స్క్వాడ్రన్ లీడర్ సాన్యా సరికొత్త చరిత్ర : సర్వత్రా ప్రశంసలు | IAFs Sqn Ldr Saanya becomes first woman to earn Cat-A QFI qualification | Sakshi
Sakshi News home page

స్క్వాడ్రన్ లీడర్ సాన్యా సరికొత్త చరిత్ర : సర్వత్రా ప్రశంసలు

May 19 2026 12:39 PM | Updated on May 19 2026 12:40 PM

IAFs Sqn Ldr Saanya becomes first woman to earn Cat-A QFI qualification

సాక్షి, న్యూఢిల్లీ:  భారత వైమానిక దళానికి (IAF) చెందిన స్క్వాడ్రన్ లీడర్ (Sqn Ldr) సాన్యా సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రతిష్టాత్మకమైన 'క్యాట్-ఏ క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్' (Cat-A Qualified Flying Instructor - QFI) అర్హత సాధించిన దేశంలోనే మొట్టమొదటి మహిళా అధికారిగా ఆమె నిలిచారు. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సోమవారం అధికారికంగా ప్రకటించింది.

సాన్యా  సాధించిన ఘనతపై వైమానిక దళ అధిపతి ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా  ఎయిర్ చీఫ్ మార్షల్ ఏ.పి. సింగ్.. స్క్వాడ్రన్ లీడర్ సాన్యాను కలిసి ఆమె సాధించిన ఈ అద్భుత విజయానికి గాను అభినందించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఐఏఎఫ్ తన అధికారిక   ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేసింది. "ఉత్కృష్టత సరికొత్త శిఖరాలను తాకింది. స్క్వాడ్రన్ లీడర్ సాన్యా ఎంతో ప్రతిష్టాత్మకమైన 'క్యాట్-ఏ క్యూఎఫ్ఐ' అర్హతను సాధించి, ఈ ఘనత సాధించిన తొలి మహిళా అధికారిగా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేశారు. ఆమె సాధించిన ఈ విజయం అంకితభావానికి, నిరంతర ప్రతిభా సాధనకు నిదర్శనం" అని వైమానిక దళం పేర్కొంది.

దేశానికి స్ఫూర్తి
ఈ విజయం భారత వైమానిక దళానికి ఒక గర్వకారణమైన మైలురాయి అని, దేశవ్యాప్తంగా విమానయాన రంగంలోకి రావాలనుకునే ఎంతోమంది యువతీయువకులకు ఇది గొప్ప స్ఫూర్తినిస్తుందని ఐఏఎఫ్ కొనియాడింది.

ఇదీ చదవండి: టీవీకే విజయం : డిజిటల్‌ సునామీపై స్టాలిన్‌ కీలక వ్యాఖ్యలు

కాగా   2015 జూన్ 20న సాన్యా  ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోని ఫ్లయింగ్ బ్రాంచ్‌లో కమిషన్ అయ్యారు. ఈమె 42 ఎస్‌ఎస్‌సి (SSC) కోర్సు ద్వారా ఎంపికయ్యారు. ప్రస్తుత బాధ్యతల్లో  భవిష్యత్తులో ఫైటర్ పైలట్‌లకు శిక్షణ ఇవ్వడం, ఇతర ఇన్‌స్ట్రక్టర్లకు మార్గదర్శకత్వం వహించడం, విమానంలో ఉన్నప్పుడు తప్పులను సరిదిద్దడం వంటి అత్యంత కీలకమైన బాధ్యతలను ఆమె నిర్వర్తిస్తారు.

ఇదీ చదవండి: మేయర్‌ పీఠంపై ఇండియన్‌ ఎవరీ తుషార్‌ కుమార్‌?
ఇదీ చదవండి: ట్రంప్‌, నెతన్యాహులను హతమారిస్తే రూ. 480 కోట్లు : ఇరాన్‌

Advertisement
 
Advertisement
Advertisement