కన్నీళ్లు తెప్పించే క్షణం..! ఎట్టకేలకు 130 ఏళ్ల .. | 130 Years of Bonded Labour Ends After Foreigner Pays Off Pakistani Familys Debt | Sakshi
Sakshi News home page

కన్నీళ్లు తెప్పించే క్షణం..! ఎట్టకేలకు 130 ఏళ్ల ..

May 19 2026 12:00 PM | Updated on May 19 2026 12:09 PM

130 Years of Bonded Labour Ends After Foreigner Pays Off Pakistani Familys Debt

ప్రస్తుతం ఏఐ టెక్నాలజీతో శరవేగంగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి ప్రపంచ దేశాలు. కొంగొత్త ఆవిష్కరణలు, రోజుకో సరికొత్త టెక్నాలజీతో దూసుకుపోతుంది యువత. అలాంటి ఈ కాలంలో వెట్టిచాకిరి వ్యవస్థ, బానిసలు అనేవి ఇంకా ఉన్నాయంటే నమ్ముతారా?. పుస్తకాల్లో, చరిత్ర పుటల్లో చదివిన ఘటనలు ఇంకా కళ్లముందు కదలాడటమే కాదు, ఆ దురాగతలకే బలి అవుత్ను వాళ్లు ఇంకా మన మధ్యే ఉన్నారు. అలాంటి భావోద్వేగ ఘటనే పాకిస్తాన్‌లో చోటుచేసుకుంది. ఓ కుటుంబం అప్పులో ఊబిలో చిక్కుకుని, తరతరాలు వెచ్చిచాకిరిలో మగ్గిపోయింది. సింపుల్‌గా చెప్పాలంటే ఆధునిక బానిసలు. బాధలనే చీకట్లో మగ్గిపోతున్న వాళ్ల బతుకుల్లోకి ఓ విదేశీయుడి కారణంగా వెలుగు సంతరించుకుంది. 

అసలేం జరిగిందంటే..పాకిస్తాన్‌లోని పంజాబ్లోని కసూర్‌ ప్రాంతంలో ఇటుక బట్టీలలో దాదాపు 130 ఏళ్లుగా వెట్టిచాకిరిలో చిక్కుకుంది ఓ కుటుంబం. ఆ ఫ్యామిలీని విడిపించేందుకు ఓ మానవతావాది ముందుకొచ్చారు. నివేదికల ప్రకారం..తరతరాల క్రితం వారి పూర్వీకులు తీసుకున్న 'పేష్కి' అనే అప్పు భారంతో పనిచేస్తూ ఉండేది. 

ఆ అప్పు ఎన్నడూ తీరకపోవడంతో  తర్వాత తరాలు వేతనాలు లేకుండా పనిచేస్తూ జీవితాంత బానిసలుగా బతుకీడుస్తున్నారు. వాళ్లకు విముక్తి కలిగించే రక్షణ చర్యను  ఆరోన్ హచింగ్స్ అనే విదేశీయుడు చేపట్టారు. 'జూబ్లీ క్యాంపెయిన్' అనే మానవహక్కుల సంస్థ సభ్యుడైన ఆరోన్‌ వారి జీవితాలకు బానిసత్వం నుంచి విముక్తి కల్పించి, కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. 

ఈ 'జూబ్లీ క్యాంపెయిన్' సంస్థ పలు దేశాలలో బానిసత్వం, మతపరమైన హింసకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఒక మానవ హక్కుల సంఘం. హచింగ్స్‌ ఆ కుటుంబం బానిసత్వం నుంచి విముక్తి లభిస్తుందని తెలుసుకుని ఎలా భావోద్వేగంగా స్పందించారో రికార్డు చేసి మరీ వీడియోని పంచుకున్నారు. అంతేగాదు ఆ వీడియోకి ఐదో రోజు గుడ్‌న్యూస్‌ తెలుసుకున్న ఆ కుటుంబం..కన్నీళ్లు పెట్టుకున్న క్షణం అనే క్యాప్షన్‌ జోడించి మరి పోస్టు చేశారు. 

కాగా, ఈ జూబ్లీ క్యాంపెయిన్ ప్రపంచవ్యాప్తంగా జాతి, మత మైనారిటీల కోసం మానవ హక్కులు, మత స్వేచ్ఛను ప్రోత్సహించడానికి  పనిచేస్తుంది. ఈ క్యాంపెయిన్ ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్, మయన్మార్, నైజీరియా, పాకిస్తాన్, ఇరాన్, ఈజిప్ట్ వంటి దేశాలలో బలవంతపు చాకిరీ, వెట్టిచాకిరి,మానవ అక్రమ రవాణా వంటి సమస్యలపై పనిచేస్తోంది. నెటిజన్లు ఈ వీడియోని చూసి..ఆ విదేశీయుడు హచింగ్స్‌ని ప్రశంసించగా, ఇంకా ఇలాంటివి కొనసాగుతున్నాయా అని విస్తుపోస్తూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: ఆ కేఫ్‌ మొత్తం ఆడవాళ్లే..!)

 

Advertisement
 
Advertisement
Advertisement