ప్రదీప్ రంగనాథన్, కృతీ శెట్టి (Krithi Shetty) జంటగా నటించిన చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK). విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల కానుంది.
ఈ క్రమంలో ఏప్రిల్ 5న హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించగా తాజాగా చెన్నైలో ప్రీరిలీజ్ కార్యక్రమం జరిపారు. ఈ సందర్భంగా కృతీ శెట్టి మాట్లాడుతూ.. తన కెరీర్‌లో చేసిన చిత్రాల్లో ఇది అత్యంత ప్రత్యేకమైన మూవీ అని తెలిపింది.


