చెన్నై: తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ కొనసాగుతున్న వేళ అన్నాడీఎంకే ఎంపీ మరో బాంబు పేల్చారు. తమిళనాడు ప్రజలకు అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో, అసలు తమిళనాడులో ఏం జరుగుతోంది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అన్నాడీఎంకే రాజ్యసభ ఎంపీ తంబిదురై తమిళనాడు రాజకీయ పరిస్థితులపై తాజాగా స్పందించారు. ఎంపీ తంబిదురై మీడియాతో మాట్లాడుతూ.. తమిళ ప్రజలు అన్నాడీఎంకే సర్కార్‌ను కోరుకుంటున్నారు. అన్నాడీఎంకే తిరిగి అధికారంలోకి రావాలనే ప్రజాభిప్రాయం ఉంది. తప్పకుండా మేము అధికారంలోకి వస్తాం. దైవానుగ్రహంతో తగిన సమయంలో అది జరగవచ్చు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై తమిళనాడులో చర్చ మొదలైంది.
ఇక, తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో ఇప్పటికీ రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. గవర్నర్ ఆర్లేకర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. మెజారిటీ చూపిస్తూ ఏ పార్టీ తన వద్దకు వచ్చినా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తానని చెప్పడం ఆసక్తికరంగా మారింది. దీంతో, డీఎంకే, అన్నాడీఎంకేలు జత కడతాయా? అనే చర్చ తెరపైకి వచ్చింది. అదే సమయంలో అన్నాడీఎంకే ఎంపీ ఇలా కామెంట్స్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. డీఎంకే, అన్నాడీఎంకేలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా? అనే చర్చ నడుస్తోంది.
#WATCH | Chennai | AIADMK MP M Thambidurai says, "...The public sentiment is there that AIADMK has to come back to power...That may happen in the due course of time with the grace of God" pic.twitter.com/8JtjU5Jr5H
— ANI (@ANI) May 8, 2026
ఇదిలా ఉండగా.. తమిళనాడులో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల రిసార్ట్ రాజకీయం కొనసాగుతోంది. రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలు తిరిగి చెన్నై చేరుకోవాలని పార్టీ చీఫ్ పళనిస్వామి సూచించారు. మరోవైపు.. వివిధ పార్టీల మద్దతు తమకు ఇవ్వాలని టీవీకే నేతలు మంతనాలు జరుపుతున్నారు. లెఫ్ట్, వీఎంసీ పార్టీల మద్దతుపై ఈరోజు సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


