breaking news
arumbaka
-
Viral: చిన్నారిని రక్షించిన ఈ రియల్ హీరో ఏమన్నాడంటే..
తన ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా ఓ వ్యక్తి చేసిన సాహసం నెట్టింట ప్రశంసలందుకుంటోంది. విద్యుత్ షాక్‌కు గురైన తొమ్మిదేళ్ల చిన్నారిని కాపాడి శెభాష్ అనిపించుకున్నాడు చెన్నై యువకుడు కణ్ణన్. ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. అసలేం జరిగిందో ఆయన మాటల్లోనే..‘‘నా పేరు కణ్ణన్ తమిళసెల్వన్. బుధవారం మధ్యాహ్నాం సమయంలో పని మీద బైక్ మీద వెళ్తున్నా. ఆరోజు బాగా వర్షం కురిసింది. అరుంబాక్కమ్ ఏరియాలో రోడ్ల మీద బాగా నీరు నిలిచిపోయింది. చూస్తుండగానే ఓ పిల్లాడు నీళ్లలో పడిపోయాడు. బహుశా కళ్లు తిరిగి అందులో పడిపోయాడు అనుకున్నా. సాయం చేయడానికి దగ్గరగా వెళ్లా. కానీ, దగ్గరికి వెళ్లి చూస్తే షాక్‌తో విలవిలాడుతున్నాడని అర్థమైంది.సాయం కోసం కేకలు వేశా. ఎవరూ ముందుకు రాలేదు. దగ్గరికి వెళ్లి ముట్టుకోగానే నాకూ షాక్ కొట్టింది. ఆలస్యం చేయకుండా బయటకు లాగేశా. పక్కకు తీసుకెళ్లి ఛాతీ మీద బలంగా నొక్కా. ఆ పిల్లాడు ఊపిరి తీసుకోవడంతో ెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లా అని కణ్ణన్ తెలిపాడు. బాధిత చిన్నారి పేరు జేడన్. ప్రస్తుతం అతను కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. సీసీటీవీ ఫుటేజీలో ఆ ఘటన రికార్డయ్యింది. కరెంటు షాక్‌తో విలవిల్లాడుతూ ఆ బాలుడు నీటిలో కుప్పకూలిపోయాడు. అది గమనించిన కణ్ణన్ దగ్గరగా వెళ్లాడు.. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కాపాడాడు. కాస్త ఆలస్యమైతే ఆ చిన్నారి ప్రాణాలు పోయేవే. ఆదివారం నుంచి ఆ వీడియో వైరల్‌గా మారడంతో కణ్ణన్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘నిజమైన హీరో’ అంటూ కొనియాడుతున్నారు. జేడన్ తండ్రి రాబర్ట్ ఓ ప్రైవేట్ ఉద్యోగి. అరుంబాక్కమ్‌లోని మాంగ్లీ నగర్లో నివాసం ఉంటున్నారు. ఆరోజు జేడన్కు ఆరోగ్యం బాగోలేదట. కానీ, వార్షిక పరీక్షలు ఉండడంతో బడికి పంపించా. పరీక్ష రాశాక ఒక్కడే తిరిగి వచ్చాడు. ఈ క్రమంలోనే ప్రమాదానికి గురయ్యాడు అని చెబుతున్నాడాయన. జేడన్ ఐడీ కార్డు మీద ఉన్న నెంబర్ చూసి కణ్ణన్ తనకు ఫోన్ చేశాడని, తన బిడ్డ ప్రాణం కాపాడిన అతనికి జీవితాంతం రుణపడి ఉంటానని చెబుతున్నాడు రాబర్ట్. సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ కావడంతో అరుంబాక్కమ్ అధికారులు స్పందించారు. అండర్‌గ్రౌండ్ కేబుల్ దెబ్బ తినడం వల్లే ఈ ఘటన జరిగిందని వివరణ ఇచ్చుకున్నారు. #Kannan is the young man who bravely saved a boy who was drowning in the water due to an electric shock. He is the young man who risked his life to save the boy.⛑️He is a true hero. An inspiration to all.🫡Everyone should admire him.🫡#Chennai #Tamilnadu pic.twitter.com/PopgnYDUGp— Shashi Kumar Reddy Vura (@vurashashi) April 20, 2025 -
బ్రోతల్ కేసులో ఇరికిస్తా...
న్యాయం చేయండని వెళ్లిన దళిత మహిళకు ఎస్ఐ బెదిరింపు లాఠీతో కొట్టి దుర్భాషలాడిన వైనం అవమానంతో పురుగు మందు తాగిన బాధితురాలు.. పరిస్థితి విషమం రేపల్లె: న్యాయాన్యాయాలు చూడకుండా లాఠీతో చితకబాది, బ్రోతల్ కేసులో ఇరికిస్తానంటూ ఎస్ఐ తీవ్రంగా బెదిరించడంతో ఓ దళిత మహిళ పురుగు మందు తాగి ఆత్యహత్యాయత్నం చేసింది. తమ స్థలంలో ఉన్న మెట్లను ఎందుకు అక్రమంగా పగులగొడుతున్నారని ప్రశ్నించడమే ఆ మహిళ పట్ల శాపంగా మారింది. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం ఆరుంబాకలో రోడ్డు నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా తమ ఇంటి వద్ద ఉన్న మెట్లను కూల్చడం అక్రమమని సువార్తమ్మ, ఆమె భర్త ఏసురత్నం శనివారం అడ్డుపడ్డారు. దీంతో తమ మాటకే ఎదురు చెబుతారా అంటూ సర్పంచ్ వేము ప్రసన్నత, ఆమె భర్త కిరణ్, మరికొందరు వీరిపై దాడి చేశారు. తమపై సర్పంచ్, ఆమె భర్త.. అనుచరులు దాడి చేశారంటూ బాధితులు సువార్తమ్మ, ఆమె భర్త ఏసురత్నం చెరుకుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రాత్రి ఎస్ఐ పి.భాస్కర్ సువార్తమ్మ, ఏసురత్నంలను స్టేషన్‌కు పిలిపించి దుర్భాషలాడుతూ లాఠీతో కొట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన సువార్తమ్మ ఇంటికొచ్చి ఆదివారం తెల్లవారుజామున పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని, 24 గంటలు గడిస్తేగాని ఏ విషయం చెప్పలేమని వైద్యులు తెలిపారు. ‘బ్రోతల్ కేసులో ఇరికిస్తా... అండమాన్ జైలుకు పంపిస్తా... ఇంటి చుట్టు పక్కల పది మందితో సంతకాలు చేయించుకుని అడ్రస్ లేకుండా చేస్తా.. ఇల్లు కూల్చేస్తా.. అంటూ బూతులు తిడుతూ నా తల్లిదండ్రులను ఎస్ఐ భాస్కర్ అవమానించారు. పోలీస్టేస్టేషన్‌లో లాఠీతో కొట్టడంతోనే మా అమ్మ పురుగుల మందు తాగింది. మా నాన్న ఆరోగ్యం బాగోలేదు. నా తల్లి చనిపోతే నా పరిస్థితేంటి? మాపై దాడి జరిగింది.. న్యాయం చేయండని వెళ్లిన మా అమ్మా నాన్నలను నిర్బంధించి లాఠీలతో కొట్టడం ఎంత వరకు న్యాయం’ అని సువార్తమ్మ కుమార్తె సీహెచ్ అనూష కన్నీటి పర్యంతమైంది. విచారించాం.. కొట్టలేదు రోడ్డు నిర్మాణానికి అడ్డు పడుతున్నారని గ్రామ సర్పంచ్ వేము ప్రసన్నత, కార్యదర్శి ఎం.కుమారి ఆరుంబాక గ్రామానికి చెందిన సువార్తమ్మ, ఏసురత్నంలపై ఫిర్యాదు చేశారు. దీంతో వారిని స్టేషన్‌కు పిలిపించి విచారించిన మాట వాస్తవమే. ఎవరినీ దుర్భాషలాడలేదు. కొట్టలేదు. – భాస్కర్, ఎస్సై, చెరుకుపల్లి