గెలిచా అనుకునేలోపే ఓటమి హగ్‌ ఇచ్చిందిగా..! | Runner Loses Delaware Marathon By 2 Seconds Goes Viral | Sakshi
Sakshi News home page

గెలిచా అనుకునేలోపే ఓటమి హగ్‌ ఇచ్చిందిగా..!

Apr 21 2026 11:07 AM | Updated on Apr 21 2026 11:39 AM

Runner Loses Delaware Marathon By 2 Seconds Goes Viral

ఎప్పుడైన గెలవాలని అనుకున్నప్పుడు చివరవరకు ఓపికతో పోరాడాలి. గెలిచాక సంబరాలు చేసుకోవాలి. అప్పటి వరకు సంయమనంతో ఉండాలి లేదంటే ఘోరంగా అవమానపాలు కావాల్సిందే. అందుకు నిదర్శనం ఈ ఘటన. డెలావేర్ మారథాన్ రన్నింగ్‌ కాంపిటీషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫినిష్‌ చేయాల్సిన గీతకు కొన్ని అంగుళాల ముందే యాహు గెలిచేశా అంటూ సంబరాలు చేసుకుటూ చేతులు పైకెత్తాడు. 

కొద్ది దూరంలోనే వేగాన్ని తగ్గించి ఆనందంగా గెంతులేస్తూ వస్తున్నాడు. ఇంతలో అతడి ప్రత్యర్థి 24 ఏళ్ల జాషువా జాక్సన్ అనూహ్యంగా వెనుక నుంచి దూసుకొచ్చి..అతడిని ఓడించేటప్పటికీ..అతన ఒక్కసారిగి కంగుతింటాడు. గెలిచానన్న ఆనందం క్షణాల్లో చూస్తుండగానే ఆవిరైపోయిందా అని షాక్‌లో ఉండిపోయాడు. 

అందుకే అంటారు పెద్దలు గెలుపుని పాదాక్రాంతం చేసుకునేంత వరకు చప్పుడు చేయకూడదు అనేది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారంది. జాక్సన్‌ అనే వ్యక్తి మారథాన్‌ రేసు గెలిచి..అద్భుతమైన 2:43:11 సమయాన్ని నమోదు చేశాడు. ఈ ఘటన అందరికి అద్భుతమైన గుణపాఠం కదూ..!.

(చదవండి: అరుదైన ఘటన: కూతురిని చితకబాదిన అమ్మ..!)
 

Advertisement
 
Advertisement
Advertisement