వైభ‌వ్ సూర్య‌వంశీ పొర‌పాటు.. వీడియో వైరల్‌! | Vaibhav Sooryavanshi forgot to wear his shoes Vs Punjab Match | Sakshi
Sakshi News home page

IPL 2026: వైభ‌వ్ సూర్య‌వంశీ పొర‌పాటు.. వీడియో వైరల్‌!

Apr 29 2026 7:08 PM | Updated on Apr 29 2026 7:48 PM

Vaibhav Sooryavanshi forgot to wear his shoes Vs Punjab Match

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఎక్కువ‌గా వినిపిస్తున్నపేరు వైభ‌వ్ సూర్య‌వంశీ. ఈ సీజ‌న్‌లో సూర్య‌వంశీ ఇప్ప‌టివ‌ర‌కు 9 మ్యాచ్‌లాడి 400 ప‌రుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నాడు. మంగ‌ళ‌వారం సీజ‌న్‌లో వ‌రుస విజ‌యాల‌తో ఎదురులేకుండా సాగుతున్న పంజాబ్ కింగ్స్‌కు చెక్‌పెట్టిన రాజ‌స్తాన్ 6 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. 

కాగా జైస్వాల్‌, వైభ‌వ్ మ‌రోసారి మెరుపు ఆరంభం ఇచ్చారు. చివ‌ర్లో ఫెరీరా, శుభ‌మ్ దూబే ఫినిషింగ్ ట‌చ్‌తో రాజ‌స్తాన్‌ను గెలిపించారు. అయితే పంజాబ్ ఇన్నింగ్స్ స‌మ‌యంలో ఒక ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. వైభ‌వ్ సూర్య‌వంశీ ఫీల్డింగ్‌కు వెళ్లే స‌మ‌యంలో షూ వేసుకోకుండానే మైదానంలోకి వ‌చ్చాడు. 

అయితే పొర‌పాటును గ్ర‌హించిన వైభ‌వ్ వెంట‌నే త‌న షూ పంపించాలంటూ డ్రెసింగ్ రూమ్‌కు సైగ‌లు చేయ‌డం క‌నిపించింది. ప‌క్క‌నే ఉన్న‌ రోమి భింద‌ర్ కూడా వైభ‌వ్‌కు స‌హాయం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇక ఈ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఇప్పటివరకు 9 మ్యాచ్‌లాడి 6 విజయాలు, మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది.

చదవండి: లంక క్రికెట్‌లో సంక్షోభం.. బోర్డు మూకుమ్మడి రాజీనామా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement