లింగమయ్య కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ | YS Jagan consoles family members of Kuruba Lingamaiah | Sakshi
Sakshi News home page

లింగమయ్య కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ

Apr 1 2025 12:10 PM | Updated on Apr 1 2025 2:29 PM

YS Jagan consoles family members of Kuruba Lingamaiah

ఉమ్మడి అనంతపురం, సాక్షి: ఫ్యాక్షన్‌ రాజకీయాలకు బలైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) పరామర్శించారు. లింగమయ్య కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి మాట్లాడారు. ఈ సందర్భగా తమకు ప్రాణహాని ఉందని లింగమయ్య తనయుడు చెప్పగా.. అధైర్య పడొద్దని, పార్టీ అండగా ఉంటుందని, అవసరమైన న్యాయసహాయం అందిస్తామని జగన్‌ భరోసా ఇచ్చారు. వచ్చే వారం తానే స్వయంగా వస్తానని ఆయన చెప్పారు.

అంతకు ముందు.. అధికార పార్టీ అన్యాయాలను ప్రశ్నించినందుకు.. దాడులను వ్యతిరేకించినందుకే బీసీ వర్గానికి చెందిన కురుబ లింగమయ్యను టీడీపీ నాయకులు (TDP) పొట్టనపెట్టుకున్నారని వైఎస్‌ జగన్‌ ఒక ప్రకటనలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని.. కురబ లింగమయ్య హత్యే దీనికి నిదర్శనమని అన్నారు.

 

కురుబ లింగమయ్య కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడిన వైఎస్ జగన్

Advertisement
 
Advertisement
Advertisement