
సమ్మర్ హీట్‌ని బీట్ చేయాలంటే కళ్లకు సన్‌గ్లాస్ పెట్టాల్సిందే. సన్‌గ్లాసెస్ ఫ్యాషన్ యాక్సెసరీ మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ. సూర్యుడి అతి నీలలోహిత కిరణాలకు రేడియేషన్‌కు ఎక్కువసేపు గురి కావడం రకరకాల సమస్యలకు కారణం అవుతుంది. సూర్యుని నుంచి వెలువడే హానికరమైన రేడియేషన్ నుంచి సన్‌గ్లాసెస్ మన కళ్లకు రక్షణగా ఉంటాయి.
ఎలాంటి సమస్యలు రాకుండా కంటి ఆరోగ్యం కోసం సన్ గ్లాసెస్ ఉపయోగపడతాయి. తీవ్రమైన సూర్యకాంతి వల్ల కళ్లు ఒత్తిడికి గురవుతాయి. తలనొప్పి రావచ్చు. బయటికి వెళ్లినప్పుడు సూర్యకాంతి ప్రభావాన్ని తగ్గించి కంటిపై ఒత్తిడి లేకుండా చేస్తాయి కూల్ గ్లాసెస్.
ఎలాంటి సన్‌గ్లాసెస్‌ను ఎంచుకోవాలంటే...
100 శాతం యూవీ ప్రొటెక్షన్ ఇచ్చేవాటిని ఎంపిక చేసుకోవాలి.
పోలరైజ్డ్ లెన్సెస్ సూర్యకాంతి ప్రభావాన్ని తగ్గిస్తాయి.
బ్రైట్ కండీషన్స్‌లో పోలరైజ్‌డ్ గ్లాసెస్ మంచి క్లారిటీని ఇస్తాయి
స్ట్రాంగ్, స్క్రాచ్–రెసిస్టెంట్ సన్ గ్లాసెస్‌ను ఎంచుకోవాలి
లైట్ వెయిట్, ఇంపాక్ట్–రెసిస్టెంట్, గుడ్‌క్లారిటీ కోసం పాలీకార్బోనేట్ లెన్సులు పాపులర్ ఛాయిస్
రకరకాల సైజ్, షేప్‌లలో సన్‌గ్లాసెస్ వస్తున్నాయి. అయితే వాటిలో మన ముఖ ఆకృతికి నప్పే అద్దాలను ఎంచుకోవడం ఉత్తమం.
(చదవండి: చీర కేవలం మహిళల సొత్తు కాదు..! స్టైలిష్ ధోతీలా పురుషులు కూడా..)