పాక్‌ ప్రధానితో ఇరాన్‌ ఫోన్‌ కాల్‌.. | Pak PM dials Iranian President discusses evolving regional situation | Sakshi
Sakshi News home page

పాక్‌ ప్రధానితో ఇరాన్‌ ఫోన్‌ కాల్‌..

Apr 26 2026 11:52 AM | Updated on Apr 26 2026 1:13 PM

Pak PM dials Iranian President discusses evolving regional situation

ఇస్లామాబాద్‌: ఇరాన్‌, అమెరికా మధ్య చర్చల సందర్భంగా హైడ్రామా చోటుచేసుకుంది. చర్చల కోసం పాకిస్థాన్‌ వెళ్లిన ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ అమెరికా ప్రతినిధులు రాకముందే ఒమన్ బయల్దేరి వెళ్లిపోయారు. దీంతో శాంతి చర్చలకు తన ప్రతినిధులను ఇస్లామాబాద్‌కు పంపించడం లేదని  ట్రంప్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అమెరికాతో శాంతి చర్చలపై అనిశ్చితి నెలకొన్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక కామెంట్స్ చేశారు.

పెజెష్కియాన్ తాజాగా పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో పెజెష్కియాన్ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన శాంతి చర్చలపై ఇరాన్ వైఖరిని స్పష్టం చేశారు. ఈ క్రమంలో అమెరికా విధిస్తున్న ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనం, బెదిరింపుల నడుమ ఆ దేశంతో చర్చలు అసాధ్యమని తేల్చి చెప్పారు. అలాగే, ఇరాన్ తన సార్వభౌమాధికారాన్ని వదులుకోదని, అలాగే ఒత్తిళ్లకు తలొగ్గి ఒప్పందాలు చేసుకోబోదని స్పష్టం చేశారు. ప్రస్తుత ఉద్రిక్తతలకు అమెరికానే కారణమని పేర్కొన్నారు. అమెరికా అనుసరిస్తున్న చర్యలే చర్చలకు ప్రధాన అడ్డంకి ఆయన కుండబద్దలు కొట్టారు.

కాగా, ఏప్రిల్ 13 నుంచి ఇరాన్ ఓడరేవులను అమెరికా నౌకాదళం దిగ్బంధించిన విషయం తెలిసిందే. ఈ పరిణామం వల్ల ఇరాన్ ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇలాంటి దిగ్బంధనాల నడుమ పరస్పర నమ్మకాన్ని పునరుద్ధరించడం అసాధ్యమని పేజెష్కియాన్ వెల్లడించారు. అందుకే ఇరు దేశాల మధ్య చర్చలు జరగాలంటే ముందుగా అమెరికా ఆంక్షలను తొలగించి, చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

అరాగ్చీ స్పందన..
ఇస్లామాబాద్ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పందించారు. ఇప్పటికే తాము ఒక ఫ్రేమ్ వర్క్‌ను పాకిస్తాన్‌​కు అందించామని తెలిపారు. యుద్ధాన్ని శాశ్వతంగా ముగించేందుకు ఇది ఒక మంచి మార్గమని ఆయన చెప్పారు. అయితే, శాంతి చర్చలపై అమెరికాకు నిజంగా ఆసక్తి ఉందా? అన్నది అనుమానమేనని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అబ్బాస్ అరాగ్చీ ఒమన్ పర్యటనలో ఉన్నారు. అయితే, చర్చల కోసం ఆయన తిరిగి పాకిస్తాన్‌ వచ్చే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement