ఒకప్పుడు బాంబులు మోత.. ఇప్పుడు మాత్రం..? | tehran during ceasefire womans viral video stuns internet | Sakshi
Sakshi News home page

ఒకప్పుడు బాంబులు మోత.. ఇప్పుడు మాత్రం..?

May 2 2026 6:55 PM | Updated on May 2 2026 7:25 PM

tehran during ceasefire womans viral video stuns internet

ప్రస్తుతం అమెరికా- ఇరాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నడుస్తోంది. దీంతో కాల్పుల మోతకు తాత్కాలిక తెర పడింది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపుగా రెండునెలలలుగా కాల్పుల మోతతో దద్దరిల్లిపోయిన టెహ్రాన్‌ నగరం ఇప్పుడు ఏలా ఉందో ఆ యువతి వీడియో చూపించింది. ఈ వీడియో నెటిజన్స్‌ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.  

ఇరాన్, ఇజ్రాయెల్, మరియు అమెరికా దేశాల మధ్య కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో'ఎస్టెల్' అనే వినియోగదారు షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. "ఏ డే ఇన్ టెహ్రాన్ డ్యూరింగ్ సీజ్‌ఫైర్" (టెహ్రాన్‌లో కాల్పుల విరమణ వేళ ఒక రోజు) పేరుతో ఉన్న ఈ వీడియో, టెహ్రాన్‌లోని సాధారణ ,ప్రశాంతమైన జీవనశైలిని ప్రపంచానికి చూపిస్తోంది. గతంలో క్షిపణులు నగరాన్ని తాకిన భయానక దృశ్యాలకు ఇది పూర్తిగా భిన్నంగా ఉండటంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

టెహ్రాన్‌ మెుత్తం కలియతిరుగుతూ...

రాజధాని నగర వీధుల గుండా ప్రయాణిస్తూ  ఎస్టెల్ తన కారులో ప్రధాన రహదారుల గుండా ప్రయాణిస్తూ నగరాన్ని చూపించారు. ఫుట్‌పాత్ మీద ఉన్న ఒక చిన్న విక్రేత వద్ద క్యాట్ ప్లషీని కొనడం, ఒక ఫుడ్ కోర్టులోకి వెళ్లి లంచ్ ఆర్డర్ చేయడం, ఇరానియన్ బిస్కెట్లు కొనడం వంటి దృశ్యాలు ఉన్నాయి. అంతేకాకుండా, ఆమె ఒక స్టాల్‌లో కొరియన్ ఫుడ్ కూడా రుచి చూసింది.అదే విధంగదా సాయంత్రం సమయంలో, ఆమె ఒక విలాసవంతమైన హోటల్‌లోని లాంజ్‌కు వెళ్ళింది. అక్కడ ప్రజలు యుద్ధ భయం లేకుండా ఆనందంగా సమయాన్ని గడుపుతున్నారు.

వైరల్‌గా వీడియో

అయితే ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్ల వైరల్‌గా మారింది. నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, మీడియాలో చూపే దానికి, అక్కడ జరుగుతున్న దానికి చాలా తేడా ఉందని పేర్కొన్నారు. ఇరాన్ ప్రజల ఆతిథ్యాన్ని, నగర అందాలను ప్రశంసిస్తూ, యుద్ధం త్వరగా ముగియాలని కోరుకుంటున్నారు. కాగా ప్రస్తుతం యుద్ధం విషయంలో నీలినీడలు కమ్ముకున్నాయి. యుద్ధం ముగింపుకు ఇరాన్ చేసిన కొత్త ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించారు.దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement