
తన ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా ఓ వ్యక్తి చేసిన సాహసం నెట్టింట ప్రశంసలందుకుంటోంది. విద్యుత్ షాక్‌కు గురైన తొమ్మిదేళ్ల చిన్నారిని కాపాడి శెభాష్ అనిపించుకున్నాడు చెన్నై యువకుడు కణ్ణన్. ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. అసలేం జరిగిందో ఆయన మాటల్లోనే..
‘‘నా పేరు కణ్ణన్ తమిళసెల్వన్. బుధవారం మధ్యాహ్నాం సమయంలో పని మీద బైక్ మీద వెళ్తున్నా. ఆరోజు బాగా వర్షం కురిసింది. అరుంబాక్కమ్ ఏరియాలో రోడ్ల మీద బాగా నీరు నిలిచిపోయింది. చూస్తుండగానే ఓ పిల్లాడు నీళ్లలో పడిపోయాడు. బహుశా కళ్లు తిరిగి అందులో పడిపోయాడు అనుకున్నా. సాయం చేయడానికి దగ్గరగా వెళ్లా. కానీ, దగ్గరికి వెళ్లి చూస్తే షాక్‌తో విలవిలాడుతున్నాడని అర్థమైంది.
సాయం కోసం కేకలు వేశా. ఎవరూ ముందుకు రాలేదు. దగ్గరికి వెళ్లి ముట్టుకోగానే నాకూ షాక్ కొట్టింది. ఆలస్యం చేయకుండా బయటకు లాగేశా. పక్కకు తీసుకెళ్లి ఛాతీ మీద బలంగా నొక్కా. ఆ పిల్లాడు ఊపిరి తీసుకోవడంతో ెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లా అని కణ్ణన్ తెలిపాడు. బాధిత చిన్నారి పేరు జేడన్. ప్రస్తుతం అతను కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు.
సీసీటీవీ ఫుటేజీలో ఆ ఘటన రికార్డయ్యింది. కరెంటు షాక్‌తో విలవిల్లాడుతూ ఆ బాలుడు నీటిలో కుప్పకూలిపోయాడు. అది గమనించిన కణ్ణన్ దగ్గరగా వెళ్లాడు.. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కాపాడాడు. కాస్త ఆలస్యమైతే ఆ చిన్నారి ప్రాణాలు పోయేవే. ఆదివారం నుంచి ఆ వీడియో వైరల్‌గా మారడంతో కణ్ణన్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘నిజమైన హీరో’ అంటూ కొనియాడుతున్నారు.
జేడన్ తండ్రి రాబర్ట్ ఓ ప్రైవేట్ ఉద్యోగి. అరుంబాక్కమ్‌లోని మాంగ్లీ నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆరోజు జేడన్‌కు ఆరోగ్యం బాగోలేదట. కానీ, వార్షిక పరీక్షలు ఉండడంతో బడికి పంపించా. పరీక్ష రాశాక ఒక్కడే తిరిగి వచ్చాడు. ఈ క్రమంలోనే ప్రమాదానికి గురయ్యాడు అని చెబుతున్నాడాయన. జేడన్ ఐడీ కార్డు మీద ఉన్న నెంబర్ చూసి కణ్ణన్ తనకు ఫోన్ చేశాడని, తన బిడ్డ ప్రాణం కాపాడిన అతనికి జీవితాంతం రుణపడి ఉంటానని చెబుతున్నాడు రాబర్ట్.
సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ కావడంతో అరుంబాక్కమ్ అధికారులు స్పందించారు. అండర్‌గ్రౌండ్ కేబుల్ దెబ్బ తినడం వల్లే ఈ ఘటన జరిగిందని వివరణ ఇచ్చుకున్నారు.
#Kannan is the young man who bravely saved a boy who was drowning in the water due to an electric shock. He is the young man who risked his life to save the boy.⛑️
He is a true hero. An inspiration to all.🫡
Everyone should admire him.🫡#Chennai #Tamilnadu pic.twitter.com/PopgnYDUGp— Shashi Kumar Reddy Vura (@vurashashi) April 20, 2025