100 మందిని ఒకేసారి మోసం చేసిన బిచ్చగాడు | Beggars Deception Exposed on Camera | Sakshi
Sakshi News home page

100 మందిని ఒకేసారి మోసం చేసిన బిచ్చగాడు

Apr 26 2026 6:26 PM | Updated on Apr 26 2026 7:13 PM

 Beggars Deception Exposed on Camera

అంగవైకల్యం ఉన్నప్పటికీ చాలా మంది కష్టపడి పనిచేసుకుని జీవిస్తుంటారు. కొందరు మాత్రం ఏ సమస్య లేకపోయినా అంగవైకల్యం ఉన్నట్లు నటిస్తూ అడుక్కుతింటుంటారు. అటువంటి వ్యక్తే నడిరోడ్డుపై ఓ కెమెరాకు దొరికిపోయాడు. ఘర్‌ కే కాలేశ్‌ అనే ఎక్స్‌ ఖాతాలో ఈ వీడియోను తాజాగా పోస్ట్‌ చేశారు. దీంతో, ఇది పాత వీడియోనా? లేదా కొత్త వీడియోనా? అన్నది తెలియకయినప్పటికీ ఆన్‌లైన్‌లో బాగా ట్రెండ్ అవుతోంది.

ఈ దృశ్యాలు ఒక కార్ డ్యాష్‌క్యామ్‌లో రికార్డ్ అయ్యాయి. వీడియోలో ఒక భిక్షగాడు నడిరోడ్డుపై కర్రల సాయంతో కుంటుతూ ముందుకు వస్తూ జనాల వద్దకు వెళ్లి తన కాలు బాగోలేదని  చెప్పి భిక్ష అడుగుతున్నట్టు కనిపిస్తుంది. ఆ రోడ్డుపై దాదాపు 100 మంది ఉంటారు. వాళ్లంతా అతడిని చూసి నిజంగానే ఒక కాలు లేదేమోనని అనుకుంటారు. 

సిగ్నల్‌ వద‍్ద రెడ్‌ లైట్‌ పడడంతో అతను స్కూటీపై ఉన్న జంట దగ్గరకు వెళ్లి భిక్ష అడుగుతాడు. వారు డబ్బులు ఇచ్చేదాక అక్కడే ఉంటాడు. చివరకు స్కూటీపై ఉన్నవారు డబ్బు ఇస్తారు. గ్రీన్ పడగానే వాహనదారులు అందరూ అక్కడి నుంచి వెళ్లడం ప్రారంభిస్తారు. అప్పుడు ఆ భిక్షగాడి నిజస్వరూపం బయటపడుతుంది. అందరూ వెళ్లిన తర్వాత అతడు కర్రల సాయంతో కాకుండా సాధారణంగా నడుస్తూ వెళ్లడం కనిపిస్తుంది. 

ఇందుకు సంబంధించిన వీడియోను వేలాది మంది చూశారు. ఇలాంటి బిచ్చగాళ్లు ప్రతి రెడ్ లైట్ దగ్గర కనిపిస్తారని నెటిజన్లు అంటున్నారు. వికలాంగులుగా నటిస్తూ చాలా మంది భిక్ష అడుగుతారని కామెంట్లు చేస్తున్నారు. నిజంగా కాలు సమస్య ఉన్నట్టు నటించి, కుంటుతూ జనాల్ని మోసం చేయడం చాలా తప్పని కొందరు కామెంట్లు చేశారు. బిచ్చగాళ్లపై ప్రజల నమ్మకాన్ని అతడు దెబ్బతీస్తున్నాడని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement