జస్ట్‌, పెళ్లికి ముందు : వరుడి వింత ప్రశ్న, అతిథులు అవాక్కు | Just Before the Wedding the Groom Said Something to the Bride That Left Everyone Stunned | Sakshi
Sakshi News home page

జస్ట్‌, పెళ్లికి ముందు : వరుడి వింత ప్రశ్న, అతిథులు అవాక్కు

Apr 29 2026 2:42 PM | Updated on Apr 29 2026 2:52 PM

Just Before the Wedding the Groom Said Something to the Bride That Left Everyone Stunned

ఇరాన్‌ వార్‌ ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. ముఖ్యంగా ఇండియాలో వంటగ్యాస్‌ సరఫరాపై ఆందోళన తీవ్రంగానే ఉంది. దీనికి  ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఒక సంఘటన నిదర్శనం. దీనికి సంబంధించిన వీడియో  నెట్టింట వైరల్‌గా మారింది. సాధారణంగా పెళ్లిళ్లలో కట్నకానుకలు, విందులో లేదా ఇతర డిమాండ్ల గురించి వింటుంటాం, కానీ ఇక్కడ ఒక వింత సంఘటన జరిగింది.

రాష్ట్రంలోని బారాబంకి జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఒక్క పక్క పెళ్లి తతంగం జరుగుతుండగానే గ్యాస్ ధరలు పెరగడం లేదాకొరత ఏర్పడటం వంటి పరిస్థితులువస్తే, ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పెళ్లి కొడుకు అశోక్‌కు వచ్చిన సందేహం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. వరుడు అందరి ముందూ వధువుని పట్టుకుని ఒక ఊహించని ప్రశ్న వేశాడు.

అసలు ఏం జరిగింది?
అందరూ పెళ్లి సంబరాల్లో మునిగితేలుతుండగా,  అకస్మాత్తుగా "ఒకవేళ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లేకపోతే, నువ్వు కట్టెల పొయ్యి మీద వంట చేయగలవా?" అని అడిగాడు పెళ్లి కూతుర్ని కాబోయే భర్త. ఈ ప్రశ్న వినగానే అక్కడ ఉన్న బంధువులు, అతిథులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. పెళ్లి సమయంలో ఇలాంటి ప్రశ్న ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు.దీనికి వధువు సమాధానం విని అందరూ సంతోషంగా తెగ నవ్వు కున్నారు.

వధువు సమాధానం
వధువు ఏమాత్రం తడబడకుండా చాలా ధైర్యంగా సమాధానం చెప్పింది. తనకు కట్టెల పొయ్యి మీద వంట చేయడం వచ్చని, అలా వండటానికి తనకేమీ ఇబ్బంది లేదని స్పష్టం చేసింది. వధువు ఇచ్చిన ఈ సమాధానంతో వరుడు సంతోషించి, పెళ్లి తంతును ముందుకు సాగించాడు. వైరల్ అవుతున్న వీడియోలో పెళ్లి ముగిసిన తర్వాత వధూవరులిద్దరూ కారులో కూర్చుని ఉండగా, ఒక వ్యక్తి కెమెరాతో వారి వద్దకు వెళ్తాడు. ముందు ముందు ఇబ్బంది రాకూడదనే ఈ ప్రశ్న అడిగానని వరుడు వివరణ ఇచ్చాడు. దీంతో  వధువు ముసిముసిగా నవ్వుకుంది.

నెటిజన్ల స్పందన
ఈ వీడియోపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు ఇది చాలా ప్రాక్టికల్ ఆలోచన అని మెచ్చుకుంటున్నారు. ఈ కాలంలో పెళ్లి కూతురు దొరకడమే కష్టమంటే, ఇప్పుడు 'పొయ్యి టెస్ట్' కూడా మొదలుపెట్టారా?" అంటూ మరికొందరు సరదాగా కామెంట్స్  చేశారు. మొత్తానికి, ఈ "కట్టెల పొయ్యి" ప్రశ్నదేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చదవండి: చిన్నారుల కాళ్లు, చేతులు, కట్టేసి : డేకేర్‌ సెంటర్‌లో అమానుషం

Advertisement
 
Advertisement
Advertisement