‘మా మామ గారికి అంకితం’ | Father in law ke liye: Priya Saroj reacts to Rinku Singh Heroics Vs LSG | Sakshi
Sakshi News home page

‘మా మామ గారికి అంకితం’

Apr 27 2026 2:20 PM | Updated on Apr 27 2026 2:38 PM

Father in law ke liye: Priya Saroj reacts to Rinku Singh Heroics Vs LSG

చాన్నాళ్ల తర్వాత ఐపీఎల్‌-2026లో కోల్‌కతా రైట్‌ రైడర్స్‌ స్టార్‌ రింకూ సింగ్‌ స్థాయికి తగ్గ ప్రదర్శన చేశాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఈ యూపీ ఆటగాడు అదరగొట్టాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 51 బంతులు ఎదుర్కొన్న రింకూ.. 83 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి.

కోల్‌కతా విజయంలో అంతా తానే..
రింకూ ప్రదర్శన కారణంగానే కోల్‌కతా 155 పరుగుల మార్కు అందుకోగలిగింది. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా కోల్‌కతా ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో నాలుగు సిక్స్‌లు.. ఫీల్డింగ్‌లో నాలుగు క్యాచ్‌లు, సూపర్‌ ఓవర్‌లో నాలుగు పరుగులు ఇలా... జట్టు విజయంలో రింకూనే కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

మా మామ గారికే అంకితం
ఇక ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు రింకూ సింగ్‌ కాబోయే భార్య, ఎంపీ ప్రియా సరోజ్‌ (Priya Saroj) లక్నోలోని ఏకనా స్టేడియానికి వచ్చారు. ఈ సందర్భంగా రింకూ ప్రదర్శన పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. 

‘‘నేను ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉన్నాను. రింకూ మా మామ గారి కోసం ఆడాడు. ఈరోజు ఆయనను మేము ఎంతగానో మిస్సవుతున్నాము. రింకూ ప్రదర్శన మా మామ గారికే అంకితం’’ అని ప్రియా సరోజ్‌ చెప్పుకొచ్చారు.

చిన్న పిల్లలా గంతులేశారు
కాగా రింకూ సిక్సర్లు బాదుతున్న వేళ ప్రియా సరోజ్‌ చిన్న పిల్లలా గంతులేశారు. నవ్వులు చిందిస్తూ కాబోయే భర్త విజయాన్ని సెలబ్రేట​ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

సుప్రీంకోర్టు న్యాయవాది అయిన ప్రియా సరోజ్‌.. ఉత్తరప్రదేశ్‌లోని మచ్లిచహర్‌ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున లోక్‌సభకు ఎంపికయ్యారు. రింకూతో పరిచయం ప్రేమగా మారగా.. గతేడాది పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవలే రింకూ తండ్రి మరణించిన విషయం విదితమే. 

చదవండి: వైభ‌వ్, శ్రేయ‌స్ కాదు.. ఎవ‌రికీ టీమిండియాలో చోటు లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement