హీరో మంచు మనోజ్ (Manchu Manoj) "ఐక్యధైర్య సేన సమితి" పేరిట కొత్త ట్రస్ట్ ప్రారంభించాడు.
ఈసారి బర్త్‌డే సెలబ్రేషన్స్ కంటే ముందు సేవకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపాడు. మార్చి 20న మనోజ్ పుట్టినరోజు.. ఈ క్రమంలోనే శనివారం (మార్చి 17) నాడు కొత్త ట్రస్ట్‌ను ప్రారంభిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
మనోజ్ మంచు , ఆయన భార్య మౌనిక భూమా మంచు కలిసి హైదరాబాద్‌లో కూకట్‌పల్లి లో రక్తదాన శిబిరం మరియు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి, తమ కొత్త సామాజిక సేవా సంస్థ “ఐక్య ధైర్య సేన సమితి”ను అధికారికంగా ప్రారంభించారు.
ఈ సంస్థ ఆవిష్కరణ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, అభిమానులు, వాలంటీర్లు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.


