ఎండ వేడికి తట్టుకోలేక ఐస్‌క్రీం తినాలనింపించడం, ఆన్‌లైన్‌లోఆర్డర్ పెట్టుకోవడం ఈ సమ్మర్ సీజన్‌లో చాలా కామన్. అయితే ఒక ఐస్ క్రీమ్ ఆర్డర్ ఆన్‌లైన్‌లో చర్చకు దారి తీసింది. జమ్మూకి చెందిన ఒక వ్యక్తి బ్లింకిట్ నుండి ఐస్ క్రీమ్‌లను ఆర్డర్ చేశాడు. రాత్రి భోజనం తరువాత తిందామని తీరిగ్గా ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది. అసలు ఏమైంది అంటే..
తేజిందర్ సింగ్ సోధి అనే యూజర్ తన కెదురైన అనుభవాన్ని ఎక్స్‌లో షేర్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశాడు. దీని ప్రకారం ఇటీవల జమ్మూలోని బ్లింకిట్ నుంచి కోన్ ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టాడు. డెలీవరీ తీసుకున్నాక దాన్ని జాగ్రత్తగా ఫ్రిజ్‌లో భద్రపరిచాడు. రాత్రి భోజనం తర్వాత హాయిగా ఐస్ క్రీం ను ఆస్వాదిద్దామని ప్యాకెట్ ఓపెన్ చేశాడు. తీరా చూస్తే లోపల సగం తిన్న ఐస్ క్రీమ్ కనిపించడంతో షాక్‌అయ్యానని తెలిపాడు. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని, ఇది పొరపాటుగా జరిగిన సంఘటన కాదని కూడా పేర్కొన్నాడు. అయితే దీనికి స్పందించిన బ్లింకిట్ రీఫండ్ ఆఫర్ చేసినప్పటికీ,తేజిందర్ దానిని తిరస్కరిస్తూ, పారేయడానికి కాదు. జవాబుదారీతనం ముఖ్యం, కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Ordered ice creams from @letsblinkit in Jammu. Stored them properly, opened the pack after dinner — and found a HALF-CONSUMED ice cream inside the Blinkit pack.
This is not negligence. This is a serious health risk.
Refund offered. Refused.
I will be taking this to consumer… pic.twitter.com/ujrWBfTnWo— Tejinder Singh Sodhi (@TejinderSsodhi) April 8, 2026
>
ఈ విషయాన్ని వినియోగదారుల కోర్టు దృష్టికి తీసుకువెళ్లాలని యోచిస్తున్నట్లు చెబుతూ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా , జాగో గ్రాహక్ జాగో వంటి అధికారులను కూడా ట్యాగ్ చేశాడు. అంతేకాదు ఈ సంఘటనను చూసిన తర్వాత తన కుమార్తె ఎంతగానో కలత చెందిందని, ఇకపై బ్లింకిట్‌ను ఎప్పటికీ నమ్మనని చెప్పిందని అతను పంచుకున్నాడు.
ఈ పోస్ట్ వైరల్ కావడంతో బ్లింకిట్ స్పందించింది. అసౌకర్యానికి క్షమాపణలు చెప్పి, ఈ సమస్యను ప్రాధాన్యతా క్రమంలో పరిశీలించడానికి వీలుగా అతని ఆర్డర్ ఐడీ, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను డైరెక్ట్ మెసేజ్ ద్వారా పంచుకోమని కోరింది.
నెటిజన్ల స్పందన
దీనిపై చాలామంది వినియోగదారులు స్పందించారు. ఇందులో పెద్దగా ఆశ్చర్య పోవాల్సిం దేమీ లేదని కమెంట్స్ చేయడం విశేషం. “నాకు కూడా ఇలాగే జరిగింది. నేను అముల్ చాక్లెట్ ఆర్డర్ చేశాను, అది సగం తిన్నది, కానీ దానికి నాకు రీఫండ్ వచ్చింది.” ఒక యూజర్ పేర్కొన్నారు. అలాగే కోన్‌లు లేదా కుల్ఫీలను ఆర్డర్ చేయవద్దని మరొకరు ప్రజలను హెచ్చరించారు. ఆర్డర్‌లలో వస్తువులు మిస్ అవ్వడం సర్వసాధారణమని,పూర్తి మొత్తంపై జీఎస్టీ వసూలు చేయడం వల్ల రీఫండ్స్‌తో న్యాయంజరగదని మరికొందరు విమర్శించారు. మరికొంతమంది డెలివరీ ఏజెంట్లపై విమర్శలు గుప్పించారు.
ఇదీ చదవండి: షుగర్ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా?


