స్టయిలిష్‌గా కనిపించాలంటే, బ్రాండ్స్ కాదు బాస్.. సరైన కలర్స్‌తో కంట్రోల్ చేసి గేమ్ చేంజర్‌గా మారొచ్చు.. ఈ చిన్న ట్రిక్‌ని మిస్ అయితే, బడ్జెట్ ఎంత పెట్టినా లుక్ డల్‌గానే ఉంటుంది. మరి ఆ సీక్రెట్స్ ఏంటో చూద్దాం!
త్రీ కలర్స్ రూల్: ఒక అవుట్‌ఫిట్‌లో కేవలం మూడు రంగుల్లో మాత్రమే ఉండాలి. అంతకంటే, మించిన రంగులు అసలు వద్దు. ఎందుకంటే, ఒకేసారి చాలా కలర్స్ వేసుకుంటే, మీరు స్టయిలిష్‌గా కాకుండా కలర్ ఎగ్జిబిషన్‌లా మారేలా చాన్స్ ఉంది.
న్యూట్రల్స్‌గా బేస్: ఇంటికి పునాది ఎంత ముఖ్యమో, ఔట్‌ఫిట్‌కి కూడా బేస్ అంతే ముఖ్యం. బ్లాక్, వైట్, నేవీ, గ్రే, బీజ్, ఆలివ్ ఇవి మీ స్టయిల్‌కి బలమైన బేస్. ఇవి దేనితో అయినా ఈజీగా మ్యాచ్ అవుతాయి. ఇవి ఉంటే, మీ వాడ్రోబ్ ఎప్పుడూ ‘నో టెన్షన్ జోన్’లో ఉంటుంది.
సింపుల్ స్టయిల్ ఫార్ములా: ఒక న్యూట్రల్ కలర్, ఒక మెయిన్ కలర్, ఒక చిన్న హైలైట్ అంతే, ఉదాహరణకు: నేవీ ప్యాంట్ + వైట్ టీషర్ట్ + లైట్ గ్రీన్ షర్ట్. అంతా న్యూట్రల్ కలర్స్ అయితే కాస్త బోరింగ్‌గా అనిపించొచ్చు. అందుకే, కాస్త బర్గండీ, లైట్ బ్లూ, రస్ట్, సాఫ్ట్ పింక్ లాంటి కలర్స్ జోడిస్తే లుక్‌కి లైఫ్ వస్తుంది.
టెక్చ్సర్ కూడా మ్యాటర్: ఒకే కలర్ అయినా, మెటీరియల్ మారితే లుక్ మారిపోతుంది. ఉదాహరణకు: గ్రే టీషర్ట్ గ్రే స్వెటర్ రెండూ గ్రే కలర్సే కానీ ఫీల్ వేరు! కాట¯Œ , లినె¯Œ , వూల్ వంటి టెక్స్చర్స్ మిక్స్ చేస్తే మీ స్టయిల్ మరింత రిచ్‌గా కనిపిస్తుంది.
రెడీగా ఉన్న సూపర్ కాంబినేషన్స్
ఈ కాంబినేషన్స్ సేవ్ చేసుకోండి! ఎందుకంటే,
ఇవి ట్రై చేస్తే స్టయిల్ ఎప్పుడూ మిస్ అవ్వరు
1. వైట్ షర్ట్ + నేవీ ప్యాంట్
2. లైట్ బ్లూ షర్ట్ + టాన్స్‌ప్యాంట్
3. బ్లాక్ టీషర్ట్ + ఖాకీ ప్యాంట్
4. బర్గండీ షర్ట్ + డెనిమ్ జీన్స్
మీ స్కి టోన్‌కి సరిపడే కలర్స్
అందరికీ అన్ని కలర్స్ సెట్ కావు. అందుకే, ఒక్కసారి మీకు సెట్ అయ్యే కలర్స్ తెలుసుకున్నారంటే, స్టయిల్ గేమ్‌లో మీరు అప్పుడే హాఫ్ విన్ అయిపోయినట్టే. ఎక్కువగా ఫెయిర్ స్కిన్‌కి లైట్, సాఫ్ట్ కలర్స్, మీడియం స్కిన్ ఉంటే ఆలివ్, నేవీ, రస్ట్. డార్క్ స్కిన్ వారికైతే బోల్డ్, బ్రైట్ కలర్స్ సూపర్‌గా కనిపిస్తాయి.


