ఇండోనేషియాలోని ఒక డేకేర్ సెంటర్‌లో చిన్న పిల్లలపై జరిగిన దారుణమైన వేధింపుల ఘటన దిగ్భ్రాంతి రేపింది. ఎంతో నమ్మకంతో, పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించి డేకేర్ సెంటర్‌లో చేర్పిస్తే, అక్కడి సిబ్బంది వారిని తీవ్రంగా హింసించిన ఉదంతం కలకలం రేపింది. పసిపిల్లల కాళ్లు, చేతులు కట్టేసి మరి అమానుషంగా వేధిస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్త మవుతున్నాయి. ఈ కేసులో పోలీసులు 13 మందిని అరెస్టు చేశారు.
జావా ద్వీపంలోని యోగ్యకార్తాలో ఉన్న 'లిటిల్ అరేషా' (Little Aresha) అనే డేకేర్ సెంటర్‌లో రెండేళ్లలోపు వయసున్న పిల్లలు కేవలం డయాపర్లతో నేలపై పడుకుని ఉన్నారు. వారి కాళ్లు, చేతులను పాత గుడ్డలతో కట్టేసి ఉంచారు. అక్కడ పనిచేసిన ఒక మాజీ ఉద్యోగి ఫిర్యాదు చేయడంతో, ఈ దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన సీసీటీవీ ఫుటేజీలో.. ఈ వీడియో నిజమైనదేనని పోలీసులు ధృవీకరించారు. గత శుక్రవారం (ఏప్రిల్ 24, 2026) పోలీసులు ఆ కేంద్రంపై దాడి చేశారు.
This horrific daycare abuse in Yogyakarta, Indonesia is a nightmare.
53 babies tied up, drugged, and neglected by strangers. 13 suspects arrested.
This proves why women belong at home raising their own children. No daycare can replace a mother’s care. https://t.co/RXyicwynw5— MUSAFIR. (@Peoplepower08) April 28, 2026
Bayangin, udah percaya dan bayar daycare, tapi anakmu malah diperlakukan kayak gini
Kalau gk suka anak kecil, PLEASE jangan jadi pengasih anak
Orang tua juga harus extra hati-hati milih daycare 😭
Rekaman CCTV dari salah satu daycare di Banda Aceh
🎥 ayakasakura_ pic.twitter.com/ihdD94DDBA— Si Paling Gen Z (@txtdarigenz97) April 28, 2026
విచారణలో తేలిన భయంకర నిజాలు:
కేవలం 3 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పు ఉన్న ఒక గదిలో 20 మంది పిల్లలను కుక్కేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సెంటర్‌లో సుమారు 100 మంది పిల్లలు ఉండగా, అందులో సగానికి పైగా (50 మందికి పైగా) పిల్లలు వేధింపులకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పిల్లలు ఒకరినొకరు ఇబ్బంది పెట్టకుండా ఉండటానికే కాళ్లు, చేతులు కట్టేశామని నిందితులు పోలీసులకు చెప్పారు. సిబ్బంది కొరత కారణంగా పిల్లలకు స్నానం చేయించడం, బట్టలు వేయడం కష్టమై ఇలా చేశామని వారు కుంటి సాకులు చెప్పారు.
అరెస్టులు - చర్యలు:
ఇప్పటివరకు, ఈ కేసులో 13 మందిని అనుమానితులుగా గుర్తించి అరెస్టు చేశాం," అని నగర పోలీస్ చీఫ్ ఈవా గుణ పాండియా సోమవారం యోగ్యకార్తాలో విలేకరులతో అన్నారు. అరెస్టయిన వారిలో 11 మంది చైల్డ్ కేర్ వర్కర్లు, డేకేర్ సెంటర్ హెడ్‌మాస్టర్ మరియు ఆ సంస్థను నడిపే ఫౌండేషన్ హెడ్ ఉన్నారు.
ఇదీ చదవండి: వాటర్ మిలన్ క్యాపిటల్ ఏది ? ఈ షాకింగ్ విషయాలు తెలుసా?
తల్లిదండ్రుల ఆవేదన:
గత శుక్రవారం తన 2 ఏళ్ల కొడుకును తీసుకెళ్లమని తోటి తల్లిదండ్రుల నుండి ఫోన్ కాల్ వచ్చినప్పుడు తాను దిగ్భ్రాంతికి గురయ్యానని తండ్రి, 42 ఏళ్ల నూర్మాన్ విండార్టో చెప్పారు. తన బిడ్డ కాళ్లు, చేతులు కట్టేసి వేధించబడ్డారని తెలిసి షాక్‌కు గురైనట్లు బాధను వ్యక్తం చేశారు. నా గుండె ముక్కలైపోయిందని వాపోయారు. తన బిడ్డ పదేపదే న్యుమోనియాతో ఆసుపత్రిలో చేరాడు. బట్టలు లేకుండా చల్లటి నేలపై పడుకోబెట్టడం వల్లే అలా జరిగి ఉండవచ్చని కూడా అనుమానిస్తున్నారు.ఈ ఘటనపై ప్రస్తుతం తదుపరి విచారణ కొనసాగుతోంది. దాదాపు అక్కడ పిల్లల్ని చేర్చిన వారందరిదీ ఇదే ఆవేదన. తమ పిల్లలపై జరిగిన ఈ పైశాచికంపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిందితులకు కఠినమైన మరణశిక్ష విధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఇండోనేషియా బాలల సంరక్షణ చట్టం ప్రకారం, నిందితులకు ఐదేళ్ల వరకు జైలు శిక్ష మరియు 100 మిలియన్ల రూపియాల జరిమానా విధించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: భారీ అగ్ని ప్రమాదం: పైనుంచి దూకేసిన 50మంది యువతులు


