అత్తారింట్లో కూతురి నిర్వాకం..చితకబాదిన అమ్మ | Viral Video: The daughter in-law did not cook food for her in laws | Sakshi
Sakshi News home page

అరుదైన ఘటన: కూతురిని చితకబాదిన అమ్మ..!

Apr 20 2026 4:43 PM | Updated on Apr 20 2026 5:10 PM

Viral Video: The daughter in-law did not cook food for her in laws

ఇటీవల కాలంలో కోడళ్లు ఎలా ఉంటున్నారో తెలిసిందే. ఆధునిక కాలం అత్తలకు కోడళ్లు దడవడం లేదు. కోడళ్లే అత్తలను భయపెట్టే రేంజ్‌లో ఉంటున్నారు. పైగా ఏ మాత్రం తేడా వచ్చినా..వేరు కాపురం, ఆస్తులు కావాలని డిమాండ్‌ ఒకటి కాదు..రెండు కాదు ఎన్నో వింతలు విడ్డూరాలు జరుగుతున్నాయి. అత్తలకు భయపడే కోడళ్ల కాలం చెల్లినదిగా మారిపోయింది. 

అంత వరకు ఓకేగానీ కనీసం అత్తమామలను స్నేహితుల్లా లేదా సాటి మనిషిగా చూడకుండా నానాయాతను పెడుతున్నారు నేటితరం కొందరు కోడళ్లు. దానికి పుట్టింటివాళ్లు వత్తాసు పలికి పెళ్లిని మూణ్ణాళ్ల ముచ్చటలా మార్చేస్తున్న ఘటనలు కోకొల్లలు. అలాంటి కాలంలో నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ ఘటన అత్యంత అరుదైనది , రికార్డు ఘటనగా చెప్పొచ్చు.

ఇంతకీ ఏం జరిగిందంటే..కోడలు తన అత్తమామల కోసం వంట చేయలేదు.  ఆ విషయం తెలుసుకున్న తల్లి అక్కడకు చేరుకుని నేరుగా కూతరు వద్దకు పోయి చితకబాదింది. అంతేగాదు అత్తమామలకు భోజనం వడ్డించమని ఆదేశించింది. ఇటీవలకాలంలో ఇది అత్యంత అరుదైన ఘటన అంటూ నెటిజన్లు కామెంట్‌  చేస్తూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: కూరగాయలు అమ్మడం నుంచి సైనికుడిగా! కట్‌చేస్తే..)

 

Advertisement
 
Advertisement
Advertisement