Romi Bhinder
-
వైభవ్ సూర్యవంశీ పొరపాటు.. వీడియో వైరల్!
ఐపీఎల్ 2026 సీజన్లో ఎక్కువగా వినిపిస్తున్నపేరు వైభవ్ సూర్యవంశీ. ఈ సీజన్లో సూర్యవంశీ ఇప్పటివరకు 9 మ్యాచ్‌లాడి 400 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మంగళవారం సీజన్లో వరుస విజయాలతో ఎదురులేకుండా సాగుతున్న పంజాబ్ కింగ్స్‌కు చెక్‌పెట్టిన రాజస్తాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా జైస్వాల్, వైభవ్ మరోసారి మెరుపు ఆరంభం ఇచ్చారు. చివర్లో ఫెరీరా, శుభమ్ దూబే ఫినిషింగ్ టచ్‌తో రాజస్తాన్‌ను గెలిపించారు. అయితే పంజాబ్ ఇన్నింగ్స్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వైభవ్ సూర్యవంశీ ఫీల్డింగ్‌కు వెళ్లే సమయంలో షూ వేసుకోకుండానే మైదానంలోకి వచ్చాడు. అయితే పొరపాటును గ్రహించిన వైభవ్ వెంటనే తన షూ పంపించాలంటూ డ్రెసింగ్ రూమ్‌కు సైగలు చేయడం కనిపించింది. పక్కనే ఉన్న రోమి భిందర్ కూడా వైభవ్‌కు సహాయం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఇప్పటివరకు 9 మ్యాచ్‌లాడి 6 విజయాలు, మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది.Vaibhav Sooryavanshi forgot to wear his shoes and then asked someone to bring them onto the ground 😭Romi Bhinder is literally taking care of him like a father 🫡 pic.twitter.com/3TayVsGf78— TEJASH (@Tejashyyyyy) April 29, 2026చదవండి: లంక క్రికెట్లో సంక్షోభం.. బోర్డు మూకుమ్మడి రాజీనామా! -
వైభవ్ సేఫ్.. రోమి భిందర్‌కు బీసీసీఐ షాక్!
రాజస్తాన్ రాయల్స్ జట్టు మేనేజర్ రోమి భిందర్ డగౌట్లో ఫోన్ వాడడంపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. ఐపీఎల్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను రోమి భిందర్‌కు రూ. లక్ష జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే అతడిపై నిషేధం కూడా పడుతుందని వార్తలు వచ్చినప్పటికీ బీసీసీఐ మాత్రం రోమి భిందర్‌కు జరిమానాతో సరిపెట్టింది. ఈ విషయాన్ని బీసీసీఐ ప్రధాన కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించాడు. ఐపీఎల్లో జట్టు మేనేజర్లు మొబైల్ ఫోన్లు ఉపయోగిం చడానికి అనుమతి ఉన్నప్పటికీ మ్యాచ్ జరిగే సమయంలో ఫోన్ వాడడం నిషేధమని ఆయన తెలిపారు. అయితే డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నప్పుడు మాత్రం జట్టు మేనేజర్లు ఫోన్ వాడేందుకు అనుమతి ఉందన్నారు. ఈ విషయంలో రోమి భిందర్‌కు షోకాస్ నోటీసు కూడా జారీ చేశామని, కానీ నోటీసుపై అతడు ఇచ్చిన వివరణపై యాంటీ కరప్షన్ యూనిట్ అసంతృప్తి వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. అయితే రోమి భిందర్‌కు మొదటి ఉల్లంఘన కాబట్టి, నిబంధనల ప్రకారం అతడికి రూ. లక్ష జరిమానాతో సరిపెడుతున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినట్లు తెలిపారు. ఈ ఘటనను అందరూ గుణపాఠంగా తీసుకోవాలని, ఆట దెబ్బతినకుండా ప్రతీ ఒక్కరు నియమ నిబంధనలు పాటించాలని తాము విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 10న గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి.రాజస్తాన్ ఇన్నింగ్స్ 11వ ఓవర్లో రోమి భిందర్ డగౌట్లో కూర్చొని మొబైల్ ఫోన్ వాడుతూ కెమెరాలకు చిక్కాడు. ఆ సమయంలో రాజస్తాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కూడా అతడి పక్కనే కూర్చొని ఫోన్ చూడడం వివాదానికి దారి తీసింది. అయితే ఈ చర్యతో వైభవ్ సూర్యవంశీకి సంబంధం లేకపోవడంతో, అతడిని కేవలం హెచ్చరికతోనే సరిపెట్టినట్లు బీసీసీఐ తెలిపింది. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో వరుస విజయాలతో జోరు మీదున్న రాజస్తాన్ రాయల్స్‌కు సన్‌రైజర్స్ బ్రేకులు వేసింది. మ్యాచ్‌లో హైదరాబాద్ 57 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. రాజస్తాన్ రాయల్స్ తన తర్వాతి మ్యాచ్‌ను ఆదివారం కేకేఆర్‌తో ఆడనుంది.చదవండి: ముఖం చాటేసిన పాండ్యా.. ఏడుపొక్కటే తక్కువ! -
షోకాజు నోటీసులు జారీ చేసిన బీసీసీఐ
ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్ జట్టు మేనేజర్ రోమీ భిందర్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) షాకిచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా అతడు డగౌట్లో మొబైల్ ఫోన్ వాడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ అవినీతి, భద్రత నిరోధక విభాగం రోమీ భిందర్‌కు షోకాజు నోటీసులు జారీ చేసింది. డగౌట్లో మొబైల్ ఫోన్ ఎందుకు వాడారో 24 గంటల్లోపు వివరణ ఇవ్వాలని ఈ నోటీసులో బీసీసీఐ పేర్కొంది.వైభవ్ సూర్యవంశీ కూడా...కాగా శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుతో గువాహటిలో జరిగిన మ్యాచ్ సందర్భంగా రోమీ భిందర్ మొబైల్ ఫోన్ వాడాడు. ఆ సమయంలో రాజస్తాన్ ఓపెనింగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కూడా అతడి పక్కనే ఉన్నాడు. వీరిద్దరు మొబైల్‌లోకి చూస్తున్నట్లుగా ఉన్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాగా ఐపీఎల్ పాలక మండలి నిబంధనల ప్రకారం జట్టు మేనేజర్‌కు మొబైల్ ఫోన్ వాడే వెసులుబాటు ఉన్నా... డగౌట్లో మాత్రం ఉపయోగించడానికి వీలు లేదు.తొలి ఓటమిఇదిలా ఉంటే.. వరుస విజయాలతో దుమ్ములేపుతున్న రాజస్తాన్ రాయల్స్ జోరుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ అడ్డుకట్ట వేసింది. ఉప్పల్ వేదికగా సోమవారం నాటి మ్యాచ్‌లో రాయల్స్‌ను 57 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచిన రాయల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా సన్‌రైజర్స్ బ్యాటింగ్‌కు దిగింది.నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 216 పరుగులు సాధించింది సన్‌రైజర్స్. లక్ష్య ఛేదనలో రాయల్స్ 19 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. సన్‌రైజర్స్ బౌలర్ ప్రఫుల్ హింగే ఆకాశమే హద్దుగా చెలరేగి ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (0)తో పాటు వన్‌డౌన్‌లో వచ్చిన ధ్రువ్ జురెల్ (0), లువాన్ డ్రి ప్రిటోరియస్ (0), కెప్టెన్ రియాన్ పరాగ్ (4)లను అవుట్ చేసి ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. ఇక ఇప్పటికి ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న రాయల్స్ నాలుగు గెలిచింది. చదవండి: సన్‌రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత రియాన్ పరాగ్ వ్యాఖ్యలు -
ఫోన్ చూసిన రోమీ, వైభవ్ సూర్యవంశీ.. షాకిచ్చిన బీసీసీఐ!
రాజస్తాన్ రాయల్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. రాయల్స్ టీమ్ మేనేజర్ రోమి భిందర్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కఠిన చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం. ఇందులో భాగంగా అనినీతి వ్యతిరేక, భద్రతా విభాగం అతడికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.అగ్రస్థానంలోఐపీఎల్-2026లో సూపర్ ఫామ్ కొనసాగిస్తున్న రాజస్తాన్ రాయల్స్.. శుక్రవారం నాటి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)ని చిత్తు చేసింది. తద్వారా ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లు నాలుగూ గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో రాయల్స్ ఓపెనర్, పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీ పాత్ర కీలకం.అయితే, ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా రాజస్తాన్ టీమ్ మేనేజర్ రోమీ భిందర్ చేసిన పని వివాదానికి దారితీసింది. డగౌట్లో కూర్చుని అతడు మొబైల్ ఫోన్‌ను చూశాడు. ఆ సమయంలో వైభవ్ సూర్యవంశీ సైతం పక్కనే కూర్చుని ఫోన్లోకి చూసినట్లుగా ఉన్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.రంగంలోకి బీసీసీఐకాగా ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా (PMOA) నిబంధనల ప్రకారం.. మ్యాచ్ జరుగుతున్న వేళ డగౌట్లో మొబైల్ ఫోన్లు వాడటం నిషిద్ధం. ఇలా చేయడం ద్వారా అవినీతి నిరోధక ప్రొటోకాల్ నిబంధనలను ఉల్లంఘించినట్లే లెక్క. ఈ నేపథ్యంలో బీసీసీఐ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. ఈ ఘటనపై విచారణలో భాగంగా బీసీసీఐలోని యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్ (ACSU) రోమీ భిందర్‌కు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో నలభై ఎనిమిది గంటల్లోగా.. తాను ఆరోజు ఫోన్ ఎందుకు ఉపయోగించానన్న విషయంపై రోమీ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.ఈ విషయాన్ని ఐపీఎల్ పాలక మండలి చైర్మన్ అరుణ్ ధుమాల్ ధ్రువీకరించాడు. ‘‘ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు జరిపి.. నివేదిక ఇవ్వాల్సిందిగా మేము ACSUను ఆదేశించాము’’ అని ధుమాల్ తెలిపాడు.PC: BCCIఅందుకే ఫోన్ చూశాడా?ఈ విషయంపై రోమి భిందర్ సన్నిహిత వర్గాలు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘అనారోగ్యం కారణంగా రోమీ దాదాపుగా పది కిలోల బరువు తగ్గిపోయాడు. అతడికి ఆస్తమా కూడా ఉంది. అందుకే దూరప్రయాణాలు చేయొద్దని, మెట్లు ఎక్కడం తగ్గించాలని వైద్యులు సూచించారు.అయితే, టీమ్ మేనేజర్‌గా ఫ్రాంఛైజీ తరపున అతడు ఎన్నెన్నో వ్యవహారాలు చక్కబెట్టాల్సి ఉంటుంది. అతడికి నిబంధనలు తెలుసు. ఆరోజు కూడా వైద్యపరమైన కారణాల వల్లే అతడు ఫోన్ చూశాడు. హెల్త్ ఎమర్జెన్సీ సమయాల్లో డగౌట్లో కూర్చుని ల్యాప్‌టాప్ లేదంటే మొబైల్‌తో కనిపించడం తప్పేమీ కాదు.నిజానికి అతడు ఫోన్ కాల్స్ మాట్లాడుతూనే.. ఎవరికైనా ఫోన్ చేస్తున్నట్లుగానో కనిపించలేదు. కేవలం అతడు ఫోన్‌ను స్క్రోల్ చేశాడంతే. ACSU విచారణలో అతడు తాను చేసిన పని గురించి వివరణ ఇవ్వగలడు. అతడి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ACSU విచారణ జరుపుతుందని భావిస్తున్నాం. డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి ఫోన్ చూసుకోవచ్చు. కానీ అక్కడికి వెళ్లాలంటే కనీసం 50 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అందుకే అతడు అక్కడే కూర్చుని ఫోన్ చూసి ఉంటాడు’’ అని పేర్కొన్నాయి.చదవండి: Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా 1️⃣5️⃣ years of age. 1️⃣5️⃣ deliveries for a half-century 🤯🎥 Vaibhav Sooryavanshi taking on the best in the business with ease 🤌What a special talent 💎Updates ▶️ https://t.co/X76bJjmq1j#TATAIPL | #KhelBindaas | #RRvRCB | @rajasthanroyals pic.twitter.com/6TCpgCMnjy— IndianPremierLeague (@IPL) April 10, 2026


