వైరల్‌గా మారిన జితేశ్‌ శర్మ చర్య! | Jitesh shows Respect Rowards DC Flag Became Viral During Match | Sakshi
Sakshi News home page

వైరల్‌గా మారిన జితేశ్‌ శర్మ చర్య!

Apr 28 2026 6:45 PM | Updated on Apr 28 2026 7:05 PM

Jitesh shows Respect Rowards DC Flag Became Viral During Match

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) జోరు కనబరుస్తోంది. సీజన్‌లో 8 మ్యాచ్‌లాడిన ఆర్సీబీ 6 విజయాలు, 2 ఓటములతో 12 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 

ఈ నేపథ్యంలో మ్యాచ్‌ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌ సమయంలో స్టాండ్స్‌లో ఉన్న ఒక ప్రేక్షకుడి చేతిలో నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌ నుంచి జెండా గాలిలో ఎగురుకుంటూ మైదానంలోకి వచ్చింది. దీనిని గమనించిన ఆర్సీబీ వికెట్‌ కీపర్‌ జితేశ్‌ శర్మ ఆ జెండాను అందుకొని తన జేబులో పెట్టుకోవడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

మ్యాచ్ విష‌యానికొస్తే సొంత‌గ‌డ్డ‌పై ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆర్సీబీ బౌల‌ర్ల ధాటికి 75 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. అభిషేక్ పొరేల్ 30 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. హాజిల్‌వుడ్ 4, భువ‌నేశ్వ‌ర్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టారు. 

అనంత‌రం ఛేద‌న‌లో ఆర్సీబీ వికెట్ కోల్పోయి 77 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది. ప‌డిక్క‌ల్ (34 నాటౌట్‌), కోహ్లి (23 నాటౌట్) జ‌ట్టును విజ‌య‌తీరాలకు చేర్చారు. ఈ విజ‌యంతో ఆర్సీబీ 12 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో రెండో స్థానానికి చేరుకుంది.  ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌ తన తర్వాతి మ్యాచ్‌ను మే1న రాజస్తాన్‌ రాయల్స్‌తో ఆడనుంది. 

చదవండి: ‘కేఎల్ రాహుల్‌పై విషం చిమ్మ‌డం ఆపండి!’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement