చీర్‌గ‌ర్ల్స్ చిందులు.. క‌ళ్ల‌ప్ప‌గించిన‌ పోలీసులు! | Raipur Police Enjoy-Watching Mumbai Indians Cheerleaders Dance | Sakshi
Sakshi News home page

చీర్‌గ‌ర్ల్స్ చిందులు.. క‌ళ్ల‌ప్ప‌గించిన‌ పోలీసులు!

May 12 2026 7:04 PM | Updated on May 12 2026 7:06 PM

Raipur Police Enjoy-Watching Mumbai Indians Cheerleaders Dance

ఐపీఎల్ 2026 సీజ‌న్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. ఇప్ప‌టికీ ప్లేఆఫ్స్‌కు చేరే జ‌ట్ల‌పై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. ముంబై, ల‌క్నో ఎలిమినేట్ కాగా ప్లేఆఫ్స్ స్థానం కోసం ఎనిమిది జ‌ట్లు పోటీ ప‌డుతున్నాయి. అయితే అందులో ఆర్సీబీ, ఎస్ఆర్‌హెచ్‌, పంజాబ్‌, గుజ‌రాత్‌కు ప్లేఆఫ్స్ చేరే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. 

కానీ టీ20 మ్యాచ్‌లు కావ‌డంతో ఏ క్ష‌ణంలో ఏం జ‌రుగుతుంద‌నేది ఊహించ‌డం క‌ష్టం. అందుకే సీజ‌న్‌లో అన్ని లీగ్ మ్యాచ్‌లు పూర్త‌ య్యాకే ప్లేఆఫ్స్ చేరే జ‌ట్ల‌పై క్లారిటీ రానుంది. ఈ విష‌యం ప‌క్క‌న‌బెడితే ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను వీక్షించ‌డానికి వ‌చ్చే అభిమానుల‌కు, ఆట‌గాళ్ల‌కు చీర్‌గ‌ర్ల్స్ త‌మ నృత్యాల‌తో అల‌రించ‌డం చూస్తూనే ఉంటాం. 

అయితే ఆదివారం రాయ్‌పూర్‌ వేదికగా ముంబై ఇండియ‌న్స్‌, ఆర్సీబీ మ‌ధ్య మ్యాచ్ స‌మ‌యంలో జ‌రిగిన ఆస‌క్తికర ఘట‌న కాస్త ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. విష‌యంలోకి వెళితే ఆర్సీబీ బ్యాటింగ్ స‌మ‌యంలో స్ట్రాట‌జిక్ టైమ్ అవుట్ ఇచ్చారు. ఈ స‌మ‌యంలో ముంబై ఇండియ‌న్స్‌కు చెందిన చీర్ గ‌ర్ల్స్ ఫోడియంపై చిందులు వేస్తున్నారు. 

అందులో ఒక చీర్‌గ‌ర్ల్ అక్క‌డే ఉన్న పోలీసుల‌ను చూస్తూ నృత్యం చేసింది. దీంతో అక్క‌డే డ్యూటీ చేస్తున్న పోలీసులు చీర్ గ‌ర్ల్స్ నృత్యాల‌ను క‌ళ్ల‌ప్పగించి అలా చూస్తూ ఉండిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో ఇప్పుడు తెగ వైర‌లవుతోంది. ఇక మ్యాచ్ విష‌యానికొస్తే ఆద్యంతం ఉత్కంఠ‌గా సాగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. 

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ న‌ష్టానికి 166 ప‌రుగులు చేసింది. అనంత‌రం ఆర్సీబీ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 167 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది. ఓట‌మితో ముంబై ఇండియ‌న్స్ ఐపీఎల్ 19వ సీజ‌న్ నుంచి ఎలిమినేట్ కాగా.. ఆర్సీబీ 14 పాయింట్ల‌తో టేబుల్ టాప‌ర్‌గా నిలిచింది. ఆర్సీబీ త‌న త‌ర్వాతి మ్యాచ్‌లో కేకేఆర్‌ను ఎదుర్కోనుండగా, ముంబై ఇండియ‌న్స్ పంజాబ్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

చదవండి: అక్షర్ పటేల్‌కు భారీ జరిమానా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement