ఈ డెలివరీ బాయ్‌ చాలా మంచోడు | Mumbai Woman Shares What A Delivery Boy Did, Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

ఈ డెలివరీ బాయ్‌ చాలా మంచోడు

Apr 29 2026 11:01 AM | Updated on Apr 29 2026 11:12 AM

Mumbai Woman Shares What A Delivery Boy Did, Goes Viral On Social Media

చిన్న చిన్న తప్పులు.. ఒక్కోసారి పెద్ద నష్టానికే దారి తీయొచ్చు. అలాంటి టైంలో ఎవరో ఒకరు కాపాడేందుకు ముందుకు వస్తే ఎలా ఉంటుంది?. వాళ్లను రియల్‌ హీరో అనకుండా ఉండలేం కదా!. ముంబైలో ఒక యువతి అలాంటి అనుభవం ఎదురైంది. డెలివరీ కోసమని వచ్చిన యువకుడు చేసిన పనితో ఆమె ఉబ్బితబ్బిబై నెట్టింట ఆ విషయాన్ని షేర్‌ చేసుకుంది. 

ముంబైకి చెందిన దివ్య ఉన్ని.. పని నిమిత్తం బయటకు వెళ్లింది. ఆ కంగారులో ఇంటికి తాళం సంగతి ఏమోగానీ.. కనీసం డోర్‌ కూడా దగ్గరకు వేయకుండా వెళ్లిపోయింది. అయితే అప్పటికే ఆమె ఆన్‌లైన్‌లో ఓ పార్శిల్‌ ఆర్డర్‌ పెట్టింది. ఇంటికి తాళం వేయని సంగతి మర్చిపోయి.. డెలివరీ బాయ్‌ దానిని బయట పెట్టి వెళ్తాడులే అని అనుకుంది. అయితే డెలివరీ ఇవ్వడానికి వచ్చిన యువకుడు డోర్‌ తెరిచే ఉన్న విషయాన్ని గమనించాడు. 

ఇదే విషయాన్ని అతను ఫోన్‌లో ఆమెకు తెలియజేశాడు. నాలిక్కరుచుకున్న దివ్య.. ఆగమేఘాల మీద ఇంటికి చేరింది. ‘‘అతను కేవలం పార్సెల్‌ను వదిలి వెళ్లిపోలేదు. ఇంటి ముందు నిలబడి, ఎవరూ లోపలికి వెళ్లకుండా చూసుకున్నాడు. నా పెంపుడు పిల్లి బయటకు పారిపోకుండా చూశాడు. నేను వచ్చేదాకా ఓపికగా అక్కడే ఎదురు చూశాడు. తనను అమ్జాద్ అని పరిచయం చేసుకున్న ఈ డెలివరీ బాయ్‌కి దివ్య కృతజ్ఞతలు తెలిపింది.

ఈ సంఘటనను దివ్య వీడియో రూపంలో సోషల్ మీడియాలో పంచుకోగా.. అది వైరల్‌ అయింది. అమ్జాద్‌ నిజాయితీ, బాధ్యతా భావం చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. “ఇలాంటి నిజాయితీకి గుర్తింపు ఇవ్వాలి” అని కొందరు.. అతనికి టిప్‌ అయినా ఇవ్వాల్సింది అని మరికొందరు కామెంట్లు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement