ముంబై: నగరంలో ఓ మహిళ.. ఏకంగా మంత్రిని నడిరోడ్డుపై నిలదీసిన ఘటన సంచలనం రేపింది. వర్లీ ప్రాంతంలో రాజకీయ ర్యాలీ కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ఆ మహిళా.. మహారాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి గిరీష్ మహాజన్, స్థానిక పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమి ఓ నిరసన ప్రదర్శన చేపట్టింది. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్, ఇతర విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ర్యాలీ చేపట్టారు.
సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని నినాదాలు చేశారు. వర్లీలోని జంబోరి మైదాన్ నుండి డోమ్ వరకు ఈ ర్యాలీ సాగింది. ర్యాలీ ఆలస్యం కావడంతో ఆ ప్రాంతమంతా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. తన బిడ్డను స్కూలు నుండి తీసుకురావడానికి కారులో వెళ్తున్న ఒక స్థానిక మహిళ.. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. తీవ్ర అసహనానికి గురైన ఆ మహిళ.. తన వాహనం దిగి నేరుగా ర్యాలీ మధ్యలోకి వెళ్లి మంత్రి మహాజన్‌తో వాగ్వాదానికి దిగారు. రాజకీయ ర్యాలీల వల్ల ప్రజలకు కలిగే అసౌకర్యంపై ఆమె ఘాటుగా ప్రశ్నించారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి!" అంటూ ప్రదర్శనకారులపై అరుస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Mumbai woman, who taught Maharashtra minister Girish Mahajan a lesson in civics sense, also lashed out at a cop who tried to shut her down. In reply, a chilling "Shut up" reverberated. https://t.co/fHwlntCQoJ pic.twitter.com/Dr4ZXX8YJl
— Piyush Rai (@Benarasiyaa) April 22, 2026
సమీపంలో ఖాళీ స్థలం ఉంది. ఇక్కడ వందలాది మంది వేచి చూస్తున్నారు. అక్కడ ఖాళీ మైదానం ఉంది కదా! అంటూ మంత్రిపై ఆ మహిళ తీవ్రస్థాయిలో మండిపడింది. ఆమె ముంబై పోలీసులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు.. ఆమె ఒక పోలీసు అధికారిపై విరుచుకుపడ్డారు. సీనియర్ అధికారులతో మాట్లాడాలని పట్టుబట్టారు. ఈ వాగ్వాదం తర్వాత, పోలీసులు ఆమెను రోడ్డు పక్కకు తీసుకెళ్లి ఆమె సమస్యను వినే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


