breaking news
Priya Saroj
-
సీజేపీ ఆందోళనకు యువ ఎంపీ మద్దతు.. ఎవరీ ప్రియా సరోజ్?
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన ఆందోళనకు యువ ఎంపీ ప్రియా సరోజ్ మద్దతు తెలిపారు. మంగళవారం జంతర్ మంతర్‌కు వెళ్లి సంఘీభావం ప్రకటించారు. లోక్‌సభలో అతి వయస్కులైన ఎంపీల్లో ఒకరైన ఆమె సీజేపీ ఆందోళనకు మద్దతు తెలపడం ఆసక్తికరంగా మారింది. సమాజ్‌వాదీ పార్టీ తరపున మచ్లిశహర్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. టీమిండియా క్రికెటర్ రింకు సింగ్‌తో గేతడాది జూన్‌లో నిశ్చితార్థం జరగడంతో ప్రియా సరోజ్ పేరు దేశమంతా తెలిసింది.ఎవరీ ప్రియా సరోజ్?ప్రియా సరోజ్.. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో 1998లో జన్మించారు. న్యూఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇన్స్టిట్యూట్లో విద్యాభ్యాసం చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందారు. అమిటి యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. రాజకీయాలపై ఆసక్తి కలిగి ఉన్న ప్రియా సరోజ్ 2024 సాధారణ ఎన్నికల్లో మచ్లిశహర్ లోక్‌సభ నియోజక వర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆమె తండ్రి తూఫానీ సరోజ్ కూడా మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం కేరాకట్ శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు.8.5 కిలోల బరువు తగ్గిన వాంగ్చుక్దేశంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని, పరీక్ష వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన నిరసన మంగళవారం 25వ రోజుకు చేరుకుంది. సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 17వ రోజుకు చేరింది. ఆయన 8.5 కేజీల బరువు తగ్గారు. వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించిందని వైద్యులు తెలిపారు.రాజకీయ, సినీ ప్రముఖుల మద్దతు కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన నిరసనకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు మద్దతు తెలిపారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సిన్హ్ వాఘేలా, నటి స్వరభాస్కర్ మంగళవారం జంతర్ మంతర్ చేరుకుని సోనమ్ వాంగ్చుక్కు సంఘీభావం ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. బీకేయూ చారుణి ప్రెసిడెంట్ గుర్నామ్ సింగ్ చారునీ తదితరులు కూడా సీజేపీ ధర్నాలో పాల్గొన్నారు.చలో పార్లమెంట్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండిఈనెల 20న తలపెట్టిన చలో పార్లమెంట్ కార్యక్రమానికి ప్రజలంతా తరలిరావాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) పిలుపునిచ్చింది. కార్యక్రమానికి హాజరయ్యే వారు 70116 70115 నంబరు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరింది. CHALO SANSAD!!Give a missed call and mark your attendance for 20th July70116 70115 pic.twitter.com/c3AQHAd2ut— Cockroach is Back (@Cockroachisback) July 14, 2026 -
‘మా మామ గారికి అంకితం’
చాన్నాళ్ల తర్వాత ఐపీఎల్-2026లో కోల్‌కతా రైట్ రైడర్స్ స్టార్ రింకూ సింగ్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఈ యూపీ ఆటగాడు అదరగొట్టాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 51 బంతులు ఎదుర్కొన్న రింకూ.. 83 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి.కోల్‌కతా విజయంలో అంతా తానే..రింకూ ప్రదర్శన కారణంగానే కోల్‌కతా 155 పరుగుల మార్కు అందుకోగలిగింది. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా కోల్‌కతా ఇన్నింగ్స్ చివరి ఓవర్లో నాలుగు సిక్స్‌లు.. ఫీల్డింగ్‌లో నాలుగు క్యాచ్‌లు, సూపర్ ఓవర్లో నాలుగు పరుగులు ఇలా... జట్టు విజయంలో రింకూనే కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.మా మామ గారికే అంకితంఇక ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు రింకూ సింగ్ కాబోయే భార్య, ఎంపీ ప్రియా సరోజ్ (Priya Saroj) లక్నోలోని ఏకనా స్టేడియానికి వచ్చారు. ఈ సందర్భంగా రింకూ ప్రదర్శన పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ‘‘నేను ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉన్నాను. రింకూ మా మామ గారి కోసం ఆడాడు. ఈరోజు ఆయనను మేము ఎంతగానో మిస్సవుతున్నాము. రింకూ ప్రదర్శన మా మామ గారికే అంకితం’’ అని ప్రియా సరోజ్ చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Kolkata Knight Riders (@kkriders)చిన్న పిల్లలా గంతులేశారుకాగా రింకూ సిక్సర్లు బాదుతున్న వేళ ప్రియా సరోజ్ చిన్న పిల్లలా గంతులేశారు. నవ్వులు చిందిస్తూ కాబోయే భర్త విజయాన్ని సెలబ్రేట చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సుప్రీంకోర్టు న్యాయవాది అయిన ప్రియా సరోజ్.. ఉత్తరప్రదేశ్‌లోని మచ్లిచహర్ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున లోక్‌సభకు ఎంపికయ్యారు. రింకూతో పరిచయం ప్రేమగా మారగా.. గతేడాది పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవలే రింకూ తండ్రి మరణించిన విషయం విదితమే. చదవండి: వైభవ్, శ్రేయస్ కాదు.. ఎవరికీ టీమిండియాలో చోటు లేదు View this post on Instagram A post shared by Kolkata Knight Riders (@kkriders)


