అమ్మగా గర్వించే క్షణం..! | Vegetable Sellers Reaction To Son's CRPF Selection goes Viral | Sakshi
Sakshi News home page

అమ్మగా గర్వించే క్షణం..!

May 11 2026 10:40 AM | Updated on May 11 2026 10:40 AM

Vegetable Sellers Reaction To Son's CRPF Selection goes Viral

పిల్లలు ప్రయోజకులైతే అంతకుమించిన ఆనందం  ఇంకొకటి ఉండదు. అత్యంత అపురూపమైన క్షణం కూడా. మన పెంపకానికి సార్థకత అంటే పిల్లలు మంచి స్థితిలో ఉండేటమే కదా..!. అలాంటి భావోద్వేగపు ఆనందాన్నే దక్కించుకుంది ఈ మహిళ. అందుకు సంబంధించిన వీడియోని పారిశ్రామిక దిగ్గంజ ఆనంద్‌ మహీంద్రా షేర్‌ చేశారు.

ఆ వీడియోలో మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌కు చెందిన  మహిళ తన కొడుకుని అభినందిస్తూ కనిపిస్తుంటుంది. కూరగాయలు అమ్ముకునే ఆ మహిళ అకస్మాత్తుగా తన కొడుకు రావడం చూస్తుంటుంది. అతడు చిరునవ్వుతో ఓ శుభవార్తతో వస్తూ ఆమె కాళ్లపై పడిపోతాడు. ఆ విషయం ఏంటో తన కుమారుడు నోటితో విని సంతోషంతో ఉబ్బితబ్బిబవ్వుతుంది. అంతేగాదు కొడుకుని ఆత్మీయంగా కౌగిలించుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తుంది. 

అక్కడున్న కుమారుడి స్నేహితులు రంగులు చల్లుతు వాళ్ల వేడుకుని మరింత ఆనందభరితంగా మార్చడం స్పషంగా కనిపిస్తుంటుంది. ఆ తల్లి తన కుమారుడిని పాఠశాలకు పంపే స్థోమత లేక జీవితమంతా కాలిబాటన కూరగాయలు అమ్ముతూ ఎంతో శ్రమకోర్చి చదివించుకుంది. తన కుమారుడు గోపాల్‌సావంత్‌ చదువు కోసం ఆమె మహారాష్ట్రలో కాలిబాటన ఎండలో కూరగాయలు అమ్ముతూ జీవనం సాగించింది. 

CRPFకు ఎంపికైన వెంటనే, గోపాల్ నేరుగా తన తల్లి పనిచేస్తున్న కూరగాయల మార్కెట్‌ వద్దకు కాలిబాటన వెళ్లి..ఆమె పాదాలపై పడి తాను సీఆర్పీఎఫ్‌గా ఎంపికయ్యానంటూ చెప్పాడు. ఒక్కసారిగా ఇద్దరు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. 

ప్రతి గొప్ప విజయం వెనుక ఓ తల్లి అపారమైన త్యాగం తప్పక ఉంటుందని ఈ సంఘటన అత్యంత శక్తిమంతంగా గుర్తుచేస్తోంది కదూ..! అంటూ అందుకు సంబంధించిన వీడియోని షేర్‌ చేశారు ఆనంద్‌ మహీంద్రా. అంతేగాదు పిల్లల భవిష్యత్తు కోసం శ్రమించే ప్రతి తల్లికి మాతృదినోత్సవ శుభాకాక్షలు అంటూ తన పోస్ట్‌ని ముగించారు ఆనంద్‌ మహీంద్రా.

 

(చదవండి: అన్యోన్య దాంపత్యం అంటే ఇదే కదా..! బాధను సైతం..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement