హైదరాబాద్‌లో మహిళలకు రక్షణ ఉండదా? | Woman Runner Face Harassment At Cycle Track Next happend This Video Viral | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో మహిళలకు రక్షణ ఉండదా?

Apr 27 2026 1:51 PM | Updated on Apr 27 2026 2:03 PM

Woman Runner Face Harassment At Cycle Track Next happend This Video Viral

సాక్షి, హైదరాబాద్‌: ‘‘మహిళలకు ఈ నగరం ఎంతో సురక్షితమనుకున్నా. కానీ, అది నిజం కాదని ఇవాళే తెలిసింది’’ అంటూ ఓ యువతి విడుదల చేసిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఉదయాన్నే రన్నింగ్‌కు వెళ్లిన తనకు ఎదురైన భయానక అనుభవాన్ని ఆమె ఆ వీడియోలో పంచుకుంది. 

హైదరాబాద్‌ సైకిల్‌ ట్రాక్‌లో ఓ మహిళా రన్నర్‌కు వేధింపులు ఎదరయ్యాయి. ఓ వ్యక్తి ఆమెను వెంబడిస్తూ జుగుప్సాకరంగా వ్యవహరించబోయాడు. అయితే అప్రమత్తమైన ఆ యువతి అతన్ని వీడియో తీయబోగా.. నిక్కరు వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ అనుభవాన్ని సోషల్‌ మీడియాలో పంచుకుని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. 

తన దుస్తుల్ని చూపిస్తూ.. ఇది హైదరాబాద్‌! మహిళలకు సురక్షితంగా ఉండకూడదా?. సూర్యోదయం కంటే ముందు నేను ఎప్పుడూ రన్నింగ్‌కు రాలేదు. ఎప్పుడూ సూర్యోదయం తర్వాతే వస్తా.. రన్నింగ్‌ దుస్తుల్లో వస్తే ఆటోవాలాలు, బైక్‌ రైడర్లూ తేడా చూపులు చూస్తారు. ఆఖరికి ఐదు పదుల వయసున్న అంకుల్స్‌ కూడా అందుకు మినహాయింపేం కాదని ఆమె వ్యాఖ్యానించింది.  

భయంతో, బాధతో ఆ యువతి చేసిన వీడియో సోషల్‌ మీడియాకు చేరింది. పలువురు ఆమెకు మద్ధతుగా పోలీసు వ్యవస్థను నిందిస్తున్నారు. సైకిల్‌ ట్రాక్‌పై పోలీసుల గస్తీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో విపరీతంగా వైరల్‌ కావడంతో.. ఆ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. 

Advertisement
 
Advertisement
Advertisement