ఆ ఇంటి దీపం ఆరిపోలేదు | Dubare Elephant Incident: Husband Donates Tulsi Eyes Viral | Sakshi
Sakshi News home page

ఆ ఇంటి దీపం ఆరిపోలేదు

May 19 2026 9:04 AM | Updated on May 19 2026 9:11 AM

Dubare Elephant Incident: Husband Donates Tulsi Eyes Viral

అనుకోని రీతిలో మృత్యువు ఆమెను కబళించింది. అయితే అంత విషాదంలోనూ ఆమె భర్త శెభాష్‌ అనిపించే నిర్ణయం తీసుకున్నారు. ఏనుగుల దాడిలో చనిపోయిన తన భార్య కళ్లను దానం చేశారు. 

కర్ణాటకలో పర్యాటక ప్రాంతం కొడగు జిల్లా దుబారే వద్ద ఏనుగుల పొట్లాటలో ఓ మహిళ నలిగి చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే వైద్యుల సలహా మేరకు మృతురాలు తులసి కళ్లను దానం చేశాడు భర్త జోయెల్‌. తద్వారా ఆమె చూపు మరొకరి జీవితంలో వెలుగుని నింపుతుందని.. ఇలాగైనా తాను జీవించి ఉంటుందని చెబుతూ ఆ భర్త కన్నీళ్లు పెట్టుకున్నాడు.  

ఏనుగులను చూసేందుకు దుబారే శిబిరం, దాని సమీప కావేరి నది వద్దకు నిత్యం పర్యాటకులు వస్తుంటారు. సోమవారం కూడా తమిళనాడుకు చెందిన ఝాన్సీ (33) కుటుంబం అక్కడికి వెళ్లింది. ఈ క్రమంలోనే కావేరి నది వద్దకు ఏనుగులను మావటీలు స్నానానికి తీసుకువచ్చారు. ఆ సమయంలో రెండు ఏనుగులు పోట్లాడుకోగా.. అందులో ఒకటి అక్కడే ఉన్న ఝాన్సీపై పడిపోయింది. 

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించేె లోపు మృతి చెందింది. ఆమె భర్త, కుమార్తె ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆ సమయంలో భార్యను రక్షించుకునేందుకు జోయెల్‌ చేసిన ప్రయత్నం.. వీడియోగా నెట్టింట వైరల్‌ అయ్యింది. అయితే ఈ ఘటనలో ఆమె శరీరం ఏనుగు కింద పడి నలిగిపోగా.. కళ్లు మాత్రం దెబ్బతినలేదు.

Advertisement
 
Advertisement
Advertisement