breaking news
cheer girls
-
చీర్‌గర్ల్స్ చిందులు.. కళ్లప్పగించిన పోలీసులు!
ఐపీఎల్ 2026 సీజన్ దగ్గరపడుతున్న కొద్దీ రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికీ ప్లేఆఫ్స్‌కు చేరే జట్లపై ఇంకా స్పష్టత రాలేదు. ముంబై, లక్నో ఎలిమినేట్ కాగా ప్లేఆఫ్స్ స్థానం కోసం ఎనిమిది జట్లు పోటీ పడుతున్నాయి. అయితే అందులో ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, పంజాబ్, గుజరాత్‌కు ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ టీ20 మ్యాచ్‌లు కావడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందనేది ఊహించడం కష్టం. అందుకే సీజన్లో అన్ని లీగ్ మ్యాచ్‌లు పూర్త య్యాకే ప్లేఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ రానుంది. ఈ విషయం పక్కనబెడితే ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించడానికి వచ్చే అభిమానులకు, ఆటగాళ్లకు చీర్‌గర్ల్స్ తమ నృత్యాలతో అలరించడం చూస్తూనే ఉంటాం. అయితే ఆదివారం రాయ్‌పూర్ వేదికగా ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య మ్యాచ్ సమయంలో జరిగిన ఆసక్తికర ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయంలోకి వెళితే ఆర్సీబీ బ్యాటింగ్ సమయంలో స్ట్రాటజిక్ టైమ్ అవుట్ ఇచ్చారు. ఈ సమయంలో ముంబై ఇండియన్స్‌కు చెందిన చీర్ గర్ల్స్ ఫోడియంపై చిందులు వేస్తున్నారు. అందులో ఒక చీర్‌గర్ల్ అక్కడే ఉన్న పోలీసులను చూస్తూ నృత్యం చేసింది. దీంతో అక్కడే డ్యూటీ చేస్తున్న పోలీసులు చీర్ గర్ల్స్ నృత్యాలను కళ్లప్పగించి అలా చూస్తూ ఉండిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరలవుతోంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్ నష్టానికి 166 పరుగులు చేసింది. అనంతరం ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓటమితో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 19వ సీజన్ నుంచి ఎలిమినేట్ కాగా.. ఆర్సీబీ 14 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఆర్సీబీ తన తర్వాతి మ్యాచ్‌లో కేకేఆర్‌ను ఎదుర్కోనుండగా, ముంబై ఇండియన్స్ పంజాబ్‌తో తలపడనుంది.Raipur police enjoying watching the Mumbai Indians cheerleaders during the MI vs RCB match.😅 pic.twitter.com/xichgo4HEw— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) May 11, 2026చదవండి: అక్షర్ పటేల్‌కు భారీ జరిమానా! -
శివమ్ దూబే సిక్సర్ దెబ్బ.. కేకేఆర్ చీర్‌గర్ల్స్ అబ్బ!
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా కేకేఆర్, సీఎస్కే మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సీఎస్కే ఇన్నింగ్స్ సమయంలో శివమ్ దూబే కొట్టిన సిక్సర్ కేకేఆర్ చీర్‌గర్ల్స్‌ను తాకడం ఆసక్తి కలిగించింది. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో సుయాశ్ శర్మ వేసిన ఐదో బంతిని దూబే ఎక్స్ట్రా కవర్స్ మీదుగా భారీ సిక్సర్ కొట్టాడు. అక్కడే కేకేఆర్ చీర్‌గర్ల్స్ కూర్చొని ఉండగా వారి వద్దకే నేరుగా బంతి వెళ్లింది. బంతి వెళ్లి ఒక చీర్గర్ల్కు తాకింది. పాపం బంతి స్పీడుగా వచ్చి తగలడంతో నొప్పితో విలవిల్లాలాడిన చీర్‌గర్ల్ బంతి తగిలిన చోట రాసుకోవడం కనిపించింది. ఆ తర్వాత చీర్‌గర్ల్స్ మధ్య నవ్వులు విరపూశాయి. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Kolkata Knight Riders Cheerleaders are in shock after Shivam Dube hits a six near them😂 📸: Jio Cinema #CSKvKKR #KKRvCSK #IPL2023 #TATAIPL2023 #T20Cricket #CricketNews #Cheerleaders #KKR #KolkataKnightRiders pic.twitter.com/gqnQEDD2Uh — SportsTiger (@The_SportsTiger) May 14, 2023 చదవండి: ధోనిని గుర్తుకుతెచ్చిన అనూజ్ రావత్.. అశ్విన్ డైమండ్ డక్ -
'హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్ లు అడ్డుకుంటాం'
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో భాగంగా చీర్ గర్ల్స్ తో డ్యాన్స్ చేయిస్తే మ్యాచ్ లు అడ్డుకుంటామని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) హెచ్చరించింది. హైదరాబాద్ వేదికగా రాత్రి 8 గంటలకు ఉప్పల్ స్డేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో వీహెచ్‌పీ నేతలు ఈ వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ శోభాయాత్ర నిర్వహణలో డీజేకు అనుమతి ఇవ్వకపోవడంపై వీహెచ్‌పీ ఆగ్రహంగా ఉండటమే ఈ వ్యాఖ్యలకు కారణమని తెలుస్తోంది.


