ఎలక్ట్రిక్ యూనిసైకిల్‌ రైడ్‌కి ట్రాఫిక్‌ పోలీసులే ఫిదా! చివరికి.. | Bengaluru mans electric unicycle leaves traffic cop curious | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రిక్ యూనిసైకిల్‌ రైడ్‌కి ట్రాఫిక్‌ పోలీసులే ఫిదా! చివరికి..

May 11 2026 12:18 PM | Updated on May 11 2026 12:25 PM

Bengaluru mans electric unicycle leaves traffic cop curious

ఒక బెంగళూరు వ్యక్తి తన ఎలక్ట్రిక్‌ యూని సైకిల్‌పై రోజూ చేసే ప్రయాణg ఓ ట్రాఫిక్‌ పోటీసులో కుతుహాలం రేపి, ఆ వ్యక్తిని ఆపి మరి దాని గురించి తెలసుకునేలా చేసింది. చివరికి ఆ పోలీసు ఒక సారి ఆ సైకిల్‌ని ట్రై చేసి చూశాడు కూడా. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

జెరోమ్ ఆనంద్ అనే ఆ వ్యక్తి అందుకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఆయన రోజు తన ఆఫీస్‌ నుంచి ఇంటికి ఆ ఎలక్ట్రిక్‌ యూని సైకిల్‌పై వెళ్తుంటారు. ఎప్పటిలానే ఆ రోజు కూడా సాధారణ ప్రయాణంగా ప్రారంభమైన తన రైడ్‌ చివర్లో అసాధారణంగా మారింది. 

ఆయన ఆఫీస్‌ నుంచి ఇల్లు జస్ట్‌ 25 కి.మీటర్లే కావడంతో ఆ ఒంటి చక్ర వాహనంపై రోజు వెళ్తుంటాడాయన. అందులోనూ బెంగళూరు ట్రాఫిక్‌లో ప్రయాణించడం ఎంత సాహసమో తెలియంది కాదు. ఆ రోజు కూడా ఆనంద్‌ ఎప్పటిలానే తన ఒంటి చక్ర వాహనంపై ఆఫీస్‌ నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్నడు. ఇంతలో తన జర్నీకి ట్రాఫిక్‌ పోలీసుల రూపంలో సడెన్‌ బ్రేక్‌ పడింది. అక్కడ ఉన్న ట్రాఫిక్‌ పోలీసులు అతడిని ఆపుతారు. 

ఆయన ఇలా ప్రయాణించడం కూడా ఏదైన ట్రాఫిక్‌ ఉల్లంఘన ఏంటీ అనుకుని ఆగిపోతాడు. వాళ్లు ఈ వాహనంపై ఎలా ప్రయాణిస్తారు వంటి కుశల ప్రశ్నలు అడుగతారు. దాంతో అతను ఆ వాహనం ఫీచర్స్‌ గురించి సవివరంగా వివరించడమే కాదు రైడ్‌ చేసి చూస్తారా అని అడుగుతాడు. దాంతో ఆ ట్రాఫిక్‌ పోలీస్‌ ఆనంద్‌ వాహనంపై ఎక్కి సరదాగా రైడ్‌ చేస్తాడు కూడా. 

ఆ సైకిల్‌పై రైడ్‌ చేయడంలో ఆనంద్‌ పోలీస్‌కి హెల్ప్‌ చేస్తాడు కూడా. అయితే ఈ వాహనంతో పెట్రోల్‌ టెన్షన్‌, పార్కింగ్‌ హైరానా ఉండదని కూడా వివరిస్తాడు. పైగా ట్రాఫిక్‌ని సులభంగా నిర్వహించొచ్చు, చాలా దూరం సునాయాసంగా ప్రయాణించొచ్చు అని ఆనంద్‌ ఆ ట్రాఫిక్‌ పోలీసులకు వివరిస్తాడు. 

ఆయన ఆ వీడియోకి "ట్రాఫిక్ పోలీసులకు దొరికాడు... చివరికి అతను నా ఈయూసీని నడపడంతో ముగిసింది" అనే క్యాప్షన్‌తో షేర్ చేశాడు ఆనంద్‌. అంతేగాదు ఏమో ఎవరు చెప్పగలరు ఏదో ఒక రోజు ట్రాఫిక్ పోలీసులు కూడా బెంగళూరు రోడ్లపై EUC తో గస్తీ కాయొచ్చేమో..అని చమత్కిరిస్తూ పోస్ట్‌ని ముగించాడు. 

 

(చదవండి: అమ్మగా గర్వించే క్షణం..!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement