అన్యోన్య దాంపత్యం అంటే ఇదే కదా..! బాధను సైతం.. | Man Shaves Head After Wife Loses Hair During Cancer Treatment | Sakshi
Sakshi News home page

అన్యోన్య దాంపత్యం అంటే ఇదే కదా..! బాధను సైతం..

May 10 2026 1:14 PM | Updated on May 10 2026 1:18 PM

 Man Shaves Head After Wife Loses Hair During Cancer Treatment

ఓ మహిళ అనారోగ్యంలో సైతం తన భర్త ఎలా అండగా నిలబడ్డాడో వివరిస్తూ షేర్‌ చేసిన పోస్ట్‌ నెటిజన్ల మనసులను అమితంగా గెలుచుకుంది. నిజానికి మనకిష్టమైన వాళ్ల కోసం చాలా వాటిని షేర్‌ చేసుకోగలమేమో గానీ కొన్నింటిని మాత్రం షేర్‌ చేసుకోవడానికి చాలా పెద్ద మనసు కావాలి. అదే ఈ మహిళ వివరిస్తూ తన కథను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకుంది. 

నమర్తా నితిన్‌ గోయెల్‌ తన వైద్య ప్రయాణంతో తనకు మద్దతుగా నిలిచి గుండు చేయించుకుంటున్న భర్త వీడియోని షేర్‌ చేశారు. ఆమె తాను కేన్సర్‌ బాధితురాలిననని, కీమో ధెరపీ కారణంగా తన జుట్టుని కోల్పోవడంతో తనకు సంఘీభావం తెలిపేలా తన భర్త గుండు చేయించుకున్న వీడియోని షేర్‌ చేషింది. కష్టకాలంలో సైతం తమ మధ్య బలమైన బంధం ఉందనడానికి ఈ ఘటనే నిదర్శనం అంటూ భావోద్వేగం చెందింది. 

ఆ వీడియోలో కీమోథెరపీ తర్వాత జుట్టు రాలిపోవడంతో తాను అనుభవించిన బాధ గురించి ఆమె మాట్లాడింది. తన రెండవ కీమోథెరపీ సెషన్ తర్వాత, జుట్టు విపరీతంగా రాలిపోవడం ప్రారంభమైందని, తన తల చర్మం చాలా సున్నితంగా, బాధాకరంగా మారిందని ఆమె చెప్పింది. జుట్టు రాలినప్పుడల్లా నొప్పి మరింత తీవ్రమయ్యేదని కూడా చెప్పుకొచ్చింది. ఆ విషయాన్ని ఆయనకు చెప్పడంతో ఆ బాధను తాను కూడా పంచుకుంటానంటూ ఆమె భర్త ట్రిమ్మర్‌తో గుండు చేయించుకున్నారని తెలిపింది. 

ఆ క్రమంలో ట్రిమ్మర్‌ తలపైన సున్నిత చర్మానికి తగిలినప్పుడల్లా ఆయనకు గాయమవ్వడం తాను చూశానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. నిజానికి కేన్సర్‌ చికిత్సలో భాగం జుట్టు ఊడిపోతుందని తెలుసు కానీ అందుకు తాను సిద్ధంగా లేనని వివరించింది. తన బాధను చూసే ఆమె భర్త ఇలా చేసినట్లు పేర్కొంది. నెటిజన్లే ఈ వీడియోని చూసి..భాగస్వాముల మధ్యలో ఉండాల్సిన శ్రద్ధను ఈ ఘట్టం తెలుపుతోందని, మరికొందరు..'మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌' అంటే మీ దంపుతులే అంటూ ప్రశంసలు, ఆశీస్తులు అందిస్తూ పోస్టులు పెట్టారు. 

 

(చదవండి:  ఈ ఐస్‌క్రీమ్‌... చాలా హాట్‌ గురూ!)
 

Advertisement
 
Advertisement
Advertisement