తన పరువు తానే తీసుకున్న బాబర్‌ ఆజం! | Babar Azam Try to recreate Rohit Sharma's celebrations, See Reactions | Sakshi
Sakshi News home page

తన పరువు తానే తీసుకున్న బాబర్‌ ఆజం!

May 5 2026 9:17 AM | Updated on May 5 2026 9:27 AM

Babar Azam Try to recreate Rohit Sharma's celebrations, See Reactions

పాకిస్తాన్‌ స్టార్‌ క్రికెటర్‌ బాబర్‌ ఆజం కల ఎట్టకేలకు నెరవేరింది. అతడి సారథ్యంలో పెషావర్‌ జెల్మీ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌)-2026 టైటిల్‌ గెలిచింది. హైదరాబాద్‌ కింగ్స్‌మెన్‌తో ఆదివారం జరిగిన పోరులో పెషావర్‌ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది.

తద్వారా తొలిసారి పీఎస్‌ఎల్‌లో చాంపియన్‌గా అవతరించింది. సీజన్‌ ఆసాంతం అద్భుతంగా రాణించిన పెషావర్‌ కెప్టెన్‌ బాబర్ ఆజం (Babar Azam).. ఈ మ్యాచ్‌లో మాత్రం గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. 

రాణించిన ఆరోన్‌ హార్డీ
అయినప్పటికీ హైదరాబాద్‌ విధించిన 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పెషావర్‌ విజయవంతంగా ఛేదించింది. ఆరోన్‌ హార్డీ (39 బంతుల్లో 56 నాటౌట్‌), అబ్దుల్‌ సమద్‌ (34 బంతుల్లో 48) రాణించి జట్టును గెలిపించారు.

దీంతో తొలిసారి పీఎస్‌ఎల్‌ టైటిల్‌ గెలిచిన ఆనందంలో బాబర్‌ ఆజం ఎగిరి గంతేశాడు. ముఖ్యంగా ట్రోఫీ అందుకునే సమయంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ శైలిని అనుకరించబోయి నెటిజన్ల చేతికి చిక్కాడు. 

రోబో మాదిరి నడిచి వెళ్లి..
కాగా 2024లో టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌ను విజేతగా నిలిపిన సారథి రోహిత్‌.. రోబో మాదిరి నడుచుకుంటూ వెళ్లి ట్రోఫీ అందుకుని సంబరాలు చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే, ఇప్పుడు బాబర్‌ కూడా అదే స్టైల్‌లో వెళ్లి ట్రోఫీ తీసుకోవాలనుకున్నాడు. కానీ రోబో మాదిరి కాకుండా వెనుక నుంచి ఎవరో తరిమినట్లుగా చిన్న పిల్లాడిలా పరిగెత్తుకు వచ్చి ట్రోఫీ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

రోహిత్‌ను కాపీ కొట్టబోయి బొక్కబోర్లా పడ్డాడు
దీంతో.. ‘‘రోహిత్‌ శర్మను కాపీ కొట్టబోయి బొక్కబోర్లా పడ్డాడు. మీమర్లకు పండుగ చేసుకునే అవకాశం ఇచ్చాడు’’ అంటూ బాబర్‌ ఆజంపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా పీఎస్‌ఎల్‌ తాజా సీజన్‌లో బాబర్‌ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు.  పదకొండు మ్యాచ్‌లలో కలిపి 588 పరుగులు సాధించి.. టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు.

కాగా పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు కరాచీ, లాహోర్‌లో పీఎస్‌ఎల్‌ మ్యాచ్‌లు నిర్వహించింది. 

ప్లే ఆఫ్స్‌నకు ప్రేక్షకులను అనుమతించినా ప్రజా రవాణా ద్వారానే స్టేడియానికి చేరుకోవాలనే షరతు పెట్టింది. ఏదేమైనా మరోసారి ఐపీఎల్‌కు పోటీగా వచ్చి బొక్కబోర్లా పడింది. కాగా మార్చి 26 నుంచి మే 3 వరకు పీఎస్‌ఎల్‌ తాజా ఎడిషన్‌ నడించింది.

చదవండి: ఐపీఎల్‌లో మరో సిక్సర్ల చిచ్చరపిడుగు.. వైభవ్‌ సూర్యవంశీలాగే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement