వరుడు అనూహ్య మరణం, పెద్దల షాకింగ్‌ నిర్ణయం | Shock Bihar Groom passed away Wedding With His Younger Brother | Sakshi
Sakshi News home page

వరుడు అనూహ్య మరణం, పెద్దల షాకింగ్‌ నిర్ణయం

May 8 2026 11:54 AM | Updated on May 8 2026 11:58 AM

Shock Bihar Groom passed away Wedding With His Younger Brother

బీహార్‌లో అత్యంత దిగ్భ్రాంతికరమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. బంధుమిత్రులు, పెళ్లి వేడుకలతో కళకళలాడుతున్న ఉన్నట్టుండి విషాదంగా మారిపోయింది. పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోవడంతో అంతా నివ్వెర పోయారు. కానీ పుట్టెడు దుంఖాన్నిగుండెల్లో దాచుకుని ఆ శుభకారాన్ని జరిపించారు. అదేంటి.. అదెలా అను కుంటున్నారా? పూర్తి వివరాలు తెలియాంటే  ఈ కథనం చదవాల్సిందే.

ఒక వైపు ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కొడుకును కోల్పోయిన బాధ, మరోవైపు బాధ్యతగా జరిపించిన పెళ్లి.. ఈ సంఘటన చూస్తుంటే కాలం ఎంత క్రూరమైనదో కదా అనిపించకమానదు. దంపతులిద్దరూ సంతోషకరమైన వేడుకగా కలకలం గుర్తుంచు కోవాల్సిన మధురమైన క్షణాలు కాస్తా క్షణాల్లో జీవితకాల దుఃఖంగా మారిపోవడం విధి విచిత్రమే. మ్యారేజెస్‌ మేడిన్‌ హెవెన్‌ అంటే ఇదేనేమో!

నివేదికల ప్రకారం అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిపించే సందడిలో ఉన్నాయి ఇరు కుటుంబాలు. ఇరు కుటుంబాల బంధువులు, సన్నిహితులతో  పెళ్లి మండపం కళకళలాడుతోంది. మరోవైపు వరుడు తన బంధుమిత్రులు, మేళతాళాలతో కలిసి పెళ్లి వేదిక వైపు ఊరేగింపుగా బయలుదేరాడు. అందరూ ఎంతో ఉత్సాహంగా, సంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకుంటున్న సమయంలో, వరుడు ప్రయాణిస్తున్న వాహనం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాద తీవ్రతకు వరుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ వార్త తెలియగానే అందరూ నిశ్చష్టులైపోయారు. సంతోషంతో నిండిపోవాల్సిన ఇరు కుటుంబాల్లోనూ, గ్రామంలోనూ తీవ్ర విషాదం నెలకొంది. ఆటపాటలతో సందడిగా ఉన్న వాతావరణం అంతా హాహాకారాలతో నిండిపోయింది. ఇక్కడే బంధవులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 

ఇదీ చదవండి: ఎంపీ మహువాకు ఇండిగో విమానంలో చేదు అనుభవం

అనూహ్య నిర్ణయం
అయితే, ఈ ఘోర విషాదం జరిగిన తర్వాత ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సామాజిక ఆచారాలు, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో వరుడి కుటుంబ సభ్యులు గుండెలు దిటవు చేసుకుని  కీలక నిర్ణయం తీసుకున్నారు. చనిపోయిన వరుడి స్థానంలో, అతని తమ్ముడికి ఇచ్చి వధువుకు వివాహం చేయాలని నిర్ణయించారు. అనుకున్న ముహూర్తానికి పెళ్లి ఆగిపోకూడదనే ఉద్దేశంతో, పెళ్లి పీటల మీద తమ్ముడిని కూర్చోబెట్టి వివాహ క్రతువును పూర్తి చేశారు. విషాద ఛాయల మధ్యే ఆ వివాహం ముగిసింది.   కన్నీమరు మున్నీరుగా విలపిస్తూనే వధూవరులు ఈ తంతును ముగించారు.

స్థానికుల భిన్నాభిప్రాయాలు
ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సామాజిక ఒత్తిడి, ఆచారాల దృష్ట్యా ఆ కుటుంబం తీసుకున్నది చాలా కష్టమైన నిర్ణయమని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బలవంతంగా పెళ్లి చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు.
 

 

Advertisement
 
Advertisement
Advertisement