వీడియో: చున్నీ కోసం పట్టాలపైకి దిగి.. | Delhi Station Incident Goes Viral, Elderly Man Climbs Tracks To Save Tourist’s Dupatta, Sparks Debate On Safety Vs Heroism | Sakshi
Sakshi News home page

వీడియో: చున్నీ కోసం పట్టాలపైకి దిగి..

May 15 2026 8:55 AM | Updated on May 15 2026 10:28 AM

Man Jump Railway Track Indonesian Woman's 'Dupatta', Video Viral

ఏమరపాటులో.. నిర్లక్ష్యంగా చేసే పనులు ఎంతటి విషాదాలకు దారి తీస్తాయో తెలియంది కాదు. పట్టాలు దాటుతూ ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు ఇందుకు మంచి ఉదాహరణలు. తాజాగా ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఓ ఘటనపై నెట్టింట మిశ్రమ స్పందన లభిస్తోంది. ఆ వీడియో తెగ వైరల్‌ అవుతోంది.. 

ఇండోనేషియాకు చెందిన ఓ మహిళ సంప్రదాయ భారత దుస్తుల్లో రైలు ఎక్కింది. డోర్‌ దగ్గర నిల్చుని సెల్ఫీ వీడియో(టూరిస్ట్‌ లేదంటే ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఏమో!) ఆమె దుప్పట్టా జారిపోయి ఫ్లాట్‌ఫారమ్‌కు-రైలుకు మధ్య పట్టాల మీద పడింది. ఇంతలో అటుగా వెళ్తున్న ఓ వృద్ధుడు.. అది గమనించాడు. ఆ యువతికి సాయం చేస్తానని ముందుకు వచ్చాడు. 

ఫ్లాట్‌ఫారమ్‌ నుంచే ఆ చున్నీని అందుకునే ప్రయత్నం చేయగా.. అది వీలుపడలేదు. దీంతో సరాసరి పట్టాలపైకి దూకాడు. అయితే ఆ సమయంలో ఆ ఇండోనేషియా మహిళ అప్రమత్తమైంది. త్వరగా పైకి రావాలంటూ ఆయన్ని కోరింది. ఆ వృద్ధుడు కూడా చున్నీని దొరకబుచ్చుకుని పైకి వచ్చేశాడు. ఆమె చేతికి అందగా థ్యాంక్స్‌ చెప్పడంతో ఫర్వాలేదని చెయ్యి చూపిస్తూ నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. 

“ఆయన హీరోలా వచ్చి సహాయం చేశారు. ఎలాంటి ప్రశంసలు ఆశించకుండా నిశబ్దంగా వెళ్లిపోయారు. నిజంగా గ్రేట్‌” అంటూ ఆ వీడియోలో వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో ఈ వీడియోకు 41 మిలియన్లకుపైగా వీక్షణలు వచ్చాయి. 

నెటిజన్లు ఆయనను “జెంటిల్‌మన్”, “హీరోలా నడిచాడు” అంటూ ప్రశంసించారు. కొందరు తమ అనుభవాలను పంచుకుంటూ, “ఇలాంటి భారతీయ అంకుల్స్‌ సో స్వీట్‌” అని వ్యాఖ్యానించారు. అదే సమయంలో హ్యుమాటినీ నా?, సేఫ్టీనా? అంటూ చర్చ నడిచింది. ఆ సమయంలో రైలు కదిలి జరగరానిది జరిగితే ఎలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ వయసులో అంత రిస్క్‌ అవసరమా అంకుల్‌? అని సరదాగా ఆ పెద్దాయన్ని మందలిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement