పర్యాటకం కమ్ ఉపాధిని కల్పించేలా అద్బుతమైన కేఫ్ ఇది. అయితే ఇక్కడ మొత్తం ఆడవాళ్లే ఉంటారు. నిర్వహించేది..వంట చేయడం నుంచి క్లీనింగ్ వరకు మొత్తం ఆడవాళ్ల సామ్రాజ్యమే దర్శనమిస్తుంది. అలాంటి విచిత్రమైన కేఫ్ తూర్పు సిక్కింలోని ఒక ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాబా హర్భజన్ సింగ్ పుణ్యక్షేత్రానికి సమీపంలో, 13,000 అడుగుల ఎత్తులో ఉంది.
ఇది పూర్తిగా స్థానిక మహిళలతో కూడిన బృందంతో నడిచే కేఫ్. మారుమూల ఎత్తైన ప్రాంతంలో ఉండే ఈ కేఫ్ స్థితిస్థాపకత, వ్యవస్థాపకత, స్వావలంబనను ప్రతిబింబిస్తుంది. అంతేగాదు సందర్శకులకు ఓ గొప్ప అనుభవాన్ని అందిస్తోంది. ఈ కేఫ్ భారత ఆర్మీ చొరవతో ఏర్పాటైంది. స్థానికి భాగస్వాముల సమన్వయంతో త్రిశక్తి కార్ప్స్ ఈ ప్రాజెక్ట్‌ని రూపొందించి, సులభతరం చేసింది. యుద్ధ భూమిని వీక్షించే కార్యక్రమంలో భాగంగా, ఈ ప్రాంత వారసత్వాన్ని, వ్యూహాత్మక ప్రాముఖ్యతను ప్రదర్శిస్తూ సరిహద్దు ప్రాంతాలలో పర్యాటకాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కేఫ్ రూపుదిద్దుకుంది.
ఇది ఒకరకరంగా స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తూ..మారుమూల ప్రాంతా ఆర్థిక సాధికారతనకు దోహదపడుతోంది. అంతేగాదు జీవనోపాధిని ఇలా పర్యాటకంతో అనుసంధానించటంతో ఈ కార్యక్రమం సుస్థిర అభివృద్ధికి, పుణ్యక్షేత్రానికి పర్యాటకుల రాక పెరగడానికి తోడ్పడుతుందని పలువురు భావిస్తున్నారు.
ఈ ప్రయత్నం నిజంగా సమర్థవంతమైన సైనిక-పౌర సహకారానికి నిదర్శనంగా నిలుస్తుంది. అంతేగాదు ఇది సరిహద్దు ప్రాంతాలలో సమ్మిళిత వృద్ధి, అభివృద్ధి పట్ల భారత సైన్యం నిబద్ధతను బలోపేతం చేయడంతో పాటు, భారత పౌరులతో బలమైన సంబంధాలను పెంపొందిస్తుంది.
(చదవండి: సూటు వేసుకుని వంట..! నెలకు ఏకంగా రూ. 7 లక్షలు..)


