న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో ఒక కాంగ్రెస్ కార్యకర్త హత్యకు గురికావడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో ఉన్నది ప్రజాస్వామ్యం కాదని, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) గూండారాజ్ నడుస్తోందని ఆరోపించారు.
దారుణ హత్య.. ఆవేదనలో రాహుల్
అసన్సోల్‌లో కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్న దేబ్‌దీప్ ఛటర్జీ అనే కార్యకర్తను పోలింగ్ అనంతరం కొందరు దుండగులు దారుణంగా కొట్టి చంపారు. ఈ ఉదంతంపై ‘ఎక్స్’ వేదికగా స్పందించిన రాహుల్ గాంధీ.. ఇదొక అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. ఛటర్జీ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన, అధికార టీఎంసీ పార్టీకి చెందిన గూండాలే పక్కా ప్రణాళికతో ఈ దారుణానికి ఒడిగట్టారని ఆరోపించారు.
कांग्रेस के कार्यकर्ता देबदीप चटर्जी की चुनाव बाद TMC से जुड़े गुंडों द्वारा की गई हत्या बेहद निंदनीय है। शोकाकुल परिवार के प्रति मेरी गहरी संवेदनाएँ।
पश्चिम बंगाल में आज लोकतंत्र नहीं, TMC का गुंडा राज चल रहा है। वोट के बाद विरोधी आवाज़ों को डराना, मारना, मिटाना - यही TMC का… https://t.co/kQn4T9deL0— Rahul Gandhi (@RahulGandhi) April 26, 2026
ప్రజాస్వామ్యం కాదు.. గుండారాజ్
బెంగాల్‌లో ప్రజాస్వామ్యం కనుమరుగైందని, కేవలం టీఎంసీ గూండాల రాజ్యమే నడుస్తోందని రాహుల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓటింగ్ ముగిశాక ప్రత్యర్థుల గొంతు నొక్కడం, దాడులు చేయడం, భయభ్రాంతులకు గురిచేయడమే టీఎంసీ నైజంగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ హింసను ప్రోత్సహించలేదని, తాము రాజ్యాంగబద్ధమైన మార్గంలోనే నడుస్తామని అన్నారు. ఇదే తమ వారసత్వం, సంకల్పం అని ఆయన పేర్కొన్నారు.
కఠిన శిక్ష పడాల్సిందే
ఈ హత్యాకాండకు పాల్పడిన దోషులను తక్షణమే అరెస్టు చేసి, అత్యంత కఠినంగా శిక్షించాలని రాహుల్ డిమాండ్ చేశారు. బాధితుని కుటుంబానికి పూర్తి భద్రత కల్పించడంతో పాటు తగిన నష్టపరిహారం చెల్లించాలన్నారు. అసన్సోల్ నార్త్ అభ్యర్థి ప్రసేన్‌జిత్ పుటండికి అత్యంత సన్నిహితంగా పనిచేస్తున్న దేబ్‌దీప్‌పై టీఎంసీ అనుబంధ దుండగులే ఈ దారుణ దాడికి పాల్పడ్డారని పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. భారతదేశ అహింసా సిద్ధాంతానికి మచ్చ తెస్తున్న ఇటువంటి నీచ రాజకీయాలకు తాము తలొగ్గేది లేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ఎన్నికల వేళ.. ప్రధాని మోదీ గుడ్‌న్యూస్


