2023లో ప్రపంచవ్యాప్తంగా 59 లక్షల మంది కేవలం ఆహారపు అలవాట్లతో ముడిపడిన గుండె జబ్బుల వల్ల మరణించారట. 204 దేశాలకు సంబంధించి సమాచారం ఆధారంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ అధ్యయనం వివరాలు ది ఇన్నోవేషన్ న్యూట్రీషన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ మరణాల్లో అత్యధిక శాతం చైనా(13.6 లక్షలు), భారత్(11 లక్షలు)లో సంభవించాయి. తర్వాతి స్థానాల్లో రష్యా, అమెరికా, ఇండోనేసియా ఉన్నాయి. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, పళ్లు, తృణ ధాన్యాలు తక్కువ తీసుకోవడం వంటివాటిని వీటికి ప్రధాన కారణాలుగా పరిశోధకులు గుర్తించారు.

మనమేం చేయాలి
దేశపు ఆహారపు విధానాల్లో మార్పులు అత్యవసరం. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందింపజేయాలి. ముఖ్యంగా సోడియం(ఉప్పు) వినియోగాన్ని తగ్గించే విధానాలు తేవాలి. ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై పోషకాల వివరాలను తప్పనిసరిగా ముద్రించే విధంగా చర్యలు తీసుకోవాలి.
సాక్షి, నేషనల్ డెస్క్


