అమ్మాయి చేసిన‌ పనికి అభిషేక్ శ‌ర్మ షాక్‌! | Lady Fan Grabs Hands Of SRH Batter Abhishek Sharma Video Viral | Sakshi
Sakshi News home page

అమ్మాయి చేసిన‌ పనికి అభిషేక్ శ‌ర్మ షాక్‌!

Apr 27 2026 8:03 PM | Updated on Apr 27 2026 9:24 PM

Lady Fan Grabs Hands Of SRH Batter Abhishek Sharma Video Viral

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) ఓపెన‌ర్‌ అభిషేక్ శ‌ర్మ విధ్వంసం కొన‌సాగుతుంది. 8 మ్యాచ్‌ల్లో 380 ప‌రుగుల‌తో ఆరెంజ్ క్యాప్ రేసులో తొలి స్థానంలో ఉన్న అభిషేక్ సెంచ‌రీతో పాటు మూడు అర్థ‌శ‌త‌కాలు సాధించాడు. 

ఇక శ‌నివారం రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో మ్యాచ్ అనంత‌రం ఎస్ఆర్‌హెచ్ ఆట‌గాళ్లు హోట‌ల్ రూంకు చేరుకునే స‌మ‌యంలో అభిషేక్ శ‌ర్మ‌కు ఊహించ‌ని ప‌రిణామం ఎదుర‌య్యింది. అభిషేక్ శర్మను చూసి ఉత్సాహానికి లోనైన ఒక అమ్మాయి చేయి పట్టుకుని లాగింది.  ఈ అనూహ్య ఘటనతో అభిషేక్ ఒక్క‌సారిగా షాకయ్యాడు. కాస్త ఇబ్బందిగానే అభిషేక్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 

భద్రతా సిబ్బంది అక్కడే ఉన్నప్పటికీ ఈ ఘటన చోటు చేసుకోవడంతో సెక్యూరిటీ లోపాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శనలు చేస్తోంది. వరుస నాలుగు విజయాలు సాధించి సూపర్ ఫామ్‌లో ఉంది. ఆడిన ఎనిమిది మ్యాచుల్లో ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.

 చదవండి: ఏమిటీ ‘అబ్‌స్ట్రక్టింగ్‌ ది ఫీల్డ్‌’.. ఎంతమంది ఔటయ్యారంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement