గొప్ప డాక్టర్‌ని అవ్వాలనుకున్నా..కానీ ఆ ఒక్క రీజన్‌..! | Physiotherapist Leaves Rs 40 Lakh Job In UK To Return To India | Sakshi
Sakshi News home page

గొప్ప డాక్టర్‌ని అవ్వాలనుకున్నా..కానీ ఆ ఒక్క రీజన్‌..!

Apr 13 2026 5:26 PM | Updated on Apr 13 2026 5:41 PM

Physiotherapist Leaves Rs 40 Lakh Job In UK To Return To India

విదేశాల్లో ఉద్యోగం అనేది చాలామంది యువత డ్రీమ్‌. మా అబ్బాయి ఫారెన్‌లో ఫలానా ఉద్యోగం చేసుకుంటున్నాడు అని తల్లిదండ్రులు కూడా తమ బంధువులకు, మిత్రులకు గర్వంగా చెప్పుకుంటుంటారు. కానీ వాస్తవ జీతంలో అదేమంత సౌఖ్యంగా ఉండదు పైగా అక్కడ నుంచి ఎలా బయటపడాలి, తిరిగి సొంతగూటికి వచ్చేస్తే పరిస్థితి ఏంటి అన్న భయం ఓ రేంజ్‌లో వెంటాడతాయి. చాలామంది అక్కడ కొత్త లైఫ్‌స్టైల్‌కి అడ్జెస్ట్‌ కాలేక మరోపక్క తమవాళ్లను వదిలేసి వచ్చేశామన్న బెంగ కుదురుగా ఒక చోట నిలవనివ్వక..తిరిగి సొంత గడ్డకి పయనమయ్యేలా చేస్తాయి. ఇక్కడ కూడా ఈ ఫిజియోథెరపిస్టూ అలానే భారత్‌కి గోడకు కొట్టి బంతిలా తిరిగొచ్చేశాడు. తాను ఎందుకలో వచ్చేశాడో చెబుతుంటే..అమ్మో విదేశాలకా అని అనిపిస్తుంది. 

అసలేం జరిగిందంటే. ఫిజియోథెరపిస్ట్ మానవ్ షా తానెలా విదేశీ ఉద్యోగం అనే డ్రీమ్‌ని మధ్యలో వదిలేసి భారత్‌కి వచ్చాశాడో సోషల్‌ మీడియా పోస్ట్‌లో వెల్లడించాడు. ఆ పోస్ట్‌లో మానవ్‌ షా..తన మంచి ఉద్యోగంతో చక్కటి లైఫ్‌ని లీడ్‌ చేస్తున్న టైంలోనే ఇంటికి తిరిగి వచ్చేశానని చెప్పుకొచ్చాడు. ఏకంగా ఏడాదికి రూ. 40 లక్షల జీతంతో మంచి లగ్జరీ లైఫ్‌ని లీడ్‌ చేస్తున్నట్లు చెప్పాడు. అంతేగాదు, మంచి ఆర్థిక భద్రతతో లైఫ్‌ బిందాస్‌గా ఉందని చెప్పుకొచ్చాడు. 

కానీ అవేమి అతడి ఒంటరితనాన్ని దూరం చేయలేకపోయాయని అంటున్నాడు. తాను నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌లో పనిచేస్తుండేవాడినని తెలిపాడు. అయితే అక్కడ ఉదయం 9 టు 5 ఉద్యోగ సంస్కృతికి బంధీ అయిపోతున్న ఫీలింగ్‌ వచ్చేదట. వ్యక్తిగత ఎదుగుదల ఏం లేకుండా..స్వేచ్ఛలేని జీవితాన్ని గడుపుతున్నట్లుగా ఉండేదట. సింపుల్‌గా చెప్పాలంటే అదొక జైలులా అనిపించేదట. పోనీ అక్కడ నుంచి వచ్చేద్దామంటే..అప్పటికే చక్కగా సెటిల్‌ అయిన లైఫ్‌, స్నేహితులు, ఆ సౌకర్యాలను వదిలేయాలంటే విపరీతమైన భయం, అనుమానాలు, సందేహాలతో చాలా రోజుల పాటు సతమతమయ్యానని చెప్పుకొచ్చాడు. 

తాను తన ఇంటికి దూరంగా ఉండటంతో విపరీతమైన ఒంటరితనంతో బాధపడేవాడినని, కొన్ని గొప్ప క్షణాలను కోల్పోతున్న ఫీలింగ్‌ వచ్చేదని అన్నాడు. వాటన్నింటిని ఏ జీతం భర్తీ చేయలేదని తెలుసుకుని తక్షణమే తన సొంత గూటికి వచ్చేశానని అన్నాడు. అలాగే ఇక్కడ విదేశంలో సంపాదించినంత కాకపోయినా..తన వాళ్లతో హాయిగా గడపగలనన్నా ఆ ఆలోచనే సంతోషంలో ముంచెత్తుందని చెబుతున్నాడు. 

అలాగే తక్కువ జీతమే అయినా..చక్కగా పొదుపు చేయగలను, నాణ్యమైన ఆరోగ్యాన్ని అందివ్వగలనని అన్నాడు. అన్నింటికంటే సంతృప్తిగా, మనశ్శాంతిగా బతకుతానని చెబుతున్నాడు. నెటిజన్లు కూడా అతడి నిర్ణయానికి మద్దతిస్తూ..వెస్ట్రన్‌ డ్రీమ్‌ లేదా విదేశీ ఉద్యోగం అనే కల దూరపు కొండలు నునుపు అన్నట్లు ఉంటుందే తప్ప..ఎన్నో ఆనందాల క్షణాలను కోల్పోతాం. ఏకాకిగా ఓ యంత్రంలా బతుకుతున్నట్లుగా జీవితంపై విరక్తి వచ్చేస్తుందంటూ పోస్టులు పెట్టారు. కొందరు తాము కూడా అలానే విదేశం నుంచి సొంత గూటికి వచ్చేసినట్లు చెప్పడం విశేషం.

 

(చదవండి: సామాజిక బాధ్యత అంటే ఇదే..! రెప్పపాటులో ఆ పాప..)

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement