విజయ్‌ ఎన్నికల ర్యాలీలో అనూహ్య ఘటన | Vijay blesses newlyweds with gift during political rally | Sakshi
Sakshi News home page

విజయ్‌ ఎన్నికల ర్యాలీలో అనూహ్య ఘటన

Apr 20 2026 4:07 PM | Updated on Apr 20 2026 7:25 PM

Vijay blesses newlyweds with gift during political rally

చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో పార‍్టీల నేతల ప్రచారంలో మరింత జోరు కనపడుతోంది. అన్ని పార్టీల ప్రధాన నేతలు ర్యాలీలు, బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. అలాగే, టీవీకే అధినేత విజయ్‌ సోమవారం పొన్నేరి అసెంబ్లీ నియోజకవర్గం పంచట్టి సహా పలు ప్రాంతాల్లో భారీ రోడ్‌షో నిర్వహించారు.

ప్రచారం సమయంలో ఓ కొత్త జంట విజయ్‌ వద్దకు వచ్చింది. వారిని విజయ్‌ తన వాహనం మీదకు ఎక్కించుకున్నారు. దీంతో ఆనందం పట్టలేక పెళ్లికూతురు ఉబ్బితబ్బిబ్బయిపోయింది. పెళ్లికొడుకు, పెళ్లికూతురిని విజయ్‌ ఆశీర్వదించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 

కొత్త దంపతులు విజయ్‌ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.  విజయ్ తన జేబు నుంచి ఒక బహుమతిని తీసి ఆ జంటకు ఇచ్చారు. వధువు-వరుడు విజయ్ చేతులను ముద్దుపెట్టుకొని, ఆయన పాదాలను తాకుతూ కనిపించారు. వరుడు విజయ్‌ను ఆలింగనం చేసుకున్నాడు. 

విజయ్ ఆ జంట చేతులను పైకి ఎత్తి విజయం మనదే అనే సంకేతం చూపించారు. పరమానందంలో ఉత్సాహంతో ఉన్న వధువు జన సమూహాన్ని అభినందిస్తూ విజిల్ వేసింది. తమిళనాడు ఎన్నికల పోలింగ్‌ ఏప్రిల్‌ 23న జరుగుతుంది. ఓట‍్ల కౌంటింగ్‌ మే 4న జరుగుతుంది. ప్రచారానికి సమయం తక్కువగా ఉండడంతో ప్రచారంలో నేతలు దూకుడుగా పాల్గొంటున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement