ఉత్కంఠకు తెర: 27న నీట్ హాల్ టికెట్లు విడుదల | NEET 2026 Admit Cards Dropping Tomorrow | Sakshi
Sakshi News home page

ఉత్కంఠకు తెర: 27న నీట్ హాల్ టికెట్లు విడుదల

Apr 26 2026 1:22 PM | Updated on Apr 26 2026 1:38 PM

NEET 2026 Admit Cards Dropping Tomorrow

న్యూఢిల్లీ: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నీట్ (NEET UG 2026) అడ్మిట్ కార్డుల నిరీక్షణకు తెరపడింది. ఎన్టీఏ (NTA) చేసిన తాజా ప్రకటన అభ్యర్థుల్లో ఉత్సాహాన్ని నింపింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG 2026) హాల్ టికెట్లు సోమవారం, (ఏప్రిల్ 27)విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ‘ఎక్స్‌’ వేదికగా అధికారికంగా ప్రకటించింది. అడ్మిట్ కార్డులు విడుదలైన వెంటనే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 

డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఇదే..
అడ్మిట్ కార్డులను సులభంగా పొందేందుకు విద్యార్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in ను సందర్శించాలి. అక్కడ కనిపించే ‘అడ్మిట్ కార్డ్ పీడీఎఫ్ (Admit Card PDF)’ లింక్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత మీ అప్లికేషన్ నంబర్ (Application Number), పాస్‌వర్డ్ (Password) వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలి. ఈ వివరాలు ఇచ్చిన వెంటనే నీట్ హాల్ టికెట్ మీ స్క్రీన్‌పై దర్శనమిస్తుంది. వెంటనే ఆ పీడీఎఫ్‌ను సేవ్ చేసుకుని, పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లేందుకు తప్పనిసరిగా ఒక ప్రింటవుట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.

పరీక్షా విధానం.. 180 నిమిషాల సమరం
నీట్ 2026 ప్రశ్నాపత్రం పూర్తిగా విద్యార్థుల ప్రతిభకు పదును పెట్టేలా ఉండనుంది. మొత్తం 180 ప్రశ్నలకు అభ్యర్థులు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఇందులో భౌతిక శాస్త్రం (ఫిజిక్స్) నుంచి 45, రసాయన శాస్త్రం (కెమిస్ట్రీ) నుంచి 45, జీవశాస్త్రం (బయాలజీ) నుంచి 90 ప్రశ్నలు ఉంటాయి. ఈ 180 ప్రశ్నలను సాధించడానికి విద్యార్థులకు కేవలం 180 నిమిషాల సమయం మాత్రమే లభిస్తుంది. కాబట్టి పరీక్షలో సమయపాలన అత్యంత కీలకం కానుంది.

ఇది కూడా చదవండి: గుండెకు క్యాన్సర్ ఎందుకు రాదో తెలుసా?

Advertisement
 
Advertisement
Advertisement