యాహూ! ఎట్టకేలకు భారతీయురాలిగా..! వీడియో వైరల్‌ | Russian Woman Living In India finally Got Her OCI Card Goes Viral | Sakshi
Sakshi News home page

యాహూ! ఎట్టకేలకు భారతీయురాలిగా..! వీడియో వైరల్‌

Apr 24 2025 5:13 PM | Updated on Apr 24 2025 6:57 PM

Russian Woman Living In India finally Got Her OCI Card Goes Viral

ఓ విదేశీయురాలు భారతీయ పౌరసత్వానికి సరితూగే ఓ హక్కుని సంపాదించుకుంది. ఇక అంతే ఇది వెలకట్టలేని ఆనందం అంటూ తన సంతోషాన్ని నెటిజన్లతో పంచుకుంటూ అందుకు సంబంధించిన వీడియోని షేర్‌ చేసింది. విదేశీ గడ్డపై పుట్టిన ఆమె..హే ఇక నేను భారతీయురాలినే అంటూ ఆనందంతో పొంగిపోతూ వీడియోలో చెబుతుండటం కనిపిస్తోంది. నెటిజన్లు సైతం ఆమె ఆనందాన్నిచూసి విస్తుపోయారు.  

రష్యన్‌ జాతీయురాలు మెరీనా ఖర్బానీ ఇన్‌స్టాగ్రాంలో తన సంతోషాన్నివ్యక్తపరిచే వీడియోని షేర్‌ చేసుకుంది. ఆమె షిల్లాంగ్‌ నివాసం ఉంటుంది. ఆ వీడియోలో ఒక చేతిలో బిడ్డను పట్టుకుని, మరో చేతిలో OCI కార్డును చూపిస్తూ సంతోషంతో ఉప్పొంగిపోతున్నట్లు కనిపిస్తుంది. ఎట్టకేలకు నేను భారతీయురాలినే అంటూ ఉద్వేగంగా చెబుతుంది ఆ వీడియోలో. 

మూడున్నర సంవత్సరాల కృషి ఫలితం అని కూడా చెబుతుండటం కనిపిస్తుంది. అలాగే తన తదుపరి లక్ష్యం తన బిడ్డ కూడా ఈ కార్డుని పొందడమే అని ఆ వీడియోలో చెబుతుందామె. అంతేగాదు నెట్టింట షేర్‌ చేసిన ఆ వీడియోకి "చివరకు నేను భారతీయురాలిని" అనే క్యాప్షన్‌ జోడించి మరీ పోస్ట్‌ చేశారామె. 

అలాగే నెటిజన్లు సైతం ఆమె ఆనందాన్ని చూసి ఆశ్యర్యపోవడమే గాక, మీరు ఎల్లప్పుడూ భారతీయులే కాకపోతే ఇప్పుడే ఈ పత్రాలు దాన్ని ధృవీకరించాయి అంతే అంటూ పోస్టులు పెట్టారు. కాగా, ఖర్బానీ ప్రేమ వివాహం అనంతరం షిల్లాంగ్‌ స్థిరపడ్డానని, తల్లిగా మారడం, ఇక్కడ భారతీయ సంస్కృతిని  అడాప్ట్‌ చేసుకోవడం తదితరాల గురించి ఎప్పటికప్పుడూ నెటిజన్లతో షేర్‌ చేసుకుంటుంటారామె. 

ఓసీఐ కార్డు అంటే..
ఇది పూర్తి భారతీయ పౌరసత్వం కాదు. కానీ భారత సంతతికి చెందిన విదేశీ పౌరులకు అనే హక్కులను మంజూరు చేస్తుంది. అంటే వీసా అవసరం లేకుండానే భారతదేశంలో స్వేచ్ఛగా జీవించడానికి, పనిచేయడానికి, ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది.

 

(చదవండి: సమ్మర్‌ హీట్‌ని తట్టుకోవాలంటే..కళ్లకు సన్‌గ్లాస్‌ పెట్టాల్సిందే..! ఎలాంటివి బెస్ట్‌ అంటే..)

 

Advertisement
 
Advertisement
Advertisement