breaking news
daycare centre
-
వాషింగ్ మెషీన్ డ్రమ్‌లో కూర్చోబెట్టి..
బెంగళూరు: డేకేర్ సెంటర్ పిల్లల పాలిట నరకమైంది. బెంగళూరులో కార్పొరేట్ సంస్థలోని డేకేర్ సంరక్షణలో ఉన్న పిల్లలను అక్కడ పనిచేస్తున్న సిబ్బంది దారుణంగా శిక్షించారు. ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగ సమయంలో పిల్లల్ని ఈ డేకేర్ సెంటర్లో వదిలి వెళ్తున్నారు. అక్కడ పని చేసే ఐదుగురు సిబ్బంది పిల్లల అల్లరిని మాన్పించడానికి పైశాచిక పద్ధతులు అనుసరించారు. చిన్న పిల్లలనే మానవత్వం లేకుండా కర్కశంగా శిక్షించారు.పిల్లలు ఏడ్చినప్పుడు ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్లో ఉంచి తలుపు మూసేసి భయపెట్టారు. వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్‌పై కూర్చోబెట్టి, హై ప్రెజర్ జెట్‌తో నోట్లో నీళ్లు కొట్టడం, చీకటి బాత్రూమ్లో బంధించడం వంటివి చేశారు. ఫ్రెంచ్ బహుళజాతి సంస్థ క్యాప్‌జెమిని బెంగళూరు క్యాంపస్‌లో నడుస్తున్న డేకేర్ నుంచి బయటికొచ్చి వీడియోలు పిల్లల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి.వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఐదుగురు మహిళలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదుదారులు, డేకేర్ సిబ్బంది, ఇతర సాక్షుల నుంచి వాంగ్మూలాలను సేకరిస్తున్నారు. పోలీసులు ఫుటేజీని ధృవీకరించి, సంఘటనల క్రమాన్ని పరిశీలిస్తున్నారు. ఆ డేకేర్ సెంటర్లో ఇలాంటి వేధింపులు చాలాకాలంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. -
దారుణాలు బయటపెడితే.. ఉద్యోగం నుంచి తీసేశారు!
బెంగళూరు: క్యాప్‌జెమినీ బెంగళూరు క్యాంపస్‌లోని డేకేర్ సెంటర్లో చిన్నారులపై జరుగుతున్న అమానుష వేధింపులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే ఈ ఘటనలో ఇప్పుడు మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. చిన్నారులపై జరుగుతున్న హింసను గతంలోనే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన ఉద్యోగినినే ఉద్యోగం నుంచి తొలగించినట్లు తేలింది. జిల్లా బాలల సంరక్షణ అధికారి తిలకేశ్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. డేకేర్ సెంటర్లో మొత్తం 50 నుంచి 60 మంది చిన్నారులు నమోదు కాగా, ప్రతిరోజూ 15 నుంచి 20 మంది హాజరవుతున్నారు. పిల్లలు ఏడుస్తున్నారనే కారణంతో వారిని వాషింగ్ మెషీన్లో కూర్చోబెట్టడం, బాత్రూమ్లో బంధించడం, టాయిలెట్ జెట్ స్ప్రేతో నీరు చల్లడం, భయపెట్టి మౌనం పాటించేలా చేయడం వంటి దారుణాలు చాలా కాలంగా జరుగుతున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. అంతేకాదు.. గతంలో ఓ ఉద్యోగి ఈ దారుణాలపై ప్రశ్నించిందని చెప్పారు. ఈ విషయమై కేర్టేకర్ల మీద సూపర్వైజర్కు ఫిర్యాదు చేసి.. ఎంత జరుగుతుందో తెలియజేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, పైగా ఫిర్యాదు చేసిన ఆ ఉద్యోగినినే విధుల్లోంచి తొలగించారని అధికారులు తెలిపారు.🚨 Bengaluru Daycare Horror: Five women booked after toddlers were allegedly forced into a washing machine and abused at a daycare. The accused have been taken in for questioning. Investigation is underway.#Bengaluru pic.twitter.com/wQrCdaNl4i— Smriti Sharmaa (@SmritiSharma_) July 1, 2026ఇటీవల ఈ దారుణాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బయటకు రావడంతో వ్యవహారం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. చైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు రంగంలోకి దిగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఐదుగురు కేర్‌టేకర్లపై కేసు నమోదు చేసి, వీడియోలను కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు పంపించారు.ఈ ఘటనపై స్పందించిన క్యాప్‌జెమినీ సంస్థ.. ఉద్యోగులు, వారి కుటుంబాల భద్రతకే అత్యంత ప్రాధాన్యం ఇస్తామని పేర్కొంది. దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నామని, విచారణ పూర్తయ్యే వరకు బెంగళూరు క్యాంపస్‌లోని డేకేర్ కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.ఇప్పటికే ఐదుగురు మహిళా కేర్‌టేకర్లపై బాలల సంరక్షణ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇలాంటి ఘటనలు గతంలో మరెన్ని జరిగాయనే అంశాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఓ మహిళా అధికారిణికి దర్యాప్తు బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో.. ఇలాంటి కేర్ సెంటర్లలో పిల్లల భద్రతకు సంబంధించిన ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. -
బెంగళూరు ఐటీ కారిడార్‌లో ఘోరం
ఐటీ ఉద్యోగుల పిల్లల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన డేకేర్ సెంటర్లో అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఐటీ రాజధాని బెంగళూరులో కలకలం రేపింది. ప్రముఖ ఐటీ దిగ్గజం క్యాప్‌జెమిని బెంగళూరు క్యాంపస్‌లోని డేకేర్ సెంటర్లో రెండు నుంచి మూడేళ్ల వయసున్న పసిబిడ్డలను తీవ్రంగా వేధించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో లీక్ కావడంతో ఐటీ వర్గాలతో పాటు ప్రజల్లో చర్చకు దారితీసింది.బాత్రూమ్లో బంధించి..జిల్లా పిల్లల సంరక్షణ యూనిట్ (డీసీపీయూ) అధికారి తిలకేష్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లోని అంశాలు కీలక విషయాలు వెల్లడించాయి. అందులోని వివరాల ప్రకారం.. పిల్లలు ఏడుస్తున్న సమయంలో సంరక్షకులు వారిని ఓదార్చాల్సింది పోయి శారీరకంగా బెదిరింపులకు గురిచేశారు. తల్లి పాలు కూడా మరువని పసిబిడ్డల నోటిలో బలవంతంగా నీరు పోశారు. వెస్ట్రన్ టాయిలెట్ కమోడ్లపై పిల్లలను బలవంతంగా కూర్చోబెట్టి బాత్రూమ్ లోపల వేసి తాళాలు పెట్టారు. వాట్సాప్‌లో హల్చల్ చేసిన వీడియోల ప్రకారం.. పిల్లలను భయపెట్టడానికి ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్ లోపల కూడా ఉంచినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.ఐదుగురు మహిళా కేర్‌టేకర్లపై కేసు నమోదుఈ అమానుష ఘటనపై జూన్ 29న బెంగళూరులోని హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా కేసు నమోదైంది. జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ) చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మహిళా సంరక్షకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.స్పందించిన క్యాప్జెమినిఈ ఉదంతంపై తీవ్ర దుమారం రేగడంతో క్యాప్‌జెమిని యాజమాన్యం తక్షణమే స్పందించింది. జులై 1న కంపెనీ అధికారిక ప్రకటన విడుదల చేస్తూ బ్రూక్‌ఫీల్డ్ పరిధిలోని హెచ్ఏఎల్ క్యాంపస్‌లో ఉన్న ఆన్-క్యాంపస్ డేకేర్ సదుపాయాన్ని తాత్కాలికంగా వెంటనే మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ‘క్యాప్‌జెమిని సంస్థకు తన ఉద్యోగులు, వారి కుటుంబాల ఆరోగ్యం, భద్రత, శ్రేయస్సే అత్యంత ప్రధానం. ఈ ఘటనకు సంబంధించి వాస్తవాలను నిర్ధారించేందుకు దర్యాప్తు జరుపుతున్న అధికారులకు మేము పూర్తిస్థాయిలో సహకరిస్తున్నాం. ముందు జాగ్రత్త చర్యగా బెంగళూరు ఆన్-క్యాంపస్ డేకేర్ సదుపాయాన్ని తక్షణమే తాత్కాలికంగా మూసివేస్తున్నాం’ అని కంపెనీ అధికారిక ప్రతినిధి చెప్పారు.ఇదీ చదవండి: బంగారం ధరలు కూల్ఆఫ్! -
చిన్నారుల కాళ్లు, చేతులు, కట్టేసి : డేకేర్ సెంటర్లో అమానుషం
ఇండోనేషియాలోని ఒక డేకేర్ సెంటర్లో చిన్న పిల్లలపై జరిగిన దారుణమైన వేధింపుల ఘటన దిగ్భ్రాంతి రేపింది. ఎంతో నమ్మకంతో, పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించి డేకేర్ సెంటర్లో చేర్పిస్తే, అక్కడి సిబ్బంది వారిని తీవ్రంగా హింసించిన ఉదంతం కలకలం రేపింది. పసిపిల్లల కాళ్లు, చేతులు కట్టేసి మరి అమానుషంగా వేధిస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్త మవుతున్నాయి. ఈ కేసులో పోలీసులు 13 మందిని అరెస్టు చేశారు.జావా ద్వీపంలోని యోగ్యకార్తాలో ఉన్న 'లిటిల్ అరేషా' (Little Aresha) అనే డేకేర్ సెంటర్లో రెండేళ్లలోపు వయసున్న పిల్లలు కేవలం డయాపర్లతో నేలపై పడుకుని ఉన్నారు. వారి కాళ్లు, చేతులను పాత గుడ్డలతో కట్టేసి ఉంచారు. అక్కడ పనిచేసిన ఒక మాజీ ఉద్యోగి ఫిర్యాదు చేయడంతో, ఈ దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన సీసీటీవీ ఫుటేజీలో.. ఈ వీడియో నిజమైనదేనని పోలీసులు ధృవీకరించారు. గత శుక్రవారం (ఏప్రిల్ 24, 2026) పోలీసులు ఆ కేంద్రంపై దాడి చేశారు.This horrific daycare abuse in Yogyakarta, Indonesia is a nightmare.53 babies tied up, drugged, and neglected by strangers. 13 suspects arrested.This proves why women belong at home raising their own children. No daycare can replace a mother’s care. https://t.co/RXyicwynw5— MUSAFIR. (@Peoplepower08) April 28, 2026 Bayangin, udah percaya dan bayar daycare, tapi anakmu malah diperlakukan kayak giniKalau gk suka anak kecil, PLEASE jangan jadi pengasih anakOrang tua juga harus extra hati-hati milih daycare 😭Rekaman CCTV dari salah satu daycare di Banda Aceh🎥 ayakasakura_ pic.twitter.com/ihdD94DDBA— Si Paling Gen Z (@txtdarigenz97) April 28, 2026విచారణలో తేలిన భయంకర నిజాలు:కేవలం 3 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పు ఉన్న ఒక గదిలో 20 మంది పిల్లలను కుక్కేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సెంటర్లో సుమారు 100 మంది పిల్లలు ఉండగా, అందులో సగానికి పైగా (50 మందికి పైగా) పిల్లలు వేధింపులకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పిల్లలు ఒకరినొకరు ఇబ్బంది పెట్టకుండా ఉండటానికే కాళ్లు, చేతులు కట్టేశామని నిందితులు పోలీసులకు చెప్పారు. సిబ్బంది కొరత కారణంగా పిల్లలకు స్నానం చేయించడం, బట్టలు వేయడం కష్టమై ఇలా చేశామని వారు కుంటి సాకులు చెప్పారు.అరెస్టులు - చర్యలు:ఇప్పటివరకు, ఈ కేసులో 13 మందిని అనుమానితులుగా గుర్తించి అరెస్టు చేశాం," అని నగర పోలీస్ చీఫ్ ఈవా గుణ పాండియా సోమవారం యోగ్యకార్తాలో విలేకరులతో అన్నారు. అరెస్టయిన వారిలో 11 మంది చైల్డ్ కేర్ వర్కర్లు, డేకేర్ సెంటర్ హెడ్మాస్టర్ మరియు ఆ సంస్థను నడిపే ఫౌండేషన్ హెడ్ ఉన్నారు. ఇదీ చదవండి: వాటర్ మిలన్ క్యాపిటల్ ఏది ? ఈ షాకింగ్ విషయాలు తెలుసా?తల్లిదండ్రుల ఆవేదన:గత శుక్రవారం తన 2 ఏళ్ల కొడుకును తీసుకెళ్లమని తోటి తల్లిదండ్రుల నుండి ఫోన్ కాల్ వచ్చినప్పుడు తాను దిగ్భ్రాంతికి గురయ్యానని తండ్రి, 42 ఏళ్ల నూర్మాన్ విండార్టో చెప్పారు. తన బిడ్డ కాళ్లు, చేతులు కట్టేసి వేధించబడ్డారని తెలిసి షాక్‌కు గురైనట్లు బాధను వ్యక్తం చేశారు. నా గుండె ముక్కలైపోయిందని వాపోయారు. తన బిడ్డ పదేపదే న్యుమోనియాతో ఆసుపత్రిలో చేరాడు. బట్టలు లేకుండా చల్లటి నేలపై పడుకోబెట్టడం వల్లే అలా జరిగి ఉండవచ్చని కూడా అనుమానిస్తున్నారు.ఈ ఘటనపై ప్రస్తుతం తదుపరి విచారణ కొనసాగుతోంది. దాదాపు అక్కడ పిల్లల్ని చేర్చిన వారందరిదీ ఇదే ఆవేదన. తమ పిల్లలపై జరిగిన ఈ పైశాచికంపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిందితులకు కఠినమైన మరణశిక్ష విధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఇండోనేషియా బాలల సంరక్షణ చట్టం ప్రకారం, నిందితులకు ఐదేళ్ల వరకు జైలు శిక్ష మరియు 100 మిలియన్ల రూపియాల జరిమానా విధించే అవకాశం ఉంది. ఇదీ చదవండి: భారీ అగ్ని ప్రమాదం: పైనుంచి దూకేసిన 50మంది యువతులు -
ఆఫీస్‌లో కొత్త వర్క్ పాలసీ.. ఉద్యోగులు పాటించాల్సిందే! లేదంటే
‘త్వరలో ఆఫీసులో కొత్త వర్క్ పాలసీని అమలు చేస్తున్నాం. ఉద్యోగులు తప్పక పాటించాల్సిందే. లేదంటే వారిపై కఠిన చర్యలు తప్పవు! అంటూ పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ కంపెనీ బాస్ సిబ్బందికి నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఆ మెమో ఇప్పుడు తెగ చక్కెర్లు కొడుతోంది. రెడిట్‌లో గుర్తు తెలియని యూజర్ చేసిన పోస్ట్‌లో ఇలా ఉంది. ‘ఉద్యోగులకు గమనిక! వర్క్ అంటే వినోదం కాదు. ఇది మీ బాధ్యత. ఆఫీస్ వర్క్ చేయకుండా.. బయట విషయాల గురించి అస్సలు చర్చించ కూడదు. పనివేళల్లో స్నేహానికి తావివ్వకూడదు. “work is not meant to be fun” by u/DiorRoses in mildlyinfuriating ఏదైనా మాట్లాడుకోవాలంటే అది ఆఫీస్ అవర్స్ తర్వాతే. ఆఫీస్ వేళల్లో మీ సహచర ఉద్యోగి.. ఆఫీస్ వర్క్ గురించి కాకుండా ఇతర విషయాల గురించి మీతో మాట్లాడితే నన్ను సంప్రదించండి. పని మీ బాగోగులు చూసుకునే ‘డేకేర్’ కాదు. అంటూ సంబంధిత ఆఫీస్ బాస్ సంతకం చేసిన మెమోలో పేర్కొని ఉంది. ఈ నోటీస్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. రెడిట్‌లో పోస్ట్ చేసిన నాటి నుంచి సుమారు 26 వేల మంది కామెంట్లు చేశారు. బాస్ చాలా ప్రమాదకరంగా ఉన్నారే. ఆ ఆఫీస్ వర్క్ కల్చర్ చెత్తగా ఉంది. ఆఫీస్‌లో స్నేహపూరితమైన వాతావరణం ఉంటే వర్క్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది’ అని కామెంట్లలో చెబుతున్నారు యూజర్లు. చదవండి👉 ప్రమాదంలో మరో బ్యాంక్.. ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రాబర్ట్ కియోసాకి ఆందోళన! -
మనసు కుదిరింది.. పెళ్లి జరిగింది
‘పెళ్లి కుదిరితే పిచ్చి కుదురుతుంది పిచ్చి కుదిరితే పెళ్లి జరుగుతుంది’ అని సామెత. అంటే పిచ్చి కుదరదు... పెళ్లి జరగదు అని అర్థం. కాని ఆ సామెతను తప్పు చేశారు ఇద్దరు ప్రేమికులు. మానసిక అస్వస్థతతో చెన్నై పిచ్చాసుపత్రిలో విడివిడిగా చేరిన ఈ ఇరువురుకి అక్కడ పరిచయమైంది. వ్యాధి నయం కావడంతో పెళ్లి నిర్ణయానికి వచ్చారు. 200 ఏళ్ల చరిత్రగల ఆ ఆస్పత్రిలో ఈ ఘటన మొదటిసారి. మానసిక అస్వస్థత కూడా జ్వరం, కామెర్లులా నయం కాదగ్గదే. గమనించి వైద్యం చేయిస్తే పూర్వ జీవితం గడపొచ్చు. చెన్నైలో జరిగిన ఈ పెళ్లి ఆశలు వదులుకునే మానసిక అస్వస్థులకు గొప్ప శుభవార్త. శుభమస్తు వార్త. మానసిక అస్వస్థత వస్తే ఈ సమాజంలో ఎన్నో అపోహలు, భయాలు, ఆందోళనలు, హేళనలు ఆపై బహిష్కరణలు. ‘పిచ్చివారు’ అని ముద్ర వేసి వారికి వైద్యం చేయించాలనే ఆలోచన కూడా చేయరు. అదే జ్వరం వస్తే జ్వరం అని చూపిస్తారు. కాని మనసు చలిస్తే ఏదో దెయ్యం పట్టిందని వదిలేస్తారు. మానసిక ఆరోగ్యం గురించి ప్రభుత్వాలు, సేవా సంస్థలు ఎంతో ప్రచారం చేస్తున్నా వైద్యం అందాల్సిన వారు, వైద్యం చేయించాల్సిన వారు కూడా అవగాహన లోపంతో వున్నారు. డాక్టర్ దగ్గరకు వెళ్దామంటే ‘నాకేమైనా పిచ్చా’ అని ఎదురు తిరుగుతారు పేషెంట్లు. ‘పిచ్చి’ ముద్ర వేస్తారని. ‘పిచ్చికి మందు లేదు’ అని వదిలేస్తారు బంధువులు. ఇద్దరూ ఓర్పు వహిస్తే గొప్ప ఫలితాలు వస్తాయి అనడానికి ఇదిగో ఇదే ఉదాహరణ. చెన్నైలోని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్’ (ఐ.ఎం.హెచ్.) బ్రిటిష్ కాలం నాటిది. దేశంలోనే రెండవ అతి పెద్ద మానసిక చికిత్సాలయం. అందులో కొంత కాలం కిందట వైద్యం కోసం చేరారు మహేంద్ర (42), దీప (38). కుటుంబాలు వారిని చేర్పించి చేతులు దులుపుకున్నాయి. కాని వారు బాగయ్యారు. కొత్త జీవితం గడపాలనుకున్నారు. కాని బయటకు వెళితే ‘నయమై వచ్చినా’ అమ్మో పిచ్చోళ్లు అనే వివక్షతో చూస్తారు జనం. ఆ భయంతో మళ్లీ హాస్పిటల్‌కు వచ్చేశారు. దాంతో హాస్పిటల్ వారే వారికి లోపల ఉద్యోగాలు కల్పించారు. మహేంద్ర డేకేర్ సెంటర్లో పని చేస్తుంటే దీప కేంటిన్లో పని చేస్తోంది. మెల్లగా ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ సంగతి అడ్మినిస్ట్రేషన్‌కు తెలియగానే హడలిపోయారు. ఎందుకంటే ఇలాంటిది ఇంతకు మునుపు ఎరగరు. ఇదేమైనా ఇష్యూ అవుతుందా అనుకున్నారు. కాని హాస్పిటల్ డైరెక్టర్ అయిన డాక్టర్ పూర్ణ దగ్గరకు వచ్చిన దీప ‘నేను అతనితో నా జీవితం పంచుకోవాలనుకుంటున్నానమ్మా’ అని చెప్పే సరికి ఆమెకు ఆ స్త్రీ హృదయం అర్థమైంది. అంతే. హాస్పిటల్లో పని చేసే అందరూ తలా ఒక చేయి వేసి వారి పెళ్లికి ఆర్భాటంగా ఏర్పాట్లు చేశారు. తాళిబొట్టు ఆ ఏరియా ఎం.ఎల్.ఏ. ఏర్పాటు చేశాడు. అంతేనా హెల్త్ మినిస్టర్ శేఖర్ బాబు, ఎం.పి. దయానిధి మారన్ ఏ బందోబస్తు లేకుండా సగటు బంధువుల్లా పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి ఎంతో వేడుకగా జరిగింది. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటే జీవితం ముగిసినట్టు కాదు. స్వల్ప కాలం ఇబ్బంది పడ్డా నయమయ్యి కొత్త జీవితం గడపవచ్చు. అందుకు ఉచిత వైద్యం దొరుకుతుంది. కనుక ఆరోగ్యాన్ని గమనించి సమస్య వస్తే జయించండి. కొత్త జీవితాన్ని కళకళలాడించండి. ఎవరికి తెలుసు... ఇప్పుడు కష్టం వచ్చినా భవిష్యత్తు ఎన్ని సంతోషాలను దాచిపెట్టి ఉందో! -
ఎందుకిలా చేశారు?
గుర్ గావ్: 'వీళ్లకు హృదయం లేదు. దేవుడు, చట్టం, సమాజం అంటే భయం లేదు'... తన ముద్దుల కూతురి చేతివేలు పోవడానికి కారణమైన డేకేర్ సెంటర్ నిర్వాహకులపై ఓ మహిళ వ్యక్తం చేసిన ఆవేదన ఇది. తన గారాలపట్టికి జరిగిన అన్యాయంపై సోషల్ మీడియా వేదికగా ఆమె గొంతెత్తింది. లాభార్జన ధ్యేయంగా పనిచేస్తూ పసిపిల్లల ప్రాణాలను ఫణంగా పెడుతున్న విద్యా వ్యాపారులపై విప్లవ శంఖం పూరించింది. దేశ రాజధాని సమీంలోని గుర్ గావ్ లో ఏప్రిల్ 28న చోటుచేసుకున్న ఈ ఘటన కార్పొరేట్ విద్యాసంస్థల పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. శివాని శర్మ అనే మహిళ తన మూడేళ్ల కూతురు మిరాను చెరబ్ ఏంజెల్ అనే డేకేర్ సెంటర్ లో చేర్చారు. ఏప్రిల్ 28న ఆమెకు టీచర్ ఫోన్ చేసి మీ అమ్మాయి కుడిచేతి బొటనవేలు చితికిపోయిందని, ఆస్పత్రికి తరలించామని చెప్పింది. వెంటనే ఆమె ఆస్పత్రికి వెళ్లారు. చేతివేతి గాయంతో విలవిల్లాడుతున్న మిరాను చూసి చలించిపోయారు. ఏమైందని టీచర్లను నిలదీశారు. కార్తీక్ అనే విద్యార్థి తలుపు వేయడంతో మిరాకు గాయమైందని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. జాగ్రత్తగా చూసుకోమని మీకు అప్పగిస్తే ఇలా చేస్తారా అని టీచర్లను శివాని ప్రశ్నించింది. బొటనవేలు పైభాగం బాగా చితికిపోవడంతో దాన్ని తొలగించారు. డే కేర్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో తన కూతురు బొటనవేలు కోల్పోయిందని శివాని ఆవేదన వ్యక్తం చేసింది. డేకేర్ నిర్వాహకులపై కేసు పెట్టింది. దీంతో దిగొచ్చిన డేర్ కేర్ యజమానులు క్షమాపణ చెప్పారు. మిరాకు చికిత్సకు అయ్యే ఖర్చు భరిస్తామని హామీయిచ్చారు. అయితే తర్వాత వారు పత్తా లేకుండా పోయారు. తాను ఫోన్ చేస్తే స్పందించడం లేదని, పోలీసులతో బెదిరిస్తున్నారని శివాని ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకుండా జాగ్రత్త పడాలని ఫేస్ బుక్ ద్వారా కోరింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డే కేర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.


