సౌండ్‌ లేకుండా యుద్ధాలు గెలిచిన స్పైమాస్టర్..! | Dhurandhar: The Real Spy Master RN KAO | Sakshi
Sakshi News home page

సౌండ్‌ లేకుండా యుద్ధాలు గెలిచిన స్పైమాస్టర్..!

Apr 9 2026 6:23 PM | Updated on Apr 9 2026 6:36 PM

Dhurandhar: The Real Spy Master RN KAO

దేశాన్ని కాపాడేది కనబడే సైనికులు, సైనిక వ్యవస్థ. అలాగే కనిపించని కొన్ని వ్యవస్థలు, వ్యక్తులు తమ జీవితాలను దేశం కోసం త్యాగం చేసి తమ ఉనికి కూడా చరిత్రలో లేకుండా పోరాడిన యోధులు ఎంతో మంది ఉన్నారు.  హెడ్‌లైన్స్‌లో కనిపించని లెజెండ్ RAW పుట్టుక వెనుక, సౌండ్ లేకుండా యుద్ధాలు గెలిచిన భారత స్పైమాస్టర్ కథ ఇది. 

ఇవాళ సినిమాల్లో దూరందర్ లాంటి హీరోలను చూస్తున్నాం. శత్రు దేశాల్లోకి దూసుకెళ్లి, కనిపించకుండా తిరిగి, తెలివితోనే దెబ్బ తీసి, దేశాన్ని కాపాడుతున్నట్టు... ఆ థ్రిల్, ఆ సస్పెన్స్, ఆ తెలియని ధైర్యం మనల్ని ఆకట్టుకుంటుంది. కానీ ఆ సినిమా హీరోలకు పునాది వేసిన అసలు గొప్ప మనిషి ఎవరో తెలుసా? ఆయనే రమేశ్వర్ నాథ్ కౌ (R.N. Kao).

భారతదేశ గూఢచారి వ్యవస్థకు పునాది వేసిన గొప్ప వ్యక్తి. ఆయన రాజకీయ నాయకుడు కాదు… యుద్ధరంగంలో తుపాకీ పట్టిన సైనికుడు కూడా కాదు…కానీ ఆయన తెలివి, ఆయన ప్లాన్లు దేశ భవిష్యత్తును మార్చేశాయి.

రీసెర్చ అండ్‌ ఎనాలిసిస్‌ వింగ్‌ (R&AW) అనే భారత విదేశీ గూఢచారి సంస్థను నిర్మించిన అసలైన శిల్పి ఆయనే. అసలు ‘రా’ ఎలా పుట్టిందో ఓసారి చూద్దాం. 1962లో చైనా యుద్ధం, 1965లో పాకిస్థాన్ యుద్ధం ఈ రెండు సంఘటనలు భారతదేశానికి ఒక చేదు నిజం నేర్పాయి: బలమైన గూఢచార వ్యవస్థ లేకపోతే దేశం ఎదురు దెబ్బలు తినాల్సిందే. అప్పుడు అప్పటి ప్రభుత్వం, 

అధికారులు గట్టిగా ఆలోచించి ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకున్నారు దేశానికి ప్రపంచ స్థాయి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కావాలి. ఆ బాధ్యత ఒక్కరికి అప్పగించారు… అతనే ఆర్‌ ఎన్‌ కౌ 1968లో ఆయన స్థాపించిన సంస్థేనే ‘రా’ ఇది కేవలం ఒక సంస్థ కాదు… భారతదేశం ప్రపంచ వేదికపై కనిపించని బలంగా మారిన క్షణం.

 

1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో R&AW పాత్ర చరిత్రలో ప్రత్యేకం.  ఆర్‌. ఎన్‌. కౌ నాయకత్వంలో ఈస్ట్ పాకిస్థాన్‌లో రహస్య గూఢచారి నెట్‌వర్క్ నిర్మించారు. ముక్తి బాహిని యోధులకు శిక్షణ ఇచ్చి పాకిస్థాన్ సైన్యం కదలికలపై ఖచ్చితమైన సమాచారం అందించారు. ఫలితంగా  ప్రపంచ చరిత్రలో అతి వేగంగా ముగిసిన యుద్ధాల్లో ఒకటిగా నిలిచింది. 93,000 వేలమంది పాకిస్తాన్ సైనికులు లొంగుబాటు.దాంతోపాటు బంగ్లాదేశ్ అనే కొత్త దేశం జన్మించింది. యుద్ధంలో సైన్యం కనిపించింది… కానీ విజయానికి పునాది వేసింది మాత్రం  కౌ ఇంటెలిజెన్స్. 

ఈయన  స్పైమాస్టర్ స్టైల్ ఏంటంటే శబ్దం లేకుండా ప్రభావం చూపించడం ఆర్‌ ఎన్‌ కౌ గురించి అత్యంత ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి వింటే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. ఆయన ఫోటోలు చాలా అరుదు, ఇక ఇంటర్వ్యూలు దాదాపుగా లేవు, అలా అని ఆయన పబ్లిక్ స్పీచ్‌లు కూడా చేయలేదు. ఆయన నమ్మకం ఒక్కటే “Real intelligence works in silence.” ఆయన ఎప్పుడూ హెడ్‌లైన్స్‌లో లేరు కాని ఆ హెడ్ లైన్స్ రావడానికి కారణం ఆయనే. 

అయితే  ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం ఉండేది.  సీఐఏ, ఎమ్‌ 16 వంటి ప్రపంచ గూఢచారి సంస్థలు కూడా కౌ వ్యూహాలను గౌరవించేవి. అణు కార్యక్రమ రహస్యాలను రక్షించడం, విదేశీ రాజకీయ పరిణామాలను ముందే అంచనా వేయడం, శత్రు దేశాల వ్యూహాలను పసిగట్టడం...ఇవన్నీ ఆయన నిర్మించిన వ్యవస్థ వల్లే సాధ్యమయ్యాయి.

దేశం కోసం పని చేసిన రాజకీయ నాయకులు చరిత్ర పుస్తకాల్లో ఉంటారు. సైనికులు యుద్ధ గాథల్లో ఉంటారు. కానీ… దేశాన్ని కనిపించకుండా కాపాడిన గూఢచారులు మాత్రం కనిపించకుండా కదిలే కాలంలో కలిసిపోతారు. ఆ గూఢచారుల్లో అత్యున్నత స్థానం  ఆర్‌ ఎన్‌ కౌది.

ఆయన ఎప్పుడూ పేరు కోసం పని చేయలేదు. పతకాలు కోసం జీవించలేదు. దేశం సురక్షితంగా ఉండాలనే ఒకే ఒక్క లక్ష్యంతో జీవించారు. ఆ లక్ష్యాన్ని మరింత బలంగా చేసి, ముందుకు తీసుకెళ్తున్న మరో గొప్ప మనిషి  ప్రస్తుత భారత ఇంటెలిజెన్స్ అధినేత అజిత్ దోవల్ గారు. దాదాపు 
దోవల్ గారు కూడా కౌ సాబ్ బాటలోనే నడిచారు... కానీ తన స్టైల్‌లో మార్చేశారు.  ఐపీఎస్‌ అధికారిగా 1968లో జాయిన్ అయిన ఆయన, తర్వాత ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో చాలా ఏళ్లు పని చేసి, రహస్య ఆపరేషన్లలో లెజెండ్ అయ్యారు. 

గోల్డెన్ టెంపుల్‌లోకి ISI ఏజెంట్‌గా దూసుకెళ్లి, మిలిటెంట్ల మధ్య నెలల తరబడి జీవించి, ముఖ్యమైన సమాచారం సేకరించారు.  ఆపరేషన్‌ బ్లాక్‌ థండర్స్‌ (Operation Black Thunder)కు పునాది వేశారు. పాకిస్థాన్‌లో సంవత్సరాల తరబడి రహస్యంగా ఉండి (కొన్ని కథనాల ప్రకారం 7+ ఏళ్లు), శత్రు భూమిలో భారత్ కోసం పని చేశారు. మిజోరం, పంజాబ్, కాశ్మీర్‌లో తిరుగుబాట్లను అడ్డుకున్న ఆపరేషన్లు... అన్నీ ఆయన ప్లాన్ల వల్లే సాధ్యమయ్యాయి. ఇవాళ NSAగా దోవల్ గారు కౌ సాబ్ వారసత్వాన్ని “రక్షణ + దాడి” స్ట్రాటజీగా మలిచారు. 

సర్జికల్ స్ట్రైక్స్ (2016), బాలకోట్ ఎయిర్‌స్ట్రైక్ (2019), డోక్లాం స్టాండ్-ఆఫ్, కాశ్మీర్ స్పెషల్ స్టేటస్ రద్దు — ఇవన్నీ ఆయన తంత్రాల వల్లే జరిగాయి. సినిమాల్లో చూసే “దూరందర్” లాంటి థ్రిల్... దోవల్ గారి జీవితంలో నిజంగా జరిగింది, కానీ ఆయన ఎప్పుడూ లైమ్‌లైట్‌లోకి రాలేదు.

అటు కౌ సాబ్ కి ఇటు దోవల్‌కి కావలసింది ఒక్కటే — దేశం సురక్షితంగా ఉండాలి. అయితే కౌ సాబ్ రహస్యంగా పునాది వేశారు. దోవల్ ఆ పునాదిని భారత బలంగా మార్చేశారు. ఇలాంటి తెలియని హీరోలు ఉన్నంత కాలం... భారతదేశం ఎప్పుడూ అజేయమే!

Advertisement
 
Advertisement
Advertisement