పట్టించుకోని కోహ్లి.. కంటతడి పెట్టిన బుడ్డోడు! | Young Fan Breaks Down In Tears Throws Bat After Fails To Get Virat Kohli Autograph, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

పట్టించుకోని కోహ్లి.. కంటతడి పెట్టిన బుడ్డోడు!

Apr 28 2026 4:22 PM | Updated on Apr 28 2026 4:57 PM

Young Fan Breaks Down In Tears Throws Bat Fails-To Get Kohli Autograph

క్రికెట్‌లో విరాట్ కోహ్లికి ఉండే క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. చిన్న పిల్లాడి నుంచి పెద్ద‌వాళ్ల దాకా అతడి ఆటోగ్రాఫ్ లేదా ఫొటోల కోసం ఎగ‌బ‌డ‌డం చూస్తుంటాం. ఇక‌ ప్ర‌స్తుతం కోహ్లి ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదానం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మ్యాచ్ ఆడింది. 

అయితే ఆర్సీబీ ఆట‌గాళ్లు బ‌స చేస్తున్న హోటల్ రూం వ‌ద్ద ఒక ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఒక చిన్న పిల్లాడు కోహ్లి ఆటోగ్రాఫ్ కోసం బ్యాట్‌తో అత‌డి వ‌ద్ద‌కు ప‌రిగెత్తాడు. రెండు మూడుసార్లు ఆ పిల్లాడు కోహ్లి ఆటోగ్రాఫ్ కోసం తెగ ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ అధికారులు అత‌డిని అడ్డుకున్నారు. కోహ్లి కూడా ఆ పిల్లాడిని ప‌ట్టించుకోలేదు. 

దీంతో కోహ్లి త‌న‌కు ఆటోగ్రాఫ్ ఇవ్వ‌కుండానే వెళ్లిపోయాడ‌న్న కోపంతో త‌న చేతిలోని బ్యాట్‌ను విసిరేసి క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే ఈ ఘ‌ట‌న మ్యాచ్‌కు ముందు జ‌రిగిందా లేక త‌ర్వాత జ‌రిగిందా అన్న‌ది స్ప‌ష్టంగా తెలియ‌దు. కానీ బుడ్డోడు మాత్రం త‌న చ‌ర్య‌తో రాత్రికి రాత్రే సోష‌ల్ మీడియాలో వైరల్ అయ్యాడు. ఇక మ్యాచ్ విష‌యానికొస్తే సొంత‌గ‌డ్డ‌పై ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. 

తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆర్సీబీ బౌల‌ర్ల ధాటికి 75 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. అభిషేక్ పొరేల్ 30 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. హాజిల్‌వుడ్ 4, భువ‌నేశ్వ‌ర్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టారు. అనంత‌రం ఛేద‌న‌లో ఆర్సీబీ వికెట్ కోల్పోయి 77 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది. 

ప‌డిక్క‌ల్ (34 నాటౌట్‌), కోహ్లి (23 నాటౌట్) జ‌ట్టును విజ‌య‌తీరాలకు చేర్చారు. ఈ విజ‌యంతో ఆర్సీబీ 12 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో రెండో స్థానానికి చేరుకుంది. ఇక ఆర్సీబీ త‌న త‌ర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్ 30న గుజ‌రాత్ టైటాన్స్‌తో ఆడ‌నుంది.

చదవండి: ఢిల్లీలోనే ఆగిపోయిన కోహ్లి.. ఎందుకంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement