breaking news
viral video message
-
మాస్క్ మినహాయింపుల్లేవ్.. ఒక్కసారి ఈ వీడియో చూడండి
VIRAL VIDEO: ‘వేర్ ఏ మాస్క్-సేవ్ ఏ లైఫ్’.. కరోనా టైం మొదలైనప్పటి నుంచి వినిపిస్తున్న నినాదం ఇది. దశల వారీగా, వేరియెంట్లతో మానవాళిపై వైరస్ విరుచుకుపడుతున్నా.. మాస్క్లు వీడొద్దంటూ వైద్య నిపుణులు మొత్తుకుంటున్నారు. కరోనా వచ్చి తగ్గినా.. వ్యాక్సినేషన్ నడుస్తున్నా.. పూర్తిస్థాయి రక్షణ కోసం మాస్క్.. వీలైతే డబుల్ మాస్కులు ధరించాల్సిందేనని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఆంక్షల సడలింపుతో చాలామంది ముఖానికి మాస్క్లు ధరించడం లేదు. ధరించినా కొందరు అసంపూర్తిగా పెట్టుకుంటున్నారు. రద్దీ మార్కెట్లు, ప్రయాణాల్లో, ఆఫీసుల్లో.. చాలామందిలో ఈ నిర్లక్క్ష్యం పెరిగిపోయింది. అడిగితే దురుసు-నిర్లక్క్ష్యపు సమాధానాలు వినిపిస్తున్నాయి. పైగా థర్డ్ వేవ్ ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నా.. చాలామందిలో ఈ ధోరణి మారడం లేదు. ఈ తరుణంలో ఓ పాత వీడియోను తెరపైకి తెచ్చారు కొందరు. పైగా సందర్భానికి తగ్గ వీడియో కావడంతో చాలామంది వాట్సాప్ స్టేటస్ల ద్వారా మళ్లీ వైరల్ చేస్తున్నారు. వైకల్యం ఉన్నా తమనే మాస్క్ ధరించడం నుంచి మినహాయింపు ఇవ్వకండని, తామే మాస్క్లు ధరించినప్పుడు అన్నీ సక్రమంగా ఉన్నవాళ్లూ ధరించడం తప్పనిసరని గుర్తు చేసే ఆ వీడియో కిందటి ఏడాది ఫస్ట్ వేవ్ తర్వాత బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియోను మేరీల్యాండ్ యూనివర్సిటీ డాక్టర్ ఫహీమ్ యూనస్ ట్విటర్ అకౌంట్ నుంచి కిందటి ఏడాది సెప్టెంబర్ 16న పోస్ట్ అయ్యింది. కావాలంటే మరోసారి మీరూ చూసేయండి. బాధ్యతను గుర్తు చేసుకుని దయచేసి సక్రమంగా మాస్క్లు ధరించండి. -
మాస్క్ మినహాయింపుల్లేవ్.. ఒక్కసారి ఈ వీడియో చూడండి
-
కేంద్రమంత్రికి చేరిన జవాను వీడియో
-
కేంద్రమంత్రికి చేరిన జవాను వీడియో
న్యూఢిల్లీ : జమ్ముకాశ్మీర్లో జవానుల ధీన స్థితిపై బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ ఫేస్ బుక్లో పోస్ట్ చేసిన వీడియో కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ను చేరింది. సరిహద్దులో అత్యంత చలిలో విధులు నిర్వహిస్తున్న తమకు నాసిరకం ఆహారాన్ని పెడుతున్న వైనాన్ని వీడియోల్లో చిత్రీకరించి బయటి ప్రపంచానికి తెలిసేలా చేశాడు. సోషల్ మీడియాల్లో ఈ వీడియోను చూసిన వారందరూ తేజ్ బహదూర్ యాదవ్కు మద్దతుగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వం జవాన్ల ఆహారం కోసం ఎన్ని సదుపాయాలు కల్పించినా మధ్యలో అధికారులు పందికొక్కుల్లా మింగేస్తున్నారని యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మాడిన రొట్టె, పసుపు రసం, సాంబార్ మాత్రమే ఆహారంగా ఇస్తున్నారని వీడియోలో చిత్రీకరించి మరీ ఫేస్ బుక్లో పోస్ట్ చేశారు. తమ దీనగాథపై ప్రధాని మోదీ స్పందించాలని యాదవ్ కోరారు. యాదవ్ పోస్ట్ చేసిన వీడియోలు వైరల్ అవ్వడంతో కొద్దిసేపటికే ఆ వీడియోలు మీడియాల్లో దర్శనమిచ్చాయి. ఈ వీడియోలు ప్రసారమయ్యే సమయానికే తనపై సీనియర్ అధికారులు వేటు వేసే అవకాశం ఉందనే అనుమానాన్ని కూడా యాదవ్ వ్యక్తం చేశారు. మీడియాలో యాదవ్ వీడియోలు ప్రసారమైన వెంటనే రాజ్నాథ్ స్పందించారు. దర్యాప్తు జరిపి వివరాలు తెప్పించాలని దోషులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.