బోట్‌ ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు : సంచలన వీడియో | Tragedic Video Before The Cruise Boat Overturned At Jabalpur | Sakshi
Sakshi News home page

బోట్‌ ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు : సంచలన వీడియో

May 1 2026 4:30 PM | Updated on May 1 2026 4:51 PM

Tragedic Video Before The Cruise Boat Overturned At Jabalpur

మధ్యప్రదేశ్ పర్యాటక శాఖకు చెందిన ఒక క్రూయిజ్ బోట్‌  జబల్‌పూర్ సమీపంలోని నర్మదా నదిపై ఉన్న బార్గి డ్యామ్ (Bargi Dam బోల్తా పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఈ ఘటనకు కొన్ని  క్షణాల ముందుసంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.  

రాజేష్‌ సాహూ అనే  ఎక్స్‌ యూజర్‌ ఈ వీడియోను షేర్‌ చేశారు. ‘‘జబల్‌పూర్‌లో క్రూయిజ్ బోల్తా పడటానికి ముందు తీసిన వీడియో ఇది. వాతావరణం అకస్మాత్తుగా మారి, బలమైన గాలులు వీచడం ప్రారంభించాయి. ఆ సమయంలో ప్రజలు ఈ క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఎవరూ లైఫ్ సపోర్ట్ జాకెట్ ధరించలేదు. అయితే, తరువాత ప్రజలు వాటిని ధరించారు. దీనివల్ల సుమారు 25 మంది ప్రాణాలతో బయటపడ్డారు.

 పడవ బోల్తా పడటానికి ముందు చివరి క్షణాలను చూపిస్తున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో వెలుగులోకి వచ్చింది. బలమైన గాలులను ఎదుర్కొంటూ, కల్లోలభరితమైన నీరు దానిని తీవ్రంగా కుదిపేస్తుండగా, ఆ పడవ తీవ్ర ఒత్తిడికి గురవుతున్న దృశ్యాలు ఆ ఫుటేజీలో ఉన్నాయి. క్షణాల్లోనే అది అదుపు తప్పి బోల్తా పడటంతో, ప్రయాణికులు నీటిలో పడిపోయిన దృశ్యాలు కలకలంరేపాయి. 

 మరోవైపు సకాలంలో హెచ్చరికలను పాటించి, ప్రాథమిక భద్రతా చర్యలు తీసుకుని ఉంటే ఈ దుర్ఘటనజరిగి ఉండేది కాదన్న విమర్శలు వెల్లువెత్తాయి.ఈ ప్రమాదం కేవలం ప్రకృతి వైపరీత్యం వల్లనే కాకుండా, మానవ తప్పిదాల వల్ల కూడా జరిగిందని ప్రాణాలతో బయటపడిన వారు ఆరోపిస్తున్నారు. ఈ  ప్రమాదంలో ఇప్పటివరకు 9 మృతదేహాలను వెలికితీశారు.  మిగిలిన వారి ఆచూకి కోసం గాలింపు కొనసాగుతోంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement