ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఢిల్లీ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో కోపంతో ఊగిపోతూ హెల్మెట్‌ను నేలకేసి కొట్టడంతో పాటు గ్లోవ్స్‌ను విసిరేయడం కెమెరాలకు చిక్కింది. మరి స్టబ్స్ కోపానికి కారణమేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో స్టబ్స్ తన గ్లోవ్స్‌ను మార్చుకునే ప్రయత్నం చేశాడు. అప్పటికే గ్లోవ్స్ మొత్తం చెమటతో తడిసిపోవడంతో స్టబ్స్ పదే పదే బ్యాట్ గ్రిప్‌ను కోల్పోయాడు. దీంతో గ్లోవ్స్‌ను మార్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని అంపైర్‌ను కోరాడు.
కానీ అంపైర్ ససేమీరా అనడంతో చేసేదేం లేక స్టబ్స్ అదే గ్లోవ్స్‌తో కంటిన్యూ అయ్యాడు. అయితే 19వ ఓవర్లో జేమీ ఓవర్టన్ వేసిన మూడో బంతిని భారీ షాట్ ఆడే యత్నంలో మిడాఫ్‌లో నూర్ అహ్మద్ చేతికి చిక్కాడు. దీంతో పెవిలియన్ చేరిన స్టబ్స్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాకా కోపంతో ఊగిపోతూ బ్యాట్‌ను, హెల్మెట్‌ను విసిరేయడంతో పాటు గ్లోవ్స్‌ను నేలకేసి కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
స్టబ్స్ ఔటైన తర్వాత డగౌట్‌లో ఉన్న ఢిల్లీ ఆటగాడు నితీశ్ రానా స్టబ్స్‌ను సమర్థించాడు. తడిగా ఉన్న గ్లోవ్స్‌తో ఆడడం వల్ల బ్యాటింగ్‌కు ఆటంకం కలుగుతుందని, స్టబ్స్‌కు గ్లోవ్స్ మార్చుకునేందుకు అవకాశమెందుకు ఇవ్వలేదంటూ థర్డ్ అంపైర్‌తో వాదనకు దిగాడు. కోచ్ హేమంగ్ బదాని కూడా అంపైర్‌తో ఇదే విషయమై వాదనకు దిగడం కనిపించింది.
మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. శాంసన్ సెంచరీ, శివమ్ దూబే అజేయ అర్థసెంచరీతో రాణించారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది.
Stubbs asked to change his gloves just before the wicket ball and Umpire didn't allow it, now DC management is furious and ofcourse CSK is involved in another spooky decision. pic.twitter.com/jkkImLB5Bq
— Avay Sha (@avay_69) April 11, 2026
🚨 DC Camp Angry on Umpire Decision 🚨
DC coach Hemang Badani and Nitish Rana were angry on umpire after Tristan Stubbs was not allowed to change his gloves during the over.
The decision upset the DC camp, and on the very next ball, Stubbs got out. pic.twitter.com/qGHdCe6tQL— Cricket Vaira (@ramgaming242) April 11, 2026
Stubs wanted to change his gloves, but the umpire did not allow it, and he got out on the very next ball.#CSKvsDC pic.twitter.com/BAHX9zhURM
— Vivek Gupta (@VIVEK1888) April 12, 2026


