-
అరకు అందాలకు గ్రహణం
అల్లూరి జిల్లాకు ప్రాణప్రదమైనది పర్యాటక రంగం. సుందర ప్రకృతి దృశ్యాలతో దేశ విదేశీ టూరిస్టులను ఆకట్టుకునే ప్రదేశాలు మన్యంలో ఉన్నాయి. పర్యాటక ప్రాంతాలను, అక్కడికి వెళ్లే రహదారులను అభివృద్ధి చేస్తేనే కదా.. అవి పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఆ అంశాన్ని నిర్లక్ష్యం చేస్తే.. నిధులు విడుదలైనా పనులు మధ్యలో నిలిపివేస్తే .. ఇక ప్రగతి ఎలా సాధ్యం?అరకులోయ టౌన్: అందాల అరకులోయ ఎన్నో ప్రకృతి దృశ్యాలకు ఆలవాలం. మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్, రణజిల్లెడ వాటర్ ఫాల్స్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ ప్రాంతాలకు వెళ్లే రహదారుల నిర్మాణానికి, మిగతా అభివృద్ధి పనులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేసింది. పనులు కొంత వరకు పూర్తయ్యాయి. ప్రస్తుత కూటమి సర్కారు వాటిని నిర్లక్ష్యం చేయడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్‌కు వెళ్లే 3.75 కిలోమీటర్ల రహదారి, మురుగు కాలువలు, రిటైనింగ్ వాల్స్ నిర్మాణానికి మంజూరైన రూ.11 కోట్లతో పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ శరవేగంగా పనులు చేసుకొచ్చారు. అయితే చేసిన పనులకు సంబంధించి రూ.1.8 కోట్ల బిల్లును కూటమి ప్రభుత్వం చెల్లించకపోవడంతో ప్రస్తుతం పనులు నిలిపివేశారు. అటవీ అనుమతులు లేక 600 మీటర్ల రహదారి నిలిపివేత విశాఖ–అరకు రూట్లో బోసుబెడ గ్రామం నుంచి మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్ వరకు రహదారి నిర్మాణం తలపెట్టారు. సన్‌రైజ్ వ్యూపాయింట్ వద్ద వేస్తున్న రహదారిలో 600 మీటర్ల మేర ఫారెస్టు పరిధిలో ఉందని అటవీ శాఖ అభ్యంతరం తెలిపింది. దీంతో రహదారి నిర్మాణానికి ఆటంకం ఏర్పడింది. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే అరకులోయ మండలంలోని మాడగడ, బస్కీ పంచాయతీలతోపాటు, హుకుంపేట మండలం భూర్జ, అనంతగిరి మండలం పైనంపాడు ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుంది. మిషన్ కనెక్ట్‌లో భాగంగా పాడేరుకు చాలా సులువుగా అతి తక్కువ సమయంలో చేరుకోవచ్చు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే దేశ విదేశాలతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి ఈ ప్రాంత అందాలు తిలకించేందుకు వచ్చే పర్యాటకుల కష్టాలు తీరుతాయి. కూటమి ప్రభుత్వం స్పందించి సకాలంలో బిల్లులు చెల్లించి రహదారి నిర్మాణం పూర్తి చేయాలని గిరిజనులతోపాటు పర్యాటకులు కోరుతున్నారు. అరకులోయ మండలం పద్మాపురం పంచాయతీ రణజిల్లెడ వాటర్ ఫాల్స్ రహదారి పనులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసింది. అప్పట్లోనే రూ.1.8 కోట్ల బిల్లులు చెల్లించారు. ఆ తరువాత చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం 10 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణం మిగిలిపోయింది. బస్కీ రోడ్డు పనులు పూర్తి చేయరూ.. అరకులోయ మండలం మాడగడ పంచాయతీ నందివలస జంక్షన్ నుంచి బస్కీ గ్రామం వరకు 11 కిలోమీటర్ల రహదారి మరమ్మతు, సీసీ రోడ్లు నిర్మాణానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.3 కోట్లు నిధులు మంజూరు చేసింది. రహదారి మెటల్ పరిచి విడిచిపెట్టారు. దీంతో వాహన చోదకులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. చేసిన పనులకు కేవలం రూ.60 లక్షలు మాత్రమే బిల్లులు చెల్లించారు. మిగతా బిల్లు చెల్లించాల్సి ఉంది. రహదారి త్వరితగతిన పూర్తి చేయాలని గిరిజనులు కోరుతున్నారు. ప్రముఖ సందర్శిత ప్రాంతాల అభివృద్ధికి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె.రోజా పెద్ద పీట వేశారు. మాడగడ సన్‌రైజ్ వ్యూ పాయింట్‌కు, రణజిల్లెడ వాటర్ ఫాల్స్ వరకు రహదారి నిర్మాణానికి రూ.16 కోట్లు నిధులు మంజూరు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం పనులు పూర్తి చేసేందుకు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. రోడ్డుపై మెటల్‌తో.. ప్రమాదం నందివలస–బస్కీ రహదారి నిర్మాణ పనులు చేపట్టి అర్ధంతరంగా నిలిపివేశారు. రోడ్డుపై మెటల్ వేసి విడిచిపెట్టడంతో వాహన చోదకులు ప్రమాదాల బారినపడుతున్నారు. నందివలస జంక్షన్ నుంచి బస్కీ పంచాయతీ కేంద్రం వరకు రహదారి మరమ్మతు పనులు, ఇతర పనులు చేపట్టిన కాంట్రాక్టర్ త్వరితగతిన పనులు పూర్తిచేయాలి. ఇందుకు అధికారులు, ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – కిల్లో రామన్న, వైస్ ఎంపీపీ, అరకులోయబిల్లులు చెల్లిస్తే పనులు ప్రారంభిస్తాం మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్ రహదారి నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్‌కు రూ.1.80 కోట్ల బిల్లులు బకాయి ఉంది. దీంతో పనులు నిలిపివేశారు. సన్‌రైజ్ వ్యూపాయింట్ వద్ద సుమారు 600 మీటర్ల మేర అనుమతులు లేక అటవీ అధికారులు పనులు నిలిపి వేశారు. ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తే పనులు మళ్లీ ప్రారంభిస్తాం. – రామమ్, డీఈఈ, పీఆర్ ఇంజినీరింగ్ శాఖ, అరకులోయ -
విదేశీ విద్య రూటు మారుతోంది!
సాక్షి, అమరావతి: విదేశీ విద్యను ఎంపిక చేసుకోవడంలో భారతీయ విద్యార్థుల రూటు మారుతోంది. కెరీర్ పురోగతి ఉన్న దేశాల యూనివర్సిటీల్లోనే చదువుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఉద్యోగ అవకాశాలు మెరుపర్చుకోవడం, అధిక ఆదాయాన్ని ఆర్జించడం వంటి ప్రాథమిక లక్ష్యాలను బేరీజు వేసుకుని విదేశాల్లో విద్యపై నిర్ణయం తీసుకుంటున్నారు. భారతీయ విద్యార్థులు కేరీర్ కేంద్రీకృత విద్యకు ప్రాముఖ్యత ఇస్తున్నట్లు ఇటీవల అంతర్జాతీయ కన్సల్టెన్సీ ‘ఐడీపీ ఎడ్యుకేషన్’ చేసిన అధ్యయనంలో తేలింది. విద్య కోసం విదేశీ గమ్యస్థానాలను ఎంచుకోవడంలో విద్యార్థుల ప్రాధాన్యతలు ఇలా (శాతం).. కెరీర్ పురోగతి 77 ఉద్యోగ నియామకాలు 70 వర్సిటీల ద్వారా కొలువులు 69 స్కాలర్‌షిప్‌ల లభ్యత 55పార్ట్‌టైమ్ ఉద్యోగ అవకాశాలు 54పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత అక్కడే ఉద్యోగం (ప్రస్తుతం చదువుతున్నవారు) 45పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన చోటే ఉద్యోగం (చదువుకు ప్రణాళిక వేస్తున్నవారు) 43ఉద్యోగాలు వచ్చే వర్సిటీల్లోనే చదువు..» 70 శాతం మంది భారతీయ విద్యార్థులు విదేశీ విద్య గమ్యస్థానాన్ని ఎంచుకోనే సమయంలో ఉద్యోగ నియామకాలను కీలకమైన అంశంగా పరిగణిస్తున్నట్టు ‘ఐడీపీ ఎడ్యుకేషన్’ వెల్లడించింది. » కెరీర్ అవకాశాలు పెంచుకోవడానికి అటువంటి అవకాశాలు కల్పించే సంస్థలకే ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపింది. దీనిని దృష్టిలో పెట్టుకుని చాలా విదేశీ సంస్థలు ప్రతిభ గల భారతీయ విద్యార్థులను ఆకర్షించడానికి వివిధ ప్రోగ్రామ్‌లను ఆఫర్ చేస్తున్నాయి. » విశ్వవిద్యాలయాల ఎంపికలోనూ విద్యేతర అంశాలకు భారతీయ విద్యార్థులు ప్రాధాన్యం ఇస్తున్నారు. చదువు ముగిసిన తర్వాత ఎంత మంది ఉద్యోగాల్లో స్థిరపడ్డారనే లెక్కలను పరిగణనలోకి తీసుకుని ప్రవేశాలకు దరఖాస్తు చేస్తున్నారు. ఇలాంటి దృక్పథంలో ప్రపంచ సగటు (60శాతం) కంటే భారత్‌లో తొమ్మిది శాతం (69%) ఎక్కువగా ఉంది. » గతంలో భారతీయుల ఇష్టమైన విదేశీ విద్య గమ్యస్థానంగా ఉన్న అమెరికాను అధిగమించి ఆ్రస్టేలియా అత్యంత ఆదరణ పొందిన ఎంపికగా నిలిచింది. ఆస్ట్రేలియాలో నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరతతోపాటు చదువు పూర్తయిన తర్వాత పని హక్కు కల్పించడం వల్ల ఇతర దేశాలతో పోలిస్తే అక్కడికి వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఆ తర్వాత యూకే రెండో స్థానంలో నిలిచింది. -
పింఛన్.. ‘సాక్షి’ కదిలించెన్..!
టెక్కలి: వారంతా వృద్ధులు.. నెలనెలా అందే పింఛను వైద్య ఖర్చులకో, మందులకో పనికి వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. అలాంటివారికి రెండు నెలలుగా పింఛను పెండింగ్ పెట్టారు.. మే నెలలో అయినా వస్తుందేమోనని ఆశిస్తే నిరాశే ఎదురైంది. వారి బాధను వివరిస్తూ ‘సాక్షి’లో శుక్రవారం కథనం రావడంతో అధికారులు కదిలారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం మాసాహెబ్‌పేట పంచాయతీ కమలనాభపురంలో ఎనిమిది మంది వృద్ధులకు పింఛను పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన 8 మంది వృద్ధులు దువ్వారపు అప్పన్న, కర్రి లక్ష్మణ, రోణంకి సింహాచలం, గురువెల్లి గోపాలరావు, కూన సుగ్రీవులు, మొజ్జాడ సూర్యనారాయణ, బొడ్డేపల్లి ధర్మారావు, నెయ్యిల లక్ష్మీనారాయణకు ఎలాంటి కారణం లేకుండా మార్చి, ఏప్రిల్ నెలల పింఛన్ ఇవ్వలేదు. తాజాగా వీరికి అధికారులు ఒకేసారి మూడు నెలల పింఛన్ అందజేశారు. గ్రామ సర్పంచ్ సంపతిరావు ధనలక్ష్మి, వైఎస్సార్సీపీ నాయకుడు సంపతిరావు హేమసుందర్‌రాజు, గ్రామస్థులు కొందరు బాధితుల తరఫున పోరాటం చేశారు. సమస్యను వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్‌తో కలిసి మండల అధికారులతో పాటు కలెక్టర్, డీఆర్డీఏ పీడీ దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు ఉన్నతాధికారులు స్పందించారు. పింఛన్ జాప్యంపై కమలనాభపురం పంచాయతీ కార్యదర్శి రమేష్, ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శి, వెల్ఫేర్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్‌కు ఉన్నతాధికారులు మెమోలు జారీ చేసినట్లు కోట»ొమ్మాళి ఈవోపీఆర్డీ ఆనందరావు వెల్లడించారు. ఆనందంగా ఉందివరుసగా మూడో నెల కూడా పింఛన్ రాదని భయాందోళన చెందాం. ఇప్పుడు ఒకేసారి డబ్బులు ఇచ్చారు. ఎంతో ఆనందంగా ఉంది. మా లాంటి వారి కోసం సర్పంచ్, నాయకులు, గ్రామస్థులు అండగా నిలిచారు. – నెయ్యిల లక్ష్మీనారాయణ పింఛన్ కోల్పోతామనే భయం ఉండేది రెండు నెలల పాటు పింఛన్ ఇవ్వలేదు. మూడో నెల కూడా ఇవ్వరేమోనని భయం ఉండేది. సాక్షి కథనానికి అధికారులు స్పందించి పింఛన్లు మంజూరు చేయడం మాకు ఎంతో సంతోషం. – బొడ్డేపల్లి ధర్మారావు సర్పంచ్, ఆమె భర్త పోరాడారు మా గ్రామంలో నాతో పాటు 8 మందికి పింఛన్ ఇవ్వడం ఆపేశారు. మా సర్పంచ్ ధనలక్ష్మిమ, ఆమె భర్త హేమసుందర్‌రాజు, మరికొంత మంది మా కోసం ఎంతగానో పోరాటం చేశారు. మా ఆవేదనని సాక్షి వెలుగులోకి తెచి్చంది. చివరకు మాకు పింఛన్ డబ్బులు అందాయి. – మొజ్జాడ సూర్యనారాయణ -
రాష్ట్రంలో అనిశ్చిత వాతావరణం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అనిశ్చిత వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలతో పలు ప్రాంతాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మరో రెండు, మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా ప్రాంతంలో ఎండలతోపాటు వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు రాయలసీమ ప్రాంతంలో ఎండలు మండుతున్నాయి. అనేక ప్రాంతాల్లో 40 నుంచి 43 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం వైఎస్సార్ జిల్లా కమలాపురంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల జిల్లా గుల్లదుర్తిలో 41.7, తిరుపతి జిల్లా వెంకటగిరిలో41.3, కర్నూలు జిల్లా రేవూరులో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. వర్షాలతోపాటు పిడుగులు పడుతుండడంతో ప్రజలు, వ్యవసాయ పనులు చేసుకునేవారు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశి్చమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదే సమయంలో ఉష్ణోగ్రతలు 41 నుంచి 42.5 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. -
పెనుగాలుల బీభత్సం
సాక్షి రాయచోటి/జగ్గయ్యపేట/పలమనేరు/వీరఘట్టం: రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసాయి. ఈ వర్షాలకు మామిడి, అరటి, వరి, మొక్కజొన్న రైతులకు తీరని నష్టం వాటిల్లింది. అన్నమయ్య జిల్లాలో పెనుగాలులు, వర్షం బీభత్సం సృష్టించింది. రాయచోటి నియోజకవర్గంలోని పలు మండలాల్లో మామిడికి అపారనష్టం వాటిల్లగా, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో అరటి పంటకు నష్టం వాటిల్లింది. రాయచోటి నియోజకవర్గ పరి«ధిలోని రామాపురం, లక్కిరెడ్డిపల్లె, సంబేపల్లె, పీలేరు నియోజకవర్గంలోని గుర్రంకొండ మండలంలో మామిడి కాయలు పెద్ద ఎత్తున నేలరాలాయి. రాజంపేట నియోజకవర్గంలోని వీరబల్లి, సిద్దవటం, రైల్వేకోడూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో అరటి, బొప్పాయి పంటకు కూడా నష్టం వాటిల్లింది. వీరబల్లి ప్రాంతంలో మామిడి చెట్లు విరిగి పడ్డాయి. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా 3,500 ఎకరాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. రైతులు కోట్లాది విలువైన పంటను నష్టపోయారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలో దాదాపు 2 గంటల పాటు బలంగా వీచిన గాలులకు షేర్‌మహ్మద్‌పేట, బలుసుపాడు, రామచంద్రునిపేట పంట పొలాల్లోని విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. మామిడి తోటల్లో చెట్లు విరిగిపడ్డాయి. కొన్ని చోట్ల కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న వర్షానికి పూర్తిగా తడిసిపోయింది. షేర్‌మహ్మద్‌పేటలో మూడు రేకుల ఇళ్లకు పైకప్పు లేచిపోయి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి గృహోపకరణాలు దగ్ధమయ్యాయి. 20కి పైగా విద్యుత్ స్తంభాలు పడిపోవటంతో శుక్రవారం సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జగ్గయ్యపేటలోని కోదాడ రోడ్డులో బాక్స్ క్రికెట్ కేంద్రం కుప్పకూలింది. తీగ పంటలకూ అపార నష్టం చిత్తూరు, పలమనేరు మండలాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా భారీ వర్షం కురిసింది. మామిడి, తీగ పంటలు దెబ్బతిన్నాయి. చిత్తూరులోని పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగి పడడంతో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలమనేరు ప్రాంతంలో బీర, కాకర, బీన్సు, అరటి తోటలు దెబ్బతిన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అరటి, మామిడి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. రోడ్లపై చెట్లు కూలడంతో రాకపోకలకు ఆటంకం కలిగింది. వీరఘట్టం ఆర్అండ్బీ బంగ్లా సమీపంలో లెంక మురళీ అనే రైతుకు చెందిన రెండు పాడి ఆవులు పిడుగుపాటుకు గురై మృతి చెందాయి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పల్లెల్లో విద్యుత్‌కు అంతరాయం కలిగింది. అరటి, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. రూ.10 లక్షల మేర విద్యుత్ శాఖకు నష్టం సంభవించింది. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పోలవరం పంచాయతీ కలగట్ల సమీపంలోని పొలాల్లో పిడుగు పడి 20 మేకలు మృతి చెందాయి. ఆముదాలవలసలో 69.5 మి.మీ, శ్రీకాకుళంలో 65, చాగల్లులో 62.2, గిద్దలూరులో 54, కనిగిరిలో 51.2 మి.మీ వర్షపాతం నమోదైంది. కాగా, దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందజేయాలని బాధిత రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
సీహెచ్‌వోలపై ప్రభుత్వం కక్షసాధింపు
సాక్షి, అమరావతి: సమస్యల పరిష్కారం కోసం సమ్మె బాటపట్టిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌వో)లపై కూటమి సర్కారు కాఠిన్యం ప్రదర్శించింది. సమ్మె చేస్తున్న వారికి ఏప్రిల్ నెల వేతనాలను చెల్లించకుండా నిలిపేసింది. నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో పనిచేసే ఉద్యోగులకు శుక్రవారం వేతనాలు చెల్లించారు. ఈ క్రమంలో సమ్మెలో ఉన్న 9వేల మందికి ప్రభుత్వం వేతనాలు జమ చేయలేదని సీహెచ్‌వోలు వెల్లడించారు. వేతనాలు పెంపు, సర్వీస్ రెగ్యులరైజేషన్‌తోపాటు, పలు డిమాండ్లతో గత నెల 16 నుంచి సీహెచ్‌వోలు ఆందోళన బాట పట్టారు. ఇదే నెల 24 నుంచి విధులనూ బహిష్కరించి సమ్మె తీవ్రం చేశారు. దీంతో తిరిగి విధుల్లో చేరకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలో కొందరు తిరిగి విధులకు హాజరయ్యారు. 9 వేల మంది సమ్మె విరమణకు ససేమిరా అన్నారు. వీరందరికీ ఏప్రిల్ నెల వేతనాలు నిలిపేశారని సీహెచ్‌వోల యూనియన్ ప్రతినిధులు తెలిపారు. విధుల్లో కొనసాగుతున్న వారికీ రూ.4వేల చొప్పున వేతనాల్లో కోత విధించారని పేర్కొన్నారు. మరోవైపు సీహెచ్‌వోలు విధులు బహిష్కరించడంతో గ్రామాల్లో వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10,032 విలేజ్ క్లినిక్స్ ఉన్నాయి. వీటిలో వైద్య సేవలు అందించడం కోసం గత ప్రభుత్వం బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత కలిగిన వారిని సీహెచ్‌వోలుగా నియమించింది. వీరంతా సమ్మెలోకి వెళ్లడంతో విలేజ్ క్లినిక్‌లకు తాళాలు పడ్డాయి. ఆరోగ్య కేంద్రాలకు తాళాలు వేయడానికి వీల్లేదని సీహెచ్‌వోల బాధ్యతలను ఏఎన్ఎంలు, ఆశాలకు అప్పగించాలని ప్రభుత్వం డీఎంహెచ్వోలను ఆదేశించింది. క్షేత్ర స్థాయిలో ఇప్పటికే పని భారంతో సతమతమవుతున్న ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలపై ప్రభుత్వం అదనపు భారం మోపింది. అయినా రాష్ట్రంలోని విలేజ్ క్లినిక్‌లు తెరుచుకోక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమ్మెకు వెళతామని కొద్ది వారాల ముందే సీహెచ్‌వోలు నోటీసులు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. తీరా వారు సమ్మెలోకి వెళ్లాక పిలిచి చర్చలు జరిపే యత్నం కూడా చేయలేదు. పైగా నేరుగా వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటంపై వైద్య శాఖ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మరోవైపు సమ్మెకు నేతృత్వం వహిస్తున్న సీహెచ్‌వోల సంఘం ప్రతినిధులపైనా ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఒకరిద్దరిని విధుల నుంచి తొలగించడం ద్వారా మిగిలిన వారిని భయపెట్టాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నట్టు తెలిసింది. -
కేంద్ర నిధులను మింగేద్దాం ‘టీవీ’గా..
అంగన్వాడీ కేంద్రాలకు వస్తువుల కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా మింగేసేందుకు కూటమి కీలక నేతలు పెద్ద స్కెచ్ వేశారు. ‘సాక్షం అంగన్వాడీ పోషన్-2‘ అభియాన్ ద్వారా.. ఆరేళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహార పంపిణీ, వస్తువుల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని అంగన్వాడీల బలోపేతానికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం రూ.100 కోట్లు ఇచ్చింది. ఈ మొత్తంలో రూ.25 కోట్లతో అంగన్వాడీల్లో స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇక్కడే అసలు తంతు మొదలైంది. కేంద్ర నిధుల్లో స్మార్ట్‌గా కమీషన్లు కొట్టేసేందుకు కూటమి నేతలు పథక రచన చేశారు. - సాక్షి, అమరావతి » రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 9,664 సెంటర్లలో కేంద్ర నిధులతో తొలి దశలో స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కొక్క టీవీకి రూ.25 వేల చొప్పున కేటాయించారు. ఇందుకోసం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ (జీఈఎం) పోర్టల్ ద్వారా గత ఏడాది అక్టోబరులో టెండర్ పిలిచారు. » పేరున్న కంపెనీలకు చెందిన 11 సంస్థలు బిడ్స్ దాఖలు చేశాయి. వాటిలో 6 సంస్థలను టెక్నికల్‌గా టెండర్ కమిటీ అనర్హమైనవి (డిస్ క్వాలిఫై) చేసింది. ఇక మిగిలినవారిలో ఎవరికైనా టెండర్ ఖరారు చేశారా? అంటే అదీ లేదు. కారణం చెప్పకుండానే అర్థంతరంగా టెండర్‌ను రద్దు చేశారు. కమీషన్లకు సంబంధించిన డీల్ కుదరకపోవడమే దీనికి కారణమని విశ్వసనీయంగా తెలిసింది. ముందస్తు ఒప్పందాలతో మళ్లీ టెండర్ ప్రక్రియ రెండోసారి అనుకూలమైన కాంట్రాక్ట్ సంస్థలతో కొందరు కీలక నేతలు, అధికారులు కలిసి ముందస్తు ఒప్పందాలతోనే మళ్లీ టెండర్ ప్రక్రియ చేపట్టినట్టు విమర్శలు వస్తున్నాయి. కేంద్రం నిధులు సకాలంలో ఖర్చు చేయకుంటే మురిగిపోతాయనే సాకుతో మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి రూ.25 కోట్లను ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్)కి ఈ ఏడాది ఫిబ్రవరిలో బదిలీ చేశారు. దీన్ని అడ్డుపెట్టుకుని ఏపీటీఎస్ ద్వారా మార్చిలో మళ్లీ టెండర్ ప్రక్రియ చేపట్టారు. ఇదిగో అసలు కథ ముందస్తు ఒప్పందాలతో తమకు నచ్చిన సంస్థలకు టెండర్ కట్టబెట్టేలా నిబంధనలను మార్చేశారు. మొదటి టెండర్ నిబంధనల్లో ప్రస్తావించిన బిడ్స్ దాఖలు చేసే కంపెనీలు డీఎల్ఈడీ, ఈఎల్‌ఈడీ అనేది ఉండాలని, మూడేళ్లలో 9,800 టీవీలు సరఫరా చేసిన అనుభవం ఉండాలని, తాము చెప్పిన ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) మాత్రమే ఉండాలనే తదితర కీలక షరతులను రెండో టెండర్ ప్రక్రియలో లేకుండా చేశారు. దీంతో మొదటి టెండర్ ప్రక్రియలో 11 సంస్థలు బిడ్స్ వేస్తే.. రెండో టెండర్లో మూడు సంస్థలు మాత్రమే బిడ్స్ వేశాయి. ఇదంతా ముందుగా ఎంచుకున్న సంస్థకు లబ్ధి చేకూర్చడానికేనని స్పష్టమవుతోంది. -
దేశాభివృద్ధికి ఏపీని ఇంజన్‌గా చేస్తాం
సాక్షి, అమరావతి : ‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మీ భుజంతో పాటు నా భుజం కలిపి పనిచేస్తా. రాష్ట్రాభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆంధ్రప్రదేశ్ యువకుల కలలను నిజం చేసేందుకు అంకిత భావంతో పనిచేస్తామని హామీ ఇస్తున్నా’ అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అమరావతి పునఃప్రారంభంలో భాగంగా రూ.58 వేల కోట్ల విలువైన పనులకు ప్రధాని శుక్రవారం శంకుస్థాపన చేశారు. వెలగపూడిలోని సచివాలయం వెనుక భాగంలో నిర్వహించిన సభలో ప్రధాని మాట్లాడుతూ తల్లి దుర్గాభవాని కొలువైన పుణ్యభూమిపై మీ అందరినీ కలవడం ఆనందంగా ఉందన్నారు. ‘దాదాపు రూ.60 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం. ఇవి కేవలం కాంక్రీట్ నిర్మాణాలు మాత్రమే కాదు. ఏపీ ఆశలకు, వికసిత్ భారత్ ఆశయాలకు బలమైన పునాది. ఈ సందర్భంగా వీరభద్రస్వామికి, అమరలింగేశ్వరస్వామికి, తిరుపతి వెంకన్న పాదాలకు నమస్కరిస్తూ ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు. ప్రసంగాన్ని తెలుగులోనే ప్రారంభించిన ప్రధాని మోదీ మధ్యలో కొన్ని తెలుగు వాక్యాలు పలికారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. పదేళ్లుగా చేయూతనిచ్చాం... ఇంద్రుడి రాజధాని అమరావతి.. ఏపీ రాజధాని అమరావతి. ప్రతి యువకుడి కలలు నిజమయ్యే నగరంగా అమరావతి తయారవుతోంది. ఐటీ, ఏఐ, గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఇండస్ట్రీస్, విద్య, ఆరోగ్య రంగాల్లో రానున్న రోజుల్లో అమరావతి దేశంలోనే ప్రధాన నగరంగా నిలవబోతోంది. 2015లో అమరావతికి శంకుస్థాపన చేశా. ఈ పదేళ్లలో అమరావతికి అన్ని రకాలుగా సంపూర్ణ మద్దతు ఇచ్చాం. వికసిత్ ఏపీ కోసం నాడు ఎన్టీఆర్ కలగన్నారు. మనందరం కలసి అమరావతి, ఏపీని వికసిత్ భారత్ దేశానికి గ్రోత్ ఇంజన్‌గా తయారు చేయాలి. రైలు, రోడ్డు ప్రాజెక్టులకు రూ.వేల కోట్లు.. రైలు, రోడ్డు ప్రాజెక్టులకు కేంద్రం రూ.వేల కోట్లు అందిస్తోంది. దీనివల్ల ఏపీలో జిల్లాల మధ్య అనుసంధానం, పక్క రాష్ట్రాలతో కనెక్టివిటీ మెరుగుపడుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల తరలింపు, పర్యాటకం పెరిగేందుకు దోహదం చేస్తుంది. రేణిగుంట నుంచి నాయుడుపేట మధ్య నిర్మిస్తున్న కొత్త హైవే వల్ల తిరుపతి వెంకన్నను తక్కువ సమయంలో దర్శించుకోవచ్చు. రైల్వే బడ్జెట్లో ఉమ్మడి రాష్ట్రానికి రూ.900 కోట్లకు మించి కేటాయింపులుండేవి కావు. ఇప్పుడు విభజిత ఏపీకి రూ.9 వేల కోట్లకు పైగా అందిస్తున్నాం. ఏపీలో వంద శాతం ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేసుకున్నాం. 8 సరికొత్త వందేభారత్ రైళ్లు ప్రారంభించాం. 750కిపైగా రైల్వే ఫ్లైఓవర్లు, అండర్ పాసేజ్‌లు నిర్మించాం. 70కిపైగా రైల్వేస్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్ కింద అభివృద్ధి చేశాం. నాలుగు స్తంభాలు కేంద్ర బిందువుగా పేదలు, రైతులు, యువత, మహిళాశక్తి.. ఈ నాలుగు స్తంభాలపై వికసిత్ భారత్ నిర్మాణం ఆధారపడి ఉంటుంది. రైతులపై భారం పడకుండా పదేళ్లలో ఎరువుల సబ్సిడీ కోసం రూ.12 లక్షల కోట్లు ఖర్చు చేశాం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై) ద్వారా ఒక్క ఏపీలోనే సుమారు రూ.5,500 కోట్ల బీమా పరిహారం అందించాం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం (పీఎం కిసాన్) ద్వారా రాష్ట్రంలో రైతులకు రూ.17,500 కోట్ల మేర పెట్టుబడి సాయం అందించాం. పోలవరం ప్రాజెక్టు పూర్తికి సహాయ సహకారాలు అందిస్తాం. నవదుర్గా మిస్సైల్ లాంచ్ కేంద్రం.. అంతరిక్ష శక్తిగా దేశం అవతరించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. శ్రీహరికోట నుంచి లాంచ్ అయ్యే ప్రతీ రాకెట్ కోట్లాది మంది భారతీయులు గర్వించేలా చేస్తుంది. కోట్లాది మంది దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో డీఆర్డీవో నవదుర్గా మిస్సైల్ లాంచింగ్ రేంజ్‌కు శంకుస్థాపన చేశాం. నాగాయలంకలో నిర్మించబోయే ఈ కేంద్రం కనక దుర్గమ్మలా దేశ రక్షణకు నిరంతరం శక్తిని ఇస్తుంది. దేశవ్యాప్తంగా ఏక్తా మాల్స్ నిర్మించబోతున్నాం. ఇందులో ఒకటి విశాఖపట్నంలో నిర్మించేందుకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉంది. దేశవ్యాప్తంగా హస్తకళాకారుల ఉత్పత్తులు ఒకే చోటకు తెచ్చేందుకు వీలుంటుంది.21న విశాఖలో యోగా దినోత్సవం.. జూన్ 21న విశాఖలో నిర్వహించే యోగా దినోత్సవానికి నన్ను ఆహ్వానించడం ఆనందంగా ఉంది. ఆరోజు ప్రపంచ ప్రజలంతా ఏపీ వైపు చూసేలా చేయాలి. అందుకోసం ఈ 50 రోజుల్లో ప్రతి గ్రామం, ప్రతి వీధి, ప్రతి ఇంట్లో యోగాకు ప్రాముఖ్యత కల్పించేలా, వరల్డ్ రికార్డు సాధించేలా కృషి చేయాలి. ఏపీలో కలలు గనే వారి సంఖ్య తక్కువేమీ కాదు. వాటిని నిజం చేసే వారూ తక్కువేమీ లేరు. మూడేళ్లలో అమరావతి పనులు పూర్తి చేస్తామంటున్నారు. అమరావతి పనులు పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ జీడీపీ ఏ స్థాయిలోకి దూసుకెళ్తుందో ఊహించగలను.ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలబెడతాం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్అమరావతి ఆర్కిటెక్చరల్ జోన్‌గా, కాంక్రీట్ జంగిల్‌గా మిగిలిపోకుండా జవాబుదారీతనంతో ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పాలనలో అమరావతి వరల్డ్ క్లాస్ రాజధానిగా ఎదుగుతుందన్నారు. గత ప్రభుత్వం అమరావతి భవిష్యత్తును, ప్రజల ఆకాంక్షలను దివిసీమ ఉప్పెన మాదిరి తుడిచి పెట్టాలని చూసిందని విమర్శించారు. అమరావతితో పాటు రాష్ట్రాభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ప్రపంచంలోనే టాప్ 5 రాజధానుల్లో అమరావతిని నిలబెట్టాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్టు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు.కక్షతో నిలిపేశారు: మంత్రి లోకేశ్ సీఎం చంద్రబాబుపై వ్యక్తిగత కక్షతోనే అమరావతి నిర్మాణాన్ని నిలిపివేశారని మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ విమర్శించారు. గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో ఐదేళ్లు కాలం గడిపేసిందన్నారు. మోదీ శంకుస్థాపన చేసిన రాజధానిని అపే దమ్ము ఎవరికీ లేదన్నారు. నరేంద్ర మోదీ అనే మిస్సైల్ ఉండగా వందల పాకిస్తాన్‌లు వచ్చినా భారత్‌ను ఏమీ చేయలేరన్నారు.మూడేళ్లలో నిర్మిస్తాంమోదీ ఆశీస్సులతోనే అమరావతి పనులు పట్టాలెక్కించాం: సీఎం చంద్రబాబు ప్రపంచంలోనే శక్తిమంతమైన నాయకుడు మోదీ 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాం సాక్షి, అమరావతి: అమరావతి పనులను మూడేళ్లలో పూర్తి చేసి ప్రధాని మోదీ చేతుల మీదుగా కొత్త రాజధానిని ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా అమరావతిని నిర్మించి ప్రపంచ పటంలో నిలబెడతామన్నారు. శుక్రవారం ‘అమరావతి పునః ప్రారంభ’ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 2015లో ప్రధాని మోదీ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే ఆ తర్వాత ప్రభుత్వం విధ్వంసం చేసిందని విమర్శించారుగత పది నెలల్లో కేంద్ర సహకారం, మోదీ ఆశీస్సులతో అమరావతి పనులను పట్టాలెక్కించామన్నారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిని క్వాంటం వ్యాలీ సిటీగా మారుస్తామన్నారు. కేంద్రం సహకారంతో 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో ఐదు కోట్ల ఆంధ్రులు ప్రధాని మోదీకి మద్దతుగా ఉంటారన్నారు. మోదీ నాయకత్వంలో మనదేశం ప్రపంచంలో గొప్ప శక్తిగా ఆవిర్భవిస్తోందన్నారు. -
వైఎస్సార్సీపీ నేతలపై కక్ష
రేణిగుంట/కొలిమిగుండ్ల: వైఎస్సార్సీపీ నేతలపై కక్ష గట్టి నష్టం చేకూర్చిన ఘటనలు తిరుపతి, నంద్యాల జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో వైఎస్సార్సీపీ నేత, సర్పంచ్ చెలికం నాగరాజురెడ్డి తన పొలం (లీజు)లో ఉన్న 100 టన్నుల టేకు కొయ్యలను కట్ చేయించి గ్రామ శివారులో ఉన్న తన స్థలంలో నిల్వ చేశారు. ఇది తెలుసుకున్న కొందరు గురువారం అర్ధరాత్రి వాటికి నిప్పు పెట్టారు. టేకు కలప ఉంచిన ప్రాంతంలో మంటలు ఎగుస్తుండటంతో స్థానికులు గుర్తించి నాగరాజురెడ్డికి సమాచారం ఇచ్చారు.మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా వీలు కాలేదు. అవి పూర్తిగా కాలిపోవడంతో రూ.10 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. గ్రామానికి చెందిన కొందరు అధికార పార్టీ నాయకులు తనను భయభ్రాంతులకు గురిచేసేందుకు తగులబెట్టారని ఆయన మండిపడ్డారు. ఇందుకు కారకులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో ఘటనలో నంద్యాల జిల్లా హనుమంతుగుండంలో వైఎస్సార్సీపీ నేత పాణ్యం ఖాన్బాదర్కు చెందిన పొలానికి కొందరు వ్యక్తులు శుక్రవారం నిప్పు పెట్టారు.గ్రామ సమీపంలోని ఆంజనేయస్వామి గుండం వద్ద ఉన్న ఎకరం పొలంలో పశువుల మేత కోసం గడ్డి సాగు చేశాడు. కొందరు ఉద్దేశ పూర్వకంగా పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో పశుగ్రాసం పూర్తిగా కాలిపోయింది. బోరులో నుంచి తీసి పక్కన పెట్టిన 40 పైపులు దగ్ధమయ్యాయి. నీళ్లు పారించేందుకు ఏర్పాటు చేసిన పది లింక్ పైపులు, స్టార్టర్ బాక్స్, విద్యుత్ తీగ కాలిపోయింది. రూ.3 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఖాన్బాదర్, రమీజాబి దంపతులు కన్నీటిపర్యంతమయ్యారు. పక్కనే ఉన్న గడ్డివామికి కూడా నిప్పంటించి వెళ్లారు. అయితే అదే సమయంలో పొలంలోకి వచ్చిన రమీజాబి గమనించి మంటలను ఆర్పేసింది. బాధితుడు వైఎస్సార్సీపీ తరఫున 2024 ఎన్నికల్లో ఏజెంట్‌గా కూర్చున్నాడు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత డిసెంబర్లో టీడీపీ నాయకులు పట్టుబట్టి ఇతన్ని వీఓఏగా తొలగించారు. భార్య రమీజాబి చాలా ఏళ్లుగా ఉపాధి హామీ పథకంలో మేటీగా పని చేస్తోంది. ఆమెను మేటీగా తొలగించాలని టీడీపీ నేతలు కొద్ది రోజులుగా ఒత్తిడి చేస్తున్నారు. ఎలాగైనా తమను ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతో టీడీపీ నాయకులే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని ఖాన్బాదర్ దంపతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కొలిమిగుండ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.పాలన మరచి పగబట్టారు : ఎంపీ గురుమూర్తి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, పాలనను మరచి కేవలం వైఎస్సార్సీపీ నాయకులు, సానుభూతిపరులే లక్ష్యంగా విధ్వంసం సృష్టిస్తోందని తిరుపతి ఎంపీ గురుమూర్తి మండిపడ్డారు. ఇనగలూరు సర్పంచ్ చెలికం నాగరాజురెడ్డికి చెందిన టేకు కొయ్యలకు నిప్పంటించిన ప్రాంతాన్ని శుక్రవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. బాధితుడు నాగరాజు రెడ్డికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మరచి, రెడ్ బుక్ రాజ్యాంగ పాలనను అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధితునికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
ప్రధాని సభలో భో‘జనం పాట్లు’
సాక్షి ప్రతినిధి, గుంటూరు, తాడికొండ/ మంగళగిరి: ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన ఏర్పాట్లలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. సమావేశానికి తప్పకుండా రావాల్సిందేనని, లేదంటే రుణాలు, ఇతర పథకాలు మంజూరు కావంటూ భయపెట్టి ప్రజలను తీసుకొచ్చినా.. వారికి కనీస ఏర్పాట్లు చేయలేకపోయారు. ఇంటింటికీ ఆహ్వానం పలికిన అమరావతి రైతులకు కూడా అడుగడుగునా అవమానాలే ఎదురయ్యాయి. ఆహ్వాన పత్రిక ఉంటే చాలని చెప్పినా, వారిని ప్రతిచోట పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై రైతులు అసంతృప్తి వెళ్లబుచ్చారు. వాహనాలను మూడు కి.మీ దూరంలోనే నిలిపివేయడంతో మండే ఎండలో అక్కడినుంచి రావడానికి మహిళలు ఇబ్బందిపడ్డారు. వారికి ఇచ్చిన భోజనం ఉదయాన్నే ప్యాక్ చేసినది కావడంతో పాచి వాసన వస్తోందని మహిళలు తినకుండా పక్కన పడేశారు. రాజధానిలోని 29 గ్రామాల ప్రజలు మినహా పరిసర ప్రాంతాల నుంచి జన సమీకరణను టీడీపీ క్యాడర్ పట్టించుకోలేదు. రెండో దశ పూలింగ్ పేరుతో చంద్రబాబు మీడియాకు లీకులిస్తుండటం.. రాజధాని రైతులకు న్యాయం చేయకుండా మళ్లీ తమ భూములు ఎక్కడ లాక్కుంటారో అనే ఆందోళనతో ఈ ప్రాంత టీడీపీ క్యాడర్ డుమ్మా కొట్టారు. » పోలీసులు అన్ని మార్గాల నుంచి జనాన్ని వదిలినా సభా ప్రాంగణ పరిసరాల్లో కూడా పెద్ద సంఖ్యలో కనిపించలేదు. » రాజధాని పరిసర ప్రాంతాల నుంచి డ్వాక్రా మహిళలు భారీగా తరలిరావాలని హుకుం జారీ చేసినా, అధికారులు ఎంత ప్రయత్నించినా జనం కదలలేదు. » ప్లాస్టిక్ బిర్యానీ డబ్బాలో స్వస్తిక్ కంపెనీకి చెందిన చిన్నపాటి పచ్చడి ప్యాకెట్లు దర్శనమివ్వగా, కొన్నింటిలో ఉడికీ ఉడకని గోంగూర వేసి ఇవ్వడంతో ఆగ్రహంతో మహిళలు, టీడీపీ క్యాడర్ రోడ్ల వెంట పారేశారు. అమరావతి రైతులకు మళ్లీ అవమానం ప్రధాని సభకు ఉత్సాహంగా వెళ్తున్న అమరావతి రైతులు మహిళలకు ఎప్పటిలాగే తీరని అన్యాయం జరిగింది. ఆహ్వాన పత్రమే వీఐపీ పాస్ కంటే ఎక్కువ అంటూ పంచినా, నిన్న మొన్నటివరకు ఇంటింటికీ తిరిగి చెప్పిన నాయకులు, ప్రజాప్రతిని«ధులు వారిని గాలికొదిలేశారు. » అమరావతి రైతులను వీఐపీ మార్గాల్లోకి అనుమతించకుండా పోలీసులు నెట్టివేశారు. మీరు ఇటువైపు కాదు తిరిగి రావాలనడంతో మహిళలు, రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మి వేలాది ఎకరాల భూములిచ్చిన మాకు సభకు వెళ్ళాలంటే ఇన్ని ఆంక్షలు ఎందుకని పలువురు కంటతడి పెట్టారు. ఆహ్వాన పత్రం చూపించినా నెట్టేయడం చాలా బాధించిందన్నారు. » దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి కాజ టోల్గేట్ సమీపంలో దశావతారం దేవాలయం పక్కనే ట్రాన్సిట్ పాయింట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ పోలీసులు, రెవెన్యూ అధికారుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. ట్రాన్సిట్ పాయింట్ ముందే కంతేరు అడ్డరోడ్డుకు కొన్ని వాహనాలు తరలించడంతో ప్రజలు భోజనం లేక అవస్థలు పడ్డారు. కనీసం తాగునీరు కూడా అందలేదు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ టోల్‌గేటు వద్ద నుంచి చినకాకాని వరకు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వందలకొద్దీ బస్సులు ఒకేసారి టోల్‌గేటు వద్దకు రావడం, ఒకదానివెంట ఒకటి వెళ్లి ఆహార కేంద్రాల వద్ద ఆగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. -
దాతృత్వంలో పెద్ద చెయ్యే..
సాక్షి, స్పెషల్ డెస్క్: కార్పొరేట్ సామా జిక బాధ్యత (సీఎస్ఆర్)లో భాగంగా కంపెనీలు తమ దాతృత్వాన్ని చాటు కుంటున్నాయి. కంపెనీలు ఏటా ఇందుకోసం వెచ్చిస్తున్న మొత్తం క్రమంగా పెరుగుతోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2022–23లో దేశ వ్యాప్తంగా 24,392 సంస్థలు సీఎస్ఆర్ కార్యక్రమాలకు రూ.29,987 కోట్లు ఖర్చు చేశాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 12.8% ఎక్కువ. ఈ కంపెనీలు దేశ వ్యాప్తంగా మొత్తం 51,966 ప్రాజెక్టులు చేప ట్టాయి. 2021–22లో 19,888 కంపెనీలు రూ.26,580 కోట్లు ఖర్చు చేశాయి. అయితే 2022– 23లో 55.6% కంపెనీలు నిర్దేశిత మొత్తాన్ని మించి వ్యయం చేసిదాతృత్వంలో తమది పెద్ద చేయి అనిపించుకున్నాయి. సామాజిక బాధ్యతగా పేదవారి చదువుకే సంస్థలు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. పెద్ద చేయి విస్తరిస్తోంది..2022–23లో మొత్తం సీఎస్ఆర్ ఫండింగ్‌లో ప్రైవేటు సంస్థల వాటా ఏకంగా 86%. 13,571 కంపెనీలు నిర్దే శిత మొత్తం కంటే ఎక్కువగా వెచ్చించడం విశేషం. 2017– 18లో ఇటువంటి కంపెనీల సంఖ్య 4,945 మాత్రమే. నిర్దేశిత మొత్తాన్ని మించి సీఎస్ఆర్కు విరివిగా ఖర్చు చేస్తున్న టాప్– 10 సంస్థల్లో రిల యన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ, టాటా స్టీల్, ఐఓసీఎల్, మహానది కోల్‌ఫీల్డ్స్, గెయిల్ ఇండియా, విప్రో, ఎన్టీపీసీ, వేదాంత, మారుతీ సుజుకీ ఇండియా ముందున్నా యి. నిర్దేశిత మొత్తం వ్యయం చేసిన కంపెనీలు 1,622. ఇక, రూపాయి కూడా విదిలించని కంపెనీల సంఖ్య 11,748 నుంచి 810కి దిగిరావడం శుభపరిణామం. సంస్థలు ఆర్జిస్తున్న లాభాల్లో మెరుగైన వృద్ధి సీఎస్ఆర్ నిధుల పెరుగుదలకు దోహదం చేస్తోంది. ఇక సీఎస్ఆర్లో భాగంగా 2022–23లో మూడు సంస్థలు రూ.500 కోట్లకుపైగా ఖర్చు చేశాయి. 37 కంపెనీలు రూ.100–500 కోట్లు, 337 సంస్థలు రూ.10–100 కోట్లు వెచ్చించాయి. కంపెనీలు పేదల విద్య కోసం అత్యధికంగా రూ.10,086 కోట్లు వెచ్చించాయి. ఆరోగ్య సంరక్షణకు రూ.6,830 కోట్లు ఖర్చు చేశాయి.ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీలు..అన్లిస్టెడ్తో పోలిస్తే లిస్టెడ్ కంపెనీలే సీఎస్ఆర్లో ముందంజలో ఉన్నాయి. నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్‌లో (ఎన్ఎస్ఈ) నమోదైన 1,394 సంస్థలు 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేసిన మొత్తం రూ.17,967 కోట్లు. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఈ మొత్తం 15.7%అధికం. వీటిలో 66 ప్రభుత్వ సంస్థలు చేసిన వ్యయాలు అంత క్రితం ఏడా దితో పోలిస్తే 19% ఎగసి రూ.3,717 కోట్లకు చేరాయి. 2022–23లో 56 ప్రభుత్వ కంపెనీలు రూ.3,136 కోట్లు వెచ్చించాయి. 544 సంస్థలు విద్య కోసం రూ.1,104 కోట్లు ఖర్చు పెట్టాయి. ఆ తర్వాత ఆహారం, పేదరిక నిర్మూ లన, ఆరోగ్యం కోసం రూ.720 కోట్లు ఖర్చు పెట్టాయి. సీఎస్ఆర్ చట్టం ఏం చెబుతోందంటే..2014 ఏప్రిల్‌లో అమలులోకి వచ్చిన కార్పొరేట్ సామాజిక బాధ్యత చట్టం ప్రకారం ఒక కంపెనీ రూ.500 కోట్ల విలువ కలిగి.. రూ.1,000 కోట్ల ఆదా యం లేదా రూ.5 కోట్ల నికరలాభం గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జిస్తే.. అంత క్రితం మూడు ఆర్థిక సంవత్సరాల్లో పొందిన లాభాల్లో సగటు మొత్తంపై 2% తప్పనిసరిగా సీఎస్ఆర్ కార్యక్రమాలకు వెచ్చించాలి. -
మరణించింది టైగర్ 123
నిర్ధారించిన అటవీశాఖ నాడు ఉచ్చుకు చిక్కి.. నేడు అర్ధంతరంగా మృతిచెందిన పెద్దపులి నంద్యాల జిల్లా, ఆత్మకూరు అటవీ డివిజన్ ముసలిమడుగు సెక్షన్లో ఇటీవల కుళ్లిపోయిన స్థితిలో కనిపించిన పెద్దపులిది తొలుత సహజ మరణమని అధికారులు భావించారు. అయితే పులి చర్మంపై ఉన్న చారల ఆధారంగా శ్రీశైలం బయో లాబ్‌లో పరిశీలించగా అది టి123(ఎఫ్)గా నిర్ధారించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నాలుగేళ్ల వయసున్న ఈ ఆడపులి గతేడాది వేటగాళ్ల ఉచ్చులోపడి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న విషయం తెలిసిందే. - ఆత్మకూరు రూరల్టైగర్ 123కి ఏం జరిగిందంటే పూర్తి ఆరోగ్యంగా ఉన్న ఈ టి123 ఆడపులి హఠాత్తుగా మరణించడం వెనక ఏడాది క్రితం ఉచ్చుకు బిగుసుకుని తప్పించుకున్న ప్రభావమేనని భావిస్తున్నారు. అప్పట్లో ఉచ్చు నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఈ ఆడపులి నడుముకు ఉచ్చుకు సంబంధించిన ఇనుప తీగ ఉన్నట్టు ఇన్ఫ్రారెడ్ కెమెరాల్లో గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అటవీ అధికారులు పులిని ట్రాంక్విలైజర్ గన్‌తో అపస్మారక స్థితిలోకి చేర్చి, ఆ తీగను తొలగించారు. వన్యప్రాణి వైద్యులు చికిత్స చేసి, పూర్తిగా నయమైన తర్వాత అడవిలో వదిలిపెట్టారు. అదే పులి సంవత్సరం తరువాత చనిపోవడం వెనుక నాటి ఉచ్చు గాయమే కారణమని తెలుస్తోంది. గాయం పైపైన నయమైనప్పటికీ అంతర్గత అవయవాలైన గర్భాశయం(గర్భ సంచి), కాలేయం వంటి వాటికి ఇన్ఫెక్షన్ సోకి అది క్రమేపి విస్తరించి పులి మరణానికి కారణమైనట్లు భావిస్తున్నారు.మరణాన్ని ముందే ఊహించే పులి పెద్దపులి జీవనశైలిలో ప్రత్యేకత ఏంటంటే... అది తన మరణాన్ని ముందే ఊహించడం. వృద్ధాప్యంలో వేటాడలేని స్థితిలో కొండ అంచుకు చేరుకుంటుంది. అక్కడ ఏ ఇతర జంతువులు గమనించలేని ప్రదేశంలో విశ్రమించి మరణం కోసం వేచి చూస్తూ... అలాగే మరణిస్తుంది. మరణించిన పులి కళేబరం ఎవరి కంటా పడకపోవడానికి కారణం అదే. ఈ కోవలోనే టి123 పులి కూడా తన చావు సమీపించే కొద్దీ ఒంటరి ప్రదేశానికి వెళ్లి తనువు చాలించినట్లుగా అనుమానిస్తున్నారు. అది ఎవరి కంటాపడని ప్రదేశం కాబట్టే చనిపోయిన 20 రోజులకు గానీ గుర్తించలేక పోయారని సమాచారం. -
అరెస్ట్ నుంచి రక్షణ కల్పించండి
సాక్షి, అమరావతి: మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన అక్రమ కేసులో అరెస్ట్ నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ అప్పటి సీఎంవో కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతీ సిమెంట్స్‌కు చెందిన బాలాజీ గోవిందప్ప సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు శుక్రవారం అత్యవసరంగా మూడు స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరపాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. కాగా, తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలు ఇప్పటికే హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. వీటిపై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు వికాస్‌సింగ్, నాగముత్తు కోరారు. ఈ లోపు ఏసీబీ అరెస్ట్ చేస్తే తాము దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లు నిరర్థకం అవుతాయని తెలిపారు.అయితే, ఏసీబీ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు స్పష్టం చేశారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించారు. తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ధనుంజయరెడ్డి తదితరులు అత్యవసరంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కనీస స్థాయిలో కూడా మా వాదన వినలేదుఅరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించడాన్ని తమ వ్యాజ్యాల్లో ధనుంజయరెడ్డి తదితరులు ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో తమ వ్యక్తిగత స్వేచ్ఛ ముడిపడి ఉందని, న్యాయస్థానాలు ఎప్పుడూ కూడా పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు ఎంతో ప్రాధాన్యతనిస్తాయని తమ పిటిషన్లలో పేర్కొన్నారు. హైకోర్టు తీరు తమ హక్కులను కాలరాసే విధంగా ఉందన్నారు. అరెస్ట్ విషయంలో తమ ఆందోళనను హైకోర్టు కనీస స్థాయిలో పట్టించుకోలేదని, తమ సీనియర్ న్యాయవాదులకు వాదన వినిపించే అవకాశం కూడా ఇవ్వలేదని చెప్పారు. ముందస్తు బెయిల్ మంజూరు అంశాన్ని కనీస స్థాయిలోనూ పరిశీలించకపోవడం, వాదన వినిపించే అవకాశం ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. వాస్తవానికి ఏసీబీకి ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసే అధికారం హైకోర్టుకు ఉందన్నారు. గుర్భక్ష్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని తెలిపారు. అరెస్ట్ విషయంలో ఆందోళన ఉన్నప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చునని సుప్రీంకోర్టే చెప్పిందన్నారు. మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో ఏసీబీ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టుల్లో తమను కుట్రదారులుగా పేర్కొందని, ఆ ఆరోపణలన్నీ నిరాధారమని ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి తమ వ్యాజ్యాల్లో వివరించారు.మద్యం కొనుగోళ్లతో మాకేం సంబంధం లేదుమద్యం కొనుగోళ్లతో తమకు ఎలాంటి సంబంధం లేదని ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి వివరించారు. ఇదంతా పూర్తిగా ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలోనిదని తెలిపారు. తాము కుట్రదారులని చెప్పేందుకు ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఇదే వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇప్పటికే ఎంపీ మిథున్‌రెడ్డికి అరెస్ట్ నుంచి రక్షణ కల్పించిందని పేర్కొన్నారు. మద్యం కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు జరగలేదని కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఇప్పటికే తేల్చి చెప్పిన సంగతిని గుర్తుచేశారు. అయినా కూడా తమపై ఆరోపణలు చేయడం వేధింపుల్లో భాగమేనని పేర్కొన్నారు. మద్యం కొనుగోళ్లలో తమ పాత్ర ఉందన్న ఆరోపణలకు ఆధారాలుంటే అవి ఏసీబీ వద్దే ఉంటాయని, అలాంటప్పుడు తాము ఆధారాలను ఎలా తారుమారు చేయగలమని వారు ప్రశ్నించారు. ప్రజల్లో తమ స్థాయిని తగ్గించి, అవమానించాలన్న ఉద్దేశంతోనే ఏసీబీ అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును కోరారు. -
ఏపీ సీఐడీ పరిధి సంగతి తేలుస్తాం
సాక్షి, అమరావతి: ఏపీ సీఐడీ పరిధి సంగతిని తేలుస్తామని, సీఐడీ కూడా చట్ట నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని పేర్కొంది. మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో విచారణకు హాజరు కావాలంటూ బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 179 కింద ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు తనకు నోటీసులు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ రాజ్ కేసిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.సీఐడీ నోటీసుల్లో జోక్యానికి నిరాకరిస్తూ హైకోర్టు గత నెల 4న ఇచ్చిన ఉత్తర్వులపై స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్ ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, సీఐడీ స్టేషన్ హౌజ్ ఆఫీసర్, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారి, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది.తెలంగాణ పరిధిలో జోక్యం చేసుకునే అధికారం ఏపీ సీఐడీకి లేదుఅంతకుముందు రాజ్ కేసిరెడ్డి తరఫు న్యాయవాది శ్రీహర్ష పీచర వాదనలు వినిపించారు. రాజ్ హైదరాబాద్‌లో నివాసం ఉంటారని, అందువల్ల ఆయనకు నోటీసులు జారీ చేసే పరిధి ఏపీ సీఐడీకి లేదని వివరించారు. ఒక రాష్ట్రం తన పరిధిలోని ప్రాంతాలకు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రమే కలగజేసుకునే వీలుంటుందని తెలిపారు. తాము సీఐడీ నోటీసులను సవాలు చేస్తూ మొదట ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశామని, అయితే ఏపీ సీఐడీ పరిధిలోకి తెలంగాణ రాష్ట్రం వస్తుందంటూ 2022లో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా తమ పిటిషన్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించిందని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ సీఐడీలకు ఇరు రాష్ట్రాలు కూడా ఒకదానికొకటి పొరుగు పోలీస్ స్టేషన్లు అవుతాయన్న తీర్పు ఇవ్వడం ద్వారా హైకోర్టు పొరపాటు చేసిందని వివరించారు. సీఐడీ పరిధి విషయంలో హైకోర్టు చెప్పిన భాష్యం వల్ల సెక్షన్ 179 నిరర్థకం అవుతోందన్నారు. హైకోర్టు తీర్పుతో ఏపీ సీఐడీకి అపరిమిత అధికారులు దఖలు పడ్డాయన్నారు. దీంతో పొరుగు రాష్ట్రంలోని వారికి సైతం నోటీసులు ఇచ్చే అధికారం సీఐడీకి కలిగిందని తెలిపారు. అందులో భాగంగానే పిటిషనర్ రాజ్ కేసిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చిందని అన్నారు. కేవలం రాజకీయ కారణాలతోనే పిటిషనర్‌ను తప్పుడు కేసులో ఇరికించినట్లు చెప్పారు.ఇప్పటికే అరెస్ట్ చేశారు.. ఈ వ్యాజ్యం నిరర్థకంరాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, సీఐడీ పరిధి విషయంలో ఏపీ హైకోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చిందని.. పిటిషనర్‌ను సీఐడీ ఇప్పటికే అరెస్ట్ చేసిందని తెలిపారు. కాబట్టి నోటీసులను సవాలు చేస్తూ దాఖలు చేసిన ఈ వ్యాజ్యం నిరర్థకం అవుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఐడీ పరిధిని తేలుస్తాం అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సీఐడీ స్టేషన్ హౌజ్ ఆఫీసర్, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు అధికారి, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది. మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోరుతూ ఎంపీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంతో కలిపి ఈ వ్యాజ్యాన్ని విచారిస్తామని తెలిపింది. -
నోటి మాటతో గోడ కట్టారు
సాక్షి, విశాఖపట్నం: ఏకంగా ఐదుగురు మంత్రులు స్వయంగా పర్యవేక్షించినా సింహగిరిపై ఏడుగురు భక్తుల ప్రాణాలు బలై పోయిన నేపథ్యంలో తన దారుణ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు కూటమి సర్కారు అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో ప్రజల దృష్టి మళ్లించేందుకు గోడ నిర్మాణంలో వైదిక నియమాల ఉల్లంఘన జరిగిందా? ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా చేపట్టారా? అనే అంశాలను తాజాగా తెరపైకి తెచ్చింది. ఇంజనీర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని దేవదాయ – పర్యాటక శాఖల మధ్య సమన్వయం లోపించిందంటూ పక్కదారి పట్టించే ఎత్తుగడలకు తెర తీసింది. మంత్రుల పర్యవేక్షణలోనూ ఇంత దారుణం జరగడం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టంగా తెలుస్తున్నా మభ్యపుచ్చే యత్నాలు చేయడంపై సర్వత్రా విభ్రాంతి వ్యక్తమవుతోంది. సింహాచలంలో భక్తుల మృత్యువాతపై రెండు రోజుల పాటు విచారణ జరిపిన త్రిసభ్య కమిషన్ శనివారం సాయంత్రం ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. తొలిరోజు కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, ఈవో, ఏఈవో, దేవస్థానం అధికారులను విచారించగా రెండోరోజు సర్క్యూట్ హౌస్‌లో విచారణ జరిపారు. నోటిమాటతో గోడ కట్టారని.. ఎలాంటి డిజైన్, అనుమతులు లేవని ప్రాథమికంగా తేలినట్లు కమిషన్ సభ్యులు చెప్పారు. సింహాచలంలో చందనోత్సవం సందర్భంగా గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందిన ఘటనపై సురేష్ కుమార్ చైర్మన్‌గా, సభ్యులు ఆకె రవికృష్ణ, వెంకటేశ్వరరావులతో ప్రభుత్వం విచారణ కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే. మాస్టర్‌ప్లాన్‌కు సంబంధించిన మ్యాప్‌లు, డ్రాఫ్ట్ కాపీలను కమిషన్ సేకరించింది. గోడ నిర్మాణం చేపట్టొద్దని ముందుగానే అధికారుల్ని హెచ్చరించామని దేవస్థానం అర్చకులు, వైదిక పండితులు పేర్కొన్నట్లు సమాచారం. కలెక్టర్ హరేంధిరప్రసాద్, విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ విచారణకు హాజరై తాము సేకరించిన వివరాలను కమిషన్‌కు అందించారు. ఇంజనీర్ల నిర్లక్ష్యమే ప్రమాదానికి ప్రధాన కారణమని సీపీ తన నివేదికలో స్పష్టం చేసినట్లు సమాచారం. ఏప్రిల్ 29, 30వ తేదీలకు సంబంధించిన ఆలయ ప్రాంగణంలో సీసీటీవీ ఫుటేజీని స్వాదీనం చేసుకున్నట్లు తెలిసింది. విచారణ అనంతరం కమిషన్ చైర్మన్ సురేష్ కుమార్ మీడియాతో శుక్రవారం మాట్లాడారు. ‘శనివారం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పిస్తాం. పూర్తిస్థాయి నివేదికకు నెల సమయం ఉన్నందున మరికొంత మందిని విచారిస్తాం. మాస్టర్‌ప్లాన్‌కు విరుద్ధంగా కొన్ని పనులు జరిగినట్లు మా దృష్టికి వచ్చాయి. ఎవరి ఆమోదంతో మార్పులు చేశారో తెలియాల్సి ఉంది. గోడ నిర్మాణ పనులకు ఎలాంటి అనుమతులు లేవు. ఎవరు అనుమతి ఇచ్చారు? స్ట్రక్చరల్ డిజైన్లు, మెటీరియల్‌కు సంబంధించి ఒక్క రికార్డు కూడా లేదు. కేవలం నోటిమాట ద్వారానే గోడని నిర్మించినట్లు ప్రాథమికంగా నిర్థారించాం. ‘ప్రసాద్’ పథకం కింద మంజూరైన పనులు 2024 ఆగస్ట్ నాటికే పూర్తి కావాలి. ఆలస్యంపై దేవస్థానం, టూరిజం అధికారులు వేర్వేరు కారణాలు చెబుతున్నారు. శాఖల మధ్య సమన్వయ లోపం ఉంది..’ అని కమిషన్ చైర్మన్ పేర్కొన్నారు. -
వర్షం ఉధృతికే కూలింది!
సాక్షి, అమరావతి: సింహగిరిలో భక్తుల మృతి ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి, ఇతర మంత్రులు ప్రచారం చేసిన అంశాలతోనే నివేదిక సిద్ధమైంది! చందనోత్సవం ఏర్పాట్లను ఏకంగా ఐదుగురు మంత్రులు స్వయంగా పర్యవేక్షించినప్పటికీ ఈ విషాదం చోటు చేసుకోగా ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ నివేదికను సిద్ధం చేయించింది. వర్షం ఉధృతికి గోడ కూలిపోయిన కారణంగా భక్తులు మరణించినట్లు దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ మూడు పేజీల ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. సింహాచలంలో ఎలాంటి కాలమ్స్ లేకుండా కేవలం ఫ్లైయాష్‌తో అంత పెద్ద గోడ నిర్మాణాన్ని ఆదరాబాదరాగా చేపట్టడంతో అది కుప్పకూలి ఏడుగురు భక్తులు సజీవ సమాధి కావడం తెలిసిందే. తిరుపతి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తొక్కిసలాట చోటు చేసుకుని ఆరుగురు భక్తులు మృత్యువాత పడితే తన వైఫల్యాలను దాచిపెట్టేందుకు ఆపసోపాలు పడ్డ కూటమి సర్కారు సింహాచలంలో మాత్రం బహిరంగ విచారణ పేరుతో నాటకాన్ని రక్తి కట్టించి కాంట్రాక్టర్, ఉద్యోగులను బలి పశువులుగా మార్చి తప్పించుకునే యత్నాలు చేస్తోంది. సాక్షాత్తూ మంత్రుల పర్యవేక్షణలోనే ఇంత దారుణం జరిగిందంటే ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని ఇంజనీరింగ్ నిపుణులు, పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఏప్రిల్ 19న మౌఖిక ఆదేశాలు.. తర్వాత గోడ నిర్మాణం నూతన మెట్ల మార్గాన్ని గతంలో ఉన్నట్లు కాకుండా ప్లాన్ మార్చి ‘వై’ ఆకారంలో నిర్మాణం చేశారని, దీంతో గతంలో మెట్లు ప్రారంభమైన ప్రదేశంలో కూలిన గోడ నిర్మాణం చేపట్టినట్లు దేవదాయ శాఖ కమిషనర్ నివేదికలో పేర్కొన్నారు. గోడకు దిగువన రెండు వైపులా మెట్లు ఉన్నాయని, చందనోత్సవం సందర్భంగా మెట్ల గుండా ఒక వరుస క్యూలైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మెట్లు, గోడను ఈవో సూచనల ప్రకారం నిర్మించినట్లు తెలిసిందన్నారు. కాగా దుర్ఘటనకు కారణమైన గోడకు సంబంధించి ఏప్రిల్ 19వ తేదీన దేవదాయ శాఖ అధికారుల వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చ జరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. చందనోత్సవం సమీపించినా గోడ నిర్మాణం చేపట్టకపోవడంపై దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలోని ముఖ్య అధికారి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. చందనోత్సవం నాటికల్లా నిర్మాణం పూర్తి చేయాలని ఆలయ ఇంజనీరింగ్ అధికారులకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. దీంతో కూలిన గోడ ఏప్రిల్ 19వ తేదీ తర్వాతే నిర్మాణం జరిగినట్లు స్పష్టంగా వెల్లడవుతోంది. హడావుడిగా ఫ్లైయాష్ తో గోడ కట్టేసి కనీసం నాణ్యత పరిశీలించకుండా పక్కనే భక్తుల క్యూలైన్ ఏర్పాటు చేయడంతో విషాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు వర్షం కారణంగానే గోడ కూలిందంటూ దుర్ఘటన జరిగిన రోజే ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. -
దీనికి పేటెంట్ వారిదేనట! ‘‘రాహుల్ గాంధీ కులగణన’’ అని పేరు పెట్టమంటున్నారు!
దీనికి పేటెంట్ వారిదేనట! ‘‘రాహుల్ గాంధీ కులగణన’’ అని పేరు పెట్టమంటున్నారు! -
అప్పన్న సన్నిధిలో అపచారం!
శ్రీమహావిష్ణువు వరాహ లక్ష్మీ నృసింహస్వామి రూపంలో వెలిశాడని లక్షలాదిమంది భక్తులు విశ్వ సించే సింహాచల క్షేత్రం గురించి తెలియని వారెవరూ లేరు. ఏటా గంధం అమావాస్య తర్వాత వచ్చే అక్షయ తృతీయనాడు ఎంతో వేడుకగా జరిగే చందనోత్సవం సందర్భంగా భక్తజనం పోటెత్తుతారు. భక్తుల విశ్వాసాలతో అంతగా ముడిపడి వుండే ఈ చందనోత్సవ సమయంలో చిన్న దుర్ఘటనైనా చోటుచేసుకున్న ఉదంతం ఆలయ చరిత్రలో లేదు. అలాంటిచోట కళ్లుమూసుకుపోయిన పాలకుల సాక్షిగా అపచారం జరిగిపోయింది. కొత్తగా నిర్మించిన గోడ కూలి బుధవారం వేకువజామున ఏడు గురు భక్తులు మరణించటం అందరినీ కలచివేసింది. అసలు చందనోత్సవంనాడు అడుగడుగునా చోటుచేసుకున్న అరాచకం గమనిస్తేనే ఈ ప్రభుత్వానికి పవిత్రోత్సవాలపై భక్తిశ్రద్ధల మాటఅటుంచి ఏదైనా అనుకోనిది సంభవిస్తుందేమోనన్న భయం కూడా లేదని అందరికీ అర్థమైంది. వీఐపీ టిక్కెట్లు, పాస్‌లు పంచుకోవటానికి పెట్టిన శ్రద్ధలో వెయ్యోవంతైనా భక్తులకు సౌకర్యాల కల్పనలో, వారి భద్రతకు చర్యలు తీసుకోవటంలో లేవు. ప్రమాదాలు చెప్పి రావు. అందుకేముందస్తు ఏర్పాట్లు చేసుకుంటారు. అంబులెన్స్‌లు, పారా మెడికల్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్బృందాలు అందుబాటులో ఉంచుతారు. కానీ విషాదం సంభవించిన క్షణాల్లో బాధితులది అరణ్య రోదనే అయింది. ప్రమాదంలో చిక్కుకున్నవారూ, ఇతరులూ ఆర్తనాదాలు చేస్తుండగా అరగంటకు అధికారులు వచ్చారు. ప్రయోజనం ఏముంది? 3.05 గంటలకు ప్రమాదం జరిగితే ఆ తర్వా తెప్పుడో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అడుగుపెట్టారు. ముందస్తు ఏర్పాట్లుంటే ఆ ఏడుగురూ... లేదా కనీసం వారిలో కొందరైనా ప్రాణాలతో బయటపడేవారు. వెనక్కి తిరిగిచూస్తే ఈ తరహా విషాద ఉదంతాలు ఆయన అధికారం వెలగబెట్టే సమయంలో ఎన్నో జరిగాయని తెలుస్తుంది. 2015లో రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కరాల ప్రారంభంనాడే తీవ్ర తొక్కిసలాట జరిగి 29 మంది భక్తులు ప్రాణాలు కోల్పోవటం ఎవరూ మరిచిపోలేరు. చిన్నపిల్లలూ, వృద్ధులూ తెల్లారుజామున 4 గంటలనుంచి స్నానాల కోసం నిరీక్షిస్తుండగా చంద్ర బాబు సకుటుంబ సమేతంగా ఉదయం 8.30కు స్నానాదికాలు ముగించుకుని నిష్క్రమించేవరకూ ఎవరినీ అనుమతించలేదు. తర్వాత హఠాత్తుగా స్నానఘట్టానికున్న ఏకైక ప్రవేశ ద్వారాన్ని తెరి చారు. తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకొని భక్తులు కన్నుమూశారు. కృష్ణా పుష్కరాల్లో సుందరీకరణ పేరిట వందల ఆలయాలను కూల్చి, వాటిల్లోని విగ్రహాలను చెత్తబండ్లలో తరలించటం కూడా బాబు హయాంలోని ముచ్చటే. మళ్లీ ఈ పదకొండు నెలల కాలంలో వరస విషాద ఉదంతాలు చోటుచేసుకున్నాయి. బాధ్యతాయుత స్థానంలో వున్నానన్న ఇంగితం కూడా లోపించి తిరుమల వేంకటేశుని లడ్డూ కల్తీ జరిగిందంటూ ఆయనే తప్పుడు ప్రచారాన్ని లంకించుకున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన ముందస్తు ఏర్పాట్ల వైఫల్యం కారణంగా తొక్కిసలాట జరిగి తిరుమల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఆరుగురు భక్తులు మరణించారు. ఇక టీటీడీ గోశాలలో గోవుల మృతిఉదంతం సాధారణ భక్తుల ఊహకందనిది. అసలు అలాంటిదేమీ లేదని బాబు బుకాయించగా టీటీడీ చైర్మన్, ఈవోలు మృతిచెందిన గోవుల సంఖ్య గురించి తోచిన అంకెలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. దశాబ్దాలుగా హైందవ ధర్మానికీ, దాతృత్వానికీ ప్రతీకగా వున్న కాశీ నాయన ఆశ్రమాన్ని ఈ ప్రభుత్వమే స్వహస్తాలతో నేలమట్టం చేసింది. పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీకూర్మం క్షేత్రంలో ఇటీవల తాబేళ్లు చనిపోవటం అందరినీ ఆశ్చర్యంలో ముంచింది. ఏమైంది ఈ సర్కారుకు? పగలూ, ప్రతీకారాలూ తీర్చుకోవటానికి పదకొండు నెలల సమయం చాల్లేదా? పాలనపై దృష్టి పెట్టేదెప్పుడు? అసలు చందనోత్సవం వంటి ముఖ్య ఘట్టం కోసం ప్రభుత్వపరంగా చేసిందేమిటి? ఇందుకోసం నియమించిన కమిటీలో మంత్రులకు లోటులేదు. అయిదుగురున్నారు. హైలెవెల్ కమిటీ అన్నారు. అందులో ఒక్కరంటే ఒక్కరికి కొత్తగా కట్టిన గోడ ఎలా వుంటుందో తెలియదు. ఎలాంటిచోట నిర్మించారో, దేంతో నిర్మించారో, నిర్మించి ఎన్నాళ్ల యిందో అంతకన్నా తెలియదు. చందనోత్సవంనాడు వాన పడటం అక్కడ రివాజని కూడా తెలిసి వుండదు. కొండధారలు, ఆకాశగంగ, మాడవీధుల్లో పడిన వర్షమంతా ఇప్పుడు ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతంలోని మెట్లపై నుంచి కిందకు పోతుందని తెలిసే గతంలోనే రిటైనింగ్ వాల్ నిర్మించారు. కానీ పునర్నిర్మాణం పేరిట పాత గోడను తొలగించి అత్యంత నాసిరకంగా నిర్మించిన పర్యవసానంగా ఘోరం జరిగిపోయింది. ఒకరిద్దరు పెద్దలతోపాటు బంగారు భవిష్యత్తుగల యువభక్తులు కూడా తప్పించుకునే మార్గం దొరక్క సజీవసమాధి అయ్యారు. కూలిన గోడ వెనకున్న గూడుపుఠాణీ కథే వేరు. సొంత మీడియా సైతం దాచలేని కంతలు అందులో ఎన్నెన్నో! మంత్రులు దీనికి బాధ్యత వహించాలి. కానీ, వర్షం మీదా, చిన్న ఉద్యోగుల మీదా దీనిని నెట్టివేసే ప్రయత్నం జరుగుతోంది. తీరి కూర్చుని ఇలాంటి వరస విషాద ఉదంతాలకు కారణమవుతున్న సర్కారుకు ఒక్కరోజైనా అధికారంలో కొనసాగే నైతికార్హత వుందా? లక్షలాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతిని, మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొని రెండ్రోజులైనా గడవకముందే ఆర్భాటంగా అమరావతి పునఃశంకుస్థాపన కార్యక్రమం జరిపారు. కానీ మరణించిన భక్తులస్మృతిలో ఒక్క నిమిషం మౌనం పాటించాలన్న స్పృహ, కనీసం నివాళులర్పించాలన్న ఇంగితం ఒక్కరికీ లేకపోయింది. ఇదే అసలైన విషాదం. -
మరో మహమ్మారిని ఎదుర్కొనేలా...
కోవిడ్ వంటి మహమ్మారిని మరింత సమ ర్థంగా ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సిద్ధమయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నేతృత్వంలో ఏప్రిల్ 16న ఈ మేరకు ‘ద పాండెమిక్ ట్రీటీ’ ఒప్పందం కుదిరింది. డబ్ల్యూహెచ్ఓ నేతృత్వంలో కుదిరిన రెండో అంతర్జాతీయ ప్రజారోగ్య ఒప్పందం ఇది. 2003లో ‘ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్’ చర్చల్లో నేను భారత్‌కు ప్రాతినిధ్యం వహించాను. పొగాకు నియంత్రణకు సంబంధించిన ఈ ఒప్పందాన్ని అమెరికా, జపాన్ , అర్జెంటీనా వ్యతిరే కించినా, యూరోపియన్ యూనియన్ తటపటాయించినా చివరకు వాణిజ్య ప్రయోజనాల కంటే ప్రజారోగ్యమే ముఖ్యమని గుర్తించారు. ‘ద పాండెమిక్ ట్రీటీ’ విషయంలోనూ వాణిజ్య ప్రయోజనాలు కొందరి ప్రాధాన్యంగా ఉండింది. ఫలితంగా ఈ ఒప్పందంపై నాలు గేళ్లుగా చర్చలు, వాద ప్రతివాదాలూ నడిచాయి. కోవిడ్ వంటి మహ మ్మారి విషయంలో ఎదురైన వైఫల్యాలను మాత్రం ప్రపంచ దేశా లన్నీ గుర్తించాయి. విపత్కర పరిస్థితుల్లో దేశాల మధ్య మరింత సమ న్వయం, సహకారం అవసరమనీ, వట్టిమాటలు, సంఘీభావాలతో ప్రయోజనం తక్కువేననీ అర్థం చేసుకుని అందుకు తగ్గట్టుగా ఒక ఒప్పందం అవసరాన్ని కూడా గుర్తించాయి. వాస్తవానికి ఈఒప్పందం గత ఏడాదే అమల్లోకి రావాల్సింది. ఒప్పంద ప్రతిలోని భాష విషయంలో కొన్ని దేశాలు విభేదించడంతో ఈ ఏడాదికి పొడిగించాల్చి వచ్చింది. ధనిక దేశాల మొండిపట్టు‘ద పాండెమిక్ ట్రీటీ’ ఏడాది క్రితమే కుదరకపోవడానికి రెండు ప్రధానమైన అంశాలు కారణం. ప్రపంచం మొత్తానికి టీకాలు,మందులు, టెక్నాలజీలు అందరికీ సమానంగా అందుబాటులో ఉండేలా హామీ పొందడం ఒకటైతే... ప్రమాదకరమైన సూక్ష్మజీవులను మొట్టమొదట గుర్తించిన దేశం దాన్ని ఇతర దేశాలతో పంచుకోవడం (టీకా, మందులపై ప్రయోగాలు, నిర్ధారణ పరీక్షల అభివృద్ధి వంటి వాటికోసం) రెండో విషయం. ధనిక దేశాలు తమ ఫార్మా కంపెనీల ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఈ విషయాలపై పేటెంట్ హక్కులను రక్షించుకునే ప్రయత్నం చేశాయి. అదే సమయంలో తమకు టీకాలు, మందులు, టెక్నాలజీలు అందుబాటు ధరల్లోఉండేలా చూడాలని పేద, మధ్యస్థాయి దేశాలు పట్టుబట్టాయి. హాని కారక సూక్ష్మజీవులను ఇతర దేశాలతో పంచుకుంటున్నందుకు, క్లినికల్ ట్రయల్స్ ద్వారా తమ జనాభాల్లో టీకా, మందులను ప్రయో గించి చూస్తున్నందుకు తమకు ఈ వెసలుబాటు కల్పించాలని కోరాయి. ఈ వైరుధ్యం కారణంగా చర్చలు దీర్ఘకాలం కొనసాగాయి. ఒప్పందంలోని పదాలను కూడా అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో మార్చాల్సి వచ్చింది. చివరకు ఈ 2 వివాదాస్పద అంశాలను కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సమావేశాల్లో చర్చలు కొనసాగించాలని నిర్ణ యించారు. వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశాల్లో ఈ ట్రీటీని ప్రవేశ పెట్టిన తరువాత ఇది అమల్లోకి వస్తుంది. ఫార్మా కంపెనీల ప్రయోజనాలను కాపాడేందుకు ధనిక దేశాలు ఎంత మూర్ఖంగా బేరాలాడాయి అంటే... సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకునే విషయంలో ‘పరస్పర అంగీకారం ఆధారంగా’ అన్న వాక్యాన్ని ‘స్వచ్ఛంద పరస్పర అంగీకారం’ అని మార్చేంత వరకూ ఒప్పుకోలేదు. సానుకూలతలుకోవిడ్ సమయంలో ధనిక దేశాలు టీకాలను నిల్వ చేసుకున్న దాఖలాలు ఇంకా తాజాగానే ఉన్నాయి. టీకాలు అందుబాటులో లేని చోట్ల కోవిడ్ వైరస్ వేగంగా రూపాంతరం చెందిన విషయమూ తెలిసిందే. ఒక్క విషయమైతే స్పష్టం. ద పాండెమిక్ ట్రీటీ విషయంలో ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా 193 దేశాలు కొన్ని కీలకఅంశాల విషయంలోనైతే ఏకాభిప్రాయానికి వచ్చాయి. కోవిడ్ వంటి మహమ్మారులు ప్రబలుతున్న సమయంలో సమాచారాన్ని వేగంగా, తగిన సమయంలో పంచుకోవాలన్నది వీటిల్లో ఒకటి. అలాగే టీకాలు, మందులు, వ్యాధి నిర్ధారణ పరీక్షల తయారీదారులు తమ ఉత్పత్తిలో కనీసం 20 శాతాన్ని అందుబాటు ధరల్లో డబ్ల్యూహెచ్ఓకు అందించాలన్నది రెండోది. వ్యాధిని సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడం మూడోది. మాస్కులు, పీపీఐ కిట్ల వంటి వాటి సరఫరా, లభ్యతల విషయంలో డబ్ల్యూహెచ్ఓకు పర్యవేక్షణ అధికారం దక్కడం ఒక విశేషం.ఈ ఒప్పందం కోవిడ్ లాంటి మహమ్మారుల నివారణపై కూడా దృష్టి పెడుతోంది. వన్ హెల్త్ పద్ధతిని అనుసరించాలని సూచిస్తోంది. భౌగోళికంగా వేర్వేరు ప్రాంతాల్లో పరిశోధనలు చేపట్టాలనీ, ప్రమాద కర సూక్ష్మజీవులు పరిశోధనలకు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలనీ, మందులు, ఇతర ఆరోగ్య సంబంధిత ఉత్పత్తుల తయారీకి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవాలనీ కూడా ఈ ఒప్పందం ప్రస్తావిస్తోంది. అంతేకాకుండా... అంతర్జాతీయ స్థాయిలో వేర్వేరు రంగాలకు చెందిన నిపుణులను అరోగ్య అత్యవసర పరిస్థితులకు దీటుగా స్పందించేలా సిద్ధం చేయాలని, ఈ కార్యకలా పాలకు అవసరమైన ఆర్థిక వనరుల సమన్వయానికి, ఆరోగ్య వ్యవస్థ లను బలోపేతం చేసేందుకూ, అంతర్జాతీయంగా సప్లై చెయిన్, లాజి స్టిక్స్ నెట్వర్క్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది.ప్రజారోగ్యం విషయంలో దేశాలకు ఉన్న సార్వభౌమ అధికారా లను గుర్తించే ఈ ఒప్పందం, అందులోని అంశాలు ఏ రకంగానూ డబ్ల్యూహెచ్ఓ ఇస్తున్న ఆదేశాలుగా భావించరాదని స్పష్టం చేస్తోంది. దేశీ విధానాలు, కార్యక్రమాలను మార్చుకోవాల్సిన అవసరమూ లేదని తెలిపింది. అంటే ప్రయాణీకుల నిలిపివేత, టీకాలు తప్పనిసరి చేయడం, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేపట్టడం వంటివి.నిపుణుల ఆమోదం...ఈ ఒప్పందంపై ఏకాభిప్రాయం కుదరడంపై అంతర్జాతీయ నిపుణులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజారోగ్య చట్టాల విషయంలో నిపుణుడైన అమెరికా న్యాయవాది లారెన్స్ గోస్టిన్దృష్టిలో ఈ ఒప్పందం ఒక ఘన విజయం. ఈ ఒప్పందంపై విమర్శకులు కూడా లేకపోలేదు. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ఉండగా... రిపబ్లికన్ పార్టీ నేతలు, ఒక వర్గం మీడియా వ్యాఖ్యాతలు అమెరికా ఈ చర్చల్లో పాల్గొనడాన్నే తప్పుపట్టారు. డబ్ల్యూహెచ్ఓ అమెరికా సార్వభౌమత్వంలో జోక్యం చేసుకుంటోందని ఆరోపిస్తూ ముసాయిదా ఒప్పందాన్ని తిరస్కరించారు. వాణిజ్యం, పర్యాటకరంగాలపై దీని ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేశారు. డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ప్రభుత్వంగా మారే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత డబ్ల్యూహెచ్ఓ నుంచిట్రంప్ వైదొలగడంతో ఈ ఒప్పందంపై చర్చలు వేగవంత మయ్యాయి. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సాగాయని కూడా చెప్పాలి. ఇక్కడ ఒక కీలకమైన విషయం గురించి చెప్పుకోవాలి. ఒప్పందాన్ని ఆమోదించిన దేశాల జాబితాలో అమెరికా లేకపోవడం హానికారక సూక్ష్మజీవులపై ప్రపంచవ్యాప్త నిఘా అన్న అంశాన్ని బలహీన పరిచేదే. సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి కూడా ఎంతవరకూ సాధ్యమవుతుందన్నది చూడాలి. కాబట్టి ఆ యా దేశాల స్థాయిలో వనరుల నిర్మాణం, ప్రాంతీయ స్థాయిలో సహకారం వంటి ఇతర మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ స్థాయి సవాళ్లకు అంతే స్థాయి స్పందన కూడా అవసరమవుతుంది. పాండె మిక్ ట్రీటీ ఈ దిశగా వెళ్లేందుకు తగిన చోదక శక్తిని ఇస్తోంది!-వ్యాసకర్త ‘పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’,‘ఇండియన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ’ డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)- కె. శ్రీనాథ్ రెడ్డి -
ఈ రాశి వారు కొత్త కార్యక్రమాలు చేపడతారు.. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు.
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: శు.షష్ఠి ప.1.20 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: పునర్వసు సా.5.47 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం: ఉ.6.03 నుండి 7.37 వరకు, తదుపరి రా.1.46 నుండి 3.22 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.03 నుండి 7.14 వరకు, అమృతఘడియలు: ప.3.27 నుండి 5.02 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.37, సూర్యాస్తమయం: 6.15.మేషం: కొన్ని పనుల్లో ప్రతిబంధకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమాధిక్యం. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.వృషభం: ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. స్వల్ప ధనలాభం. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రగతి కనిపిస్తుంది.మిథునం: మిత్రులతో విభేదాలు. ప్రయాణాలలో అవాంతరాలు. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు కలసిరావు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.కర్కాటకం: శుభవార్తా శ్రవణం. కుటుంబంలో ఉత్సాహవంతంగా ఉంటుంది. ఏ పని చేపట్టినా విజయమే. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. దైవచింతన.సింహం: వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమ తప్పదు. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.కన్య: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలను సమయానికి పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.తుల: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.వృశ్చికం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో వివాదాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.ధనుస్సు: వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆత్మీయులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.మకరం: సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. దైవదర్శనాలు. శుభవర్తమానాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు.కుంభం: సన్నిహితులతో విభేదిస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చిక్కులు.మీనం: కార్యజయం. ధనలాభ సూచనలు. ప్రముఖులతో పరిచయాలు. నూతన ఉద్యోగలాభం. సోదరుల నుంచి పిలుపు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. -
కోహ్లి X ధోని
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్లో మెరుగైన ఆటతీరు కనబరుస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు శనివారం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)తో తలపడనుంది. గత మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన బెంగళూరు ‘ప్లే ఆఫ్స్’ బెర్తు ఖరారు చేసుకోవడంపై దృష్టి పెడితే... ఈ సీజన్లో పేలవ ప్రదర్శన కనబర్చిన చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి తప్పుకుంది. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి పోరులోనూ ఆర్సీబీ విజయం సాధించగా... సొంతగడ్డపై జరగనున్న పోరులో అదే జోరు కొనసాగించాలని బెంగళూరు భావిస్తోంది. ఈ సీజన్లో 10 మ్యాచ్‌లాడిన బెంగళూరు 7 విజయాలు, 3 పరాజయాలతో 14 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. మరో విజయం సాధిస్తే ఇక ‘ప్లే ఆఫ్స్’కు చేరినట్లే. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ 10 మ్యాచ్‌ల్లో రెండింట గెలిచి 8 మ్యాచ్‌ల్లో ఓడింది. ఎలాగో ఇప్పటికే రేసు నుంచి తప్పుకున్న సీఎస్కే ‘పోరాడితే పోయేదేముంది’ అన్న తరహాలో విజృంభించాలని చూస్తోంది. దిగ్గజ ఆటగాళ్లు ధోని, కోహ్లి బరిలోకి దిగనుండటంతో ఈ మ్యాచ్‌పై మరింత ఆసక్తి నెలకొంది. ప్రస్తుత ఫామ్ ప్రకారం వచ్చే ఏడాది ధోని ఐపీఎల్ ఆడటంపై సందేహాలు నెలకొన్న నేపథ్యంలో ధోనీ, కోహ్లి కలిసి మైదానంలో కనిపించడం ఇదే చివరిసారి కావొచ్చని సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ సాగుతోంది! మరి ఈ పోరులో ధోని సేనను విజయం వరిస్తుందా... బెంగళూరు ‘ప్లే ఆఫ్స్’ బెర్తు ఖరారు చూసుకుంటుందా చూడాలి. జోరు మీదున్న కోహ్లి... అంతర్జాతీయ టి20ల నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లి... ఈ సీజన్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి జట్టు అవసరాలకు తగ్గట్లు ఆడుతూ ముందుకు సాగుతున్నాడు. 10 మ్యాచ్‌ల్లో 63.29 సగటుతో 443 పరుగులు చేశాడు. ఇందులో 6 అర్ధశతకాలు ఉన్నాయి. ఈ సీజన్లో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న కోహ్లి... ‘ఆరెంజ్ క్యాప్’ రేసులో ముందున్నాడు. మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఎక్కువసేపు నిలవలేకపోతుండగా... దేవదత్ పడిక్కల్, కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్ మంచి టచ్‌లో ఉన్నారు. ముఖ్యంగా వన్‌డౌన్‌లో పడిక్కల్ ధనాధన్ షాట్లతో చెలరేగుతున్నాడు. కెప్టెన్ రజత్ పాటీదార్ నుంచి టీమ్ మేనేజ్మెంట్ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. పెద్దగా ప్రభావం చూపలేకపోతున్న చెన్నై బౌలర్లపై బెంగళూరు బ్యాటర్లంతా కలిసికట్టుగా కదంతొక్కితే భారీ స్కోరు ఖాయమే. ఇక బౌలింగ్‌లో భువనేశ్వర్, హాజల్‌వుడ్, యశ్ దయాళ్ పేస్ భారం మోస్తుండగా... కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ స్పిన్ బాధ్యతలు పంచుకుంటున్నారు. సమష్టిగా సత్తా చాటితేనే! ఐపీఎల్ టోర్నమెంట్ ఆరంభం (2008) నుంచి ఆడుతున్న ధోని... వచ్చే ఏడాది ఆటగాడిగా లీగ్‌లో పాల్గొనక పోవచ్చనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఈ సీజన్ మధ్యలో చెన్నై పగ్గాలు అందుకున్న ధోని... జట్టు విజయాల బాట పట్టించలేకపోయాడు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో సీఎస్కే ఏమాత్రం ప్రభావం చూపలేకపోతోంది. స్వదేశీ, విదేశీ ఆటగాళ్లనే తేడా లేకుండా అంతా విఫలమవుతున్నారు.ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ ఓపెనర్ షేక్ రషీద్... వచ్చిన అవకాశాలను వృథా చేసుకుంటుండగా... మరో యంగ్‌స్టర్ ఆయుశ్ మాత్రే ఫర్వాలేదనిపిస్తున్నాడు. స్యామ్ కరన్, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా సమష్టిగా రాణించాల్సిన అవసరముంది. ఇక బౌలింగ్‌లో ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్ కాస్త నయం కాగా... మిగిలిన వాళ్లు కూడా సత్తా చాటాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ప్రస్తుత స్థితిలో బెంగళూరు బ్యాటింగ్ జోరును అడ్డుకోవడం చెన్నై బౌలర్లకు కత్తిమీద సామే! తుది జట్లు (అంచనా) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటీదార్ (కెప్టెన్ ), కోహ్లి, సాల్ట్, దేవదత్ పడిక్కల్, కృనాల్ పాండ్యా, జితేశ్ శర్మ, రొమారియో షెఫర్డ్, టిమ్ డేవిడ్, భువనేశ్వర్, హాజల్‌వుడ్, యశ్ దయాళ్, సుయాశ్ శర్మ. చెన్నై సూపర్ కింగ్స్: ధోని (కెప్టెన్ ), షేక్ రషీద్, ఆయుశ్ మాత్రే, స్యామ్ కరన్, రవీంద్ర జడేజా, బ్రెవిస్, శివమ్ దూబే, దీపక్ హూడా, అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, పతిరణ. 21 ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు, చెన్నై జట్ల మధ్య మొత్తం 34 మ్యాచ్‌లు జరిగాయి. చెన్నై జట్టు 21 మ్యాచ్‌ల్లో, బెంగళూరు 12 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఒక మ్యాచ్ రద్దు అయింది. బెంగళూరుపై చెన్నై అత్యధిక స్కోరు 226 కాగా, అత్యల్ప స్కోరు 82 పరుగులు. చెన్నైపై బెంగళూరు అత్యధిక స్కోరు 218 కాగా, అత్యల్ప స్కోరు 70 పరుగులు. -
న్యాయపీఠంపై మహిళా తేజం
‘నాన్న జడ్జి. చెల్లి కూడా జడ్జే. వారే నాకు స్ఫూర్తి’ అంటుంది నిఖిషా. జడ్జి కావాలనేది కీర్తన హైస్కూల్ నాటి కల. ‘మా కుటుంబం, బంధువులలో న్యాయవాదులు, జడ్జీలు ఎవరూ లేరు. అందుకే జడ్జి కావాలనుకున్నాను’ అంటుంది మధులిక. ‘పట్టుదల గట్టిగా ఉంటే తొలి ప్రయత్నంలోనే బ్రహ్మాండంగా విజయం సాధించవచ్చు’ అంటుంది సాహితి....తెలంగాణ హైకోర్టు జూనియర్ సివిల్ జడ్జి పోస్ట్‌లకు ఎంపికైన విజేతలు వీరు. న్యాయమూర్తి కావాలనుకోవడానికి వారికి స్ఫూర్తి వేర్వేరుగా ఉండవచ్చు. అయితే పడిన కష్టం మాత్రం ఒక్కటే. ‘న్యాయవ్యవస్థలో ఉన్నత స్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి’ అని జాతీయ స్థాయిలో నివేదికలు నొక్కి చెబుతున్న నేపథ్యంలో ఈ మహిళల విజయం... ఆశా కిరణం – అరవింద్ గండ్రాతి, ‘సాక్షి’ నెట్వర్క్1. ఎన్నో సవాళ్లు... అయినా సరే...న్యాయవాది కావాలనేది నా చిన్నప్పటి కల. జూనియర్ సివిల్ జడ్జి పోస్టుకు ఎంపికైనందుకు సంతోషంగా ఉంది. మధ్యతరగతి కుటుంబాల్లో ప్రత్యేకంగా స్టడీ రూమ్స్ లేకపోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఏకాంతంగా చదువుకునే అవకాశం ఉండదు. లైబ్రరీలలో రాత్రి ΄÷ద్దుపోయే వరకు చదువుకునే వీలు అమ్మాయిలకు ఉండదు. మెటీరియల్ కలెక్ట్ చేసుకోవడం నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రిపేర్ కావడం వరకు...పేద, మధ్యతరగతి అమ్మాయిలకు ఎన్నో సమస్యలు ఉంటాయి. అయితే లక్ష్యాన్ని మాత్రమే చూస్తే ఆ సమస్యలు కనిపించవు. – గంగిశెట్టి ప్రసీద, వరంగల్ సిటీ2. పుట్టెడు దుఃఖంతో... తిరుగులేని పట్టుదలతో...తెలంగాణ ఉద్యమంలో నర్సంపేట పట్టణం నుండి ముందు వరుసలో ఉండి ఉద్యమాన్ని నడిపించారు నాన్న. 2020లో నాన్న హత్యకు గురయ్యారు. నా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. నా కాళ్లపై నేను నిలబడి అమ్మకు అండగా ఉండాలనుకున్నాను. నాన్న ఆలోచనలకు అనుగుణంగా ఎల్ఎల్బీలో చేరినప్పటి నుంచి జడ్జి కావాలనే పట్టుదలతో చదివాను. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించడం సంతోషంగా ఉంది. – అంబటి ప్రణయ, నర్సంపేట, వరంగల్3. తొలి ప్రయత్నంలోనే... ‘లక్ష్యం ఏర్పర్చుకున్నప్పుడు ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురొచ్చినా పట్టుదలను వదలవద్దు. జూనియర్ సివిల్ జడ్జి పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యేవారు సొంత నోట్స్ తయారు చేసుకోవడమే ఉత్తమం. ఇది ఒక హ్యాపీ మూమెంట్. నా పేరెంట్స్‌కు ఒక గిఫ్ట్.– సాహితి, నంగనూరు, సిద్దిపేట జిల్లా (తొలి ప్రయత్నంలోనే, 26 ఏళ్ల వయసులో జూనియర్ సివిల్ జడ్జి పోస్ట్‌కు ఎంపికైంది)4.ఉద్యోగం కాదు... బాధ్యతమా కుటుంబంలో ఎవరూ న్యాయవాదులు, జడ్జిలు లేరు. అదే నన్ను న్యాయమూర్తి కావాలనే లక్ష్యం వైపు నడిపించింది. కొంతకాలం న్యాయవాదిగా చేసిన అనుభవం జేసీజే పరీక్షలో తోడ్పడింది. జడ్జి పోస్ట్ అనేది ఉద్యోగం కాదు. విలువైన బాధ్యత. – డాకన్నగారి మధులిక తేజ, హైదరాబాద్5. చిన్ననాటి కల... తొలి ప్రయత్నంలోనే చిన్ననాటి నుంచి జడ్జి అవ్వాలనేది నా కల. నా కల నెరవేరినందుకు సంతోషంగా ఉంది. హైకోర్టు, కరీంనగర్ కోర్టుల్లో న్యాయవాదిగా పలు కేసులు వాదించాను. రెండేళ్ల క్రితం నుంచి జేసీజే పరీక్షలకు సిద్ధమయ్యాను. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా క్రమపద్ధతిలో పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యాను. – కట్ట కీర్తన, ఆరెపల్లి, కరీంనగర్జడ్జిల కుటుంబం...తండ్రి కె. ఖుషా హైదరాబాద్ సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జి. చెల్లి భావన మహబూబ్‌నగర్‌లో 4వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి. తాజాగా అక్క నిఖీషా జూనియర్ సివిల్ జడ్జి పోస్ట్‌కు ఎంపికైంది. తండ్రి, ఇద్దరు కూతుళ్లతో వారిది జడ్జిల కుటుంబంగా మారింది. ఐటీ ఉద్యోగం వచ్చినా చట్టంపై అవగాహన ఉండాలని న్యాయమూర్తి కె. ఖుషా తన కూతుళ్లను న్యాయ విద్య చదివించారు.అసలైన లక్ష్యం అదే...కోవిడ్ లాక్డౌన్ సమయంలో నిఖీషా వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగంలో చేరింది. ఐటీ రంగంలో అనుభవం కోసం ఉద్యోగంలో చేరింది. అయితే ఆ ఉద్యోగం ఆశించిన స్థాయిలో సంతృప్తి ఇవ్వలేదు. ఆ సమయంలోనే ‘నేను చేయాల్సిన ఉద్యోగం ఇది కాదు’ అనుకుంది. ‘నాన్నలాగే న్యాయమూర్తి కావాలి’ అని తనలో నిద్రాణంగా ఉన్న లక్ష్యంపై దృష్టి పెట్టింది.మానసిక స్థైర్యం... హరే కృష్ణ మంత్రంమెయిన్స్ ఎగ్జామ్స్ సమయంలో నిఖీషా తల్లి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ఇంటర్వ్యూకు ముందు నాన్నకు బై΄ాస్ సర్జరీ జరిగింది. కవలబిడ్డలకు అప్పటికి సంవత్సరం కూడా నిండలేదు. ఇలా ఎన్నో ఒడిదొడుకులు వచ్చినా మానసికంగా కుంగిపోకుండా లక్ష్యాన్ని పదేపదే గుర్తు తెచ్చుకునేది. ‘హరే కృష్ణ మంత్రం జపిస్తూ మానసిక స్థైర్యాన్ని పొందాను. విజయం సాధించాను. మా కుటుంబం నుంచి నేను కూడా న్యాయమూర్తిగా అడుగుపెడుతున్నందుకు ఎంతో గర్వం ఉంది’ అంటుంది నిఖీషా. -
అమెరికాతో భారత్ ‘సై’
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్, అమెరికాల మధ్య చెస్ టోర్నమెంట్ జరగనుంది. ఇరు దేశాలకు చెందిన టాప్ స్టార్ ప్లేయర్లందరూ ఈ టోర్నీలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. దీనికి సంబంధించిన ‘డ్రా’ తదితర వివరాలను శుక్రవారం వెల్లడించారు. అక్టోబర్ 4న అర్లింగ్టన్లోని ఇ–స్పోర్ట్స్ స్టేడియంలో చెస్ పోటీలు జరుగనున్నాయి. ఇరు దేశాల నుంచి ఐదుగురు చొప్పున ఆటగాళ్లు ఇందులో పాల్గొంటారు. క్లాసికల్ ఫార్మాట్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ భారత జట్టును ముందుండి నడిపించనున్నాడు. అమెరికన్ సూపర్ గ్రాండ్‌మాస్టర్ హికారు నకమురను గుకేశ్ ‘ఢీ’కొంటాడు. గుకేశ్‌తో పాటు తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్, సాగర్ షా, కుర్రాడు ఎథన్ వాజ్‌తో పాటు భారత మహిళా ప్లేయర్, అంతర్జాతీయ మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్‌లు బరిలో ఉన్నారు. మొదటి బోర్డులో గుకేశ్, నకముర తలపడతారు. రెండో బోర్డులో అర్జున్... గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరువానాను ఎదుర్కొంటాడు. మూడో బోర్డులో సాగర్ షా, లెవి రొజ్మన్ పోటీపడనుండగా, మిగతా పోటీల్లో దివ్యతో కారిస్సా యిప్, ఎథన్ వాజ్‌తో టానిటొలువా అడ్యూమి తలపడతారు. టోర్నీ నిబంధనల విషయానికొస్తే బోర్డులోని ఇరు ఆటగాళ్ల మధ్య ఐదు రౌండ్ల గేమ్‌లు జరుగుతాయి. పది నిమిషాల్లో గేమ్‌ను ముగించాల్సి ఉంటుంది. అప్పటికీ ‘డ్రా’ అయితే మరో 5 నిమిషాల ఆటను కొనసాగిస్తారు. షూటౌట్‌కు వస్తే మరో నిమిషం అదనంగా కేటాయిస్తారు. అప్పటికీ సమఉజ్జీలుగా నిలిస్తే మాత్రం విజేత తేలే వరకు పోటీ కొనసాగుతుంది. -
క్రీడా గ్రామంలో కాదు... క్రూజ్ షిప్లో
టోక్యో: కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు, ఒలింపిక్స్‌లాంటి మెగా ఈవెంట్లు జరిగితే ప్రపంచ వ్యాప్తంగా పాల్గొనే అంతర్జాతీయ అథ్లెట్ల కోసం ఆధునిక హంగులతో, సకల సౌకర్యాలతో క్రీడా గ్రామాన్ని నిర్మించడమేది ఆనవాయితీ. ఇప్పటి వరకు జరిగిన ప్రతీ మెగా ఈవెంట్లోనూ ఇదే జరిగింది. కానీ వచ్చే ఏడాది జపాన్ ఆతిథ్యమిచ్చే ఆసియా క్రీడల్లో మాత్రం క్రీడా గ్రామం కనిపించదు. దీని స్థానంలో ఫ్లోటింగ్ విలేజ్‌కు నిర్వాహకులు మొగ్గు చూపారు. అంటే నీటిపై తెలియాడే విలేజ్ అన్నమాట! ఇందుకోసం భారీ ఓడను వినయోగించనుంది. క్రూజ్ షిప్ తెలుసుగా... అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ఓడ. నీటిపై కదలాడే నగరాన్ని తలపించే క్రూజ్షిప్లో ఏషియాడ్‌కు విచ్చేసే అథ్లెట్లకు బస కల్పించే ఏర్పాట్లను జపాన్ నిర్వాహకులు చేస్తున్నారు. వచ్చే ఏడాది సెపె్టంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగే ఈ ఆసియా క్రీడల్లో ఆసియా దేశాలకు చెందిన 15 వేల మంది అథ్లెట్లు పాల్గొంటారు. వీరందరి బసకోసం రోటీన్‌గా క్రీడా గ్రామాన్ని నిర్మించకుండా క్రూజ్షిప్లోనే బస ఏర్పాట్లు చేయనున్నారు. ఇదే జరిగితే అథ్లెట్లకు ఇదో సరికొత్త అనుభూతిని అందిస్తుంది. జపాన్‌లోని అయిచి రాష్ట్రంలోని నగోయా నగరంలో ఆసియా క్రీడలతో పాటు పారా ఆసియా క్రీడలు జరుగుతాయి. దీనికి సంబంధించిన ఆర్గనైజింగ్ కమిటీ నగోయా రేవు సమీపంలోని కింజో పీర్ వద్ద క్రూజ్షిప్ను ఫ్లోటింగ్ విలేజ్‌గా వాడుకోనుంది. ఆర్చరీ, బాస్కెట్‌బాల్ 3్ఠ3, కనోయింగ్ –కయాకింగ్, సైక్లింగ్, మౌంటెన్ బైక్ సైక్లింగ్, రేసింగ్ ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, జూడో, కబడ్డీ, కురాష్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, రోయింగ్, రగ్బీ, సెపక్తక్రా, స్పోర్ట్ క్లైంబింగ్, స్క్వాష్, టెన్నిస్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్, వుషు తదితర పోటీల్లో పాల్గొనేందుకు 4600 మంది అథ్లెట్లు వస్తారని నిర్వాహకులు అంచనా వేశారు. ఈ 20 క్రీడాంశాలకు సంబంధించిన వేదికలన్నీ (స్టేడియాలు) కూడా నగోయా పోర్ట్‌కు అతి దగ్గరలోనే ఉండటంతో నిర్వాహకులు ఫ్లోటింగ్ విలేజ్ (క్రూజ్షిప్పై) వైపు మొగ్గినట్లు తెలిసింది. ఇంతకు ముందెన్నడూ చూడని గ్రామాన్ని ఆవిష్కరించనున్నామని, ఇది అథ్లెట్ల జీవితాల్లో చిరకాలం నిలిచిపోయే వినూత్న వేదికని ఆసియా క్రీడల సాంకేతిక అధికారి ఒకరు తెలిపారు. భారీ ఓడలో కంటెయినర్లతో తయారు చేసిన విల్లాలు ఉంటాయి. అంతేకాదు జిమ్, స్విమ్మింగ్‌పూల్ సదుపాయలెన్నో ఉంటాయి. -
శ్రీశాంత్‌పై మూడేళ్ల నిషేధం
తిరువనంతపురం: భారత మాజీ పేస్ బౌలర్ ఎస్.శ్రీశాంత్‌పై కేరళ క్రికెట్ సంఘం (కేసీఏ) తీవ్ర చర్యలు తీసుకుంది. క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు అతనిపై మూడేళ్ల నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. కేరళ ఆటగాడు సంజు సామ్సన్ చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టులోకి ఎంపిక కాకపోవడంతో శ్రీశాంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఒక మళయాళ టీవీ చానల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ... సామ్సన్ను విజయ్ హజారే వన్డే టోర్నీకి కేరళ క్రికెట్ సంఘం ఎంపిక చేయకపోవడం తప్పుడు నిర్ణయమని శ్రీశాంత్ వ్యాఖ్యానించాడు. దీని వల్లే అతను చాంపియన్స్ ట్రోఫీ అవకాశాలు కోల్పోయాడని అభిప్రాయపడ్డాడు. ఈ క్రమంలో కేరళ సంఘంపై పలు ఆరోపణలు చేసిన అతను... సామ్సన్తో పాటు ఇతర కేరళ క్రికెటర్లకు తాను అండగా ఉంటానని, కేరళ సంఘం నుంచి వారిని రక్షిస్తానని అతను పేర్కొన్నాడు. ఇదే కారణంగా శ్రీశాంత్‌పై వేటు పడింది. ఈ వివాదం మొదలైన సమయంలో శ్రీశాంత్‌తో పాటు కేరళ క్రికెట్ లీగ్‌లో అతను సహ యజమానిగా ఉన్న కొల్లామ్ ఏరీస్ టీమ్‌కు కూడా కేసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ‘నేను తప్పు చేయలేదు’ కేసీఏ తనపై నిషేధం విధించడంపై స్పందిస్తూ తాను ఎలాంటి తప్పూ చేయలేదని స్పష్టం చేశాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే అసలు నేను ఏం తప్పు చేశానో అర్థం కావడం లేదు. సామ్సన్ మనవాడు. అందుకే ఒక మంచి ఉద్దేశంతో అతడికి మద్దతు పలికానంతే. కేసీఏను ఎక్కడా విమర్శించలేదు. అసోసియేషన్‌లో ఉన్నవారు కాస్త పెద్ద స్థాయిలో క్రికెట్ ఆడిన వారైతే బాగుండేది అని మాత్రమే అన్నాను. సామ్సన్ మాత్రమే కాదు కేరళ ఆటగాళ్లు ఎవరికైనా మనం అండగా నిలవాలి నాపై నిషేధం వెనక ఎలాంటి కారణం ఉందో నాకు అర్థం కాలేదు. కేరళ అభిమానులే దీనిని నిర్ణయించండి’ అని శ్రీశాంత్ చెప్పాడు. భారత్ తరఫున 90 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన శ్రీశాంత్ టి20, వన్డే వరల్డ్ కప్‌లు గెలిచిన జట్లలో భాగంగా ఉన్నాడు. -
వాణిజ్య ఒప్పందంపై ఆశలతో లాభాలు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాలతో ముగిసింది. అమెరికా – భారత్ వాణిజ్య ఒప్పందంపై ఆశలు, రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్ల అంశాలు కలిసొచ్చాయి. సెన్సెక్స్ 260 పాయింట్లు పెరిగి 80,502 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 13 పాయింట్లు బలపడి 24,347 వద్ద నిలిచింది. ఉదయం సానుకూలంగా మొదలైన సూచీలు ట్రేడింగ్ ప్రారంభంలోనే భారీ లాభాలు ఆర్జించాయి.ఐటీ, బ్యాంకుల షేర్లకు డిమాండ్ లభించడంతో ఒక దశలో సెన్సెక్స్ 936 పాయింట్లు బలపడి 81,178 వద్ద గరిష్టాన్ని అందుకుంది. నిఫ్టీ 255 పాయింట్లు ఎగసి 24,589 వద్ద ఈ ఏడాది గరిష్టాన్ని నమోదు చేసింది. అయితే ద్వితీయార్ధంలో గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో లాభాలు తగ్గాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. ⇒ బీఎస్ఈలో రంగాల వారీగా సూచీల్లో సర్వీసెస్ 1.67%, ఆయిల్‌అండ్‌గ్యాస్ 0.69%, ఇంధన 0.57%, ఐటీ ఇండెక్సు అరశాతం పెరిగాయి. టెలికమ్యూనికేషన్ 2%, కన్జూమర్ డ్యూరబుల్స్ 1.66%, విద్యుత్, యుటిలిటీ 1%, మెటల్, రియల్టీ సూచీలు అరశాతం నష్టపోయాయి. మిడ్‌క్యాప్ 1.67%, స్మాల్ క్యాప్ సూచీ 0.07 శాతం పతనమయ్యాయి. ⇒ మార్చి క్వార్టర్ నికరలాభం 4% వృద్ధి నమోదుతో అదానీ పోర్ట్స్–సెజ్ షేరు 4% పెరిగి రూ.1,267 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 6% ఎగసి రూ.1,295 వద్ద గరిష్టాన్ని తాకింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో అత్యధికంగా లాభపడిన షేరు ఇదే. కంపెనీ మార్కెట్ విలువ రూ.10,812 కోట్లు పెరిగి రూ.2.73 లక్షల కోట్లకు చేరింది. ⇒ భూషణ్ స్టీల్ అండ్ పవర్‌ను దక్కించుకునేందుకు సమర్పించిన ప్రణాళికలు దివాలా పరిష్కార ప్రక్రియ చట్టాలకు విరుద్ధంగా ఉన్నాయంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడంతో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేరు 5.5% నష్టపోయి రూ.972 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 8% క్షీణించి రూ.948 వద్ద కనిష్టాన్ని తాకింది. షేరు భారీ పతనంతో కంపెనీకి రూ.13,731 కోట్ల నష్టం వాటిల్లింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.2.37 లక్షల కోట్లకు దిగివచి్చంది. -
టైటాన్స్ ఏడో గెలుపు రైజర్స్ ఏడో ఓటమి
ఐపీఎల్లో గత సీజన్ రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ‘ప్లే ఆఫ్స్’ వెళ్లే అవకాశాలకు దాదాపు తెరపడినట్లే! హైదరాబాద్ జట్టు అధికారికంగా ఇంకా నిష్క్రమించకపోయినా ఏడో ఓటమితో సమీకరణాలన్నీ సంక్లిష్టంగా మారిపోయాయి. ఆశలు నిలవాలంటే గుజరాత్‌పై కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ పేలవ బౌలింగ్‌తో ఓటమిని మూటగట్టుకుంది. సొంత మైదానంలో గిల్, బట్లర్, సుదర్శన్ బ్యాటింగ్‌తో భారీ స్కోరు నమోదు చేసిన టైటాన్స్ దానిని నిలబెట్టుకుంది. ఏడో విజయంతో గుజరాత్ మరో మెట్టు పైకెక్కి ప్లే ఆఫ్స్‌కు చేరువైంది. అహ్మదాబాద్: ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఆడిన రెండు మ్యాచ్‌లలో నెగ్గిన గుజరాత్ టైటాన్స్ 2–0తో పైచేయి సాధించింది. శుక్రవారం జరిగిన పోరులో గుజరాత్ 38 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (38 బంతుల్లో 76; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), జోస్ బట్లర్ (37 బంతుల్లో 64; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేయగా... సాయి సుదర్శన్ (23 బంతుల్లో 48; 9 ఫోర్లు) మరో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులే చేయగలిగింది. అభిషేక్ శర్మ (41 బంతుల్లో 74; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు. పరుగుల వరద... తొలి 2 ఓవర్లలో 16 పరుగులతో గుజరాత్ ఇన్నింగ్స్ నెమ్మదిగా మొదలైంది. అయితే తర్వాతి 4 ఓవర్లలో ఏకంగా 66 పరుగులు వచ్చాయి. షమీ ఓవర్లో సుదర్శన్ 5 ఫోర్లతో (4, 0, 4, 4, 4, 4) చెలరేగిపోగా, కమిన్స్ ఓవర్లో గిల్ 2 ఫోర్లు, సిక్స్ బాదాడు. హర్షల్ ఓవర్లోనూ సుదర్శన్ 4 ఫోర్లతో దూకుడు ప్రదర్శించాడు. పవర్‌ప్లే ముగిసేసరికి టైటాన్స్ 82 పరుగులు చేసింది. ఆ జట్టుకు ఐపీఎల్లో ఇదే అత్యధిక పవర్‌ప్లే స్కోరు కావడం విశేషం. తొలి వికెట్‌కు గిల్‌తో 41 బంతుల్లోనే 87 పరుగులు జోడించిన అనంతరం సుదర్శన్ వెనుదిరిగాడు. ఆ తర్వాత 25 బంతుల్లో గిల్ అర్ధ సెంచరీ పూర్తయింది. మరోవైపు బట్లర్ కూడా దూకుడు కనబర్చాడు. 22 పరుగుల వద్ద అతను ఇచ్చిన క్యాచ్‌ను కమిన్స్ వదిలేయడం కూడా కలిసొచ్చింది. అన్సారీ ఓవర్లో 6, 4 కొట్టిన బట్లర్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఉనాద్కట్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్ ఆసక్తికరంగా సాగింది. ఈ ఓవర్లో 2 సిక్స్‌లు బాదిన గుజరాత్...3 వికెట్లు కోల్పోయింది. అభిషేక్ పోరాటం వృథా... భారీ ఛేదనలో తొలి వికెట్‌కు 49 పరుగులు జత చేశాక ట్రవిస్ హెడ్ (16 బంతుల్లో 20; 4 ఫోర్లు) వెనుదిరిగాడు. అభిషేక్ సిక్సర్లతో ధాటిగా ఆడటంతో పవర్‌ప్లేలో 57 పరుగులు వచ్చాయి. ఇషాన్ కిషన్ (13) పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడగా, అభిషేక్‌కు క్లాసెన్ (18 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్) సహకరించాడు. 28 బంతుల్లోనే అభిషేక్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అభిషేక్ , క్లాసెన్ మూడో వికెట్‌కు 33 బంతుల్లో 57 పరుగులు జత చేసినా... చేయాల్సిన రన్‌రేట్ పైపైకి వెళ్లడంతో బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. 31 బంతుల్లో 86 పరుగులు చేయాల్సిన స్థితిలో అభిషేక్ అవుట్ కాగా... మరో మూడు బంతులకే క్లాసెన్ కూడా వెనుదిరగడంతో హైదరాబాద్ ఆశలు గల్లంతయ్యాయి. చివర్లో నితీశ్ కుమార్ రెడ్డి (10 బంతుల్లో 21 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు), ప్యాట్ కమిన్స్ (10 బంతుల్లో 19 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) కొన్ని షాట్లు ఆడినా అది సరిపోలేదు. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సుదర్శన్ (సి) క్లాసెన్ (బి) అన్సారీ 48; గిల్ (రనౌట్) 76; బట్లర్ (సి) అభిషేక్ (బి) కమిన్స్ 64; సుందర్ (సి) నితీశ్ రెడ్డి (బి) ఉనాద్కట్ 21; షారుఖ్ (నాటౌట్) 6; తెవాటియా (సి) అనికేత్ (బి) ఉనాద్కట్ 6; రషీద్ (సి) అండ్ (బి) ఉనాద్కట్ 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 224. వికెట్ల పతనం: 1–87, 2–149, 3–206, 4–218, 5–224, 6–224. బౌలింగ్: షమీ 3–0–48–0, ఉనాద్కట్ 4–0–35–3, కమిన్స్ 4–0–40–1, హర్షల్ 3–0–41–0, అన్సారీ 4–0–42–1, కమిందు 2–0–18–0. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (సి) రషీద్ (బి) ప్రసిధ్ 20; అభిషేక్ (సి) సిరాజ్ (బి) ఇషాంత్ 74; ఇషాన్ కిషన్ (సి) ప్రసిధ్ (బి) కొయెట్జీ 13; క్లాసెన్ (సి) బట్లర్ (బి) ప్రసిధ్ 23; అనికేత్ (సి) షారుఖ్ (బి) సిరాజ్ 3; నితీశ్ రెడ్డి (నాటౌట్) 21; కమిందు (సి) బట్లర్ (బి) సిరాజ్ 0; కమిన్స్ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1–49, 2–82, 3–139, 4–141, 5–145, 6–145, బౌలింగ్: సిరాజ్ 4–0–33–2, ఇషాంత్ 3.2–0–35–1, ప్రసిధ్ 4–0–19–2, కొయెట్జీ 4–0–36–1, సుందర్ 1–0–6–0, రషీద్ 3–0–50–0, సాయికిషోర్ 0.4–0–1–0. ఐపీఎల్లో నేడుబెంగళూరు X చెన్నై వేదిక: బెంగళూరురాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
బంగారం @ 96,800
న్యూఢిల్లీ: బంగారం మళ్లీ మెరిసింది. జ్యువెలర్లు కొనుగోళ్లకు ముందుకు రావడంతో శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) రూ.1,080 పెరిగి రూ.96,800 వద్ద స్థిరపడింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం కేవలం రూ.180 లాభపడి రూ.96,350 వద్ద ముగిసింది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం పట్ల సానుకూల ధోరణి కనిపించింది. ఔన్స్‌కు 47 డాలర్లు పెరిగి 3,269 డాలర్ల స్థాయికి చేరింది. మరోవైపు వెండి ధర సైతం దేశీయంగా కిలోకి రూ.1,600 ఎగసి రూ.97,100 స్థాయి వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల ధోరణితో జ్యువెలర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించినట్టు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది.యూఎస్ వాణిజ్య ఒప్పందాలపై తాజాగా నెలకొన్న సందిగ్ధతతో బంగారం పట్ల సానుకూల సెంటిమెంట్ ఏర్పడినట్టు ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ వైస్ ప్రెసిడెంట్ జతీన్ త్రివేది తెలిపారు. అస్పష్టతకు తోడు వాణిజ్య సంప్రదింపులపై మారుతున్న అమెరికా వైఖరితో ఇన్వెస్టర్లు బంగారంలో షార్ట్ పొజిషన్లను కవర్ చేసుకునేందుకు మొగ్గు చూపించినట్టు చెప్పారు. -
జీడీపీ వృద్ధి 6.3 శాతమే
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025–26) సంబంధించి భారత జీడీపీ వృద్ధి అంచనాలను ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ మరోసారి తగ్గించింది. గత అంచనాలను 0.2 శాతం మేర తగ్గించి 6.3 శాతంగా ప్రకటించింది. 2026–27లో 6.5 శాతం నమోదు కావొచ్చని అంచనా వేసింది. అమెరికా వాణిజ్య విధానాల్లో నెలకొన్న అనిశ్చి తులు ప్రభావం చూపించొచ్చని తెలిపింది. రక్షణాత్మక ధోరణులు పెరిగిపోతున్న తరుణంలో దీన్నుంచి ప్రయోజనం పొందే విజేతలు ఎవరూ ఉండరని పేర్కొంది.చైనా జీడీపీ సైతం 2025లో 0.7 శాతం మేర తగ్గిపోయి 3.5 శాతానికి.. 2026లో మరింత తగ్గి 3 శాతానికి పరిమితం కావొచ్చని తెలిపింది. ఈ ఏడాది మార్చిలోనూ ఎస్అండ్పీ 2025–26 సంవత్సరం భారత జీడీపీ వృద్ధి అంచనాలను 6.7 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గించడం గమనార్హం. వృద్ధి అంచనాలకు కోత పెట్టడం ఇది రెండోసారి. అంచనాలకు మించి టారిఫ్‌ల వల్ల ఆర్థిక వ్యవస్థ ఏ మేరకు నిదానిస్తుందన్న దానిపైనే తమ ప్రాథమిక వృద్ధి అంచనాలు ఆధారపడి ఉంటాయని ఎస్అండ్పీ స్పష్టం చేసింది. 88కి రూపాయి.. 2025 చివరికి డాలర్ మారకంలో రూపాయి విలువ 88 వద్ద స్థిరపడొచ్చని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. అమెరికా టారిఫ్‌ల ప్రకటన తర్వాత డాలర్–రూపాయి మారకంలో తీవ్ర ఆటుపోట్లు నెలకొనడం తెలిసిందే. ప్రస్తుతం 84 స్థాయిలో ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 1.5 శాతం, 2026లో 1.7 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేసింది. అమెరికా టారిఫ్ విధానాలను మూడు బకెట్లుగా పేర్కొంది. చైనాతో దీర్ఘకాలంగా ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దాన్ని విడిగాను, ఐరోపా యూనియన్‌తో సంక్లిష్టంగా ఉండొచ్చని తెలిపింది. మిగిలిన దేశాలు ప్రతీకార చర్యలకు బదులు చర్చల ద్వారా అమెరికాతో ఒప్పందానికి రావచ్చని అంచనా వేసింది. ఆర్థిక వ్యవస్థలపై టారిఫ్‌ల వాస్తవ ప్రభావాన్ని చూడాల్సి ఉందని పేర్కొంది. -
ఢిల్లీ సహా ఉత్తరాదిన భారీ వర్షం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాలు శుక్రవారం ఉదయం ఈదురు గాలులు, వర్షాలతో అతలాకుతలమయ్యాయి. రహదారులపైకి వరద నీరు చేరడంతోపాటు, పలు చోట్ల చెట్లు కూలడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. విమానాల రాకపోకలకు సైతం అంతరాయం ఏర్పడింది. వర్షం సంబంధిత ఘటనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. నజఫ్‌గఢ్ ప్రాంతంలోని ఖర్ఖారీలో ఇంటిపై చెట్టు కూలినపడినట్లు ఉదయం 5.30 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందింది.భారీ వర్షం, తీవ్ర ఈదురుగాలుల కారణంగా ఒకే గది ఉన్న చిన్న ఇంటిపై పక్కనే ఉన్న చెట్టు కూలి పడింది. ఘటనలో ఆ ఇంట్లోని ఐదుగురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది కలిసి వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఒక మహిళ(28), ఆమె ముగ్గురు చిన్నారులు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మహిళ భర్త గాయాలతో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. అదే సమయంలో చావ్లా పోలీస్ స్టేషన్ పరిధిలో పాపారావత్ గ్రామంలో గోడ కూలి ఇద్దరు బాలురు సహా ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారని చెప్పారు. ఒక్కసారిగా కురిసిన వర్షంతో ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, మధుర రోడ్లపై పెద్ద ఎత్తున వరద నిలిచిపోయింది. ఘజియాబాద్‌లో రోడ్లపై వాహనాలు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరి కనిపించాయి. ఫరీదాబాద్‌లో వరదలో సగం వరకు మునిగిన కారును జనం బయటకు తీస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.200 విమానాలు ఆలస్యంఈదురు గాలుల ప్రభావం ఢిల్లీలో విమానాల రాకపోకలపైనా పడింది. మూడు విమానాలను దారి మళ్లించగా 200కు పైగా ఆలస్యంగా నడిచాయని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. కుండపోతతో ట్రాఫిక్ అంతరాయం, వరదలు, చెట్లు, ఇళ్లు కూలిన ఘటనలకు సంబంధించి 100 కాల్స్ అందాయని ఫైర్ విభాగం తెలిపింది. -
సీపోర్ట్‌తో కేరళలో ఆర్థిక స్థిరత్వం
తిరువనంతపురం: కంటైనర్ల ద్వారా సరుకు రావాణా కోసం ప్రత్యేకంగా నిర్మించిన అతిపెద్ద విఝింజమ్ అంతర్జాతీయ సీపోర్ట్‌తో కేరళ రాష్ట్రంలో ఆర్థిక స్థిరత్వం సుసాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అభిలషించారు. భవిష్యత్తులో ఈ సీపోర్ట్ సామర్థ్యం మూడు రెట్లు పెరుగుతుందని, దాంతో కంటైనర్ కార్గో రవాణా విభాగంలో భారత సామర్థ్యం మరింత ఇనుమడిస్తుందని ప్రధాని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని శుక్రవారం కేరళలోని తిరువనంతపురం జిల్లా కేంద్రంలోని విఝింజమ్ వద్ద రూ.8,686 కోట్ల వ్యయంతో నిర్మించిన డీప్‌వాటర్ సీపోర్ట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించారు.అప్పుడలా.. ఇప్పుడిలా‘‘గతంలో భారత కంటైనర్ల రవాణా వ్యవహారంలో 75 శాతం విదేశీ పోర్టుల్లో జరిగేది. దాని వల్ల దేశం భారీ స్థాయిలో ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అప్పటి పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారుతున్నాయి. ఇప్పుడు దేశ సంపద భారత్‌కే ఉపయోగపడుతోంది. గతంలో భారత్‌ను దాటిపోయిన నిధులు ఇప్పడు స్వదేశంలోనే నూతన ఆర్థిక అవకాశాలను సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా కేరళలోని విఝింజమ్ ప్రజలకు అవకాశాలు పెరిగాయి.అంతర్జాతీయ వాణిజ్యంలో తొలినాళ్ల నుంచీ కేరళ నౌకలు భారత్‌కు సరుకు రవాణాలో కీలక భూమిక పోషించాయి. సముద్ర మార్గంలో అంతర్జాతీయ వాణిజ్యంలో భారత హబ్‌గా కేరళ ఎదుగుతోంది. ఇప్పుడు కేరళను మెరుగైన ఆర్థికశక్తిగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది’’ అని మోదీ అన్నారు. అదానీని పొగిడిన మోదీఅదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్(ఏపీసెజ్) ఈ డీప్‌వాటర్ పోర్ట్‌ను నిర్మించింది. ఈ నేపథ్యంలో ఈ సంస్థ అధినేత గౌతమ్ అదానీని మోదీ పొగిడారు. ‘‘ అదానీ గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. సొంత రాష్ట్రంలోనూ ఓడరేవులున్నాయి. అయినాసరే గుజరాత్‌ను కాదని కేరళలో ఇంత పెద్ద సీపోర్ట్‌ను కట్టాడని తెలిస్తే గుజరాత్ ప్రజలు సైతం అసూయపడతారు’’ అని సరదాగా అదానీని మోదీ పొగిడారు.‘‘2014లో సరుకు రవాణా నౌకలు, ప్రజారవాణా, ఇతర పడవల ద్వారా 1.25 లక్షల మంది కార్మికులు ఉపాధి పొందితే ఇప్పుడు వాళ్ల సంఖ్య 3.25 లక్షలకు పెరిగింది. ఈ కార్మికుల సంఖ్యపరంగా భారత్ ప్రపంచ టాప్–3 స్థానం పొందింది. సరుకు రవాణా విషయంలో టాప్–30లో రెండు భారతీయ నౌకాశ్రయాలు స్థానం దక్కించుకున్నాయి’’ అని మోదీ అన్నారు.స్వప్నం సాకారమైంది‘‘కేరళ స్వప్నం సాకారమైంది. అంతర్జాతీయ జలరవాణా, వాణిజ్యం, సరుకు రవాణా చిత్రపటంలో ఈ సీపోర్ట్ భారత్‌కు కొత్త దారులు తెరిచింది’’ అని మోదీ అన్నారు. కార్యక్రమంలో కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, సీఎం విజయన్, గౌతమ్ అదానీ, శశిథరూర్ పాల్గొన్నారు. ‘‘ మూడో మిలీనియంలో వృద్ధి అవకాశాలకు విఝింజమ్ సీపోర్ట్ సింహద్వారంగా నిలవనుంది’’ అని సీఎం విజయన్ అన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, అదానీ సంస్థ సంయుక్తంగా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో ఓడరేవును నిర్మించారు.ఈ ఇద్దరిని నా పక్కన చూశాకకొందరికి అస్సలు నిద్రపట్టదువిపక్షాల ‘ఇండియా’ కూటమిలో కీలక భాగస్వామి అయిన సీపీఎం సీనియర్ నేత, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ మోదీతోపాటు వేదికను పంచుకున్నారు. దీంతో కాంగ్రెస్‌నుద్దేశిస్తూ మోదీ సరదా వ్యాఖ్యలు చేశారు. ‘‘సీఎం విజయన్‌కు నేనో విషయం చెప్పదల్చుకున్నా. విపక్షాల ఇండియా కూటమిలో మీరూ ఒక మూలస్తంభం. ఇక కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సైతం వేదికపైనే ఉన్నారు. మీ ఇద్దరినీ నా పక్కన చూశాక కొందరికి అస్సలు నిద్ర పట్టదు. మలయాళంలోకి నా ప్రసంగాన్ని తర్జుమా చేస్తున్న వ్యక్తి సరిగా చెప్తున్నారో లేదో నాకు తెలీదుగానీ నా ఈ సందేశం చేరాల్సిన వారికి ఇప్పటికే చేరిపోయింది’’ అని వ్యాఖ్యానించారు.దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ‘‘పహల్గాం తర్వాత కూడా విపక్ష నేతల నిద్రలు పాడుచేయడం మీదే మోదీ దృష్టిపెట్టారు. మేం మాత్రం నిద్రలేని రాత్రులు గడిపైనాసరే మిమ్మల్ని మీ ప్రభుత్వ తప్పులకు బా«ధ్యులను చేస్తాం’’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. సొంత కాంగ్రెస్ పార్టీ నేతలతో శశిథరూర్ ఇటీవల అంటీముట్టనట్లు వ్యవహరించడం తెల్సిందే. ‘‘శుక్రవారం నా సొంత నియోజకవర్గం తిరువనంతపురంలో ప్రధానికి స్వాగతం పలికా. సీపోర్ట్ ప్రారంభంకావడం మాకెంతో గర్వకారణం’’ అని శశిథరూర్ అంతకుముందు ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. -
రోడ్డుపై వైమానిక గర్జన
షాజహాన్‌పూర్ (యూపీ): పహల్గాం దాడి ఉద్రిక్తతల నేపథ్యంలో గురువారం నాటి పాకిస్తాన్ సైనిక విన్యాసాలకు మన సైన్యం దీటుగా బదులిచి్చంది. సంప్రదాయ యుద్ధక్షేత్రాలకు భిన్నంగా నడిరోడ్డుపైనా యుద్ధవిమానాల ల్యాండింగ్, టేకాఫ్ జరిపి వాయుసేన సత్తా చాటింది. అత్యంత అధునాతన శత్రు భీకర రఫేల్‌తో పాటు సుఖోయ్–30, ఎంకేఐ, మిరాజ్–2000, మిగ్–29, జాగ్వార్, సీ–130జే సూపర్ హెర్క్యులస్, ఏఎన్–32 విమానాలతో పాటు ఎంఐ–17 వీ5 హెలికాప్టర్లను కూడా ఈ అధునాతన ఎయిర్ర్‌స్టిప్‌పై ల్యాండింగ్, టేకాఫ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలోని గంగా ఎక్స్‌ప్రెస్‌వే ఈ ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలకు వేదికైంది. పగటి పూటే గాక అవసరమైతే కారుచీకట్లోనూ నిర్భీతిగా యుద్ధవిమానాలను రోడ్లపై కూడా దింపగలమని వాయుసేన నిరూపించింది. 594 కిలోమీటర్ల పొడవైన గంగా ఎక్స్‌ప్రెస్ వేలో జలాలాబాద్ సమీపంలోని పిరూ గ్రామం వద్ద నిర్మించిన 3.5 కిలోమీటర్ల పొడవైన ఎయిర్్రస్టిప్పై శుక్రవారం రాత్రి ఎయిర్‌ఫోర్స్ యుద్ధవిమానాలు ఇలా ల్యాండై అలా టేకాఫ్ తీసుకున్నాయి. తద్వారా దేశంలో పగలు, రాత్రి తేడా లేకుండా అన్నివేళలా ఫైటర్జెట్ల ల్యాండింగ్, టేకాఫ్‌కు అనువైన తొలి ఎక్స్‌ప్రెస్‌వే గా ఈ మార్గం నిలిచింది. తొలిసారిగా శుక్రవారమే పరీక్ష గంగా ఎక్స్‌ప్రెస్ వే ఎయిర్్రస్టిప్ను శుక్రవారమే తొలిసారిగా పరీక్షించారు. ఎయిర్‌ఫోర్స్ విభాగంలోని టాప్ ఫైటర్లు దీన్ని వినియోగించాయి. గంగా ఎక్స్‌ప్రెస్ వే ఇప్పటికే 85 శాతం నిర్మాణం పూర్తయింది. యూపీలో ఆగ్రా–లఖ్‌నవూ, పూర్వాంచల్, బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేల మీదా ఎయిర్‌స్ట్రిప్‌లను నిర్మించారు.గంగా ఎక్స్‌ప్రెస్ వే మీద మాత్రమే ప్రస్తుతానికి రాత్రివేళ ఆపరేషన్‌కు అనువుగా అధునాతన లైటింగ్, నావిగేషన్ వ్యవస్థలను సిద్ధంచేశారు. ఈ ఎయిర్ర్స్టిప్ను సంఘవ్యతిరేక శక్తులు పాడుచేయకుండా కనిపెట్టేందుకు 250కి పైగా సీసీటీవీ కెమెరాలను అమర్చారు. ఎయిర్‌్రస్టిప్ పరీక్షను స్వయంగా తిలకించేందుకు సమీప గ్రామాల ప్రజలు, వందలాది మంది పాఠశాల విద్యార్థులు వచ్చారు. రక్షణ శాఖ, యూపీ రాష్ట్ర అధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.రోజంతా చక్కర్లు రాత్రిపూట ల్యాండింగ్, టేకాఫ్‌కు ముందు పగటిపూట యుద్ధ విమానాలను ఎయిర్ర్‌స్టిప్‌పై చాలాసార్లు విజయవంతంగా దింపారు. యుద్ధ సమయాల్లో వైమానిక స్థావరాలు, రన్‌వేలను శత్రు విమానాలు ధ్వంసం చేస్తే అత్యవసరంగా యుద్ధ విమానాలను దించడానికి, మళ్లీ సమరానికి సిద్ధమై వెనువెంటనే టేకాఫ్ తీసుకోవడానికి వీలుగా ఎక్స్‌ప్రెస్ వేలపై ఇలా ఎయిర్్రస్టిప్లను నిర్మిస్తున్నారు. యుద్ధ సమయాల్లో సైనికులు, ఆయుధాలు, సైనిక ఉపకరణాలను మోసుకెళ్లే భారీ సరకు రవాణా విమానాలు సైతం దిగేలా వాటిని అత్యంత పటిష్టంగా నిర్మించారు.ఈ ఎయిర్్రస్టిప్ను అత్యంత అరుదుగా మాత్రమే వాడే అవకాశం ఉందని తెలిసి కూడా మన్నిక, నాణ్యతలో ఏమాత్రం రాజీపడకుండా అధునాతన ఇంజనీరింగ్ నైపుణ్యంతో నిర్మించారు. అందుకు క్యాట్–2 ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ సాంకేతికతను వినియోగించారు. మంచు, వర్షం, పొగమంచు, తక్కువ దృగ్గోచరత వంటి సందర్భాల్లోనూ ల్యాండింగ్, టేకాఫ్ సాధ్యమయ్యేలా ఎక్స్‌ప్రెస్ వేలో ఎత్తయిన, అనువైన ప్రదేశంలోనే స్ట్రిప్‌ను నిర్మించారు. వరదలు, భూకంపం వంటి విపత్తుల వేళ సైన్యాన్ని వెంటనే రంగంలోకి దించడానికీ ఈ స్ట్రిప్ ఉపయోగపడనుంది. అత్యంత తక్కువ ఎత్తులో దూసుకొస్తూ ల్యాండింగ్‌నూ పరీక్షించారు. -
వణుకుతున్న దాయాది
ఇస్లామాబాద్/వాషింగ్టన్/శ్రీనగర్/న్యూఢిల్లీ: భార త ‘పహల్గాం ప్రతీకార’ప్రయత్నాలు చూసి పాకిస్తాన్ బెదిరిపోతోంది. ఉద్రిక్తతలను ఎలాగైనా తగ్గించేలా భారత్‌ను ఒప్పించాలంటూ అరబ్ దేశాలను ఆశ్రయించింది. సౌదీ అరేబియా, యూఈఏ, కువైట్ తదితర దేశాలకు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ శుక్రవారం ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పాక్‌లోని ఆ దేశాల రాయబారులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దక్షిణాసియాలో సుస్థిరతనే కోరుతున్నామంటూ శాంతి వచనాలు వల్లెవేశారు. పహల్గాం దాడితో పాక్‌కు ఏ సంబంధమూ లేదంటూ పాతపాటే పాడారు.పాక్‌లో చైనా రాయబారి జియాంగ్ జైడాంగ్‌తో కూడా షహబాజ్ భేటీ అయ్యారు. ఉగ్రవాదంపై పోరుతో భారత్‌కు తాము పూర్తిస్థాయిలో దన్నుగా నిలుస్తామని అమెరికా పునరుద్ఘాటించింది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి తమ పూర్తి మద్దతుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టామీ బ్రూస్ స్పష్టం చేశారు. భారత్, పాక్ మధ్య నెలకొన్న పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్టు చెప్పారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ విషయమై నిర్ణాయక వ్యాఖ్యలు చేశారు. పాక్ భూభాగం నుంచి మారణకాండకు దిగుతున్న ఉగ్రవాదులను వెదికి పట్టుకోవడంలో భారత్‌కు సహకరించాలని దాయాదికి హితవు పలికారు.‘‘ఇరుదేశాల మధ్య పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. అవి రెండు అణుదేశాల ప్రాంతీయ యుద్ధంగా మారొద్దన్నదే మా ఉద్దేశం. ఏం జరుగుతుందో చూద్దాం’’అని గురువారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అభిప్రాయపడ్డారు. పహల్గాం దాడి సమయంలో వాన్స్ కుటుంబంతో పాటు భారత్‌లోనే ఉండటం తెలిసిందే. దాయాదుల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలని బ్రిటన్ ఆకాంక్షించింది. పహల్గాం దాడిని హౌస్ ఆఫ్ లార్డ్స్ తీవ్రంగా ఖండించినట్టు పేర్కొంది. వాటిని నిరసిస్తూ బ్రిటన్‌లో కొద్ది రోజులుగా శాంతియుత ఆందోళనలు జరుగుతున్న వైనం కూడా సభలో చర్చకు వచ్చినట్టు పేర్కొంది. అదేమీ రహస్యం కాదు: బిలావల్ పాక్ ఉగ్రవాదులకు ఆశ్రయంగా మారడం నిజమేనని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్పర్సన్ బిలావల్ భుట్టో కూడా అంగీకరించారు. మూడు దశాబ్దాలుగా పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇటీవల అంతర్జాతీయ మీడియా సాక్షిగా అంగీకరించడం తెలిసిందే. దీనిపై స్కై న్యూస్ ఇంటర్వ్యూలో బిలావల్ ఈ మేరకు స్పందించారు. రక్షణ మంత్రి వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా అని ప్రశ్నించగా, ‘అది పెద్ద రహస్యమేమీ కాదు. పాక్‌ది ఉగ్రవాద గతమే’’అంటూ పాక్ నిర్వాకాన్ని బాహాటంగా అంగీకరించారు. అయితే దానివల్ల దేశం ఎంతగానో నష్టపోయిందని వాపోయారు.‘‘ఉగ్రవాదం పాక్‌కే కాదు, అంతర్జాతీయ సమాజానికి కూడా పెనుబెడదగా పరిణమించింది. పాక్ దశలవారీగా ఉగ్రవాదానికి మద్దతిస్తూ వచ్చింది. మా సమాజం ఇస్లామీకరణ, సైనికీకరణ దశల గుండా సాగింది. వీటన్నింటివల్లా మేం నష్టపోతూ వచ్చాం. అయితే వాటినుంచి పాఠాలు నేర్చుకున్నాం. సింధూ పరివాహక నదులకు భారత్ నీరు వదలకుంటే రక్తం పారుతుందంటూ బిలావల్ ఇటీవల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. తన ఉద్దేశం అది కాదని ఆయన తాజాగా చెప్పుకొచ్చారు. ‘‘నీటిని ఆపడాన్ని యుద్ధ చర్యగానే పరిగణిస్తామని మా ప్రభుత్వమే చెప్పింది. యుద్ధం జరిగితే పారేది రక్తమేగా. అదే నేనూ చెప్పా’’అన్నారు. మరోవైపు సింధూ జల ఒప్పందం నిలుపుదలను నిరసిస్తూ భారత్‌కు దౌత్య నోటీసులివ్వాలని పాక్ యోచిస్తోంది. ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికల మీదా లేవనెత్తేందుకు సిద్ధమవుతోంది. హాకింగ్‌కు విఫలయత్నాలు పాక్ ప్రేరేపిత హాకర్ గ్రూపులు భారత వెబ్సైట్లపై శుక్రవారం మరోసారి భారీగా సైబర్ దాడులకు దిగాయి. జమ్మూలోని ఆర్మీ స్కూల్స్, రిటైర్డ్ సైనికుల ఆరోగ్య సేవలు తదితరాలకు సంబంధించిన సైట్లను హాక్ చేసేందుకు విఫలయత్నం చేశాయి. సైబర్ గ్రూప్ హోక్స్1337, నేçషనల్ సైబర్ క్రూ పేరిట దాడులు జరిగినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ‘‘పాక్‌తో పాటు పలు పశ్చిమాసియా దేశాలు, ఇండొనేసియా, మొరాకో తదితర చోట్ల నుంచి ఈ సైబర్ దాడులు జరిగాయి. వాటికి పాల్పడ్డ పలు సంస్థలు ఇస్లామిక్ భావజాలానికి మద్దతు పలుకుతున్నట్టు చెప్పుకున్నాయి. వాటన్నింటినీ సమర్థంగా తిప్పికొట్టాం’’అని తెలిపాయి. పహల్గాం దాడి నుంచీ ఈ తరహా దాడులు విపరీతంగా పెరిగిపోయినట్టు వెల్లడించాయి. ఇదంతా పాక్ హైబ్రిడ్ యుద్ధతంత్రంలో భాగమని అనుమానిస్తున్నారు. ఐదు సెక్ట్టర్లలో కాల్పులుపాక్ వరుసగా ఎనిమిదో రోజు కాల్పుల విరమణకు తూట్లు పొడిచింది. జమ్మూ కశ్మీర్లో ఐదు జిల్లాల వెంబడి నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి గురువారం రాత్రి కూడా కాల్పులకు తెగబడింది. కుప్వారా, బారాముల్లా, పూంచ్, నౌషేరా, అఖూ్నర్ ప్రాంతాల్లో ఎలాంటి కవ్వింపులూ లేకుండానే పాక్ దళాలు తేలికపాటి ఆయుధాలతో కాల్పులకు దిగినట్టు సైన్యం అధికార ప్రతినిధి వెల్లడించారు. ‘‘తొలుత ఉత్తర కశ్మీర్లో కుప్వారా, బారాముల్లా జిల్లాల్లో మొదలైన కాల్పులు జమ్మూ ప్రాంతంలోని పూంచ్, అఖ్నూర్ సెక్టర్లకు విస్తరించాయి.అనంతరం నౌషేరాలోని సుందర్బనీ, జమ్మూ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు గుండా పర్గ్వాల్ సెక్టర్లోనూ కాల్పులకు తెగబడ్డాయి. వాటిని భారత సైన్యం దీటుగా తిప్పికొట్టింది’’అని తెలిపారు. ఉద్రిక్తతలు మరింత పెరగవచ్చన్న అంచనాల నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లోని సరిహద్దు గ్రామాల ప్రజలు సురక్షితంగా తలదాచుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన కమ్యూనిటీ, వ్యక్తిగత బంకర్లను సిద్ధం చేసుకుంటున్నారు.కథువా, సాంబా, రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో ఇంకా పంటకోతలు జరగాల్సి ఉంది. పాక్‌తో భారత్ 3,323 కి.మీ. మేరకు సరిహద్దును పంచుకుంటోంది. ఇందులో 2,400 కి.మీ. మేరకు అంతర్జాతీయ సరిహద్దు గుజరాత్ నుంచి జమ్మూ దాకా విస్తరించింది. 740 కి.మీ. నియంత్రణ రేఖ, యాక్చ్యువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ (ఏజీపీఎల్)తో పాటు మరో 110 కి.మీ. సియాచిన్ ప్రాంతంలో విస్తరించి ఉంది. -
నిర్బంధ ఓటింగ్‌కు వందేళ్లు
ఆ్రస్టేలియా పార్లమెంటుకు శనివారం ఎన్నికలు జరుగుతున్నాయి. దేశంలోని 1.8 కోట్ల మంది అర్హులైన ఓటర్లు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారు. ఆ దేశంలో ఓటేయడం కేవలం నచ్చిన అభ్యరి్థని ఎన్నుకునే ప్రక్రియ మాత్రమే కాదు.. తప్పనిసరిగా పాటించి తీరాల్సిన చట్టపరమైన బాధ్యత. ఎందుకంటే ఆ్రస్టేలియాలో 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు వేయాలని చట్టముంది. దాంతో అనేక దేశాలు ప్రజలను పోలింగ్ కేంద్రాలకు తీసుకురావడానికి నానా కష్టాలు పడుతుంటే ఆస్ట్రేలియా మాత్రం ప్రపంచంలోనే అత్యధిక ఓటింగ్ నమోదయ్యే దేశాల్లో ఒకటిగా ఉంది. 2022 ఎన్నికల్లో ఏకంగా 90 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు! బ్రిటన్‌లో 2024 ఎన్నికల్లో కేవలం 60 శాతం పోలింగ్ నమోదయ్యింది. అమెరికాలో ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో 64 శాతం నమోదైంది. చట్ట సవరణ ఆ్రస్టేలియాలో 1924లో ఎన్నికల చట్టాన్ని సవరించి ఫెడరల్ ఎన్నికల్లో ఓటేయడాన్ని తప్పనిసరి చేశారు. దానిప్రకారం ఫెడరల్ ఎన్నికల్లో ఓటు వేయకపోతే 20 డాలర్లు, రాష్ట్ర ఎన్నికల్లో ఓటేయకపోతే 79 డాలర్ల దాకా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ చట్టం బాగానే పనిచేసింది. 1922 ఎన్నికల్లో 60 శాతం కూడా లేని ఓటింగ్ చట్టం తర్వాత 1925 ఎన్నికల్లో ఏకంగా 91 శాతం దాటేసింది. నిర్బంధ ఓటింగ్ వల్ల గెలిచినవారు మరింత బాధ్యతాయుతంగా ఉంటారనే వాదన కూడా ఉంది.నిర్బంధ ఓటు అట్టడుగు వర్గాలకు మెరుగైన ప్రాతినిధ్యం కల్పించడానికి కూడా సహాయపడుతుందని, ఇది మరింత సమసమాజ ప్రజా విధానాలను రూపొందిస్తుందని నిపుణుల విశ్లేషణ. నిర్బంధ ఓటింగ్ విధానంలో మధ్యతరగతి పౌరులు, వారి ఆందోళనలు, సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటారని, ఇది ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో కనిపించే పోలరైజేషన్ రాజకీయాలను నిరోధించి భిన్నమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందనే అభిప్రాయం ఉంది. ప్రత్యేక పరిస్థితుల్లో ఓటు వేయలేకపోతే ఏంటి పరిస్థితి? సరైన కారణం ఉంటే మినహాయింపు ఉంటుంది.ఆ్రస్టేలియన్లు ఏమంటున్నారు?నిర్బంధ ఓటింగ్ గురించి ఆస్ట్రేలియాలో ఎలాంటి వివాదం లేదు. ఈ చట్టానికి ప్రజల గట్టి మద్దతుంది. దీనికి 70 శాతం ఆమోదం ఉందని 1967 నుంచి జరిగిన పలు జాతీయ సర్వేలు తేల్చాయి. అయితే నిర్బంధ ఓటింగ్‌ను రద్దు చేయాలని దశాబ్దాలుగా డిమాండ్, ఆందోళనలు చేస్తున్న వాళ్లూ ఉన్నారు. ఓటేయాలో వద్దో ఎంచుకునే హక్కు పౌరులకు ఉండాలన్నది వారి వాదన. వాళ్లకు ప్రజాదరణ అంతంతే. నిర్బంధ ఓటింగ్ ద్వారా యువకులు మనమందరం ఎలాగైనా ఓటు వేయాలి అనే అవగాహనకు వస్తున్నారు. రాజకీయ ప్రక్రియలో పాల్గొనడంతోపాటు ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. నిర్బంధ ఓటు లేకపోయినా స్వచ్ఛందంగా ఓటేసే వాళ్లమేనని 2022లో 77 శాతం మంది ఆ్రస్టేలియన్లు చెప్పడం విశేషం!వేతనంతో కూడిన సెలవుఓటింగ్‌కు అడ్డంకులు తొలగించడానికి, ప్రజలంతా ఓటింగ్‌లో పాల్గొనేలా చూడటానికి అధికారులు పలు విధానాలను అమలు చేశారు. ఆస్ట్రేలియాలో శనివారాల్లోనే ఎన్నికలు జరుగుతాయి. వీకెండ్ కావడంతో ఎక్కువ మంది స్వేచ్ఛగా పోలింగ్ కేంద్రాలకు వెళ్తారు. యాజమాన్యాలు ఎన్నికల రోజున కార్మి కులకు వేతనంతో కూడిన సెలవు ఇస్తాయి.పోలింగ్ బూత్‌ల దగ్గర బార్బెక్యూలపై కాల్చిన డెమోక్రసీ సాసేజ్లు అదనపు ప్రోత్సాహం. ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రాల దగ్గర నిధుల సేకరణ కోసం ఏర్పాటు చేసే ఈ స్నాక్స్ ఆ్రస్టేలియా ఎన్నికలకు చిహ్నాలుగా మారాయి. ఇవి స్థానిక పాఠశాలలు, కమ్యూనిటీలకు అతి పెద్ద నిధుల సేకరణ కార్యక్రమాలుగా మారా యి. మొత్తంగా ఎన్నికల రోజు ఆ్రస్టేలియాలో పండుగ వాతావరణం ఉంటుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రంపే బదులివ్వాలి
వాషింగ్టన్: స్టూడెంట్ వీసాల రద్దు, విదేశీ విద్యార్థుల చట్టపరమైన హోదాను రద్దు చేస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై భారత సంతతికి చెందిన డెమొక్రాట్ ప్రమీలా జయపాల్ మండిపడ్డారు. ఏ ప్రాతిపదికన ఈ చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలన్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ, హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగాలకు లేఖ రాశారు. దానిపై 130 మందికి పైగా డెమొక్రాట్లు సంతకాలు చేశారు. విద్యా సంవత్సరం మధ్యలో అకస్మాత్తుగా వీసాల రద్దు వల్ల విద్యార్థుల భవిష్యత్ గందరగోళంలో పడుతుందని జయపాల్ అన్నారు.వీసా హోదా అనిశ్చితి అమెరికా విశ్వవిద్యాలయాలను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘రద్దు చేసిన కొందరు విద్యార్థుల వీసాలను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించినా అదింకా అమలు కాలేదు. కొందరు విద్యార్థులు ఇంకా ఇమిగ్రేషన్ నిర్బంధంలో ఉన్నారు. భవిష్యత్‌లో మరిన్ని వీసా రద్దులు జరుగుతాయనే భయాందోళనలు నెలకొన్నాయి’’అని లేఖలో పేర్కొన్నారు.‘‘ఇది స్టూడెంట్ వీసా హోల్డర్లపై దాడి. ఈ భారీ, రాజకీయ ప్రేరేపిత ఇమ్మిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ విశ్వవిద్యాలయాలను భయానక ప్రదేశాలుగా మారుస్తోంది’అని జయపాల్ హెచ్చరించారు. ఆమె ఇమ్మిగ్రేషన్ ఇంటిగ్రిటీ, సెక్యూరిటీ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సబ్ కమిటీలో సభ్యురాలు. కొన్ని వారాల్లో గ్రాడ్యుయేషన్ ఉండగా ఆకస్మిక వీసాల రద్దు పలువురు విద్యార్థులను అయోమయంలో పడేసింది. తమ వీసా హోదాను పునరుద్ధరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా 100 మందికి పైగా విద్యార్థులు కోర్టులను ఆశ్రయించారు. ఎవరీ ప్రమీలా జయపాల్? అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్ మహిళగా జయపాల్ రికార్డు సృష్టించారు. 1965 సెప్టెంబర్ 21న చెన్నైలో జన్మించిన ఆమె వాషింగ్టన్ 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ సంస్కరణలు, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక న్యాయం, వాతావరణం మార్పులు వంటి అంశాలపై ఎంతోకాలంగా క్రియాశీలకంగా పని చేస్తున్నారు. విద్యార్థి హక్కులు, వలస సంస్కరణల కోసం గళమెత్తుతున్నారు. -
పాక్‌పై ఫైనాన్షియల్ స్ట్రైక్స్!
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్లో సర్జికల్ స్ట్రైక్స్ చేసి డజన్లకొద్దీ ముష్కరులను అంతమొందించిన భారత ఇప్పుడు పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఆర్థిక మూలాలపై కోలుకోలేని దెబ్బ కొట్టాలని కంకణం కట్టుకుంది. అందులోభాగంగా విదేశీ నిధులను పాక్ సర్కార్ ఉగ్ర కార్యకలాపాలు, సీమాంతర ఉగ్రవాదం, ఇతర చీకటి పనులను కేటాయిస్తోందని నిరూపించడం ద్వారా విదేశీ సాయం నిలిచిపోయేలా చేయాలని భారత్ యోచిస్తోంది.ఇందుకోసం ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్)పై భారత్ తీవ్ర స్థాయిలో ఒత్తిడిచేయనుంది. ఈ టాస్‌్కఫోర్స్‌కు చెందిన ‘గ్రే’జాబితాలోకి చేరితే ఆయా దేశాలకు అంతర్జాతీయ సాయం, నిధుల మంజూరు, విదేశాల మద్దతు, విదేశీ పెట్టుబడులు రావడం చాలా కష్టమవుతుంది. దీనికితోడు ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ద్వారా పాకిస్తాన్‌కు రాబోయే వందల కోట్ల విలువైన నిధులను అడ్డుకుని పాక్‌ను ఆర్థిక కష్టాల కడలిలో ముంచాలని మోదీ సర్కార్ తీవ్రంగా శ్రమిస్తోంది. గతంలో పాక్‌పై గ్రే లిస్ట్ కొరడా విదేశీ నిధులను పూర్తిగా దేశాభివృద్ధికి కోసం కేటాయించకుండా అందులో కొంత మొత్తాలను ఉగ్ర సంబంధ కార్యకలాపాలకు వెచ్చించినట్లు పాకిస్తాన్‌పై ఆరోపణలు వచ్చాయి. ఇవి నిజమని తేలడంతో పాక్‌ను 2018 జూన్‌లో ఎఫ్ఏటీఎఫ్ తన గ్రే లిస్ట్‌లో పెట్టింది. దీంతో విదేశీ సాయం అందక పాక్ తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంది. దీంతో బుద్ధి తెచ్చుకున్న పాకిస్తాన్ తన ఉగ్రకార్యకలాపాలకు నిధుల్లో కోత పెట్టింది. పలువురు ఉగ్రవాదులను అరెస్ట్‌చేసింది.దీంతో ఎట్టకేలకు 2022 అక్టోబర్‌లో గ్రే జాబితా నుంచి పాకిస్తాన్‌కు విముక్తి లభించింది. ఇప్పుడు సైతం ఇలాగే పాకిస్తాన్‌ను గ్రే జాబితాలోకి చేర్చేలా ఎఫ్‌ఏటీఎఫ్‌పై మోదీ సర్కార్ ఒత్తిడిని పెంచింది. ఎఫ్ఏటీఎఫ్లో 40 సభ్యదేశాలున్నాయి. వీటిలో భారత్ తన అత్యంత స్నేహశీల దేశాల ద్వారా ఈ పని ముగించాలని చూస్తోంది. ఎఫ్ఏటీఎఫ్ ప్లీనరీ సమావేశాలు ఏటా ఫిబ్రవరి, జూన్, అక్టోబర్‌లో జరుగుతాయి. ఈ జూన్ సెషన్లో ఈ మేరకు మద్దతు కూడగట్టేందుకు మిత్రదేశాలతో భారత్ ఇప్పటికే సంప్రదింపులు మొదలెట్టినట్లు వార్తలొచ్చాయి. ఐఎంఎఫ్పైనా కేంద్రం ఒత్తిడిస్వదేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, తగ్గిపోయిన విదేశీ పెట్టుబడులతో సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న పాకిస్తాన్ దేశ పాలన కోసం తరచూ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థపై ఆధారపడుతోంది. దీంతో వచ్చే మూడేళ్లలో 7 బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు ఐఎంఎఫ్ ఒప్పుకుంది. ఈ నిధులొస్తే పాక్ వాటిని ఉగ్రకార్యకలాపాలకు దుర్వినియోగం చేయనుందని భారత్ ఐఎంఎఫ్ ఎదుట ఆందోళన వ్యక్తంచేయనుంది. భారత వాదన నెగ్గితే ఈ నిధులు ఆగిపోవడమో, తగ్గిపోవడమో జరగొచ్చు. నిధుల విస్తరణపై మే 9వ తేదీన ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్, పాక్ ఉన్నతాధికారుల మధ్య తొలి సమీక్ష సమావేశం జరగనుంది.పాకిస్తాన్‌కు నిధుల మంజూరుపై పునరాలోచన చేస్తే మంచిదని ఇతర అంతర్జాతీయ బహుళజాతి సంస్థలు, సంఘాలను సైతం భారత్ కోరబోతోంది. ప్రజాపనుల రుణాలు, సాంకేతిక సహకారానికి సంబంధించి మొత్తంగా 764 పనులకు గాను ఏకంగా 43.7 బిలియన్ డాలర్ల నిధులను పాక్‌కు ఇచ్చేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ నిర్ణయించింది. ఇప్పటికే 9.13 బిలియన్ డాలర్ల రుణాలిచ్చింది. నాలుగు నెలల క్రితం ప్రపంచ బ్యాంక్ సైతం పాకిస్తాన్‌కు 20 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. -
గ్రూప్–1 నియామకాలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేం
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 నియామకాలపై గత నెలలో ఇచ్చిన స్టేని ఎత్తివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. స్టే ఎత్తివేసి నియామకాలకు అనుమతిస్తే ఇక ఆ తర్వాత విచారణ జరిపినా అర్థం లేదని అభిప్రాయపడింది. ఎంపికైన వారు, ఎంపిక కాని వారినీ దృష్టిలో పెట్టుకుని క్షుణ్ణంగా విచారణ చేపడతామని స్పష్టం చేసింది. సమగ్ర విచారణ చేపట్టకుండా, వాదనలు పూర్తిగా వినకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని చెప్పింది. గ్రూప్–1 మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లలో విచారణను హైకోర్టు జూన్ 11కు వాయిదా వేసింది. అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకుతో చెప్పవచ్చు: న్యాయమూర్తి 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు, అసమానతలు చోటుచేసుకున్నాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట శివనగర్‌కు చెందిన కె.పర్శరాములుతో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు శుక్రవారం మరోసారి విచారణ చేపట్టారు. కోర్టు సమయం ముగిసినా రెండు గంటలకు పైగా విచారణ కొనసాగించారు.తొలుత వాదనలు వినిపించేందుకు అరగంట సమయం కావాలని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది రచనారెడ్డి కోరగా, న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఇలా వాదనలు వినిపిస్తూ పోతే ఇక అంతు ఉండదన్నారు. అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకుతో చెప్పవచ్చని.. వాదనలు సంక్షిప్తంగా విన్పించాలని సూచించారు. రీకౌంటింగ్‌లో మార్కులు తగ్గాయని పిటిషనర్లు పేర్కొంటున్న పూజితారెడ్డి సమాధాన పత్రాలు సహా ఇతర వివరాలను సీల్డ్ కవర్లో ఇవ్వాలని టీజీపీఎస్సీకి సూచించారు. నకిలీ పత్రాలు, తప్పుడు డాక్యుమెంట్లు సమర్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇరుపక్షాలను హెచ్చరించారు. వాదనలు ఇలా.. రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని చెబుతున్న కమిషన్ వద్ద మెయిన్స్ పరీక్షలు ఎందరు రాశారో కచ్చిత్చమైన వివరాలు ఇప్పటికీ లేవు. బయోమెట్రిక్ తీసుకున్న తర్వాత కూడా లెక్కల్లో తేడా ఎందుకు వస్తుంది? కొన్ని సెంటర్ల నుంచి 10 శాతం మంది ఎంపికయ్యారు. తెలుగు, ఉర్దూ, ఆంగ్లం మీడియాల్లో మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. ఆయా మీడియం పేపర్లను ఆ సబ్జెక్టుల్లో నిపుణులైన వారే దిద్దారా? వారి వివరాలు లేవు. మూల్యాంకనం చేసిన వారిలో తెలుగు వచ్చిన వారు ఎందరున్నారు? ఇలాంటి వివరాలు కమిషన్ ఎక్కడా పేర్కొనలేదు..’అని చెప్పారు.టీజీపీఎస్సీ తరఫున న్యాయవాది పీఎస్ రాజశేఖర్ వాదనలు వినిపిస్తూ.. ‘కొందరు తప్పుడు డాక్యుమెంట్లతో పిటిషన్లు వేస్తున్నారు. ఇలా వేసిన కొందరు పిటిషనర్లకు ఇదే హైకోర్టులోని మరో బెంచ్ జరిమానా కూడా విధించింది. ఓ పిటిషనర్‌కు 60 మార్కులు తగ్గాయని పిటిషనర్ న్యాయవాది చెబుతున్నారు. అది తప్పుడు డాక్యుమెంటు. కొందరు పిటిషనర్లు వకాలత్‌పై సంతకమే పెట్టలేదు. తప్పుడు సంతకాలతో పిటిషన్లు వేస్తున్నారు. నియామకాలపై ఇచ్చిన స్టేని ఎత్తివేయాలి..’అని కోరారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది. ‘నాపై విచారణను ఉపసంహరించండి’గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల్లో తప్పుడు మార్కుల మెమో పెట్టిన వ్యవహారంలో తనపై విచారణ ఉపసంహరించాలని సంగారెడ్డి జిల్లా లింగంపల్లి పంచాయతీ సెక్రటరీ షబ్నం ఆర్యా(అభ్యర్థి) హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రిజి్రస్టార్ జనరల్‌కు లేఖ రాశారు. మెయిన్స్ పారదర్శకంగా జరగలేదని పేర్కొంటూ ఓ వాట్సాప్ గ్రూప్ రూపొందించి, తనను కూడా అందులో చేర్చారన్నారు. టీజీపీఎస్సీపై పోరాడటం కోసమంటూ రూ.5 వేలు అడిగితే పంపానన్నారు. ఆ తర్వాత ఇటీవల డబ్ల్యూపీ 12431/2025 పిటిషన్ ఉత్తర్వుల కాపీని గ్రూప్‌లో పోస్టు చేశారని పేర్కొన్నారు. పిటిషనర్ల జాబితాలో తన పేరు ఉండటం చూసి ఆశ్చర్యపోయానన్నారు. తాను కేసు వేయలేదని, ఎలాంటి వకాలత్‌పై సంతకం పెట్టలేదని, తన పేరు తొలగించాలన్నారు. -
ఏఐ మర్యాద.. చాలా కాస్ట్లీ గురూ
కృత్రిమ మేధ (ఏఐ).. సాంకేతిక ప్రపంచాన్ని శాసిస్తున్న ఓ సరికొత్త ఆవిష్కరణ. గూగుల్ సెర్చ్ ఇంజన్ మాత్రమే తెలిసిన మనకు అంతకు మించి సమాచారాన్ని క్రోడీకరించి ఇచ్చే అనువైన సాధనం. అందుకే, ఏఐని రోజువారీ వ్యాపకాల్లో అత్యధికంగా వినియోగిస్తున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది.గిబ్లి–శైలి, పోర్ట్రెయిట్ సెల్ఫీలు, గ్రూప్ చిత్రాల రూపకల్పనలో ఏఐని ఎక్కువగా వాడుతున్నారు. ఈ నేపథ్యంలో చాట్ జీపీటీకి సంబంధించి ఎవరూ ఊహించలేని, ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ . కేవలం రెండు పదాల వినియోగం వల్ల ఏఐ ఖర్చు విపరీతంగా పెరుగుతోందట. ఇప్పుడు ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా ఏఐని వినియోగించేవారిని నివ్వెరపోయేలా చేసింది.కృత్రిమ మేధకు కృతజ్ఞతల భారంధన్యవాదాలు, దయచేసి అనే పదాలను.. గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు(జీపీయూ)గా పిలిచే ప్రత్యేక చిప్‌లతో నిండిన సర్వర్లను ఉపయోగించి ఏఐ ఉత్పత్తి చేస్తుంది. ప్రజలు చాట్‌జీపీటీకి ‘దయచేసి, ధన్యవాదాలు‘ అని చెప్పడం వల్లే కంపెనీ విద్యుత్ ఖర్చుల కోసం పది మిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తోందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ ్స కంపెనీ (ఓపెన్ ఏఐ) సీఈఓ సామ్ ఆల్ట్మాన్ వెల్లడించారు. ఏఐ ద్వారా ఒక ప్రశ్నకు సమాధానం వెదకడానికి గూగుల్ కంటే 10 రెట్లు ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. వినియోగదారులతో ఏఐ మర్యాదగా ఉండటానికి రోజుకి 10 మిలియన్ల డాలర్లు ఖర్చవుతుందని ఆయన వివరించారు.ఒక దేశానికి సరిపోయే విద్యుత్కృత్రిమ మేధ, చాట్ జీపీటీ వంటి వ్యవస్థలకు ఎక్కువ విద్యుత్ శక్తిని వినియోగించే భారీ డేటా కేంద్రాలు (సర్వర్లు) అవసరం. వాషింగ్టన్ పోస్ట్ పరిశోధన ప్రకారం ఏఐ ద్వారా 100 పదాల ఇ–మెయిల్‌ను తయారు చేయడానికి వాడే విద్యుత్... గంటకు 14 ఎల్ఈడీ లైట్లు వెలగడానికి వాడేంత విద్యుత్ వినియోగంతో సమానం. అలాంటిది ప్రతిరోజూ ఏఐని మనం లక్షలాది ప్రశ్నలు అడుగుతుంటాం. వాటన్నిటికీ ఏఐకి ఎంత విద్యుత్ అవసరం అవుతుందో ఊహించడమే కష్టం.ప్రస్తుతం ఉన్న డేటా సెంటర్ల విద్యుత్ వినియోగం వాటా ఇప్పటికే ప్రపంచంలోని మొత్తం విద్యుత్ వినియోగంలో 2 శాతంగా ఉంది. ఏఐ మన నిత్య జీవితంలో మరింతగా కలిసిపోయినందున ఇది ఇంకా భారీగా పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆర్థిక సలహాల సైట్ బెస్ట్ బ్రోకర్స్ పరిశోధకులు చాట్‌జీపీటీకి ఏటా సగటున 1.059 బిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమని కనుగొన్నారు. అంటే విద్యుత్ ఖర్చుల్లో ఏఐ చాట్‌బాట్ కోసం మాత్రమే ఏటా దాదాపు 139.7 మిలియన్ డాలర్లు ఖర్చవుతుంది. ఇది 2026 నాటికి రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. అంటే జపాన్ వంటి దేశం మొత్తం ఇంధన అవసరాలకు సరిపోయేంత విద్యుత్‌ను ఒక్క ఏఐ వాడేస్తోంది.కర్బన ఉద్గారాలు.. ఖర్చైపోతున్న నీరురివర్సైడ్లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధన ప్రకారం.. ఏఐకి శక్తినిచ్చే సర్వర్లను చల్లబరచడానికి అధిక మొత్తంలో నీరు అవసరం. వంద పదాల ఇ–మెయిల్‌కు చాట్‌జీపీటీకి 1,408 మిల్లీలీటర్ల వరకూ నీరు వినియోగం అవుతుంది. మసాచుసెట్స్ విశ్వవిద్యాలయం పరిశోధన ప్రకారం ఒక పెద్ద ఏఐ మోడల్‌ను తయారు చేయడం వల్ల విడుదలయ్యే కార్బన్... ఐదు కార్లు వాటి మొత్తం జీవితకాలంలో విడుదల చేసే కార్బన్ కంటే ఎక్కువ.గూగుల్ కూడా 2019 నుంచి ఉద్గారాలలో 48 శాతం పెరిగినట్లు వెల్లడించింది. ఇదంతా ఎక్కువగా ఏఐ వల్ల జరిగింది. కాబట్టి, ఏఐ అసిస్టెంట్‌కు కృతజ్ఞతలు చెప్పడం మనకు చాలా సాధారణంగా అనిపిస్తున్నప్పటికీ, ప్రతి అదనపు పదం సిస్టమ్ పనిభారాన్ని, పర్యావరణానికి ముప్పుని, సంస్థలకు ఖర్చుని పెంచుతుందని గుర్తించాలనే సలహా ఇప్పుడు టెక్ నిపుణుల నుంచి ఎక్కువగా వినిపిస్తోంది.ఏఐ మర్యాద నేర్పుతోందా?..: ‘ఫ్యూచర్’ అనే అమెరికాకు చెందిన ఓ పత్రిక తాజా అధ్యయనం ప్రకారం అమెరికాలో ఏఐని ఉపయోగించే 67శాతం వ్యక్తులు చాట్‌బాట్‌తో మర్యాదగా ప్రవర్తిస్తున్నారు. వారిలోని 18 శాతం మంది ‘దయచేసి, ధన్యవాదాలు‘ అని చెబుతున్నారు. మిగిలిన 82శాతం మంది అది ఏఐ అయితే ఏంటీ, సాటి మనిషి అయితే ఏంటి.. ఎవరితోనైనా మర్యాదగా ప్రవర్తించడం మంచిదని తాము ఆ విధంగా ఉన్నామని చెప్పారు. కాగా ఏఐతో మర్యాదగా ఉండటం వల్ల ప్రయోజనాలున్నాయని మైక్రోసాఫ్ట్ డిజైన్ డైరెక్టర్ కుర్టిస్ బీవర్స్ మైక్రోసాఫ్ట్ బ్లాగ్ పోస్ట్‌లో రాసుకొచ్చారు. మీరు ఏఐతో మర్యాదగా ప్రవర్తిస్తే, అది అదే విధంగా స్పందించే అవకాశం ఉందనేది ఆయన మాటల సారాంశం. -
చిన్న పరిశ్రమకు అప్పు కరువు
సాక్షి, హైదరాబాద్: భారతీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వాణిజ్య సంస్థ (ఎంఎస్ఎంఈ)లు అప్పులు పుట్టక, పెట్టుబడులు రాక కునారిల్లుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పరిశ్రమ ప్రోత్సాహానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నా, అప్పులు ఇవ్వాలని లక్ష్యాలు నిర్దేశించినా బ్యాంకర్లు రుణాలు ఇవ్వటంలేదు. ఎంఎస్ఎంఈలకు రూ.80 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని కేంద్రం నిర్దేశించగా.. బ్యాంకులు ఇచ్చింది మాత్రం 19 శాతమేనని నీతి ఆయోగ్ వెల్లడించింది. ఎంఎస్ఎంఈ రంగంలో పోటీతత్వం పెంపునకు సంబంధించిన నివేదికను ఈ సంస్థ శుక్రవారం విడుదల చేసింది. ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్నెస్ (ఐఎఫ్‌సీ) సహకారంతో ఈ నివేదికను రూపొందించింది. భారతీయ ఎంఎస్ఎంఈల పోటీతత్వాన్ని ప్రభావితం చేస్తున్న కీలక సవాళ్లను ఈ నివేదిక విశ్లేషించింది. రుణ వితరణ 19 శాతమే: దేశంలో ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేందుకు బ్యాంకుల ద్వారా రూ.80 లక్షల కోట్ల రుణాలు ఇప్పించాలని 2021–22 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నిర్ణయించింది. కానీ, బ్యాంకులు ఇచ్చింది మాత్రం లక్ష్యంలో 19 శాతమేనని నీతి ఆయోగ్ నివేదికలో పేర్కొంది. 2020–24 మధ్యకాలంలో బ్యాంకుల నుంచి చిన్న సంస్థలకు రుణాలు 14 నుంచి 20 శాతానికి పెరగ్గా, మధ్య తరహా సంస్థలకు 4 నుంచి 9 శాతానికి పెరిగాయి. ఎంఎస్ఎంఈలకు రుణ వితరణను పెంచేందుకు ఏర్పాటు చేసిన క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ (సీజీటీఎంఎస్ఈ)ను విస్తరించినా పరిమిత ఫలితాలే సాధించినట్లు నివేదిక పేర్కొంది. పీడిస్తున్న నైపుణ్య లేమి నైపుణ్య లేమి ఎంఎస్ఎంఈలను వేధిస్తోంది. ఈ సంస్థల్లో పనిచేసేవారిలో ఎక్కువ మందికి సాంకేతిక శిక్షణ లేకపోవడం సంస్థల ఉత్పాదకత, నిర్వహణపై ప్రభావం చూపుతోంది. మరోవైపు అనేక ఎంఎస్ఎంఈలు నాణ్యత పెంపు కోసం అవసరమైన ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై నిధులు వెచ్చించడం లేదు. దీంతో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ పోటీలో భారతీయ ఎంఎస్ఎంఈలు నిలదొక్కులేకపోతున్నాయని నీతి ఆయోగ్ విశ్లేషించింది.నాణ్యమైన విద్యుత్, ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడంతో ఆధునిక సాంకేతికతను ఈ రంగం అందిపుచ్చుకోలేకపోతోంది. అధునిక టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలపై ఈ సంస్థలకు అవగాహన ఉండటం లేదు. జాతీయ, అంతర్జాతీయ పోటీలో రాణించాలంటే ఆధునిక సాంకేతికతను స్థానిక ఎంఎస్ఎంఈలు అందిపుచ్చుకోవాలని నీతి ఆయోగ్ సూచించింది. భాగస్వామ్యాలతోనే పోటీతత్వం ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం, సంస్థల నడుమ భాగస్వామ్యాలు, అంతర్జాతీయంగా పోటీ పడటం ద్వారా ఎంఎస్ఎంఈలు సుస్థిర ఆర్థిక ప్రగతి సాధిస్తాయని నివేదిక వెల్లడించింది. డిజిటల్ మార్కెటింగ్‌లో శిక్షణ, భాగస్వామ్య ఒప్పందాలు, మార్కెట్‌తో ప్రత్యక్ష అనుసంధానం తదితరాల ద్వారా ఎంఎస్ఎంఈల పురోగతి సాధ్యమవుతుందని పేర్కొంది. ఈశాన్య, తూర్పు భారత్‌లో ఎంఎస్ఎంఈ రంగం అభివృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. -
ముంచెత్తిన నష్టం
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: అకాల వర్షాలతో రైతులు తల్లడిల్లిపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దవుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలకు నష్టపోతున్నారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు నల్లగొండ, రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్, ఖమ్మం, భూపాలపల్లి జిల్లాల్లో ఒక్కసారిగా కురిసిన వర్షంతో రైతులు కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉంచిన ధాన్యం తడిసిపోయింది. కొన్ని చోట్ల వర్షం ధాటికి ధాన్యం కొట్టుకుపోయింది. ఖమ్మంలో నష్టం అధికంగా జరిగినట్టు అధికార యంత్రాంగం ప్రాథమికంగా అంచనా వేసింది. కొనుగోళ్లలో ఆలస్యంతోనే... యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఇప్పటికే దాదాపుగా 60 శాతానికి పైగా కోతలు పూర్తయినా, కొనుగోళ్లు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. లారీల కొరత, మిల్లర్ల కొర్రీలు, గోనె సంచులు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి రైతులు వేచి చూసే పరిస్థితి ఏర్పడింది. ఐకేపీ, పీఏసీఎస్ వంటి సహకార సంఘాలు మిల్లర్ల మీద ఆధారపడి కొనుగోలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.లారీలు రావడం లేదని, మిల్లర్లు క్వింటాల్‌కు 5 నుంచి 10 కిలోల తరుగు తీస్తేనే మిల్లులకు ధాన్యం ఇవ్వాలంటున్నారని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులే చెప్పే పరిస్థితి కరీంనగర్, ఖమ్మం, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో కొనుగోళ్లు ఆలస్యం కావడంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతుంది. తిరిగి ఆ ధాన్యాన్ని ఎండబెట్టి, తేమ శాతం 17 శాతం వచ్చిన తర్వాత విక్రయించాలంటే ఎన్ని రోజులు ఆగాలో తెలియని పరిస్థితి. ఆయా జిల్లాల్లో ఇలా.... ⇒ ఖమ్మం జిల్లా వైరా మార్కెట్ యార్డులో ఆరబోసిన 3 వేల క్వింటాల ధాన్యం తడిసి ముద్దయ్యింది. కూసుమంచి మండలంలోనూ ధాన్యం తడిసింది. ⇒ మహబూబాబాద్ జిల్లాలోని కురవి, మరిపెడ, కేసముద్రం, డోర్నకల్, గూడూరు, మహబూబాబాద్, నర్సింహులపేట, బయ్యారం, గార్ల మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. ⇒ యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, భూదాన్ పోచంపల్లి ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా వ్యవసాయ మార్కెట్లు, ఐకేపీ సెంటర్లలో ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది. ⇒ సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో శుక్రవారం సాయంత్రం వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిముద్దయ్యింది. కమ్మరపల్లి, చీకోడ్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం వర్షం ధాటికి కొట్టుకుపోయింది. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడ్డారు. సకాలంలో తరలించకపోవడంతో కాంటాలు పెట్టిన బస్తాలు కూడా తడిసిపోయాయి. ⇒ పెద్దపల్లి జిల్లా మంథని డివిజన్లో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయ్యింది.మంథని వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యంలో చేరిన వర్షపు నీటిని శుక్రవారం ఎత్తిపోస్తూ రైతులు కనిపించారు. పోచమ్మవాడ కొనుగోలు కేంద్రంతోపాటు గోపాల్‌పూర్‌లోనూ ధాన్యం వర్షపునీటిలో కొట్టుకుపోయింది. ఆరుగాలం కష్టపడితే.. చేతికందిన పంట కళ్ల ముందు వర్షపు నీటిలో కొట్టుకుపోవడంతో రైతు బండారి లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. డివిజన్లోని అయా మండలాల్లో పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లోనూ ధాన్యం తడిసిపోయింది. -
తెలంగాణే మార్గదర్శి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో త్వరలో చేపట్టనున్న జనగణనలో కులగణనను చేర్చాలన్న కేంద్ర నిర్ణయం వెనుక కాంగ్రెస్ పార్టీ అద్వితీయ పోరాటం ఉందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) పేర్కొంది. ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ తన భారత్ జోడో పాదయాత్ర సందర్భంగా, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసి చూపించిందని, దేశానికే మార్గదర్శిగా నిలిచిందని కొనియాడింది. తెలంగాణలో అన్ని వర్గాల నుంచి సమాచారం సేకరించి పారదర్శకంగా నిర్వహించిన కులగణన నమూనానే కేంద్రం అనుసరించాలని తీర్మానించింది. దేశంలోని అణగారిన వర్గాలకు విద్య, ఉపాధి, రాజకీయ అంశాల్లో న్యాయం చేసేలా జనగణనను ఎప్పట్లోగా పూర్తి చేస్తుందో కేంద్రం చెప్పాలని డిమాండ్ చేసింది. శుక్రవారం సాయంత్రం న్యూఢిల్లీ అక్బర్ రోడ్డులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీడబ్ల్యూసీ భేటీ జరిగింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాం«దీ, కేసీ వేణుగోపాల్‌తో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి కమిటీ సభ్యులు దామోదర రాజనరసింహ, రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు హాజరయ్యారు. ప్రధానంగా కులగణన, పహల్గాం ఉగ్రదాడిపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు అప్రమత్తంగా ఉండాలి: ఖర్గే రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర మొదలు, మొన్నటి లోక్‌సభ ఎన్నికల వరకు ఇదే అంశాన్ని ముందుపెట్టి కాంగ్రెస్ పార్టీ పోరాడిందని ఖర్గే చెప్పారు. పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కులగణన పూర్తి చేసి ప్రభుత్వ పథకాల్లో అమలు చేసే ప్రక్రియను సైతం మొదలు పెట్టిందని ప్రశంసించారు. ప్రజల సమస్యలను నిజాయితీగా లేవనెత్తితే, ఎన్డీఏ వంటి మొండి ప్రభుత్వాలు తలవంచాల్సిందేనని రాహుల్‌గాంధీ నిరూపించారని అన్నారు. అయితే కులగణన సమస్యను ఒక మంచి ముగింపు వచ్చేంత వరకు కాంగ్రెస్ నేతలంతా అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించారు. అనంతరం ఇదే అంశంపై చేసిన తీర్మానంలోనూ తెలంగాణ అంశాన్ని సీడబ్ల్యూసీ ప్రస్తావించింది. తెలంగాణ నమూనాను కేంద్రం అనుసరించాలి ‘తెలంగాణలో కులగణనకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం పాటించిన విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అనుసరించాల్సిన అవసరం ఉందని సీడబ్ల్యూసీ భావిస్తోంది. తెలంగాణలో కుల సర్వే రూపకల్పన పూర్తిగా పౌర సమాజం, సామాజికవేత్తలు, నాయకుల క్రియాశీల ప్రమేయంతో.. సంప్రదింపులు, పారదర్శక ప్రక్రియ ద్వారా జరిగింది. ఈ సర్వే పూర్తిగా బ్యూరోక్రాటిక్ విధానంలో కాకుండా ప్రజల పరిశీలన నుంచి వచ్చింది.అందువల్ల జాతీయ స్థాయి కులగణన కోసం తెలంగాణ పాటించిన విధానాన్ని అనుసరించాలని సీడబ్ల్యూసీ కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతోంది. కేంద్రం విశ్వసనీయమైన, శాస్త్రీయమైన, భాగస్వామ్య నమూనాను రూపొందించేందుకు వీలుగా మా పూర్తి మద్దతును ప్రకటిస్తున్నాం. సంప్రదింపులు, జవాబుదారీతనం సమ్మిళితత్వంతో విలువలను ప్రతిబింబించే చట్రాన్ని రూపొందించడంలో సహకరించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం..’అని సీడబ్ల్యూసీ తన తీర్మానంలో పేర్కొంది. జాప్యం వద్దు..పారదర్శకంగా జరగాలి ‘కులగణన ప్రక్రియలో జాప్యం చేయకూడదు. అన్ని రాజకీయ పార్టీలను పూర్తి విశ్వాసంలోకి తీసుకోవాలి. ఈ అంశంపై పార్లమెంట్లో వెంటనే చర్చ జరపాలి. ప్రభుత్వం వెంటనే అవసరమైన నిధులను కేటాయించి, జనాభా లెక్కల ప్రతి దశకు నిర్దిష్టమైన సమయాన్ని ప్రకటించాలి. కులగణన వివరాల నమోదు ప్రక్రియ పూర్తి సమగ్రంగా, పారదర్శకంగా ఉండేలా చూడాలి. రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలకు, విద్యా, ఉపాధి అవకాశాలకు ఈ కులగణనే ప్రాతిపదికగా ఉండాలి. కుల గణన సరిగ్గా జరిగి అమలైతే సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుతుంది..’అని తీర్మానంలో స్పష్టం చేసింది. పూర్తి పారదర్శకతతో నిర్వహించాం: సీఎం రేవంత్ తెలంగాణలో కులగణన జరిగిన తీరును సీడబ్ల్యూసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివరించారు. కచ్చితత్వంతో, పూర్తి పారదర్శకంగా కులగణన నిర్వహించామని తెలిపారు. ‘బీసీల జనాభా గతం కన్నా 6 శాతం మేర పెరిగింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి, దానిని పార్లమెంట్ ఆమోదానికి పంపించాం. విద్య, ఉద్యోగం, ఉపాధి, నిధుల కేటాయింపుల్లో ఓబీసీ, ఆదివాసీ, దళితులు, మైనార్టిలకు ప్రయోజనం చేకూరేలా ఇకపై ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి.కులగణనతో ఆయా వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని మేము విశ్వసిస్తున్నాం. మమ్మల్ని చూసే కేంద్రం కూడా కులగణన చేసేందుకు ముందుకొచ్చింది. దీనిపై రాష్ట్రంలోని నిమ్న వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి..’అని సీఎం తెలిపారు. రేవంత్, దామోదరకు అభినందనలు కులగణన ప్రక్రియలో చేసిన శ్రమ, అమలులో చూపిన చొరవపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి దామోదరలను సీడబ్ల్యూసీ కీలక నేతలు అభినందించారు. -
బోగీలు భగభగ.. ఏసీలో చల్లగా..
సికింద్రాబాద్–హౌరా మధ్య తిరిగే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ థర్డ్ ఏసీ ఎకానమీలో నెల క్రితం వరకు 15 రోజుల ముందు కూడా టికెట్లు అందుబాటులో ఉండేవి. కానీ ప్రస్తుతం మే 15న ప్రయాణానికి వెయిటింగ్ జాబితా 85గా ఉంది. ఇక 31వ తేదీన వెళ్లాలంటే అసలు బుకింగ్‌కే వీల్లేకుండా ఉంది.ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో మే 15న వెళ్లాలంటే వెయిటింగ్ లిస్ట్‌లో 47వ నంబర్ చూపుతోంది. నెలాఖరుకు ‘రిగ్రెట్’ అని చూపుతోంది. దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో ఈనెల మొత్తం వెయిటింగే చూపుతోంది. వీటిల్లో కేవలం థర్డ్ ఎకానమీ క్లాస్ మాత్రమే కాదు, ఏసీ కేటగిరీలోని ఏ తరగతిలోనూ వచ్చే నెల రోజుల్లో టికెట్లు అందుబాటులో లేవు. కానీ అల్పాదాయ వర్గాలకు అందనంత దూరంలో ఉండే వందేభారత్ రైళ్లలో మాత్రం 15 రోజుల ముందు కూడా టికెట్లు లభిస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్: రైలు ప్రయాణం అంటే ప్రజలు హడలిపోతున్నారు. నడి వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పగటి వేళ రైలు ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది. తీవ్రమైన ఎండలతో కోచ్‌లు కొలిమిలా మారుతున్నాయి. ఫ్యాన్ల నుంచి వచ్చే వేడి గాలి, కిటికీల్లోంచి వీచే వడగాడ్పులు ప్రయాణికులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చల్లటి వేళ రైలెక్కుతున్నప్పటికీ సుదూర ప్రాంతానికి ప్రయాణం చేసేవారు పగటి వేళ రైలు బోగీల్లో వేడి, ఉక్కపోతతో వడదెబ్బకు సైతం గురవుతున్నారు.పేద, అల్పాదాయ, మధ్య తరగతి వర్గాలు రైలు ప్రయాణానికి సాధారణంగా చార్జీ తక్కువగా ఉండే జనరల్ లేదా స్లీపర్ కోచ్‌లనే ఎంచుకోవటం కద్దు. కాని వేసవి భగ భగలతో బోగీలు ఉడికిపోతున్న నేపథ్యంలో చార్జీ భారమైనా చాలామంది ఇప్పుడు ఏసీ కోచ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో అన్ని రైళ్లలో ఏసీ కోచ్‌లు నెల ముందే నిండిపోతున్నాయి.దాదాపుగా అన్ని రైళ్లలోనూ నెల తర్వాత వెయిటింగ్ జాబితా చూపిస్తోంది. ఏసీ కోచ్‌లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతుండటంతో రైల్వే శాఖ దీనిపై దృష్టి సారించింది. ప్రయాణికులకు సౌకర్యం కల్పించడంతో పాటు ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చనే ఉద్దేశంతో ఏసీ ఎకానమీ క్లాస్ కోచ్‌ల సంఖ్య పెంచుతోంది. కొత్తగా మరిన్ని రైళ్లలో ఆ కేటగిరీని ప్రవేశపెడుతోంది. రెండేళ్ల క్రితం నుంచి థర్డ్ ఏసీ ఎకానమీ రైళ్లలో గతంలో ఫస్ట్ ఏసీ, సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీ.. ఇలా మూడు రకాల ఏసీ కోచ్‌లు మాత్రమే ఉండేవి. పేద, మధ్య తరగతి వర్గాలను దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ రెండేళ్ల క్రితం కొత్తగా థర్డ్ ఏసీ ఎకానమీ కోచ్‌లను/ ప్రవేశపెట్టింది. సాధారణ థర్డ్ ఏసీ కోచ్‌లోని ఓ కూపేలో 8 బెర్త్‌లుంటే, ఎకానమీ ఏసీ కోచ్‌లో తొమ్మిదుంటాయి. కూపేల వైశాల్యం కూడా తగ్గించడం వల్ల ఇలాంటి ఓ కోచ్‌లో అదనంగా మరో కూపే ఉంటోంది. అంటే ఈ కూపే ద్వారా అదనంగా తొమ్మిది బెర్తులు అందుబాటులో ఉంటాయన్నమాట. సాధారణ కోచ్ కంటే తక్కువ చార్జీ సాధారణ థర్డ్ ఏసీ కోచ్ కంటే ఎకానమీ కోచ్ టికెట్ ధర తక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే అల్పాదాయ వర్గాలు వేసవి వేడిని దృష్టిలో పెట్టుకుని ఈ ఎకానమీ ఏసీ కోచ్‌లలో ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే దక్షిణ మధ్య రైల్వేలో వీటి సంఖ్యను పెంచుతున్నారు. స్లీపర్ కోచ్‌ల సంఖ్యను కుదించటం ద్వారా ఈ తరహా కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. గత వేసవిలో జోన్ పరిధిలో ఎకానమీ కోచ్‌లు కేవలం 20 రైళ్లలోనే ఉండగా, ప్రస్తుతం 30కి చేరాయి.అయినా రద్దీని తట్టుకునే పరిస్థితి లేకపోవడంతో త్వరలో మరిన్ని రైళ్లలో కూడా వీటిని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుత డిమాండ్ నేపథ్యంలో ప్రయాణ తేదీకి 15 రోజులకు చేరువకాగానే కొన్ని ముఖ్యమైన రైళ్లలో ఏసీ కోచ్‌లకు టికెట్ల విక్రయం ఆపేసే పరిస్థితి నెలకొంది. ఆన్లైన్లో ‘రిగ్రెట్’ (ఐఆర్సీటీసీ పరిభాషలో బెర్తులు లేవు అని అర్ధం) అని చూపుతోంది. సరిపడా రేక్స్ లేవు వేసవి రద్దీ నేపథ్యంలో వివిధ ప్రాంతాలకు 100కు పైగా ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే చర్యలు చేపట్టింది. ఇప్పటికే కొన్ని నడుస్తున్నాయి. జూన్ వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. వాస్తవానికి మరో 200 ప్రత్యేక రైళ్లను నడిపినా కూడా రద్దీకి సరిపోయే పరిస్థితి లేదు. కానీ అన్ని రేక్స్ అందుబాటులో లేవు. దీంతో అదనపు రైళ్ల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని రైల్వే బోర్డు స్థానిక అధికారులకు సూచించింది. వేరే ప్రాంతాల నుంచి కూడా కోచ్‌లను కేటాయించే పరిస్థితి లేకపోవటంతో ఈ అలర్డ్ జారీ చేసింది. రాష్ట్రంలో 230 రైళ్ల రాకపోకలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం 230 వరకు ప్రయాణికుల రైళ్లు తిరుగుతుంటాయి. వేసవి సెలవుల నేపథ్యంలో వీటిల్లో ప్రయాణానికి ప్రతిరోజూ 30 వేల మంది వరకు అదనంగా ప్రయత్నిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో రిజర్వేషన్లు దొరక్క చాలామంది జనరల్ కోచ్‌లలో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. చాలామంది అనధికారికంగా స్లీపర్ కోచ్‌లలో కూడా ఎక్కేస్తున్నారు. ఎండలతో ఉడికిపోతున్న బోగీలు ప్రయాణికుల కిటకిట మరింత వేడెక్కిపోతున్నాయి. థర్డ్ ఏసీ దొరక్క పోవడంతో ఏసీ స్లీపర్ బస్సులో తీసుకున్నామార్చి ప్రారంభంలో కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్లొచ్చాం. కేవలం వారం రోజుల వ్యవధిలోనే థర్డ్ ఏసీ టికెట్లు లభించాయి. కానీ ఇప్పుడు బెంగుళూరు వెళ్లాల్సి రావటంతో, ఆన్లైన్ రిజర్వేషన్ కోసం ప్రయతి్నస్తే రిగ్రెట్ చూపుతోంది. అసలు టికెట్లే లేవని చూపిస్తోంది. నెలన్నర ముందే ఏసీ టికెట్లు అయిపోతున్నాయి. ఎండాకాలంలో మామూలు బోగీల్లో వెళ్లాలంటే భయం వేస్తోంది. గత్యంతరం లేక ఎక్కువ చార్జీ చెల్లించి ఏసీ స్లీపర్ బస్సులో బుక్ చేసుకున్నాం. రైళ్లలో ఏసీ కోచ్‌ల సంఖ్య పెంచటమో, అదనపు రైళ్లను నడపటమో చేస్తే బాగుంటుంది. – జి.రవికుమార్, బాగ్‌లింగంపల్లి (హైదరాబాద్) -
బకాసుర రెస్టారెంట్లో వినోదం
హాస్య నటుడు ప్రవీణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’(Bhakasaura Restaurant). ఈ సినిమా ద్వారా ఎస్జే శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వైవా హర్ష, కృష్ణభగవాన్, షైనింగ్ ఫణి, ‘కేజీఎఫ్’ గరుడరామ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఎస్జే శివ మాట్లాడుతూ– ‘‘హంగర్ కామెడీ ఎంటర్టైనర్గా ‘బకాసుర రెస్టారెంట్’ రూపొందింది. వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రవీణ్‌లోని మరో కోణాన్ని చూపిస్తుంది’’ అన్నారు. -
ఆసక్తి గొలిపే చర్చలతో వేవ్స్
‘వేవ్స్’లో హీరో నాగార్జున మాట్లాడుతూ– ‘‘పుష్ప’ సిరీస్ సినిమాలు తెలుగు కంటే వేరే భాషల్లో ఎక్కువగా వసూళ్లు సాధించాయి. వందలో దాదాపు తొంభై మంది తమ ఒత్తిడి పొంగొట్టుకునేందుకు తెరపై జరిగే మ్యాజిక్ (సినిమాలు) చూసేందుకు ఇష్టపడుతుంటారు. నేటితరం ప్రేక్షకులు కథానాయకులను పుష్పరాజ్ (‘పుష్ప’లో అల్లు అర్జున్), రాఖీ భాయ్ (‘కేజీయఫ్’లో యశ్), బాహుబలి (‘బాహుబలి’లో ప్రభాస్) లాంటి లార్జర్ దేన్ లైఫ్ రోల్స్‌లో చూడాలనుకుంటున్నారు. నేనూ దాన్నే ఇష్టపడతాను. కేవలం హీరోల ఎలివేషన్ ఒక్కటే కాదు.. బలమైన కథలతోనే ఆయా చిత్రాలు బ్లాక్‌బస్టర్ అయ్యాయి. రాజమౌళి ‘బాహుబలి’ సినిమాని తెలుగులోనే తెరకెక్కించినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఆదరించారు’’ అన్నారు.భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న నాలుగు రోజుల వరల్డ్ ఆడియో, విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్) – 2025 రెండో రోజు సైతం అట్టహాసంగా సాగింది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ వేదికగా జాతీయ, అంతర్జాతీయ సినీ ప్రముఖులు, దర్శక, నిర్మాతలు, ఔత్సాహిక సినీ రూపకర్తలు శుక్రవారం పెద్ద ఎత్తున సమ్మిట్‌కు హాజరయ్యారు. వివిధ వేదికలపై చర్చాగోష్ఠులు, ముఖాముఖీలు కొనసాగాయి.మీడియా – వినోద రంగంలో వివిధ దేశాల్లో అనుసరిస్తున్న విధానాలనూ, వ్యూహాలనూ పరస్పరం పంచుకొనేందుకు వీలుగా గ్లోబల్ మీడియా డైలాగ్ అలాగే, క్రియేట్ ఇండియా ఛాలెంజ్ పొంటీలోని విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. వేవ్స్ బజార్ వేదికగా వివిధ చిత్ర నిర్మాణ సంస్థలు, వ్యక్తుల మధ్య కంటెంట్ మార్కెటింగ్ అవకాశాల అన్వేషణ నడిచింది.భవిష్యత్తులో స్టూడియోలు, సాఫ్ట్ పవర్‌గా సినిమా, డిజిటల్ యుగంలో మారుతున్న కథాకథన రీతులు, మారుతున్న భారతీయ సినిమా ముఖచిత్రం తదితర అంశాలపై చర్చాగోష్ఠులు జరిగాయి. దక్షిణాది సినీ ప్రముఖులు నాగార్జున, విజయ్ దేవరకొండ, అమల అక్కినేని, సుప్రియ యార్లగడ్డ, ఖుష్బూ, కార్తి, రవి మోహన్, హిందీ చిత్ర సీమ నుంచి అనుపమ్ ఖేర్, ఆమిర్ ఖాన్, కరణ్ జోహార్, కరీనా కపూర్, సోనాలీ కులకర్ణి, ‘ఆదిపురుష్’ చిత్రదర్శకుడు ఓం రౌత్, ఆస్కార్ అవార్డు గెల్చిన మహిళా నిర్మాత గునీత్ మోంగా సదస్సుప్రాంగణంలో ఉత్సాహంగా చర్చల్లో పాల్గొన్నారు.కృత్రిమ మేధ (ఏఐ) రాకపై ఆసిడెంట్ రిచర్డ్ జి. కెర్రీస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో ఆసక్తికరంగా వివరించారు. హాలు మొత్తం ప్రేక్షకులతో కిక్కిరిసి పొంగా, మీడియా దిగ్గజం అరుణ్ పురీ సహా పలువురు కెర్రీస్ తెరపై చూపిన ఏఐ ఆధారిత సినిమా వీడియోలను చూశారు. ఫుగటో లాంటి సాఫ్ట్ వేర్లతో ఆడియోలో సౌండ్ ఎఫెక్ట్‌ల మొదలు సంగీత బాణీల దాకా ఎలా మార్చుకోవచ్చో సమావేశంలో వివరించిన తీరు హర్షధ్వానాలు అందుకుంది. భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చేరువ చేయడమనే అంశంపై నీతా అంబానీ ఇచ్చిన కీలకోపన్యాసం ఓ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.‘‘ఇవాళ మన దేశానికి అతి పెద్ద మార్కెటింగ్ సాధనం... సినిమా. నేను కశ్మీర్లో షూటింగ్ చేస్తున్నా, నన్ను జనం గుర్తు పడుతున్నారంటే దానికి సినిమాయే కారణం! మనం మన (సినీ) సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకోవాల్సి ఉంది. దేశం సరిహద్దులు దాటి మన సినిమా ముందుకు వెళ్ళాలంటే, అక్కడా మన సినిమాల డిస్ట్రిబ్యూషన్‌ను పెంచుకోవడమే మార్గం. అలాగే, బాక్సాఫీస్ వద్ద మన సినిమాల జోరు పెరగాలంటే, వివిధ భాషల నటులు కలసి సినిమాలు చేయాలి’’. – హీరో విజయ్ దేవరకొండహీరో ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ– ‘‘ఇండియాలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా మంచి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉండాలి. విదేశాల్లో డిస్ట్రిబ్యూషన్ గురించి మన నిర్మాతలు ఆలోచిస్తే మార్పు మొదలవుతుంది. దేశవ్యాప్తంగా మరిన్ని స్క్రీన్ ్స పెంచేందుకు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది’’ అన్నారు.‘‘లార్జర్ దేన్ లైఫ్ పాత్రలతో పాటు కుటుంబాన్ని ప్రేమిస్తూ, కుటుంబ సభ్యుల కోసం ఏమైనా చేసే పాత్రలనూ ప్రేక్షకులు ఇవాళ ప్రేమిస్తున్నారు. ఇవాళ ప్యాన్ ఇండియా అనేది ఫ్యాషన్ అయిపొంయింది. అసలు ఈ కంగాళీ పదం రాక ముందే మన మణిరత్నం తీసిన ‘రోజా, బొంబాయి’ లాంటివి అఖిల భారత చిత్రాలే కదా. అవన్నీ భాష,ప్రాంతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకున్నాయి’’. – నటి ఖుష్బూ‘‘ఇవాళ ఓటీటీ సహా అనేక రకాల కంటెంట్ అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రేక్షకులు హీరో వీరోచిత విన్యాసాలు, ఊహల్లో విహరింపజేసే భారీ పాటలు, డ్యాన్సులు చూసేందుకు సినిమా హాళ్ళకు వస్తున్నారు. అయితే, ప్రతిదీ భారీ, ప్యాన్ ఇండియా సినిమా కావాల్సిన పని లేదు. మంచి కథతో, చిన్న సినిమాలూ రావాలి’’. – హీరో కార్తి‘‘ఏ తెరపై ఏ కథ చెప్పినా... నిజాయతీగా, భావోద్వేగభరితంగా చెప్పడం కీలకం. ప్రేక్షకులు తెరపై ఎంత భారీతనాన్ని ఇష్టపడినప్పటికీ, సినిమా రూపకర్తలోని ఆ నిజాయతీ, నిబద్ధతను ఇట్టే గమనిస్తారు. ఆస్వాదిస్తారు, అభినందిస్తారు. సినిమా విజయానికి అదే ప్రధాన సూత్రం’’. – నటుడు అనుపమ్ ఖేర్‘‘స్టోరీ టెల్లింగ్, కంటెంట్ క్రియేషన్ లాంటి పెద్ద పెద్ద మాటలు చెబుతాం కానీ, ప్రేక్షకులకు నచ్చిందా, లేదా అన్నదే ఆఖరికి మిగిలే అసలు పాయింట్. అంతే. ఎంచుకున్న ఆలోచనను బలంగా నమ్మాలి. అలా నమ్మిన ఆలోచనతో ముందుకు వెళ్ళాలి’’. – సుప్రియ యార్లగడ్డ, నిర్మాత, అన్నపూర్ణా స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‘‘ఉత్తరాది, దక్షిణాది లాంటి చీలికలు, భేదాల చుట్టూ తిరగకుండా, ఏది గొప్ప, ఏది తక్కువ అనే వాదన కన్నా, మనది భారతీయ సినిమా అనే భావన చాలా ముఖ్యం. భారతీయ సినిమా అంటే ఇదీ అని చూపాలంటే, నేను గురుదత్ తీసిన ‘కాగజ్ కే ఫూల్, ప్యాసా’ లాంటి సినిమాలు ప్రపంచానికి చూపాలంటాను’’. – దర్శక – నిర్మాత కరణ్ జోహార్‘‘కరోనా తర్వాత తమిళ సినిమాను తీసే విధానం, జనం చూసే విధానం కూడా మారాయి. రకరకాల వేదికలపై ఇప్పుడు కంటెంట్ అందుబాటులో ఉంది. మొబైల్‌తో కూడా సినిమా తీసేయచ్చు. అందులోనే రిలీజ్ చేయవచ్చు. చూడవచ్చు. అది ఒక మార్గం, అదనపు చేర్పు. అంతే తప్ప భారీ వెండితెర వినోదం మాత్రం ఎన్నటికీ చెరిగిపొందు, కరిగిపొందు’’. – తమిళ హీరో ‘జయం’ రవి -
గుజరాత్ చేతిలో ఓటమి.. సన్‌రైజర్స్ ప్లే ఆశలు గల్లంతు!
ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కథ దాదాపు ముగిసినట్లే. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ తేలిపోయింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 38 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. 225 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేయగల్గింది. లక్ష్య చేధనలో ఓపెనర్లు మంచి అరంభం ఇచ్చినప్పటికి, మిడిలార్డర్ విఫలమం కావడంతో ఆరెంజ్ ఆర్మీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ(74) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, సిరాజ్ తలా రెండు వికెట్లు సాధించగా.. ఇషాంత్ శర్మ, కోయిట్జీ తలా వికెట్ సాధించారు. గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్..అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్(76) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జోస్ బట్లర్(64), సుదర్శన్(48) పరుగులతో రాణించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో జయ్‌దేవ్ ఉనద్కట్ మూడు వికెట్లు పడగొట్టగా.. కమ్మిన్స్, అన్సారీ తలా వికెట్ సాధించారు. కాగా ఇప్పటివరకు పది మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ కేవలం మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండోస్దానంలో కొనసాగుతోంది. -
IPL 2025: శుబ్‌మన్ గిల్ది ఔటా? నాటౌటా?
ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో భాగంగా శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి ఓవర్ నుంచే ఎస్ఆర్హెచ్ బౌలర్లను ఊతికారేశాడు.మహ్మద్ షమీ, కమ్మిన్స్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం గిల్ వదలేదు. ఈ క్రమంలో కేవలం 25 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత కూడా గిల్ ఎక్కడ తగ్గలేదు. దీంతో అతడు దూకుడు చూసి మూడెంకల స్కోర్‌ను అందుకుంటాడని అంతా భావించారు. సరిగ్గా ఇదే సమయంలో గిల్‌ను దురదృష్టం వెంటాడింది. అనుహ్యంగా గిల్ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. దీంతో కేవలం 38 బంతుల్లోనే 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 76 పరుగులు చేసిన గిల్.. తీవ్ర నిరాశతో డగౌట్‌కు చేరాల్సి వచ్చింది. అయితే గిల్ ఔటైన తీరు వివాదస్పదమైంది.ఏమి జరిగిందంటే?గుజరాత్ ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన జీషన్ అన్సారీ బౌలింగ్‌లో ఆఖరి బంతికి జోష్ బట్లర్.. షార్ట్ ఫైన్ లెగ్ దిశగా ఆడాడు. ఆ బంతికి బట్లర్, గిల్ క్విక్ సింగిల్ తీసేందుకు ప్రయత్నించారు. నాన్‌స్ట్రైక్ నుంచి గిల్ వికెట్ కీపర్ వైపు వచ్చేటప్పటికి బంతిని హర్షల్ పటేల్ త్రో చేశాడు. అయితే గిల్ క్రీజులోకి వచ్చేటప్పుడు వికెట్ కీపర్ క్లాసెన్ స్టంప్ట్స్ ను పడగొట్టాడు. అయితే క్లాసెన్ బంతితో కాకుండా తన గ్లౌవ్స్‌తో స్టంప్స్‌ను పడగొట్లు అన్పించింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు అంత ఉత్సాహంగా అప్పీల్ చేయలేదు. ఏదేమైనప్పటికి ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. రీప్లేలు గిల్ క్రీజుకు షార్ట్‌గా ఉన్నప్పటికీ, క్లాసెన్ తన గ్లోవ్స్‌తో బెయిల్స్‌ను పడగొట్టినట్లు కన్పించింది. కానీ పలు కోణాల్లో రిప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ఔట్‌గా ప్రకటించి అందరికి షాకిచ్చాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంపై గిల్ కూడా అసహనం వ్యక్తం చేస్తూ మైదానాన్ని వీడాడు. Shubman Gill robbed of a century here due to a terrible decision by the Umpire 💔The bails are clearly dislodged by the gloves !#ShubmanGill #IPL2025 #GTvSRH pic.twitter.com/aTXAA7Gr4Q— Prateek (@prateek_295) May 2, 2025 -
అందుకే అప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాను: విరాట్ కోహ్లి
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గతేడాది అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్‌కప్-2024 విజయం అనంతరం కోహ్లి తన నిర్ణయాన్ని వెల్లడించి అందరికి షాకిచ్చాడు. అతడితో పాటు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు కూడా ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే తాజాగా తన రిటైర్మెంట్ వెనక గల కారణాన్ని కోహ్లి వెల్లడించాడు. యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చేందుకు ఆ నిర్ణయం తీసుకున్నట్లు కోహ్లి చెప్పుకొచ్చాడు. "టీ20లకు రిటైర్మెంట్ అన్ని ఆలోచించాకే ప్రకటించాను. కొత్త ఆటగాళ్లు జట్టులోకి రావాలని, వారు సిద్దమయ్యేందుకు కాస్త సమయం అవసరమని భావించాను.వారు తదుపరి టీ20 వరల్డ్‌కప్‌కు సిద్దంగా ఉండేందుకు కనీసం రెండేళ్ల సమయమైనా కావాలి. అందుకే వరల్డ్‌కప్ అనంతరం టీ20 క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లి పేర్కొన్నాడు. కాగా కోహ్లి అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటి ఐపీఎల్లో మాత్రం దుమ్ములేపుతున్నాడు. ఐపీఎల్-2025లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 138.87 స్ట్రైక్ రేట్‌తో 443 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆరెంజ్ క్యాప్ జాబితాలో మూడవ స్థానంలో కోహ్లి కొనసాగుతున్నాడు.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్.. సచిన్ రికార్డు బద్దలు -
రోడ్డు ప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి : నంద్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందడంపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీశైలంలో దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు వైఎస్ జగన్ ఇటువంటి దుర్ఘటనలు జరగటం అత్యంత బాధాకరమని, ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు వైఎస్ జగన్.కాగా, నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు మండలంలోని సిద్ధాపురం చెరువు వద్ద శుక్రవారంఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు, గుంటూరు ప్రధాన జాతీయ రహదారిపై బోలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 16 మందికి గాయాలు కాగా, అందులో పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రీశైల క్షేత్రంలో దైవదర్శనానికి వెళ్లి బొలెరో వాహనంలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో గాయపడిన వారు, మృతులు కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఇందిరానగర్, రాజీవ్ నగర్ లకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. -
ఎమ్4ఎమ్ మూవీ హీరోయిన్.. వేవ్స్ సమ్మిట్‌కు ప్రత్యేక ఆహ్వానం
అంతర్జాతీయ సినిమా రంగంలో దూసుకెళ్తున్న ఎమ్4ఎమ్ (M4M) చిత్ర హీరోయిన్ జో శర్మకు మరో గౌరవం లభించింది. ఆమెకు 'వేవ్స్ సమ్మిట్ 2025' (WAVES Summit 2025)లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA) డెలిగేట్‌గా పాల్గొనాలని గౌరవ ఆహ్వానం అందింది. కళ, సాంస్కృతికం, సినిమాను ఘనంగా ఆవిష్కరించే ఈ గ్లోబల్ సమ్మిట్‌లో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మోలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సమ్మిట్‌లో జో శర్మ పాల్గొనడం సినిమా రంగంలో ఆమె ఎదుగుదలకు నిదర్శనంగా నిలుస్తోంది.కాగా.. మోటివ్ ఫర్ మర్డర్ (M4M) అనే థ్రిల్లర్ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీతో జో శర్మ సినీ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారారు. ఈ చిత్రాన్ని మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించారు. మోహన్ మీడియా క్రియేషన్స్ సంస్థ, జో శర్మ మెక్విన్ గ్రూప్ యూఎస్ఏ సంయుక్తంగా నిర్మించాయి.కాగా.. జో శర్మకు ప్రతిష్టాత్మక వేవ్ల్ సమ్మిట్ -2025కు ఆహ్వానం రావడం ఇండియన్-అమెరికన్ ప్రతిభ ప్రపంచ సినీ రంగంలో ఎలా విస్తరిస్తున్నదనేదానికీ నిదర్శనంగా నిలుస్తోంది. మరోవైపు ముంబయి లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో 'వేవ్స్ సమ్మిట్ 2025 ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మే 4, 2025 వరకు జరిగే ఈ సమ్మిట్‌లో 90కి పైగా దేశాల నుంచి అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొంటున్నారు. -
అర్జెంటీనాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
బ్యూనోస్ ఎయిర్స్: అర్జెంటీనాలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. అర్జెంటీనాలో వచ్చిన భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 7.4గా నమోదైంది. దాంతో చిలీ, అర్జెంటీనా, దక్షిణ అమెరికా తీరాలను భూకంపం కుదిపేసింది. మరో రెండు భూప్రకంపనలు కూడా నమోదయ్యాయి. ఫలితంగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు.దక్షిణ అర్జెంటీనాలోని ఉషుయాకు దక్షిణంగా 219 కి.మీ దూరంలో ఉన్న డ్రేక్ పాసేజ్ వద్ద ఉదయం 9 సమయంలో ప్రకంపనలు సంభవించాయని యూఎస్ జియోలాజికల్ సర్వే స్పష్టం చేసింది. చిలీ తీరంలోని కొన్ని ప్రాంతాలను సాధారణ అలల స్థాయి కంటే 3 నుండి 10 అడుగుల ఎత్తులో అలలు తాకవచ్చని అమెరికా సునామీ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. ఒక మీటర్ ఎత్తు వరకు చిన్న అలలు కూడా అంటార్కిటికా తీరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రభావితం చూపే అవకాశం ఉందని పేర్కొంది. -
పవన్ కల్యాణ్ హీరోగా కొత్త చిత్రం.. సాంగ్ రిలీజ్ చేసిన తండేల్ డైరెక్టర్
పవన్ కల్యాణ్ హీరోగా పరిచయం అవుతున్న సరికొత్త సినిమా 'ఏ స్టార్ ఈజ్ బార్న్'. ఈ సినిమా ద్వారా ప్రియా పాల్, నేహా శర్మ, ఊహ రెడ్డి హీరోయిన్లుగా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. ఈ సినిమాకు వీజే సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. సీఆర్ ప్రొడక్షన్స్, వీజే ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై రవి సాగర్, వీజే సాగర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని "నా గతమే' అనే పాటను తండేల్ మూవీ డైరెక్టర్ చందు మొండేటి విడుదల చేశారు.ఈ సందర్భంగా దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ... "నా గతమే సాంగ్ బాగుంది. పోస్టర్స్, ప్రోమోస్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ కావడంతో పాటు చిత్ర యూనిట్ సభ్యులందరికి మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. కాగా.. ఈ సినిమాను తెలంగాణలోని వనపర్తి, కొల్లాపూర్, సోమశిల, జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఈ సినిమాలో దాదాపు 93 మంది కొత్త నటీనటులు ఉండడం విశేషం. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతమందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్ర టీజర్, ట్రైలర్ విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు. -
వచ్చే మంగళవారం.. మరో భారీ అప్పుకు బాబు సిద్ధం!
విజయవాడ: ఇప్పటివరకూ రికార్డ్ స్థాయిలో అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. మరో భారీ అప్పుకు రెడీ అయ్యింది. రాష్ట్రాన్ని అప్పులు చేసి నడిపించడంలో భాగంగా వచ్చే మంగళవారం రూ. 7వేల కోట్ల అప్పుకి ఇండెంట్ పెట్టింది. రిజర్వ్ బ్యాంకుకి ఇండెంట్ పెట్టింది చంద్రబాబు సర్కార్. ఇప్పటివరకూ లక్షా 52 వేల కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. మళ్లీ రూ. 7వేల కోట్ల అప్పుకి సిద్ధం కావడం గమనార్హం.ఎన్నికల సమయంలో సంపద సృష్టి తనతోనే సాధ్యమని చెప్పిన చంద్రబాబు.. ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుల సృష్టి కోసమే వేట కొనసాగిస్తున్నారు. ఏడాది కాలంలోనే రికార్డు స్థాయిలో అప్పులు చేయడం చూస్తే చంద్రబాబు ‘సంపద సృష్టి’ భలేగా ఉంది అంటూ జనాలు నవ్వుకుంటున్నారు. -
మళ్ళీ ఇదే కారు.. అమ్మకాల్లో అదే జోరు
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) కంపెనీకి చెందిన క్రెటా కారు అమ్మకాల్లో దూసుకెళ్తోంది. ఈ కారు వరుసగా రెండో నెల కూడా మంచి అమ్మకాలను పొందినట్లు సంస్థ వెల్లడించింది.హ్యుందాయ్ క్రెటా గత నెలలో (2025 ఏప్రిల్) మొత్తం 17016 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ అమ్మకాలు ఏప్రిల్ 2024తో పోలిస్తే.. 10.2 శాతం ఎక్కువ. కాగా ఈ కారును 2025 జనవరి నుంచి ఏప్రిల్ వరకు 69914 మంది కొనుగోలు చేశారు.హ్యుందాయ్ క్రెటాభారతదేశంలో ఎక్కువమందికి ఇష్టమైన కారుగా నిలిచిన హ్యుందాయ్ క్రెటా మంచి డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి మూడు ఇంజన్ ఎంపికలతో వస్తుంది. అవి 1.5-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్, 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్లు. ట్రాన్స్మిషన్స్.. ఎంచుకునే ఇంజిన్లను లేదా వేరియంట్‌ను బట్టి మారుతూ ఉంటాయి. ఈ కారు ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఇది ఒక ఫుల్ ఛార్జితో 390 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది.ఇదీ చదవండి: జర్మన్ బ్రాండ్ కీలక నిర్ణయం: మరోసారి పెరిగిన కార్ల ధరలు -
చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్.. సచిన్ రికార్డు బద్దలు
ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ యువ ఓపెనర్ సాయిసుదర్శన్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సుదర్శన్ విధ్వంసం సృష్టించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఎస్ఆర్హెచ్ బౌలర్లను ఊతికారేశాడు. ముఖ్యంగా గుజరాత్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన స్టార్ పేసర్ మహ్మద్ షమీకి సుదర్శన్ చుక్కలు చూపించాడు. ఆ ఓవర్లో ఐదు ఫోర్ల సాయంతో ఏకంగా 20 పరుగులు పిండుకున్నాడు. ఓవరాల్‌గా 23 బంతులు ఎదుర్కొన్న 9 ఫోర్ల సాయంతో 48 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో సుదర్శన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో అత్యంతవేగంగా 2000 పరుగుల మైలు రాయిని అందుకున్న భారత క్రికెటర్‌గా సాయి సుదర్శన్ రికార్డు సృష్టించాడు. సుదర్శన్ కేవలం 54 ఇన్నింగ్స్‌లలో అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ ఈ ఘనతను 59 ఇన్నింగ్స్‌లలో అందుకున్నాడు. తాజా మ్యాచ్‌తో సచిన్ రికార్డును ఈ తమిళనాడు బ్యాటర్ బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ షాన్ మార్ష్(53) అగ్రస్దానంలో ఉండగా.. రెండో స్దానంలో సుదర్శన్ కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు బ్రాడ్ హాడ్జ్ , మార్కస్ ట్రెస్కోథిక్, ముహమ్మద్ వసీం పేరిట సంయుక్తంగా ఉండేది. తాజా మ్యాచ్‌తో వీరిని సుదర్శన్ అధిగమించాడు. చదవండి: బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లకు షాక్.. అకౌంట్లు బ్లాక్ -
‘కేసీఆర్ పాలనలో మంత్రులకు పవర్ లేదు’
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రెవెన్యూ వ్యవస్థను కేసీఆర్ తన దగ్గర పెట్టుకొని పూర్తిగా నాశనం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో మంత్రులకు పవర్ లేదని, స్వేచ్చగా రివ్యూ చేసుకునే పరిస్థితి ఉండేది కాదన్నారు పొంగులేటి. ఈరోజు(శుక్రవారం) మీడియాతో చిట్ చాట్ చేసిన పొంగులేటి.. ‘ ఆనాడు మంత్రులను కేసీఆర్ పని చేయనియ్యలేదు. భూ భారతి వల్ల 70శాతం ప్రజలకు ఉపయోగం జరిగినా మేము సక్సెస్ అయినట్లే. భూ భారతిలో కొత్త సాఫ్ట్ వేర్ రాబోతోంది. ఇందిరమ్మ ఇండ్లలో అవినీతి జరగదు. జరగనివ్వను. త్వరలోనే రాష్ట్రంలో సర్వేయర్లు నోటిఫికేషన్ విడుదల చేస్తాం. జూన్ లో సర్వే మ్యాప్ పైలెట్ ప్రాజక్టు ద్వారా రిజస్ట్రేషన్లు చేస్తాం. ఆరువేల దరఖాస్తులు సర్వేకు వచ్చాయి. భర్తీ చేయబోతున్నాం. ప్రైవేట్ సర్వేయర్లతో భూముల సర్వే జరుగుతుంది.. ప్రభుత్వ పర్యవేక్షణ సైతం ఉంటుంది’ అని అన్నారు. -
రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: రేషన్ కార్డుదారుల పరేషాన్‌కు ఇక తెరపడనుంది. లబ్ధిదారులకు శుభవార్త. సరిగ్గా ఎనిమిదేళ్ల నిరీక్షణకు మోక్షం లభిస్తోంది. పాత రేషన్‌కార్డుల్లో కొత్త సభ్యుల(యూనిట్) ఆమోద ప్రక్రియ ఆరంభమైంది. పౌర సరఫరాల శాఖ ఆన్లైన్ ద్వారా కొత్త సభ్యుల చేర్పుల కోసం అందిన దరఖాస్తులను పరిశీలిస్తూ ఒక్కొక్కటిగా ఆమోదిస్తోంది. అయితే రేషన్‌కార్డు (Ration Card) కలిగిన కుటుంబంలోని కొత్త సభ్యుల పేర్లను ఆమోదిస్తున్నప్పటికీ ఏడేళ్ల వయసు దాటిన వారికి మాత్రమే రేషన్ కోటా కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెండింగ్ దరఖాస్తుల్లో సుమారు 20 శాతం మేర పరిష్కరించి మే నెల రేషన్ కోటా కూడా కేటాయించింది. మిగతా దరఖాస్తులను కూడా దశలవారీగా పరిష్కరించేందుకు పౌర సరఫరాల శాఖ చర్యలు చేపట్టింది.ఆరు లక్షలపైనే కొత్త సభ్యులు.. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిరిగి జిల్లాల్లో పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల చేర్పుల కోసం సుమారు మూడు లక్షలపైనే దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు ఆన్లైన్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత ఎనిమిదేళ్లుగా రేషన్‌కార్డుల్లోని సభ్యులు (యూనిట్లు) వివిధ సాకులతో తొలగింపునకు గురవుతున్నా కొత్త సభ్యుల చేర్పుల దరఖాస్తులకు మాత్రం అతీగతీ లేదు. ఈ వ్యవధిలో ఉమ్మడి కుటుంబాలు రెండు, మూడుగా ఏర్పడగా, మరోవైపు కుటుంబంలో మరి కొందరు కొత్త సభ్యులుగా చేరారు.సుమారు మూడు లక్షల కుటుంబాలు ఆరు లక్షల కొత్త సభ్యుల పేర్ల నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల చేర్పులు కోసం దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుండగా, మొన్నటి వరకు ఆమోదించే ఆప్షన్ లేకుండా పోయింది. అయితే రేషన్‌కార్డులోని సభ్యుల తొలగింపు ఆప్షన్ మాత్రం కొనసాగుతూ వస్తోంది. తాజాగా కొత్త సభ్యులు చేర్పుల ఆప్షన్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్న్‌ల్ ఇవ్వడంతో ఆమోద ప్రక్రియ ప్రారంభమైంది. చదవండి: తెలంగాణ గొర్రెల స్కాంలో కీలక పరిణామంఅర్హుల పేర్లకు ఆమోదంపాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల ఆమోదం ప్రక్రియ కొనసాగుతోంది. మీ సేవా (Mee Seva) ఆన్లైన్ ద్వారా వచ్చిన ప్రతి పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి అర్హులై సభ్యుల పేర్లను ఆమోదిస్తున్నాం. ఇప్పటికే కొన్ని కొత్త యూనిట్లకు నెలవారీ రేషన్ కోటా కేటాయించాం. మరి కొన్ని కొత్త యూనిట్లకు వచ్చే నెల నుంచి రేషన్ కోటాకేటాయిసాం. ఆందోళన చెందవద్దు – రమేష్, జిల్లా పౌర సరఫరాల అధికారి, హైదరాబాద్ -
భారీగా తగ్గుతున్న బంగారం ధరలు: కారణం ఇదే..
గ్లోబల్ మార్కెట్లలో టారిఫ్ భయం తగ్గిపోతున్న క్రమంలో.. బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. దీంతో గోల్డ్ రేటు లక్ష రూపాయల నుంచి సుమారు రూ. 7000 తగ్గింది. దీంతో కొనుగోలుదారుల్లో కూడా బంగారం కొనాలా? వద్దా? అనే ప్రశ్న మొదలైపోయింది. ఎందుకంటే ఇంకా తగ్గుముఖం పడుతుందేమో అనే ఆలోచన వారిలో తలుపుతట్టింది.గత వారం గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 3500.05 డాలర్ల వద్ద ఉంది. అయితే గురువారం రోజు 2.2 శాతం క్షీణించి 3216.41 డాలర్లకు పడిపోయింది. ప్రస్తుతం భారతదేశంలో కూడా బంగారం ధరలు రూ. 95510 వద్ద ఉన్నాయి. ఏప్రిల్ నెలతో పోలిస్తే.. ఈ ధరలు కొంత తక్కువే అని స్పష్టమవుతోంది.బంగారం ధరలు తగ్గడానికి కారణంప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం వల్ల సురక్షితమైన ఆస్తులకు డిమాండ్ తగ్గింది. దీంతో పెట్టుబడిదారులు మళ్ళీ లాభాలను ఆర్జించడానికి సిద్ధమయ్యాయి. అంతే కాకుండా దక్షిణ కొరియా, జపాన్, భారతదేశంతో సంభావ్య వాణిజ్య ఒప్పందాల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనలు.. చైనాతో ఒప్పందం గురించి సానుకూల వ్యాఖ్యలు కూడా బంగారం ధరల తగ్గుదలకు కారణమైందని ఏంజెల్ వన్‌లో కమోడిటీస్ అండ్ కరెన్సీల చీఫ్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ 'తేజస్ అనిల్ షిగ్రేకర్' అన్నారు.ఇదీ చదవండి: ఆ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు: జాబితాలో ఉన్న మోడల్స్ ఇవే..అమెరికా సుంకాలను నివారించడానికి అనేక ప్రధాన వాణిజ్య భాగస్వాములు "చాలా మంచి" ఆఫర్లను అందించారని, ఒప్పందం కుదుర్చుకున్న మొదటి దేశాలలో భారతదేశం ఉంటుందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి 'స్కాట్ బెసెంట్' అన్నారు. మొత్తం మీద రాబోయే మూడు నుంచి నాలుగు నెలల్లో బంగారం మరింత తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. -
హైకోర్టు అనుమతిచ్చినా.. జేసీ ప్రభాకర్ రెడ్డి బరితెగింపు!
అనంతపురం: వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతిచ్చినా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తొడలు కొడుతున్నారు. పెద్దారెడ్డి తాడిపత్రి వస్తే తిరిగి వెళ్లడు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతి ఇచ్చినా... తాను మాత్రం దాడులు చేస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగా సవాల్ చేశారు.పెద్దారెడ్డికి ఎవరూ మద్దత ఇవ్వొద్దని, తనకు పెద్దారెడ్డితో గొడవలు ఉన్నాయని, ఒకవేళ వస్తే తిరిగి వెళ్లడు అంటూ వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతిచ్చిన క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలా వ్యాఖ్యానించడం ఏంటో అర్థం కావడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలు చేయడంలో తాము వెనక్కి తగ్గమని సంకేతాల్ని ఇచ్చిన జేసీపై విశ్లేషకులు మండిపడుతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్నా టీడీపీ పెద్దలు మాత్రం పెదవి విప్పడం లేదు. పార్టీలో సభ్యుడైన వ్యక్తిని కంట్రోల్ చేయాల్సిన వారు మిన్నుకుండిపోతుండటంతో జేసీ ప్రభాకర్ రెడ్డి పదే పదే రెచ్చిపోయి వ్యాఖ్యలు చేస్తున్నారనే అబిప్రాయం వ్యక్తమవుతోంది. -
శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఇంట తీవ్ర విషాదం
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి నిర్మల్ కపూర్(90) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేరిన ఆమె ఇవాళ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కాగా.. ఆమెకు ప్రముఖ నిర్మాత, శ్రీదేవి భర్త బోనీ కపూర్, నటుడు సంజయ్ కపూర్ కూడా సంతానం. వీరితో పాటు రీనా కపూర్ ఆమె ఓ కుమార్తె కూడా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆమె మరణం పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.ఈ విషయం తెలుసుకున్న వెంటనే శ్రీదేవి భర్త బోనీ కపూర్, ఆయన కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌తో పాటు శిఖర్ పహరియా, షనాయా కపూర్ల ముంబయి లోఖండ్‌వాలాలోని అనిల్ కపూర్ ఇంటికి చేరుకున్నారు. కాగా.. గతేడాది సెప్టెంబర్‌లో నిర్మల్ కపూర్ 90వ పుట్టినరోజు వేడుకను అందరూ కలిసి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.కాగా.. నిర్మల్ కపూర్ ప్రముఖ నిర్మాత సురీందర్ కపూర్‌ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ అనిల్ కపూర్, బోనీ కపూర్, సంజయ్ కపూర్, రీనా కపూర్ అనే నలుగురు జన్మించారు. అంతే కాకుండా ఆమెకు అర్జున్ కపూర్, సోనమ్ కపూర్, రియా కపూర్, హర్ష్ వర్ధన్ కపూర్, జాన్వీ కపూర్, అన్షులా కపూర్, ఖుషీ కపూర్, మోహిత్ మార్వా అనే మనవలు, మనవరాళ్లు ఉన్నారు. -
ఇప్పుడు మనం ఏం చేయాలి?
సిసలైన ఉద్వేగాలు సాటి మనుషులకు అర్థమవుతాయి. ఉద్వేగాలలోని నిజాయితీ ఉద్దేశాలలో ఉండదు. ‘పహల్గామ్’ ఘటన తరువాత ఏర్పడిన ఉద్వేగాలనూ, ఉద్దేశాలనూ కాస్త ముందు వెనుకలుగా వేరు చేసి మనమంతా ఒక్కటిగా శత్రువును ఎదుర్కొందాం అనే సందేశాన్ని ఇవ్వడంలో దేశవాసులు దాదాపు సఫలీకృతమయ్యారనే చెప్పాలి. అయితే అదంత సులువు కాలేదు. ఉద్దేశాలున్నవారు వాట్సప్‌లలో మునివేళ్లను కదిలించినంత వేగంగా ఉద్వేగాలున్నవారు కదిలించలేకపోయారు. అయినప్పటికీ వేగంగా మేలుకొని జవాబు చెప్పడానికి ప్రయత్నించారు. ఇందుకు అల్లాహ్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే.ఏప్రిల్ 22న కశ్మీర్ పహల్గామ్ (pahalgam) ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు మరణించారన్న వార్త వినగానే ముందు మనిషిగా, తర్వాత ముస్లింగా ఎంతో బాధను, ఆందోళనను అనుభవించాను. దేశంలోని కోట్ల ముస్లింలు ఇటువంటి పాశవిక దాడికి తీవ్రంగా నాలాగే బాధ పడ్డారు. మతం అడిగి ఇలాంటి దాడి చేశారన్న వార్త వారిని వేదనలో, విషాదంలో ముంచెత్తింది. ఈ తీవ్ర ఘటన తాలూకు విషాదాన్ని అనుభవించాలా, లేకుంటే తమకు ఏ సంబంధమూ లేకపోయినా జరిగే విద్వేష ప్రచారానికి కలత పడాలా అనే ఆందోళనలో వారు తల్లడిల్లారు. అయితే ఎవరైతే చావు నోటి వరకూ వెళ్లి వచ్చారో వారే ఈ పరిస్థితిని కుదుట పరచగలిగారు. మానవీయత ఉన్న కశ్మీరీలు తమ ప్రాణాలకు వారి ప్రాణాలను ఎలా అడ్డు పెట్టి కాపాడారో చెప్పిన కథనాలు దేశ ప్రజలకూ, ముఖ్యంగా ముస్లింలకూ ఊరటనిచ్చాయి.కశ్మీర్ (Kashmir) విషయంలో భారత్–పాకిస్తాన్ల మధ్య చాలా కాలంగా సాగుతున్న వైరం లెక్కలేనంత మందిని బలిదీసుకున్నా గత దాడులన్నీ సైన్యంపై జరిగితే, ఈసారి పర్యాటకులపై హిందూ మతం పేరిట జరిగింది. ఈ దాడి వెనుక ఉగ్రవాదుల ప్రధాన ఉద్దేశం దేశాన్ని సంక్షోభంలోకి నెట్టడం, కశ్మీర్‌ను ప్రపంచ దృష్టికి తీసుకురావడం. ఈ ఉగ్రచర్యకు పాల్పడినవారు, వారికి ఆర్థిక సాయం అందించినవారు, స్పాన్సర్లు.. పహల్గామ్ అమాయకుల ప్రాణాలను బలిదీసుకోవడంలో పాత్ర పోషించినవారే. వారందరినీ ఈ దాడికి జవాబుదారీగా చేసి, న్యాయస్థానం ఎదుట నిలబెట్టాలి.మతం అడగడం సిగ్గుచేటుప్రపంచంలోని ఏ మతగ్రంథం కూడా ప్రజలను చంపమని చెప్పలేదు. ఈ ఉగ్రదాడిలో బాధితుడి మతాన్ని అడగడం, అతను హిందువా, ముస్లిమా అని గుర్తించడానికి కల్మా పఠించమనడం సిగ్గుచేటు. శాంతిని కోరే భారతీయ ముస్లింలు ఇలాంటి నీచత్వాన్ని ఏ మాత్రం హర్షించరు. నిజమైన మానవుడంటే ప్రాణాలను కాపాడేవాడే కానీ ప్రాణాలను తీసేవాడు కాదు. ఖురాన్ లోని సూరహ్ అల్–మాయిదా వచనం 5:32 ‘ఒక అమాయకుడిని చంపేవాడు మొత్తం మానవాళిని చంపినట్లే’ అని చెబుతుంది. ఈ సూరహ్ కరుణ, సానుభూతి, బలహీనుల రక్షణను ప్రోత్సహిస్తుంది. తాను ముస్లిం అని చెప్పుకొనే వ్యక్తి ఈ భూమిపై ఏ మానవుడినీ చంపడు.భారతదేశ ప్రజలు కోరుకునేది మత విద్వేషాలు కాదు. భారతదేశం ప్రపంచంలోని అన్ని దేశాల శరణార్థులను స్వీకరించిందే తప్ప, ఈ దేశం నుండి ఏ వ్యక్తిని ఇతర ప్రాంతాలకు శరణార్థిగా పంపలేదు. అదే ఈ దేశానికున్న ఘనత. ఇది గొప్ప ఆధ్యాత్మిక ప్రేమగల దేశం. ప్రపంచంలోని ఇతర దేశాల్లో నివసిస్తున్న ముస్లింలతో పోలిస్తే భారతదేశంలో ముస్లింలకు అత్యున్నత గౌరవం, రక్షణ దొరుకుతున్నాయి. ఉగ్రవాదంపై పోరాటంలో ఇక్కడి ముస్లింల పాత్ర ఇప్పుడు కీలకంగా మారింది.ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏ మతాన్నీ కలవరపెట్టకుండా, ద్వేషించకుండా నిరసనలు, ప్రదర్శనలు నిర్వహించవచ్చు. రాజకీయ నాయకుల ప్రసంగాలు, మీడియా వ్యాఖ్యలను ఒక తటస్థ స్థితికి తేవాలి. సమస్యకు పరిష్కారం వెతకాలి. అన్ని మతాల ఆధ్యాత్మిక నాయకులు, సాధువులు, ముస్లిం, హిందూ మతాధికారులు, అన్ని మత పాఠశాలలు, ఇతర విద్యాసంస్థల అధిపతులు, ఉపాధ్యాయులు ఇందులో భాగం కావాలి. అన్ని మతాలను ప్రేమించడం ద్వారా ప్రజల్లో ఐక్యత, ఉమ్మడి విలువలను తీసుకురావాలి. ప్రభుత్వాన్నో, ఫలానా రాజకీయ పార్టీనో విమర్శించి చేతులు దులుపుకోకుండా ఉగ్రవాదాన్ని బలంగా ఎదుర్కోవడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడమే ఇప్పుడు మన ముందున్న బాధ్యత.దేశం ఇలాంటి విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్న సమయంలో మీడియా దేశంలోని భిన్నవర్గాలను బలోపేతం చేయాలి. అంతేకానీ రాజకీయ పార్టీలు, మతాల పేరుతో వర్గాలను విభజించకూడదు. ముస్లింల వల్లే తాము బతికి ఉన్నామని చెప్పిన బాధితుల కుటుంబాల మాటలను మీడియా కూడా ప్లే చేయాలి. దురదృష్టవశాత్తు కొన్ని మీడియా సంస్థలు ఇలా చేయడం లేదు. పౌర హక్కులు, మానవ హక్కుల కార్యకర్తల్లాగే ఇప్పుడు మతస్వేచ్ఛ కార్యకర్తలు అవసరం. మత విద్వేషాన్ని ఆపేందుకు వారి తోడ్పాటు కావాలి.చదవండి: ఉగ్రవాదంపై పోరులో ఏకమైన దేశంభారత్–పాక్ అణుశక్తిని కలిగి ఉన్న దేశాలు. ఒకసారి యుద్ధం మొదలైందంటే ఇది ఎక్కడ ముగుస్తుందో తెలియదు. అందుకే యుద్ధకాంక్షను ఆపి, శాంతి వైపు చర్చలు జరపాలి. స్నేహపూర్వక దేశాలతో కూర్చుని ఈ సమస్యను పరిష్కరించాలి. యుద్ధమనేది అంతిమ పరిష్కారం. ఉగ్రదాడిలో అమాయకులు తమ ప్రాణాలు కోల్పోయారు. ఆ అమరవీరులకు వందనం చేద్దాం. భారతం చెప్పిందే మన సందేశం. కౌరవులు, పాండవుల మధ్య ఏ ఫిర్యాదులైనా ఉండొచ్చు... బయటి శత్రువుకు మేము నూటా ఐదుగురం అన్నాడు ధర్మరాజు. బయట శత్రువు కన్నెత్తి చూస్తే ఈ దేశంలోని అన్ని మతాల వారు ఐక్యమై సింహాల్లా గర్జించగలరని చాటడమే ఇప్పుడు కావలసింది. జై భారత్. జై హింద్.- జహారా బేగం సామాజిక కార్యకర్త, యూఎస్ఏ -
‘ఇలంబర్తికి వచ్చింది ప్రమోషన్.. డిమోషన్ కాదు’
హైదరాబాద్: తన పరిధిలో ఉన్న శాఖల్లో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. దీనికి సంబంధించి తన పరిధిలోని అన్ని డిపార్ట్ మెంట్లలో విచారణ చేసుకోవచ్చని సవాల్ చేశారు. మీడియాతో చిట్ చాట్ చేసిన పొన్నం తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై స్పందించారు. చిన్నస్థాయి నుంచి మంత్రిగా ఎదిగానని, తనపై వచ్చిన అవినీతి మరకలను నిరూప్తిస్తే తాను దేనికైనా సిద్ధమేనన్నారు.తప్పుడు ప్రచారాన్ని సహించేది లేదని, తన దగ్గరున్న ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి కింది స్థాయి అధికారి వరకూ మంచి సంబంధాలున్నాయన్నారు. ఇలంబర్తికి తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. అధికారుల బదిలీలు ప్రభుత్వంలో సర్వసాధారణంగా జరుగుతుందన్నారు. ఇలంబర్తికి వచ్చింది ప్రమోషన్.. డిమోషన్ కాదన్నారు. ఇదిలా ఉంటే, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి బదిలీ అయిన సంగతి తెలిసిందే. కొత్త కమిషనర్ గా ఆర్వీ కర్ణన్ ను నియమించింది ప్రభుత్వం. 2024 జూన్ లో రోనాల్డ్ రోస్ ని పక్కన పెట్టి జీహెచ్ఎంసీ కమిషనర్‌గా అమ్రాపాలి నియమించింది ప్రభుత్వం. ఐదు నెలల పాటు పనిచేయగానే అమ్రాపాలి ఏపీకి వెళ్లాల్సి వచ్చింది. దీంతో 2024 అక్టోబర్ లో బల్దియా బాస్ గా ఇలంబర్తిని నియమించారు. ఆరు నెలలు పని చేయగానే ఐఏఎస్ బదిలీల్లో భాగంగా ఇలంబర్తిని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్( MAUD) సెక్రెటరీగా బదిలీ చేసింది ప్రభుత్వం. ఈ క్రమంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ పై అవినీతి ఆరోపణలు రావడం, దానికి ఇలంబర్తి అంశాన్ని లింకు పెట్టడంతో వివాదం పెద్దదిగా మారింది. దీనిపై పొన్నం ప్రభాకర్ వివరణ ఇవ్వడమే కాకుండా అవినీతిని నిరూపించాలంటూ సవాల్ చేశారు. -
ఆ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు: జాబితాలో ఉన్న మోడల్స్ ఇవే..
స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే దాదాపు ప్రతి ఒక్కరూ.. వాట్సాప్ ఉపయోగిస్తుంటారు. అయితే 2025 మే 5 నుంచి కొన్ని ఫోన్లలో ఈ మెసేజింగ్ యాప్ (వాట్సాప్) పనిచేయదు. ఇంతకీ జాబితాలో ఏ ఫోన్లు ఉన్నాయనే విషయం ఈ కథనంలో తెలుసుకుందాం.యూజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని మెటా ఎప్పటికప్పుడు 'వాట్సాప్'ను అప్డేట్ చేస్తూ లేదా కొత్త ఫీచర్లులను ప్రవేశపెడుతూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు వాట్సాప్ ఉపయోగించే ఫోన్ల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ క్రమంలో పాత ఆపరేటింగ్ సిస్టం కలిగిన ఐఫోన్లలో తమ సేవలను నిలిపివేయనుంది.మీరు ఉపయోగించే ఐఫోన్ iOS 15.1 తర్వాత లాంచ్ అయిన వెర్షన్ అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా వాట్సాప్ పనిచేస్తుంది. అయితే మీ ఐఫోన్ iOS 15.1 లేదా అంతకు ముందు వెర్షన్ అయితే వాట్సాప్ పనిచేయదు. జాబితాలో ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ వంటివి ఉన్నాయి. అంటే ఈ ఫోన్లలో మే 5 నుంచి వాట్సాప్ పనిచేయదు. ఎందుకంటే ఈ ఫోన్లు iOS 14 వెర్షన్లకే పరిమితమయ్యాయి. వీటిని iOS 15కి అప్డేట్ చేయడం కుదరదు. -
సురేఖా వాణి బర్త్ డే సెలబ్రేషన్స్.. చీరలో ట్రెండింగ్ బ్యూటీ
తల్లి సురేఖావాణి పుట్టినరోజు సెలబ్రేట్ చేసిన సుప్రీతచీరలో ట్రెండింగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సేటోపీతో టూర్ లో చిల్ అవుతున్న కాయదు లోహర్ఎర్రటి డ్రస్సులో రచ్చ లేపుతున్న రకుల్ ప్రీత్ సింగ్అందాల్ని ఎర వేస్తూ రెచ్చగొట్టేస్తున్న కేతిక శర్మఫ్యామిలీతో కలిసి శ్రియ శరణ్ హ్యాపీ మూమెంట్స్చీరలో చాలా నిండుగా బాలయ్య బ్యూటీ హనీరోజ్ View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Meera Jasmine (@meerajasmine) View this post on Instagram A post shared by Komalee Prasad (@komaleeprasad) View this post on Instagram A post shared by Pepper Trail, Wayanad (@peppertrail) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Ivana (@i__ivana_) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) -
ఎస్ఆర్హెచ్ను చిత్తు చేసిన గుజరాత్
IPL 2025 Gujarat Titans vs Sunrisers Hyderabad Live Updates:ఎస్ఆర్హెచ్ను చిత్తు చేసిన గుజరాత్‌ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కథ దాదాపు ముగిసినట్లే. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ తేలిపోయింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 38 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. 225 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేయగల్గింది. లక్ష్య చేధనలో ఓపెనర్లు మంచి అరంభం ఇచ్చినప్పటికి, మిడిలార్డర్ విఫలమం కావడంతో ఆరెంజ్ ఆర్మీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ(74) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, సిరాజ్ తలా రెండు వికెట్లు సాధించగా.. ఇషాంత్ శర్మ, కోయిట్జీ తలా వికెట్ సాధించారు. ఓటమి దిశగా ఎస్ఆర్హెచ్సన్రైజర్స్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. 6 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయింది. క్లాసెన్(23).. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో ఔట్ కాగా.. సిరాజ్ బౌలింగ్‌లో అనికేత్ వర్మ(3), మెండిస్(0) ఔటయ్యారు. 17 ఓవర్లకు సన్‌రైజర్స్ 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ డౌన్అభిషేక్ శర్మ రూపంలో ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. 74 పరుగులు చేసిన అభిషేక్ ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 15 ఓవర్లకు సన్‌రైజర్స్ మూడు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ క్లాసెన్(22), అనికేత్ వర్మ(0) పరుగులతో ఉన్నారు.అభిషేక్ హాఫ్ సెంచరీగుజరాత్తో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 14 ఓవర్లకు సన్‌రైజర్స్ రెండు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(69), క్లాసెన్(16) పరుగులతో ఉన్నారు.ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ డౌన్..ఇషాన్ కిషన్ రూపంలో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన కిషన్.. కోయిట్జీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 11 ఓవర్లకు సన్‌రైజర్స్ రెండు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(49), క్లాసెన్(10) పరుగులతో ఉన్నారు.ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ డౌన్..225 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ ట్రావిస్ హెడ్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన హెడ్.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లకు సన్‌రైజర్స్ వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది.చెలరేగిన గుజరాత్ బ్యాటర్లు.. ఎస్ఆర్హెచ్ ముందు భారీ టార్గెట్ అహ్మదాబాద్ వేదికగా ఎస్ఆర్హెచ్తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్(76) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జోస్ బట్లర్(64), సుదర్శన్(48) పరుగులతో రాణించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో జయ్‌దేవ్ ఉనద్కట్ మూడు వికెట్లు పడగొట్టగా.. కమ్మిన్స్, అన్సారీ తలా వికెట్ సాధించారు.గుజరాత్ రెండో వికెట్ డౌన్శుబ్మన్ గిల్ రూపంలో గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 76 పరుగులు చేసిన గిల్.. దురదృష్టవశాత్తూ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. 13 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ రెండు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది.శుబ్‌మన్ గిల్ ఫిప్టీ..గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 25 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 10 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 120 పరుగులు చేసింది. క్రీజులో బట్లర్(19), గిల్(52) ఉన్నారు.గుజరాత్ తొలి వికెట్ డౌన్..సాయిసుదర్శన్ రూపంలో గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 48 పరుగులు చేసిన సుదర్శన్.. జీషన్ అన్సారీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 103 పరుగులు చేసింది. క్రీజులో గిల్(42), బట్లర్(12) ఉన్నారు.దంచి కొడుతున్న గుజరాత్ ఓపెనర్లు..నరేంద్ర మోదీ మైదానంలో గుజరాత్ ఓపెనర్లు బౌండరీల వర్షం కురిపిస్తున్నారు. 6 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 82 పరుగులు చేసింది. క్రీజులో సుదర్శన్(45), శుబ్‌మన్ గిల్(36) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న గుజరాత్టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్(26), గిల్(10) ఉన్నారు. ఐపీఎల్-2025లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు సన్‌రైజర్స్ చాలా కీలకం. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే హైదరాబాద్.. ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందేఎస్ఆర్హెచ్ తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. గుజరాత్ మాత్రం ఓ మార్పుతో బరిలోకి దిగింది. కరీమ్ జనత్ స్ధానంలో జట్టులోకి కోయిట్జీ వచ్చాడు.తుది జట్లుగుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, గెరాల్డ్ కోయెట్జీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణసన్రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ, మహమ్మద్ షమీ -
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
నంద్యాల: జిల్లాలోని ఆత్మకూరు మండలంలోని సిద్ధాపురం చెరువు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు, గుంటూరు ప్రధాన జాతీయ రహదారిపై బోలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 16 మందికి గాయాలు కాగా, అందులో పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రీశైల క్షేత్రంలో దైవదర్శనానికి వెళ్లి బొలెరో వాహనంలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో గాయపడిన వారు, మృతులు కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఇందిరానగర్, రాజీవ్ నగర్ లకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. -
కొత్త కారు కొన్న 'బిగ్ బాస్ 8' నైనిక.. రేటు ఎంతంటే?
బిగ్ బాస్ కొత్త సీజన్ త్వరలో మొదలుకానుంది. ఇప్పటివరకు 8 సీజన్లు జరగ్గా.. కంటెస్టెంట్ వాళ్లలో చాలామంది గుర్తింపు తెచ్చుకున్నారు. మరీ సినిమా అవకాశాలైతే రావట్లేదు గానీ షోలు చేస్తూ సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే గతేడాది 8వ సీజన్ లో పాల్గొన్న డ్యాన్సర్ నైనిక ఇప్పుడు కొత్త కారు కొనుగోలు చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే) ఢీ షోతో డ్యాన్సర్ గా కెరీర్ ప్రారంభించిన నైనిక.. ఒకటి రెండు సీజన్లలో పాల్గొంది. మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా వచ్చిన ఫేమ్ తో బిగ్ బాస్ అవకాశం దక్కించుకుంది. కానీ ఎన్ని వారాలు ఉండలేకపోయింది. ఫెర్ఫార్మెన్స్ సరిగా లేకపోవడం వల్ల కొన్ని వారాలకే ఎలిమినేట్ అయిపోయింది. షో నుంచి బయటకొచ్చిన తర్వాత అప్పుడప్పుడు షోల్లో కనిపించిన నైనిక.. మరోవైపు ప్రమోషన్స్ కూడా చేస్తూ సంపాదించుకుంటోంది. ఇప్పుడు అలా దాచుకున్న డబ్బుతో టాటా కారుని కొనుక్కుంది. దీని ధర మార్కెట్ లో రూ.10-15 లక్షల మధ్యలో ఉండొచ్చని తెలుస్తోంది.(ఇదీ చదవండి: చేసిన ప్రతి సినిమా హిట్.. ఎవరీ శ్రీనిధి శెట్టి?) View this post on Instagram A post shared by Nainika Anasuru (@nainika.anasuru26) -
శశిథరూర్‌పై ప్రధాని మోదీ వ్యాఖ్యల వెనుక..
'ఈ సమావేశం తర్వాత కొంతమందికి నిద్రపట్టదు' అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) చేసిన వ్యాఖ్యలకు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. కేరళలో శుక్రవారం పర్యటించిన మోదీ మాటల తూటాలతో ప్రత్యర్థులపై సూటిగా గురిపెట్టారు. సీనియర్ కాంగ్రెస్ నేత శశిథరూర్ భుజాలపైనుంచి ప్రతిపక్ష ఇండియా కూటమిపై తుపాకీ ఎక్కుపెట్టారు. 'మీ పార్టీకి చెందిన సీనియర్ నేత మా పక్కన నిలబడ్డారు చూడండి' అన్నట్టుగా గ్రాండ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్‌కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.వారికి నిద్ర పట్టకపోవచ్చు..తిరువనంతపురం సమీపంలో నిర్మించిన ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ డీప్ వాటర్ మల్టీపర్పస్ సీపోర్టును ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేరళ సీఎం పినరయి విజయన్‌తో పాటు స్థానిక ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నేత శశిథరూర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. "ముఖ్యమంత్రి (పినరయి విజయన్)కి నేను చెప్పాలనుకుంటున్నాను, మీరు INDIA కూటమికి బలమైన స్తంభం, శశి థరూర్ (Shashi Tharoor) కూడా ఇక్కడ కూర్చున్నారు. ఈరోజు మీరు నాతో పాటు వేదిక పంచుకున్నారు. మీరు ఇక్కడ ఉండడం కొందరికి రుచించకపోవచ్చు. వారికి నిద్ర కూడా పట్టకపోవచ్చు. ఈ మెసేజ్ ఎక్కడికి వెళ్లాలో అక్కడికి చేరుతుంద"ని వ్యాఖ్యానించారు.గ్యాప్ పెరిగింది..తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న శశిథరూర్.. ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ (INDIA) కూటమిలో కీలక నేతగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ఆయనకు మధ్య దూరం పెరిగింది. పినరయి విజయన్ (Pinarayi Vijayan) సర్కారు తీసుకొచ్చిన ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, రెడ్ టేప్ కోత విధానాలపై కొద్ది రోజుల క్రితం శశిథరూర్ ప్రశంసలు కురిపించారు. అక్కడితో ఆగకుండా కాంగ్రెస్‌కు బద్దశత్రువైన ప్రధాని మోదీని పొగడ్తలతో ముంచెత్తారు. మోదీ అమెరికా పర్యటన, డొనాల్డ్ ట్రంప్‌తో భేటీపై పాజిటివ్ కామెంట్స్ చేశారు. దీంతో శశిథరూర్‌ను కాంగ్రెస్ హైకమాండ్ దూరం పెట్టింది. పార్టీకి తన అవసరం లేకపోతే స్పష్టంగా చెప్పాలని, తన దారి తాను చూసుకుంటానని గత ఫిబ్రవరిలో అధిష్టానాన్ని అడిగారు. ఈ నేపథ్యంలో థరూర్ బీజేపీలో చేరతారని ప్రచారం కూడా ఊపందుకుంది. అయితే తాను పార్టీ మారబోనని అప్పట్లో ఆయన స్పష్టం చేశారు.చదవండి: ప్రపంచానికి ఇదే సందేశం ఇచ్చాం.. మల్లిఖార్జున ఖర్గేపతాక శీర్షికలకు మోదీ వ్యాఖ్యలుతాజాగా థరూర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు పతాక శీర్షికలకు ఎక్కాయి. శశిథరూర్ భుజాల పైనుంచి ప్రతిపక్ష ఇండియా కూటమిపైకి మోదీ తుపాకీ ఎక్కుపెట్టారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇండియా కూటమిని డిఫెన్స్‌లో పడేసేందుకే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. మరోవైపు కేరళలో పాగా వేసేందుకు కాషాయ పార్టీ ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మోదీ వ్యాఖ్యలపై ఇండియా కూటమి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. -
ముంబైని ఓడించడం అంత ఈజీ కాదు.. టాప్-2లో నిలుస్తుంది: హర్భజన్
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా గురువారం జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది.ఈ విజయంతో ముంబై పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌పై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ఏడాది సీజన్ గ్రూపు స్టేజి పాయింట్ల పట్టికలో ముంబై మొదటి రెండు స్థానాల్లో నిలుస్తుందని జోస్యం చెప్పాడు."రాజస్తాన్ రాయల్స్‌పై ముంబై ఇండియన్స్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ప్రస్తుతం ముంబై ఛాంపియన్ టీమ్‌లా ఆడుతోంది. ముంబై ప్లేయింగ్ ఎలెవన్‌లో పది మంది ఆటగాళ్లకు ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించే సత్తా ఉంది. ఏ జట్టుకైనా హార్దిక్ సేనను ఓడించడం అంత సులువు కాదు. కచ్చితంగా గ్రూపు స్టేజిలో ముంబై టాప్-2లో నిలుస్తుందని నేను భావిస్తున్నాను. ముంబై గ్రూపు స్టేజిని 18 లేదా 20 పాయింట్లతో ముగుస్తుందని" హర్భజన్ తన యూట్యూబ్ ఛానెల్లో పేర్కొన్నాడు. -
బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లకు షాక్.. అకౌంట్లు బ్లాక్
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌పై భారత్ కఠిన చర్యలు చేపట్టింది. సింధు జలాల ఒప్పందం రద్దు సహా దాయాదిపై అనేక ఆంక్షలు విధించింది. అదే విధంగా పాకిస్తాన్‌కు చెందిన సామాజిక మాధ్యమాల ఖాతాల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే పాక్ యూట్యూబ్ చానెళ్లు, ట్విటర్‌ను నిషేధించిన భారత్.. క్రీడాకారుల సోషల్ మీడియా అకౌంట్లపై కూడా దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇప్పటికే జావెలిన్ త్రోయర్, ప్యారిస్ ఒలింపిక్స్-2024 స్వర్ణ పతక విజేత అర్షద్ నదీమ్ (Arshad Nadeem) ఖాతాను దేశంలో నిలిపివేసింది.బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లకు షాక్ఇక పాకిస్తాన్ స్టార్ క్రికెటర్లు బాబర్ ఆజం (Babar Azam), కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (Mohammed Rizwan)లకు కూడా తాజాగా షాక్ తగిలింది. వీరిద్దరి ఇన్స్టాగ్రామ్ ఖాతాలను భారత్‌లో నిలిపి వేశారు. వీరి అకౌంట్లను ఓపెన్ చేయాలని చూస్తే.. ‘‘ఈ అకౌంట్ ఇండియాలో అందుబాటులో లేదు. చట్టపరమైన అభ్యర్థనల నేపథ్యంలో దీనిపై ఆంక్షలు ఉన్నాయి’’ అనే సందేశం కనిపిస్తోంది.కాగా పహల్గామ్ దాడి తర్వాత షోయబ్ అక్తర్, షాహిన్ షా ఆఫ్రిది, హ్యారిస్ రవూఫ్, షాహిద్ ఆఫ్రిది, వసీం అక్రం, వకార్ యూనిస్, బసిత్ అలీ తదితర క్రికెటర్ల అకౌంట్లను కూడా భారత్‌లో బ్లాక్ చేశారు. అదే విధంగా ఇతర సెలబ్రిటీలు మహీరా ఖాన్, ఫవాద్ ఖాన్, అలీ జాఫర్, హనియా ఆమిర్ ఖాతాలను కూడా నిలిపివేశారు.భారత్‌లో నిషేధంఇక పాకిస్తాన్ ఆటగాళ్లు ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్‌తో బిజీగా ఉన్నారు. ఐపీఎల్-2025తో పోటీ పడి చేతులు కాల్చుకున్న పాక్ క్రికెట్ బోర్డుకు.. పహల్గామ్ దాడి తర్వాత మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే అంతంత మాత్రమైన వ్యూయర్షిప్ ఉన్న ఈ లీగ్ ప్రసారాలను భారత్‌లో నిషేధించారు.కాగా జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో గల ప్రశాంతమైన బైసరన్ లోయలో ఉగ్రవాదులు ఇటీవల పాశవిక దాడికి తెగబడిన విషయం తెలిసిందే. బైసరన్ అందాలు చూసేందుకు వచ్చిన 26 మంది పర్యాటకులను కాల్చి చంపేశారు. దీంతో... అమాయక ప్రజల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులు, వారికి మద్దతు ఇస్తున్న వారిపై భారత్ కఠిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ముందుగా దాయాదికి బుద్ధిచెప్తోంది.చదవండి: ఆసియా కప్, బంగ్లాదేశ్ పర్యటనను రద్దు చేసుకోనున్న టీమిండియా..? -
ప్రధాని సభలో ఏపీ హక్కులపై బాబు, పవన్‌లు మౌనం
అమరావతి: అమరావతి పునః ప్రారంభ కార్యక్రమంలో భాగంగా ఏపీకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఎదుట.. రాష్ట్ర హక్కులపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు మౌనం పాటించారు. రాష్ట్ర విభజన నాటి ఏపీ హక్కుల గురించి ప్రధాని మోదీ వద్ద.. వీరు కనీసం ప్రస్తావించలేదు. కేవలం ప్రధాని మోదీపై పొగడ్తల వర్షం కురిపించిన బాబు.. విభజన సమస్యల పరిష్కారం అంశానికి సంబంధించి మోదీ నుంచి ఎటువంటి ప్రకటన చేయించలేకపోయారు.విభజన హామీలు పెండింగ్ లో ఉన్నందను చంద్రబాబు, పవన్‌లు కనీసం మోదీ వద్ద ఆ ప్రస్తావన తెచ్చి ఉంటే బాగుండేది. కానీ వారు ఆ పని చేయలేదు. అమరావతిని రీలాంచ్ చేసే కార్యక్రమం వరకే పెట్టుకున్నట్లే చంద్రబాబు, పవన్‌ల ధోరణి కనబడింది. ప్రధాని బ్లెస్సింగ్స్ కావాలన్నారే కానీ ఏపీ హక్కుల కోసం మాత్రం అడగలేదు చంద్రబాబు. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరణ, పోలవరం ఎత్తు తగ్గింపుపై స్పష్టత తదితర అంశాలు మోదీ వద్ద చంద్రబాబు, వవన్‌లు ప్రస్తావించలేదు.అమరావతి రీలాంచ్ కార్యక్రమంలో భాగంగా కొత్తగా మరో శిలాఫలకాన్ని ఆవిష్కరించారే కానీ, విభజన నాటి ఏపీ హక్కుల గురించి మాత్రం మోదీ ప్రసంగంలో కానీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల ప్రసంగంలో కానీ కనీసం మచ్చుకైనా కనిపించకపోవడం గమనార్హం.పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు -
ప్రజల వద్దే పెద్ద నోట్లు.. ఇంకా రావాల్సిన మొత్తం ఎంతంటే?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.2000 నోట్ల ఉపసంహరణ ప్రారభించి దాదాపు రెండేళ్లు కావొస్తోంది. అయినప్పటికీ ప్రజల వద్ద ఇంకా రూ.6266 కోట్ల విలువైన నోట్లు ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు వెనక్కి వచ్చిన నోట్లు 98.24 శాతం. ఇంకా 1.76 శాతం నోట్లు రావాల్సి ఉందని ఆర్బీఐ వెల్లడించింది.పెద్దనోట్ల ఉపసంహరణ ప్రకటించిన సమయానికి చలామణిలో రూ. 3.56 లక్షల కోట్ల విలువైన రూ. 2000 నోట్లు ఉన్నాయి. అయితే ఇది 2025 ఏప్రిల్ 30 నాటికి రూ. 6,266 కోట్లకు తగ్గింది.ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్న రెండు వేలరూపాయల నోట్లను రిజర్వ్ బ్యాంక్‌కు చెందిన 19 ప్రాంతీయ కార్యాలయాల్లో డిపాజిట్ చేసుకోవచ్చు. అలా కాకుంటే.. పోస్టాఫీసు నుంచి ఆర్బీఐ జారీ కార్యాలయాలకు ఇండియా పోస్ట్ ద్వారా పంపించవచ్చు. మీరు పంపించిన నోట్ల విలువకు సమానమైన మొత్తాన్ని బ్యాంక్ ఖాతాకు ఆర్బీఐ జమచేస్తుంది. -
ఓటీటీలో మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక ఏడాపెడా వెబ్ సిరీస్‌లు వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ఈ నేపథ్యంలో వెబ్ సిరీస్‌లు ఎక్కువగా ఆ జోనర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ జోనర్ ఇష్టపడే వారికోసం మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ త్వరలోనే అలరించనుంది.రోషన్ మాథ్యూ , మోహిత్ రైనా, త్రినేత్ర ప్రధాన పాత్రల్లో నటించిన తాజా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'కంకాజుర'. ఈ సిరీస్‌కు చందన్ అరోరా దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సిరీస్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ థ్రిల్లర్ సిరీస్ సోనీలివ్‌లో ఈనెల 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇజ్రాయెల్ సిరీస్ మ్యాగ్పీ ఆధారంగా ఈ సిరీస్నును హిందీలో తెరకెక్కించారు. టీజర్ చూస్తే తనను అవమానించిన వారిపై పగతీర్చుకునే ఓ యువకుడి కథ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. It’s fragile. It’s fatal. It’s coming.Kankhajura — Streaming on 30th May on Sony LIV.#KanKhajura #SoFragileYetSoFatal#MohitRaina @roshanmathew22 @sarahjanedias03 #TrinetraHaldarGummaraju #NinadKamat #MaheshShetty #HeebaShah pic.twitter.com/FxUDjHUsaW— Sony LIV (@SonyLIV) May 2, 2025 -
పాక్ ప్రధాని యూట్యూబ్ ఛానల్ బ్యాన్
జమ్మూ & కాశ్మీర్‌లోని పహల్గామ్లో 26 మంది పర్యాటకులను బలిగొన్న ఘోరమైన ఉగ్రవాద దాడిపై కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య పాకిస్తాన్ ప్రధాన మంత్రి 'షెహబాజ్ షరీఫ్' యూట్యూబ్ ఛానెల్‌ను శుక్రవారం భారతదేశంలో బ్లాక్ చేశారు.కొన్ని రోజుల క్రితం భారత ప్రభుత్వం 16 పాకిస్తానీ యూట్యూబ్ ఛానెల్‌లను నిషేధించిన తర్వాత ఈ ఖాతాలను బ్లాక్ చేశారు. వీటిలో డాన్ న్యూస్, సమా టీవీ, ఏఆర్వై న్యూస్ వంటి ప్రముఖ మీడియా సంస్థలు ఉన్నాయి. రెచ్చగొట్టే.. మతపరంగా సున్నితమైన కంటెంట్, తప్పుదారి పట్టించే కథనాలు మాత్రమే కాకుండా భారతదేశానికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారం ప్రసారం చేసినందుకు ఈ ఛానెల్‌లను నిషేధించారు.'షెహబాజ్ షరీఫ్' యూట్యూబ్ ఛానెల్‌ను బ్లాక్ చేయడంతో పాటు.. గాయకుడు అతిఫ్ అస్లాం, క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, బాబర్ ఆజం, నటుడు ఫవాద్ ఖాన్, హనియా అమీర్, మహిరా ఖాన్‌లతో సహా అనేక మంది పాకిస్తాన్ ప్రముఖుల ఇన్స్టాగ్రామ్ ఖాతాలు కూడా సస్పెండ్ చేశారు.పహల్గామ్లో ఉగ్రవాద దాడి జరిగిన తరువాత.. భారత ప్రభుత్వం సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం మాత్రమే కాకుండా, అటారీ-వాఘా సరిహద్దును కూడా పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. భారత్ గగనం తలంలో పాక్ విమాన ప్రయాణాలపై నిషేధం విధించింది. -
ప్రపంచానికి ఇదే సందేశం ఇచ్చాం: మల్లికార్జున ఖర్గే
ఢిల్లీ : దేశ భద్రత విషయంలో మొత్తం విపక్షం కేంద్రానికి మద్దతుగా నిలుస్తుందన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ప్రపంచానికి కూడా ఇదే సందేశం ఇచ్చామన్నారాయన. ఈరోజు(శుక్రవారం) జరిగిన సీడబ్యూసీ సమావేశంలో మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. ‘ పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిగా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన వ్యూహం కనిపించలేదు. రాహుల్ గాంధీ కాన్పూర్ లో చనిపోయిన శుభం ద్వివేదీ కుటుంబాన్ని కలిశారు. చనిపోయిన వారికి ‘అమరుల’ హోదా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.దేశ భద్రత విషయంలో మొత్తం విపక్షం కేంద్రానికి మద్దతుగా నిలుస్తుంది. ప్రపంచానికి ఇదే సందేశం ఇచ్చాం. మోదీ ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన నిర్వహించాలని నిర్ణయించింది. ఇది రాహుల్ గాంధీ దీర్ఘకాలిక ఉద్యమ ఫలితమే. ఆయన “భారత్ జోడో న్యాయ యాత్ర” ద్వారా దీనిని ప్రధాన అజెండాగా మార్చారు. తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇప్పటికే కుల సర్వే పూర్తి చేశాయి.50% రిజర్వేషన్ సీలింగ్ ఎత్తివేయాలి. గణన నుండి వచ్చిన సమాచారాన్ని ప్రభుత్వం మంచి పాలన కోసం ఉపయోగించాలి.కులగణన కచ్చితంగా జరగాలి. ఫలితాలను అమలు చేయాలి. పాలసీలు, చట్టాలు దానికి అనుగుణంగా ఉండాలి. 2021 సాధారణ జనగణన కూడా జరగలేదు. ఇప్పటికీ 2011 డేటానే ఉపయోగిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ యొక్క రిజర్వేషన్ వ్యతిరేక దృక్పథమే ఈ ఆలస్యం వెనుక కారణం’ అని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. -
సింహాచలం ఘటన: ముగిసిన త్రీమెన్ కమిటీ ప్రాథమిక విచారణ
విశాఖ :సింహాచలంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతిచెందిన దుర్ఘటనలో త్రీమెన్ కమిటీ ప్రాథమిక విచారణ ముగిసింది. దీనిపై ప్రభుత్వానికి రేపు(శనివారం) నివేదిక ఇవ్వనుంది త్రీమెన్ కమిటీ. దీనివలో భాగంగా త్రీమెన్ కమిటీ చైర్మన్, మున్సిపల్ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ మాట్లాడుతూ ‘ సింహాచలం దుర్ఘటనపై రేపు ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం. ప్రమాదానికి కారణమైన గోడను నోటి మాటతో కట్టేశారు. గోడ నిర్మాణానికి ఎటువంటి అనుమతులు లేవు.విచారణలో భాగంగా వివిధ శాఖల వారిని విచారించాం. వైదిక నియమాలను ఉల్లంఘించినట్లు ఆలయ అర్చకులు చెప్పారు. ఆగమ శాస్త్రపరమైన సలహాలు లేకుండానే గోడ నిర్మించారని వైదికులు మా దృష్టికి తీసుకొచ్చారు. మాస్టర్ ప్లాన్ ఉల్లంఘనలు కనిపించాయి. ఎవరి అనుమతిలో మాస్టర్ ప్లాన్ పై నిర్ణయాలు తీసుకున్నారో తేలాలి. ప్రసాద్ స్కీం పనులు గత ఏడాది ఆగస్టులో పూర్తి కావాల్సి ఉంది. ఆలస్యానికి కారణం ఏంటని అడిగితే భిన్నమైన సమాధానాలు వచ్చాయి. అధికారుల మధ్య సమన్వయంపై ఉన్నతాధికారులతో మాట్లాడాలి’ అని స్పష్టం చేశారు.కాగా, సింహాచలం చందనోత్సవంలో గోడ కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. రూ.300 టికెట్ కౌంటర్ వద్ధ ఈ ప్రమాదం జరిగింది. ఇటీవలే అక్కడ గోడ నిర్మించారు. గోడ నాసిరకంగా నిర్మించడం వలనే కూలిపోయిందని అధికారులు భావిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున 2-3 గంటల మధ్య రూ.300 క్యూ లైన్లో ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతులను విశాఖపట్నం మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం గ్రామానికి చెందిన పిళ్లా ఉమామహేశ్వరరావు (30), ఆయన భార్య శైలజ (26)గా అధికారులు గుర్తించారు. వీరితో పాటు పిల్లా శైలజ తల్లి వెంకటరత్నం, మేనత్త గుజ్జురి మహాలక్ష్మి కూడా ఈ ఘటనలో మృతిచెందారు. -
సరికొత్త వెల్నెస్ ట్రెండ్ "ఫార్ట్ వాక్" అంటే ..? వైద్య నిపుణుల సైతం బెస్ట్..
ప్రస్తుతం అభివృద్ధి చెందిన సాంకేతికత తోపాటు..సరికొత్త వెల్నెస్ ట్రెండ్లు తెగ పుట్టుకొచ్చేస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా పుణ్యమా అని సామాన్యులు సైతం ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నారు. పైగా ఇంట్లో వాళ్లకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఈ డైట్ మంచిది, ఇలా చేస్తే బెటర్ అంటూ ఎన్నెన్నో ఆరోగ్య చిట్కాలు కోకొల్లలుగా వచ్చేస్తున్నాయి. అలానే ఇప్పుడు మరో వెల్నెస్ ట్రెండ్ నెట్టింట సందడి చేస్తోంది. ఆఖరికి నిపుణులు సైతం చాలా మంచిదని చెబుతుండటం మరింత విశేషం. మరీ ఆ ట్రెండ్ ఏంటి..? దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటీ అంటే.."ఫార్ట్ వాక్"(Fart Walk) అనే పదాన్ని తొలిసారిగా కెనడియన్ కుక్‌బుక్ రచయిత్రి మైర్లిన్ స్మిత్ రూపొందించారు. ఇదే చాలామంది వ్యక్తుల దీర్ఘాయువు రహస్యం అట. తక్కువ శ్రమతో కూడిన ఆరోగ్య రహస్యమని అంటున్నారు. ఇంతకీ అసలు ఈ వాక్ ఎలా చేస్తారంటే..ఫార్ట్ వాక్ అంటే..భోజనం తర్వాత తేలికపాటి నడకనే ఫార్ట్వాక్ అంటారు. అంటే ఇక్కడ రాత్రిభోజనం తర్వాత తప్పనిసరిగా వాక్ చేయడంగా భావించాలి. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలందిస్తుందని వైద్యనిపుణులు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధాప్యానికి సహాయపడుతుందట. ఈ ఫిట్నెస్ దినచర్య ప్రాథమిక లక్ష్యం జీర్ణక్రియకు సహాయపడటం, తీవ్రమైన వ్యాధులను నివారించడం అని రచయిత్రి స్మిత్ చెబుతున్నారు. View this post on Instagram A post shared by Dr. Tim Tiutan | Internal Medicine (@doctortim.md) మనం ఫైబర్‌తో కూడిన భోజనం తీసుకుంటాం కాబట్టి గ్యాస్ సమస్య ఉత్ఫన్నమవుతుందట. అలాంటప్పుడు గనుక ఇలా ఫార్ట్ వాక్ చేస్తే.. ఆపానవాయువు నోరు లేదా కింద నుంచి బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంటుందట. జస్ట్ రెండు నిమిషాలు ఆ విధంగా నడిస్తే..టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడ తగ్గుతాయని చెబుతున్నారు స్మిత్. కేన్సర్ వైద్యుడు డాక్టర్ టిమ్ టియుటన్ రచయిత్రి స్మిత్ సూచించిన ఫిట్నెస్ చిట్కాని సమర్థించారు. ఆమె చెప్పింది సరైనదేనని, నిజంగానే దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఇన్స్టాగ్రామ్ వేదికగా చెప్పారు. భోజనం తర్వాత నడవడం వల్ల పేగు చలనశీలత - లేదా మన ప్రేగుల కదలిక అనేది గ్యాస్‌ను వదిలించుకోవడమే గాక మలబద్ధకాన్ని కూడా నివారిస్తుందని చెప్పారు. అలాగే రక్తంలోని చక్కెర స్థాయిలను నివారించడం లేదా 24 గంటల వరకు ఇన్సులిన్ సమస్య ఏర్పడదని అన్నారు. అలాగే మరో వైద్యుడు అమెరికాకు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ క్రిస్టోఫర్ డామన్ కూడా ఈ ఫిట్‌నెస ట్రెండ్‌కి మద్దుతిచ్చారు. భోజనం తర్వాత నడక అనేది తిన్న గంటలోపు చేస్తేనే అత్యంత ప్రభావవంతంగా ఉంటుందని అన్నారు. ఆలస్యంగా నడక ప్రారంభిస్తే అప్పటికే పోషకాలు శోషించబడి రక్తంలో కలిసిపోతాయని, అలాగే గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయని చెబుతున్నారు డామన్. కలిగే లాభాలు..కేన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మంచి దీర్ఘాయువుని అందిస్తుందిఎలాంటి అనారోగ్యల బారినపడకుండా కాపాడుతుందివృద్దాప్యంలో ఎలాంటి సమస్యల బారిన పడకుండా రక్షిస్తుంది. కాబట్టి రాత్రి భోజనం చేసిన వెంటేనే కాసేపు ఓ రెండడుగులు అటు.. ఇటు..నడిచి ఆరోగ్యంగా ఉందామా మరీ..!. (చదవండి: Summer Tips: ఏసీతో పనిలేకుండానే సహజసిద్ధంగా ఇంటిని చల్లగా మార్చేద్దాం ఇలా..!) -
నా డ్రీమ్స్.. కరియర్ : ఇపుడు కొత్తగా, ప్రతీక్షణం ఆస్వాదిస్తున్నా
మాతృత్వం ఒక వరమే.కానీ అంతకుమించిన బాధ్యతల భారం కూడా. కుటుంబ సభ్యులు, భర్త సహకారం ఉన్నపుడు నిజంగా ఏ మహిళకైనా గర్భం దాల్చడం, బిడ్డకు జన్మనివ్వడం, పాలిచ్చి పోషించడం లాంటి వన్నీ జీవితాంతం పదిలపర్చుకునే మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఇంత ముఖ్యమైన విషయాన్ని అటు కుటుంబ సభ్యులు, ఇటు సమాజమూ గుర్తించాలన్న స్పృహ ఇటీవలి కాలంలో బాగా పెరుగుతోంది. దీనికి తోడు చాలా మంది సెలబ్రిటీలు కూడా ఈ అంశంపై బహిరంగంగా చర్చిస్తుండటం మంచి పరిణామం. ఈ కోవలోకి తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే చేరింది.హిందీ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో ఒకరు దీపికా పదుకొణే (Deepika Padukone). అందానికి తగ్గ అభినయం, అభిమానుల హృదయాలను దోచుకుంది. బాలీవుడ్లో అనేక బ్లాక్ బస్టర్ మూవీలను తన సొంతం చేసుకుంది. తనదైన నటనతో దర్శక నిర్మాతల ఫ్యావరేట్‌గా మారింది. హీరోయిన్గా కరియర్ కొనసాగిస్తూనే, బాలీవుడ్ హీరో,ప్రేమికుడు రణవీర్ సింగ్‌ను 2018లో వివాహం చేసుకుంది. 2024లో తొలి బిడ్డ దువాకు జన్మనిచ్చింది. వేవ్స్ సమ్మిట్ 2025లో దీపిక తన కూతురు దువాకుతో తనకున్న అనుబంధం, చిన్నారి వచ్చిన తరువాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడింది.ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో జరిగిన WAVES 2025 సమ్మిట్‌లో మాతృత్వం, బిడ్డ పెంపకం గురించి మాట్లాడినపుడు. దీపికా పదుకొనే మాతృత్వాన్ని స్వీకరించడం గురించి, దువా రాక తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది స్పష్టంగా,చాలా ఉత్సాహంగా చెప్పుకొచ్చింది. పాపాయి రక్షణ కోసం ఎలాంటి ఆయాను (నానీ)ని నియమించుకోలేదు దీపిక. స్వయంగా తానే ఆ బాధ్యతను తానే తీసుకుంది. తల్లినయ్యాక కొత్త జీవితాన్ని అనుభవిస్తున్నానని చెప్పింది. తల్లికాక ముందు, తన కలలు తన ఆశయాలు మాత్రమే ఉండేవి, కానీ ఇపుడంతా ఆమె గురించే. ఇదీ చదవండి: నిశ్చితార్థం రద్దు, ప్రేమ వివాహం, డైమండ్స్ షూస్ : ఎవరీ అందాల రాణి?"అమ్మ అయిన తర్వాత కొత్త జీవితాన్ని చూస్తున్నాను. బిడ్డను కన్న క్షణంనుంచి మరో ప్రాణిని పోషించే బాధ్యత వహించాలి. ముఖ్యంగా నాలాంటి జీవనశైలి ఉన్నవారికి, ముఖ్యంగా ఇల్లు వదిలి వెళ్ళడం, నా ఆశయం, నా కెరీర్ ఇలా ప్రతిదీ నా జీవితం, ఇలా ప్రతిదాని గురించి ఆలోచించాను. ఇప్పుడు, అకస్మాత్తుగా, పాపాయి మీద శ్రద్ద వహించాలి. తల్లి కావాలని కోరుకున్నాను కనుక, ప్రతి అంశాన్ని ఆస్వాదిస్తున్నాను, " అని దీపికా పేర్కొన్నారు.మరోవైపు షారుఖ్ ఖాన్ దీపికా పదుకొణేను ప్రశంసల్లో ముంచెత్తారు. దువాకు తల్లి అయినందుకు షారుఖ్ దీపికను అభినందించారు. నటి పోషించగల ఉత్తమ పాత్ర నిజ జీవితంలోనే అని, ఇప్పుడు ఆమె తన పాప దువాకు తల్లి అని అన్నారు.చదవండి: హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్! -
Eng Vs Zim Test: ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. అతడికి తొలిసారి పిలుపు
జింబాబ్వే (England Vs Zimbabwe)తో ఏకైక టెస్టు మ్యాచ్‌కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఇందుకు సంబంధించి పదమూడు మంది సభ్యులతో కూడిన వివరాలను శుక్రవారం వెల్లడించింది. కాగా.. 27 ఏళ్ల పేసర్ సామ్ కుక్ (Sam Cook)కు తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కడం విశేషం.ఇప్పటికే 318 వికెట్లుకుక్తో పాటు జోర్డాన్ కాక్స్‌ను కూడా ఈ మ్యాచ్‌కు ఎంపిక చేసిన ఇంగ్లిష్ జట్టు సెలక్టర్లు.. జోష్ టంగ్ (Josh Tongue)కు కూడా తిరిగి పిలుపునిచ్చారు. కాగా కౌంటీ క్రికెట్లో సామ్ కుక్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. నిలకడైన ఆటకు మారుపేరైన ఈ ఎస్సె.క్స్పేస్ బౌలర్ కౌంటీల్లో ఇప్పటికే 318 వికెట్లు తీశాడు.మరోసారి పిలుపుఅదే విధంగా ఇంగ్లండ్ లయన్స్ తరఫున ఆస్ట్రేలియా-ఎ జట్టుతో మూడు మ్యాచ్‌లలో కలిపి సామ్ కుక్ 13 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు.. జోర్డాన్ కాక్స్ 2024లోనే అరంగేట్రం చేయాల్సింది. న్యూజిలాండ్‌తో నవంబర్ నాటి మ్యాచ్‌లో అతడు ఆడాల్సి ఉండగా.. ప్రాక్టీస్ సెషన్లో కుడిచేతి బొటనవేలికి గాయమైంది. దీంతో అప్పుడు అవకాశం కోల్పోయిన అతడికి మళ్లీ సెలక్టర్లు పిలుపునిచ్చారు.ఇక జోష్ టంగ్ విషయానికొస్తే.. 2023లో ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ టెస్టు తర్వాత మళ్లీ జాతీయ జట్టుకు ఆడలేదు. కాగా స్వదేశంలో జింబాబ్వేతో టెస్టుతో కెప్టెన్ బెన్ స్టోక్స్ తిరిగి ఆటలో అడుగుపెట్టనున్నాడు.33 ఏళ్ల స్టోక్స్ గత కొంతకాలంగా పిక్కల్లో గాయంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. గతేడాది డిసెంబరులో న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడిన అతడు.. సర్జరీ తర్వాత కోలుకున్నాడు.కాగా మే 22-25 వరకు సొంతగడ్డపై ఇంగ్లండ్ జింబాబ్వేతో నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ ఆడనుంది. గాయాల కారణంగా మార్క్ వుడ్, బ్రైడన్ కార్స్,క్రిస్ వోక్స్, ఓలీ స్టోన్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. ఇక జోఫ్రా ఆర్చర్ ఇప్పట్లో టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చే పరిస్థితి కనబడటం లేదు.జింబాబ్వేతో టెస్టు మ్యాచ్‌కు ఇంగ్లండ్ జట్టు:జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), జోర్డాన్ కాక్స్ (వికెట్ కీపర్), సామ్ కుక్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, మాథ్యూ పాట్స్, జోష్ టంగ్.చదవండి: ఇంగ్లండ్‌తో టెస్టుల్లో అతడిని ఆడించండి.. అదరగొడతాడు: టీమిండియా మాజీ కోచ్ -
బలవంతంగానైనా సినిమాలకు గుడ్‌బై చెప్తా..: అజిత్
ముందుగా ప్లాన్ చేసుకోకుండా సినిమాల్లోకి వచ్చినవారిలో అజిత్ (Ajith Kumar) ఒకరు. అనుకోకుండా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తమిళంలో బిగ్గెస్ట్ స్టార్‌గా ఎదిగారు. ఈ మధ్యే పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చిన ఆయన హఠాత్తుగా సినిమాలను ఎప్పుడు వదిలేసేది కూడా తెలీదంటున్నారు.రిటైర్ అవొచ్చేమో..తాజాగా ఓ ఇంటర్వ్యూలో అజిత్ మాట్లాడుతూ.. 'ఎప్పుడేం జరుగుతుందో మనకు తెలీదు. రిటైర్మెంట్ నేను ప్లాన్ చేసుకోవాల్సిన పని లేదు. బలవంతంగా కూడా రిటైర్ అయిపోవచ్చేమో! చెప్పలేం.. ఈరోజుకు మనమింకా బతికున్నామన్నదే పెద్ద ఆశీర్వాదంలా భావించాలి. నేనేం ఫిలాసఫీలు చెప్పడం లేదు. ఈ ప్రయాణంలో ఎన్నో దెబ్బలు తగిలాయి, అవి సర్జరీల వరకు కూడా వెళ్లాయి. ఇకపోతే నా ఫ్రెండ్స్, చుట్టాల్లో క్యాన్సర్‌ను జయించినవాళ్లు కూడా ఉన్నారు. కాలాన్ని వృథాగా పోనివ్వనుజీవితం ఎంత విలువైనదో మాకు బాగా తెలుసు. అందుకే ఈ లైఫ్‌లో ప్రతి సెకనును వృథాగా పోనివ్వదల్చుకోలేదు. వీలైనంతవరకు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటాను. సినిమాల్లోకి రావాలని నేనెన్నడూ అనుకోలేదు. అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చాను. స్కూల్ అయిపోయాక ఆటోలు తయారుచేసే కంపెనీలో ఆరు నెలలు పని చేశాను. 18 ఏళ్ల వయసులో రేసింగ్ మొదలుపెట్టాను. ఆ తర్వాత వాణిజ్య ప్రకటనలు చేశాను. అలా సినిమాల్లోకి వచ్చాను' అని చెప్పుకొచ్చారు. అజిత్ చివరగా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాతో మెప్పించాడు. ఈ మూవీ కేవలం రెండు వారాల్లోనే రూ.200 కోట్లు రాబట్టింది.చదవండి: గలీజ్ మాటలు.. నా జీవితంతో ఆడుకుంటున్నారు.. బతకను: జానులిరి -
చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లి..
ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఆర్సీబీ శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్దానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని బెంగళూరు భావిస్తోంది.అయితే సీఎస్కేతో మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి(Virat Kohli)ని అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో కోహ్లి మరో 53 రన్స్ చేస్తే.. ఐపీఎల్ చరిత్రలో 8,500 పరుగుల మైలురాయిని తొలి ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. ఇప్పటివరకు విరాట్ . 262 మ్యాచ్‌ల్లో 8,447 పరుగులు చేశాడు. కోహ్లి తర్వాతి స్ధానంలో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ(6921) ఉన్నాడు. అయితే కోహ్లి కంటే రోహిత్ దాదాపు 2000 పరుగులు వెనకబడి ఉన్నాడు. ఇక 2008లో ఆర్సీబీ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన కింగ్ కోహ్లి.. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడి ఐపీఎల్ కెరీర్లో 8 సెంచరీలతో పాటు 61 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది సీజన్లో కూడా కింగ్ కోహ్లి దుమ్ములేపుతున్నాడు. వరుస హాఫ్ సెంచరీలతో ప్రత్యర్ధి జట్లపై విరుచుకుపడుతున్నాడు. కోహ్లి 10 మ్యాచ్‌ల్లో 138.87 స్ట్రైక్ రేట్‌తో 443 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆరెంజ్ క్యాప్ జాబితాలో మూడవ స్థానంలో ఈ ఆర్సీబీ మాజీ కెప్టెన్ కొనసాగుతున్నాడు.చదవండి: Shikhar Dhawan: అవును.. ప్రేమలో ఉన్నాం!.. ఇంతకీ ఎవరీమె? -
ఉత్తమ చిత్రంగా హనుమాన్ నటి మూవీ
హనుమాన్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన 'శబరి'. తాజాగా ఈ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. దాసరి ఫిలిం అవార్డ్స్- 2025లో ఉత్తమ కథా చిత్రంగా శబరి అవార్డును కైవసం చేసుకుంది. తెలుగు సినిమా పరిశ్రమలో మరోసారి ప్రయోగాత్మక చిత్రం ఈ ఘనతను సాధించింది. ఈ సినిమాను ప్రముఖ ఎన్నారై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించారు.తొలి సినిమాకే కథాబలం ఉన్న చిత్రాన్ని ఎన్నుకొని అనిల్ క్యాట్జ్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. అద్భుతమైన భావోద్వేగాలతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఒక తల్లి తన బిడ్డను రక్షించేందుకు చేసిన ఒంటరి పోరాటాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. కాగా.. గతేడాది మే నెలలో థియేటర్లలో విడుదలైన శబరి మూవీకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన దక్కించుకుంది. -
బిల్‌గేట్స్‌కు అరుదైన వ్యాధి.. పేరెంట్స్‌కు కూడా అర్థమయ్యేది కాదు!
ప్రపంచ కుబేరులలో ఒకరు.. మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ 'బిల్‌గేట్స్' గురించి దాదాపు అందరికీ తెలుసు. కానీ ఈయనకు 'ఆస్పెర్జర్ సిండ్రోమ్' ఉందని, ఇది ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ASD) కిందికి వస్తుందని ఆయన కుమార్తె ఫోబ్ గేట్స్ 'కాల్ హర్ డాడీ' పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు.'కాల్ హర్ డాడీ' పాడ్‌కాస్ట్ ఎపిసోడ్లో.. కనిపించిన ఫోబ్ గేట్స్, తన తండ్రిని కలవడానికి తన బాయ్ఫ్రెండ్లను ఇంటికి తీసుకువెళ్లిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. అయితే నాన్న వారిని కలవడానికి ఇబ్బందిపడేవారని, అది నాకు చాలా ఫన్నీగా అనిపించేది ఫోబ్ పేర్కొన్నారు.నిజానికి బిల్‌గేట్స్.. గతంలో ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఇప్పటి పరిస్థితుల్లో నేను పెరిగి ఉంటే నాకు ఖచ్చితంగా ఆస్టిజం ఉందని తేలేది. నాకు ఆస్టిజం ఉందా?.. లేదా? అని టెస్టులు చేయించుకోలేదు, డాక్టర్లు కూడా నాకు ఎప్పుడూ దీని గురించి చెప్పలేదు. అయితే నా ప్రవర్తన చిన్నప్పటి నుంచి అలా ఎందుకు ఉందో.. అమ్మానాన్నలకు అర్థమయ్యేది కాదు. అప్పట్లో ఇది ఒక వ్యాధి అని తెలుసుకోవడానికి టెక్నాలజీ కూడా అంత అభివృద్ధి చెందలేదు.ఇదీ చదవండి: సొంతంగా స్టార్టప్.. కుమార్తెపై బిల్‌గేట్స్ ప్రశంసల వర్షంఒకసారి అమ్మానాన్నలు నన్ను (బిల్‌గేట్స్) ఓ థెరపిస్ట్ దగ్గరకు తీసుకెళ్లారు. ఆయన నా ప్రవర్తనను మార్చడానికి చాలా ప్రయత్నించారు. నా లోపాన్ని పాజిటివ్‌గా చూపించడంలో విజయం సాధించాడని పేర్కొన్నారు.ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్: ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉన్నవారు ఇతరులతో మాట్లాడాలన్నా.. కలవాలన్నా ఇబ్బంది పడుతుంటారు. అంతే కాకుండా వీరికి కొన్ని విషయాలపై అమితాసక్తి ఉంటుంది. ఈ డిజార్డర్ ఉన్నవారికి ఇతరులతో ఎలా ఉండాలో తెలియదు. చేసిన పనిని మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు. -
అటు రొమాన్స్.. ఇటు యాక్షన్.. 'కింగ్డమ్' తొలి పాట చూశారా?
విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ 'కింగ్డమ్'. మే 30న థియేటర్లలోకి రానుంది. కొన్నిరోజుల ముందు వరకు సినిమా వాయిదా పడుతుందని రూమర్స్ వినిపించాయి. కానీ తాజాగా పాటతో ప్రమోషన్స్ తో మొదలుపెట్టడంతో పుకార్లకు చెక్ పడింది. ఇప్పుడు ఆ పాటని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: అనిరుధ్ కి విజయ్ దేవరకొండ 'ప్రేమలేఖ') 'హృదయం లోపల..' అంటూ సాగే ఈ గీతంలో కింగ్డమ్ సినిమా కథేంటి అనేది కొంతలో కొంత రివీల్ చేశారని చెప్పొచ్చు. సూరి అనే రౌడీ, అతడితో ప్రేమలో ఉన్న ఓ డాక్టర్.. వీళ్లిద్దరూ కలిసి శ్రీలంక ఆర్మీపై ఏదో ప్లాన్ చేస్తున్నట్లు కనిపించారు. అదేంటి అనేది మాత్రం సినిమా చూసి తెలుసుకోవాలి.కింగ్డమ్ సినిమాలో సూరి అనే పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించాడు. అతడి ప్రేయసిగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. ఈ పాటలో ఓవైపు చంపడం చూపిస్తూనే, చివర్లో రొమాన్స్ కూడా చూపించారు. సినిమా కూడా అటు యాక్షన్, ఇటు రొమాన్స్ అనేలా ఉంటుందని హింట్ ఇచ్చారేమో?(ఇదీ చదవండి: అల్లు అర్జున్.. నెల్లూరు పెద్దారెడ్డి తాలుకా!) -
జాక్‌పాట్ కొట్టేసిన ప్రముఖ సింగర్.. ఏకంగా మూడున్నర్ర కోట్ల లాభం!
ప్రముఖ సింగర్, బిగ్ బాస్ రన్నరప్ రాహుల్ వైద్య తన ఖరీదైన అపార్ట్మెంట్లను విక్రయించారు. ముంబయిలోని ఓషివారాలో ఉన్న తన రెండు విల్లాలను దాదాపు రూ.5 కోట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. గతంలో అంటే 2008లో రాహుల్ వైద్య ఈ అపార్ట్మెంట్లను రూ.1.70 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. తాజాగా వీటిని విక్రయించడంతో దాదాపు రూ.3.50 కోట్ల మేర ఆదాయం వచ్చింది. కాగా.. ఈ ప్రాంతంలో పలువురు సినీతారలు నివాసం ఉండడంతో ధరలు కూడా అంతేస్థాయిలో ఉన్నాయి. ఇక్కడ అమితాబ్ బచ్చన్, అజయ్ దేవ్గన్, సన్నీ లియోన్, సారా అలీ ఖాన్ వంటి అనేక మంది బాలీవుడ్ ప్రముఖులు కూడా ఆస్తులు కలిగి ఉన్నారు.కాగా.. సింగర్ రాహుల్ వైద్య ఇండియన్ ఐడల్ సీజన్ 1లో రెండో రన్నరప్‌గా నిలిచారు. అప్పటి నుంచి బాలీవుడ్లో రాణిస్తున్నారు. అతని కెరీర్లో తొలి మ్యూజిక్ ఆల్బమ్ తేరా ఇంతేజార్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత అనేక బాలీవుడ్ పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా జో జీతా వోహి సూపర్ స్టార్,మ్యూజిక్ కా మహా ముఖాబ్లా వంటి రియాలిటీ షోలలో విజేతగా నిలిచారు. హిందీ బిగ్‌బాస్ సీజన్ -14 రన్నరప్‌గా నిలిచి మరింత ఫేమస్ అయ్యారు. అతను ప్రస్తుతం సెలబ్రిటీ కుకింగ్ రియాలిటీ షో లాఫ్టర్ చెఫ్స్‌లో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by RAHUL VAIDYA (@rahulvaidyarkv) -
ఏసీతో పనిలేకుండానే హీట్‌ని బీట్ చేద్దాం ఇలా..!
సూర్యుడి ప్రతాపం రోజు రోజుకి ఎక్కువవుతోంది. పది దాటితో బయటికి రావడమే కష్టంగా ఉంది ఈ సమ్మర్లో. ఇక రాత్రిళ్లు ఉక్కపోతలు, తట్టుకోలేని ఉడుకుతో కంటిమీద కునుకు పడితే ఒట్టు అంటూ వాపోతుంటారు ప్రజలు. ఆరుబయట సేద తీరదామన్న..పక్కపక్కనే బిల్డింగ్లు ఉండటంతో గాల్పు కొడుతూ వేడిగా ఉంటుంది. రవ్వంత గాలి కూడా రాదు. ఏసీ లేనిదే పనికాదేమో అన్నంతగా సమ్మర్ తారెత్తిస్తుంటుంది. అలాంటప్పడు ఏసితో పనిలేకుండా తక్కువ ఖర్చుతోనే ఇంటిని చల్లగా మార్చుకుని హాయిగా నిద్రపోవచ్చు. అదెలాగా చూద్దామా..!.ఇంట్లోనే ఫ్యాన్‌తో..బయటి చల్లగాలి లోపలికి వచ్చేలా కిటికీ దగ్గర ఉండే ఫ్యాన్‌ను ఉంచండి లేదా గదిలోపల గాలిప్రసరణ మెరుగుపరుచుకునేలా సీలింగ్ లేదా స్టాండింగ్ ఫ్యాన్‌ను ఉపయోగించండి. రాత్రి సమయంలో వేడి గాలిని బయటకు నెట్టేలా కిటికీలో బయటకి ఎదురుగా ఫ్యాన్‌ను ఉంచండి. అలాగే ఇత ఓపెనింగ్‌ల నుంచి చల్లని గాలి లోపలకు వచ్చేలా చూసుకోండికర్టెన్లు లేదా బ్లైండ్‌లతో మూసి ఉంచడంనేరుగా సూర్యకాంతి గదిలో పడకుండా నిరోధించాలి. అంటే కిటికీలు మూసేయడం. కర్టెన్లు, బ్లైండ్‌లతో కవర్ చేయడం లేదా తడికల్లాంటివి ఏర్పాటు చేసుకోవడం. లేతరంగు లేదా ఇన్సులేటెడ్ కర్టెన్లు ఉపయోగించడం మంచిది.ఇవి 40% వరకు వేడిని తగ్గిస్తాయి.రాత్రిపూట గాలి ప్రసరణ కోసం కిటికీలు తెరవడంఫ్యాన్ ముందు మంచు నీరు లేదా మాములు నీళ్లు బకెట్ ఉంచడం..బాష్పీభవన శీతలీకరణను సృష్టించడానికి ఫ్యాన్ ముందు ఒక బకెట్ మంచుగడ్డ లేదా చల్లని నీటిని ఉంచండి. ఈ పద్ధతిఫ్యాన్ద్వారా వచ్చే గాలిని చల్లబరుస్తుంది. ఇది పొడి వాతావరణంలో మరింత ప్రభావవంతంగా ఉంటుంది.నేలపై పడుకోవడం..వేడిగాలి పెరుగుతుంది కాబట్టి నేలపే కూర్చోవడం లేదా పడుకోవడం వల్ల చల్లదనంగా అనిపిస్తుంది.తేలికైనా.. గాలి ఆడే దుస్తులు ధరించడంతేమను దూరం చేసి.. చర్మం శ్వాస తీసుకోవడానికి వీలు కల్పించే కాటన్ లాటి తేలికైన వదులు దుస్తులను ధరించాలి. ఇవి తేమను దూరం చేస్తాయి. చర్మం శ్వాస తీసుకోవడానికి అనుమతించడమే గాక శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడతాయిపరుపు, దిండ్లు చల్లగా ఉండేలా చేయడం..పడుకునే ముందే..బెడ్షీట్లు, దిండ్లు, పరుపు చల్లగా ఉండేలా కేర్ తీసుకుంటే హాయిగా నిద్రపట్టేస్తుంది.తడి తువ్వాళ్లు లేదా స్ప్రే బాటిళ్లు..తడి తువ్వాళ్లు వేయడం లేదా చల్లటి నీటితో నిండిన స్ప్రే బాటిల్ రిఫ్రెషింగ్ చల్లదనాన్ని అందిస్తుంది. నిద్రించడానికి ముందు మంచం మీద తడిగా ఉన్న టవల్‌ను ఉంచండి తద్వారా పరుపు చల్లగా ఉంటుంది. వేడిని ఉత్పత్తి చేసే వాటిని నివారించడంఉపయోగంలో లేనప్పుడు ఇన్కాండిసెంట్ బల్బులు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌లను ఆపివేయండి. తక్కువ వేడిని విడుదల చేసి, శక్తిని ఆదా చేసే LED బల్బులను ఎంచుకోండి.తేలికగా తినండి, హైడ్రేటెడ్‌గా ఉండండిహైడ్రేటెడ్గా ఉండటానికి తగినంత నీరు తాగండి. ప్రోటీన్ అధికంగా ఉండే భోజనాలను నివారించి.. పండ్లు, స్మూతీస్ వంటి తాజా చల్లని ఆహారాలు తీసుకోవడం మంచిది.ఈ పద్ధతులన్ని ఎయిర్ కండిషనింగ్ ఖర్చు లేకుండా వేడి వాతావరణంలో సౌకర్యవంతంగా ఉండటానికి సహాయపడతాయి.(చదవండి: స్లిమ్‌గా బాలీవుడ్ చిత్ర నిర్మాత హన్సల్ మెహతా.. మౌంజారోతో పది కిలోలు..!) -
RCB: నాపై ఆ సౌతాఫ్రికా ఆటగాడి ప్రభావం ఎక్కువ: కోహ్లి
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీతో పనిచేసిన తొలి రోజుల్లో తనపై ఓ వ్యక్తి ప్రభావం చూపాడంటూ సౌతాఫ్రికా ఆటగాడి పేరు చెప్పాడు. అయితే, ఆ వ్యక్తి ఏబీ డివిలియర్స్ మాత్రం కాదు!.. ఇంతకీ విషయం ఏమిటంటారా?!కాగా 2008లో ఐపీఎల్ మొదలుకాగా.. ఆరంభ సీజన్ నుంచి కోహ్లి ఆర్సీబీతోనే కొనసాగుతున్నాడు. బెంగళూరు జట్టుకు కెప్టెన్‌గానూ పనిచేసిన కింగ్.. టైటిల్ మాత్రం అందించలేకపోయాడు. ప్రస్తుతం కేవలం ఆటగాడిగా కొనసాగుతున్న కోహ్లి.. ఈసారీ ఆరెంజ్ క్యాప్ రేసులో ముందుకు దూసుకుపోతున్నాడు.ఇదిలా ఉంటే.. ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో తాజాగా కోహ్లి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. జట్టుతో చేరిన తొలినాళ్లలో సౌతాఫ్రికా స్టార్ మార్క్ బౌచర్ (Mark Boucher) తననెంతో ప్రభావితం చేశాడని కింగ్ చెప్పుకొచ్చాడు.అడగకముందే ఎన్నో విలువైన సలహాలు‘‘ఆరంభ రోజుల్లో నాతో పాటు ఆడిన ఆటగాళ్లలో బౌచర్ అప్పట్లో నన్ను బాగా ప్రభావితం చేశాడు. నేను అడగకముందే ఎన్నో విలువైన సలహాలు ఇచ్చాడు. నేను అనుకున్న స్థాయికి చేరాలంటే.. బలహీనతలు ఎలా అధిగమించాలో వివరించాడు.ఇండియా మ్యాచ్‌లకు కామెంటేటర్‌గా వచ్చే తదుపరి మూడు- నాలుగేళ్లలో టీమిండియాకు కీలక ప్లేయర్‌గా మారాలని.. లేదంటే.. నీకు నువ్వు ద్రోహం చేసుకున్న వాడివి అవుతావని చెప్పాడు. ఆయనతో జరిగిన సంభాషణ నన్ను ఎంతో ప్రభావితం చేసింది’’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా మార్క్ బౌచర్ 2008 నుంచి 2010 వరకు ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాడు.ప్లే ఆఫ్స్ చేరాలని కాగా ఐపీఎల్-2025లో ఆర్సీబీ ఇప్పటికి పది మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఏడు గెలిచింది. తద్వారా పద్నాలుగు పాయింట్లు సాధించి పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈసారీ ప్లే ఆఫ్స్ చేరాలని పట్టుదలగా ఉంది.ఇక ఆర్సీబీ ఓపెనర్ కోహ్లి ఇప్పటికి పది మ్యాచ్‌లలో కలిపి 443 పరుగులు సాధించాడు. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతూ ఆరెంజ్ క్యాప్ కోసం పోటీపడుతున్నాడు. కాగా ఆర్సీబీ తదుపరి శనివారం నాటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: పిల్లలంతా హ్యాపీ అంటూ ట్రోలింగ్!.. వైభవ్‌ను ఓదార్చిన రోహిత్.. ఆటలో ఇవి మూమూలే -
కేజే పురం జంక్షన్లో ఉద్రిక్తత.. అన్నదాన భవనాన్ని కూల్చేందుకు యత్నం
సాక్షి, అనకాపల్లి జిల్లా: మాడుగుల మండలం కేజే పురం జంక్షన్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సంతోషి మాత ఆలయం అన్నదాన భవనాన్ని కూల్చేందుకు అధికారులు ప్రయత్నించారు. జేసీబీ మిషన్‌తో సహా వచ్చిన ఆర్అండ్బీ అధికారులను అన్నదాన భవనాన్ని కూల్చవద్దంటూ భక్తులు, గ్రామస్తులు అడ్డుకున్నారు.అధికారులతో వాగ్విదానికి దిగారు. అన్నదాన భవనాన్ని కూల్చితే సహించేది లేదని గ్రామస్తులు తేల్చి చెప్పారు. భక్తులు, గ్రామస్తులు ఎదురు తిరగటంతో అధికారులు వెనుదిరిగారు. -
నిశ్చితార్థం రద్దు, ప్రేమ వివాహం, డైమండ్స్ షూస్ : ఎవరీ అందాల రాణి?
ఫ్యాషన్ ఐకాన్, అందమైన రాణి. సాటిలేని అందగత్తె మాత్రమే కాదు అపర మేధావి కూడా. ఆమె పేరే కూచ్ బెహార్ మహారాణి ఇందిరా దేవి. అందానికి మించిన తెలివితేటలు, అంతకుమించిన ఐశ్వర్యంతో తులతూగిన మహిళ. బరోడాలోని విలాసవంతమైన లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌లో యువరాణిగా పెరిగింది. పాఠశాల, కళాశాలకు వెళ్ళిన తొలి యువరాణి కూడా ఇందిర కావడం విశేషం. పదండి ఇందిరా దేవి జీవిత విశేషాలు, విలాసవంతమైన జీవన శైలి గురించి తెలుసుకుందాం.బరోడా మహారాజు సాయాజిరావు గైక్వాడ్ III , అతని రెండవ భార్య చిమ్నాబాయి II ల కుమార్తె ఇందిర. చాలా చిన్న వయస్సు నుండే చాలా తెలివిగా, సామాజిక స్పృహతో ఉంటూ, అనేక సామాజిక సమస్యలపై గొంతెత్తిన మహిళ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రముఖులకు విలాసవంతమైన పార్టీలను ఇచ్చేదట. ఫ్యాషన్‌కు పెట్టింది పేరైన ఇందిర ఖరీదైన దుస్తులను ధరించేదట. అంతేకాదు ఒకసారి ఆమె వజ్రాలు, ఇతర విలువైన రాళ్లు పొదిగిన 100 జతల ఫెర్రాగామో బూట్లు ఆర్డర్ చేసిందట. ఆమె ధరించే సాండిల్స్ కూడా చాలా ఖరీదైనవే.మహారాణి ఇందిరాదేవి విలాసవంతమైన ప్రతిదాన్ని ఇష్టపడేవారట. చరిత్రకారుడు అంగ్మా డే ఝాలా రాసిన ఒక పుస్తకం, రాయల్ ప్యాట్రనేజ్, పవర్, అండ్ ఈస్తటిక్స్ ఇన్ ప్రిన్స్లీ ఇండియా అనే పుస్తకంలో ఇందిరా దేవికి సంబంధించిన అనేక విశేషాలను పొందుపర్చారు. మహారాణి ఇందిరా దేవికి పాదరక్షలంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు. ఆమె ధరించే బూట్ల బ్రాండ్ చాలా స్పెషల్ అనీ, నాణ్యమైన బూట్లకు ప్రసిద్ధి చెందిన ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ సాల్వటోర్ ఫెర్రాగామోను చాలా ఇష్టపడేదని రాసుకొచ్చారు.1938లో మహారాణి కెంపులు, వజ్రాలు, పచ్చలతో పొదిగిన కస్టమ్-మేడ్ సాల్వటోర్ ఫెర్రాగామో 100 జతల ఫెర్రాగామో బూట్లను ఆర్డర్ చేసింది. కప్పబడి ఉంది. ఇవి 20వ శతాబ్దపు ఇటలీలోని ఫ్లోరెన్స్‌లోని మ్యూజియో సాల్వటోర్ ఫెర్రాగామోలో ప్రదర్శించారని కూడా తెలిపారు.చదవండి: Good Health: వెజ్ తినాలా? నాన్ వెజ్ తినాలా?అందమైన , షిపాన్ చీరలు షిఫాన్ చీరను ప్రాచుర్యంలోకి తెచ్చిన ఘనత ఆమెకు దక్కింది. పారిస్ నుండి 45-అంగుళాల వెడల్పులో నేసిన షిఫాన్ చీరలను ఆర్డర్ చేసేది. ఢిల్లీ , కలకత్తాలో ఆమె కొనుగోలు చీరలను కొనుగోలు చేసిన ఒక ఏడాది తరవాత మాత్రమే ఇతర కస్టమర్లకు అదే నమూనాను తయారు చేయడానికి అనుమతి ఉండేది అంటే ఆమె స్టేటస్‌ను అర్థం చేసుకోవచ్చు.ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ ప్రేమ వివాహం18 ఏళ్ళ వయసులో మహారాణి ఇందిరా దేవి గ్వాలియర్ మహారాజు మాధో రావు సింధియాతో నిశ్చితార్థం అయింది. 1911లో ఢిల్లీ పర్యటన సందర్భంగా మహారాజు తీరు, ముఖ్యంగా గ్వాలియర్ , బరోడా రాజ కుటుంబాల మధ్య సంబంధాలపై రాజకీయ పరిణామాలు కారణంగా ఆమె నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది. దీని వల్ల తీవ్ర వ్యతిరేకత వస్తుందని తెలిసినా సాహసమైన నిర్ణయం తీసుకుంది. తరువాత ఆమె అప్పటి కూచ్ బెహార్ మహారాజు తమ్ముడు యువరాజు జితేంద్ర నారాయణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఊహించినట్టుగానే ప్లేబాయ్‌గా పేరు తెచ్చుకున్న జితేంద్రతో వివాహాన్ని దీన్ని తల్లిదండ్రులు వ్యతిరేకించారు. కానీ లండన్‌లోని రిజిస్ట్రార్ కార్యాలయంలో అతడిని పెళ్లాడింది.ఇదీ చదవండి: హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్!సోదరుడు మహారాజా రాజేంద్ర నారాయణ్ మరణించిన తర్వాత, జితేంద్ర కూచ్ బెహార్ మహారాజు అయ్యాడు. ఈ జంట జీవితం సంతోషంగాగడిచింది.కానీ జితేంద్ర మితిమీరిన మద్యపానం అతని అకాల మరణానికి దారితీసింది.వివాహమైన పదేళ్లకు జితేంద్ర మరణించడంతో ఐదుగురు పిల్లలతో ఇందిర ఒంటరిదై పోయింది. రాణి ఇందిరా దేవి తన ఐదుగురు పిల్లలతో కూచ్ బెహార్ వ్యవహారాలను నిర్వహించింది. ఆ కాలంలోనే అన్ని ఆంక్షలను తోసిపుచ్చి ఇందిర స్వతంత్ర జీవితాన్ని గడిపింది. ఇంగ్లాండ్ , ఫ్రాన్స్‌లలో ఉంటూ హాలీవుడ్ తారలు, సన్నిహితులతో లగ్జరీ పార్టీలతో ఉత్సాహవంతమైన జీవితాన్ని గడిపింది. ఆమె స్వేచ్ఛా జీవితం, తెలివితేటలు, ఆమెకు బలమైన మహిళగా ఖ్యాతిని తెచ్చిపెట్టాయి."అత్యంత అందమైన , ఉత్తేజకరమైన మహిళ అమ్మ. ఆమె తెలివితేటలు ఆమె ప్రేమ, వెచ్చదనం , సున్నితమైన చూపుల అసమానమైన కలయికగా నా జ్ఞాపకంలో ఉంది." తన తల్లి గురించి ఇందిరా దేవి కుమార్తె మహారాణి గాయత్రీ దేవి మాటలివి. 1892లో జన్మించిన రాణి ఇందిరా దేవి 1968లో 76 సంవత్సరాల వయసులో మరణించారు. -
TG: వడదెబ్బ మరణాల ఎక్స్ గ్రేషియా రూ. 4లక్షలకు పెంపు
హైదరాబాద్: వడదెబ్బ మరణాల ఎక్స్ గ్రేషియాను రూ. 4 లక్షలకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో వడదెబ్బ మరణాల ఎక్స్ గ్రేషియా రూ. 50 వేలు ఉంటే దాన్ని రూ. 4 లక్షలకు పెంచింది ప్రభుత్వం. ఈ మేరకు హీట్ వేవ్ పై 12 విభాగాలతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్షించారు. వడగాల్పులపై హీట్ వేవ్ యాక్షన ప్లాన్ ను రూపొందించారు. దీనిలో భాగంగా వడదెబ్బ మరణాల ఎక్స్ గ్రేషియాను రూ. 4 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు. ఓఆర్ఎస్ ప్యాకెట్ల సరఫరా అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు మంత్రి పొంగులేటి. -
గలీజ్ మాటలు.. నా జీవితంతో ఆడుకుంటున్నారు.. బతకను: జానులిరి
జాను లిరి (Janu Lyri).. జానపద పాటలతో చాలా ఫేమస్ అయింది. యూట్యూబ్‌లో ఫోక్ సాంగ్స్‌కు హుషారుగా స్టెప్పులేసే జాను.. తర్వాత ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 షో విన్నర్‌గానూ నిలిచింది. పదో తరగతిలోనే పెళ్లి చేసుకున్న ఈ డ్యాన్సర్‌కు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. భర్తతో విభేదాల కారణంగా వీరు విడిపోయారు. అయితే జాను ఏం చేసినా సరే కొందరు తనను విమర్శిస్తూనే ఉన్నారు. ఈ మధ్య ఓసారి మంచి వ్యక్తి దొరికితే రెండో పెళ్లికి కూడా సిద్ధమే అంది. దాన్ని కూడా తప్పుపడుతూ తనను ట్రోల్ చేస్తున్నారు.గుక్కపెట్టి ఏడ్చిన జానుఈ విమర్శలను జాను లిరి భరించలేకపోయింది. నన్ను టార్గెట్ చేయడం ఆపండి అంటూ బోరుమని ఏడుస్తోంది. ఈ మేరకు పలు వీడియోలు షేర్ చేసింది. నా జీవితంతో ఆడుకుంటున్నారు. నేను నవ్వితే ఓవరాక్షన్.. నాకు పద్ధతి తెలీదు..కదా? ఫోక్ ఇండస్ట్రీలో పద్ధతిగా చీర కట్టుకుని డ్యాన్స్ చేస్తుంది నేనే. కెమెరా ముందు ఒకలా, వెనక ఒకలా ఉండను. అందరితో నవ్వుతూ ఉంటాను. నేనేం చేసినా తప్పే అంటున్నారు.బతకాలని లేదుఇన్‌స్టాగ్రామ్‌లో నా వాయిస్‌కు గలీజ్ మాటలు యాడ్ చేస్తున్నారు. అవి నా కొడుకు చూడడా? ఎక్కడికైనా వెళ్లి చచ్చిపోవాలనిపిస్తోంది. ఒకవేళ నేను నిజంగా చచ్చిపోతే మాత్రం మీరే కారణం. ఇంత నరకమా? మీ వ్యూస్ కోసం ఒకమ్మాయి జీవితాన్ని రోడ్డుమీద పడేస్తున్నారు. మా అమ్మానాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఒక్క మాట అనకుండా పెంచారు. కానీ ఈరోజు అడ్డమైన వెధవలతో మాటలు పడుతున్నాను. సూసైడ్ తప్పు అని నలుగురికీ చెప్పేదాన్ని.. కానీ ఇప్పుడర్థమవుతోంది.నా వల్ల కావట్లేదువాళ్లు పడే బాధల వల్ల చనిపోవట్లేదు. మీరు చేసే రచ్చ తట్టుకోలేక చనిపోతున్నారని! నా వల్ల కావట్లేదు. నా ఓపిక నశించింది. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అన్నయ్యతో మాట్లాడినా, అక్కతో మాట్లాడినా, నవ్వినా, కూర్చున్నా.. ఎందుకు నిందలేస్తున్నారు? నా గురించి మంచి పెట్టొచ్చు కదా.. బాధ తట్టుకోలేకపోతున్నా.. నా జీవితంతో ఆడుకోవడం ఎందుకు? నా వల్ల మీకేమైనా హాని జరిగిందా? నా కొడుకును బాగా చదివించి మంచి స్థాయిలో చూడాలనుకున్నాను. అప్పటివరకు నేను బతకనని నాకర్థమవుతోంది. నేను మధ్యలోనే పోతాను అంటూ జాను వెక్కి వెక్కి ఏడ్చేసింది. View this post on Instagram A post shared by Jimmidi Jhansi - Janulyri (@janulyri_official) ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: హీరోయిన్ రెచ్చగొట్టింది.. అందుకే సిక్స్ ప్యాక్ చేశా: అల్లు అర్జున్ -
అల్లు అర్జున్.. నెల్లూరు పెద్దారెడ్డి తాలుకా!
మీకు మీమ్ లాంగ్వేజ్ తెలుసా? అవును మీరు సరిగానే విన్నారు. అందరూ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ వచ్చా అని అంటారు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా ఉపయోగించేవాళ్లకు మీమ్ లాంగ్వేజ్ అని ఒకటుంది. బయటవాళ్లకు అది అర్థం కాదు కానీ ఇన్ స్టా వాడేవాళ్లకు బాగా తెలుసు.ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే అల్లు అర్జున్(Allu Arjun).. మీమ్ లాంగ్వేజ్ ఉన్న ఓ టీ షర్ట్ ధరించాడు. ముంబై ఎయిర్ పోర్ట్ లో 'నెల్లూరు పెద్దారెడ్డి తాలుకా' అని ఫేమస్ బ్రహ్మానందం డైలాగ్, ఆయన ఫొటోలతో ఉన్న టీ షర్ట్ తో కనిపించాడు. ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బన్నీ కూడా ట్రెండ్ ఫాలో అయిపోతున్నాడే అని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: అనిరుధ్ కి విజయ్ దేవరకొండ 'ప్రేమలేఖ') సినిమాల విషయానికొస్తే.. 'పుష్ప 2'(Pushpa 2 Movie) బ్లాక్ బస్టర్ తర్వాత మూడు నెలలు గ్యాప్ తీసుకున్న బన్నీ.. తమిళ దర్శకుడు అట్లీతో(Director Atlee) సినిమాను ప్రకటించాడు. మూవీ ఎలా ఉండబోతుందనే వీడియో కూడా రిలీజ్ చేశారు. దీంతో ప్రాజెక్ట్ మొదలవకుండానే హైప్ పెరిగిపోయింది. ప్రస్తుతం హీరోయిన్లు, ఇతర క్యాస్టింగ్ ఎంపిక చేసే పనిలో టీమ్ ఉంది. మరికొన్ని నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది.మరోవైపు త్రివిక్రమ్ కూడా బన్నీ కోసం మైథలాజికల్ స్టోరీ ఒకటి రెడీ చేశారు. లెక్క ప్రకారం పుష్ప 2 తర్వాత ఇదే మొదలవుతుందని అందరూ అనుకున్నారు. కానీ గురూజీ స్క్రిప్ట్ ని బన్నీ కాస్త పక్కనబెట్టాడు. అట్లీ ప్రాజెక్ట్ తర్వాత త్రివిక్రమ్ తో బన్నీ సినిమా ఉంటుంది. కానీ దీనికి మరో ఏడాది సమయం పట్టొచ్చు.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే) Look At The Tshirt 😂🤍@AlluArjun #AlluArjun pic.twitter.com/8QyTrPX9OT— C/o.AlluArjun (@CareOfAlluArjun) May 2, 2025 -
‘ఆ దుర్ఘటనకు మంత్రుల కమిటీ బాధ్యత వహించాలి’
విశాఖ : సింహాచలం దుర్ఘటనపై ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ విచారణ కొనసాగుతున్న సందర్భంలో వారిని సీపీఎం నేతలు కలిశారు. సింహాచలం గోడ కూలిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం నేతలు కోరారు. ఈ దర్యాప్తు అనేది ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా జరగాలన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ‘అ‘ సింహాచలం గోడ కూలిన దుర్ఘటనలో మరణనించిన వారికి రూ. కోటి పరిహారం ఇవ్వాలి. బాధిత కుటుంబ సభ్యులకు పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. క్షతగాత్రులకు రూ. 10 లక్షలు నష్ట పరిహారం ఇవ్వాలి. రక్షణగా ఉండాల్సిన గోడే భక్తులను భక్షించింది. ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ కూడా బాధ్యత వహించాలి. మంత్రుల కమిటీ పనుల తనికీల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించింది. అధికారులు, కాంట్రాక్టర్‌ను ఒక్కరినే బలి చేయడం కాదు అసలైన బాధ్యులైన గుర్తించాలి. గోడ నాశిరకంగా కట్టారు.. ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది.’ అని వారు విమర్శించారు.కాగా, సింహాచలం చందనోత్సవంలో గోడ కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. రూ.300 టికెట్ కౌంటర్ వద్ధ ఈ ప్రమాదం జరిగింది. ఇటీవలే అక్కడ గోడ నిర్మించారు. గోడ నాసిరకంగా నిర్మించడం వలనే కూలిపోయిందని అధికారులు భావిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున 2-3 గంటల మధ్య రూ.300 క్యూ లైన్లో ప్రమాదం జరిగింది. మృతులను యడ్ల వెంకటరావు(48),దుర్గా స్వామినాయుడు(32), మణికంఠ(28)గా గుర్తించారు.ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతులను విశాఖపట్నం మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం గ్రామానికి చెందిన పిళ్లా ఉమామహేశ్వరరావు (30), ఆయన భార్య శైలజ (26)గా అధికారులు గుర్తించారు. వీరితో పాటు పిల్లా శైలజ తల్లి వెంకటరత్నం, మేనత్త గుజ్జురి మహాలక్ష్మి కూడా ఈ ఘటనలో మృతిచెందారు. -
పాక్ వెళ్లిపోవాలన్న కేంద్రం ఆదేశాలపై ఓ కుటుంబానికి సుప్రీంలో ఊరట
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ జాతీయుల వీసాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే.. ఇలాంటి పరిస్థితుల్లో కశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చెందిన ఆరుగురు సభ్యులున్న అహ్మద్ తారిక్ బట్ కుటుంబం కూడా తిరిగి వెళ్లిపోవాల్సి ఉంది. అయితే, వారు వేసిన పిటిషన్‌పై శుక్రవారం.. వాదనలు విన్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్కే సింగ్ ధర్మాసనం.. ఆ కుటుంబానికి తాత్కాలిక ఊరటనిచ్చింది. వీసా గడువు ముగిసినా వీరు ఇంకా భారత్‌లోనే ఉన్నట్లు తేలింది. ఆ కుటుంబం కశ్మీర్లో ఉండగా.. కుమారుడు బెంగళూరు యాక్సెంచర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆ కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.తాము భారత జాతీయులమేనని అయినా మమ్మల్ని అరెస్టు చేశారంటూ వాదనలు వినిపించారు. తమ వద్ద అన్ని ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఉన్నాయని పేర్కొన్నారు. ఆధార్, పాన్, ఓటర్ ఐడీ ఉన్నాయని కోర్టుకు ఆధారాలు సమర్పించారు. ఈ కుటుంబంలో ఒకరు పాకిస్థాన్‌లో జన్మించినా.. ఆ తర్వాత భారత్‌కు వలసవచ్చి ఆ దేశ పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. ఈ అంశంలో ధ్రువీకరించాల్సిన అంశాలున్నాయని.. ఈ పిటిషన్ దాఖలు చేయడంలోనే లోపాలున్నాయని పేర్కొంది. దీని మెరిట్‌పై ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేయకుండా పిటిషన్‌ను కొట్టేస్తున్నామన్న ధర్మాసనం.. అధికారులకు ఓ సూచన చేసింది. ఏ నిర్ణయం తీసుకోబోయే ముందైనా.. వారు చూపుతున్న పత్రాలను ధ్రువీకరించాలని.. ఈ కేసులో ఉన్న కొన్ని విచిత్ర పరిస్థితుల దృష్ట్యా సరైన నిర్ణయం తీసుకొనేవరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. అధికారుల చర్యలతో సంతృప్తి లేకపోతే పిటిషనర్లు జమ్మూకశ్మీర్ హైకోర్టును ఆశ్రయించవచ్చంటూ కూడా ధర్మాసనం సూచించింది. -
అనిరుధ్ కి విజయ్ దేవరకొండ 'ప్రేమలేఖ'
గత కొన్నాళ్లుగా హిట్ పడక డీలా పడిపోయిన హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda).. కింగ్డమ్ సినిమాతో ఎలా అయినా హిట్ కొట్టాలనుకుంటున్నాడు. మే 30న ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే 'హృదయం లోపల' అని చిత్రంలోని తొలి పాటని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు అనిరుధ్(Anirudh Ravichander)కి విజయ్ ప్రేమలేఖ రాయడం విశేషం.(ఇదీ చదవండి: చేసిన ప్రతి సినిమా హిట్.. ఎవరీ శ్రీనిధి శెట్టి?) 'మనం పాట రిలీజ్ చేశాం కదా. ఈ సందర్భంగా అనిరుధ్ కి నా చిన్న ప్రేమలేఖ. వీఐపీ, త్రీ సినిమాలు రిలీజైనప్పటి నుంచే నేను అనిరుధ్ కి వీరాభిమానిని. అసలు ఈ కుర్రాడెవరా? నేను యాక్టర్ అయిన తర్వాత అతడు మ్యూజిక్ కి నేను స్క్రీన్ పై కనిపించాలని అనుకునేవాడిని. పదేళ్ల తర్వాత ఇప్పుడు నా 13వ సినిమా రిలీజ్ కి రెడీ. మరో 28 రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఇది విజయ్ దేవరకొండ-అనిరుధ్ తొలి పాట. ఇప్పుడు నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నా' అని విజయ్ దేవరకొండ ట్వీట్ పెట్టాడు.'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన కింగ్డమ్ మూవీని యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీశారు. విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. అనిరుధ్ సంగీతమందించాడు. ఇప్పుడు ఈ పాటతో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ నెలంతా చేస్తూనే ఉంటారు. మరి ఈసారైనా 'కింగ్డమ్' మూవీతో(Kingdom Movie) విజయ్ హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే) Hey @anirudhofficial ☺️#HridayamLopala from #Kingdom - Today 4.06 PM onwards ❤️@gowtam19 @vamsi84 pic.twitter.com/NoIt6IiXea— Vijay Deverakonda (@TheDeverakonda) May 2, 2025 -
జర్మన్ బ్రాండ్ కీలక నిర్ణయం: మరోసారి పెరిగిన కార్ల ధరలు
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి.. భారతదేశంలో తన కార్ల ధరలపై 2 శాతం పెంపును ప్రకటించింది. ఇన్పుట్ ఖర్చుల పెరుగుదల కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆడి ఇండియా హెడ్ 'బల్బీర్ సింగ్ ధిల్లాన్' వెల్లడించారు.ప్రస్తుత ఆడి ఇండియా లైనప్‌లో ఏ4, ఏ6, క్యూ3, క్యూ3 స్పోర్ట్‌బ్యాక్, క్యూ5, క్యూ7, క్యూ8, ఎస్5 స్పోర్ట్‌బ్యాక్, ఆర్ఎస్ క్యూ8, క్యూ8 ఈ-ట్రాన్, క్యూ8 స్పోర్ట్‌బ్యాక్ ఈ-ట్రాన్, ఈ-ట్రాన్ జీటీ, ఆర్ఎస్ ఈ-ట్రాన్ జీటీ ఉన్నాయి. 2025 మే 15నుంచి వీటన్నింటి ధరలు పెరుగుతాయి. వేరియంట్ వారీగా కొత్త ధరలు త్వరలోనే అందుబాటులో వస్తాయి.ఇదీ చదవండి: రూ.21000 కోట్లు: మూడేళ్ళలో యూట్యూబర్ల సంపాదన..2025లో ఆడి ఇండియా ధరలను పెంచడం ఇది రెండోసారి. జనవరిలోనే కంపెనీ మొదటిసారి ధరలను పెంచింది. ధరల ప్రభావం కార్ల అమ్మకాలపైన ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే అమ్మకాలను పెంచడానికి కంపెనీ ఎలాంటి చర్యలను తీసుకుందనే విషయం తెలియాల్సి ఉంది. -
హీరోయిన్ రెచ్చగొట్టింది.. అందుకే సిక్స్ ప్యాక్ చేశా: అల్లు అర్జున్
అప్పట్లో ఆరుఫలకల దేహానికి ఉన్న క్రేజే వేరు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు.. చాలామంది హీరోలు సిక్స్ ప్యాక్‌లు ట్రై చేసినవారే.. తెలుగుకు ఆ ట్రెండ్‌ను తీసుకొచ్చింది మాత్రం హీరో అల్లు అర్జున్ (Allu Arjun) అనే చెప్పాలి. దేశముదురు సినిమాలో బన్నీ సిక్స్ ప్యాక్‌తో కనిపించాడు. తర్వాత చాలామంది తెలుగు హీరోలు ఈ ట్రెండ్‌ను ఫాలో అయ్యారు.20 ఏళ్ల కిందట..గురువారం నాడు వేవ్స్ సదస్సు (Waves Summit 2025)కు హాజరైన అల్లు అర్జున్ ఈ ట్రెండ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బన్నీ మాట్లాడుతూ.. 20 ఏళ్ల క్రితం దక్షిణాదిన ఏ నటుడూ చేయని పని నేను చేసి చూపించాను. మన వల్ల కాదు అన్న పనిని చేసి చూపిస్తే ఆ కిక్కే వేరు. నిజానికి నేను ఆరు ఫలకల దేహం కోసం ప్రయత్నించడానికి ఓ హీరోయిన్ ముఖ్య కారణం. తను నాతో ఓ సినిమా కూడా చేసింది. సౌత్‌లో ఎవరూ సిక్స్ ప్యాక్స్ చేయలేరు అని కామెంట్స్ చేసింది. సిక్స్ ప్యాక్ చేసి చూపించా..అది నాకు నచ్చలేదు. ఎందుకు చేయలేరు? అని ప్రశ్నించుకున్నాను. ఛాలెంజ్‌గా తీసుకున్నాను. సిక్స్ ప్యాక్స్ చేసి చూపించాను అని చెప్పుకొచ్చాడు. అయితే ఆ హీరోయిన్ ఎవరన్నది మాత్రం చెప్పలేదు. అల్లు అర్జున్.. గంగోత్రి సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు. దేశముదురు చిత్రంలో తొలిసారి సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హన్సిక కథానాయికగా నటించింది. చక్రి సంగీతం అందించిన ఈ చిత్రం 2007 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.చదవండి: విజయ్ దేవరకొండపై కేసు! ఎందుకంటే? -
‘ఇంగ్లండ్‌తో టెస్టుల్లో అతడిని ఆడించండి.. అదరగొడతాడు’
ఐపీఎల్-2025 (IPL 2025) ముగిసిన తర్వాత టీమిండియా ఆటగాళ్లు మళ్లీ అంతర్జాతీయ షెడ్యూల్‌తో బిజీ కానున్నారు. ఇందులో భాగంగా తొలుత ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్నారు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 (WTC)లో భాగంగా టీమిండియా తమ తొలి సిరీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది.ఇరుజట్ల మధ్య జూన్ 20 నుంచి ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి జట్టు ఎంపికపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో అదరగొడుతున్న సాయి సుదర్శన్‌ను ఈ టూర్‌కు తప్పక సెలక్ట్ చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి విజ్ఞప్తి చేశాడు.ఇంగ్లండ్‌తో టెస్టుల్లో అతడిని ఆడించండి..మూడు ఫార్మాట్లలోనూ రాణించగల సత్తా సాయి సుదర్శన్‌కు ఉందన్న రవిశాస్త్రి.. అతడికి ఒక్క అవకాశం ఇవ్వాలని సెలక్టర్లకు సూచించాడు. ఈ మేరకు ఐసీసీ రివ్యూ షోలో మాట్లాడుతూ.. ‘‘సాయి సుదర్శన్.. అతడొక క్లాస్ ప్లేయర్. తను బ్యాటింగ్ చేస్తుంటే నేనైతే కళ్లు తిప్పుకోలేను.అన్ని ఫార్మాట్లలోనూ అదరగొట్టగలడు. ఇంగ్లండ్ పరిస్థితులకు తగ్గట్లుగా ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన సాయి తప్పక రాణించగలడు. అతడి టెక్నిక్ అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది.ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే జట్టులోని కొత్త ఆటగాళ్లలో నేనైతే సాయి సుదర్శన్‌కు మొదటి ప్రాధాన్యం ఇస్తాను’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. అదే విధంగా ఐసీసీ చాంపియన్స ట్రోఫీ-2025లో, ఐపీఎల్లో దుమ్ములేపుతున్న శ్రేయస్ అయ్యర్ కూడా ఈ సిరీస్ ద్వారా టెస్టుల్లో పునరాగమనం చేస్తాడని అంచనా వేశాడు.అర్ష్‌దీప్ సింగ్‌ను కూడా ఆడిస్తేఅదే విధంగా పేస్ దళంలో రైటార్మ్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ తరచూ గాయాల బారిన పడుతున్న వేళ.. ఓ లెఫ్టార్మ్ సీమర్‌ను కూడా తీసుకోవాలని రవిశాస్త్రి సూచించాడు. వైట్‌బాల్ స్పెషలిస్టు అర్ష్‌దీప్ సింగ్‌ను టెస్టుల్లోనూ ఆడిస్తే బాగుంటుందని సూచించాడు.కాగా ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న తమిళనాడు ఆటగాడు సాయి సుదర్శన్ ఓపెనర్‌గా దుమ్ములేపుతున్నాడు. ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి 456 పరుగులు చేసి.. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.రోహిత్ సిద్ధమేమరోవైపు.. టీమిండియా టాప్ బ్యాటర్, కెప్టెన్ రోహిత్ శర్మ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లడంపై సందిగ్ధత వీడింది. అతడు ఇంగ్లండ్‌కు వెళ్లడం దాదాపు ఖాయమైనట్లే. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో పాల్గొనే సీనియర్ టీమ్, భారత ‘ఎ’ జట్టు కోసం కలిపి సెలక్టర్లు ప్రాథమికంగా 35 మంది ప్రాబబుల్స్‌ను ఎంపిక చేశారు. ఇందులో రోహిత్ శర్మకు చోటు లభించింది. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ 1–3తో ఓడిన తర్వాత రోహిత్ శర్మ టెస్టు భవితవ్యంపై సందేహాలు రేగాయి. ఈ సిరీస్‌లో భాగంగా సిడ్నీలో జరిగిన చివరి టెస్టులో ఫామ్ బాగా లేదంటూ రోహిత్ స్వచ్ఛందంగా తానే తుది జట్టు నుంచి తప్పుకున్నాడు. దాంతో అతని టెస్టు కెరీర్ ముగిసినట్లే అనిపించింది. ఈ ఫార్మాట్లో వరుసగా విఫలమవుతున్న అతను ఇంగ్లండ్‌కు వెళ్లక ముందే రిటైర్ కావచ్చని ఊహాగానాలు వచ్చాయి. అయితే ఇప్పుడు బీసీసీఐ సెలక్టర్లు ప్రాబబుల్స్‌ను ఎంపిక చేయడంతో వాటికి తెర పడినట్లే. అయితే రోహిత్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించే విషయంలో మాత్రం బీసీసీఐ తేల్చుకోలేకపోతోంది.ఇంగ్లండ్‌లాంటి బలమైన జట్టుతో ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్ అంటే పూర్తి ఫామ్, ఫిట్నెస్ ఉన్న ఆటగాడిని ఎంపిక చేయడం సరైందిగా బోర్డు భావిస్తోంది. ఈ కోణంలో రోహిత్ తగిన వ్యక్తిగా కనిపించడం లేదు. అయితే ఇప్పటికిప్పుడు మరో సరైన ప్రత్యామ్నాయం లేకుండా రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించే సాహసం బోర్డు చేయకపోవచ్చు. పైగా ఇంగ్లండ్‌లాంటి టీమ్‌పై బలమైన నాయకుడు ఉంటే బాగుంటుందనే ఆలోచన కూడా బోర్డులో ఉంది కాబట్టి రోహిత్‌నే ఎంపిక చేసే అవకాశం ఉంది. చదవండి: సంజూ శాంసన్‌కు మద్దతు!.. శ్రీశాంత్‌పై మూడేళ్ల పాటు సస్పెన్షన్ -
ఆసియా కప్, బంగ్లాదేశ్ పర్యటనను రద్దు చేసుకోనున్న టీమిండియా..?
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది స్వదేశంలో (సెప్టెంబర్) జరగాల్సిన ఆసియా కప్‌ను రద్దు చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ టోర్నీలో పాకిస్తాన్ పాల్గొనాల్సి ఉండటంతో ఈ మేరకు నిర్ణయించినట్లు ఓ ప్రముఖ వార్త సంస్థ తెలిపింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండబోవని బీసీసీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.🚨 LIKELY NO ASIA CUP 2025 🚨- Asia Cup 2025 remains under a cloud because of the terror attack in Pahalgam. (Sahil Malhotra/TOI). pic.twitter.com/dji5zdwc5T— Tanuj (@ImTanujSingh) May 2, 2025కాగా, ఈ ఏడాది ఆసియా కప్‌లో భారత్, పాక్ సహా 8 జట్లు పాల్గొనాల్సి ఉంది. ఈ టోర్నీ టీ20 ఫార్మాట్లో జరుగుతుందని ఏసీసీ (ఆసియా క్రికెట్ కౌన్సిల్) నిర్ణయించింది. ఈ టోర్నీలో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగాల్సి ఉంది. ఈ టోర్నీకి భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నేరుగా అర్హత సాధించగా.. హాంగ్‌కాంగ్, ఒమన్, యూఏఈ 2024 ఏసీసీ ప్రీమియర్ కప్ ద్వారా క్వాలిఫై అయ్యాయి.🚨 NO INDIA-BANGLADESH SERIES 🚨- Team India Unlikely to tour Bangladesh for the White ball series in August due to cross border tension. (Sahil Malhotra/TOI). pic.twitter.com/qsBdZO7ccE— Tanuj (@ImTanujSingh) May 2, 2025బంగ్లాదేశ్ పర్యటన కూడా రద్దు..?అక్రమ చోరబాట్లు, సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ బంగ్లాదేశ్ పర్యటనను కూడా క్యాన్సిల్ చేసుకోనుందని సమాచారం. ఎఫ్టీపీ ప్రకారం ఈ ఏడాది ఆగస్ట్‌లో భారత్ పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే తాజా పరిస్థితుల దృష్ట్యా ఈ పర్యటన రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.షెడ్యూల్ ప్రకారం టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనలో 3 వన్డేలు, 3 టీ20లు ఆడాల్సి ఉంది. ఈ పర్యటనలో తొలుత వన్డే సిరీస్ జరుగనుంది. ఆగస్ట్ 17న తొలి వన్డే, 20న రెండో వన్డే ఢాకా వేదికగా జరగాల్సి ఉంది. ఆతర్వాత ఆగస్ట్ 23న మూడో వన్డే, 26న తొలి టీ20 చట్టోగ్రామ్‌లో జరగాల్సి ఉన్నాయి. చివరి రెండు టీ20లు ఆగస్ట్ 29, 31 తేదీలోల ఢాకాలో జరగాల్సి ఉన్నాయి.కాగా, ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో గల ప్రశాంత బైసరన్ లోయలో పాక్ ఉగ్రమూకలు కాల్పులకు తెగబడి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారు. ఈ ఉగ్రదాడిని భారత ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. పాకిస్తాన్‌కు తగు రీతిలో బుద్ధి చెబుతుంది. సింధు జలాల ఒప్పందం సహా చాలా విషయాల్లో భారత్ పాక్‌ను కోలుకోలేని దెబ్బలు కొట్టింది. పాక్‌తో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌ల రద్దును కొనసాగించింది. ఆ దేశ ట్విటర్, సినిమాలపై నిషేధం విధించింది. పాక్‌కు చెందిన 16 యూట్యూబ్ చానెళ్లను, ఆ దేశ జర్నలిస్ట్‌లను బ్యాన్ చేసింది. పాక్‌కు అప్పు ఇవ్వొద్దని ఐఎంఎఫ్‌కు సూచించింది. -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 259.75 పాయింట్లు లేదా 0.32 శాతం లాభంతో 80,501.99 వద్ద, నిఫ్టీ 12.50 పాయింట్లు లేదా 0.051 శాతం లాభంతో 24,346.70 వద్ద నిలిచాయి.జుల్లుందూర్ మోటార్ ఏజెన్సీ ఢిల్లీ, స్పోర్ట్‌కింగ్ ఇండియా, జోడియాక్ క్లాతింగ్ కంపెనీ, క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్, ఫోర్స్ మోటార్స్ వంటి కంపెనీలు లాభాలను చవి చూశాయి. యునైటెడ్ పాలీఫ్యాబ్ గుజరాత్, గోద్రేజ్ ఆగ్రోవెట్, జీ-టెక్ జైన్ఎక్స్ ఎడ్యుకేషన్, వైశాలి ఫార్మా, మాలు పేపర్ మిల్స్ మొదలైన కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
చేసిన ప్రతి సినిమా హిట్.. ఎవరీ శ్రీనిధి శెట్టి?
సాధారణంగా హీరోయిన్లు వరసపెట్టి సినిమాలు చేస్తుంటారు. కానీ హిట్ కొట్టేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలాంటి వాళ్లతో పోలిస్తే కాస్త భిన్నమైన హీరోయిన్ శ్రీనిధి శెట్టి. చేసింది తక్కువ సినిమాలే అయినా కేజీఎఫ్ ఫ్రాంచైజీతో బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇప్పుడు 'హిట్ 3'తో మరోసారి సక్సెస్ అందుకుంది. సరే ఇవన్నీ పక్కనబెడిత ఇంతకీ శ్రీనిధి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే)ఈమె పూర్తి పేరు శ్రీనిధి రమేశ్ శెట్టి. మంగళూరులో పుట్టి పెరిగిన ఈమె తుళువ కమ్యూనిటీకి చెందిన అమ్మాయి. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివింది. యాక్సెంచర్ కంపెనీలో జాబ్ తెచ్చుకుంది. ఇందులో జాబ్ చేస్తూనే మోడల్ గానూ పనిచేసింది. అలా 2016 మిస్ సూపర్ నేషనల్ అందాల పోటీల్లో విజేతగా నిలిచింది. ఈ అవార్డ్ గెలిచిన రెండో దక్షిణాది అమ్మాయిగా రికార్డ్ కూడా సృష్టించింది.ఇలా మోడల్ గా చాలా పేరు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి.. అనుకోకుండా దర్శకుడు ప్రశాంత్ నీల్ దృష్టిలో పడింది. అలా కేజీఎఫ్ ఫ్రాంచైజీలో ఈమెని హీరోయిన్ గా తీసుకున్నాడు. స్వతహాగా ఇది హీరో సెంట్రిక్ సినిమా అయినప్పటికీ రీనా దేశాయ్ అనే పాత్రలో శ్రీనిధి నటన ఆకట్టుకుంది. అలా ఈమెకు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది.కేజీఎఫ్ 2 రిలీజైన కొన్నాళ్లకు తమిళంలో విక్రమ్ సరసన 'కోబ్రా' సినిమా చేసింది. ఇది తెలుగులో ఆడలేదు గానీ తమిళంలో మాత్రం మోస్తరు హిట్ గా నిలిచింది. 2022లో కోబ్రా చేసిన శ్రీనిధి.. దాదాపు మూడేళ్ల తర్వాత తెలుగులోకి 'హిట్ 3'తో పరిచయమైంది.(ఇదీ చదవండి: సూర్య 'రెట్రో' Day 1 కలెక్షన్.. నాని కంటే తక్కువే)హిట్ 3 కూడా హీరో సెంట్రిక్ యాక్షన్ మూవీ కావడంతో శ్రీనిధి శెట్టికి ఏమంత ప్రాధాన్య ఉండదులే అని చాలామంది అనుకున్నారు. స్టోరీకి అవసరమయ్యే పాత్ర ఈమెకు దక్కడం, మరోవైపు సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో శ్రీనిధి.. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బి అయిపోయింది.లెక్క ప్రకారం హిట్ 3 ఈమెకు మొదటి తెలుగు సినిమా కాదు. సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు కదా' కోసం ఈమెని హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ మూవీ లాంచ్ ఈవెంట్ కి వచ్చిన నాని.. శ్రీనిధిని చూసి హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. దీంతో అసలు కంటే ఈ సినిమా ముందొచ్చింది. హిట్ కొట్టేసింది.మరోవైపు హిందీలో భారీ బడ్జెట్ తో తీస్తున్న 'రామాయణ్'లోనూ శ్రీనిధినే సీతగా ఎంపిక చేశారు. కానీ రావణుడి పాత్ర కోసం యష్ వచ్చేసరికి.. ఈమెకి దక్కిన అవకాశం చేజారిపోయింది. సీత పాత్రలోకి సాయిపల్లవి వచ్చింది. ఏదేమైనా నిదానంగా సినిమాలు చేస్తున్న శ్రీనిధి శెట్టి.. చేసిన ప్రతి మూవీతోనూ హిట్ అందుకోవడం ఇక్కడ విశేషం.(ఇదీ చదవండి: సూర్యకు ఏమైంది? ఎందుకిలా చేస్తున్నాడు?) -
ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తి: ఆర్.యు. రెడ్డి
సోనుధి ఫిలిమ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఆర్.యు. రెడ్డి నిర్మిస్తున్న తొలి చిత్రం ప్రొడక్షన్ నెం.1 షూటింగ్ శరవేగంగా పూర్తయింది. ఈ సందర్భంగా శుక్రవారం ఆర్.యు. రెడ్డి మాట్లాడుతూ, ఈ సినిమా కొత్త రకమైన కథతో అనేక ఎమోషన్స్ కలగలిపిన చిత్రమని తెలిపారు. నటీనటులు ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్‌ల నుండి అద్భుతమైన సహకారం లభించడంతో అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేయగలిగామన్నారు.కిరణ్ కిట్టి, లక్ష్మీ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కొత్తవారైనా కథను అద్భుతంగా చిత్రీకరించారని ఆయన ప్రశంసించారు. ఒక్క పాట మినహా మొత్తం షూటింగ్ పూర్తయిందని, ఆ పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సమకూరుస్తారని వెల్లడించారు. ప్రముఖ సంగీత దర్శకుడు గోపీసుందర్ అందించిన ఆరు పాటలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని ఆయన తెలిపారు.త్వరలో సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసి, రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఆర్.యు. రెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాదిలో సోనుధి ఫిలిమ్ ఫ్యాక్టరీ నుండి మరికొన్ని చిత్రాలు ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. -
హైదరాబాద్ పబ్‌లో టాప్ హీరోయిన్... ఊపేస్తోందిగా..
గత ఏడాది లండన్‌లోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో అతిధులకు అనుకోని షాక్.. అప్పటి దాకా సంగీతం అందిస్తున్న లోకల్ బ్యాండ్ బృందం మధ్యలోకి అనూహ్యంగా దూసుకొచ్చిందో అందమైన యువతి. హఠాత్తుగా మైక్ తీసుకుని పాడడం ప్రారంభించింది. కాసేపట్లోనే అతిధుల హర్షధ్వానాలతో ప్రాంగణం మారుమోగిపోయింది. అప్పట్లో అది అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచింది. ఆమె సాదా సీదా యువతి కాదు మరి...భారత చలనచిత్ర రంగంలో టాప్ హీరోయిన్స్‌లో ఒకరైన శృతి హాసన్.ప్రఖ్యాత నటుడు కమల్ హాసన్ నటి సరికా ఠాకూర్ కుమార్తె శృతి హాసన్, తెలుగు, తమిళం హిందీ చిత్రాల ద్వారా భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది. ఆమె రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ ఏడు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులతో సహా అనేక అవార్డులను గెలుచుకుంది. ఇటీవల రజనీకాంత్ నటించి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన రాబోయే చిత్రం కూలీ షూటింగ్‌ను శ్రుతి హాసన్ పూర్తి చేసింది. ఆమె అంతర్జాతీయ చిత్రం ‘ది ఐ’ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో సంచలనం సృష్టిస్తోంది.ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఇటీవల భారతదేశంలో వెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శనకు నోచుకుంది కూడా. సానుకూల సమీక్షలను అందుకుంటోంది.ఇలా నటనా పరంగా అనేక రకాల సంచనాలను సృష్టిస్తోన్న శృతి...తన పేరును సార్ధకం చేసుకోవాలని అనుకుంటోంది. ఆమె పాటల ప్రపంచంలోనూ తన సత్తా చాటుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. చిన్నతనంలోనే సంగీత శిక్షణ పొంది పాడటం ప్రారంభించింది తరువాత తన సొంత బ్యాండ్‌ను సైతం ఏర్పాటు చేసుకుంది. నటీమణులలో పాడే వారే తక్కువ అంటే స్వంత బ్యాండ్ కూడా ఉన్న ఏకైక హీరోయిన్ ఆమె మాత్రమే ఆమె పలు చిత్రాలకు సైతం పాడింది. ఈ సంవత్సరంలో రాబోయే కూలీ చిత్రంలో ఆమె పాత్రతో పాటు, మిస్కిన్ దర్శకత్వం వహించి సంగీతం అందించిన విజయ్ సేతుపతి రాబోయే చిత్రం ‘ట్రెయిన్‘ కు కూడా ఆమె తన గాత్రాన్ని అందించింది. ‘ఇట్స్ ఎ బ్రేక్ అప్ డా‘ పాట కోసం రెహమాన్ తో కలిసి పనిచేసింది. నటన గానం కాకుండా, శ్రుతి ఒక పాటల రచయిత కూడా. ఆమె ‘ఎడ్జ్,‘ ‘మాన్స్టర్ మెషిన్,‘ ‘ఇనిమెల్‘ వంటి ప్రసిద్ధ సింగిల్స్‌తో ఇండీ సంగీత రంగంలో గణనీయమైన ప్రభావాన్ని చూపింది.శ్రుతి తన స్పష్టమైన వ్యక్తిత్వం ప్రత్యేకమైన ఫ్యాషన్సెక్షన్కు ప్రసిద్ధి చెందింది.గాయని శ్రుతి హాసన్ మార్చి 28న హైదరాబాద్‌లోని ప్రముఖ పబ్ కమ్ క్లబ్‌గా పేరున్న ఓడియం బై ప్రిజంలో ప్రత్యక్ష ప్రదర్శన ఇవ్వవలసి ఉంది. వయసు 21 ఏళ్లు అంతకంటే ఎక్కువ ఉన్నవారికి మాత్రమే ప్రవేశం అనే నిబంధనతో ఈ కన్సర్ట్ రాత్రి 8:00 గంటలకు ప్రారంభమై 4 గంటల 30 నిమిషాల పాటు కొనసాగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. టిక్కెట్లు ధరలు 1,000 నుంచి ఆపైన...బుక్‌మై షో ద్వారా విక్రయించారు కూడా అయితే ఏమైంతో ఏమో కానీ... ఆ షో వాయిదా పడింది. ఆ తర్వాత ఏప్రిల్ 28న శృతి హాసన్ ప్రదర్శన ఉంటుందని తిరిగి అనౌన్స్ చేశారు. అది కూడా వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి మే 3న శృతి రానున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌కు రానున్న శ్రుతి, తన అభిమానులను ఆకట్టుకోవడానికి రాక్, సోల్ భారతీయ ప్రభావాల మిశ్రమాన్ని తీసుకువస్తోంది.ఈ నేపధ్యంలోనే శ్రుతి హాసన్ తాజాగా తన రాబోయే ప్రత్యక్ష ప్రదర్శన సన్నాహాల రిహార్సల్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఆమె బ్యాండ్ సహచరులతో కలిసి ప్రాక్టీస్ సెషన్ లో మునిగిపోతున్న ఈ వీడియో, తెరవెనుక సంగీతం పట్ల ఉన్న ఆమె మక్కువను చూడటానికి అభిమానులకు వీలు కల్పిస్తుంది. తన ఇన్ స్ట్రాగామ్ పోస్ట్‌లో, శ్రుతి తన తోటి సంగీతకారులకు కృతజ్ఞతలు తెలుపుతూ, వారిని ’నేరంలో సోదరులు’ అని పేర్కొంది. ఆమె ఇలా రాసింది, ‘మనం ఆ షో చేసి ఉంటే బాగుండేది కానీ చేయలేక పోయాం (మా తప్పు కాదు) కానీ మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడటానికి మేం ఇంకా వేచి ఉండలేం. త్వరలో మీ అందమైన ముఖాలన్నీ చూడాలనుకుంటున్నాను. నా అద్భుతమైన సంగీతకారులకు, నేరంలో ఉన్న నా సోదరులకు ఈ సంగీతం ప్రతిధ్వనించే ధైర్యం ఉన్న కొద్దిమంది ఆత్మలకు ధన్యవాదాలు. త్వరలో హైదరాబాద్‌లో కలుద్దాం, మీకు నా హృదయంలో చోటు ఉందని మీకు తెలుసు‘ అంటూ ఆమె అభిమానులను తన పోస్ట్ ద్వారా ఊరడించింది.ఎప్పుడూ సంగీతం పట్ల మక్కువ కలిగి ఉండే శ్రుతి హాసన్ ఈ సంవత్సరం తన సినిమా కమిట్మెంట్లను నిర్వహిస్తూనే మరిన్ని స్వతంత్ర పాటలను విడుదల చేయనుంది. భవిష్యత్తులో మరిన్ని ప్రత్యక్ష ప్రదర్శనలకు ఆమె సిద్ధమవుతున్నందున, ఆమె సంగీత ప్రయాణం ఎలా సాగుతుందో చూడటానికి ఆమె అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతానికి, హైదరాబాద్‌లో ఆమె తొలి షో ఆమె శృతి మ్యూజికల్ జర్నీకి మలుపు కానుంది. -
హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్!
పెళ్లి అంటే ఆ సందడే వేరుంటుంది. నిశ్చితార్థం దగ్గర్నుంచి, పసుపుకొట్టడం, పెళ్లి కూతుర్ని చేయడం, హల్దీ, సంగీత్, బారాత్ ఇలా ప్రతీదీ చాలా ఘనంగా ఉండాలని ప్లాన్ చేసుకుంటారు. ఆకాశమంత పందిరి, భూదేవి అంత పీట అన్నట్టు సాగుతుంది ఈ సందడి. అలాగే బంధువులు, సన్నిహితులు, వధూవరుల ఫ్రెండ్స్ చేసే అల్లరి, అనుకోని సర్ప్రైజ్లు, సరదా సరదా సంఘటనలు చాలా కామన్. కానీ స్వయంగా పెళ్లి కూతురే అక్కడున్న వారందరికీ షాకిస్తే... పదండి అదేంటో చూద్దాం.న్యూఢిల్లీకి చెందిన ఓ జంట పెళ్లి వేడుకల్లో భాగంగా జరిగిన హల్దీ వేడుక (haldi ceremony) నెట్టింట సందడిగా మారింది. వధువు చేసిన సర్ప్రైజ్ అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ అవుతోంది. అక్కడంతా పెళ్ళికి వచ్చిన అతిథులతో అంతా హడావిడిగా ఉంది. హల్దీ వేడుకలో అందరూ పెళ్లికూతురి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలోనూ ఉన్నట్టుండి డైనోసార్ ఎంట్రీ ఇవ్వడంతో అతిథులంతా షాక్ అయ్యారు. అందర్నీ పలకరిస్తూ తెగ సందడి చేసింది. అందరితో కలిసి డ్యాన్స్ చేసింది. పెళ్లి కొడుకును కూడా కవ్వించి, సరదాగా ఆటపట్టిస్తూ కాసేను స్టెప్పులేసింది. ఆ తరువాత అసలు విషయం తెలిసాక వేదిక అంతా అందమైన నవ్వులు పూసాయి. అలా వచ్చింది మరెవ్వరో కాదు స్వయంగా వధువే. ఊహించని విధంగా విచిత్రమైన అలంకరణతో రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. View this post on Instagram A post shared by Malkeet Shergill | Anchor | Wedding Host (@malkeetshergill)తనకు కాబోయే భార్య చిలిపితనం, ఊహించని గెటప్ చూసి వరుడు కూడా నవ్వుతూ, సిగ్గుల మొగ్గయ్యాడు. ఆ తరువాత ముసి ముసి నవ్వులతో కాబోయే జంట స్టెప్పులేయడం విశేషం. ఇన్స్టాగ్రామ్ యూజర్ మల్కీత్ షెర్గిల్ అప్లోడ్ చేసిన వీడియోలో, "కభీ ఐసా కుచ్ దేఖా హై?" అనే క్యాప్షన్‌తో ఈ వీడియో షేర్ అయింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. మీ క్రియేటివిటీకి ఓ దండం రా బాబూ అని ఒకరంటే, ఇలా ఉన్నారేంట్రా బాబూ అని మరికొందరు కామెంట్ చేశారు. గాడ్జిల్లా కాదు బ్రైడ్జిల్లా అని కామెంట్ చేయడం విశేషం. -
అమ్మకు మీ అందరి ఆశీస్సులు కావాలి: రాఘవ లారెన్స్
కోలీవుడ్ స్టార్ హీరో రాఘవ లారెన్స్ గురించి పరిచయం అక్కర్లేదు. కేవలం సినిమాలే కాదు.. సమాజ సేవలోనూ రాఘవ లారెన్స్ ముందుంటారు. తన వంతుసాయంగా రైతులు, పేదలకు ఆర్థికంగా నిలబడేందుకు ఫౌండేషన్ ద్వారా సహాయ, సహకారాలు అందిస్తుంటారు. అలా రీల్ హీరోగా రాణిస్తూనే.. రియల్ లైఫ్‌లోనూ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.అయితే చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రాఘవ లారెన్స్. ఇవాళ తన మాతృమూర్తి పుట్టిన రోజు సందర్భంగా ట్వీట్ చేశారు. అమ్మ పుట్టినరోజు శుభవేళ మీ అందరి ఆశీస్సులు కావాలంటూ ట్విటర్లో ఫోటోలు పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు లారెన్స్ మదర్‌కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే రాఘవ లారెన్స్ చివరిసారిగా జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రంలో కనిపించారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ఎస్జే సూర్య కీలక పాత్రలో కనిపించారు. 2023లో బాక్సాఫీస్ వద్ద రిలీజైన ఈ చిత్రానికి ఆడియన్స్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. Hi Everyone, Today is my mother’s birthday. I need all your wishes and blessings 💐 pic.twitter.com/3QAWRisjvD— Raghava Lawrence (@offl_Lawrence) May 2, 2025 -
మూడు రోజుల్లో స్కైప్ కనుమరుగు
కరోనా సమయంలో పాపులర్ అయిన కొన్ని టెక్నాలజీ సర్వీసులు క్రమంగా కనుమరుగవుతున్నాయి. అందులో మైక్రోసాఫ్ట్ సర్వీసు స్కైప్ ఒకటి. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి 22 ఏళ్లు అయినా, కొవిడ్ సమయంలో చాలా మంది ఉద్యోగులు, బిజినెస్ సంస్థలు స్కైప్ సర్వీసులు విరివిగా వినియోగించుకున్నారు. కానీ కొవిడ్ అనంతరం క్రమంగా యూజర్ల నుంచి ఆదరణ తగ్గడం, మార్కెట్లో పోటీగా మెరుగైన ఇతర ప్రత్యామ్నాయాలు రావడంతో సవాళ్లు ఎదురవుతున్నాయి. దాంతో ఈ సర్వీసును మే 5, 2025 నుంచి నిలిపేస్తున్నట్లు ఇప్పటికే మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. అయితే స్కైప్ యూజర్లకు మైక్రోసాఫ్ట్ టీమ్స్‌వైపు మళ్లించేందుకు అన్ని ప్రయత్నాలు జరిగాయి. కాగా, కంపెనీ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన స్కైప్‌ను ఎందుకు నిలిపేస్తున్నారో నిపుణులు విశ్లేషిస్తున్నారు.మైక్రోసాఫ్ట్ టీమ్స్‌లోకి మార్పుమైక్రోసాఫ్ట్ తన కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌లను ఏకీకృతం చేయడం కూడా స్కైప్‌ను నిలిపేసేందుకు కారణమవుతుంది. మెసేజింగ్, వీడియో కాల్స్ ఇతర సర్వీసుల కోసం దాని ప్రాథమిక కేంద్రంగా మైక్రోసాఫ్ట్ టీమ్స్‌పై పూర్తిగా దృష్టి పెడుతోంది. దాంతో స్కైప్ వినియోగదారులను సైతం ఈ టీమ్స్‌లో చేరమని కొంత కాలంగా కోరుతుంది. ఇప్పటికే చాలామంది టీమ్స్‌లోకి మారారు.తగ్గుతున్న ప్రజాదరణస్కైప్ కొన్నేళ్లుగా మెరుగైన సర్వీసులు అందిస్తున్నప్పటికీ జూమ్, గూగుల్ మీట్, వాట్సాప్.. వంటి పోటీదారులు కూడా ఈ సర్వీసు అందిస్తున్నారు. దాంతో ఆఫీస్ 365లో భాగంగా ఉన్న మైక్రోసాఫ్ట్ టీమ్స్‌వైపు వినియోగదారులు నడిపించేలా సంస్థ చర్యలు తీసుకుంటోంది.వినియోగదారులకు మద్దతుగా..స్కైప్ నుంచి టీమ్స్‌కు మైగ్రేట్ అయ్యేందుకు మైక్రోసాఫ్ట్ యూజర్లకు చాలా నెలల సమయం ఇచ్చింది. టీమ్ల్లోకి లాగిన్ కావడానికి ఇప్పటికే ఉన్న స్కైప్ ఐడీలను ఉపయోగించవచ్చని తెలిపింది. ఇది యూజర్ ట్రాన్పర్మేషన్ను సులభతరం చేసింది. చాట్ హిస్టరీలు, కాంటాక్ట్‌లను నిరాటంకంగా టీమ్స్‌కు బదిలీ చేస్తామని మైక్రోసాఫ్ట్ హామీ ఇచ్చింది.పెయిడ్ సేవలు నిలిపివేతస్కైప్ క్రెడిట్, కాలింగ్ ప్రణాళికలతో సహా పెయిడ్ సేవల కోసం కొత్త సబ్ స్క్రిప్షన్లను మైక్రోసాఫ్ట్ నిలిపివేసింది. ఇప్పటికే ఉన్న వినియోగదారులు వారి తదుపరి రీఛార్జ్ సైకిల్ వరకు సబ్స్క్రిప్షన్లను కొనసాగించవచ్చని తెలిపింది. ఆ తర్వాత పెయిడ్ ఫీచర్లు నిలిచిపోతాయని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: గూగుల్ కథ కంచికేనా?ప్రత్యామ్నాయాలుమార్కెట్లో టీమ్స్‌కు కూడా ప్రత్యామ్నాయాలున్నాయి. యూజర్లు వీడియో కాలింగ్ ఫీచర్లను అందించే గూగుల్ మీట్, జూమ్ లేదా వాట్సాప్.. వంటి సర్వీసులకు కూడా మారవచ్చు. అయితే స్కైప్‌తో పోలిస్తే టీమ్స్ మరింత ఆధునిక, ఇంటిగ్రేటెడ్ అనుభవాన్ని అందిస్తుందని మైక్రోసాఫ్ట్ నొక్కి చెప్పింది. -
పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు
PM Narendra Modi AP Tour Updatesవెలగపూడి:02-05, 5.10 PMప్రధాని మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీమీ అందరిని కలవడం నాకు ఆనందంగా ఉందిఏపీకి కేంద్రం సంపూర్ణం సహకారం అందిస్తుందిమౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేస్తున్నాంఏపీలో కనెక్టవిటీ వేగంగా అభివృద్ధి చెందుతుందికనెక్టివిటీ అభివృద్ధి చెందితే అన్ని రంగాలకు లబ్ధిదీంతో రవాణా రంగం అభివృద్ధి చెంది రైతులకు మేలు జరుగుతుందిరైల్వే బడ్జెట్ లో ఏపీ వాటా 10 రెట్లు పెరిగిందికేంద్ర ప్రభుత్వం రైల్వేల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తోందిరూ. 9 వేల కోట్లకు పైగా ఏపీకి కేటాయిస్తున్నాంఏపీలో వందశాతం రైల్వేల విద్యుదీకరణ జరిగిందిమౌలిక సదుపాయాల కల్పనతో ఆర్ధిక వ్యవస్థ బలోపేతం చేస్తున్నాంనిర్మాణ రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయిగత పదేళ్లలో ఏపీలో 750 రైల్వే బ్రిడ్జిలు నిర్మించాంఏపీకి వందే భారత్, అమృత్ భారత్ రైళ్లు కేటాయించాంహైవేల నిర్మాణం వల్ల టూరిజం అభివృద్ధి చెందుతుందిపంట బీమా యోజన కింద రైతులకు ఇప్పటివరకూ రూ. 5,500 కోట్లు ఇచ్చాంఅంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఏపీలో ఘనంగా నిర్వహిస్తాంజూన్ 21 యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ఏపీకి వస్తానాగాయలంక క్షిపణి కేంద్రంతో దేశ రక్షణకు కొత్త శక్తి వస్తుందియూనిటీ మాల్ తో స్థానిక ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అవుతాయియూనిటీ మాల్ లో హస్త కళాకారుల ఉత్పత్తులు ఒకేచోట అందుబాటులో ఉంటాయిరైతుల వికాసానికి కేంద్రం ప్రత్యేకంగా కృషి చేస్తోందిపథకాలు, పరిహారం కింద రైతులకు రూ. 17 వేల కోట్లు ఇచ్చాంపీఎం సమ్మాన్ నిధి ద్వారా రైతులకు సాయం చేస్తున్నాం02-05, 4.55 PMపలు ప్రాజెక్టులకు నరేంద్ర మోదీ శంకుస్థాపనలువేదికపై నుంచి ప్రాజెక్టుల శంకుస్థాపనలు చేసిన మోదీమొత్తం 18 ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలుఅమరావతిలో రూ. 49 వేల కోట్ల పనులకు మోదీ శ్రీకారంరూ. 8 వేల కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులకు సైతం మోదీ శంకుస్థాపనలురాజధాని సహా రూ. 58 వేల కోట్ల ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు02-05, 2:50PMప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రాష్ట్రానికి వచ్చారు. అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2.50 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు మోదీ,. ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయమునకు చేరుకున్న భారత ప్రధానికి ప్రజా ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో వెలగపూడి చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో వెలగపూడి సభా ప్రాంగణానికి బయల్దేరి వెళ్లారు. పలు కేంద్ర ప్రాజెక్ట్ లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మోదీ పాల్గొననున్నారు. దీనిలో భాగంగా 18 ప్రాజెక్ట్ లకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. భారీ భద్రత ఏర్పాట్లు..ప్రధాని పర్యటనకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 6 వేల మందికి పైగా పోలీస్ బలగాలను మోహరించారు. భద్రతను పర్యవేక్షించేందుకు 19 మంది ఐపీఎస్ అధికారులను నియమించారు. అమరావతిలోని సభా ప్రాంగణానికి చేరుకునేందుకు 11 మార్గాలను ఖరారు చేశారు. వాటిలో రెండు మార్గాలను ప్రముఖులకు కేటాయించారు. సభా ప్రాంగణం పరిసరాలను ఎన్ఎస్జీ కమెండోలు ఆ«దీనంలోకి తీసుకున్నారు. సభ కోసం 5 లక్షల మందిని సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బాధ్యత రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులకు అప్పగించింది. జన సమీకరణ కోసం 4,500 ఆర్టీసీ బస్సులను కేటాయించింది. -
ఇంటర్నేషనల్ బ్రాండ్‌కు గ్లోబల్ అంబాసిడర్‌గా కేఎల్ రాహుల్
ప్రముఖ ఇంటర్నేషనల్ బ్రాండ్ పాల్ & షార్క్‌కు (Paul & Shark) గ్లోబల్ అంబాసిడర్‌గా టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని పాల్ & షార్క్ సంస్థ యాజమాన్యం ఇవాళ (మే 2) ప్రకటించింది. రాహుల్ లాంటి నిష్ణాతుడైన క్రికెటర్‌తో భాగస్వామ్యం పొందడం తమ సంస్థకు గర్వకారణమని పేర్కొంది. రాహుల్ పాల్ & షార్క్‌కు గ్లోబల్ అంబాసిడర్‌గా ఎంపికైన మొట్టమొదటి భారత అథ్లెట్.పాల్ & షార్క్ అనేది ఇటలీకి చెందిన లగ్జరీ దుస్తుల కంపెనీ. ఈ సంస్థను పాలో డిని అనే వ్యాపారవేత్త 1975లో స్థాపించాడు. దీని ప్రధాన కార్యాలయం వారెస్లో ఉంది. ఈ ఫ్యాషన్ బ్రాండ్ ప్రధానంగా లైఫ్‌స్టైల్ మరియు స్పోర్ట్‌వేర్ దుస్తులను తయారు చేస్తుంది. ఈ కంపెనీ లోగోపై షార్క్ గుర్తు ఉంటుంది. ఈ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 280 స్టోర్లు ఉన్నాయి. పాల్ & షార్క్ భారత్‌లో 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ కంపెనీకి భారత్‌లో ప్రముఖ నగరాల్లో స్టోర్లు ఉన్నాయి.ఇదిలా ఉంటే, కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్ 2025తో బిజీగా ఉన్నాడు. ఈ సీజన్లో అతను ప్రాతినిథ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ బెర్త్‌కు ప్రధాన పోటీదారుగా ఉంటూ, పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతుంది. ఢిల్లీ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించింది. ఈ జట్టు విజయాల్లో కేఎల్ రాహుల్‌ది కీలకపాత్ర. రాహుల్ ఈ సీజన్లో 9 మ్యాచ్‌లు ఆడి 53 సగటున, 146.06 స్ట్రయిక్‌రేట్‌తో 371 పరుగులు చేసి లీడింగ్ రన్‌స్కోరర్ల జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఢిల్లీ తమ తదుపరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ మే 5న హైదరాబాద్‌లో జరుగనుంది. -
రూ.21000 కోట్లు: మూడేళ్ళలో యూట్యూబర్ల సంపాదన..
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో చాలామంది సొంతంగా సంపాదించడానికి మార్గాలను వెతుకుతున్నారు. పెట్టుబడి లేకుండా సంపాదించడానికి యూట్యూబ్ ఓ మంచి ఫ్లాట్‌ఫామ్. దీనిని దృష్టిలో ఉంచుకుని చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానెల్స్ ప్రారంభిస్తున్నారు, ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. యూట్యూబ్ ద్వారా గత మూడేళ్ళలో కంటెంట్ క్రియేటర్లు ఎంత సంపాదించారనే విషయాన్ని సీఈఓ నీల్ మోహన్ వెల్లడించారు.గత మూడు సంవత్సరాలలో యూట్యూబ్.. భారతీయ క్రియేటర్లకు, మీడియా సంస్థలు మొదలైన వాటికి రూ. 21,000 కోట్లకు పైగా చెల్లించింది. ఈ విషయాన్ని సీఈఓ నీల్ మోహన్ ముంబైలో జరిగిన ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (WAVES)లో స్పష్టం చేశారు. అంతే కాకుండా.. యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహించడానికి రాబోయే రెండు సంవత్సరాలలో.. రూ.850 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ పెట్టుబడి ప్రత్యేకంగా భారతదేశ కంటెంట్ క్రియేటర్ల ఆర్థిక వ్యవస్థను పెంచుతుందని ఆయన అన్నారు.ఇదీ చదవండి: 1925లో బంగారం రేటు ఇంత తక్కువా?: అదే ధర ఇప్పుడుంటే..భారతదేశంలోని సుమారు 100 మిలియన్ల కంటే ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ లేదా యూట్యూబర్లు కంటెంట్ అప్లోడ్ చేశారు. సుమారు 15,000 మంది యూట్యూబర్లు ఒక ఏడాదిలోనే 10 లక్షల సబ్స్క్రైబర్లను పొందిన రికార్డును సొంతం చేసుకున్నారు. కాగా 2005 ఫిబ్రవరి 14న ప్రారంభమైన యూట్యూబ్ 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. -
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
ఢిల్లీ: మద్యం విధానం కేసులో మద్యం తనకు సీఆర్పీసీ 160 నోటీసు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో రాజ్ కేసిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణలో నివసిస్తున్న తనకు నోటీసులు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నోటిసు ఇచ్చే పరిధి ఏపీ సీఐడికి లేదని పిటిషన్లో ఆయన పేర్కొన్నారు.విచారణ జరిపిన జస్టిస్ జేబీ పార్థివాల, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వం, సిట్, ముఖేష్‌కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రాజ్ కేసిరెడ్డి తరపున న్యాయవాది శ్రీహర్ష వాదనలు వినిపించారు. తదుపరి విచారణ మే 13కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. -
బంగారం మాయలో పడొద్దు..
బంగారాన్ని సాంప్రదాయకంగా సురక్షితమైన, నమ్మదగిన పెట్టుబడిగా భావిస్తారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లు అస్థిరతకు లోనవుతున్న తరుణంలో బంగారంపై పెట్టుబడి ధోరణి ఇన్వెస్టర్లలో మరీ ఎక్కువైంది. బంగారం ధరలు 10 గ్రాములకు రూ .1 లక్షకు చేరువలో ఉన్నందున పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన అవకాశం అని చాలా మంది భావిస్తున్నారు. అయితే బంగారంపై పెట్టుబడులు ఎల్లప్పుడూ అద్భుతమైన రాబడిని ఇస్తాయనుకోవద్దని, బంగారం మాయలో పడొద్దని ఇన్వెస్టర్లను హెచ్చరిస్తున్నారు నితేష్ బుద్ధదేవ్ అనే చార్టర్డ్ అకౌంటెంట్.స్వల్పకాలిక ధోరణుల ఆధారంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలని ఇన్వెస్టర్లకు సీఏ బుద్ధదేవ్ సూచించారు. గత కొన్నేళ్లుగా బంగారం బలమైన రాబడులను అందించినప్పటికీ, ఎల్లప్పుడూ అలా ఉండదని ఆయన చెబుతున్నారు. వాస్తవానికి, బంగారం దాదాపు సున్నా రాబడిని అందించిన సుదీర్ఘ కాలం కూడా ఉంది. చాలా మంది కొత్త ఇన్వెస్టర్లు ఈ వాస్తవాన్ని విస్మరిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.ఈ లెక్కలు చూడండి..తన హెచ్చరికకు మద్దతుగా బుద్ధదేవ్ 2012 నుండి 2019 వరకు బంగారంపై రాబడులు ఏ మాత్రం ఉన్నాయనే దానికి సంబంధించిన చారిత్రక లెక్కలను ముందుపెట్టారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో బంగారం ధరలు మరీ అంత పెద్దగా పెరిగిందేమీ లేదు. 2012లో 10 గ్రాముల బంగారం ధర రూ.31,050 ఉండగా.. 2019 నాటికి అది స్వల్పంగా పెరిగి రూ.35,220కి చేరింది. అంటే 8 సంవత్సరాలలో పెరిగింది కేవలం రూ .4,170. శాతంలో చెప్పాలంటే మొత్తం 13% రాబడి. సగటున చూసినప్పుడు, కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు సంవత్సరానికి 1.5% కంటే తక్కువగానే ఉంది. ఇక 1992 నుంచి 2002 మధ్య కాలంలో బంగారం ధర 10 గ్రాములకు రూ.4,334 నుంచి కేవలం రూ.4,990కి పెరిగిందని, 1.5 శాతం కంటే తక్కువ వార్షిక రాబడులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.2020 తర్వాత బంగారం ఎందుకు పెరిగిందంటే..2020 తర్వాత బంగారం ధరలు అకస్మాత్తుగా పెరగడం యాదృచ్ఛికం కాదని బుద్ధదేవ్ వివరించారు. సురక్షిత ఆస్తులకు డిమాండ్‌ను పెంచిన 2019 కోవిడ్ మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ ఘర్షణ, పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఆందోళనలు, కేంద్ర బ్యాంకులు దూకుడుగా బంగారం కొనుగోలు చేయడం ఇవన్నీ బంగారం నాటకీయ పెరుగుదలకు దోహదం చేశాయి.ఈ అంశాలు మదుపర్లు బంగారం కొనుగోలుకు ఎగబడే పరిస్థితిని సృష్టించాయి, ధరలు భారీగా పెరిగాయి. కానీ సీఏ బుద్ధదేవ్ చెబుతున్నట్లుగా ప్రతి పెద్ద స్పైక్ తర్వాత సుదీర్ఘ ఫ్లాట్ లైన్ ఉంటుంది. అంటే ఇన్వెస్టర్లు బంగారం పనితీరులో బూమ్లతోపాటు పడిపోయే స్థితినీ అంచనా వేయాలి.బంగారం ఇప్పటికీ మంచి పెట్టుబడేనా అంటే బుద్ధదేవ్ ప్రకారం.. పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో బంగారానికి ఎప్పటికీ విలువ ఉంటుంది. కానీ ఇది డైవర్సిఫికేషన్, హెడ్జింగ్ సాధనంగా మాత్రమే ఉంటుంది. ఈక్విటీల మాదిరిగా స్థిరమైన రాబడిని అందించదు. కాబట్టి మొత్తం పోర్ట్‌ఫోలియోలో బంగారానికి కేవలం 5% నుండి 12% కేటాయించాలని ఆయన సిఫార్సు చేస్తున్నారు. -
వజ్రాల నెక్లెస్, బెనారస్ సిల్క్ చీరలో నీతా అంబానీ స్టన్నింగ్ లుక్..!
నీతా అంబానీ వ్యాపారవేత్తగా, ఫ్యాషన్ ఐకాన్‌గా తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంటారు. ఎప్పటికప్పడూ సరికొత్త లుక్‌తో అందర్నీ ఆశ్యర్యపరుస్తుంటారు. మరోసారి తాజాగా అలాంటి మెస్మరైజ్ లుక్‌తో మెరిశారు. ఆ విశేషాలేంటో చూద్దామా..!.నీతా కేవలం వ్యాపార దిగ్గజం మాత్రమే కాదు, భారతదేశ గొప్ప హస్తకళను ప్రదర్శించే ఫ్యాషన్ ఐకాన్. ఆమె సదా విశాలమైన బంగారు అంచులతో కూడిన చీరలతో మన సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటి చెబుతుంటారు . కేవలం ప్రతిభాపాటవాలే కాదు, అప్పడప్పుడూ మన డ్రెస్ సెన్స్ కూడా మన అభివృద్ధికి తోడ్పడుతుందని తన స్టైలిష్ ఫ్యాషన్వేర్లతో చెబుతూనే ఉంటారామె. ఈసారి ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన WAVES 2025 సమ్మిట్‌లో అద్బుతమైన లుక్‌తో ఆకర్షించారు. చీరలంటే అమితంగా ఇష్టపడే నీతాని ఈ వేడుకలో బెనారస్ సిల్క్ చీరలో తళుక్కుమన్నారు. సంక్లిష్టమైన బహుళ వర్ణ పూల ఎంబ్రాయిడరీ డిజైన్‌తో చీర హైలెట్‌గా నిలిచింది. ఆ చీర లుక్‌కి సరిపోయే మ్యాచింగ్ బ్లౌజ్ జత చేశారు. ఆ చీరకు తగ్గట్టు స్టేట్మెంట్ డైమండ్ స్టడ్ చెవిపోగులు, ప్రకాశవంతమైన ఎరుపు మాణిక్యాలతో పొదగబడిన డైమండ్ నెక్లెస్‌తో ఆకాశంలో మెరిసే నక్షత్రంలా కాంతివంతమైన లుక్‌లో కనిపించారామె. అందుకు తగ్గ మేకప్, స్టైలిష్ హెయిర్ స్లైల్‌తో రాజరికానికి అద్దం పట్టేలా ఆమె ఆహార్యం అదిరిపోయింది. కాగా, వేవ్స్ 2025(WAVES 2025) వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ఈ నెల మే 1 నుంచి 4 వరకు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. ఈ కార్యక్రమంలో పరిశ్రమ నాయకులు, క్రియేటర్లు, విధాన రూపకర్తలతో సహా 90కి పైగా దేశాల నుంచి సుమారు పదివేల మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) (చదవండి: భారత్.. నాకెన్నో పాఠాలు నేర్పింది.. కానీ ఇక్కడే ఉండలేను కదా!’) -
The Midnight Walk’ అ ‘మాయ’కుడు ఎవరు
డార్క్ ఫాంటసీ అడ్వెంచర్ గేమ్.... ది మిడ్నైట్ వాక్. ప్లేయర్స్‌ను ఈ గేమ్ భయానక ప్రపంచంలోకి ఆహ్వానిస్తుంది. ఆ ప్రపంచంలోకి వెళ్లే ధైర్యసాహసాలు ఉంటే క్రూరమైన రాక్షసులతో ΄ోరాడాలి. ఎన్నో రహస్యాలను వెలికితీయాలి. కోర్ గేమ్‌ప్లే ఫీచర్స్ఆకట్టుకుంటాయి. ఈ గేమ్ కోసం ఎన్నో సర్రియల్ క్రియేచర్లను సృష్టించారు. ప్రతి ఫ్రేమ్ స్టాప్ మోషన్ మ్యాజిక్‌తో ప్రాణం పోశారు.‘సూర్యుడిని ఎవరు మాయం చేశారు? ఎందుకు?’ అనేది గేమ్‌లో సెంట్రల్ మిస్టరీ.‘ఈ గేమ్ ఇండి గేమింగ్ ప్రపంచంలో ప్రత్యేకతను చాటుకుంటుంది. మిడ్నైట్ వాక్ అనేది డార్క్ ఫాంటసీ, స్టాప్–మోషన్ మ్యాజిక్ సమ్మేళనం’ అంటున్నారు గేమ్ మేకర్స్.విడుదల తేది: 8 మే ప్లాట్‌ఫామ్స్: ప్లేస్టేషన్ 5, మైక్రోసాప్ట్ విండోస్ జానర్స్: అడ్వెంచర్ గేమ్, ఇండి గేమ్ఇదీ చదవండి: Good Health: వెజ్ తినాలా? నాన్ వెజ్ తినాలా? అవును... ఇది నిజమే! ∙1904లో అమెరికన్ టీ వ్యాపారి ఒకరు చిన్న సిల్క్ సంచులలో టీ పొడిని ఐరోపాకు రవాణా చేశాడు. అయితే....కొందరు తెలియక వాటిని మరుగుతున్న నీటిలో ముంచారు. అలా టీ బ్యాగ్ ఐడియా పుట్టింది! ∙‘ఏ ఇద్దరు వ్యక్తుల వేలి ముద్రలు ఒకేరకంగా ఉండవు’ అనేది నాలుకకు కూడా వర్తిస్తుంది. ప్రతి వ్యక్తి ‘టంగ్ ప్రింట్’కు దాని స్వంత, విలక్షణమైన ఆకారం, పరిమాణం, రంగు ఉంటుంది అంటున్నారు పరిశోధకులు. ఫోరెన్సిక్ పరిశోధనలలో ‘టంగ్ ప్రింట్’లు కూడా ఉపయోగపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. -
సూర్యకు ఏమైంది? ఎందుకిలా చేస్తున్నాడు?
సూర్య పేరుకే తమిళ హీరో. కానీ తెలుగులోనూ కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇతడి నుంచి ఓ సినిమా వస్తుందంటే మన దగ్గర కూడా హౌస్ ఫుల్స్ పడతాయి. అలాంటిది గత కొన్నాళ్లుగా సినిమాలైతే చేస్తున్నాడు. సూర్య కోసమని తెలుగు ప్రేక్షకులు థియేటర్ కి వెళ్తున్నారు. కానీ అసంతృప్తితో బయటకు వస్తున్నారు. ఇంతకీ సూర్య ఎందుకిలా చేస్తున్నాడు? (ఇదీ చదవండి: సూర్య 'రెట్రో' Day 1 కలెక్షన్.. నాని కంటే తక్కువే)ఈ మధ్య కాలంలో సూర్యకు థియేటర్లలో సరైన హిట్ అన్నదే పడట్లేదు. అదేంటి జై భీమ్, ఆకాశమే హద్దురా సినిమాలు హిట్ అయ్యాయి కదా మీరు అనుకోవచ్చు. కానీ ఇవి రెండూ లాక్ డౌన్ టైంలో నేరుగా ఓటీటీలో రిలీజైపోయాయి. కాబట్టి ఇవి థియేటర్ లెక్కలోకి రావు. 2017లో సింగం 3 రిలీజైన తర్వాత సూర్య నుంచి గ్యాంగ్, ఎన్జీకే, బందోబస్త్, ఈటీ, కంగువ.. ఇప్పుడు రెట్రో సినిమా థియేటర్లలోకి వచ్చాయి. రెట్రో గురించి కాసేపు పక్కనబెడితే అంతకు ముందు విడుదలైన ఏ సినిమా కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది.ఇప్పుడు రెట్రో చిత్రానికి కూడా తమిళంలో టాక్ ఓకే గానీ తెలుగులో మాత్రం ఏ మాత్రం ఆశాజనకంగా అయితే లేదు. ఒకవేళ ఇదే కొనసాగితే మాత్రం వీకెండ్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి కష్టమైవడం గ్యారంటీ. తమిళంలో ఇలానే ఉండే అవకాశాలు లేకపోలేదు.(ఇదీ చదవండి: 'హిట్ 3' ఫస్ట్ డే కలెక్షన్స్.. నాని కెరీర్లో ఇదే టాప్)సూర్య యాక్టింగ్, కష్టపడటం ఏమన్నా తక్కువ చేస్తున్నాడా అంటే అస్సలు లేదు. కానీ అతిగా దర్శకుల్ని నమ్మడమే ఇతడికి మైనస్ అవుతుందా అనిపిస్తుంది. ఎందుకంటే గతేడాది వచ్చిన 'కంగువ'పై సూర్య చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరో బాహుబలి అవుతుందనుకున్నాడు. డైరెక్టర్ శివని చాలా నమ్మాడు. కట్ చేస్తే ఈ మూవీ ఘోరమైన డిజాస్టర్ అయింది.ఇప్పుడు రెట్రో విషయంలోనూ చాలామంది ప్రేక్షకులు సూర్యని ఏం అనట్లేదు. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ అసలు ఎందుకు ఇలాంటి సినిమా తీశాడా? సూర్య.. అసలు ఇలాంటి కథని ఎలా ఒప్పుకొన్నాడా అని మాట్లాడుకుంటున్నారు.ప్రస్తుతం సూర్య చేతిలో ఆర్జే బాలాజీ తీస్తున్న '45', సార్-లక్కీ భాస్కర్ ఫేమ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో తీయబోయే సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు 'వడివాసల్' చిత్రం కూడా ఉంది. వీటితోనైనా హిట్ కొట్టి సూర్య కమ్ బ్యాక్ ఇస్తే అభిమానులకు అదే హ్యాపీ. లేదంటే మాత్రం సూర్య చిత్రాన్ని చూసేందుకు థియేటర్ కి వచ్చే ప్రేక్షకుల నమ్మకం తగ్గిపోతుంది.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే) -
సంజూ శాంసన్‌కు మద్దతు!.. శ్రీశాంత్‌పై వేటు.. ప్రకటన విడుదల
టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ (Sreesanth)కు కేరళ క్రికెట్ అసోసియేషన్ (KCA) భారీ షాకిచ్చింది. కేరళ క్రికెట్ వ్యవహారాలతో సంబంధం లేకుండా.. అతడిని మూడేళ్లపాటు సస్పెండ్ చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. సంజూ శాంసన్ (Sanju Samson) విషయంలో శ్రీశాంత్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణమని తెలుస్తోంది.సంజూకు కేసీఏతో విభేదాలు?కాగా కేరళకు చెందిన శ్రీశాంత్ మాదిరే సంజూ శాంసన్ కూడా టీమిండియా తరఫున రాణిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు సంజూకు కేసీఏతో విభేదాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. శిక్షణా శిబిరానికి హాజరు కానందున ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను కేసీఏ సెలక్టర్లు దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీకి ఎంపిక చేయలేదు.కేసీఏ బారి నుంచి కాపాడుతానంటూదీంతో ఐసీసీ మెగా వన్డే టోర్నీకి ముందు సంజూ ఇలా దేశీ ఈవెంట్‌కు దూరం కావడంతో సెలక్టర్లు అతడి పేరును పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో సంజూ శాంసన్‌కు మద్దతుగా మాట్లాడుతూ శ్రీశాంత్ కేసీఏను విమర్శించాడు.అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్న ఆటగాళ్లకు మద్దతుగా ఉండాల్సిన అసోసియేషన్ ఇలా చేయడం సరికాదని.. తాను స్థానిక కేరళ క్రికెటర్లను కేసీఏ బారి నుంచి కాపాడుతానంటూ శ్రీశాంత్ వ్యాఖ్యలు చేశాడు. స్థానిక ఆటగాళ్లను కాదని.. వేరే రాష్ట్రాల వారికి కేసీఏ అవకాశాలు ఇస్తోందని ఆరోపించాడు. ఎంతో మంది అనుభవజ్ఞులైన, నైపుణ్యాలు ఉన్న ఆటగాళ్లను కూడా ఎదగనివ్వడం లేదంటూ ఆరోపణలు చేశాడు.మూడేళ్ల పాటు సస్పెండ్ఇక శ్రీశాంత్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కేసీఏ అతడిపై చర్యలు చేపట్టింది. ఈ మేరకు.. అసత్యపు, నిరాధార వ్యాఖ్యలతో మా పరువుకు భంగం కలిగించేలా మాట్లాడిన శ్రీశాంత్‌ను మూడేళ్ల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. సంజూకు మద్దతుగా ఉన్నందుకు తాము ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని.. అసోసియేషన్‌ను కించపరిచేలా మాట్లాడినందుకే ఇలా చేశామని స్పష్టం చేసింది.కాగా కేరళ క్రికెట్ లీగ్‌లో భాగంగా ఏరీస్ కొల్లామ్ సెయిలర్స్ ఫ్రాంఛైజీకి శ్రీశాంత్ సహ యజమానిగా ఉన్నాడు. అయితే, తమను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గానూ.. కేసీఏ శ్రీశాంత్‌తో పాటు కొల్లామ్ ఫ్రాంఛైజీతో పాటు అలెప్పీ టీమ్. కంటెంట్ క్రియేటర్ సాయి క్రిష్ణన్, అలెప్పీ రిపుల్స్కు కూడా నోటీసులు ఇచ్చింది.అయితే, షోకాజ్ నోటీసులకు శ్రీశాంత్ మినహా వీళ్లంతా తమకు సంతృప్తికర సమాధానాలు ఇచ్చారని కేసీఏ పేర్కొంది. అందుకే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపింది.టీమిండియా తరఫున సత్తా చాటుతూ.. ఇద్దరూ ఇద్దరేకాగా శ్రీశాంత్ 2005 నుంచి 2011 వరకు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. తన అంతర్జాతీయ కెరీర్లో ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్.. 27 టెస్టులు, 53 వన్డేలు. 10 అంతర్జాతీయ టీ20లు ఆడాడు. టెస్టుల్లో 87, వన్డేల్లో 75, టీ20లలో ఏడు వికెట్లు కూల్చాడు. టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011 గెలిచిన భారత జట్టలో అతడు సభ్యుడు.మరోవైపు.. కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ 2015లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 16 వన్డేలు, 42 టీ20 మ్యాచ్‌లు ఆడి.. 510, 861 పరుగులు చేశాడు. అతడి అంతర్జాతీయ కెరీర్లో ఒక వన్డే, మూడు టీ20 శతకాలు ఉండటం విశేషం. టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన భారత జట్టులో సంజూ ఉన్నాడు.చదవండి: వైభవ్ వయసు పిల్లలంతా హ్యాపీ.. ఎందుకింత ఓర్వలేని తనం? -
కొందరు కావాలంటే.. ఇంకొందరు వద్దంటున్నారు!
ప్రసార రంగంలో సమతుల్య నియంత్రణ విధానం అవసరమని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఛైర్మన్ అనిల్ కుమార్ లహోటి తెలిపారు. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్) 2025లో ఆయన పాల్గొని మాట్లాడారు. టీవీ, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల మధ్య నియంత్రణలో అసమానతలున్నాయని తెలిపారు. అందుకోసం సమతుల్య నియంత్రణ విధానం తోడ్పడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా న్యూ టారిఫ్ ఆర్డర్ (ఎన్టీఓ)పై సమీక్ష కొనసాగుతుందని తెలిపారు.పరస్పర విరుద్ధ డిమాండ్లుప్రధాన బ్రాడ్కాస్టర్లు, పంపిణీదారులు ప్రసార రంగంలో నియంత్రణను కోరుకోవడంలేదని లహోటి చెప్పారు. అందుకు వ్యతిరేకంగా స్థానిక కేబుల్ ఆపరేటర్లు, వినియోగదారులు బలమైన నియంత్రణ పర్యవేక్షణ కోరుతున్నట్లు తెలిపారు. ఈ పరస్పర వాదనల మధ్య సమతుల్యత సాధించడం, పరిశ్రమల వృద్ధిని ప్రోత్సహించడంతోపాటు వినియోగదారుల రక్షణను నిర్ధారించడం ట్రాయ్ లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొన్నారు.కొత్త టారిఫ్ ఆర్డర్‌పై సమీక్షస్ట్రీమింగ్ సేవలతో పోలిస్తే టీవీ బిల్లులు అధికంగా ఉండడం వల్ల పోటీ తగ్గిపోయిందనే అభిప్రాయాలున్నాయి. దాంతో అధికంగా ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లవైపే వినియోగదారులు మొగ్గు చూపుతున్నారనే వాదనలున్నాయి. ఈ సమస్య పరిష్కరించేందుకు కొత్త టారిఫ్ ఆర్డర్‌ను సమగ్రంగా సమీక్షించడానికి ట్రాయ్ ముందస్తు సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించింది. ఇందుకోసం టీవీ బ్రాడ్కాస్టర్లు, ఆపరేటర్ల అభిప్రాయాలు సేకరిస్తోంది. లీనియర్ టీవీ విధానం కఠినమైన ప్రభుత్వ ఆదేశిత ప్రోగ్రామింగ్, అడ్వర్టైజింగ్ కోడ్ల కింద పనిచేస్తుందని, డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు స్వీయ నియంత్రణను అనుసరిస్తాయని లహోటి అభిప్రాయపడ్డారు. ఇది న్యాయమైన పోటీపై ఆందోళనలను లేవనెత్తుతుందని చెప్పారు.ఇదీ చదవండి: హజ్ యాత్రకు ప్రత్యేక విమానాలుడిజిటల్ మీడియాను పర్యవేక్షించే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై), వార్తలు, క్యూరేటెడ్ కంటెంట్‌కు బాధ్యత వహించే సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఎంఐబీ) మధ్య అధికార పరిధిని ట్రాయ్ పరిశీలిస్తోందని లహోటి తెలిపారు. రెండింటి మధ్య స్థిరమైన నియంత్రణ సూత్రాల అవసరాన్ని నొక్కి చెప్పారు. -
యువతి దారుణ హత్య.. ఉలిక్కిపడ్డ విశాఖ
సాక్షి,విశాఖ: కూటమి పాలనలో మహిళలు,చిన్నారులకు రక్షణ లేకుండా పోతుంది. రాష్ట్రంలో మహిళలపై రోజుకో దాడులు, హత్యలు, హత్యాచారాలు జరుగుతున్నాయి. తాజాగా, విశాఖలో దారుణం చోటు చేసుకుంది. యువతి దారుణ హత్యకు గురైంది. హత్య అనంతరం యువతిని పెట్రోల్ పోసి తగలబెట్టారు దుండగులు.బీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని దాకమర్రి ఫార్చ్యూన్ లే అవుట్ సమీపంలో చోటు చేసుకుంది. ఈ దారుణంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
బీజేపీ మహిళా మంత్రికి వేధింపులు.. మేసేజ్‌లు.. యువకుడు అరెస్ట్
ముంబై: మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నాయకురాలు పంకజా ముండే (Pankaja Munde)ను వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని పూణేకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనలో కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు.వివరాల ప్రకారం.. మహారాష్ట్ర మంత్రి పంకజా ముండే (Pankaja Munde)ను కొద్దిరోజులుగా నిందితుడు వేధిస్తున్నాడు. తరచూ ఆమెకు ఫోన్లు చేస్తూ అసభ్యంగా మాట్లాడుతున్నాడు. అలాగే, అసభ్యకరమైన మెసేజ్‌లు పెడుతున్నాడు. దీంతో, మహారాష్ట బీజేపీ కార్యాలయానికి చెందిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ నిఖిల్ భమ్రే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని ట్రాక్ చేసి పట్టుకున్నారు.మహారాష్ట్ర (Maharastra) నోడల్ సైబర్ పోలీసులు (Nodal Cyber Police) అతడిని అరెస్ట్ చేశారు. ఇక, సదరు వ్యక్తిని పూణేకు చెందిన అమోల్ కాలే(25) గుర్తించారు. ఈ నేపథ్యంలో నిందితుడు ఎందుకు పంకజా ముండేను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడ్డాడు?. ఇందులో ఇంకా ఎవరి పాత్ర అయినా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. Breaking News 🚨A man, Amol Kale (25), was arrested for harassing Maharashtra Minister Pankaja Munde with obscene calls and messages. The accused, from Pune, admitted to the acts, and he was sent to police custody for further investigation under the IT Act: Maharashtra Cyber… pic.twitter.com/slTDkbntOc— The Statesman (@TheStatesmanLtd) May 2, 2025 -
సూర్య 'రెట్రో' Day 1 కలెక్షన్.. నాని కంటే తక్కువే
మే 1న 'హిట్ 3', 'రెట్రో' (Retro Movie) సినిమాలు థియేటర్లలో రిలీజయ్యాయి. వీటిలో నాని హిట్ 3 చిత్రానికి పాజిటివ్ టాక్ రాగా.. సూర్య సినిమాకు మాత్రం తెలుగులో డివైడ్ టాక్ వచ్చింది. తమిళంలో మాత్రం మిశ్రమ స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు తొలిరోజు కలెక్షన్ రివీల్ చేయగా.. ఇందులో సూర్యని నాని దాటేయడం విశేషం.మొదట నాని హిట్ 3 విషయానికొస్తే.. మొత్తంగా రూ.43 కోట్లకు పైనే గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు. మరోవైపు సూర్య(Suriya) రెట్రో చిత్రానికి ఓవరాల్ పోస్టర్ రిలీజ్ చేయలేదు. తమిళనాడులో రూ.17.75 కోట్లు, కేరళలో రూ.2.5 కోట్లు, కర్ణాటకలో రూ.3.07 కోట్ల వసూళ్లు వచ్చినట్లు పోస్టర్స్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'హిట్ 3' ఫస్ట్ డే కలెక్షన్స్.. నాని కెరీర్లో ఇదే టాప్)తెలుగు, ఓవర్సీస్ కలెక్షన్స్ మాత్రం 'రెట్రో' టీమ్ నుంచి రాలేదు. మొత్తంగా చూసుకుంటే (Day 1 Collection) రూ.30 కోట్లకు మించి అయితే సూర్య సినిమాకు రాలేదని అనిపిస్తుంది. ఈ లెక్కన చూసుకుంటే అటు టాక్ తో పాటు కలెక్షన్స్ విషయంలోనూ సూర్యని నాని దాటేసినట్లే అనిపిస్తుంది.రెట్రో రివ్యూ (Retro Review Telugu) విషయానికొస్తే.. పారివేల్ (సూర్య) చిన్నప్పుడే పుట్టిన ఊరికి దూరమవుతాడు. తిలక్ (జోజూ జార్జ్) అనే గ్యాంగ్ స్టర్ దగ్గర పెరుగుతాడు. పెద్దయ్యాక గ్యాంగ్ స్టర్ అవుతాడు. ఓ సందర్భంలో రుక్మిణి(పూజా హెగ్డే)ని ప్రేమిస్తాడు. పెళ్లి తర్వాత రౌడీ జీవితాన్ని వదిలేస్తానని అంటాడు. మరి పారివేల్ అనుకున్నట్లు జరిగిందా? సవతి తండ్రి తిలక్ తో ఎందుకు వైరం ఏర్పడింది? చివరకు పారివేల్-రుక్మిణి పెళ్లి చేసుకున్నారా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే) -
ఐపీఎల్ ప్రారంభం నుండి మొదట నిష్క్రమించిన జట్లు ఇవే..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. 49వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమితో ఈ సీజన్లో సీఎస్కే ఖేల్ ఖతమైంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఈ సీజన్లో సీఎస్కే మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మే 3న ఆర్సీబీ, మే 7న కేకేఆర్, మే 12న రాజస్థాన్, మే 18న గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.కాగా, ఓ ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలవడం ఐదు సార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ ఇది కొత్తేమీ కాదు. 2020 సీజన్లో కూడా ఆ జట్టు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. ఐపీఎల్ ప్రారంభం నుండి అత్యధిక సార్లు తొలుత ఎలిమినేట్ అయిన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. ఈ ఫ్రాంచైజీ అత్యధికంగా మూడు సీజన్లలో అన్ని జట్లకంటే ముందే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.ఢిల్లీ తర్వాత డెక్కన్ ఛార్జర్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, ఆర్సీబీ, సీఎస్కే, ముంబై ఇండియన్స్ తలో రెండు సీజన్లలో అన్నిటి కంటే ముందే టైటిల్ వేట నుంచి నిష్క్రమించాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, పూణే వారియర్స్ ఇండియా, కేకేఆర్, పంజాబ్ కింగ్స్ తలో సారి అన్ని జట్ల కంటే ముందే టైటిల్ వేటను ముగించాయి.సీజన్ల వారీగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి మొదట నిష్క్రమించిన జట్లు..2008- డెక్కన్ ఛార్జర్స్2009- కేకేఆర్2010- కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 2011- డెక్కన్ ఛార్జర్స్2012- కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 2013- పూణే వారియర్స్ ఇండియా 2014- ఢిల్లీ క్యాపిటల్స్2015- పంజాబ్ కింగ్స్2016- రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్2017- ఆర్సీబీ2018- ఢిల్లీ క్యాపిటల్స్2019- ఆర్సీబీ2020- సీఎస్కే2021- సన్‌రైజర్స్ హైదరాబాద్2022- ముంబై ఇండియన్స్2023- ఢిల్లీ క్యాపిటల్స్2024- ముంబై ఇండియన్స్2025- సీఎస్కేకాగా, ప్రస్తుత సీజన్లో సీఎస్కే ఎలిమినేట్ అయిన మరుసటి రోజే రాజస్థాన్ రాయల్స్ కూడా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం మరో రెండు జట్లు ప్రమాదం అంచుల్లో (ఎలిమినేషన్) ఉన్నాయి. వీటిలో సన్‌రైజర్స్ భవితవ్యం ఈ రోజే తేలిపోతుంది. కేకేఆర్ ఫేట్ డిసైడ్ కావాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే. ఇవాళ (మే 2) సన్‌రైజర్స్ గుజరాత్ టైటాన్స్‌ను వారి సొంత మైదానంలో ఢీకొట్టనుంది. -
విజయ్ దేవరకొండపై కేసు! ఎందుకంటే?
సాక్షి, హైదరాబాద్: హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) చిక్కుల్లో పడ్డాడు. గిరిజన ప్రజల గురించి తప్పుగా మాట్లాడారంటూ ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిషన్ రాజ్ చౌహాన్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే విజయ్‌పై కేసు నమోదైనట్లు తెలుస్తోంది.ఏం జరిగిందంటే?సూర్య హీరోగా నటించిన రెట్రో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా వెళ్లాడు. అతడు మాట్లాడుతూ.. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కశ్మీర్ ఇండియాది. కశ్మీరీలు మనవాళ్లే.. రెండేళ్ల క్రితం ఖుషీ సినిమా షూటింగ్ అక్కడే జరిపాం. అక్కడ చాలామంచి జ్ఞాపకాలున్నాయి. పాకిస్తాన్ వాళ్లు.. అక్కడి ప్రజలనే చూసుకోలేరు.. అలాంటిది ఇక్కడేం చేయాలని చూస్తున్నారో!ఇండియా.. పాకిస్తాన్‌పై దాడి చేయాల్సిన అవసరం లేదు. అక్కడి ప్రజలకే విరక్తి వచ్చి పాక్ ప్రభుత్వంపై తిరగబడతారు. 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ (గిరిజనులు) కొట్టుకున్నట్లు.. బుద్ధి లేకుండా, కనీస కామన్ సెన్స్ లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు. మనమంతా ఐకమత్యంగా ఉండాలి అని స్పీచ్ ఇచ్చాడు. ఉగ్రవాదులను గిరిజనులతో పోల్చడంపై వ్యతిరేకత వచ్చింది. What a speech anna @TheDeverakonda ❤️🙌🏻#RetrofromMay01 #VijayDevarakonda #KINGDOM pic.twitter.com/653qCLhlu8— The Revanth (@Revanth__7) April 26, 2025 చదవండి: 21 రోజుల్లో 15 కిలోలు తగ్గా.. ఆ సీక్రెట్ మాత్రం చెప్పను: రకుల్ భర్త -
‘భారత్.. నాకెన్నో పాఠాలు నేర్పింది.. కానీ ఇక్కడే ఉండలేను కదా!’
భారతదేశం విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలతో కలగలిసిన దేశం. ఈ దేశం తీరు నచ్చిందని ఎందరో విదేశీయులు తన పర్యాటన అనుభవాలను షేర్ చేసుకున్నారు. కొందరు ఇక్కడే ఉండాలని డిసైడ్ అయ్యారు కూడా. తాజాగా మరో విదేశీయుడు మన భారత్‌ని ఆకాశానికి ఎత్తేలా ప్రశంసల జల్లు కురిపించాడు. అంతేగాదు తాను కచ్చితంగా నేర్చుకోవాల్సిన పాఠాలను ఎన్నో నేర్పిందని చెబుతున్నాడు. అవేంటో అతడి మాటల్లోనే చూద్దామా..!.కెనడియన్ ట్రావెల్ కంటెంట్ సృష్టికర్త విలియం రోస్సీ మన భారతదేశం అంతటా ఐదు వారాలు పర్యటించాడు. ఈ సుడిగాలి పర్యటనలో తాను ఎలాంటి అనుభవాన్ని పొందానో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. తాను 37 దేశాలకు పైగా పర్యటించాను గానీ భారత్ లాంటి ఆశ్చర్యకరమైన దేశాన్ని చూడలేదన్నారు. ఇక్కడ పీల్చే గాలి, వాసన, కనిపించే దృశ్యాలు, రుచి అన్ని అనుభూతి చెందేలా.. ఆలోచించేలా ఉంటాయని అన్నాడు. అలా అని ఈ దేశంలోనే శాశ్వత నివాసం ఏర్పరుచుకోలేనని అన్నారు. అయితే ఈ ఐదు వారాల సుదీర్ఘ జర్నీలో భారతదేశ పర్యటన భావోద్వేగ, మానసిక మేల్కొలుపులా అనిపించిందని చెప్పారు. ఇక్కడ ఉండాలని భావించలేకపోయినా..ఏదో తెలియని భావోద్వేగం.. ఉండిపోవాలనే అనుభూతి అందిస్తోందన్నారు. వ్యక్తిగతంగా తాను తప్పక నేర్చుకోవాల్సిన పాఠాలను కూడా బోధించిందన్నారు. ఇక్కడ పర్యటించడంతోనే తన జీవితాన్ని పూర్తిగా మార్చేసేలా ప్రభావితం చేసిందన్నారు. ఇక్కడి కొత్త ప్రదేశాలు వాటి మాయజాలంతో కట్టిపడేశాయి. భారత్ ప్రజల దినచర్యలు అలవాటు చేసుకోమనేలా ఫోర్స్‌చేస్తున్నట్లు అనిపిస్తాయన్నారు. కృతజ్ఞత..ఒకే ప్రపంచంలో రెండు వాస్తవాలను చూపిస్తుందన్నాడు. ఇక్కడ ప్రజలందరూ భిన్నమైన పరిస్థితుల్లో జీవిస్తునన్నారు. ఒక్కరోజు సెలవుతో మిగతా రోజులన్ని కష్టపడి పనిచేయడం తనని ఆశ్చర్యపరిచిందన్నారు. అప్పుడే తనకు కృతజ్ఞత విలువ తెలిసిందన్నారు. ఎందుకంటే విశ్రాంతి తీసుకోవడం పట్ల చాలా కృతజ్ఞతగా ఉండాలని గట్టిగా తెలుసుకున్నా అన్నారు. అంతేగాదు నిద్రకు ఉపక్రమించేందుకు సురక్షితమైన స్థలం, ఆహారం నిల్వ చేసుకునే ఫ్రిడ్జ్ తదితరాలతో హాయిగా జీవితం గడిపేయగలమనే విషయం కూడా తెలుసుకున్నాని అన్నారు. షాకింగ్ గురిచేసే సంస్కృతులు ఆచారాలు.. ఇక్కడ ఉండే విభిన్న సంస్కృతులు ఆచారాలు గందరగోళానికి గురిచేసేలా షాకింగ్ ఉంటాయి. అయితే ఒక సంబరం లేదా వేడుక జరిగినప్పుడూ.. ఇచ్చే అందం, ప్రత్యేకత చాలా గొప్పదని అన్నారు. స్థానిక వంటకాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. ఇక్కడ భారతీయ సుగంధద్రవ్యాలు ఇంతకు ముందెన్నడూ అనుభవించని శక్తిని అందిస్తాయని అన్నారు. ఐకానిక్ తాజ్‌మహల్ గురించి ఒక పట్టాన అంచనా వేయడం సాధ్యం కాదన్నారు. అయితే ఇక్క ఏ ఫోటో అయినా అద్భుతంగా ఉంటుందన్నారు. మరో ముఖ్యమైన విషయం ప్రజల దయ తనని ఎంతగానో ఆకట్టుకుందని చెప్పారు. ఇక్కడ ఆతిథ్యం మాత్రం సాటిలేనిదని ప్రశంసించాడు. ఎవరీ విలియం రోస్సీలింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, విలియం ఒకప్పుడూ ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా ఆరు అంకెలా జీతంతో పనిచేసేవారు. తర్వాత పూర్తి సమయం పర్యాటనలు, కంటెంట్ క్రియేటర్‌గా రాణించేందుకు మంచి ఉద్యోగ ఆఫర్లను వదులుకున్నాడు. ప్రస్తుతం తన వ్యక్తిగత అభివృద్ధి బ్రాండ్ స్ప్రౌట్ నడుపుతూ..వృద్ధి, మనస్తత్వం, అనుభవాల శక్తిపై దృష్టిసారిస్తున్నాడు. కాగా, నెటిజన్లు మా భారతదేశ సంక్లిష్టతను గౌరవించినందుకు ధన్యవాదాలు. అలాగే నిజాయితీగా అనుభవాలను పంచుకున్నందుకు అభినందించకుండా ఉండలేకపోతున్నాం అంటూ విలియంపై ప్రశంసల జల్లు కురిపించారు. View this post on Instagram A post shared by William Rossy (@sprouht) (చదవండి: స్లిమ్‌గా బాలీవుడ్ చిత్ర నిర్మాత హన్సల్ మెహతా.. మౌంజారోతో పది కిలోలు..!) -
‘శశి థరూర్ నా పక్కన ఉన్నారు.. వారికి నిద్రలేని రాత్రులే’
తిరువనంతపురం: కేరళ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విజింజం అంతర్జాతీయ ఓడరేవును ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఓడరేవును ఆయన జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో మోదీతో పాటు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై ప్రధాని మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు.‘‘ఇవాళ శశి థరూర్ ఇక్కడ కూర్చున్నారు. ఈ వేదికపై ఆయన ఉండటం కొందరికి నచ్చదు. కొందరికి ఇది నిద్రలేని రాత్రులను మిగులుస్తుంది. ఈ సందేశం ఎక్కడికి వెళ్లాలో అక్కడికి చేరుకుంటుంది’’ అంటూ మోదీ చురకలు అంటించారు. కేరళ సీఎం విజయన్ సమక్షంలోనే ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.కాగా.. గురువారం రాత్రి కేరళ చేరుకున్న ప్రధానిని.. శశి థరూర్ స్వయంగా వెళ్లి స్వాగతించిన సంగతి తెలిసిందే. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారాయి. ‘‘ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానాల ఆలస్యం ఉన్నప్పటికీ.. సమయానికి తిరువనంతపురం చేరుకోగలిగా.. నా నియోజకవర్గానికి వచ్చిన మోదీని సాదరంగా స్వాగతించా’’ అంటూ శశి థరూర్ ట్వీట్ కూడా చేశారు.శశిథరూర్ గత కొన్ని నెలలుగా తన సొంత పార్టీపై అసంతృప్తిగా ఉన్న తెలిసిందే. ఇటీవల ఓ కేంద్ర మంత్రితో ఆయన సెల్ఫీ దిగడంతో థరూర్ పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. భారత విదేశాంగ విధానాన్ని ప్రశంసిస్తూ కూడా ఆయన ప్రశంసించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంతో ఇవాళ ఆయన ప్రధాని మోదీతో వేదిక పంచుకోవడం చర్చనీయాంశంగా మారింది.కాగా, భారత సముద్ర వాణిజ్య చరిత్రలో కొత్త చరిత్రను లిఖించిన విజింజం అంతర్జాతీయ ఓడరేవు.. సముద్ర రవాణాకు కీలకమైన కేంద్రంగా మారనుంది. దేశంలో మొట్టమొదటి సెమీ ఆటోమేటెడ్ ఓడరేవు అయిన విజింజం ఓడరేవు ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాంకేతికంగా అధునాతనమైన ట్రాన్స్షిప్మెంట్ ఓడరేవులలో ఒకటిగా నిలిచింది. -
అవును.. ప్రేమలో ఉన్నాం!.. ఇంతకీ ఎవరీమె?
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) ఎట్టకేలకు తన ప్రేమ బంధాన్ని బహిర్గతం చేశాడు. సోఫీ షైన్ (Sophie Shine)తో కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్నట్లు సోషల్ మీడియా పోస్టు ద్వారా ధ్రువీకరించాడు. కాగా భారత జట్టు ఓపెనర్‌గా ఎన్నో ఘనతలు సాధించిన శిఖర్.. ఆ తర్వాత జట్టులో చోటే కరువు కావడంతో ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇక వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు శిఖర్ ధావన్. ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషా ముఖర్జీ (Aesha Mukherjee)అనే డివోర్సీని 2011లో పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉండగా వారిని తన సొంత కూతుళ్లలా చూసుకుంటానని గబ్బర్ పలు సందర్భాల్లో వెల్లడించాడు.భార్యతో విడాకులుఇక శిఖర్- ఆయేషాలకు జొరావర్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే, ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ జంట మధ్య విభేదాలు తలెత్తి విడాకులకు దారితీసింది. 2023లో శిఖర్- ఆయేషాలకు విడాకులు మంజూరయ్యాయి.అప్పటి నుంచి నుంచి ఒంటరిగా ఉంటున్న శిఖర్ ధావన్.. కనీసం తన కుమారుడిని కలిసేందుకు కూడా పరిస్థితులు అనుకూలంగా లేవంటూ పలు సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను పంచుకున్నాడు. ఇక ఇప్పుడు అతడు సోఫీ రూపంలో మరోసారి ప్రేమను వెదుక్కున్నాడు.ఇంతకీ ఎవరీ సోఫీ షైన్?సోఫీ షైన్ ఐర్లాండ్‌కు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. ఐర్లాండ్‌లోనే విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె.. మార్కెటింగ్- మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేసింది.ఇక ప్రస్తుతం నార్తర్న్ ట్రస్ట్ కార్పొరేషన్ అనే కంపెనీలో సెకండ్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో సోఫీ పనిచేస్తున్నట్లు సమాచారం. ఇది అమెరికన్ ఫైనాన్షియల్ కంపెనీ అని తెలుస్తోంది.ఇక వృత్తిరీత్యా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉంటున్న సోఫీకి అక్కడే శిఖర్‌తో పరిచయమైనట్లు సమాచారం. ఈ క్రమంలో స్నేహం ప్రేమగా మారి ఇద్దరూ సహజీవం చేస్తున్నట్లు సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలుస్తోంది.అందమైన మహిళే నా గర్ల్ఫ్రెండ్కొన్నిరోజుల క్రితం శిఖర్ ధావన్ ఓ కార్యక్రమంలో పాల్గొనగా.. అతడి రిలేషన్షిప్ గురించి ప్రశ్న ఎదురైంది. ప్రేయసి పేరు చెప్పాలంటూ గబ్బర్ను యాంకర్ ప్రశ్నించగా.. ‘‘నేను పేరు మాత్రం చెప్పను.. అయితే, ఇక్కడే ఉన్న అమ్మాయిల్లోకెల్లా అందమైన మహిళే నా గర్ల్‌ఫ్రెండ్’’ అని చెప్పాడు. అంతలో లైట్ సోఫీ ముఖంపై పడింది.ఇక తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో.. సోఫీతో దిగిన ఫొటోను షేర్ చేసిన ధావన్.. ‘‘మై లవ్’’ అంటూ అధికారికంగా తమ బంధం గురించి అభిమానులతో పంచుకున్నాడు. అయితే, పెళ్లి గురించి మాత్రం ఇంకా కన్ఫామ్ చేయలేదు.కాగా 2010 నుంచి 2022 మధ్య శిఖర్ ధావన్ టీమిండియా తరఫున అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడాడు. తన కెరీర్లో 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో 2315, 6793, 1759 పరుగులు సాధించాడు.భారత జట్టు మేటి ఓపెనర్‌గా పేరొందిన శిఖర్ ధావన్ ఖాతాలో ఏడు టెస్టు, 17 వన్డే శతకాలు ఉన్నాయి. ఇక ఐపీఎల్లో ఏకంగా 222 మ్యాచ్‌లు ఆడిన ఈ ఢిల్లీ స్టార్.. రెండు సెంచరీలు, 51 అర్ధ శతకాల సాయంతో 6768 పరుగులు సాధించాడు. చదవండి: పిల్లలంతా హ్యాపీ అంటూ ట్రోలింగ్!.. వైభవ్‌ను ఓదార్చిన రోహిత్.. ఆటలో ఇవి మూమూలే -
మంగళూరులో హై అలర్ట్.. పోలీసుల కంట్రోల్లో సిటీ
బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరులో ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. రౌడీ షీటర్ హత్య కారణంగా పోలీసుల హై అలర్ట్ ప్రకటించి.. నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మత ఘర్షణలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుత పరిస్థితులను టార్గెట్ చేసిన బీజేపీ.. కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ పాలనలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నదని ఆరోపిస్తున్నారు.వివరాల ప్రకారం.. మంగళూరులో రౌడీషీటర్ సుహాస్ శెట్టి హత్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. గురువారం రాత్రి స్నేహితులతో కలిసి కారులో వెళ్తున్న సుహాస్‌పై అటాక్ జరిగింది. నిన్న రాత్రి 8:30 గంటలకు సుహాస్ తన స్నేహితులతో కలిసి బాజ్‌పేలోని కిన్నికంబ్లాలో కారులో ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో ఆరుగురు ప్రత్యర్థులు కారును అడ్డగించి వాహనంపై దాడి చేశారు. అనంతరం, కారులోంచి సుహాస్ శెట్టిని బయటకు లాగి విచక్షణారహితంగా కత్తులతో, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ దాడి తర్వాత.. సుహాస్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే సుహాస్ మరణించినట్టు వైద్యులు వెల్లడించారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మత ఘర్షణలు జరగకుండా హై అలర్ట్ ప్రకటించారు. భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మంగళూరు ఏడీజీపీ హితేంద్ర మాట్లాడుతూ.. ‘సుహాస్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోస్ట్‌మార్టం జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి నిందితులను గుర్తించాం. పోలీస్ బృందాలు వారి కోసం గాలిస్తున్నాయి. మంగళూరు పౌరులు ప్రశాంతంగా ఉండాలి. ఎవరినీ వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఇది శాంతిభద్రతల వైఫల్యం కాదు’ అని అన్నారు.ఇదిలా ఉండగా.. సుహాస్ శెట్టిపై కనీసం ఐదు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. జూలై 2022లో బీజేపీ యువ మోర్చా నాయకుడు ప్రవీణ్ నెట్టారు హత్య జరిగిన కొద్ది రోజులకే సూరత్కల్లో 23 ఏళ్ల యువకుడు ఫాజిల్‌ను హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడిగా ఉన్నాడు. ఫాజిల్ హత్యకు ప్రతీకారంగానే ప్రస్తుతం ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు.. సుహాస్ శెట్టి హత్య నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని బీజేపీ నేతలు ఆరోపించారు. సుహాస్ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక, వీహెచ్‌పీ నేతలు.. మంగళూరులో బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో, మంగళూరులో పలుచోట్ల దుకాణాలను మూసివేశారు. బస్సు సర్వీసులను నిలిపివేశారు. *Murder accused Suhas Shetty killing at BajpeProhibitory orders imposed under Section 163 of the BNS in Mangaluru City Commissionerate limits between 6am on May 2 to 6am on May 6VHP has given bandh call in DK condemning murder @XpressBengaluru @ramupatil_TNIE @vinndz_TNIE pic.twitter.com/2QTIpMBy8H— Divya Cutinho_TNIE (@cutinha_divya) May 2, 2025 -
హజ్ యాత్రకు ప్రత్యేక విమానాలు
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ హజ్ 2025 యాత్రికులకు అంతరాయంలేని ప్రయాణాన్ని అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపింది. హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా విమాన సర్వీసులు ప్రారంభించినట్లు ప్రకటించింది. గయ, శ్రీనగర్, గౌహతి, కోల్‌కతాలను సౌదీ అరేబియాతో కలుపుతూ మొదటి దశలో 45 విమానాలను నడపనుంది. మొదటి దశ కార్యకలాపాలు 2025 మే 29 వరకు కొనసాగుతాయని పేర్కొంది.సర్వీసులు ఇలా..గౌహతి నుంచి మెదీనా వరకు మే 3 నుంచి సర్వీసులు ప్రారంభం.శ్రీనగర్ నుంచి మెదీనా వరకు మే 4 నుంచి మొదలు.కోల్‌కతా నుంచి జెడ్డాకు మే 16న విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయి.2025 జూన్ 13 నుంచి జులై 11 వరకు హజ్ యాత్ర కొనసాగనుంది.ఇదీ చదవండి: ‘డీఓజే ప్రతిపాదనలు పూర్తి ప్రతికూలం’యాత్రికుల సామర్థ్యం పెంపుస్పైస్జెట్ సుమారు 15,500 మంది యాత్రికులను తీసుకువెళ్లాలని అంచనా వేసింది. ఇది 2024లో రవాణా చేసిన 13,000 మంది ప్రయాణికులతో పోలిస్తే 18% పెరుగుదలను సూచిస్తుంది. ఈ పెరుగుదల హజ్ కార్యకలాపాల్లో విమానయాన సంస్థ విస్తరిస్తున్న పాత్రను, భారతీయ యాత్రికుల అవసరాలను తీర్చడంలో సంస్థ నిబద్ధతను హైలైట్ చేస్తుంది. ప్రయాణీకుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి స్పైస్‌జెట్ రెండు వైడ్ బాడీ ఎయిర్ బస్ ఏ 340 విమానాలను ఫ్లీట్‌లో చేర్చింది. ఒక్కొక్కటి 324 మంది ప్రయాణీకులను తీసుకెళ్లగలదు. ఈ విమానాలు శ్రీనగర్, గౌహతి నుంచి మెదీనా వరకు, కోల్‌కతా నుంచి జెడ్డా వరకు నడుస్తాయి. అదనంగా గయా-మెదీనా మార్గంలో 189 సీట్ల బోయింగ్ 737ను ప్రారంభించనున్నారు. -
ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి శుక్రవారం కాకుండా గురువారం (మే 01) పబ్లిక్ హాలీ డే కావడంతో హిట్ 3, రెట్రో, రైడ్ 2 తదితర చిత్రాలు థియేటర్లలో రిలీజయ్యాయి. వీటిలో హిట్ 3కి తెలుగులో పాజిటివ్ టాక్ వచ్చింది. మరోవైపు ఓటీటీల్లోనూ ఏకంగా 30 సినిమాలు స్ట్రీమింగ్ లోకి వచ్చేశాయి.(ఇదీ చదవండి: నానికి బిగ్ షాక్.. ఆన్లైన్లో హిట్ 3 హెచ్డీ ప్రింట్ లీక్!)ఓటీటీలోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే చాలావరకు తెలుగు కంటే హిందీ, తమిళ, మలయాళ చిత్రాలే ఈ వీకెండ్ అందుబాటులోకి వచ్చాయి. ఏకంగా 29 వరకు సినిమాలు ఈ రెండు రోజుల్లోనే రావడం విశేషం. ఇంతకీ ఆ మూవీస్ ఏంటి? ఏయే ఓటీటీల్లో ఏది స్ట్రీమింగ్ అవుతుందనేది చూద్దాం.ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చిన మూవీస్ (మే 01-02)అమెజాన్ ప్రైమ్ఈఎమ్ఐ - తమిళ మూవీఈడీ (ఎక్స్ ట్రా డిస్కౌంట్) - మలయాళ చిత్రంవలియంట్ వన్ - ఇంగ్లీష్ సినిమా ఇంపీరియల్ లైవ్ టూర్ - కన్సర్ట్ మూవీస్కూల్ స్పిరిట్ - ఇంగ్లీష్ సిరీస్బడ్డీ - హిందీ డబ్బింగ్ సినిమాఎనదర్ సింపుల్ ఫేవర్ - తెలుగు డబ్బింగ్ మూవీకరెబెటే - కన్నడ సినిమామాన్ సూన్ బేబీ - జర్మన్ మూవీఔసిప్పింటే ఒసీయాతు - మలయాళ సినిమాశ్రీ గణేశ - మరాఠీ మూవీనెట్ ఫ్లిక్స్బ్యాడ్ బాయ్ - ఇజ్రాయెలీ సిరీస్పారా రెస్క్యూ జంపర్ - జపనీస్ సిరీస్జీఏటీఏఓ - మాండరిన్ మూవీద బిగ్గెస్ ఫ్యాన్ - స్పానిష్ సినిమాద క్లీసే - థాయ్ మూవీద రాంగ్ వే టూ హీలింగ్ మ్యూజిక్ - జపనీస్ సిరీస్ద ఫోర్ సీజన్స్ - తెలుగు డబ్బింగ్ సిరీస్హాట్ స్టార్కుల్: ద లెగసీ ఆఫ్ రైజింగ్స్ - హిందీ సిరీస్ 100 ఫుట్ వేవ్ సీజన్ 3 - ఇంగ్లీష్ డాక్యుమెంట్ సిరీస్ద బ్రౌన్ హార్ట్ - ఇంగ్లీష్ డాక్యుమెంటరీ (మే 03)ఆహావేరే లెవల్ ఆఫీస్ సీజన్ 2 - తెలుగు సిరీస్వరుణన్ - తమిళ సినిమాజీ5కోస్టాకో - హిందీ మూవీసన్ నెక్స్ట్కాలా పత్తర్ - కన్నడ సినిమాబ్లూ స్టార్ - తమిళ మూవీపరమణ్ - తమిళ సినిమాసోనీ లివ్బ్రొమాన్స్ - తెలుగు డబ్బింగ్ సినిమాబ్లాక్, వైట్ అండ్ గ్రే - హిందీ సిరీస్లయన్స్ గేట్ ప్లేద బాయు - తెలుగు డబ్బింగ్ మూవీ(ఇదీ చదవండి: 'హిట్ 3' ఫస్ట్ డే కలెక్షన్స్.. నాని కెరీర్లో ఇదే టాప్) -
కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. పాక్‌కు వెయ్యి కిలోమీటర్ల దూరంలో భారత్ ఫైటర్ జెట్లు
లక్నో: పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో పాకిస్తాన్‌కు కేవలం వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్ గంగా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఫైటర్ జెట్లు విన్యాసాలు చేయడం చర్చాంశనీయంగా మారింది.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు చేస్తున్నయుద్ధ విమానాల్లో రాఫెల్, మిగ్-29, మిరాజ్ 2000 ఉన్నాయి. ఈ యుద్ధ విమానాల్ని రాత్రి వేళ్లల్లో ల్యాండ్ చేసేలా అందుబాటులోకి తెచ్చిన యూపీ షాజహాన్పూర్లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై నిర్మించిన నైట్ ల్యాండింగ్ స్ట్రిప్‌పై విన్యాసాలు ప్రదర్శిస్తున్నాయి. 3.5 కిలోమీటర్ల పొడవు గల ఈ ఎయిర్‌స్ట్రిప్ రాత్రి సమయంలో ఫైటర్ జెట్లు ల్యాండింగ్లకు అనుకూలంగా ఉంటుంది. ఇది ఎయిర్ ఫోర్స్ జెట్లు 24 గంటలూ ఆపరేషన్లకు వీలు కల్పించడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో ఎక్స్‌ప్రెస్‌వేను ప్రత్యామ్నాయ రన్‌వేగా ఉపయోగించగల సామర్థ్యాన్ని అంచనా వేయడంలో సహాయపడుతుంది.దీంతో, ఉత్తరప్రదేశ్‌లో మొత్తం నాలుగు ఎక్స్‌ప్రెస్‌వే ల్యాండింగ్ స్ట్రిప్‌లు అందుబాటులో ఉండగా.. షాజహాన్పూర్లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై ల్యాండింగ్ స్ట్రిప్ మాత్రమే రాత్రివేళల్లో ఫైటర్ జెట్లను ల్యాండ్ చేసుకోవచ్చు. ఈ ఆధునిక ఎయిర్‌స్ట్రిప్ ఎక్స్‌ప్రెస్‌వేపై నిర్మించబడిన భారత్‌లో తొలి రన్‌వేగా నిలిచింది. ఇది రాత్రింబవళ్ళూ మిలిటరీ ఆపరేషన్లకు అనుకూలంగా రూపొందించింది. భద్రతను నిర్ధారించేందుకు రన్‌వే ఇరుప్రక్కల 250 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. Indian Air Force jets are carrying out a flypast on the Ganga Expressway airstrip.3.5 kms long airstrip is India’s first night landing airstrip on an expressway - night landing trials scheduled today evening. pic.twitter.com/AaJt9RoTEv— The Uttar Pradesh Index (@theupindex) May 2, 2025గంగా ఎక్స్‌ప్రెస్‌వే ఎయిర్‌స్ట్రిప్‌పై ల్యాండింగ్ చేసే ఇండియన్ ఎయిర్స్ యుద్ధ విమానాల ప్రత్యేకతలు రాఫెల్: ఆధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, లాంగ్-రేంజ్ మీటియర్ క్షిపణులతో నిండి ఉంది. పరిస్థితులు ఎలా ఉన్నా సరే 100 కిలో మీటర్ల నుంచి 150 కిలోమీటర్ల శత్రు స్థావరాల్ని నేలమట్టం చేయడంలో దిట్టఎస్‌యు-30 ఎంకేఐ: ఇండియా-రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ట్విన్-సీటర్ యుద్ధవిమానం. ఈ ఎస్‌యూ-30 ఎంకేఐ దూరంలో ఉన్న లక్ష్యాల్ని దాడులు చేయగలిగే సామర్థ్యంతో పాటు బ్రహ్మోస్ వంటి క్షిపణులను మోసుకెళ్లగలదు.మిరాజ్ 2000: ఫ్రెంచ్ మూలాలున్న, హై-స్పీడ్ డీప్ స్ట్రైక్ మిషన్స్‌కు అనువైన యుద్ధవిమానం, ఇది అణ్వాయుధ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఫిబ్రవరి 2019లో జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు భారత వైమానిక దళానికి చెందిన 12 మిరాజ్-2000 యుద్ధ విమానాలను వినియోగించింది.మిగ్-29: వేగం, ఎత్తు పరంగా అత్యుత్తమ ప్రదర్శనతో పాటు రాడార్ల కళ్లుగప్పి శుత్రు స్థావరాల్ని నాశనం చేస్తుంది. జాగ్వార్: గ్రౌండ్ అటాక్, యాంటీ-షిప్ మిషన్ల కోసం రూపొందించబడిన ప్రిసిషన్ స్ట్రైక్ ఎయిర్‌క్రాఫ్ట్. దీని ప్రత్యేకతలు.. శత్రు నౌకలను గుర్తించడం, లక్ష్యంగా చేసుకోవడం, నాశనం చేస్తుంది. ఈ యాంటీ-షిప్ మిషన్లు సాధారణంగా విమానాలు, జలాంతర్గాములు, ఉపరితల నౌకలు లేదా నావికా ముప్పు నుంచి తప్పించుకునేందుకు ఉపయోగిస్తారు. సి-130 జె సూపర్ హెర్కులిస్: హెవీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్, స్పెషల్ ఫోర్స్ మిషన్లు, విపత్తు సహాయం, రక్షణ కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తుంది.ఏఎన్-32: ఎత్తైన ప్రాంతాల్లో సైనికులు, సరఫరాలు తరలించేందుకు అనుకూలమైన ట్రాన్స్పోర్ట్ విమానం.ఎంఐ-17 వి5 హెలికాప్టర్: సెర్చ్ అండ్ రిస్క్యూ, మెడికల్ ఎవాక్యుయేషన్, మానవతా సహాయం వంటి బహుళ పనుల కోసం ఉపయోగించే హెలికాప్టర్. -
పని మనిషికి రూ.83 లక్షల జీతం..
సాధారణంగా ఇళ్లలో పనిచేసే వారంటే చిన్న చూపు చూస్తారు. వారి సంపాదన కూడా చాలా తక్కువగానే ఉంటుంది. కానీ ప్రపంచంలో ఏ వృత్తీ తక్కువ కాదు. ఆ మాటకొస్తే ఐటీ, ఇతర ఉద్యోగాల కంటే పని మనుషులకే ఎక్కువ డిమాండ్. దుబాయ్‌లో పనిమనుషుల కోసం ఇచ్చిన ఉద్యోగ ప్రకటనే ఇందుకు నిదర్శనం. జీతం ఎంతనుకున్నారు? ఏకంగా నెలకు రూ.7 లక్షలు.దుబాయ్ కు చెందిన ఓ స్టాఫింగ్ ఏజెన్సీ రెండు హౌస్ మేనేజర్ (పని మనిషి) ఉద్యోగాల కోసం ఇచ్చిన నియామక ప్రకటన ఇంటర్నెట్ ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ ఉద్యోగానికి నెలకు 30,000 ఈఏఈ దిరమ్లు అంటే భారతీయ కరెన్సీలో రూ.7 లక్షలు ఇస్తామని అందులో ప్రకటించారు. దీన్ని సంవత్సరానికి లెక్కేస్తే దాదాపు రూ.83 లక్షలు. భారత్‌లో చాలా మంది ఐటీ, టెక్, ఫైనాన్స్ నిపుణులకు కూడా ఇంత జీతం లేదు. చెప్పాలంటే ఇది దుబాయ్‌లో కూడా ఎక్కువ జీతమే. దీంతో కొందరు సోషల్ మీడియా యూజర్లు ఈ పనిమనిషి కొలువు కోసంతమ ప్రస్తుత ఉద్యోగాలను వదులుకుంటామంటూ జోక్ చేస్తున్నారు.మిడిల్ ఈస్ట్ లోని సంపన్న, రాజకుటుంబాల ఇళ్లలో పనిచేసేందుకు నైపుణ్యమున్న పనివారిని సమకూర్చే రిక్రూట్ మెంట్ ఏజెన్సీ రాయల్ మైసన్ ఇటీవల అబుదాబి, దుబాయ్ లలో వీఐపీ క్లయింట్ల ఇళ్లలో పని చేసేందుకు ఇద్దరు పనిమనుషులు కావాలంటూ ఈ ప్రకటన ఇచ్చింది. "మేము ప్రస్తుతం మా ప్రతిష్ఠాత్మక జట్టులో చేరడానికి నైపుణ్యం, అంకితభావం కలిగిన ఫుల్ టైమ్ హౌస్ మేనేజర్‌ను వెతుకుతున్నాము. ఈ ఉద్యగానికి నెలకు 30,000 దిరమ్‌ల ఆకర్షణీయమైన వేతనం ఉంటుంది" అని రాయల్ మైసన్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొంది.ఎంపికైన అభ్యర్థులు లగ్జరీ ఇళ్లలో రోజువారీ పనులు చూసుకోవాల్సి ఉంటుంది. ఇతర పనివాళ్లను పర్యవేక్షించడంతోపాటు ఇంటి ఖర్చుల నిర్వహణ బాధ్యతలు కూడా ఉంటాయని జాబ్ లిస్టింగ్ పేర్కొంది. అయితే ఈ పనిమనిషి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారికి ఇంతకు ముందు లగ్జరీ ఇళ్లలో పనిచేసిన అనుభవం ఉండాలి. -
IPL 2025: వైభవ్ సూర్యవంశీపై సీఎస్కే మాజీ ఓపెనర్ సంచలన కామెంట్స్
ఐపీఎల్లో తన మూడో ఇన్నింగ్స్‌లోనే విధ్వంసకర శతకం (35 బంతుల్లో) బాది బేబీ బాస్‌గా గుర్తింపు తెచ్చుకున్న 14 ఏళ్ల రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీపై చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఓపెనర్ అభినవ్ ముకుంద్ సంచలన కామెంట్స్ చేశాడు. రాయల్స్ సూర్యవంశీని వేలంలో కొనుగోలు చేయాల్సింది కాదని అభినవ్ అభిప్రాయపడ్డాడు. రాయల్స్ యాజమాన్యం సూర్యవంశీతో పాటు నితీశ్ రాణాపై అనవసర పెట్టుబడి పెట్టిందని అన్నాడు. తానైతే సూర్యవంశీని రూ. 1.1 కోట్లకు, నితీశ్ రాణాను రూ. 4.2 కోట్లకు కొనుగోలు చేసేవాడిని కాదని తెలిపాడు.వైభవ్, నితీశ్‌పై పెట్టిన పెట్టుబడిని మంచి బౌలర్ల కోసం వినియోగించుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. రాయల్స్ మేనేజ్మెంట్ బ్యాటర్ల మోజులో పడి బౌలింగ్ విభాగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని అన్నాడు. ఈ సీజన్లో ఆర్చర్ ఒక్కడే తీసుకున్న డబ్బుకు న్యాయం చేశాడని పేర్కొన్నాడు. రాయల్స్ యాజమాన్యం ఎంపిక చేసుకున్న భారత్ బౌలర్లలో (తుషార్ దేశ్‌పాండే, యుద్ద్‌వీర్ సింగ్, ఆకాశ్ మధ్వాల్, కుమార్ కార్తికేయ) ఒక్కరు కూడా సత్తా చాటలేకపోయారని అన్నాడు. తుషార్ దేశ్‌పాండేపై రూ. 6.75 కోట్ల పెట్టుబడి పెట్టి అనవసరంగా డబ్బును వృధా చేసుకున్నారని అన్నాడు. గత సీజన్లో తమ పంచన ఉన్న బౌల్ట్, చహల్, ఆవేశ్ ఖాన్, అశ్విన్‌ను వదిలేసి రాయల్స్ యాజమాన్యం మూల్యం చెల్లించుకుందని అభిప్రాయపడ్డాడు. మొత్తంగా మెగా వేలంలో రాయల్స్ ఎంపికలను తప్పుబట్టాడు.కాగా, ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఇదివరకే సత్తా చాటిన ఆటగాళ్లను వేలానికి వదిలేసి పెద్ద తప్పిదం చేసింది. బ్యాటింగ్‌లో బట్లర్, బౌలింగ్‌లో చహల్, బౌల్ట్ ఆ జట్టుకు ఎన్నో అపురూప విజయాలు అందించారు. వీరిని కాదని రాయల్స్ యాజమాన్యం యువ ఆటగాళ్లపై పెట్టుబడి పెట్టి చేతులు కాల్చుకుంది. ఎన్నో అంచనాలు పెట్టి కొనుగోలు చేసిన లంక స్పిన్ ద్వయం హసరంగ, తీక్షణ ఆశించిన ప్రభావం చూపలేకపోయారు. రిటైన్ చేసుకున్న వారిలో కెప్టెన్ శాంసన్ గాయంతో సైడ్ అయిపోగా.. జురెల్, హెట్‌మైర్ దారుణంగా విఫలమయ్యారు. నితీశ్ రాణా ఒక్క మంచి ఇన్నింగ్స్‌కే పరిమితమయ్యాడు. పరాగ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పి అతడి కాస్తో కూస్తో ఫామ్‌ను చెడగొట్టుకున్నారు. సూర్యవంశీ ఫేట్‌ను నాలుగు మ్యాచ్‌లకే డిసైడ్ చేయలేని పరిస్థితి.ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ కథ ముగిసింది. నిన్న (మే 1) ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమితో ఆ జట్లు ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన రాయల్స్ ఏకంగా 8 పరాజయాలు మూటగట్టుకుంది. కేవలం మూడే విజయాలు సాధించింది. కొన్ని గెలవాల్సిన మ్యాచ్‌ల్లో అనూహ్యంగా ఓటమిపాలైంది. ఈ సీజన్లో రాయల్స్ మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. తమ తదుపరి మ్యాచ్‌ల్లో కేకేఆర్ (మే 4), సీఎస్కే (మే 12), పంజాబ్ (మే 16) జట్లను ఢీకొట్టనుంది. -
వైభవ్ వయసు పిల్లలంతా హ్యాపీ!.. ఎందుకింత ఓర్వలేనితనం?
రాజస్తాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)కి చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్ టైటాన్స్‌తో గత మ్యాచ్‌లో శతక్కొట్టిన పద్నాలుగేళ్ల ఈ పిల్లాడు.. గురువారం ముంబై ఇండియన్స్ (RR vs MI)తో మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు.రెండు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. ముంబై పేసర్ దీపక్ చహర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి విల్ జాక్స్‌కు క్యాచ్ ఇచ్చిన వైభవ్ పెవిలియన్ చేరకతప్పలేదు. ఫలితంగా 218 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌కు ఇలా ఆరంభంలోనే షాక్ తగిలింది.ముంబై బౌలర్ల ధాటికి మిగతా బ్యాటర్లు కూడా చేతులెత్తేయడంతో రాజస్తాన్ 16.1 ఓవర్లలో కేవలం 117 పరుగులకే ఆలౌట్ అయింది. తద్వారా ఏకంగా 100 పరుగుల భారీ తేడాతో ముంబై చేతిలో చిత్తుగా ఓడి.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.వైభవ్ వయసు పిల్లలంతా హ్యాపీ!.. ఎందుకింత ఓర్వలేనితనం?ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ బ్యాటర్లంతా విఫలమైనా సోషల్ మీడియా మాత్రం వైభవ్ సూర్యవంశీపైనే ఎక్కువగా దృష్టి సారించింది. ఆటలో ఇవన్నీ సహజమేనని కొంత మంది అతడికి అండగా నిలుస్తుంటే.. మరికొంత మంది మాత్రం విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.‘‘చిన్న వయసులో విజయవంతం కావడం బాగానే ఉంటుంది. కానీ ప్రతిసారీ అదృష్టం కలిసి రాదు.. ఈరోజు వైభవ్ వయసు పిల్లలంతా సంతోషపడి ఉంటారు.. ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు అతడిని చూపించి వారి పిల్లలకు గట్టిగా క్లాసులు ఇస్తున్నారు.. అందుకే ఈ ఒక్కరోజు వారికి ఉపశమనం కలిగి ఉంటుంది.. ఇక చాలు వైభవ్ నువ్వు కూడా వెళ్లి హోం వర్క్ చేసుకో’’ అంటూ పద్నాలుగేళ్ల వయసులోనే సంచలనాలు సృష్టించిన అతడిని ఓర్వలేక విద్వేషం చిమ్ముతున్నారు.వైభవ్‌ను ఓదార్చిన రోహిత్మరోవైపు.. వైభవ్ అవుట్ కాగానే ముంబై ఇండియన్స్ స్టార్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అతడిని ఓదార్చిన తీరు మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది. వైభవ్ వెన్నుతట్టి మరేం పర్లేదు అన్నట్లుగా రోహిత్ అతడి పట్ల సానుభూతి కనబరిచాడు.తప్పక పాఠాలు నేర్చుకుంటాడుఈ విషయం గురించి కామెంటేటర్ రవిశాస్త్రి లైవ్‌లో మాట్లాడుతూ.. ‘‘వైభవ్ కచ్చితంగా తన పొరపాట్లను సరిచేసుకుంటాడు. రోహిత్ శర్మ అతడిలో ఆత్మవిశ్వాసం నింపేలా మంచి మాటలు చెప్పాడు.ముంబై జట్టులోని చాలా మంది ఆటగాళ్లు అతడికి అండగా నిలిచారు. ప్రతి మ్యాచ్‌లోనూ ఇలాంటి గొప్ప సన్నివేశాలు చూడలేము. 14 ఏళ్ల పిల్లాడు సెంచరీ చేసిన మరుసటి మ్యాచ్‌లోనే ఇలా డకౌట్ అయ్యాడు. క్రికెట్ అంటే అంతే మరి!.. అతడు తప్పక ఈ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుంటాడు’’ అని వైభవ్ సూర్యవంశీకి మద్దతు ప్రకటించాడు.కాగా ఐపీఎల్-2025 ద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అతి పిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. అంతేకాకుండా మరెన్నో రికార్డులు సొంతం చేసుకుని.. క్రికెట్ ప్రపంచం దృష్టిని తన వైపునకు తిప్పుకొన్నాడు.ఐపీఎల్-2025: రాజస్తాన్ వర్సెస్ ముంబైవేదిక: సవాయ్ మాన్సింగ్ స్టేడియం, జైపూర్టాస్: రాజస్తాన్.. తొలుత బౌలింగ్ముంబై స్కోరు: 217/2 (20)రాజస్తాన్ స్కోరు: 117 (16.1)ఫలితం: వంద పరుగుల తేడాతో రాజస్తాన్‌పై ముంబై గెలుపు.చదవండి: RR VS MI: కంటిపై 7 కుట్లు పడినా అదిరిపోయే ప్రదర్శన చేసిన హార్దిక్ 6️⃣ on the trot & now they’re on 🔝A massive 1⃣0⃣0⃣-run win for #MI to sit right where they want to 👊Scorecard ▶ https://t.co/t4j49gXHDu#TATAIPL | #RRvMI | @mipaltan pic.twitter.com/20KEle7S6n— IndianPremierLeague (@IPL) May 1, 2025Deepak Chahar saved lacs of children from getting embarassed in front of their parents tonight pic.twitter.com/fOiMFV4XzZ— Sagar (@sagarcasm) May 1, 2025Rohit Sharma appreciating Vaibhav Suryavanshi after the match win last night.❤️The true leader @ImRo45 🐐 pic.twitter.com/t0iFGnBLOG— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) May 2, 2025 -
నేచర్ క్యాంప్, ఫారెస్ట్ ట్రెకింగ్ అంటే ఇష్టమా..?
గచ్చిబౌలి తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డెక్కన్ వుడ్స్, ట్రైల్స్ పేరిట వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టీజీఎఫ్డీసీ ఎకో టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంజిత్ నాయక్ తెలిపారు. 3వ తేదీ నుంచి మంరేవులలోని ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో సాయంత్రం 4 నుం మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు రాక్ బే నేచర్ క్యాంప్ ఉంటుందన్నారు. టీం బిల్డింగ్, టెంట్ పిచింగ రాత్రి పూట అడవిలో నడక, నైట్ క్యాపింగ్, క్యాంప్ ఫైర్, ఉదయం బర్డ్ వాచింగ్, ట్రెక్కింగ్, నేచర్ ట్రయల్ వంటి కార్యక్రమాలు ఉంటాయన్నారు. (Summer Vacation వాయిద్యాలను పలికించడం ఆరోగ్యకరం)కొత్తగూడలోని బొటానికల్ గార్డెన్లో ప్రతి శనివారం ఉదయం 9 గంటలకు ఎకో బస్ టూర్లో ఆడియో, వీడియో హాల్లో చెట్ల ప్రాముఖ్యతను వివరిస్తారు. సీతాకొక చిలుకల మీద ప్రజెంటేషన్, బ్యాటరీ ఆపరేటెడ్ వెహికిల్‌పై 75 థీమ్ పార్క్‌లు, వృక్ష పరిచయ క్షేత్రం చూపిస్తారు. అనంతరం జీవవైవిద్యంలో పాముల ప్రాముఖ్యతపై ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ వివరిస్తుంది. వర్చువల్ వైల్డ్‌లైఫ్ సఫారీ, గిరిజన జీవన శైలి, సంస్కృతి, వెస్ట్రన్గార్డ్స్, ఈస్ట్రన్స్ గార్డ్స్, 9డి సినిమా, స్పేస్ అక్వైరియం, థీమ్ ఫారెస్ట్‌ను వీక్షించవచ్చు. ఏసీ బస్సులో మృగవని నేషనల్ పార్క్‌కు తీసుకెళ్తారు. 4వ తేదీన ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో బర్డ్స్ వాక్ నిర్వహిస్తారు. (అత్తగారు, ఆవకాయ పచ్చడి : ఉపాసన కొణిదెల వీడియో వైరల్)బొటానికల్ గార్డెన్లో సమ్మర్ డే క్యాంప్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుంది. బర్డ్స్ వాక్, స్నేక్ షో, థీమ్ పార్క్‌లు, వైల్డ్ లైఫ్ సఫారీలను చూపిస్తారు. వివరాల కోసం ఫోన్: 9493549399, 9885298980. -
21 రోజుల్లో 15 కిలోలు తగ్గా.. ఆ సీక్రెట్ మాత్రం చెప్పను: రకుల్ భర్త
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ భర్త.. జాకీ భగ్నానీ (Jackky Bhagnani) నిర్మాత మాత్రమే కాదు నటుడు కూడా! సినిమాల్లో నటుడిగా కనిపించడానికి ముందు ఏకంగా 60 కిలోలు తగ్గి అందర్నీ సర్ప్రైజ్ చేశాడు. ఆ తర్వాత 2009లో కల్ కిస్నే దేఖా చిత్రంతో వెండితెరకు నటుడిగా పరిచయమయ్యాడు. 2017లో ఓ సినిమా కోసం 15 కిలోలు తగ్గాడు. కేవలం 21 రోజుల వ్యవధిలోనే అంత బరువు ఎలా తగ్గాడని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆ సీక్రెట్ మాత్రం ఎవరికీ చెప్పనంటున్నాడు జాకీ భగ్నానీ.అది ఆరోగ్యకరం కాదుతాజాగా జాకీ భగ్నానీ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తక్కువ సమయంలోనే ఎక్కువ బరువు తగ్గాను. కానీ అదంత ఆరోగ్యకరం కాదు. ఈ విషయంలో నేనెవరికీ సలహాలు, సూచనలు ఇవ్వను. ఒక షూట్ కోసం సడన్‌గా బరువు తగ్గాల్సి వచ్చింది. నా చేతిలో ఆప్షన్స్ లేవు. పైగా సమయం తక్కువే ఉంది. అప్పుడు నేను ఏం చేశానన్నది ఎవరికీ చెప్పదలుచుకోవడం లేదు. కానీ, దానివల్ల చాలా దుష్ప్రభావాలు ఎదురయ్యాయి.సైడ్ ఎఫెక్ట్స్ఒకేసారి ఎక్కువ బరువు కోల్పోయినప్పుడు యాసిడిటీ, జుట్టు కోల్పోవడం, జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. శరీరం కూడా నీరసించిపోతుంది. ఎందుకంటే సడన్‌గా సన్నబడటం అనేది సహజమైన ప్రక్రియ కాదు కదా.. అయితే రోజంతా కడుపు మాడ్చుకోవాలి.. లేదంటే ఒంట్లో కొవ్వు తగ్గించేందుకు వేరే విధానాలు ఎంచుకోవాలి. ఈ రెండూ మంచివి కావు.శరీరాన్ని కంట్రోల్లో ఉంచుకుంటా..సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి నేను నా బరువును కంట్రోల్లో ఉండేలా చూసుకుంటున్నాను. ఇందుకోసం ప్రతిరోజూ కష్టపడాల్సిందే! ఏదైనా వెకేషన్‌కు వెళ్లానంటే నోరు కట్టేసుకోకపోతే సహజంగానే లావెక్కుతాను. అప్పుడు మళ్లీ కష్టపడాల్సి ఉంటుంది. అందుకే ఫిట్నెస్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాను అని జాకీ భగ్నానీ చెప్పుకొచ్చాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో జాకీ బరువు తగ్గడం గురించి మాట్లాడుతూ.. రోజుకు 10-15 కి.మీ. పరిగెత్తేవాడినని చెప్పాడు. కేవలం ఐదు గ్రాముల కార్బోహైడ్రేట్లను కూరగాయల రూపంలో ఆరగించేవాడినని తెలిపాడు.చదవండి: చికిత్సకు డబ్బుల్లేవ్.. నటుడు కన్నుమూత -
విశాఖలో విషాదం.. సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి
సాక్షి, విశాఖపట్నం: విద్యుత్ షాక్‌కు గురై సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి చెందింది. మురళీనగర్‌లో ఇవాళ ఉదయం 7 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రెండో అంతస్తు నుంచి కేబుల్ వైర్ ద్వారా పై అంతస్తు నుండి పాల ప్యాకెట్ తీస్తున్న క్రమంలో జీవీ పద్మావతి(29) విద్యుత్ షాక్‌కు గురైంది. ఆమె భర్త అజయ్ ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.మరో విషాద ఘటనలో..ప్రేమ వివాహానికి అంగీకరించలేదని మనస్తాపం చెందిన ఓ చెందిన యువకుడు గురువారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. అక్కయ్యపాలెంలోని జగన్నాథపురానికి చెందిన కొణతాల లోకనరేంద్ర(29) సొంతంగా క్యాబ్ నడుపుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించాడు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామనుకున్నాడు. యువతి తల్లిదండ్రులకు విషయం తెలియడంతో ఫోర్త్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు.ఇరు కుటుంబాల సమక్షంలో ఇరువురికి సంబంధం లేనట్టు ఉంటామని ఒప్పకున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 9న యువతికి పెళ్లి చేసేందుకు ముహూర్తం నిశ్చయించారు. విషయం తెలుసుకున్న యువకుడు ఆ అమ్మాయినే చేసుకుంటానని తల్లిదండ్రుల్ని బతిమాలాడు. వారు నిరాకరించడంతో గురువారం మధ్యాహ్నం ఇంట్లో గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు.ఎంతకీ తలుపులు తీయకపోవడంతో పోలీసులకు తెలిపి, యువతితో మాట్లాడించి బయటకు రప్పించేందుకు ప్రయతి్నంచారు. అయినా స్పందన లేకపోవడంతో పోలీసులు తలుపులు బద్దలుకొట్టి చూడగా ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని, మరణించి ఉన్నాడు. తండ్రి చంద్రరావు ఫిర్యాదు మేరకు సీఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
‘డీఓజే ప్రతిపాదనలు పూర్తి ప్రతికూలం’
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అమెరికా న్యాయ శాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ (డీఓజే) ప్రతిపాదించిన యాంటీట్రస్ట్ పరిష్కారాలపై ఆందోళన వ్యక్తం చేశారు. అవి గూగుల్ సెర్చ్‌కు పూర్తి ప్రతికూలంగా ఉంటున్నాయని తెలిపారు. యూఎస్ డీఓజే ప్రాతిపాదనలు ‘దీర్ఘకాలికంగా అసాధారణమైనవి’గా ఉన్నాయని చెప్పారు. ఈ ప్రణాళికలు సెర్చ్ ఇంజిన్ నిర్మాణానికి సవాలుగా మారుతాయని పేర్కొన్నారు.సుందర్ లేవనెత్తిన కీలక ఆందోళనలుడీఓజే ప్రతిపాదనలో భాగంగా గూగుల్ తన సెర్చ్ ఇండెక్స్, టెక్నాలజీతో సమకూరిన మార్జినల్ కాస్ట్‌ను పోటీదారులతో పంచుకోవాల్సి ఉంటుంది. ఇది గూగుల్ పోటీ ప్రయోజనాన్ని నాశనం చేస్తుందని, ఆవిష్కరణలను అణిచివేస్తుందని పిచాయ్ వాదించారు. ప్రభుత్వ ప్రణాళిక దీర్ఘకాలికంగా అసాధారణమైనదని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గూగుల్ గత సంవత్సరం రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు 49 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. కంపెనీ టెక్నాలజీ మార్జినల్ కాస్ట్‌ను పోటీదారులతో పంచుకోవాల్సి వస్తే ఇలాంటి పెట్టుబడులను ఎలా కొనసాగించాలని పిచాయ్ ప్రశ్నించారు.క్రోమ్‌పై ప్రభావంక్రోమ్ సెక్యూరిటీ, అభివృద్ధిలో గూగుల్ గణనీయమైన పెట్టుబడి పెట్టినట్లు సుందర్ తెలిపారు. క్రోమ్ బ్రౌజర్‌ను బలవంతంగా విక్రయించాలనేలా డీఓజే పరిశీలిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. యాపిల్ ఇంటెలిజెన్స్‌లో జెమినీ ఏఐని చేర్చడానికి గూగుల్ సంప్రదింపులు జరుపుతోందని, ఇది నాన్ ఎక్స్‌క్లూజివ్ డీల్స్ వైపు మార్పును ప్రతిబింబిస్తుందని చెప్పారు.ఇదీ చదవండి: దేశంలో వెపన్స్ తయారీ పెంపుఆగస్టులో తుది తీర్పు2025 ఆగస్టులో ఈమేరకు పరిష్కార మార్గాలపై తీర్పు వెలువడే అవకాశం ఉంది. గూగుల్ ఇప్పటికే యాంటీట్రస్ట్ తీర్పుపై అప్పీల్ చేయాలని యోచిస్తోంది. డేటా సేకరణ, సాంకేతికతలో అన్యాయమైన ప్రయోజనం ద్వారా గూగుల్ సెర్చ్ గుత్తాధిపత్యం చెలాయిస్తోందని, దాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వ జోక్యం అవసరమని డీఓజే వాదిస్తుంది. -
నానికి బిగ్ షాక్.. ఆన్లైన్లో హిట్ 3 హెచ్డీ ప్రింట్ లీక్!
టాలీవుడ్‌ని పైరసీ బూతం కుదుపేస్తోంది. సూపర్ హిట్ సినిమాలు థియేటర్లలో విడుదలైన కొన్ని గంటల్లోనే ఆన్లైన్లో లీక్ అవుతున్నాయి. ఇప్పటికే రామ్‌చరణ్ నటించిన గేమ్ ఛేంజర్, నాగచైతన్య-సాయిపల్లవి జంటగా నటించిన తండేల్ సినిమాలు పైరసీ బారిన పడ్డాయి. తాజాగా, నాని నటించిన యాక్షన్ థ్రిల్లర్ హిట్ 3 కూడా లీక్ అయినట్లు తెలుస్తోంది.(చదవండి: హిట్ 3 మూవీ రివ్యూ)మే 1న థియేటర్స్‌లో రిలీజైన హిట్ 3 చిత్రం తొలి రోజే హిట్ టాక్ సంపాదించుకుంది. నాని ఊరమాస్ యాక్షన్‌కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఫలితంగా తొలి రోజు ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా హిట్-3 సినిమా రూ. 43 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. నాని కెరీర్లోనే తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా హిట్ 3 రికార్డ్ క్రియేట్ చేసింది. (చదవండి: 'హిట్ 3' ఫస్ట్ డే కలెక్షన్స్.. నాని కెరీర్లో ఇదే టాప్)సినిమాకు హిట్ టాక్ రావడంతో వీకెండ్లో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఈ చిత్రం హెచ్డీ ప్రింట్ ఆన్లైన్లో చక్కర్లు కొట్టడం టాలీవుడ్లో కలకలం రేపుతోంది. పైరసీ వల్ల బాక్సాఫీస్ వసూళ్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ పైరసీ బూతం టాలీవుడ్ పెద్ద సినిమాలను వదలడం లేదు. గేమ్ ఛేంజర్ రిలీజైన కొన్ని గంటల్లోనూ హెచ్డీ ప్రింట్ అన్లైన్లో అందుబాటులోకి రావడంతో నిర్మాత దిల్ రాజు షాక్‌కు గురయ్యారు.అదే విధంగా, తండేల్ సినిమా కూడా పైరసీ బారిన పడింది. దీని లీక్‌ను అడ్డుకునేందుకు నిర్మాతలు ప్రెస్ మీట్ నిర్వహించినప్పటికీ, అది విరుద్ధ ఫలితాన్ని ఇచ్చిందని, లీక్ గురించి ఎక్కువ మందికి తెలిసిపోయిందని నిర్మాత బన్నీ వాస్ విచారం వ్యక్తం చేశారు. టాలీవుడ్ నిర్మాతలు ఈ పైరసీ సమస్యను ఎదుర్కోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. విదేశాల నుంచి సెన్సార్ ప్రింట్ల ద్వారా లీక్‌లు జరుగుతున్నాయని గుర్తించిన నిర్మాత నాగవంశీ, దీనిపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కూడా నిర్మాతలతో కలిసి ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్చలు జరుపుతోంది.పైరసీ కేవలం ఆర్థిక నష్టాన్ని మాత్రమే కాక, సినిమా నిర్మాణంలో పాల్గొన్న వేలాది మంది కళాకారులు, సాంకేతిక నిపుణుల కృషిని దెబ్బతీస్తోంది. ఈ పైరసీ బూతానికి అడ్డుకట్ట వేయాలంటే.. ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని పరిశ్రమ నిపుణులు సూచిస్తున్నారు. -
Rajasthan: జైసల్మేర్‌లో పాక్ గూఢచారి అరెస్ట్
పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేస్తున్నట్లు ఆరోపణలపై 40 ఏళ్ల జైసల్మేర్ నివాసి పఠాన్ ఖాన్‌ను రాజస్థాన్ ఇంటెలిజెన్స్ అరెస్ట్ చేసింది. భారత సైన్యం కదలికల సమాచారం పంపినట్లు విచారణలో తేలింది. జైసల్మేర్.. పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉండటం వల్ల గూఢచర్యకు కేంద్రంగా మారిందని అధికారులు గుర్తించారు.2022లో ఆపరేషన్ సర్హద్‌లో 36 మంది అనుమానిత గూఢచారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఐఎస్ఐ.. భారత సైనిక కార్యకలాపాల సమాచారం సేకరించేందుకు పదేపదే ప్రయత్నిస్తోందని గుర్తించారు. భారత దేశ జాతీయ భద్రతను దెబ్బతీసేందుకు గూఢచర్యం పాకిస్తాన్‌కు ఒక సాధనంగా మారింది. భారత్-పాకిస్థాన్‌ల భౌగోళిక-రాజకీయ పోరాటంలో భాగంగా ఈ సంఘటనలు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. -
భారత్ భారీ వ్యూహం.. పాక్‌కు కోలుకోలేని దెబ్బ!
ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి ఘటన భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం చెప్పేలా భారత్ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక, తాజాగా పాక్‌పై రెండు ఆర్థిక దాడులకు భారత్ ప్రణాళికలు చేసినట్టు సమాచారం.కాగా, పాకిస్తాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా భారత్ ప్రణాళికలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(FATF) గ్రేలిస్టులోకి పాకిస్తాన్‌ను తిరిగి చేర్చడానికి భారత్ ప్రయత్నిస్తోంది. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహాయాన్ని అరికట్టడంలో విఫలమయ్యే దేశాలను ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లో చేరుస్తుంది. గతంలో ఈ జాబితాలో ఉన్న పాకిస్తాన్‌ను తిరిగి అందులోకి చేర్చడం ద్వారా ఉగ్రవాదానికి నిధులు అందకుండా అంతర్జాతీయంగా ఆ దేశంపై ఒత్తిడి పెంచాలని భారత్ భావిస్తోంది. రెండో చర్యగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఇటీవల పాకిస్థాన్‌కు మంజూరు చేసిన 7 బిలియన్ డాలర్ల భారీ ఆర్థిక సాయ ప్యాకేజీ వినియోగంపై భారత్ తన ఆందోళనలను వ్యక్తం చేయనున్నట్టు సమాచారం. ఈ నిధులను పాకిస్తాన్ ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాల కోసం దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ సంబంధిత అంతర్జాతీయ వేదికలపై ఈ అంశాన్ని లేవనెత్తాలని భారత్ యోచిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. భారత్ ప్లాన్ చేసిన చర్యల కారణంగా పాకిస్తాన్‌కు కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఈ ద్వంద్వ వ్యూహం ద్వారా పాకిస్థాన్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు ఆర్థిక మార్గాలను మూసివేయాలని, తద్వారా సరిహద్దు ఉగ్రవాదాన్ని కట్టడి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. పహల్గామ్ దాడి వంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు ఈ ఆర్థికపరమైన ఒత్తిడిని ఒక మార్గంగా భారత్ పరిగణిస్తున్నట్టు సమాచారం.2022లో విముక్తి..కాగా, 2022లో అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్‌కు కాస్త ఊరట లభించింది. ఉగ్రవాద సంస్థలకు నిధులు సరఫరా చేస్తోందన్న కారణంతో పాక్‌ను గ్రే లిస్టులో ఉంచిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(FATF) ఆ జాబితా నుంచి తొలగించింది. మనీలాండరింగ్ నిరోధక చర్యలను పాకిస్థాన్ పటిష్ఠంగా అమలు చేస్తోందని, సాంకేతిక లోపాలను పరిష్కరిస్తూ ఉగ్రసంస్థలకు నిధుల సరఫరా విషయంలోనూ పోరాటం చేసిందని ఎఫ్ఏటీఎఫ్ వెల్లడించింది. దీంతో పాక్‌ను గ్రే లిస్టు నుంచి తప్పించినట్లు తెలిపింది. గ్రే లిస్టులో ఉన్న దేశాలు అంతర్జాతీయ సంస్థల నుంచి నిధుల పొందడం చాలా కష్టం. ఈ దేశాలకు ముఖ్యంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎప్), ప్రపంచ బ్యాంక్, ఏడీబీ, యూరోపియన్ యూనియన్ వంటి సంస్థలు ఆర్థిక సాయం చేసేందుకు వెనకాడుతాయి.ఉగ్రవాదానికి ఊతమిచ్చే అతి ప్రమాదకర దేశాలను ఎఫ్ఏటీఎఫ్ బ్లాక్ లిస్ట్ జాబితాలోకి చేరుస్తుంది. కాగా, ఇప్పటివరకు ఇరాన్, ఉత్తర కొరియా మాత్రమే బ్లాక్ లిస్ట్ జాబితాలో ఉన్నాయి. బ్లాక్ లిస్ట్ నుంచి తప్పించుకోవడానికి మూడుదేశాల మద్దతు అవసరం. అయితే, చైనా, టర్కీ, మలేషియా దేశాలు పాక్‌కు మద్దతు ఇవ్వడంతో బ్లాక్ లిస్ట్‌లోకి వెళ్లకుండా బయటపడింది. తొలిసారిగా 2018 జూన్‌లో ఎఫ్ఏటీఎఫ్ పాకిస్తాన్‌ను గ్రే లిస్ట్‌లో ఉంచింది. అనంతరం వీటి నుంచి బయటపడేందుకు పాకిస్తాన్‌కు రెండు సార్లు సమయమిచ్చింది. వీటిలో భాగంగా ఉగ్రవాదులకు అందుతున్న నిధుల మూలాలను కనిపెట్టే దిశగా పాక్ చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఐరాస ఉగ్రవాదులుగా గుర్తించిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలి. అలాగే పట్టుబడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు నిరూపించగలగాలి. ఐరాస గుర్తించిన ఉగ్రవాదులకు నిధులు అందకుండా ఆర్థికపరమైన ఆంక్షలు విధించాలి. ఎఫ్ఏటీఎఫ్ నిర్దేశించిన ఈ లక్ష్యాలను చేరుకోవడంలో పాక్ ఇప్పటివరకు విఫలమవుతూనే వచ్చింది. కానీ, జూన్ నెలలో ఎఫ్ఏటీఎఫ్ ప్లీనరీ సమావేశంలో పాక్‌కు అనుకూలంగా ప్రకటన విడుదల చేసింది. ధరలతో పాక్ అతలాకుతలం..మరోవైపు.. ఇప్పటికే తీవ్ర ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కు ఇప్పుడు మరో తలనొప్పి వచ్చి పడింది. పాక్‌తో వాణిజ్య సంబంధాలు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించడంతో పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ క్రమంలోనే అట్టారీ సరిహద్దును భారత్ మూసివేసింది. దీంతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం నిలిచిపోయింది. దీంతో ఇప్పటికే తీవ్రంగా కుదేలైన పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై ఇది మరింత తీవ్ర ప్రభావం చూపనుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో పాక్‌లో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకింది. భారీగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో పాక్ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో ప్రస్తుతం పాక్‌లో ఆహార ధరలు భారీగా పెరిగాయి.పాకిస్తాన్లో ప్రస్తుతం కొన్ని ఆహార పదార్థాల ధరలుకిలో చికెన్: రూ. 798.89 పాకిస్తాన్ రూపాయలుకిలో బియ్యం: రూ. 339.56 పాకిస్తాన్ రూపాయలుడజను గుడ్లు: రూ. 332 పాకిస్తాన్ రూపాయలులీటర్ పాలు: రూ. 224 పాకిస్తాన్ రూపాయలుఅరకిలో బ్రెడ్: రూ. 161.28 పాకిస్తాన్ రూపాయలుకిలో టమాట: రూ. 150 పాకిస్తాన్ రూపాయలుకిలో బంగాళాదుంప: రూ. 105 పాకిస్తాన్ రూపాయలు. -
Summer Vacation వాయిద్యాలను పలికించడం ఆరోగ్యకరం
నగరంలో సంగీత వాయిద్యాలలో ప్రావీణ్యం సంపాదించడం పట్ల ఆసక్తి బాగా పెరుగుతోంది. సెలవుల్లో అందివచ్చిన సమయాన్ని సది్వనియోగం చేసుకునే క్రమంలో మ్యూజిక్‌కి జై కొడుతున్నారు స్టూడెంట్స్.. ముఖ్యంగా కోవిడ్ సమయంలో లాక్డౌన్ సమయం సంగీత వాయిద్యాల సాధనను ఎంచుకోవడానికి లేదా తిరిగి తమ అభిరుచులను సానబట్టడానికి దారితీసింది. అదే సమయంలో ఆన్లైన్ అభ్యాస వేదికలు విరివిగా అందుబాటులోకి రావడం ఈ అభిరుచికి ఆజ్యం పోసింది. దీని వలన విద్యార్థులు ఇంట్లో నుంచి కదలకుండానే వాయిద్యాలను నేర్చుకోవడం సులభమైంది. -సాక్షి,సిటీబ్యూరో ప్రపంచీకరణ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో సంగీత శైలులపై అవగాహన పెరిగింది. వాయిద్యాల సాధనపై ఆసక్తికి పాశ్చాత్య సంగీతానికి పెరుగుతున్న ఆదరణ కూడా కారణమే. రాక్, పాప్, జాజ్ వంటి పాశ్చాత్య శైలులకు పెరుగుతున్న ప్రజాదరణ గిటార్లు, కీబోర్డులు, డ్రమ్స్ వంటి వాయిద్యాలకు డిమాండ్ పెంచింది. అదేవిధంగా కొరియన్ పాప్ కల్చర్ పట్ల పెరుగుతున్న మోజు కూడా మరో కారణం. పాశ్చాత్య వాయిద్యాలు ప్రజాదరణ పొందుతున్నప్పటికీ, ముఖ్యంగా ఫ్యూజన్ సంగీతాన్ని అన్వేషించే యువతలో భారతీయ శాస్త్రీయ వాయిద్యాలపైనా బలమైన ఆసక్తి ఉంది.సాధనకు సరైన సమయం.. తల్లిదండ్రులు సంగీత విద్య ప్రయోజనాలను గతంలో కన్నా ఎక్కువగా తెలుసుకున్నారు. వేసవి సెలవుల్లో తమ పిల్లలను అర్థవంతమైన కార్యకలాపాల్లో నిమగ్నం చేయడంలో సంగీతాన్ని మించింది లేదని భావిస్తున్నారు. విద్యార్థులకు అత్యంత ఆసక్తి ఉన్న వాయిద్యం కీబోర్డ్ కాగా ఆ తర్వాత స్థానాల్లో గిటార్, డ్రమ్స్, వయోలిన్, పియానోలు ఉన్నాయి. ఇక గాత్ర శిక్షణ పట్ల కూడా ఆసక్తి పెరుగుతోంది.పరికరం.. ఆరోగ్యకరం..సంగీత వాయిద్యం పలికించడం ద్వారా మెదడు ఆరోగ్యం బలోపేతమై ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరిగి పనితీరుపై సానుకూల ప్రభావాలను చూపుతుందని, అభ్యాస ఆసక్తిని మరింత ప్రోత్సహిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఎక్సెటర్ విశ్వవిద్యాలయం చేసిన ఒక అధ్యయనంలో సంగీత వాయిద్యం వాయించడం తదుపరి జీవితంలో మెరుగైన మెదడు ఆరోగ్యం ఏర్పడటం మధ్య సంబంధం ఉందని కనుగొంది. సంగీతానికి విశ్రాంతి కలిగించే శక్తి ఉంది. అందుకే చాలా మంది ఒత్తిడికి గురైనప్పుడు లేదా ఆందోళన చెందుతున్నప్పుడు వాయిద్యం వాయించడం వైపు మొగ్గు చూపుతారు. ఫ్లూట్ నేర్చుకుంటున్న నగరానికి చెందిన ఎంఎస్సీ కెమిస్ట్రీ విద్యారి్థని లక్ష్మీ ‘వేణువు ఒక మధురమైన విశ్రాంతినిచ్చే వాయిద్యం’ అంటోంది. వేణువు వాయించడం మానసిక ఉద్రిక్తతను తగ్గిస్తుందని ఆమె చెప్పింది. ప్రతిరోజూ అరగంట సాధన చేస్తానని.. అది తన చదువుపై మరింత దృష్టి పెట్టడానికి సహాయ పడిందని చెప్పింది. వాయిద్యం వాయించడం భావోద్వేగ వ్యక్తీకరణకు సహాయపడుతోంది. భావోద్వేగాలకు ఒక మార్గాన్ని అందించడం ద్వారా ఆందోళనను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది అని మానసిక వైద్యులు డా.పరమేష్ వివరించారు. ఇదీ చదవండి: Good Health: వెజ్ తినాలా? నాన్ వెజ్ తినాలా?వేసవిలో సంగీత ప్రయాణం చదువుకునే ఒత్తిడి లేని వేసవిలో విద్యార్థులు సంగీత ప్రయాణాన్ని ప్రారంభించడం చాలా మంది. ఇది సరైన ప్రారంభంగా ఉపకరిస్తుంది. అంతేకాకుండా, ప్రస్తుత సంగీత వేసవి కోర్సులు సాధారణ పాఠ్యాంశాల్లో అనుసంధానించడానికి అనుకూలంగా రూపొందిస్తున్నారు. ఇది స్కూల్స్/కాలేజీలు ప్రారంభింన తర్వాత కూడా విద్యార్థులు ఎటువంటి అంతరాయం లేకుండా సాధన కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది. – లక్ష్మీనారాయణ యేలూరి, వ్యవస్థాపకులు ముజిగల్ అకాడమీ గిటార్ సాధన చేస్తున్నా.. పాశ్చాత్య సంగీతం అంటే ఇష్టం. రాక్ బ్యాండ్స్ ప్రదర్శనలకు హాజరవుతుంటాను. మంచి రాక్ బ్యాండ్ లో చేరాలని ఆలోచన ఉంది. అయితే కాలేజీలో క్లాసెస్ ఉన్నప్పుడు కుదరదు కాబట్టి.. ప్రస్తుతం ఆన్లైన్ క్లాసెస్‌లో గిటార్ నేర్చుకుంటున్నా. – విప్లవ్, విద్యార్థి మణికొండచదవండి: Vaibhav Gautam వైకల్యానికి ‘చెక్’ పెట్టాడు! -
స్లిమ్‌గా బాలీవుడ్ చిత్ర నిర్మాత హన్సల్ మెహతా.. మౌంజారోతో పది కిలోలు..!
ఇంతవరకు ఎందరో వెయిట్ లాస్ జర్నీలు ప్రేరణగా నిలిచాయి. ఒక్కోక్కరిది ఒక్కో నేపథ్యంతో బరువు తగ్గేందుకు ఉపక్రమించారు. అయితే వారంతా డైట్లు వర్కౌట్లతో బరువు తగ్గితే. ఈ బాలీవుడ్ చిత్ర నిర్మాత హన్సల్ మెహతా మాత్రం మందులతోనే బరువు తగ్గానంటూ కుండబబ్దలు కొట్టినట్లుగా చెప్పేశారు. అందరు ఆ మందులు దుష్ప్రభావాలు చూపుతాయనే దుష్ప్రచారంతో వాడేందుకు జంకుతున్నారని, అందులో వాస్తవం లేదని మరీ చెబుతున్నారు. తాను ఆ మందులు వాడుతూనే ఎలా ఆర్యోకరంగా బరువు తగ్గారో కూడా వెల్లడించారు. ఇదేంటి మందుల వద్దనే అంటారు కదా నిపుణులు అనే సందేహంతో ఆగిపోకండి అసలు కథేంటో తెలుసుకోండి మరీ..!.బాలీవుడ్ నిర్మాత హన్సల్ మెహతా టెలివిజన్ షోలు తీస్తూ నెమ్మదిగా మంచి బ్లాక్‌బస్టర్ మూవీలు తీసి మంచి నిర్మాతగా పేరుతెచ్చుకున్నారు. ఉత్తమ చలన చిత్ర నిర్మాతగా అవార్డులు కూడా దక్కించుకున్నారు. ఆయన డయాబెటిస్తో బాధపడుతున్నారు. ఓ పక్క అధిక బరువుతో పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు కూడా. అయితే మెహతా బరువు తగ్గేందుకు తన ఆరోగ్య సమస్యల రీత్యా డయాబెటిస్ చికిత్సకు ఉపయోగించే మౌంజారో మందులను వాడానని అన్నారు. దానివల్లే బరువు తగ్గానని చెప్పారు. బరువు తగ్గాడానికి సెలబ్రిటీలు ఉపయోగిచే మౌజరోని తాను వాడానని మెహతా నిర్భయంగా చెప్పడమే గాక ఏకంగా పదికిలోలు తగ్గినట్లు తెలిపారు. అలాగే దీంతోపాటు సరైన జీవనశైలిని పాటించానని అన్నారు. అధిక ప్రోటీన్ భోజనం, చక్కెరను తగ్గించడం, మెడిటేరియన్ డైట్ వంటివి అనుసరించానని అన్నారు. ఆల్కహాల్ సేవించడం కూడా తగ్గించినట్లు తెలిపారు. సరైన జీవనశైలిని అనుసరించడం తోపాటు వర్కౌట్లు, అడదడపా ఉపవాసం, హైడ్రేటెడ్ ఉండేలా తగినంత నీరు తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు. దాంతో తన రక్తంలోని చక్కెర స్థాయిలు సాధారణ స్థాయికి రావడమే గాక, ఇన్సులిన్ నిరోధకత తగ్గిందన్నారు. ఇప్పుడు యంగ్ ఏజ్‌లో వేసుకున్న పాత బట్టలు అన్ని సరిపోతున్నాయని ఆనందంగా చెప్పారు. ఆ మందులపై అపోహ ఎక్కువ..ఓజెంపిక్, మౌంజారో వంటి జీఎల్పీ-1 మందులు బరువు తగ్గడానికి పేరుగాంచినవి. కొద్దిమేర బరువుత తగ్గాలనుకునేవారికి, దీర్ఘకాలిక బరువుతో సతమతమవుతున్న వారికి ఇవి మంచివే అనేది నిపుణులు అభిప్రాయం. అయితే అనుసరించేటప్పుడు వైద్యులు లేదా వ్యక్తిగత నిపుణుల పరివేక్షణలోప్రారంభించాలట. ఇలాంటి వాడటానికి సిగ్గపడాల్సిన పనిలేదంటున్నారు మెహతా. అయితే వాటితోపాటు సరైన జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లు అవలంభిస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవని చెబుతున్నారు. భారత్‌లో ఎలి లిల్లీ లాంఛ్ చేసిన ఈ ఔషధం మౌంజారో గేమ్-ఛేంజర్ కావచ్చని..భవిష్యత్తులో మరిన్ని సంచలనాలను సృష్టిస్తుందని చెబుతున్నారు నిపుణులు.Under medical guidance, I began Mounjaro to address rising blood sugar levels in the pre-diabetic range and to manage my steadily increasing weight. Paired with a committed lifestyle shift—high-protein meals, minimal sugar and alcohol, regular strength training, proper hydration,… pic.twitter.com/R0GnHuEcl7— Hansal Mehta (@mehtahansal) May 1, 2025గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: శరీరానికి సరిపడే ఆహారాలే తీసుకోవాలి..! పోషకాలపై దృష్టి పెట్టాలి..) -
ఒడిశాలో నేపాల్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. హాస్టల్లో ఏం జరిగింది?
భువనేశ్వర్: ఒడిశాలో దారుణ ఘటన వెలుగు చూసింది. భువనేశ్వర్‌లోని ప్రతిష్ఠాత్మక కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కిట్)లో విద్యార్థిని మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సదరు విద్యార్థిని నేపాల్‌కు చెందిన యువతిగా గుర్తించారు. ఇక, మూడు నెలల వ్యవధిలో ఇదే క్యాంపస్‌లో ఇద్దరు విద్యార్థులు మృతిచెందడం అనుమానాలను తావిస్తోంది.వివరాల ప్రకారం.. కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కిట్)లో కంప్యూటర్ సైన్స్ బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి(22)ని మృతిచెందింది. ఆమె స్వస్థలం నేపాల్ రాజధాని ఖాట్మాండుకు సుమారు 135 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీర్గంజ్. సదరు విద్యార్ధిని గురువారం రాత్రి 8 గంటల సమయంలో బాలికల హాస్టల్లోని తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న స్థితిలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. దీంతో, యూనివర్సిటీ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.మూడు నెలల్లో ఇద్దరు మృతి..ఇక, గత మూడు నెలల్లో కిట్ యూనివర్సిటీలో నేపాల్ విద్యార్థిని మరణించడం ఇది రెండోసారి. ఫిబ్రవరి 16న బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ప్రకృతి లమ్సాల్ అనే నేపాల్ విద్యార్థిని కూడా ఇదే విధంగా హాస్టల్ గదిలో విగతజీవిగా కనిపించింది. ఆ సమయంలో సహచర విద్యార్థి ఒకరు తనను లైంగికంగా వేధించారని యూనివర్సిటీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆఫీస్ (ఐఆర్వో) కు ఫిర్యాదు చేసినట్టు తర్వాత వెలుగులోకి వచ్చింది. అయితే, యూనివర్సిటీ యాజమాన్యం తక్షణ చర్యలు తీసుకోలేదని, ఇది ‘తీవ్ర నిర్లక్ష్యం’ అని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) వ్యాఖ్యానించింది. విద్యార్థి సంఘాలు, పౌర సమాజం తీవ్రంగా స్పందించడంతో, ఆమె మరణించిన మరుసటి రోజే నిందితుడిని అరెస్టు చేశారు. బీజేడీ నేత, మాజీ ఎంపీ అచ్యుత సమంత స్థాపించి, నిర్వహిస్తున్న ఈ యూనివర్సిటీపై అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.A Nepali undergraduate student was found dead in her hostel room in Bhubaneswar’s Kalinga Institute of Industrial Technology (KIIT) on Thursday (May 1) evening. This is the second such case in less than three months.Prisha Shah was studying computer science and hails from… pic.twitter.com/XcCVY9vM6X— News9 (@News9Tweets) May 2, 2025 -
RR VS MI: చాలా తప్పులు చేశాం.. నిజాయితీగా ఒప్పుకున్న రాజస్థాన్ కెప్టెన్
ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ కథ ముగిసింది. నిన్న (మే 1) ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమితో ఆ జట్లు ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన రాయల్స్ ఏకంగా 8 పరాజయాలు మూటగట్టుకుంది. కేవలం మూడే విజయాలు సాధించింది. కొన్ని గెలవాల్సిన మ్యాచ్‌ల్లో అనూహ్యంగా ఓటమిపాలైంది. ఈ సీజన్లో ఆ జట్టు మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లు గెలిచినా, ఓడినా రాయల్స్‌కు ఒరిగేది ఏమీ లేదు. అయితే ప్రత్యర్థి జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. రాయల్స్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో కేకేఆర్ (మే 4), సీఎస్కే (మే 12), పంజాబ్ (మే 16) జట్లను ఢీకొట్టనుంది.ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి అనంతరం రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ నిజాయితీగా తమ తప్పిదాలను ఒప్పుకున్నాడు. ఈ సీజన్లో చాలా పొరపాట్లు చేశామని అంగీకరించాడు. తప్పిదాలపై దృష్టి సారిస్తామని చెప్పాడు. తప్పులతో పాటు కొన్ని మంచి పనులు కూడా చేశామని అన్నాడు. తదుపరి మూడు మ్యాచ్‌ల్లో సత్తా చాటుతామని ఆశాభావం వ్యక్తం చేశాడు.ముంబై ఇండియన్స్‌కు క్రెడిట్ ఇచ్చాడు. వారు బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతమని కొనియాడాడు. ఓవర్‌కు 10 పరుగుల చొప్పున రన్‌రేట్ మెయిన్టైన్ చేస్తూ చివర్లో చెలరేగారని అన్నాడు. తమ జట్టు బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ.. ఈ రోజు మాది కాదని అన్నాడు. పిచ్‌పై స్పందిస్తూ.. 190-200 ఛేజింగ్‌కు అనువైన స్కోర్ అని తెలిపాడు. ముంబై అదనపు పరుగులు సాధించినందుకు హార్దిక్, సూర్యకుమార్‌కు క్రెడిట్ ఇచ్చాడు. తమ ఆటతీరు మెరుగ్గా ఉండాల్సిందని ఒప్పుకున్నాడు.ఈ సీజన్లో బ్యాటింగ్‌లో మంచి ఆరంభాలు లభించినా మిడిలార్డర్ సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయిందని తెలిపాడు. తాను, జురెల్ మిడిలార్డర్లో బాధ్యత తీసుకోవాల్సిందని అన్నాడు. ఈ రోజు వచ్చిన అవకాశం మరోసారి వస్తే తమ సత్తా చాటుతామని తెలిపాడు.కాగా, నిన్న జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ ముంబై ఇండియన్స్ చేతిలో 100 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమైంది. తొలుత ముంబై బ్యాటర్లను కట్టడి చేయలేకపోయిన ఆ జట్టు.. ఆతర్వాత బ్యాటింగ్‌లో తొలి బంతి నుంచే చేతులెత్తేసింది. గత మ్యాచ్‌లో 35 బంతుల్లోనే సెంచరీ చేసి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్శించిన 14 ఏళ్ల చిచ్చరపిడుగు వైభవ్ ఈ మ్యాచ్‌లో డకౌటయ్యాడు. బౌల్ట్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాది జోష్‌గా కనిపించిన జైస్వాల్ అదే ఓవర్లో ఔటయ్యాడు. ముంబై బౌలర్లు చెలరేగడంతో రాణా, పరాగ్, జురెల్, హెట్‌మైర్ వికెట్లు కోల్పోయారు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో రాయల్స్ తమ స్థాయి ఆటతీరు ప్రదర్శించలేక చిత్తుగా ఓడింది. -
పహల్గాం ఉగ్రదాడిపై విస్తుపోయే వాస్తవాలు.. NIA చేతికి చిక్కిన కీలక ఆధారాలు
ఢిల్లీ : జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పహల్గాం ఉగ్రదాడి ఆర్మీ, లష్కరే తోయిబా కన్నుసన్నల్లో జరిగినట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) నిర్ధారించింది. పహల్గాం ఉగ్రదాడిలో ఎన్ఐఏ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ ఎన్ఐఏ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాక్ ఐఎస్ఐ,ఉగ్రసంస్థ లష్కరే తోయిబాలు కలిసి ఈ కిరాతక దాడికి పాల్పడినట్లు ఎన్ఐఏ తేల్చింది. పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబా ఆఫీస్‌లో పహల్గాం ఉగ్రదాడికి కుట్ర జరిగినట్లు ప్రాథమిక నివేదికల్లో పేర్కొంది.ఇక పహల్గాంలో దాడికి పాల్పడ్డ ఇద్దరు ఉగ్రవాదుల్ని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. షమీమ్ మూసా అలియాస్ అస్మీన్ మూసా,అలీబాయ్ అలియాస్ తల్హా నేరుగా ఉగ్రదాడికి పాల్పడినట్లు ఎన్ఐఏ తెలిపింది. ఎన్ఐఏ దర్యాప్తు.. శాటిలైట్ ఫోన్ల వినియోగంపాకిస్తాన్ పౌరులైన ఆ ఇద్దరు ఉగ్రవాదులు పహల్గాం ఉగ్రదాడికి కొన్ని వారాల ముందు భారత్ భూభాగంలోకి ప్రవేశించినట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. వారికి ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ (OGWs) సహాయం చేసినట్లు నిర్ధారించింది. అదే సమయంలో పహల్గాంలో కాల్పులు జరిగిన ప్రాంతంలో ఎన్ఐఏ ఫోరెన్సిక్, ఎలక్ట్రానిక్ డేటా సేకరించింది. ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న 40కి పైగా తుపాకుల బాలిస్టిక్, కెమికల్ టెస్టులు జరిపేందుకు ల్యాబ్‌కు పంపింది. 3డీ మ్యాపింగ్ సాయంతో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డ తీరును గుర్తించేందుకు లేజర్ స్కానర్ల సాయంతో త్రీడీ మ్యాపింగ్ చేసింది. ఈ 3డీ మ్యాపింగ్ సాయంతో కాల్పుల జరిగే సమయంలో ఉగ్రవాదులు పొజీషన్‌తో పాటు టూరిస్టులు ఎలా కుప్పకూలారు. బ్లడ్ శాంపిల్స్, కాల్పులు జరిగినప్పుడు బుల్లెట్ల నుంచి వెలువడ్డ రసాయనాలు వంటి వాటిని సేకరించారు. లోయ చుట్టూ ఉన్న మొబైల్ టవర్ల నుండి డంప్ డేటాను కలెక్ట్ చేశారు. ఈ డేటా ఆధారంగా ఉగ్రదాడి ముందు రోజుల్లో కాల్పులకు తెగ బడ్డ ప్రదేశం నుంచి శాటిలైట్ ఫోన్లను వినియోగించారని, ముఖ్యంగా బైసరీన్, దాని చుట్టు పక్కల ప్రదేశాల్లో కనీసం మూడు శాటిలైట్ ఫోన్లను నిందితులు వినియోగించగా.. రెండు శాటిలైట్ ఫోన్ల సిగ్నల్స్‌ను గుర్తించారు. 2,800 మందిని విచారించి ఉగ్రదాడిపై మొత్తం 2,800 మందికి పైగా ఎన్ఐఏ, భద్రతా సంస్థలు ప్రశ్నించాయి. మే2 నాటికి మరో 150 మందిని విచారించేందుకు కస్టడీలోకి తీసుకున్నాయి. వీరిలో అనుమానిత ఓజీడబ్ల్యూ, జమాత్-ఇ-ఇస్లామి వంటి నిషేధిత గ్రూపులు, హురియత్ కాన్ఫరెన్స్‌లోని వివిధ వర్గాలతో సంబంధాలు ఉన్న వ్యక్తులు ఉన్నారు.ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటే ఉగ్రవాద సంస్థలు, తిరుగుబాటు గ్రూపులకు సాయుధ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొనకుండా లాజిస్టికల్, ఆర్థిక సమాచార సహాయాన్ని అందించే వ్యక్తులను ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ (OGWలు) అంటారు.కార్ట్రిడ్జ్ అంటేకాల్పులు జరిపిన తరువాత మిగిలి ఉన్న మందుగుండు సామాగ్రి భాగాన్ని కార్ట్రిడ్జ్ అంటారు. వాటిల్లో బుల్లెట్లు,మందుగుండు సామగ్రిలో చేర్చే షెల్, గన్ పౌడర్, గన్‌లో ఉండే బులెట్లను మండించే ప్రైమర్ల అనే భాగాలున్నాయి. -
మధుసూదన్‌రావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంచు విష్ణు
పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన మధుసూదన్‌రావు కుటుంబ సభ్యులను మా అధ్యక్షులు, సినీ నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) పరామర్శించారు. నెల్లూరు జిల్లా కావలిలోని వారి ఇంటికి చేరుకున్న విష్ణు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మధుసూదన్ రావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం.. దాడి జరిగిన తీరును మధుసూధన్ సతీమణి కామాక్షి, పిల్లలను అడిగి విష్ణు తెలుసుకున్నారు. కావలి తమ అమ్మగారి ఊరు కావడంతో ఆ ప్రాంతంతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు.తాను మాట్లాడాలనుకున్నది వారితో మాట్లాడానని విష్ణు అన్నారు. మధుసూదన్‌రావు కుటుంబ సభ్యులకు ఎలాంటి భరోసా ఇచ్చాను అనేది తమ పర్సనల్ అని అన్నారు. ప్రస్తుతం తాను మీడియాతో పెద్దగా మాట్లాడలేనని చెప్పి.. ఈ విషయంలో తనను తప్పుగా అర్ధం చేసుకోవద్దంటూ అక్కడి నుంచి ఆయన వెళ్లిపోయారు. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. వారిలో కావలికి చెందిన మధుసూదన్ రావు కూడా ఉన్నారు. -
చికిత్సకు డబ్బుల్లేవ్.. నటుడు కన్నుమూత
కొచ్చి: మలయాళ నటుడు విష్ణుప్రసాద్ (Vishnu Prasad) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కేరళలోని ఓ ఆస్పత్రిలో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. బుల్లితెర, వెండితెరపై అలరించిన విష్ణు ప్రసాద్ కొన్ని నెలల క్రితం అస్వస్థతకు లోనయ్యారు. వైద్యులను సంప్రదించగాక కాలేయ సమస్య ఉన్నట్లు తేలింది. దీంతో ఆయన కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. వీలైనంత త్వరగా కాలేయ మార్పిడి చేయాలని వైద్యులు సూచింరు. దీంతో అతడి కూతురు తండ్రికి కాలేయదానం చేయడానికి సిద్ధమైంది. కానీ ఆపరేషన్‌కు దాదాపు రూ.30 లక్షల మేర ఖర్చవుతుందని, సాయం చేసి ఆదుకోమని అతడి కుటుంబసభ్యులు ఆర్థిక సాయం కోసం అర్థించారు. ఆ డబ్బు సేకరించేలోపే విష్ణుప్రసాద్ కన్నుమూశారు.విష్ణు ప్రసాద్.. కాశీ, కై ఎతుం దూరత్, రన్‌వే, మంగోకాళం, లయన్, లోకనాథన్ IAS, పటాకా, మరాఠా నాడు వంటి పలు మలయాళ చిత్రాల్లో నటించారు. సీరియల్స్‌లోనూ కనిపించాడు. ఇతడికి అభిరామి, అనానిక అని ఇద్దరు కూతుర్లున్నారు.చదవండి: నా కొడుక్కి 'ఆదిపురుష్' చూపించి సారీ చెప్పా: దేవర విలన్ -
బంగారం హాట్రిక్ తగ్గుదల.. తులం ఇప్పుడు..
దేశంలో భారీగా పెరిగి తారాస్థాయికి చేరిన బంగారం ధరలు (Gold Prices) క్రమంగా దిగివస్తున్నాయి. వరుసగా మూడో రోజూ పసిడి ధరల్లో తగ్గుదల నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు, డాలర్‌తో రూపాయి మారకం రేటు, స్థానిక డిమాండ్ వంటి అంశాలు భారత్‌లో పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. నేడు (మే 2) దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.95,510- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.87,550హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.220, రూ.200 చొప్పున తగ్గాయి.👉ఇది చదివారా? బంగారం భారీగా పడిపోతుంది: గోల్డ్ మైనర్ అంచనాచెన్నైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.95,510- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.87,550చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.220, రూ.200 చొప్పున తగ్గాయి.ఢిల్లీలో.. - 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.95,660- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.87,700ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్‌ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్‌మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.220, రూ.200 చొప్పున తగ్గాయి.ముంబైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.95,510- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.87,550ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.220, రూ.200 చొప్పున తగ్గాయి.బెంగళూరులో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.95,510- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.87,550బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.220, రూ.200 చొప్పున తగ్గాయి.వెండి ధరలు ఇలా..దేశవ్యాప్తంగా వెండి ధరలు మాత్రం నేడు భారీగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీకి రూ.2000 మేర పెరిగి రూ.1,09,000 వద్దకు ఎగిసింది. అదే ఢిల్లీ ప్రాంతంలో ఎటువంటి మార్పు లేకుండా రూ. 98,000 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
దేశంలో వెపన్స్ తయారీ పెంపు
అంతర్జాతీయ అనిశ్చితులు పెరుగుతున్న నేపథ్యంలో దేశాలు తమ డిఫెన్స్ విధానాల్లో మార్పులు చేస్తున్నాయి. అందుకు భారీగానే నిదులు గుమ్మరిస్తున్నాయి. కొన్నిదేశాలు స్వయంగా ఆయుధాలు సమకూర్చుకుంటున్నా, అత్యాధునిక వెపన్స్ దిగుమతి కోసం ఇతర దేశాలపై ఆధారపడుతున్నాయి. ఇటీవల ఇండియా-పాక్ మధ్య యుద్ధ భయాలు నెలకొంటున్న నేపథ్యంలో భారత ఆర్మీ ఆయుధ మార్కెట్ ఎలా ఉందో తెలుసుకుందాం.దేశీయ ఉత్పత్తిఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా రక్షణ రంగంలో స్వావలంబనపై ప్రభుత్వం ఎప్పటినుంచో దృష్టి సారించింది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, స్వదేశీ ఉత్పత్తిని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా పాత ఇన్సాస్ రైఫిల్స్ స్థానంలో ఏకే-203 అసాల్ట్ రైఫిల్స్ తయారీకి రష్యాతో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. ఎస్ఐజీ సౌర్ 716 రైఫిల్స్‌ను అమెరికా నుంచి కొనుగోలు చేస్తుంది. యూఏఈకి చెందిన కారకల్‌తో క్వార్టర్ బాటిల్ కార్బైన్స్ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఈ తరుణంలో పాక్ ఇండియాతో తలపడి గెలవడం దాదాపు అసాధ్యం.రక్షణ బడ్జెట్భారత్ 2025 సంవత్సరానికిగాను రూ.6.81 లక్షల కోట్ల (80 బిలియన్ డాలర్లు) రక్షణ బడ్జెట్‌ను కేటాయించింది. ఇండియా అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉంది. ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో భారత్ వాటా 9.8%గా ఉంది. దిగుమతులు తగ్గించుకుంటూ క్రమంగా దేశీయ తయారీను పెంపొందించుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఇదీ చదవండి: మేలో లాంచ్ అయ్యే టాప్ 5 స్మార్ట్ఫోన్లుకీలక సరఫరాదారులుప్రస్తుతానికి దేశీయంగా ఆయుధాల ఉత్పత్తి పెరిగినప్పటికీ, అధునాతన ఆయుధాల కోసం భారత్ ఇప్పటికీ దిగుమతులపై ఆధారపడుతోంది. ఈ విభాగంలో ప్రధాన సరఫరాదారులుగా ఉన్న దేశాల వివరాలు కింది విధంగా ఉన్నాయి.రష్యా: చారిత్రాత్మకంగా భారత్‌కు అతిపెద్ద ఆయుధ సరఫరాదారు అయినప్పటికీ దాని వాటా 64% నుంచి 45%కి తగ్గింది.ఫ్రాన్స్: భారత్ ఆయుధ దిగుమతుల్లో 29 శాతం వాటాతో రెండో అతిపెద్ద సరఫరాదారుగా అవతరించింది.అమెరికా: డ్రోన్లు, యుద్ధ విమానాలతో సహా భారత్ దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో 11% సరఫరా చేస్తుంది. -
ఆదివాసీల కోసం ప్రత్యేక డీఎస్సీ కోరుతూ మన్యం బంద్
అల్లూరి జిల్లా: ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ కోరుతూ డీఎస్సీ సాధన సమితి.. మన్యం బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌కు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు తెలిపింది. ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. పర్యాటక ప్రాంతాలు మూతపడ్డాయి. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వ్యాపార వాణిజ్య సముదాయాలను మూసివేశారు.ఈ బంద్‌లో పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, కుంభ రవిబాబు, రేగ మత్స్య లింగం, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఏజెన్సీలో 100 శాతం ఉద్యోగాలు గిరిజనులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం జీవో నెంబర్ 3 ను సీఎం చంద్రబాబు పునరుద్ధరించాలి. లేదా జీవో నెంబర్ 3 కు ప్రత్యామ్నాయం మార్గం చూపించాలి. ఏజెన్సీ ప్రాంతంలో 776 ఉపాధ్యాయుల పోస్టులకు 42 పోస్టులు మాత్రమే దక్కుతున్నాయి.’’ అని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. -
Good Health: వెజ్ తినాలా? నాన్ వెజ్ తినాలా?
ఓ మహిళ.. ఎదురుగా ఉన్న ఓ వ్యక్తితో.. జంతుబలి చేసే హక్కు మీకు ఎవరిచ్చారు..? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. మా ఇష్టం మాకు నచ్చింది మేం తింటాం.. అంటూ అవతలి వ్యక్తి సమాధానం ఇస్తున్నాడు. మాంసాహారం తింటాం అంటే కుదరదు.. ఎందుకు కుదరదో చెబుతాను వినండి.. అంటూ ఆమె శాకాహారం గొప్పతనం, మన సైక్లింగ్ ప్రకృతి నియమాలు ఇతర అంశాలను వివరించారు. మీరు ప్యూర్ వెజిటేరియన్‌గా మారతారా? అని హామీ తీసుకుంది. ఇంత చెప్పిన తర్వాత ఆ మనిషిలో ఆలోచన మొదలైంది. ఇంతకీ ఎవరా మహిళ.. ఆమె చేస్తున్న ప్రచారం ఏమిటి..? ఆమె పేరే విజయలక్ష్మి.. మియాపూర్‌లో నివాసం ఉంటున్నారు. ఓ కార్పొరేట్ స్కూల్లో కంప్యూటర్ సైన్స్ టీచర్. ప్రవృత్తి.. పది మంది గుమిగూడి ఉండే చోట శాకాహారంతో ప్రయోజనాలను వివరిస్తూ శాకాహారమే తినాలంటూ ప్రచారం చేయడం. ఎంతలా వారికి అవగాహన కల్పిస్తున్నారంటే ఆమె మాటలు విన్న తర్వాత చాలా మంది ఇక మాంసాహారం జోలికి వెళ్లకూడదని నిర్ణయం కూడా తీసుకుంటున్నారు. – సికింద్రాబాద్ శాకాహారంలో అనుభూతిని ఆస్వాదిద్దామా..? అంటూ మొదలవుతుంది ఆమె ప్రచారం. యునైటెడ్ వెజిటేరియన్స్ ఫోరం పేరుతో సోషల్ మీడియా వేదికగా ఓ పేజీ క్రియేట్ చేశారు. తనలాంటి భావజాలం ఉన్న వ్యక్తుల్ని ఆ వేదికపైకి రమ్మని పిలుపునిచ్చారు. ఒకరు, ఇద్దరు, ముగ్గురు.. అలా 200లకు చేరింది ఆ సంఖ్య. వీలున్నప్పుడల్లా పదిమంది జనం ఉండే చోట ప్రత్యక్షమవుతారు. శాఖాహారంలోని గొప్పతనాన్ని.. అది తీసుకోవడం వల్ల శరీర అవయవాల మీద పనితీరును.. ఇతర అంశాల్ని చక్కగా వివరించి మాంసాహారానికి దూరం చేసే ప్రయత్నం చేస్తారు. ఆ మాటలు విన్న ఎవరైనా క్చతంగా ఆకుకూరలు, కూరగాయలు గొప్పతనాన్ని ‘వంట’ పట్టించుకోవడం నిజం. పక్కా ప్రణాళికతో ప్రచారం.. యునైటెడ్ వెజిటేరియన్స్ ఫోరం వ్యవస్థాపకురాలైన ఎన్వీ విజయలక్ష్మి పనితీరు చాలా ఆసక్తికరం. స్వచ్ఛందంగా సేవలందించేందుకు సిద్ధమైన వలంటీర్లు ఎంతమంది అందుబాటులో ఉన్నారో తెలుసుకుంటారు. ఫలానా రోజు ఫలానా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఓ చిన్న పోస్టులు పెడతారు. ఆ ఏరియాలో ఉండే వలంటీర్లు.. అందుబాటులో ఉండే వారంతా సుముఖత వ్యక్తం చేస్తే వెంటనే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేస్తారు. తక్కువలో తక్కువ కనీసం 50 నుం 60 మంది ఆ కార్యక్రమానికి హాజరయ్యేలా చూసుకుంటారు. అక్కడికి వచ్చిన వారంతా బృందాలుగా విడిపోయి నాలుగైదు ప్రదేశాలకు వెళ్లి తమ సంస్థ లక్ష్యాన్ని వివరిస్తారు.మారేందుకు మీరు సిద్ధమా..? సోషల్ మీడియా వేదికగా యునైటెడ్ వెజిటేరియన్స్ ఫోరంలో చేరాలని ఉందా? అయితే అదే పేరుతో ఉన్న ఫేస్బుక్, ఇస్ట్రాగామ్ పేజీల ద్వారా గానీ.. సభ్యులుగా చేరిపోవచ్చు. ఆ మీదట వలంటీర్లుగా సేవలు అందించవచ్చు. ఆ మీదట శాకాహారం గొప్పతనాన్ని తెలుసుకొని మీరు శాకాహార ప్రియులుగా మారిపోవచ్చు. పాఠశాలలే టార్గెట్‌గా.. శాకాహారం వినియోగించాలనే ప్రచారాలను జనం రద్దీ ఉండే అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలను టార్గెట్ చేసుకుని ఎక్కువ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. చదువుకునే వయసు నుంచే జంతువధ చేయకూడన్న లక్ష్యాన్ని విద్యార్థుల్లో ఇనుమడింపజేయడం ద్వారా ఎక్కువ ఫలితాలు రాబట్టవచ్చన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. సదస్సులు, సమావేశాలు నిర్వహించడం, పవర్‌పాయింగ్ ప్రెజెంటేషన్లు ఇవ్వడం, కరపత్రాలు, స్టిక్కర్ల ద్వారా వీలున్న అన్ని మార్గాల్లో ప్రచారాలు కొనసాగించి శాకాహార భోజన ప్రియులను రూపొందిస్తున్నాం. పాఠశాలల్లో యునైటెడ్ వెజిటేరియన్స్ ఫోరం కమిటీలు ఏర్పాటు చేయడం, పోటీలు నిర్వహిస్తూ వారికి బహుమతులు, జ్ఞాపికలు అందజేసి ప్రోత్సహిస్తున్నాం. – ఎన్వీ విజయలక్ష్మి, వ్యవస్థాపకురాలు దేశమంతా ఒకే వేదికగా.. యునైటెడ్ వెజిటేరియన్ ఫోరం అనేది ఒక తెలంగాణకు మాత్రమే కాకుండా.. అన్ని రాష్ట్రాల్లోనూ విస్తరింపజేసి.. వీలైనంత ఎక్కువ మంది జనాభాను శాకాహారం వైపు తిప్పటిమే తమ ధ్యేయమని చెబుతున్నారు విజయలక్షి్మ. ఆ దిశగా విస్తృతంగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు చెప్పారామే. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఉండే తమ వాళ్ళ ద్వారా అవగాహన కార్యక్రమాల ద్వారా అవగాహన కార్యక్రమాలను ఫోకస్ చేస్తున్నారు ఈ వెజిటేరియన్ విజయక్ష్మిఆరోగ్య సూత్రాలు వివరిస్తూఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని పాటించడానికి శాకాహారం పాత్ర ఏంటో యునైటెడ్ వెజిటేరియన్స్ ఫోరం ప్రతినిధులు వివరిస్తారు. ఎదుటివారు మాంసాహార ప్రియులైన వారు అడిగే ప్రశ్నలకి శాకాహార పూరితమైన సమాధానాలు ఇచ్చి వెజిటేరియన్స్‌గా మారాలంటూ రిక్వెస్ట్ చేస్తారు. ఒక నెల రోజులు టైం తీసుకోండి.. పప్పు దినుసుల మీద దృష్టి పెట్టండి ఆకుకూరల్లో బలమైన పోషకాల కోసం మీరే తెలుసుకోండి.. మీరు తీసుకునే మాంసాహారాన్ని మేము చెప్పే శాకాహారాన్ని బేరీజు వేసుకోండి అంటూ జనం మెదడుల్లోకి శాఖాహార గొప్పతనాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చేయడమేంటి చాలామందిని మార్చి చూపించారు కూడా.. -
Dharmakirti గెలిచేది..నిలిచేది ధర్మమే...సత్యమే!
బౌద్ధమతాన్ని తార్కికంగా వివరించిన ప్రముఖ ఆచార్యుల్లో ధర్మకీర్తి ఒకడు. నలందా విశ్వవిద్యాలయంలో ఆచార్య ధర్మపాలునికి శిష్యుడై విద్యను ఆర్జిం భిక్షువయ్యాడు. దేశమంతా పర్యటించి అనేక చర్చల్లో, సదస్సుల్లో, సమావేశాల్లో పాల్గొన్నాడు. వాదంలో ధర్మ కీర్తిచే ఓడింపబడినవారు తమ ఓటమిని హుందాగా అంగీకరించకపోగా అవమానించడానికి పూనుకున్నారు. ఆయన రంన తాళపత్ర గ్రంథాలను సేకరిం, వాటిని కట్టగా కట్టి, కుక్క తోకకు ముడివేసి ఆ కుక్క పరుగులు తీసేట్టు దాన్ని గట్టి గట్టిగా కేకలు వేశారు. భయంతో ఆ కుక్క విచ్చలవిడిగా అటూ, ఇటూ పరుగులు పెట్టింది. దాని తోకకు కట్టిన ధర్మకీర్తి రచనలున్న తాళ పత్రాలు చిందరవందరై గాలి వీచి అన్ని దిక్కులకు ఎగిరిపోయాయి. ఆ దృశ్యాన్ని చూసి ధర్మ కీర్తి ప్రత్యర్థులు పగలబడి నవ్వుతూ ధర్మకీర్తిని హేళన చేసి, చులకనగా మాట్లాడారు. ఈ దెబ్బకు ఆయన దిగులు పడి కాళ్ళ బేరానికి వస్తాడని వారు ఆశించారు. కానీ ఆయన చాలా ప్రశాంతంగా, ‘ఈనాడు, ఈ నా గ్రంథాలు ఎలాగైతే అన్ని దిక్కులకు ఎగిరిపోతున్నవో, అలాగే ఒక నాటికి నా భావాలు, నా కీర్తి దశ దిశలకు వ్యాపించి తీరుతుంది’ అన్నాడు. అది అక్షరాలా నిజమైంది. ధర్మమే జయించింది. సత్యమే గెలిచింది.టిబెట్‌లో నేటికీ బౌద్ధ భిక్షువులు ధర్మకీర్తి రచనలను పరమ ప్రామాణికమైనవిగా భావించి ఆయనను గౌరవిస్తారు. రాహుల్ సాంకృత్యాయన్ ధర్మకీర్తిని శ్లాఘిస్తూ ‘విమర్శనాత్మకమైన వాదనా పటిమలోనూ, విస్పష్టమైన విశ్లేషణలోనూ, స్పష్టమైన భావుకతలోనూ ఆయనను మించిన వారు లేరు’ అంటారు. ‘న్యాయ బిందు’, ‘హేతుబిందు’ వంటి ఎనిమిది గ్రంథాలు ధర్మకీర్తి కీర్తి ప్రతిష్ఠలను గగనానికి చేర్చాయి.– రాచమడుగు శ్రీనివాసులు -
'హిట్ 3' ఫస్ట్ డే కలెక్షన్స్.. నాని కెరీర్లో ఇదే టాప్
నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘హిట్3: ది థర్డ్ కేస్’ బాక్సాఫీస్ వద్ద మొదటిరోజే భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఈమేరకు అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రోడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదలైంది. ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటించారు. నానీకి ఓవర్సీస్లో హయ్యెస్ట్ గ్రాసర్ ఫిల్మ్‌గా హిట్-3 రికార్డ్ క్రియేట్ చేసింది.ప్రపంచవ్యాప్తంగా హిట్-3 సినిమా రూ. 43 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. నాని కెరీర్లోనే తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. సులువుగా రూ. 150 కోట్ల మార్క్‌ను ఈ చిత్రం అందుకుంటుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశవ్యాప్తంగానే కాకుండా ఓవర్సీస్లోనూ అర్జున్ సర్కార్ దుమ్మురేపుతున్నాడు. ఓవర్సీస్లో తొలిరోజే 1.2 మిలియన్ డాలర్ల క్లబ్లో ఈ మూవీ చేరింది. ఆపై ‘బుక్‌మై షో’లోనూ ఈ చిత్రం పలు రికార్డులు క్రియేట్ చేసింది. 24గంటల్లోనే 2.70 లక్షల టికెట్స్ అమ్ముడుపోయాయి. నాని కెరీర్లో ఇంతమొత్తంలో టికెట్స్ సేల్ కావడం ఇదే తొలిసారి.కథేంటంటే..ఎస్పీ అర్జున్ సర్కార్(నాని) జమ్ము కశ్మీర్ నుంచి ఏపీకి బదిలీపై వస్తారు. డ్యూటీలో జాయిన్ అయ్యే కంటే ముందే అడవిలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేస్తారు. తర్వాత ఆ కేసును ఆయనే విచారణ చేస్తారు. అలా రెండో హత్య చేస్తున్న సమయంలో అర్జున్ సర్కార్ టీం సభ్యురాలు వర్ష(కోమలి ప్రసాద్) అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటుంది. దీంతో అర్జున్ సర్కార్ హత్యలు ఎందుకు చేస్తున్నాడో ఆమెకు వివరిస్తూ.. సీటీకే(కాప్చర్ టార్చర్ కిల్) డార్క్ వెబ్సైట్ గురించి చెబుతాడు. అసలు సీటీకే ఉద్దేశం ఏంటి? ఆ డార్క్ వెబ్సైట్ రన్ చేస్తున్నదెవరు? వారి లక్ష్యం ఏంటి? అర్జున్ సర్కార్ సీటీకే గ్యాంగ్ ఆటలకు ఎలా అడ్డుకట్ట వేశాడు? ఈ క్రమంలో ఆయనకు ఎదురైన సవాళ్లు ఏంటి? తల్లిలేని అర్జున్ సర్కార్ జీవితంలోకి మృదుల(శ్రీనిధి శెట్టి) ఎలా వచ్చింది? ఆమె నేపథ్యం ఏంటి? అర్జున్ సర్కార్ ఆపరేషన్‌కి ఆమె ఎలా సహాయపడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.SARKAAR'S BOX OFFICE MAYHEM collects a whopping 43+ CRORES GROSS WORLDWIDE on DAY 1 💥💥Natural Star @NameisNani's HIGHEST DAY 1 GROSSER 🔥#HIT3 is the #1 INDIAN FILM WORLDWIDE YESTERDAY ❤🔥Book your tickets now!🎟️ https://t.co/8HrBsV0Ry1#BoxOfficeKaSarkaar… pic.twitter.com/IEuNsxZ5Sn— Wall Poster Cinema (@walpostercinema) May 2, 2025 -
ప్రయాణికులకు అలర్ట్: ఆ మార్గాల్లో పలు రైళ్లు రద్దు
విజయవాడ: నిర్వహణ పనుల కారణంగా చర్లపల్లి-తిరుపతి, కాజీపేట-తిరుపతి మధ్య నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్వో నుస్రత్ మండ్రుప్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి,తిరుపతి (07257) ఈ నెల 8 నుంచి 29 వరకు, తిరుపతి, చర్లపల్లి (07258) ఈ నెల 9 నుంచి 30 వరకు, కాజీపేట, తిరుపతి (07253) ఈ నెల 6 నుంచి 25 వరకు, తిరుపతి, కాజీపేట (07254) ఈ నెల 7 నుంచి 25 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.తెనాలి మార్గంలో .. తెనాలి స్టేషన్ యార్డ్‌లో జరుగుతున్న ట్రాఫిక్ బ్లాక్ పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే పలు ప్యాసింజర్ రైళ్లను ఈ నెల 4న రద్దు చేశారు. అందులో గుంటూరు, రేపల్లె (67249/67250), గుంటూరు, రేపల్లె (67223/67224), తెనాలి,రేపల్లె (67231/67232), తెనాలి,రేపల్లె (67233/67234), విజయవాడ, తెనాలి (67221) రైళ్లు ఉన్నాయి. -
నా కొడుక్కి 'ఆదిపురుష్' చూపించి సారీ చెప్పా: దేవర విలన్
ప్రభాస్ తీవ్ర విమర్శలు మూటగట్టుకున్న చిత్రం ఆదిపురుష్ (Adipurush Movie). ఈ సినిమాలో ప్రభాస్ లుక్ నుంచి వానరాలను చూపించిన విధానం వరకు ప్రతిదానిపైనా ట్రోలింగ్ జరిగింది. వీఎఫ్ఎక్స్ బాలేవని, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan)కు ముందు ఐదు తలలు, దానిపైన ఐదు తలలు పెట్టడమేంటన్న కామెంట్లు వినిపించాయి. మొత్తంగా ఓంరౌత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతోపాటు ట్రోలింగ్ మెటీరియల్‌గా మారిపోయింది.సినిమా చూపించా.. రియాక్షనే లేదుమూడు గంటల నిడివి ఉన్న ఈ సినిమాను తన కుమారుడిని కూర్చోబెట్టి చూపించానంటున్నాడు ఆదిపురుష్ రావణ్ అలియాస్ సైఫ్ అలీ ఖాన్. తాజా నెట్‌ఫ్లిక్స్ ఇండియా యూట్యూబ్ ఛానల్లో సైఫ్ మాట్లాడుతూ.. నేను సినిమాల్లో విభిన్న పాత్రలు చేస్తూ ఉంటాను. అవి చూసి నా 9 ఏళ్ల కుమారుడు తైమూర్.. నువ్వసలు మంచివాడివా? చెడ్డవాడివా? అని అడుగుతుంటాడు. ఈ మధ్యే వాడికి ఆదిపురుష్ చూయించాను. వాడి నుంచి నాకు ఎటువంటి ఆహ్లాదకరమైన స్పందన రాలేదు. కాసేపటికి నన్నో చూపు చూశాడు. నాకు తన ఫీలింగ్ అర్థమై సారీ చెప్పా.. ఇట్స్ ఓకేలే అని నన్ను క్షమించేశాడు అని చెప్పుకొచ్చాడు.పర్సనల్ లైఫ్సైఫ్ అలీ ఖాన్.. నటి అమృత సింగ్‌ను 1991లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు సారా, కుమారుడు ఇబ్రహీమ్ సంతానం. దశాబ్దానికి పైగా అన్యోన్యంగా ఉన్న దంపతులు 2004లో విడిపోయారు. తర్వాత హీరోయిన్ కరీనా కపూర్‌తో ప్రేమలో పడ్డాడు. దాదాపు ఐదేళ్లపాటు జంటగా కలిసున్న వీరు 2012లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 2016లో తైమూర్, 2021లో జెహ్ జన్మించారు. సైఫ్.. దేవర: పార్ట్ 1 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.చదవండి: 'క' చిత్రానికి దక్కిన 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డ్ -
భారత్, పాక్ మధ్య యుద్ధమే.. ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
శ్రీనగర్: పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశం లేకపోలేదని చెప్పుకొచ్చారు. అలాగే, ఈ ఘటనకు భద్రత, నిఘా లోపాలు కూడా ఒక కారణమని అన్నారు.పహల్గాం ఘటనపై తాజాగా ఫరూక్ అబ్దుల్లా స్పందిస్తూ ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ..‘పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోంది. రేపటి రోజు ఎలా ఉండబోతోందో ఎవరికీ తెలియదు. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగే అవకాశం లేకపోలేదు. ఇరు దేశాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పహల్గాం ఉగ్ర దాడి జరగడానికి కారణమైన ఉగ్రవాదులను పట్టుకోవాలి. అలాగే, ఈ ఘటన వెనక ఉన్న వారిని వీలైనంత తొందరగా పట్టుకోవాలి. అప్పుడే యుద్ధాన్ని నివారించే దిశగా ప్రయత్నాలు జరుగుతాయి. భద్రత, నిఘా లోపాలు కూడా ఉగ్ర దాడి జరిగేందుకు ఒక కారణమని అనడంలో సందేహం లేదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు.. పహల్గాం ఘటనపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. ఉగ్రవాదుల బారి నుంచి అతిథుల(పర్యాటకులు)ను కాపాడటంలో తాను విఫలమయ్యానని రాష్ట్ర శాసనసభ వేదికగా ప్రకటించారు. బైసరన్‌లో ఇంత పెద్ద స్థాయిలో దాడి చేయడం మాత్రం 21 ఏళ్లలో ఇదే తొలిసారి. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఎలా క్షమాపణలు చెప్పాలో తెలియడం లేదు. రాష్ట్రానికి వచ్చిన పర్యాటకులను సురక్షితంగా తిరిగి పంపాల్సిన బాధ్యత మాదే. నేను ఆ పనిచేయలేకపోయాను. పహల్గాం ఘటన తర్వాత ఏ ముఖం పెట్టుకొని రాష్ట్ర హోదాను డిమాండ్ చేయాలి. నా రాజకీయాలు అంత చౌకబారువి కాదు. గతంలో రాష్ట్ర హోదా అడిగాం.. భవిష్యత్తులో కూడా అడుగుతాం. కానీ, 26 మంది చనిపోయారు.. ఇప్పుడు రాష్ట్ర హోదా ఇవ్వండి అని కేంద్రాన్ని అడగడం సిగ్గుచేటు. ప్రజలు మాకు మద్దతు ఇస్తే.. ఉగ్రవాదం అంతమవుతుంది’ అని పేర్కొన్నారు. -
Pahalgam tragedy ఐక్యంగా నిలబడటం మనకు తెలుసు
సిసలైన ఉద్వేగాలు సాటి మనుషులకు అర్థమవుతాయి. ఉద్వేగాలలోని నిజాయితీ ఉద్దేశాలలో ఉండదు. ‘పహల్గామ్’ ఘటన తరువాత ఏర్పడిన ఉద్వేగాలనూ, ఉద్దేశాలనూ కాస్త ముందు వెనుకలుగా వేరు చేసి మనమంతా ఒక్కటిగా శత్రువును ఎదుర్కొందాం అనే సందేశాన్ని ఇవ్వడంలో దేశవాసులు దాదాపు సఫలీకృతమయ్యారనే చెప్పాలి. అయితే అదంత సులువు కాలేదు. ఉద్దేశాలున్నవారు వాట్సప్‌లలో మునివేళ్లను కదిలించినంత వేగంగా ఉద్వేగాలున్నవారు కదిలించలేకపోయారు. అయినప్పటికీ వేగంగా మేలుకొని జవాబు చెప్పడానికి ప్రయత్నించారు. ఇందుకు అల్లాహ్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే.ఏప్రిల్ 22న కశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు మరణించారన్న వార్త వినగానే ముందు మనిషిగా, తర్వాత ముస్లింగా ఎంతో బాధను, ఆందోళనను అనుభవించాను. దేశంలోని కోట్ల ముస్లింలు ఇటువంటి పాశవిక దాడికి తీవ్రంగా నాలాగే బాధ పడ్డారు. మతం అడిగి ఇలాంటి దాడి చేశారన్న వార్త వారిని వేదనలో, విషాదంలో ముంచెత్తింది. ఈ తీవ్ర ఘటన తాలూకు విషాదాన్ని అనుభవించాలా, లేకుంటే తమకు ఏ సంబంధమూ లేకపోయినా జరిగే విద్వేష ప్రచారానికి కలత పడాలా అనే ఆందోళనలో వారు తల్లడిల్లారు. అయితే ఎవరైతే చావు నోటి వరకూ వెళ్లి వచ్చారో వారే ఈ పరిస్థితిని కుదుట పరచగలిగారు. మానవీయత ఉన్న కశ్మీరీలు తమ ప్రాణాలకు వారి ప్రాణాలను ఎలా అడ్డు పెట్టి కాపాడారో చెప్పిన కథనాలు దేశ ప్రజలకూ, ముఖ్యంగా ముస్లింలకూ ఊరటనిచ్చాయి. కశ్మీర్ విషయంలో భారత్–పాకిస్తాన్లల మధ్య చాలాకాలంగా సాగుతున్న వైరం లెక్కలేనంత మందిని బలిదీసుకున్నా గత దాడులన్నీ సైన్యంపై జరిగితే, ఈసారి పర్యాటకులపై హిందూ మతం పేరిట జరిగింది. ఈ దాడి వెనుక ఉగ్రవాదుల ప్రధాన ఉద్దేశం దేశాన్ని సంక్షోభంలోకి నెట్టడం, కశ్మీర్‌ను ప్రపంచ దృష్టికి తీసుకురావడం. ఈ ఉగ్రచర్యకు పాల్పడినవారు, వారికి ఆర్థిక సాయం అందింనవారు, స్పాన్సర్లు... పహల్గామ్ అమాయకుల ప్రాణాలను బలిదీసుకోవడంలో పాత్ర పోషింనవారే. వారందరినీ ఈ దాడికి జవాబుదారీగా చేసి, న్యాయస్థానం ఎదుట నిలబెట్టాలి. మతం అడగడం సిగ్గుచేటుప్రపంచంలోని ఏ మతగ్రంథం కూడా ప్రజలను చంపమని చెప్పలేదు. ఈ ఉగ్రదాడిలో బాధితుడి మతాన్ని అడగడం, అతను హిందువా, ముస్లిమా అని గుర్తించడానికి కల్మా పఠించమనడం సిగ్గుచేటు. శాంతిని కోరే భారతీయ ముస్లింలు ఇలాంటి నీచత్వాన్ని ఏ మాత్రం హర్షించరు. నిజమైన మానవుడంటే ప్రాణాలను కాపాడేవాడే కానీ ప్రాణాలను తీసేవాడు కాదు. ఖురాన్‌లోని సూరహ్ అల్–మాయిదా వచనం 5:32 ‘ఒక అమాయకుడిని చంపేవాడు మొత్తం మానవాళిని చంపినట్లే’ అని చెబుతుంది. ఈ సూర కరుణ, సానుభూతి, బలహీనుల రక్షణను ప్రోత్సహిస్తుంది. తాను ముస్లిం అని చెప్పుకొనే వ్యక్తి ఈ భూమిపై ఏ మానవుడినీ చంపడు.భారతదేశ ప్రజలు కోరుకునేది మత విద్వేషాలు కాదు. భారతదేశం ప్రపంచంలోని అన్ని దేశాల శరణార్థులను స్వీకరించిందే తప్ప, ఈ దేశం నుండి ఏ వ్యక్తిని ఇతర ప్రాంతాలకు శరణార్థిగా పంపలేదు. అదే ఈ దేశానికున్న ఘనత. ఇది గొప్ప ఆధ్యాత్మిక ప్రేమగల దేశం. ప్రపంచంలోని ఇతర దేశాల్లో నివసిస్తున్న ముస్లింలతో పోలిస్తే భారతదేశంలో ముస్లింలకు అత్యున్నత గౌరవం, రక్షణ దొరుకుతున్నాయి. ఉగ్రవాదంపై పోరాటంలో ఇక్కడి ముస్లింల పాత్ర ఇప్పుడు కీలకంగా మారింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏ మతాన్నీ కలవరపెట్టకుండా, ద్వేషించకుండా నిరసనలు, ప్రదర్శనలు నిర్వహించవచ్చు. రాజకీయ నాయకుల ప్రసంగాలు, మీడియా వ్యాఖ్యలను ఒక తటస్థ స్థితికి తేవాలి. సమస్యకు పరిష్కారం వెతకాలి. అన్ని మతాల ఆధ్యాత్మిక నాయకులు, సాధువులు, ముస్లిం, హిందూ మతాధికారులు, అన్ని మత పాఠశాలలు, ఇతర విద్యాసంస్థల అధిపతులు, ఉపాధ్యాయులు ఇందులో భాగం కావాలి. అన్ని మతాలను ప్రేమించడం ద్వారా ప్రజల్లో ఐక్యత, ఉమ్మడి విలువలను తీసుకురావాలి. ప్రభుత్వాన్నో, ఫలానా రాజకీయ పార్టీనో విమర్శించి చేతులు దులుపుకోకుండా ఉగ్రవాదాన్ని బలంగా ఎదుర్కోవడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడమే ఇప్పుడు మన ముందున్న బాధ్యత.చదవండి: అమాయకులను పొట్టనబెట్టుకున్నారు: వాళ్ల పాపానికి మేం మూల్యం చెల్లిస్తున్నాం!దేశం ఇలాంటి విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్న సమయంలో మీడియా దేశంలోని భిన్నవర్గాలను బలోపేతం చేయాలి. అంతేకానీ రాజకీయ పార్టీలు, మతాల పేరుతో వర్గాలను విభజించకూడదు. ముస్లింల వల్లే తాము బతికి ఉన్నామని చెప్పిన బాధితుల కుటుంబాల మాటలను మీడియా కూడా ప్లే చేయాలి. దురదృష్టవశాత్తు కొన్ని మీడియా సంస్థలు ఇలా చేయడం లేదు. పౌర హక్కులు, మానవ హక్కుల కార్యకర్తల్లాగే ఇప్పుడు మతస్వేచ్ఛ కార్యకర్తలు అవసరం. మత విద్వేషాన్ని ఆపేందుకు వారి తోడ్పాటు కావాలి. ఇదీ చదవండి: ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్భారత్–పాక్ అణుశక్తిని కలిగి ఉన్న దేశాలు. ఒకసారి యుద్ధం మొదలైందంటే ఇది ఎక్కడ ముగుస్తుందో తెలియదు. అందుకే యుద్ధకాంక్షను ఆపి, శాంతి వైపు చర్చలు జరపాలి. స్నేహపూర్వక దేశాలతో కూర్చుని ఈ సమస్యను పరిష్కరించాలి. యుద్ధమనేది అంతిమ పరిష్కారం. ఉగ్రదాడిలో అమాయకులు తమ ప్రాణాలు కోల్పోయారు. ఆ అమరవీరులకు వందనం చేద్దాం. భారతం చెప్పిందే మన సందేశం. కౌరవులు, పాండవుల మధ్య ఏ ఫిర్యాదులైనా ఉండొచ్చు... బయటి శత్రువుకు మేము నూటా ఐదుగురం అన్నాడు ధర్మరాజు. బయట శత్రువు కన్నెత్తి చూస్తే ఈ దేశంలోని అన్ని మతాల వారు ఐక్యమై సింహాల్లా గర్జించగలరని చాటడమే ఇప్పుడు కావలసింది. జై భారత్. జై హింద్.భారతం చెప్పిందే మన సందేశం. కౌరవులు, పాండవులు మధ్య ఏ ఫిర్యాదులైనా ఉండొచ్చు... బయటి శత్రువుకు మేము నూటా ఐదుగురం అన్నాడు ధర్మరాజు.-జహారా బేగంవ్యాసకర్త సామాజిక కార్యకర్త, యూఎస్ఏ -
తిరుమల: శేషాచలం అడవుల్లో ఎగసిపడుతున్న మంటలు
సాక్షి, తిరుమల: శేషాచలం అడవుల్లో మళ్లీ మంటలు చెలరేగాయి. మంటలు ఎగసిపడుతున్నాయి. అన్నమయ్య జిల్లా బాలపల్లి డివిజన్, మొగలిపెంట వద్ద మరోసారి మంటలు వ్యాపించాయి. అటవీశాఖ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు నాలుగు బృందాలుగా అటవీశాఖ సిబ్బంది యత్నిస్తున్నారు.ఫారెస్ట్ అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగానే మంటలు చెలరేగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు నివారణకు అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేదు అటవీప్రాంతంలోకి అనుమతి లేకుండా ఎవ్వరు వెళ్లరాదని అధికారులు అంటున్నారు.కాగా, గత ఏడాది కూడా శేషాచలం అడవుల్లో మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. పాపవినాశనం వైపు మంటలు వేగంగా వ్యాపించాయి. కోరుట్ల అటవీ ప్రాంతం, కాకులకొండల్లో భారీగా మంటలు వ్యాపించాయి. వేలాది ఎకరాల్లో అడవీ సంపద దగ్దమైంది. -
నేడు (మే 2) సన్‌రైజర్స్‌తో తలపడనున్న గుజరాత్.. గిల్ గాయంపై అప్డేట్
ఐపీఎల్ 2025లో ఇవాళ (మే 2) గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. గుజరాత్ హోం గ్రౌండ్ అహ్మదాబాద్‌లో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ సన్‌రైజర్స్‌కు అత్యంత కీలకంగా పరిగణించబడుతుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతైరనట్లే. ఈ సీజన్లో ఇప్పటికే సీఎస్కే, రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.సన్‌రైజర్స్ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. గుజరాత్ విషయానికొస్తే.. 9 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో నాలుగో స్థానంలో కొనసాగుతూ, ప్లే ఆఫ్స్ బెర్త్‌కు ప్రధాన పోటీదారుగా ఉంది. ప్రస్తుత పాయింట్ల పట్టికలో ముంబై, ఆర్సీబీ, పంజాబ్ టాప్-3లో ఉన్నాయి. ఢిల్లీ, లక్నో, కేకేఆర్ ఐదు నుంచి ఏడు స్థానాల్లో ఉన్నాయి.గిల్ గాయంపై అప్డేట్గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. గిల్ ఆ మ్యాచ్‌లో వెన్ను సమస్య కారణంగా ఫీల్డింగ్‌కు (బ్యాటింగ్ చేశాడు) దిగలేదు. అతడి గైర్హాజరీలో రషీద్ ఖాన్ గుజరాత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. గిల్ గాయంపై గుజరాత్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ విక్రమ్ సోలంకి తాజాగా అప్డేట్ ఇచ్చాడు. గిల్ ఇవాళ సన్‌రైజర్స్‌తో జరుగబోయే మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడని స్పష్టం చేశాడు.గిల్ గాయంపై సానుకూల అప్డేట్ రావడంతో గుజరాత్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. లీగ్ కీలక దశలో గిల్ అందుబాటులో ఉండకపోతే అది గుజరాత్ ప్లే ఆఫ్స్ అవకాశాలను భారీగా ప్రభావితం చేస్తుంది. ఈ సీజన్లో గిల్ వ్యక్తిగతంగా అద్భుతమై ఫామ్‌లో కొనసాగుతూ (9 మ్యాచ్‌ల్లో 4 హాఫ్ సెంచరీల సాయంతో 389 పరుగులు చేసి ఈ సీజన్ లీడింగ్ రన్ స్కోరర్ల జాబితలో ఏడో స్థానంలో ఉన్నాడు), తన జట్టును కూడా విజయవంతంగా నడిపిస్తున్నాడు. రాజస్థాన్ మ్యాచ్‌లో గిల్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఆ మ్యాచ్‌లో రషీద్ అనుభవారాహిత్యం కారణంగా గుజరాత్ ఓటమిపాలైంది. రషీద్ కీలక సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం కావడంతో పాటు బౌలర్లను సరిగ్గా మేనేజ్ చేయలేకపోయాడు.నేటి మ్యాచ్‌కు గిల్ అందుబాటులోకి రావడం గుజరాత్లో జోష్ నింపనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఆ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకడంతో పాటు ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంటుంది. ఈ సీజన్లో గుజరాత్ నేటి మ్యాచ్‌తో కలుపుకుని మరో ఐదు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మే 6న ముంబై ఇండియన్స్‌తో, మే 11న ఢిల్లీ క్యాపిటల్స్‌తో, మే 14న లక్నోతో, మే 18న సీఎస్కేతో తలపడనుంది.నేటి మ్యాచ్‌కు తుది జట్లు (అంచనా)గుజరాత్: శుభ్‌మన్ గిల్ (C), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (WK), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మసన్‌రైజర్స్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (WK), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్ (C), హర్షల్ పటేల్, సిమర్జీత్ సింగ్, జీషన్ అన్సారీ, మహమ్మద్ షమీ -
పోస్టాఫీస్ స్కీములకు కొత్త విధానం
పోస్టాఫీస్ పొదుపు పథకాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంటుంది. ఈ స్కీములు మారుమూల గ్రామీణులకు సైతం అందుబాటులో ఉన్నప్పటికీ వీటిని తెరిచేందుకు అనుసరించే పేపర్ వర్క్ సామాన్యులకు కాస్త ఇబ్బందిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఎంపిక చేసిన పొదుపు పథకాలను తెరవడానికి తపాలా శాఖ ఇప్పుడు పూర్తి డిజిటల్ ప్రక్రియను ప్రవేశపెట్టింది.మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (ఎంఐఎస్), టైమ్ డిపాజిట్ (టీడీ), కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సీ) వంటి పొదుపు పథకాలను తెరవడానికి పేపర్లతో పనిలేకుండా ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణను తపాలా శాఖ అమలుచేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తిగా కాగిత రహితంగా, వేగంగా ఉంటుంది. ఫిజికల్ డిపాజిట్ స్లిప్ అవసరం ఉండదు.మంత్లీ ఇన్కమ్ స్కీమ్, టైమ్ డిపాజిట్, కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వంటి ప్రసిద్ధ చిన్న పొదుపు పథకాలను తెరవడానికి ఆధార్ ఆధారిత వీ-కేవైసీ ప్రక్రియను ఏప్రిల్ 23 నుండి తపాలా శాఖ అమలు చేస్తోంది. పోస్టాఫీస్ పొదుపు ఖాతాలు తెరవడం, నిర్వహించడం కోసం ఆధార్ ఆధారిత ఈ-కేవైసీని ఇదివరకే జనవరి 6 నుండి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు డిపాజిట్ వోచర్లు, భౌతిక ఫారాలు నింపే సాంప్రదాయ పద్ధతి కూడా అందుబాటులో ఉంది. కస్టమర్లు తమకు అనువైన విధానాన్ని ఎంచుకోవచ్చు.ఆధార్ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ద్వారా ఖాతా మూసివేత, ఖాతా బదిలీలు, నామినేషన్ అప్డేట్స్ వంటి ఫీచర్లు ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నాయని, త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. అప్పటి వరకు ఈ సేవలు సంప్రదాయ ప్రక్రియలోనే కొనసాగుతాయి. పేపర్‌లెస్ కేవైసీ ప్రక్రియను కొత్త కస్టమర్లతోపాటు ఇప్పటికే ఉన్న ఖాతాదారులందరూ వినియోగించుకునేలా చూడాలని అన్ని సర్కిళ్ల సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. -
కుల గణనపై మాజీ సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: దేశంలో జనాభా లెక్కలతో పాటు కుల గణన చేపట్టాలన్న కేంద్రం నిర్ణయంపై మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్పందించారు. జనగణనలో భాగంగా కుల గణన చేయడం చారిత్రక అవసరం అని ఎన్వీ రమణ అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే, జనగణనలో ప్రతి సామాజిక సూచికను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.తాజాగా మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘కులం, కులం ఆధారిత వివక్ష ఒక కఠినమైన వాస్తవం. చాలా కాలం పాటు మనం ఈ వాస్తవాన్ని అంగీకరించకుండా విస్మరించడానికే ప్రాధాన్యం ఇచ్చాం. ఇప్పుడు మనం చైతన్యంతో ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైంది. కుల గణన నిర్ణయం తీసుకున్న భారత ప్రభుత్వానికీ హృదయపూర్వక అభినందనలు. కులాన్ని ఒక గుర్తింపుగా తీసుకుని జనగణన (Census)లో భాగం కుల గణన నిర్వహించడం సరైన నిర్ణయం.ప్రామాణికమైన డేటాను సేకరించకపోతే సమగ్ర కోణంలో అభివృద్ధి కార్యాచరణను రూపొందించడం సాధ్యపడదు. కుల గణనతో మన సమాజంలోని అన్ని వర్గాలకు అధికారంలో, ఆర్థిక అభివృద్ధిలోను వారికి రావాల్సిన వాటా లభించేలా చేయడంలో తోడ్పడుతుంది. సామాజిక, ఆర్థిక, ఇతరత్రా అసమానతలను తగ్గించడంలో కూడా కుల గణన ఎంతో దోహదపడుతుంది. జనగణనలో ప్రతి సామాజిక సూచికను కూడా పరిగణనలోకి తీసుకోవాలి అని అన్నారు. -
పాతచీరలను అప్‌సైక్లింగ్ చేసి..స్టైలిష్‌గా మార్చేయండిలా..!
అప్ సైక్లింగ్ వార్డ్రోబ్లను చెక్ చేసుకుంటే కుప్పలుగా ఉన్న చీరలు, దుపట్టాలు కొన్నిచీరలు తమ పెళ్లినాటివి అయి ఉంటాయి. అమ్మ, అమ్మమ్మలు ఇచ్చిన జ్ఞాపకాల చీరలు సరేసరి మరికొన్నింటికి బ్లౌజ్‌లు పాతవయ్యావని పక్కన పడేసినవి కొన్ని... ఓల్డ్మోడల్ అయ్యాయని కొన్నిపక్కన పెట్టేసినవి ఉంటాయి.ఇలాంటి వాటన్నింటినీ ఈ సమ్మర్ రోజుల్లో కొత్తగా రూపు కట్టేలా ప్లాన్ చేయవచ్చు. మారుతున్న ఫ్యాషన్ ట్రెండ్లను గమనిస్తూ కాలానుగుణంగా పాతచీరలను అప్‌సైక్లింగ్ చేసి, మీదైన కొత్తశైలిని వ్యక్తీకరించవచ్చు.అప్‌సైక్లింగ్ విధానం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా, పర్యావరణ అనుకూలతకు ప్రాధాన్యం ఇచ్చినవారం అవుతాం. వృధానూ అరికట్టవచ్చు.అంచులను మార్చి...అంచు ఉన్న కాటన్, పట్టుచీరలతో చేసిన ఇండోవెస్ట్రన్ మోడల్ డ్రెస్సులు ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నాయి. షిఫాన్, సిల్క్, కాటన్, ఆర్గంజా, నెటెడ్ చీరల నుండి అనార్కలీలు, లాంగ్ గౌన్లు, కుర్తీలు డిజైన్ చేయించవచ్చు. పట్టు, బ్రొకేడ్, బెనారస్ వంటి వాటితో ఓవర్ కోట్స్, లాంగ్ జాకెట్స్, పలాజోలు, స్కర్ట్లు డిజైన్ చేయవచ్చు.ప్యాచ్ వర్క్పల్లూ, లేదా అంచులు కొద్దిగా చిరిగిన చీరలకు చిరిగిన అంచును తీసివేసి, జరీ, సీక్వెన్స్, కుందన్ వర్క్ చేసిన ప్యాచ్‌వర్క్ అంచును జత చేసి, తిరిగి వాడచ్చు. పాతకాలం నాటి చీరలను సల్వార్ సూట్లుగా మార్చవచ్చు. చీర పల్లూని పైభాగానికి ఉపయోగించవచ్చు. అంచులను నెక్కి, చేతులకు వాడచ్చు. కాంట్రాస్ట్ ప్యాచ్‌వర్క్ బోర్డర్లనూ జత చేయవచ్చు. బాటమ్, దుపట్టా కోసం మరొక పాత చీరను ఉపయోగించవచ్చు.లాంగ్ గౌన్లువన్పీస్ లాంగ్గౌన్లు ఎప్పుడూ ట్రెండ్‌లోనే ఉంటున్నాయి. అందుకని, పాతచీరను ఉపయోగించి లాంగ్ గౌన్‌ను తయారు చేయించుకోవచ్చు. అదనపు మెటీరియల్‌కి కాంట్రాస్ట్ కలర్ లేదా మ్యాచింగ్ ఫ్యాబ్రిక్‌ను వాడచ్చు. చీరలను ఉపయోగించిన డ్రెస్సులనే కాదు, కటింగ్‌లో వృథాగా పడేసే ఫ్యాబ్రిక్‌తో ఫ్యాషన్ జ్యువెలరీనీ రూపొందించవచ్చు. ఇది ఇండోవెస్ట్రన్ వేర్కి ముఖ్యంగా వేసవిలో మరింత ఆధునిక అట్రాక్షన్‌ను అద్దుతుంది. (చదవండి: పేరెంట్స్ 'నో' చెప్పడం నేర్చుకోవాలి..! హెచ్చరిస్తున్న నిపుణులు) -
పరామర్శకూ తీరికలేదా బాబూ!
సింహాచలం అప్పన్న ఆలయంలో హాహాకారాలు.. మృత్యు ఘోష.. ఎవరికైనా బాధనిపిస్తుంది. కాని ఆంధ్రప్రదేశ్ సర్కారుకు మాత్రం అవేమీ పట్టినట్లు లేదు. కూటమి నేతలందరూ అమరావతి సంబరంలో మునిగి తేలుతున్నారు. పలుమార్లు శంకుస్థాపనలు జరిగిన అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఇంకోసారి శంకుస్థాపన చేయిస్తున్నారు.సింహాచలంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలి అయింది సామాన్యులే.. అమరావతి హంగామాతో తీవ్రంగా నష్టపోతున్నదీ పేదలే. హిందూ మతంలో ఒక నమ్మకం ఉంటుంది. ఏదైనా ఒక కుటుంబంలో అశుభం జరిగితే నిర్దిష్టంగా కొన్నాళ్లపాటు ఎలాంటి శుభ కార్యక్రమాలు జరపరు. హిందూ మతోద్దారకులమని ప్రచారం చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సనాతన హిందూ అని చెప్పుకునే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు. శంకుస్థాపన కార్యక్రమాలను వాయిదా వేసుకోలేదు. పాలకులు రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను కుటుంబంలా పరిగణిస్తారు. ఆ ప్రకారం చూస్తే ఒక ప్రముఖ ఆలయంలో జరిగిన ఈ దుర్ఘటనలో కొత్తగా కట్టిన గోడ కూలి ఏడుగురు మరణించినా తమ ప్రోగ్రాం ఆపుకోవడానికి ఇష్టపడలేదు. సింహాచలం మృతుల కుటుంబాలను పరామర్శించడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు వెళ్లలేదు.అంటే వారికి ఏదో అనుమానం ఉండబట్టే అటువైపు వెళ్లకుండా ఉన్నట్లు అనిపిస్తుంది.మామూలుగా అయితే ఒక ప్రసిద్ద పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఘటనలు సంభవిస్తే వెంటనే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు అంతా వెళ్లి సహాయ చర్యలను పర్యవేక్షించి బాధితులకు స్వాంతన చేకూర్చడానికి యత్నిస్తారు. కాని వీరిద్దరూ ఆ పని చేయలేదు. కొద్ది నెలల క్రితం వైకుంఠ ఏకాదశి టిక్కెట్ల కోసం తిరుపతి వెళ్లిన వేలాది భక్తులు తొక్కిసలాటకు గురయ్యారు. ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఆ తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఆ సమాచారం వచ్చిన వెంటనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు పోటీ పడి తిరుపతి వెళ్లారు.ఏదో చేస్తున్నట్లు హడావుడి చేశారు. అలాంటి వారు సింహాచలం ఎందుకు వెళ్లలేదు? ప్రధాని మోడీ అమరావతి వస్తున్నందున వెళ్లలేక పోయారని చెప్పవచ్చు కానీ మూడు గంటల ఖాళీ కూడా లేదనడం అతిశయోక్తి అవుతుంది. పైగా ఇప్పుడు వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కడ నుంచైనా పర్యవేక్షణ చేయవచ్చు. పవన్ కళ్యాణ్ కు ఆ ఇబ్బంది లేదు కదా?మరి ఆయన ఎందుకు సింహాచలం వెళ్లలేదు? దీనికి రెండు,మూడు కారణాలు చెబుతున్నారు. అక్కడకు వెళ్లితే భక్తులలో ఉన్న కోపం అంతా తమపై చూపే అవకాశం ఉందని, వారు ప్రభుత్వ నిర్వాకంపై నిలదీస్తే ఇబ్బంది అవుతుందని అనుకుని ఉండవచ్చ అంటున్నారు. అమరావతి పునః శంకుస్థాపన పనుల పేరుతో తప్పించుకునే అవకాశం ఉండడం. మరొకటి చావుల వద్దకు వెళ్లి రావడం అశుభం అని ఎవరైనా సలహా ఇచ్చారేమో తెలియదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు నిజంగానే హిందూ మతాచారాలపై అంత శ్రద్దగా ఉంటారా అంటే అదీ గ్యారంటీ లేదు. ఏ మతం వారివద్దకు వెళ్లితే ఆ మతమే గొప్పదని చెప్పి వస్తుంటారు. రాజకీయాల కోసం మతాన్ని వాడుకుంటారు.గత గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబు కుటుంబం స్నానమాచరించే ఘట్టాన్ని సినిమా తీయడం కోసం సామాన్య భక్తులను నిలిపి వేయడం, ఒక్కసారిగా గేటు తెరవడం వల్ల తొక్కిసలాట జరిగి 29 మంది మరణించడం జరిగింది. అప్పుడు చంద్రబాబు తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో యత్నాలు చేశారు. చివరికి రోడ్డు ప్రమాదాలలో చనిపోవడం లేదా? కుంభమేళాలో చనిపోలేదా? అంటూ వితండ వాదం చేశారు. అంతే తప్ప అంత పెద్ద ఘటన జరిగితే మామూలుగా అయితే పదవి నుంచి తప్పుకుంటారు. ప్రాంతీయ పార్టీ కనుక ఆయనను పార్టీలో ఎవరూ ప్రశ్నించరు కనుక ఆ ప్రస్తావనే ఉండదు. పోనీ కనీసం ఒక కానిస్టేబుల్ పై కూడా చర్య తీసుకోకపోవడం విశేషం. తిరుపతి తొక్కిసలాట ఘటన జరిన తర్వాత పవన్ కళ్యాణ్ క్షమాపణల డ్రామా తెలిసిన సంగతే.చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌లు ఏమి మాట్లాడింది అందరికి తెలుసు. అక్కడ చైర్మన్ లేదా, అధికారులపై చర్య తీసుకోలేదు. వారిని పదవుల నుంచి తప్పించలేదు. నిజంగా హిందూ మత విశ్వాసాలు నమ్మేవారైతే అలా చేస్తారా? అన్న విమర్శలను పలువురు చేశారు. చివరికి ఒక రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. గోదావరి పుష్కరాల మరణాలపై వేసిన కమిషన్ ఏ తరహా రిపోర్టు ఇచ్చిందో, తిరుపతి ఘటనపై కూడా రిపోర్టు అందుకు భిన్నంగా వస్తుందా అన్నది కొందరి సందేహం. పుష్కరాల తొక్కిసలాటలో తప్పు భక్తులదే అని ఆ కమిషన్ తేల్చింది. ఇప్పుడు సింహాచలం ఘటనపై కూడా విచారణ కమిటీని నియమించినా, ఎంతవరకు ప్రయోజనం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. గోడ కూలడానికి నాణ్యత లోపమని కాకుండా, భక్తుల రద్దీ, తోపులాట అని నివేదికలు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో ఆలయాలలో ఏ చిన్న ఘటన జరిగినా, దాని వెనుక టీడీపీ, జనసేన రాజకీయ శక్తుల ప్రమేయం ఉన్నా, దానినంతటిని జగన్ కు ఆపాదించి ఎంత రచ్చ చేసేవారో గుర్తు చేసుకుంటేనే కంపరం కలుగుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత సైతం అదే ధోరణి ప్రదర్శించారు. తిరుమల లడ్డూ లో జంతు కొవ్వు కలిసిదంటూ దారుణమైన అసత్యాన్ని చంద్రబాబు, పవన్ లు ప్రజలకు చెప్పారు. దీనివల్ల కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని, దైవానికి అపచారం చేసినట్లు అవుతుందని వారు ఫీల్ కాలేదు. తమ రాజకీయ ప్రయోజనం కోసం ఎంతకైనా దిగజారతామన్నట్లుగా వారు వ్యవహరించారు. ఈ ఘటన తర్వాత పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకు వేసి తాను అన్ అప్పాలజిటిక్ సనాతన హిందూ అని ప్రకటించుకుని కొత్త వేషం కట్టారు.అసలు సనాతన హిందూయిజం ఏమి చెబుతుందో తెలియకుండానే, తానేదో వేద శాస్త్రాలు అన్నిటిని పుక్కిట పట్టినట్లుగా మాట్లాడారు. విశేషం ఏమిటంటే ఆయన భార్య విదేశీయురాలు. క్రైస్తవ మతానికి చెందిన వారు.అలాగే పవన్ కు పుట్టిన వారు సైతం క్రైస్తవమే తీసుకున్నారు. మరి అక్కడ ఈయన సనాతనమేమైందో తెలియదు. అనవసరంగా సినిమా డైలాగులు చదివితే ఇలాంటి అప్రతిష్టే వస్తుంది. చంద్రబాబు తన రాజకీయం కోసం ఏ మతాన్ని అయినా వాడుకోగలరు.ఆయన తెలివితేటలు వేరు.ఆయనను మించి ఏదో చేసి బీజేపీ వారి మెప్పు పొందాలని పవన్ చేస్తున్న ఈ ప్రయత్నాల వల్ల ఆయన పరువు పోగొట్టుకుంటున్నారు. పోనీ నిజంగానే అంత సనాతన హిందూ అయితే సింహాచలం ఎందుకు వెళ్లలేదు.ఒక సంతాప సందేశం ఇచ్చి వదలివేశారే.అమరావతి కార్యక్రమ ఆహ్వానంలో తన పేరు వేయలేదని మొదట అలిగారని, దాంతో ప్రభుత్వం మరో కార్డు వేసిందని చెబుతున్నారు. తన డిమాండ్ నెరవేరకపోతే ఏమైనా సింహాచలం వెళ్లేవారేమో. తిరుమల గోవుల మరణాలు, కాశీనాయన క్షేత్రంలో భవనాల కూల్చివేత, తిరుమల, బ్రహ్మం గారి మఠం తదితర ఆధ్యాత్మిక కేంద్రాలలో మత్తు పదార్ధాల వాడకం వంటి ఆరోపణలు వస్తున్నా ఈ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టలేక పోతోందన్న విమర్శలు వస్తున్నాయి. సింహాచలంలో చందనోత్సవానికి ఐదుగురు మంత్రుల కమిటీ కూడా ఉందట. వారంతా ఏమి చేశారో తెలియదు. కాని గోడ కూలి ఏడుగురు మరణించారు. చిన్న ఆలయ గోడ నిర్మాణమే చేయలేని వారు రాజధాని నిర్మాణం చేస్తారట అంటూ సోషల్ మీడియాలో వ్యంగ్య వ్యాఖ్యానాలు వచ్చాయి.అదే టైమ్ లో జగన్ విజయవాడ వద్ద కృష్ణానదికి కట్టిన రిటైనింగ్ వాల్ ఏ రకంగా స్ట్రాంగ్ గా ఉందీ వివరిస్తూ కూడా వీడియోలు వచ్చాయి. సింహాచలం ఘటన తర్వాత జగన్ వెంటనే అక్కడకు వెళ్లి మృతుల కుటుంబాలకు భరోసా ఇచ్చివచ్చారు. చంద్రబాబు, పవన్ లు మాత్రం సాకులు వెతుక్కుంటూ కూర్చున్నారు. ఎల్లో మీడియా మాత్రం సింహాచలం ప్రమాదాన్ని తగ్గించి చూపడానికి నానా పాట్లు పడింది. ఏది ఏమైనా మత సెంటిమెంటును రాజకీయాలకు వాడుకోవడం మంచిది కాదు.అది ఎప్పటికైనా వారికే తగులుతుంది.ఈ నేపథ్యంలో పాలకులు చేసే పాపాలు తమకు శాపాలుగా మారుతున్నాయని ప్రజలు సెంటిమెంట్ గా భావించే పరిస్థితి ఏర్పడింది. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
NCERT చెరిపేస్తే చెరిగిపోతుందా చరిత్ర?
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసర్చ్ అండ్ ట్రయినింగ్ (ఎన్సీఈఆర్టీ) 2025–26 విద్యాసంవత్సరం నుంచి అమలులోకి రావడం కోసం ప్రచురింన ఏడో తరగతి పాఠ్య పుస్తకం మొదటి భాగం వెలువడిన సందర్భంగా అందులో గతం నుం కొనసాగిన, రద్దయిపోయిన, మారిన అంశాల గురించి వార్తా కథనాలు ఈ సోమవారం సంచలనం సృష్టించాయి.పాఠ్య పుస్తకాలు మార్చడాన్ని ఎవరూ తప్పు పట్టనక్కరలేదు. తప్పనిసరిగా పాఠ్య పుస్తకాలు ఎప్పటికప్పుడు మారవలసిన అవసరం ఉంటుంది. ఆ రంగంలో కొత్త పరిశోధనలు జరిగి కొత్త ఆవిష్కరణలు బైటపడినప్పుడు ఆ కొత్త విషయాలు విద్యార్థులకు అందుబాటులోకి తేవడానికి పాఠ్య పుస్తకాలలో మార్పులూ చేర్పులూ చేయవలసి ఉంటుంది. కానీ ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలలో గత కొద్ది సంవత్సరాలుగా చేస్తున్న మార్పులూ, చేర్పులూ, తొలగింపులూ ఆ యా శాస్త్ర రంగాలలో జరిగిన నూతన అన్వేషణలకు సంబంధింనవి కావు. అవి ఆ సంస్థనూ, విద్యా శాఖనూ, భారత ప్రభుత్వాన్నీ ఇవాళ నడుపుతున్నవారి భావజాలానికి తక్షణ ప్రయోజనాలకు అనుగుణమైనవి. ఏదో ఒక భావజాలం మాత్రమే చెప్పడం విద్యార్థుల చిన్నారి మనసులను కుంంపజేసి, కళ్లకు గంతలు కట్టడమే. అలాగే ఐదు సంవత్సరాల పాలనాధికారం కోసం గద్దెనెక్కిన వారు తమ తక్షణ ప్రయోజనాలను న్నారి పిల్లల మనసులపై సుదూర ప్రభావం పడేలా నింపడం అనుచితం. ఇప్పుడు ఏడో తరగతి కోసం కొత్తగా విడుదల చేసిన ‘ఎక్స్‌ప్లోరింగ్ సొసైటీ – ఇండియా అండ్ బియాండ్ (భాగం 1)’ అనే పుస్తకం ఇప్పటివరకూ ఉండిన చరిత్ర, భౌగోళిక శాస్త్రం, పౌరనీతి (సామాజిక, ఆర్థిక జీవనం) అనే మూడు విడివిడి పుస్తకాలను తొలగించి ఆ స్థానంలో ఒకే సమగ్ర పుస్తకంగా తయారయింది. రెండో భాగం కూడా త్వరలో వెలువడుతుందని అంటున్నారు గానీ, ఈ పుస్తకం వరకే చూస్తే చాలా మార్పులు కనబడుతున్నాయి. ‘ప్రపంచం’, ‘గత వైభవ దృశ్యం’, ‘మన సాంస్కృతిక వారసత్వం-జ్ఞాన సంప్రదాయాలు’, ‘పాలన- ప్రజాస్వామ్యం’, ‘మన చుట్టూ ఉన్న ఆర్థిక జీవనం’ అనే ఐదు ఇతివృత్తాలతో ఈ పుస్తకం ఉంది. అంతకు ముందరి ఏడో తరగతి చరిత్ర పుస్తకం ఏడో శతాబ్ది నుంచి భారత చరిత్రను పరిచయం చేయగా దానికి భిన్నంగా ప్రస్తుత పుస్తకం ఆరో శతాబ్దితో ముగుస్తుంది. అందువల్ల పాత పుస్తకంలో ఉండిన మధ్య యుగాల చరిత్ర, ఢిల్లీ సల్తనత్, ముఘల్ పాలన వంటి పాఠాలు లేకుండా పోయాయి. చరిత్రలో ఒక భాగాన్ని న్నారి పిల్లల పాఠ్యాంశాల్లోం తొలగించినంత మాత్రాన ఆ చరిత్రను రద్దు చేయగలమని అనుకోవడం హాస్యాస్పదం. కోవిడ్ తర్వాత న్నారి విద్యార్థుల మీద పాఠ్యాంశాల భారం ఎక్కువగా ఉండగూడదనే సదుద్దేశంతో పాఠ్యాంశాల హేతుబద్ధీకరణ పేరుతో కొన్ని పాఠ్యాంశాలను కుదించడం ప్రారంభించారు. ముఘల్ చరిత్రలో కొంత భాగాన్ని, డార్విన్ జీవ పరిణామవాద సిద్ధాంతాన్ని, పీరియాడిక్ టేబుల్‌ను పాఠ్యాంశాలలో కుదించారు. ప్రస్తుత పుస్తకం మరొక అడుగు ముందుకు వేసి కొన్ని పాఠ్యాంశాలను పూర్తిగానే తొలగింంది. అయితే ‘భారం తగ్గించడం కోసం పాఠ్యాంశాల తగ్గింపు, తొలగింపు’ అనే సూత్రం కూడా త్తశుద్ధితో పాటించలేదు. కొన్ని కొత్త పాఠాలు వచ్చి చేరాయి. ‘భూమి పుణ్యభూమి ఎలా అవుతుంది’ అని ఒక అధ్యాయం చేర్చి, ప్రత్యేక స్థలాలను మతాలు ఎలా పవిత్రంగా భావిస్తాయో ఒక పాఠం చేర్చారు. ద్వాదశ జ్యోతిర్లింగాల గురిం, చార్ ధామ్ యాత్ర గురిం, శక్తి పీఠాల గురిం ఏడో తరగతి పిల్లలకు పాఠాలు పెట్టారు. అలాగే ‘అరవై ఆరు కోట్ల మంది పాల్గొన్న కుంభమేళా’ గురించి పాఠం చేర్చారు. కౌటిల్యుడి అర్థశాస్త్రం, పాణిని వ్యాకరణం, ఆర్యభట్టు ఖగోళ శాస్త్రం, గుప్త సామ్రాజ్యంలో శాస్త్ర పరిశోధనలు వంటి ప్రాచీన భారత మేధా కృషి గురించి పాఠాలు చేర్చారు. వర్ణ–కుల వ్యవస్థ ప్రాచీన భారత సమాజంలో స్థిరత్వం సాధించడంలో నిర్వహింన పాత్ర గురిం ఒక పాఠం పెట్టి, బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత కుల వ్యవస్థ కరడుగట్టి అసమానతలకు దారి తీసిందని రాశారు. ఆరో శతాబ్దం నుంచి ఇరవై ఒకటో శతాబ్దానికి గంతు వేసి ప్రస్తుత ప్రభుత్వపు ‘మేక్ ఇన్ ఇండియా’, ‘బేటీ బచావో బేటీ పఢావో’, ‘అటల్ సొరంగం’ నిర్మాణం వంటి విషయాలు రాశారు. ఇలా మనం ఏకీభవింనా ఏకీభవించకపోయినా చరిత్ర లో జరిగిపోయిన వాస్తవ ఘటనలను, పరిణామాలను చెప్పకుండా ఉండాలనుకుంటే ఆ మేరకు చిన్నారి పిల్లల మనసులలో, పరిజ్ఞానంలో అనవసరమైన, ప్రమాదకరమైన ఖాళీలు, శూన్యాలు ఏర్పడతాయి. ఉద్దేశపూర్వకంగా ఖాళీలు వదలడం జ్ఞాన సముపార్జన శక్తిని ధ్వంసం చేసే, ఆలోచనా శక్తిని కురచబరిచే పద్ధతి. ఎటువంటి విషయమైనా చెప్పి, దాని పట్ల విమర్శనాత్మకంగా ఉండాలనే సందేశం ఇవ్వవలసిన చోట, కొన్ని విషయాలను తుడిచేయగలమని అనుకోవడం అనుతం. ఈ పద్ధతి ఎన్సీఈఆర్టీ వంటి ప్రామాణిక సంస్థ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. అది పాఠశాల విద్యా ప్రమాణాలను అభివృద్ధి చేయడానికి 1961లో కేంద్ర ప్రభుత్వం రపొందించిన అత్యున్నత ప్రవణాల స్వతంత్ర సంస్థ. అది చేసే అనేక పనులలో భాగంగా పాఠ్యాంశాలను రూపొందించి, వాటి ఆధారంగా ఆ యారంగాల నిపుణుల చేత పాఠ్యపుస్తకాలు రాయిం, మూడు నాలుగు అంచెల పర్యవేక్షణ, పరిశీలన, సవరణల తర్వాత అచ్చువేసి దేశవ్యాప్తంగా పంపిణీ చేసే పథకం 1970ల నుం సాగుతున్నది. ముఖ్యంగా ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి సామాజిక శాస్త్రాలు, విజ్ఞాన శాస్త్రాలు, భాషా సాహిత్యాల పుస్తకాలు ఆ యా తరగతుల వారు మాత్రమే కాక యూపీఎస్సీ పరీక్షార్థులు, సాధారణ పాఠకులు కూడా చదువుకునేంత ఆసక్తికరంగా తయారయ్యాయి. నిష్ణాతులు రాసిన, దశాబ్దాల పాటు అపారమైన గౌరవాన్ని చూరగొన్న ఆ పుస్తకాలను అడ్డదిడ్డంగా మార్చి, సంఘ్ శాఖలలో ఇన్నాళ్లుగా చెబుతున్న వక్రీకరింన, సంకుతమైన, కళ్లకు గంతలు కట్టే చరిత్రను ఇప్పుడు పాఠ్యపుస్తకాలకు ఎక్కిస్తున్నారు. ఎటువంటి పరిశోధన లేకుండా, వాస్తవాల పట్ల గౌరవం లేకుండా ఐటీ సెల్స్‌లో వండి వార్చిన అసత్యాల, అర్ధసత్యాల, వాట్సప్ యూనివర్సిటీ చరిత్రకు పాఠ్యపుస్తకాల గౌరవం కల్పిస్తున్నారు. భవిష్యత్ తరాన్ని ధ్వంసం చేస్తున్నారు. -ఎన్ వేణుగోపాల్ సీనియర్ జర్నలిస్ట్ -
శరీరానికి సరిపడే ఆహారాలే తీసుకోవాలి..! పోషకాలపై దృష్టి పెట్టాలి..
ఇంటిల్లిపాదికి శక్తిని ఇవ్వడానికి కష్టపడే మహిళలు ఎలాంటి ఆహారం తీసుకుంటారో ఒకసారి గమనిస్తే కొన్ని విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. అందరూ తిన్నాక మిగిలినదో, ఫ్రిజ్‌లో ఉంచి తీసినవి తినడమో చాలా మంది చేస్తుంటారు. సమయానుకూలంగా ఆహారాన్ని తీసుకోరు. ఈ నిర్లక్ష్యం వల్లే ప్రపంచవ్యాప్తంగా మహిళలు, గర్భిణులు 30 శాతానికి పైగా రక్త హీనతతో బాధపడుతున్నారని నివేదికలు చూపుతున్నాయి. పోషకాలపై దృష్టి అవసరంజీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు కేవలం ఆహార ప్లానింగ్ వల్లనే కాదు... తిన్నది జీర్ణం కాకపోవడం, మలబద్దకం వంటి వాటితోనూ వస్తుంటాయి. తమ శరీరానికి ఏ ఆహారాలు సరిపడుతున్నాయో, సమస్య దేని వల్ల వస్తుందో తెలుసుకోవాలి. అప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోవాలి అనే అవగాహన కలుగుతుంది. సహజంగా మహిళలు రుతుక్రమంలో ఉన్నప్పుడు ప్రతి నెలా కొంత రక్తం పోతుంటుంది. దానిని భర్తీ చేయడానికి ఐరన్ సమృద్ధిగా లభించే బీట్రూట్, వేరుశనగ వంటి నట్స్ తీసుకోవాలి. ఆహారం తయారు చేసినప్పుడే ఈ విషయాన్ని ఆలోచించుకోవాలి. ఖరీదైన ఆహారంలోనే పోషకాలు ఉంటాయనుకుంటే పొరబాటు. ఆకుకూరలు, మొలకెత్తిన గింజలు, తృణధాన్యాలనూ ఆహారంలో చేర్చుకోవాలి.పరీక్షలతో లోపాల గుర్తింపుఆహారం ద్వారా శరీరానికి పోషక విలువలు ఎంతమేరకు అందుతున్నాయి, హార్మోన్ల స్థితి ఎలా ఉంది.. అనే విషయాలు అర్థం చేసుకోవడానికి కొన్ని రక్తపరీక్షలు, ఫంక్షనల్ టెస్ట్‌లు ఉన్నాయి. వీటి ద్వారా పోషకాహార లోపాలను గుర్తించవచ్చు. హార్మోన్ల అసమతుల్యతను అంచనా వేయడంలోనూ, ఇతర ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడంలోనూ ఈ టెస్టులు సహాయపడతాయి. కండరాల పటుత్వానికి40 నుంచి 50 ఏళ్ల మహిళల్లో కండరాల పటుత్వం తగ్గుతుంది. ఈ వయసులో సమతుల ఆహారంపై దృష్టిపెట్టకపోతే ఆ తర్వాత వయసులో మరిన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. అందుకని ఐరన్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లు, జింక్, మెగ్నీషియం, బీ కాంప్లెక్స్, విటమిన్ డి ... ఉండే ఆహారాలతోపాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ తీసుకోవాలి. విశ్రాంతికీ ప్రాధాన్యత ఇవ్వాలిసమతుల ఆహారం తీసుకోవడానికి ఎంత శ్రద్ధ చూపుతామో పనుల వల్ల అలసిన శరీరానికి తగినంత విశ్రాంతినివ్వాలి అనే విషయంలోనూ అంతే జాగ్రత్త చూపాలి. అందుకు ఎనిమిది గంటల పాటు కంటినిండా నిద్ర ఉండాలి. ఒత్తిడిని బ్యాలెన్స్ చేసుకోగలగాలి. రుతుక్రమ దశలోనూ, మెనోపాజ్ దశలోనూ భావోద్వేగాలలో మార్పు మహిళల్లో ఎక్కువ చూస్తుంటాం. ఆహారం నుంచి తగినన్ని పోషకాలు అందక΄ోతే నిపుణుల సాయంతో సప్లిమెంట్స్ వాడాలి. ప్రతి పోషకాన్నీ కవర్ చేస్తూ సరైన ఆహారం తీసుకోవడం, ఫిట్‌గా ఉండటం చాలా ముఖ్యం. – డాక్టర్ సమత తూళ్ల, ఎమ్.డి, మెడికల్ డైరెక్టర్, కో–ఫౌండర్, పిఎమ్ఎక్స్ హెల్త్ (చదవండి: పేరెంట్స్ 'నో' చెప్పడం నేర్చుకోవాలి..! హెచ్చరిస్తున్న నిపుణులు) -
అమరావతి రీలాంచ్.. పరువు కోసం బాబు సర్కార్ పాట్లు
సాక్షి, విజయవాడ: పరువు నిలుపుకోవడం కోసం చంద్రబాబు ప్రభుత్వం పాట్లు పడుతోంది. అమరావతి పునః ప్రారంభ కార్యక్రమానికి ప్రజలను బలవంతంగా తరలింపునకు ప్రభుత్వం నానా తిప్పలు పడుతోంది. 5 లక్షల మందిని తరలించే బాధ్యత అధికారులు, ఉద్యోగులకు అప్పగించింది. రాష్ట్ర వ్యాప్తంగా 6500 బస్సులు ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం.. అన్ని ప్రాంతాల నుంచి ప్రజలను తరలించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.ప్రతి డ్వాక్రా గ్రూపు నుంచి ఏడుగురు సభ్యులు తప్పక హాజరు కావాలంటూ హుకుం జారీ చేసింది. హాజరుకాని డ్వాక్రా గ్రూపులను ఆన్లైన్లో తొలగిస్తామంటూ హెచ్చరికలిచ్చిన సర్కార్.. సంక్షేమ పథకాలు అమలు నిలిపివేస్తామంటూ ఆదేశాలిచ్చింది. యనిమేటర్ల ఆడియో లీక్‌తో చంద్రబాబు సర్కార్ బండారం బట్టబయలైంది. సచివాలయ ఉద్యోగులు, అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.5 లక్షల మంది తరలిస్తామని ప్రభుత్వం ప్రకటించగా.. ప్రభుత్వం.. పి4 బహిరంగ సభ ప్లాప్ కావడంతో ప్రభుత్వంలో గుబులు పుట్టిస్తోంది. ప్రధాని మోదీ రాక నేపథ్యంలో భారీగా ప్రజల తరలింపుకు ప్రయత్నాలు చేస్తోది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు నిన్నటి నుండి బస్సుల్లో జనం, డ్వాక్రా మహిళలు తరలింపు కొనసాగుతోంది. అన్ని ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సుల్లో తరలిస్తున్నారు. -
ప్రభాస్ సినిమాపై పుకార్లు.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
‘రాజాసాబ్’తర్వాత ప్రభాస్(Prabhas) నటించబోయే సినిమా ఏంటి? అనేదానిపై రకరకాల చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఈ సినిమా తర్వాత ప్రభాస్ స్పిరిట్(Spirit) సినిమా చేయాల్సింది. ఈ మేరకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పనులు కూడా ప్రారంభించారు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లాల్సింది. కానీ ప్రభాస్ మనసు మార్చుకున్నాడని, స్పిరిట్‌ని పక్కకు పెట్టి ప్రశాంత్ వర్మతో సినిమా చేయబోతున్నాడనే వార్త గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అలాగే సందీప్ రెడ్డి వంగా కూడా స్పిరిట్ కంటే ముందే ‘యానిమల్’ సీక్వెల్ చేయబోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి. తాజాగా ఈ రూమర్స్‌పై స్పిరిట్ సినిమా నిర్మాత క్లారిటీ ఇచ్చారు. సందీప్‌రెడ్డి వంగా ‘స్పిరిట్’ చేసిన తర్వాతనే ‘యానిమల్ పార్క్’ తెరకెక్కిస్తాడని చెప్పాడు. మరో రెండు మూడు నెలల్లో ‘స్పిరిట్’ షూటింగ్ ప్రారంభం కానుందన్నారు. 2027లో ఈ చిత్రం విడుదల చేస్తామని ప్రకటించారు. భూషన్ కుమార్ ప్రకటనతో ప్రభాస్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.కాగా, ప్రభాస్ ప్రస్తుతం ఇటలీలో టూర్లో ఉన్నాడు. తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాత రాజాసాబ్ షూటింగ్లో పాల్గొంటారు. ఆ తర్వాత భూషన్ చెప్పినట్లుగా స్పిరిట్ చేస్తారు. సందీప్ కోరిక మేరకు ఈ సినిమా కోసం ప్రభాస్ వరుసగా 65 రోజుల కాల్షీట్స్ ఇచ్చారట.ఈ మూవీ తర్వాత హనురాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’(ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్లో కూడా పాల్గొనే అవకాశం ఉంది. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం స్పిరిట్, పౌజీతో పాటు ప్రశాంత్ వర్మ సినిమా కూడా ఉంది. అలాగే ప్రశాంత్ నీల్‌తో సలార్ 2, నాగ్ అశ్విన్‌తో ‘కల్కి 2’ చేయాల్సి ఉంది. -
ట్రెంట్ బౌల్ట్ ట్రిపుల్ సెంచరీ
ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ టీ20ల్లో అరుదైన మైలురాయిని తాకాడు. పొట్టి ఫార్మాట్లో ఈ కివీ బౌలర్ 300 వికెట్ల క్లబ్లో చేరాడు. తద్వారా టీ20 క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన 36వ బౌలర్‌గా, మూడో న్యూజిలాండ్ బౌలర్‌గా (టిమ్ సౌథీ, ఐష్ సోధి తర్వాత) నిలిచాడు. బౌల్ట్ ఈ ఫార్మాట్లో 257 మ్యాచ్‌లు ఆడి 302 వికెట్లు తీశాడు. ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 1) రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌల్ట్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు (జైస్వాల్, నితీశ్ రాణా, జోఫ్రా ఆర్చర్) తీసిన బౌల్ట్ ముంబై విజయంలో కీలకపాత్ర పోషించాడు. బౌల్ట్‌తో పాటు కర్ణ్ శర్మ (4-0-23-3), బుమ్రా (4-0-15-2), హార్దిక్ పాండ్యా (1-0-2-1), దీపక్ చాహర్ (2-0-13-1) కూడా సత్తా చాటడంతో ముంబై 217 పరుగుల భారీ లక్ష్యాన్ని విజయవంతగా కాపాడుకోగలిగింది. ముంబై బౌలర్లు మూకుమ్మడిగా రెచ్చిపోవడంతో రాజస్థాన్ రాయల్స్ 16.1 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది. తద్వారా ముంబై 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. రికెల్టన్ (61), రోహిత్ (53), సూర్యకుమార్ (48 నాటౌట్), హార్దిక్ (48 నాటౌట్) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది.భీకర ఫామ్‌లో బౌల్ట్ఈ సీజన్లో ఆరంభ మ్యాచ్‌ల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన బౌల్ట్.. గత ఐదు మ్యాచ్‌లుగా చెలరేగి బౌలింగ్ చేస్తున్నాడు. తొలి 6 మ్యాచ్‌ల్లో కేవలం 5 వికెట్లు తీసిన బౌల్ట్.. చివరి 5 మ్యాచ్‌ల్లో ఏకంగా 11 వికెట్లు తీసి ఈ సీజన్ లీడింగ్ వికెట్ టేకర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్లో ముంబై వరుస విజయాల బాట పట్టడానికి బౌల్ట్ కూడా ఓ ప్రధాన కారకుడు. బౌల్ట్‌తో పాటు బుమ్రా, చాహర్ ఫామ్‌లోకి రావడంతోనే ముంబై డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించింది. బౌలర్లకు తోడు బ్యాటర్లు (రోహిత్, రికెల్టన్, స్కై) కూడా చెలరేగుతుండటంతో ముంబై తిరుగులేని విజయాలు సాధిస్తుంది.ముంబై డబుల్ హ్యాట్రిక్.. రాజస్తాన్ ఔట్రాజస్థాన్పై గెలుపుతో ముంబై డబుల్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఈ పరాజయంతో రాజస్థాన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన రెండో జట్టుగా నిలిచింది. రాజస్థాన్‌కు ముందు సీఎస్కే కూడా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.టాప్‌లో రషీద్ ఖాన్టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ పేరిట ఉంది. రషీద్ 471 టీ20 మ్యాచ్‌ల్లో 641 వికెట్లు తీశాడు. రషీద్ తర్వాత డ్వేన్ బ్రావో (631), సునీల్ నరైన్ (584) అత్యధిక టీ20 వికెట్లు తీశారు. భారత్ తరఫున అత్యధిక టీ20 వికెట్లు తీసిన రికార్డు చహల్ (377) పేరిట ఉంది. -
పేరెంట్స్ 'నో' చెప్పడం నేర్చుకోవాలి..! హెచ్చరిస్తున్న నిపుణులు
పేరెంటింగ్ నియమాలు తరానికీ తరానికీ మారుతున్నాయి. కొత్త తరం పేరెంటింగ్‌లో చాలా ఫ్లెక్సిబుల్‌గా, ఎంçపతీతో ఉంటోంది. పిల్లలతో చాలా దృఢమైన బంధాన్ని కోరుకుంటోంది. పిల్లల ఎమోషనల్ వెల్ బీయింగ్ కోసం ఎటువంటి భయాలూ, బిడియాలూ లేకుండా తాము అనుకున్నది ధైర్యంగా కమ్యూనికేట్ చేయడాన్ని ప్రోత్సహిస్తున్నారు. పిల్లల స్వేచ్ఛను ప్రోత్సహిస్తున్నారు. మొత్తంగా చెప్పాలంటే రోల్‌మోడల్ పేరెంటింగ్ రూల్ పాటించాలనుకుంటున్నారు. యాభైఏళ్ల కిందట పేరెంటింగ్‌లో క్రమశిక్షణ అనే పదం వీర విహారం చేసేది. నాన్న ఇంట్లో ఉంటే పిల్లల అల్లరి వినిపించకూడదు, పుస్తకం పట్టుకుని కనిపించాలి. నాన్న ప్రశ్నిస్తే వినయంగా సమాధానం చెప్పాలి. నాన్న ఎదుట పడాలంటే భయం. ఈ చట్రంలో పెరిగిన తరం, ఆ తర్వాతి తరం ఇప్పుడు పేరెంట్స్ అయ్యారు. ఈ జెన్ జెడ్ పేరెంట్స్ తమ పిల్లల విషయంలో భౌతికపరమైన క్రమశిక్షణ పాటించడం కంటే తల్లిదండ్రుల మాట మీద విశ్వాసం, అర్థం చేసుకోవడం దిశగా ప్రోత్సహిస్తున్నారు. ఎమోషనల్ ఇంటలిజెన్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.ఇంటి నిండా బొమ్మలే!జెన్ జెడ్ పేరెంట్స్ తమ బాల్యంలో ఎదురైన సంఘటనలను బేరీజు వేసుకుంటూ ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదోననే నియమావళిని రూపొందించుకుంటున్నారు. బాల్యంలో తాము నొచ్చుకున్న సందర్భాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ పిల్లల మనసు గాయపరచకూడదనే నియమాన్ని పాటిస్తున్నారు. ఇందులో విపరీతమైన షాపింగ్ ఒకటి. గత తరం పేరెంట్స్ చేతిలో డబ్బు పరిమితంగా ఉండేది. ఇప్పుడు డబ్బు పుష్కలంగా అందుతోంది. రోజువారీ శ్రామికుల కుటుంబాలు కూడా తమ రాబడిలో ఎక్కువ భాగాన్ని సరదాలకు ఖర్చుపెడుతున్నాయి. అప్పట్లో ఏడాదికో రెండేళ్లకో ఒక బొమ్మ కొనిస్తే... ఇప్పుడు ప్రతి ఇంట్లో పాతిక–ముప్పై బొమ్మలకు తక్కువ కాకుండా షెల్ఫ్‌లు నిండిపోతున్నాయి. పిల్లలు తమ భావోద్వేగాలను వ్యక్తం చేసే క్రమంలో ‘నో’ చెప్పడాన్ని ప్రోత్సహిస్తున్న జెన్ జెడ్ పేరెంటింగ్ పిల్లలకు తాము కూడా ‘నో’ చెప్పవచ్చనే సంగతి మర్చిపోతున్నారు. ఇక మగపిల్లలు ఏడవకూడదనే సామాజిక షరతును ప్రశ్నిస్తున్న మనస్తత్వ నిపుణులు ‘మగపిల్లలను కూడా ఏడవనివ్వండి’ అంటున్నారు. కాలం మారుతున్న క్రమంలో వస్తున్న మార్పులివన్నీ. ‘మగపిల్లలను కూడా ఏడవనివ్వాలి, వారిలోని సున్నితత్వాన్ని పరిరక్షించాలి’ అని చెబుతున్న న్యూజెనరేషన్ పేరెంటింగ్ దానిని అమలు చేయడంలో మాత్రం తార్కికతను కోల్పోతోందన్నారు ట్రాన్స్పర్సనల్ హోలిస్టిక్ కోచ్ అర్పితాగుప్త. సంతోష క్షణాలు!ఈ తరంలో దాదాపుగా అన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీలే. పేరెంట్స్ కూడా తమ బిడ్డ ఆడుకోవడానికి అక్క,చెల్లి, అన్న, తమ్ముడు లేని బాల్యాన్ని మిగిల్చామని అర్థం చేసుకుంటున్నారు. తోబుట్టువులు లేని లోటు తీర్చడం కోసం పిల్లలతో తల్లులే కాదు తండ్రులు కూడా చక్కగా ఆడుకుంటున్నారు. వారిని ఆటల్లో ఎంగేజ్ చేయడానికి తగినంత సమయం కేటాయిస్తున్నారు. వాళ్లు పెద్దయిన తర్వాత బాల్యాన్ని గుర్తు చేసుకుంటే తల్లిదండ్రులతో ఆడుకున్న తీపి జ్ఞాపకాలు గుర్తు వచ్చే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే పిల్లల మెదళ్లలో విరిసిన ఆలోచనను చక్కగా వ్యక్తం చేయగలిగేటట్లు ప్రోత్సహిస్తున్నారు. పిల్లల ఆలోచనలను, ఆకాంక్షలను కొట్టిపారేయకుండా తగిన ప్రాధాన్యతనిస్తున్నారు. పిల్లల కెరీర్ విషయంలోనూ వారి అభిరుచులను సమాజం గిరిగీతలను పట్టించుకోకుండా స్వాగతిస్తున్నారు. మొత్తంగా చూస్తే తమ బాల్యంలో తమకు కలలుగానే ఉండిపోయిన అన్నింటినీ తమ పిల్లలకు అందిస్తున్నారు. ఒక్క మాటలో చె΄్పాలంటే పిల్లల బాల్యంలో తామను తాము ప్రతిక్షేపించుకుంటున్నారు. తమకు దక్కని సంతోషాలను చాలా ఎక్కువగా అందించాలని తపన పడుతున్నారు. ఆదర్శవంతమైన పేరెంటింగ్‌కి ప్రతిరూపాలుగా ఉండాలని అభిలషిస్తున్నారు. ఆచరణలో ఒకింత సమతుల్యత, సమన్వయం అలవరుచుకుంటే జెన్ జెడ్ పేరెంటింగ్ రోల్ మోడల్ పేరెంటింగ్ అవుతుంది.ఓ ఆశ్చర్యకరమైన సంఘటనఅది మహారాష్ట్రలో ఓ పర్యాటక ప్రదేశం. నడిరోడ్డు మీద ట్రాఫిక్ స్తంభించి΄ోయింది. ఏం జరిగిందో చూద్దామని కొందరు తమ వాహనాలు దిగి ముందుకెళ్లారు. అక్కడ ఓ యువకుడు, 30 ఏళ్లుంటాయి, తన కారును చూసుకుంటూ బిగ్గరగా ఏడుస్తున్నాడు. ‘ఏమైంది’ అని అడిగారెవరో. కారు మీద పడిన గీతలు చూపిస్తూ మళ్లీ భోరుమన్నాడతడు. అది అతడికిష్టమైన కారు, ముచ్చటపడి కొనుక్కున్న కారని చెప్పి వెక్కిళ్లు పెడుతున్నాడు. అతడి తల్లిదండ్రులు కారు లోపల ఉన్నారు. ‘మా అబ్బాయి చాలా సున్నితమనస్కుడండీ. తనకిష్టమైన కారుకి గీతలు పడితే భరించలేక΄ోతున్నాడు’ అన్నారు వాళ్లు సమర్థింపుగా. మగవాళ్లు ఏడవకూడదని బాల్యంలోనే మైండ్‌ని కండిషన్ చేసే పెంపకం ఒకప్పటిది. ఎమోషన్స్సకి లింగభేదం ఉంటుందా అని ఏడుపు వచ్చినప్పుడు అన్ కండిషనల్‌గా ఆ ఎమోషన్ని వ్యక్తం చేయవచ్చనే వాదన నేటిది. అయితే పైన చెప్పుకున్న కండిషన్లో ఆ కుర్రాడి కారణంగా ఇతరులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ట్రాఫిక్‌లో ఇబ్బంది పడుతున్న వాళ్లు కూడా ఎమోషన్స్‌ని ఆపుకోలేక కోపాన్ని ప్రదర్శిస్తే పరిస్థితి విషమిస్తుంది. పరిణతి చెందిన వాళ్లం కొంతమందిమి కలగచేసుకుని ‘కారు పక్కకు తీసుకుని, ఎమోషన్ కంట్రోల్ అయిన తర్వాత ప్రయాణాన్ని కొనసాగించండి’ అని సర్దిచెప్పి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చిందని చెబుతున్నారు అర్పితాగుప్తా, హోలిస్టిక్ కోచ్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి(చదవండి: -
భళా వైభవ్...వైకల్యానికి ‘చెక్’ పెట్టాడు!
సెరిబ్రల్ పాల్సీతో చక్రాల కుర్చీకే పరిమితమైన వైభవ్‌కు చెస్ పరిచయం చేశాడు తండ్రి గౌతమ్. ఆనాటి నుంచి ఒంటరి ప్రపంచం నుంచి చదరంగ ప్రపంచంలోకి వచ్చాడు వైభవ్. తండ్రితో కలిసి తరచుగా చెస్ ఆడేవాడు. క్రమంగా ఆటలో నైపుణ్యం సాధించాడు. ఆ నైపుణ్యం అతడిని జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది.దిల్లీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ వైభవ్ తొలి టోర్నమెంట్. తొలి ప్రయత్నంలోనే రేటింగ్‌ను సాధించడం విశేషం. చెస్‌లో మరిన్ని శిఖరాలను అధిరోహించడానికి అవసరమైన స్ఫూర్తిని ఆ రేటింగ్ ఇచ్చింది.గ్రాండ్ మాస్టర్’ కావాలనే లక్ష్యం పెట్టుకున్నాడు. దేశవిదేశాల్లో జరిగే టోర్నమెంట్స్‌కు వైభవ్‌తో పాటు అతడి తండ్రి గౌతమ్ కూడా వెళుతుంటాడు. మ్యాచ్ సమయంలో అతడి పక్కనే కూర్చొని నొటేషన్లు రాస్తుంటాడు. కొడుకు కెరీర్ పట్ల తండ్రి చూపిస్తున్న అంకితభావం మాటలకు అందనిది.ఇదీ చదవండి: అత్తగారు, ఆవకాయ పచ్చడి : ఉపాసన కొణిదెల వీడియో వైరల్ View this post on Instagram A post shared by vaibhav gautam (@vaibhav.gautam_official) ఆటలంటే ఇష్టపడే గౌతమ్ తన కుమారుడు కూడా ఆటలు ఆడాలనుకునేవాడు. న్నప్పటి నుం వీల్‌చైర్‌కే పరిమితమైన వైభవ్ క్రికెట్, వాలీబాల్, కబడ్డీ...లాంటి ఆటలు ఆడలేడు. ‘ఇంతేనా’ అని కుమారుడి గురించి ఆలోచిస్తున్న సమయంలో ‘చెస్’ అనే ఆలోచన మెరిసింది. ఇక అప్పటి నుంచి కుమారుడికి చెస్‌పై ఆసక్తి కలిగేలా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. తానే గురువుగా మారాడు. మొదట్లో తండ్రి ఒక గేమ్, కొడుకు ఒక గేమ్ గెలిచేవారు. ఆ తరువాత మాత్రం పరిస్థితి పూర్తిగా మారి΄ోయింది. తండ్రిపై ఎప్పుడూ వైభవే విజయం సాధించేవాడు. దీంతో కుమారుడిపై ఆ తండ్రికి మరింత నమ్మకం కలిగింది.‘యస్. మా వాడు సాధించగలడు’ ఒకటికి పదిసార్లు అనుకునేవాడు. ఆటలో మరింత నైపుణ్యం కోసం రామ్‌కుమార్ అనే కోచ్‌తో వైభవ్‌కు ఆన్లైన్లో కొన్ని నెలలు శిక్షణ ఇప్పించాడు. ఆ తరువాత జీబి జోషిని కోచింగ్ ఇవ్వాల్సిందిగా అభ్యర్థించాడు. ‘మీరు ఎంత ఫీజు అడిగినా ఇస్తాను’ అన్నాడు. ‘ఒక్క పైసా కూడా అక్కర్లేదు’ అంటూ వైభవ్‌కు ఉచిత కోచింగ్ ఇవ్వడానికి ముందుకు వచ్చాడు జోషి. ఆటలో ఎప్పటికప్పుడు రేటింగ్ పెంచుకుంటూ అద్భుతం అనిపించు కుంటున్నాడు వైభవ్.‘వైభవ్ శారీరక స్థితికి వీల్‌చైర్‌లో కూర్చుని చెస్ ఆడడం అనేది అంత సులువైన విషయమేమీ కాదు. దీని కోసం ఎంతో కఠోర సాధన చేశాడు’ అంటున్నాడు గౌతమ్. జీవనోపాధి కోసం గౌతమ్ దిల్లీలో చిన్న షాప్ నడుపుతున్నాడు. ‘మీరు ఎక్కువ సమయం వైభవ్‌తోనే గడపాల్సి వస్తుంది కదా’ అని అడిగితే ఆ తండ్రి చెప్పిన జవాబు...‘మా అబ్బాయికి కచ్చితంగా మంచి టైమ్ వస్తుంది. అప్పటి వరకు నా టైమ్ గురించి ఆలోచించడం లేదు’ ‘ఇలా అయితే ఎలా?’ అని ఎప్పుడూ బాధ పడలేదు వైభవ్. ఆ యువకుడు నడవలేడు. మాట్లాడలేడు. 90 శాతం వైకల్యం ఉన్న దివ్యాంగుడు. తనను నిస్సహాయ స్థితిలో నుంచి బయటికి తీసుకువచ్చి కొత్త ప్రపంచం చూపించింది చదరంగం.... -
మధుమతి అనుమానాస్పద మృతి.. వివాహేతర సంబంధమే కారణం
సాక్షి, ఎన్టీఆర్: ఏపీకి చెందిన ప్రముఖ తెలుగు యూట్యూబర్ మధుమతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం తీవ్ర కలకలం సృష్టించింది. మధుమతి తన అమ్మమ్మ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఆమె మృతికి వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది.వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లాలోని విస్సన్నపేట మండల పరిధిలోని ఏ కొండూరు గ్రామానికి చెందిన మధుమతి(22) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండేది. ఇన్స్టాగ్రామ్ (Instagram)లో రీల్స్ చేస్తూ తనకుంటూ ఓ సపరేట్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకుంది. అదేవిధంగా లక్షల్లో సబ్స్క్రైబర్లు ఆమె సొంతం. ఈ క్రమంలోనే మధుమతికి అప్పటికే వివాహం అయిన ప్రతాప్ (Prathap)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త కొన్నాళ్లకు వివాహేతర బంధానికి దారి తీసింది.అయితే, ఉన్నట్టుండి మధుమతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. తాజాగా మధుమతి తన అమ్మమ్మ ఇంటికి వెళ్లగా.. అక్కడే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా, తమ కుమార్తె ఆత్మహత్యకు ప్రతాప్ కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అతడిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని మధుమతి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో యూట్యూబర్ అనుమానాస్పద మృతిఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలంలో మధుమతి అనే యూట్యూబర్ అనుమానాస్పద మృతిఏ కొండూరు గ్రామానికి చెందిన మధుమతి (22)కి తెల్లదేవరపల్లికి చెందిన ప్రతాప్‌తో వివాహేతర సంబంధంతమ కుమార్తెను తీసుకెళ్లి ప్రతాపే ఉరి వేసి చంపేశాడని ఆరోపిస్తున్న… pic.twitter.com/mKLsLE3UjK— Telugu Scribe (@TeluguScribe) May 2, 2025Video Credit: Telugu Scribe -
నటి రెజీనా ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..! రెండు వారాలకోసారి కలబంద గుజ్జు..
‘‘నా ఉదయం వేడి వేడి మసాలా టీతో మొదలవుతుంది. ఆ ఎనర్జీతో మొదలయ్యాక రోజంతా అదే ఉత్సాహం, శక్తితో ఉండటానికి నాకు సరిపడే ఆరోగ్యవంతమైన డైట్‌ని తీసుకుంటాను’’ అని రెజీనా కాసాండ్రా పేర్కొన్నారు. హీరోయిన్గా పలు భాషల్లో సినిమాలు చేస్తూ... బిజీ బిజీగా ఉండే రెజీనా కాసాండ్రా డైట్ విషయం లో స్ట్రిక్ట్‌గా ఉంటానంటున్నారు. కానీ వారంలో ఒక్కరోజు మాత్రం ‘చీట్ డే’ అని నవ్వేశారు. ఇక ఆ రోజు ఆయిల్ అని, ఫ్యాట్ అని నియమాలేం పెట్టుకోకుండా అన్నీ తింటానన్నారు. ఇంకా రెజెనా చెప్పిన విశేషాలు ఈ విధంగా... ఉదయం మసాలా టీ తాగిన కాసేపటికి అల్పాహారానికి మొలకలు, బాదంలాంటి డ్రై ఫ్రూట్స్ (పొట్టు తీసినవి), పండ్ల రసం తీసుకుంటాను. బ్రేక్‌ఫాస్ట్ బాగా తినాలి. అందుకే వీటితోపాటు ఇడ్లీ, దోసె తింటాను. సాంబార్ కాంబినేషన్ ఉండాల్సిందే. మధ్యాహ్నం భోజనంలో కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారానికి ప్రాధాన్యం ఇస్తాను. బీన్స్, క్యారెట్, ఇంకా ఉడికించిన కూరగాయలు, పప్పు తప్పకుండా ఉండాల్సిందే. అన్నంతోపాటు ఇవన్నీ తింటే ఇటు కార్బోహైడ్రేట్స్ అటు ప్రోటీన్ రెండూ అందుతాయి. బ్రౌన్రైస్ని ప్రిఫర్ చేస్తాను. మన రోజుని మనం హెవీ బ్రేక్‌ఫాస్ట్‌తో మొదలుపెట్టి, రాత్రి వరకూ క్రమ క్రమంగా తగ్గించుకుంటూ తినాలి. డిన్నర్ ఎంత లైట్ అయితే అంత బెటర్. అందుకే నేను సూప్ లాంటి వాటిని ప్రిఫర్ చేస్తాను. ఇప్పటివరకూ చెప్పినది ఒక రోజులో తీసుకునే డైట్ అయితే నా వారం ప్లాన్ ఎలా ఉంటుందంటే... వారంలో ఒక రోజంతా కేవలం పండ్ల రసాలతోనే సరిపెట్టేస్తాను. ఒక రోజంతా పండ్ల రసాలు మాత్రమే తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న మలినాలు పోతాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు ఇలా మలినాలను పోగొట్టుకోవడం కూడా చాలా ముఖ్యం. అలాగే రెండు వారాలకోసారి కలబంద గుజ్జు తింటాను. దీనికోసం పొట్ట ఖాళీగా ఉంచుకుంటాను. అలా ఎమ్టీ స్టమక్‌తో తింటేనే మంచిది. కలబంద గుజ్జు చర్మానికి నిగారింపుని ఇస్తుంది. ఇక ఒకేసారి కాకుండా రోజు మొత్తంలో కొంచెం కొంచెంగా నీళ్లు తాగుతుంటాను. చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్‌కి నేను దూరం. ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే... ఎక్సర్సైజ్లు చేయడటం, ఆహారం విషయంలో నియమాలు పాటించడం వంటివి స్లిమ్‌గా ఉండటం కోసమే కాదు... ఆరోగ్యంగా ఉండటం కోసం కూడా. సన్నగా ఉండాలని కడుపు మాడ్చుకున్నా ప్రమాదమే. అందుకే చక్కగా తినాలి... వ్యాయామాలు చేయాలి. అప్పుడు ఫిట్ అండ్ ఫైన్‌గా ఉంటాం’’ అంటూ ముగించారు రెజీనా.నేను, యోగా వేరు కాదని అనుకుంటాను. అంతలా యోగాని ఇష్టపడతాను. నేను ఫిట్ అండ్ ఫైన్‌గా ఉండటానికి యోగా ఓ కారణం. సూర్య నమస్కారాలతో మొదలుపెట్టి, భుజంగాసనం, సర్వాంగాసనం... ఇలా చాలా చేస్తాను. అలాగే ఇతర వ్యాయామాలు కూడా చేస్తుంటాను. నా ఎక్సర్సైజ్ ప్లాన్ ఎలా ఉంటుందంటే... ఒకరోజు అప్పర్ బాడీ చేస్తే తర్వాతి రోజు లోయర్ బాడీ వర్కవుట్స్ చేస్తాను. – డి.జి. భవాని(చదవండి: -
తెలంగాణ గొర్రెల స్కాంలో కీలక పరిణామం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో గొర్రెల స్కాంలో కీలకపరిణామం చోటుచేసుకుంది. గొర్రెల స్కాంలో దళారి మొయినుద్దీన్ అరెస్ట్ అయ్యాడు.ఈ కుంభకోణంలో గొర్రెల కొనుగోలు కాంట్రాక్టరుగా వ్యవహరించిన మొయినుద్దీన్ కీలకంగా వ్యవహరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అరెస్టు చేసేలోగానే అతడు దుబాయ్‌కి పారిపోయాడు. ఈ క్రమంలో హైదరాబాద్ వచ్చిన మొయినుద్దీన్‌ను ఇమ్మిగ్రేషన్ సహకారంతో శుక్రవారం ఉదయం ఎయిర్ పోర్టులోనే ఏసీబీ అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఇప్పటివరకు గొర్రెల స్కాములో 17మంది అరెస్టయ్యారు. వారిలో మాజీమంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్, గొర్రెల మేకల పెంపకం సమైక్య మాజీ ఎండి రామచందర్ నాయక్, పలువురు వెటర్నరీ అధికారులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
గ్రీన్‌లో కదలాడుతున్న సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 133 పాయింట్లు పెరిగి 24,473కు చేరింది. సెన్సెక్స్(Sensex) 595 పాయింట్లు పుంజుకుని 80,854 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.14 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 62.63 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.23 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో గతంతో పోలిస్తే లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.63 శాతం లాభపడింది. నాస్డాక్ 1.52 శాతం ఎగబాకింది.ఇదీ చదవండి: మేలో లాంచ్ అయ్యే టాప్ 5 స్మార్ట్ఫోన్లుఆసియా మార్కెట్లలో సానుకూల ధోరణులు, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం మార్కెట్ సెంటిమెంట్‌కు దోహదపడుతుంది. ఇండియా-పాక్ ఉద్రిక్తతలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. దీంతోపాటు అమెరికా-చైనా ట్రేడ్‌వార్‌ను మార్కెట్లు గమనిస్తున్నాయి. తగ్గిన చమురు ధరలు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించి, ఆర్థిక వృద్ధికి తోడ్పడుతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
RR VS MI: కంటిపై 7 కుట్లు పడినా అదిరిపోయే ప్రదర్శన చేసిన హార్దిక్
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 1) రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా డబుల్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్‌లో ముంబై అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి ఏకపక్ష విజయం సాధించింది.ఈ గెలుపులో కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీలకపాత్ర పోషించాడు. తొలుత బ్యాట్‌తో చెలరేగి (23 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్), ఆతర్వాత బంతితోనూ రాణించాడు (1-0-2-1). వాస్తవానికి ఈ మ్యాచ్‌కు హార్దిక్ అందుబాటులో ఉండాల్సింది కాదు. అతడికి ప్రాక్టీస్ సందర్భంగా తీవ్రమైన రక్తస్రావంతో కూడిన గాయమైంది. అతడి ఎడమ కంటి పైభాగంలో ఏడు కుట్లు పడ్డాయి. అయినా హార్దిక్ ఈ మ్యాచ్ బరిలోకి దిగి సత్తా చాటాడు.ఈ సీజన్లో హార్దిక్ మొదటి నుంచి చాలా కమిట్మెంట్తో ఉన్నాడు. ఎలాగైనా ముంబై ఇండియన్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టాలని కసితో రగిలిపోతున్నాడు. గత సీజన్లో ఎదురైన పరాభవానికి ఈ సీజన్లో ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. అనుకున్నట్లుగానే వరుస పరాజయాల బాట పట్టిన జట్టును డబుల్ హ్యాట్రిక్ విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలబెట్టాడు. వ్యక్తిగతంగానూ హార్దిక్ రాణించాడు. 9 మ్యాచ్‌ల్లో 172.5 స్ట్రయిక్ రేట్‌తో 157 పరుగులు చేసి, 13 వికెట్లు తీశాడు.రోహిత్ శర్మ నుంచి ముంబై ఇండియన్స్ పగ్గాలు చేపట్టిన హార్దిక్ గత సీజన్లో కెప్టెన్‌గా, ఆటగాడిగా దారుణంగా విఫలమయ్యాడు. గత సీజన్లో ముంబై 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.ఈ సీజన్ తొలి 5 మ్యాచ్‌ల్లోనూ ముంబై అదే పేలవ ప్రదర్శన కొనసాగించింది. కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించి, పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉండింది. అయితే సీజన్ గడిచే కొద్ది ముంబై ఇండియన్స్ ఆటతీరులో అనూహ్య మార్పు వచ్చింది. స్టార్ ఆటగాళ్లంతా టచ్‌లోకి రావడంతో ఒక్కసారిగా గెలుపు బాట పట్టింది. మూడు వారాలు తిరక్కుండానే తొమ్మిదో స్థానం నుంచి అగ్రస్థానానికి దూసుకొచ్చింది.వాస్తవానికి ముంబై ఇండియన్స్‌ను ఇలా పడి లేవడం కొత్తేమీ కాదు. గతంలో చాలా సీజన్లలో ఇలాగే ఆరంభంలో వరుస పరాజయాలు ఎదుర్కొని, ఆతర్వాత ఏకంగా టైటిల్‌నే ఎగరేసుకుపోయింది. ముంబై ఇండియన్స్ చరిత్రలో ఇలా వరుసగా 6 మ్యాచ్‌లు గెలవడం ఇది మూడో సారి. లీగ్ ఆరంభ సీజన్లో ఈ జట్టు తొలిసారి వరుసగా ఆరు విజయాలు సాధించింది. అయితే ఆ సీజన్లో లీగ్ దశలోనే నిష్క్రమించింది. తిరిగి 2017 సీజన్లో వరుసగా ఆరు విజయాలు సాధించింది. అయితే ఈ సారి ఛాంపియన్‌గా అవతరించింది.2017 సీజన్ తరహాలోనే ఆరు వరస విజయాల సెంటిమెంట్ ఈ సీజన్లోనూ కలిసొస్తుందని ముంబై ఇండియన్స్ భావిస్తుంది. ఈసారి కూడా తాము టైటిల్ ఎగరేసుకుపోతామని ఆ జట్టు అభిమానులు ధీమాగా ఉన్నారు. ఈ సీజన్లో టైటిల్ గెలిస్తే ముంబై చరిత్ర సృష్టించినట్లవుతుంది. ఐపీఎల్లో ఇప్పటివరకు ఏ జట్టు ఆరు టైటిళ్లు సాధించలేదు. ముంబై, సీఎస్కే సంయుక్తంగా ఐదు టైటిళ్లు సాధించాయి.ఈ సీజన్లో ముంబై తదుపరి టార్గెట్ అన్ని మ్యాచ్‌లు పూర్తయ్యే సరికి టేబుల్ టాపర్‌గా నిలవడం. ఈ సీజన్లో ముంబై ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మే 6న గుజరాత్, మే 11న పంజాబ్, మే 15న ఢిల్లీతో తలపడాల్సి ఉంది. -
పెళ్లింట విషాదం.. మిన్నంటిన కుటుంబ సభ్యుల ఆవేదన
సాక్షి, సత్తుపల్లి: ఆనందంతో ఉండాల్సిన పెళ్లింట విషాద ఘటన చోటుచేసుకుంది. ముందు రోజు రాత్రి వరకూ పెళ్లి సంబరాల్లో సంతోషంగా గడిపిన ఆ కుటుంబం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. ఇంటి పెద్ద కోడలి మృతితో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం కోటపాడుకు చెందిన పామర్తి మారేశ్వరరావు, జ్యోత్స్న(24) దంపతులు. అయితే, జ్యోత్స్న కడుపు నొప్పితో బాధపడుతుండగా బుధవారం రాత్రి సత్తుపల్లిలోని ఆల్ఫా స్కానింగ్ సెంటర్‌కు తీసుకొచ్చారు. అక్కడ పరీక్షించిన రేడియాలజిస్ట్ పరిస్థితి విషమంగా ఉందని, ఎదురుగా ఉన్న ఆస్పత్రికి వెళ్లాలని సూచించగా.. ఎస్వీసీ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యుడు జ్యోత్స్న గర్భం దాల్చిందని, గర్భసంచిలో కాకుండా పేగులో పిండం పెరగటంతో అది పగిలిపోయి రక్తస్రావమైందని, వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు. దీంతో మారేశ్వరరావు రూ.40వేలు ఫీజు చెల్లించారు. ఈ క్రమంలో ఆపరేషన్ చేసేందుకు కుటుంబీకులు అంగీకరించగా మరో వైద్యుడితో కలిసి శస్త్రచికిత్స చేసిన హర్షిత్ పరిస్థితి మెరుగుపడిందని చెప్పాడు. కానీ, గురువారం ఉదయం జ్యోత్స్న పరిస్థితి ఆందోళన కరంగా ఉందని కుటుంబీకులు ప్రశ్నించగా మత్తు ప్రభావం కావొచ్చని బదులిచ్చాడు. ఆ కాసేపటికి వైద్యుడు ఆమెను పరీక్షించి హార్ట్ ఫెయిల్ అయి చనిపోయిందని చెప్పడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. శస్త్రచికిత్స జరిగిన గంటల్లోనే మహిళ మృతి చెందగా.. ఆస్పత్రి ఎదుట ఆమె బంధువులు ఆందోళనకు దిగారు.మృతదేహం చూపించకుండా..ఉదయం 10 గంటలకు జ్యోత్స్య మృతి చెందగా, ఆమె కుటుంబీకులకు రాత్రి ఏడు గంటల వరకు మృతదేహాన్ని చూపించలేదు. అంతసేపు ఆస్పత్రి ఎదుట రోదిస్తూ ఆందోళనకు చేపట్టారు. ఆస్పత్రిలో వెంటిలేటర్, ఐసీయూ లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. కాగా, జ్యోత్స్యకు రెండేళ్ల కుమార్తె ఉంది. బుధవారం రాత్రి మారేశ్వరరావు తమ్ముడు చెన్నారావు వివాహం. ఆమె మరిది పెళ్లి కోటపాడులో బుధవారం రాత్రి జరుగుతుండగానే ఆరోగ్యం విషమించడంతో సత్తుపల్లి తీసుకొచ్చారు. ఇక్కడ ఆమె మృతి చెందగా కుటుంబంలో విషాదం నెలకొంది. అయితే, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆమె బంధువులతో డాక్టర్ల బృందం చర్చలు జరిపినట్లు తెలిసింది. చివరకు రాత్రి పరస్పరం అంగీకారం కుదిరినట్లు తెలుస్తుండగా, జ్యోత్స్న మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళ్లారు. -
'క' చిత్రానికి దక్కిన 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డ్
టాలీవుడ్ నటుడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా నటించిన‘క’ (KA) సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీ వేదికగా జరిగిన ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’(Dada Saheb Phalke Film Festival)లో ఉత్తమ చిత్రంగా 'క' అవార్డు దక్కించుకుంది. ఒక తెలుగు సినిమాకు ఈ అవార్డ్ రావడంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. కొత్త దర్శకులు సుజిత్, సందీప్ సంయుక్తంగా ఈ మూవీని తెరకెక్కించారు. గతేడాదిలో వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు.పీరియాడికల్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంగా 'క' ప్రేక్షకులను అలరించింది. పార్ట్ 1 విజయం సాధించడంతో పార్ట్ 2ను మరింత ఉత్కంఠగా తెరకెక్కిస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. 'క' చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీ నుంచి ఓటీటీలోకి వచ్చిన ఫస్ట్ తెలుగు సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. సైకలాజికల్ సస్పెన్స్‌తో మెప్పించిన ఈ చిత్రానికి భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు. చూడని వారు ఉంటే అమెజాన్ ప్రైమ్‌లో కూడా ఈ క చిత్రాన్ని చూడొచ్చు.‘క’ కథేంటంటే..ఈ సినిమా కథంతా 1977లో జరుగుతుంది. అభినయ వాసుదేవ్(కిరణ్ అబ్బవరం) అనాథ. చిన్నప్పటి నుంచి పక్కవాళ్ల ఉత్తరాలు చదివే అలవాటు ఉంటుంది. తన వయసుతో పాటు ఈ అలవాటు కూడా పెరుగుతూ వస్తుంది. పోస్ట్ మ్యాన్ అయితే అన్ని ఉత్తరాలు చదువొచ్చు అనే ఆశతో ఆ ఉద్యోగంలో చేరుతాడు. జాబ్ కోసం రామ్(పెంపుడు కుక్క)తో కలిసి కృష్ణగిరి అనే గ్రామానికి వెళ్తాడు. అక్కడ పోస్ట్ మాస్టర్ రామారావు(అచ్చుత్ కుమార్) అనుమతితో పోస్ట్ మ్యాన్ అసిస్టెంట్‌గా జాయిన్ అవుతాడు. అదే గ్రామంలో ఉంటూ..రామారావు గారి అమ్మాయి సత్యభామ(నయని సారిక)తో ప్రేమలో పడతాడు.అనాథ అయిన వాసుదేవ్‌కి ఆ ఊరి ప్రజలే తన కుటుంబంగా బతుకుతుంటాడు. అయితే ఆ గ్రామంలో వరుసగా అమ్మాయిలు మిస్ అవుతుంటారు. వారిని కిడ్నాప్ చేసేదెవరు? కృష్ణగిరి గ్రామానికి చెందిన అమ్మాయిలే ఎందుకు మిస్ అవుతున్నారు? ఉత్తరాలు చదివే అలవాటు ఉన్న వాసుదేవ్‌కి తెలిసిన నిజమేంటి? వాసుదేవ్ ను ఓ ముసుగు వ్యక్తి, అతని గ్యాంగ్ ఎందుకు వెంటాడుతున్నారు ? లాలా, అబిద్ షేక్ ఎవరు? వారికి ఈ కథతో ఉన్న సంబంధం ఏంటి? చీకటి గదిలో బంధించిబడిన రాధ( తన్వి రామ్) ఎవరు? ఆమెకు వాసుదేవ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
మేలో లాంచ్ అయ్యే టాప్ 5 స్మార్ట్ఫోన్లు
మొబైల్ యూజర్లు వాటి పనితీరు మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగా టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లలో మార్పులు వస్తున్నాయి. మొబైల్ తయారీ కంపెనీలు వినియోగదారుల అభిరుచుల మేరకు వినూత్న మోడళ్లను నిత్యం ఆవిష్కరిస్తున్నారు. అందులో భాగంగా మే, 2025లో లాంచ్ అవ్వనున్న టాప్ 5 కంపెనీల ఉత్పత్తుల గురించి కింద తెలుసుకుందాం.1. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్మే 13, 2025 నాటికి విడుదలవుతుందని అంచనా.6.6 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్.స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్. అల్ట్రా స్లిమ్ డిజైన్ (5.84 మిల్లీమీటర్ మందం, 162 గ్రాముల బరువు).25వాట్ ఛార్జింగ్‌తో 3,900 ఎంఏహెచ్ బ్యాటరీ.2. వన్‌ప్లస్ 13ఎస్విడుదల తేదీ మే 2025లో అంచనా.6.32 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే.స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్.కాంపాక్ట్ ఫ్లాగ్ షిప్ డిజైన్.బ్లాక్, పింక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.ధర సుమారు రూ.55 వేలు.3. రియల్మీ జీటీ 7విడుదల తేదీ మే 2025లో అంచనా.మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ చిప్ సెట్.16 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్.120 ఎఫ్‌పీఎస్ కలిగిన గేమింగ్ స్మార్ట్‌ఫోన్.రియల్మీ యూఐ 6.0 (ఆండ్రాయిడ్ 15)తో వస్తుంది.4. పోకో ఎఫ్7విడుదల తేదీ మే 2025లో అంచనా.స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 4 చిప్ సెట్.6.8 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే.90 వాట్ ఛార్జింగ్‌తో 7,550 ఎంఏహెచ్ బ్యాటరీ.ఇదీ చదవండి: రూ.5,830 కోట్ల ప్రాజెక్ట్‌ను నిలిపేసిన జోహో5. ఐకూ నియో 10విడుదల తేదీ మే 2025లో అంచనా.6.78 అంగుళాల 144 హెర్ట్జ్ ఎల్టీపీఓ అమోలెడ్ డిస్ప్లేడైమెన్సిటీ 9400 చిప్ సెట్.6,100 ఎంఏహెచ్ బ్యాటరీ, 120వాట్ వైర్డ్ ఛార్జింగ్.ధర సుమారు రూ.40 వేలు. -
ఆ యాక్సిడెంట్ నా జీవితంలో పెద్ద గిఫ్ట్ : అల్లు అర్జున్
ప్రమాదం జరిగితే కష్టం, నష్టమే. కానీ, అనుకోకుండా కొన్ని ప్రమాదాలు మంచి కూడా చేస్తాయి. ప్రముఖ హీరో అల్లు అర్జున్(Allu Arjun) స్వయంగా ఈ మాట అంటున్నారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న ‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్)(WAVES 2025)లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ– ‘‘కెరీర్ తొలి రోజుల్లో నా దృష్టి అంతా ఫిజికల్ ఫిట్నెస్, ఎజిలిటీ మీదే ఉండేది. కానీ, జీవితంలో ఒక ఘటన నా ఆలోచననే మార్చేసింది. నా పదో సినిమా తర్వాత నా భుజానికి దెబ్బ తగిలి, ఆస్ట్రేలియాలో సర్జరీ చేయించుకున్నా. అంతా బాగైపోయి, నాలుగో వారం నుంచి సెట్స్ మీదకు వెళ్ళిపోవచ్చనుకున్నా. డాక్టర్లు 6 నెలలు రెస్ట్ తప్పనిసరి అన్నారు. నాకు కొత్తగా పెళ్ళయింది. ఓ సినిమా సగంలో ఉంది. అప్పటి దాకా ఫిజికల్ ఫిట్‌నెస్‌కే ప్రాధాన్యం ఇస్తూ వచ్చిన నాకు ఒక్కసారిగా జ్ఞానోదయం అయింది.వయసు పెరిగే కొద్దీ ఫిట్నెస్, ఎజిలిటీ తగ్గుతాయి. కానీ, నటనపై దృష్టి పెడితే అది చిరకాలం మిగిలిపోతుందని గ్రహించా. అక్కడి నుంచి నా ఆలోచనే మారిపోయింది’’ అని వివరించారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘పదో సినిమా దగ్గర మొదలైన ఆ ఆలోచన ఇరవయ్యో సినిమా ‘పుష్ప–1’ దగ్గరకు వచ్చేసరి కల్లా నన్ను జాతీయ ఉత్తమ నటుడిగా, అందులోనూ తెలుగు సినీరంగం నుంచి ఆ ఘనత అందుకున్న తొట్ట తొలి నటుడిగా నిలిపింది. పదో సినిమా సమయంలో ఆ యాక్సిడెంట్ జరగకపోతే... నా దృక్పథం ఇలా మారేది కాదు.అందుకే, కొన్ని యాక్సిడెంట్లు అనుకోకుండా మన మంచికే జరుగుతాయి. మొత్తం నా ఆలోచనలు, కెరీర్‌నే మార్చేసిన ఆ యాక్సిడెంట్ నా జీవితంలో పెద్ద గిఫ్ట్’’ అని అల్లు అర్జున్ వివరించారు. ‘సాక్షి’ ఆయనను పలకరించినప్పుడు ‘‘మెడిసిన్, టెక్నాలజీ లాంటి అనేక రంగాలలో చాలా కాలంగా జరుగుతున్న సమ్మిట్లు చూసి, అలాంటివి మన సినీ, వినోద రంగంలో కూడా జరగాలనుకున్నాను. ప్రధాని మోదీ చొరవతో తొలిసారిగా వేవ్స్ సదస్సు జరగడం శుభారంభం’’ అన్నారు. -
రూ.5,830 కోట్ల ప్రాజెక్ట్‌ను నిలిపేసిన జోహో
సెమీ కండక్టర్ తయారీలో సంక్లిష్టమైన ఫ్యాబ్రికేషన్ ప్రక్రియలకు సాంకేతిక భాగస్వామిని పొందడంలో ఇబ్బందులు పడుతున్నట్లు జోహో తెలిపింది. ఈ కారణంగా 700 మిలియన్ డాలర్ల(సుమారు రూ.5,830 కోట్లు) చిప్ తయారీ ప్రణాళికలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా నిలదొక్కుకోవాలన్న భారత్ ఆకాంక్షలకు ఇలాంటి సంఘటనలు సవాలుగా మారుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.టెక్నాలజీ భాగస్వామిని కనుగొనడంలో సవాళ్లుసెమీకండక్టర్ తయారీలోకి ప్రవేశించడానికి, మార్గనిర్దేశం చేయడానికి జోహో వ్యూహాత్మక భాగస్వామి కోసం అన్వేషిస్తోంది. ఈమేరకు కంపెనీ విస్తృతమైన ప్రయత్నాలు చేసినప్పటికీ తగిన పార్ట్నర్ను కనుగొనలేకపోయినట్లు సంస్థ తెలిపింది. సెమీకండక్టర్ పరిశ్రమకు అత్యంత ప్రత్యేకమైన నైపుణ్యం అవసరమని భావిస్తోంది. నమ్మకమైన భాగస్వామి లేకపోవడంతో చిప్ తయారీ ప్రణాళికలను నిలిపివేయాలని నిర్ణయించింది.ముందుగా కర్ణాటకలో సెమీకండక్టర్ ఫెసిలిటీలో 400 మిలియన్ డాలర్లు(సుమారు రూ.3,332 కోట్లు) పెట్టుబడి పెట్టాలని కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇది 460 మందికి ఉపాధి సృష్టిస్తుందని, రాష్ట్రంలో మొదటి చిప్ తయారీ ప్రాజెక్టుగా మారుతుందని భావిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం 2024 డిసెంబర్లో ఈ ప్రాజెక్ట్‌కు అనుమతులు కూడా ఇచ్చింది. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టును నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.ఇదీ చదవండి: బంగారమా..? మాకొద్దు బాబోయ్..!భారత్ లక్ష్యాలపై ప్రభావం..?సెమీకండక్టర్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, ప్రపంచ చిప్ పరిశ్రమలో కీలక పాత్ర పోషించేందుకు భారత్ కృషి చేస్తోంది. పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం బిలియన్ల విలువైన ప్రోత్సాహక పథకాలను ప్రవేశపెట్టింది. కానీ జోహో ఎదుర్కొంటున్న సవాళ్లు దేశీయ సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను స్థాపించడంలో నిర్మాణాత్మక అడ్డంకులను హైలైట్ చేస్తున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని చిప్ తయారీకి ముందుకువస్తున్న కంపెనీలకు అవి ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు చూపేలా ప్రభుత్వాలు ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. -
వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి 'మెగా' గుడ్‌న్యూస్..?
మెగాకపుల్ వరుణ్ తేజ్(Varun Tej)-లావణ్య త్రిపాఠి శుభవార్త చెప్పబోతున్నారని తెలుస్తోంది. ఈమేరకు సోషల్‌మీడియాలో పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. ఈ దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నట్లు సమాచారం. మెగా ఇంటికి వారసుడు రాబోతున్నాడు అంటూ అభిమానులు కూడా పోస్టులు పెడుతున్నారు. 2023లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట మొదటి బిడ్డను ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నట్లు నెట్టింట వైరల్ అవుతుంది.పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi) మళ్లీ షూటింగ్స్‌లలో పాల్గొంటూ వచ్చారు. ఈ క్రమంలోనే ఒక వెబ్ సిరీస్‌ను ఆమె విడుదల చేశారు. ఆపై సతీ లీలావతితో పాటు కోలీవుడ్ మూవీ థనల్‌ను ఆమె పూర్తి చేశారు. అయితే, ఈ రెండు ప్రాజెక్ట్‌లను పూర్తి చేసిన తర్వాత ఆమె మళ్లీ కాస్త బ్రేక్ ఇచ్చారు. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాలని ఆమె భావించారని తెలుస్తోంది. దీనికి కారణం ఆమె ప్రెగ్నెన్సీ అని అందుకే ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్‌లను ఒప్పకోవడం లేదని టాక్. అయితే, ఈ విషయంపై వారి నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.వాస్తవానికి 2017లో వరుణ్, లావణ్యల మధ్య స్నేహం ఏర్పడింది. వీరిద్దరు కలిసి అప్పుడు ‘మిస్టర్’ అనే సినిమాలో నటించారు. ఆ సమయంలోనే వరుణ్, లావణ్య త్రిపాఠి క్లోజ్ అయ్యారు. మొదట్లో స్నేహం.. ఆ తర్వాత అది ప్రేమగా మార్చుకొని డేటింగ్ వరకు వెళ్లారు. కానీ ఈ విషయం బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా పర్సనల్ లైఫ్‌ని ఎంజాయ్ చేశారు. సరిగ్గా పెళ్లికి కొద్దిరోజులు ముందు వారి ప్రేమ విషయాన్ని అందరికీ తెలిపారు. అలా వరుణ్, లావణ్యల పెళ్లి ఇటలీలో జరగగా.. హైదరాబాద్‌లో రిసెప్షన్ ఘనంగా జరిగింది. -
‘మన టాలెంట్ పోతోంది’.. సీఈవో వార్నింగ్
స్టార్టప్ బూమ్‌లో భారత్ దూసుకుపోతున్నప్పటికీ, యూపీఐ వంటి ఫిన్‌టెక్ విజయగాథలు మనకు ఉన్నప్పటికీ వాస్తవ పరిస్థితిని సమీక్షించుకోవాల్సిన అవసరముందని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు అభిప్రాయపడ్డారు. ప్రత్యేకించి దేశంలోని ఉత్తమ సాంకేతిక మేధావులు విదేశాలకు వెళ్లకుండా ఉండాలంటే దేశానికి తీవ్రమైన రియాలిటీ చెక్ అవసరమని చెప్పారు.ఈ మేరకు ‘ఎక్స్’లో ఆయన ఒక వివరమైన పోస్ట్ పెట్టారు. భారత ఇన్నోవేషన్ సామర్థ్యాలను నాలుగు కేటగిరీలుగా విశదీకరించారు. ఒక్కో అంశానికి మార్కులు సైతం ఇచ్చారు. దేశంలో ప్రైవేట్ రంగం ధృడంగా వ్యవహరించాలని, స్వదేశంలో నిజమైన ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని సూచించారు. విమానయాన సంస్థలు, బ్యాంకింగ్, రిటైల్ వంటి ప్రాసెస్ ఆధారిత రంగాల్లో భారత్ ప్రకాశిస్తున్నప్పటికీ, ప్రపంచ స్థాయి ఉత్పత్తులు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సృష్టించడంలో వెనుకబడి ఉందని, మన టాలెంట్ (ప్రతిభావంతులు) విదేశాలకు వెళ్లిపోతోందని శ్రీధర్ వెంబు హెచ్చరించారు.ప్రాసెస్ ఇన్నోవేషన్ లో భారత్ 70 శాతం మంచి స్కోర్ సాధిస్తుందని వెంబు అన్నారు. కానీ ప్రొడక్ట్ ఇన్నోవేషన్ విషయషంలో మాత్రం కేవలం 35% మాత్రమే రేటింగ్ ఇచ్చారు. ఇది ఆశాజనకంగా ఉండవచ్చంటూ యూపీఐ ఆవిష్కరణను ఉదహరించారు. దేశానికి సమర్థవంతమైన ప్రాజెక్ట్ మేనేజర్లు మాత్రమే కాకుండా మరింత దూరదృష్టి కలిగిన ఉత్పత్తి సృష్టికర్తలు అవసరమని నొక్కి చెప్పారు.ఇక టెక్నాలజీ విషయంలో శ్రీధర్ వెంబు అసలు స్కోరే ఇవ్వలేదు. అంతటితో ఆగకుండా తీవ్రమైన ఆందోళన వెలిబుచ్చారు. భారతదేశపు టాప్ టెక్ టాలెంట్ ను విదేశీ సంస్థలు తీసేసుకుంటున్నాయని, టెక్ టాలెంట్‌ను నిలుపుకోవడం, వెనక్కి తీసుకురావడం కోసం దేశ ప్రైవేటు రంగం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అందు కోసం ఇక్కడ ప్రతిష్టాత్మక అవకాశాలను సృష్టించాల్సిన అవసరం ఉందని సూచించారు.సైంటిఫిక్ పురోగతుల కేటగిరీకి స్కోర్ ఇవ్వడానికి ఈ విషయంలో "మనం కనీసం పరీక్ష కూడా రాయలేదు" అంటూ కఠువుగా వ్యాఖ్యానించారు. ఉత్పత్తులు, సాంకేతిక రంగాల్లో ప్రైవేటు సంస్థలు ముందంజలో ఉండాలని, డీప్ సైన్స్ కు ప్రభుత్వ నిధులు అవసరమని ఆయన అన్నారు. 20వ శతాబ్దపు అనేక ఆవిష్కరణలకు నాంది పలికిన ప్రఖ్యాత అమెరికన్ రీసెర్చ్ హబ్ బెల్ ల్యాబ్స్ వంటిది భారత్‌లోనూ రావాల్సిన అవసరం ఉందన్నారు. -
ఏపీలో భారీ వర్షం.. ఈ జిల్లాల ప్రజలకు విపత్తుల శాఖ హెచ్చరిక
సాక్షి, ప్రకాశం: తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. కర్ణాటక నుంచి రాజస్థాన్ వరకూ.. ఒక బలమైన ద్రోణి ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణపై కూడా కనిపిస్తోంది. ఈ కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తాజాగా శుక్రవారం తెల్లవారుజాము నుంచి ప్రకాశం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. గాలివాన కారణంగా పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం అనుపాలెం దగ్గర రోడ్డుపై భారీ వృక్షం విరిగిపడింది. రోడ్డుపై చెట్టు పడటంతో భారీగా ట్రాఫిక్ స్తంభించి పోయింది. దీంతో, పిడుగురాళ్ల -సత్తెనపల్లి మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రెండు గంటలుగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో పోలీసులు.. చెట్టు తొలగించి రాకపోకలను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారు.రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నట్లు , శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీవర్షాలు, pic.twitter.com/0sPdSsATQK— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) May 1, 2025మరోవైపు.. ప్రకాశం జిల్లాలో ఈరోజు తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేని భారీ వర్షం కురుస్తోంది. కనిగిరిలో ఈదురుగాలితో కూడిన భారీ వర్షం పడుతోంది. ఇక, అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు.. వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ, తెలంగాణలో మరో ఏడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడతాయి. అలాగే.. ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది. ఒక్కోసారి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, నెల్లూరు, కర్నూలు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల శాఖ హెచ్చరించింది. ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదన్నారు. బలమైన ఈదురుగాలులు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది.ఐఎండీ ప్రకారం నేడు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటూ.. కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్రలో కొంత భాగం కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. బంగాళాఖాతం నుంచి ఏపీలోకి గాలులు బలంగా వస్తున్నాయి. ఈ రోజంతా ఈ పరిస్థితి ఉంటుంది. మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీలో సైతం భారీ వర్షం కురుస్తోంది. దీంతో, రోడ్లన్నీ జలమయమయ్యాయి. -
హారతి ఇస్తుండగా మంటలు అంటుకుని.. కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్ మృతి
జైపూర్: కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్ కన్నుమూశారు. ఈ ఏడాది మార్చి నెలలో తన ఇంటి పూజగదిలో హారతి ఇస్తుండగా అగ్ని ప్రమాదానికి గురైన గిరిజా వ్యాస్ చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు. The news of the demise of former Union Minister, former Rajasthan Congress President, and senior Congress leader Dr. Girija Vyas ji is deeply saddening.A distinguished intellectual, powerful orator, and capable administrator, she served the nation and the Congress Party with… pic.twitter.com/2fJN88nva7— B M Sandeep (@BMSandeepAICC) May 2, 2025సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ కేంద్రమంత్రి గిరిజా వ్యాస్ (Girija Vyas) మార్చి 31న అగ్ని ప్రమాదంలో పడ్డారు. రాజస్థాన్ రాష్ట్రం ఉదయపూర్‌లోని తన నివాసంలో పూజ చేసే సమయంలో హారతి (harathi) ఇచ్చే సమయంలో ఆమెకు మంటలు అంటుకున్నాయి. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం ఉదయపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పలు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. మెరుగైన వైద్యం కోసం ఆమెను 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహ్మదాబాద్‌కు తరలించాలని సూచించారు. ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంపై గిరిజా వ్యాస్ సోదరుడు గోపాల్ శర్మ స్పందించారు. గిరిజా వ్యాస్ ఇంట్లో హారతి ఇచ్చే సమయంలో ప్రమాదవ శాత్తూ కింద నుంచి మంటలు ఆమె దుప్పటాకు అంటుకున్నాయి. వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. తాజాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గిరిజా వ్యాస్ కన్నుమూశారు. ఆమె మరణంపై పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. 👉 ప్రముఖ కాంగ్రెస్ నేత గిరిజా వ్యాస్ గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో కీలక పదవులు నిర్వహించారు.1985 నుండి 1990 వరకు ఎమ్మెల్యేగా, రాజస్థాన్ పర్యాటక మంత్రిగా పనిచేశారు1991లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. 1996, 1999లో ఉదయపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి, 2009లో చిత్తోర్‌గఢ్ నుండి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా, అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (NCW) చైర్ పర్సన్‌గా సేవలందించారు. -
జనసేన జోగినేని మణిపై కేసు నమోదు
సాక్షి, అన్నమయ్య: జనసేన రాయలసీమ జోన్ కన్వీనర్ జోగినేని మణిపై ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారు. పత్తి రాజేశ్వరి అనే మహిళపై దాడి చేసిన ఘటనకు సంబంధించి.. బాధితురాలి ఫిర్యాదుతో ఓబులవారిపల్లె పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. కొద్దిరోజుల క్రితమ శ్రీరామనవమి రోజున జోగినేని మణి.. చెన్నరాజుపోడు గ్రామానికి చెందిన మహిళ రాజేశ్వరిని కాళ్లతో తన్ని దిక్కున్న చోట చెప్పుకోమంటూ బెదిరింపులకు గురిచేశాడు. అనంతరం, పత్తి రాజేశ్వరిపై దాడి చేశాడు. ఈ సందర్భంగా మణి.. తనకు పవన్ కల్యాణ్, హోం మంత్రి అందరూ తెలుసు. నీకు దిక్కున్న చోట చెప్పుకోమంటూ చులకన చేసి మాట్లాడాడు. దీంతో, మణి వల్ల తనకు ప్రాణహాని ఉంది బాధితురాలు.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో, ఆనాడు పోలీసులు ఫిర్యాదు చేయగా.. ఇప్పటికి ఓబులవారిపల్లె పోలీసులు జోగినేని మణిపై కేసు నమోదు చేసినట్టు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా, అంతకుముందు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను విమర్శించాడంటూ పోసాని కృష్ణమురళిపై మణి కేసు పెట్టిన విషయం తెలిసిందే. అతని ఫిర్యాదు మేరకు అప్పట్లో ఆఘమేఘాలపై పోసానిని అరెస్టు చేశారు పోలీసులు. తాజాగా మణి అరాచకాలను బాధితురాలు.. పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ క్రమంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. -
పుణ్యక్షేత్రాల్లో భద్రత వైఫల్యాలు.. అమిత్ షాకు ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమైన దేవాలయాల్లో భద్రత వైపల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి తెలిపారు. ఏపీలోని పుణ్యక్షేత్రాల్లో పరిపాలనా లోపాలు, భద్రతా వైఫల్యాల వల్ల తరచూ జరుగుతున్న దుర్ఘటనలపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు గురువారం లేఖ రాసినట్లు ఎంపీ వెల్లడించారు.ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి.. ‘విశాఖపట్నం జిల్లా సింహాచలం దేవాలయంలో చందనోత్సవం సందర్భంగా గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. గోడ నిర్మాణంలో సరైన ఇంజనీరింగ్ పద్ధతులు పాటించకపోవడం, నాణ్యత లేని మెటీరియల్ ఉపయోగించడమే ఈ దుర్ఘటనకు కారణం. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ కూర్మనాథ స్వామి ఆలయంలో భక్తులు పవిత్రంగా భావించే అరుదైన నక్షత్ర తాబేళ్లు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాయి. పోస్టుమార్టం చేయకుండానే వాటిని దహనం చేశారు.తిరుమలలో భద్రతా వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. జనవరి 8న తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ కౌంటర్ల క్యూ లైన్లలో తొక్కిసలాటి జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత కూడా టీటీడీ పరిపాలనలో ఎలాంటి మార్పు రాలేదు. ఇటీవల మూడంచెల భద్రత వ్యవస్థను దాటి కొంతమంది భక్తులు పాదరక్షలతో తిరుమల శ్రీవారి ఆలయ సింహద్వారం వరకు వెళ్లారు. టీటీడీ గోశాలలో 100కు పైగా గోవులు మరణించాయి. గోశాల నిర్వహణలో నిర్లక్ష్యం, నాణ్యతలేని దాణా అందించడం, వైద్యసేవల లోపం వల్లే ఈ దారుణం జరిగింది.’ అని లేఖలో పేర్కొన్నారు. -
అతడు రీ-రిలీజ్.. ఈ టెక్నాలజీతో ఏకైక సినిమాగా రికార్డ్
సూపర్ స్టార్ మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా 'అతడు'. 2005లో విడుదలైన ఈ సినిమా ఆయన పుట్టినరోజు సందర్భంగా (ఆగష్టు 9) మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, రీరిలీజ్ విషయంలో మహేశ్ సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేయబోతున్నాడు. ఒక పాత సినిమాని ఐమాక్స్ వెర్షన్‌లోకి మార్చి దానికి 4కె, డాల్బీ అట్మోస్ టెక్నాలజీతో రిలీజ్ చేయబోతున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇదే మొదటిసారి కావడం విశేషం. ఐమాక్స్ తెరకు అనుగుణంగా అతడు సినిమాను కన్వర్షన్ చేస్తున్నారు. అందుకోసం చాలా ఖర్చు అవుతున్నా సరే మేకర్స్ మాత్రం తగ్గడం లేదట. ఐమాక్స్ వెర్షన్లో అతడు సినిమాను విడుదల చేయాల్సిందేనని పట్టుబట్టి సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి.. ఏ మాత్రం తేడా వచ్చినా తెరమీద బొమ్మ కాస్త విభిన్నంగా కనిపిస్తుంది. అప్పుడు అసలుకే మోసం వస్తుంది. అందుకే ఒక టెక్నికల్ టీమ్ దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఇప్పటికే వచ్చిన అవుట్ ఫుట్ చూసిన కొందరు ఆశ్చర్యపోతున్నారట.అతడు సినిమాను ఐమాక్స్ వెర్షన్‌లోకి కన్వర్షన్ చేయడం వరకు బాగుంది. కానీ, తెలుగు రాష్ట్రాల్లో ఒరిజినల్ ఐమాక్స్ తెర ఒక్కటి కూడా లేదు. ఇండియాలో ముంబై, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, కేరళలో మాత్రమే ఐమాక్స్ తెరలు ఉన్నాయి. మనకు మాత్రం ఎక్కడా లేవు. ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో ఉన్నది పెద్ద తెరే కానీ, ఇందులో కూడా రెగ్యులర్‌గా వాడే బార్కో ప్రొజెక్టర్‌నే వాడుతారు. ప్రత్యేకంగా ఐమాక్స్ సంస్థ పంపిణి చేసే పరికరాలు అక్కడ లేవు. దీంతో ఐమాక్స్ వల్ల కలిగే ఖచ్చితమైన అనుభూతి దక్కదు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఉన్న ఆసియ అతి పెద్ద స్క్రీన్ విషయంలోనూ ఇదే జరగుతుంది. అతడు సినిమాకు ఎక్కువగా ఫ్యాన్స్ ఎన్ఆర్ఐలు ఉన్నారు. వారినే టార్గెట్ చేసేందుకే ఈ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. ఓవర్సీస్లో ఈ టెక్నాలజీతో చాలా స్క్రీన్స్ ఉన్నాయి. కాబట్టి వారు ఐమాక్స్‌లో అతడు సినిమా చూస్తే తప్పకుండా సరికొత్త అనుభూతి వస్తుంది.అతడు రీ రిలీజ్ హక్కులను రూ. 3 కోట్లకు విక్రయించినట్టు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. ఆపై ఐమాక్స్ వర్షన్‌తో పాటు 4కె, డాల్బీ అట్మోస్ టెక్నాలజీ కోసం మరో రూ. 1 కోటి ఖర్చు అవుతుందని సమాచారం. రీరిలీజ్ విషయంలో మహేశ్ సినిమాలకు ప్రత్యేకమైన రికార్డ్స్ ఉన్నాయి. ఒక్కడు, పోకిరి, మురారి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలు అన్నీ కూడా రూ. 10 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టాయి. -
Air India: పాక్ గగనతలంపై ఆంక్షలు.. ఎయిరిండియాకు వేల కోట్ల నష్టం
ఢిల్లీ: కశ్మీర్‌లోని పహల్గాం భూతల స్వర్గం.. ఆ ప్రదేశంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడితో భారత్-పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత్‌లోని ప్రముఖ ఏవియేషన్ దిగ్గజం ఎయిరిండియాకు వేలకోట్ల నష్టం వాటిల్లింది.పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌పై భారత్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. దీంతో పాక్ సైతం భారత్‌పై పలు ఆంక్షలు విధించింది. పాక్ గగన తలంపై భారత విమానాల రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.ఆ నిర్ణయంతో ఎయిరిండియా సుమారు 600 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. పాక్ గగనతలంపై భారత విమానాల రాకపోకలపై నిషేదం కారణంగా విమానాల దారి మళ్లింపు, పెరిగిన ప్రయాణ దూరం, అదనపు ఇంధనం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఫలితంగా ప్రతీ ఏడాది తమ సంస్థకు 591 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేసింది.ఈ నష్టం నుంచి బయటపడేందుకు ప్రభుత్వం రాయితీ ఇవ్వాలని కోరుతూ విమానయాన శాఖకు ఎయిరిండియా యాజమాన్యం లేఖ రాసినట్లు సమాచారం. గగనం తలంపై పాక్ తీసుకున్న నిర్ణయంతో ఒక్క ఎయిరిండియా మాత్రమే కాదని టాటా గ్రూప్‌కు చెందిన ఇతర విమానాల సర్వీసులపై ప్రభావం పడనున్నట్లు ఆ లేఖలో పేర్కొంది.ఉదాహరణకు ఇండిగో గురువారం న్యూఢిల్లీ-బాకు (అజర్బైజాన్లో) విమానం ఐదు గంటల 43 నిమిషాలు ప్రయాణించింది. పాక్ గగన తలం నుంచి కాకుండా దారి మళ్లించిన కారణంగా 38 నిమిషాలు ఎక్కువ సమయం పట్టింది. ఆ సమయానికి అదనంగా ఇంధనం వెచ్చించాల్సి ఉంటుంది. ప్రయాణ సమయంలో ప్రయాణికులకు అందించే ఇతర సర్వీసుల్లో సైతం భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది.అయితే, మిగితా విమానయాన సంస్థలతో పోలిస్తే ఎయిరిండియా పలు ప్రపంచ దేశాలకు విమానాల రాకపోకలన్నీ పాకిస్తాన్ గగన తలం నుంచే నిర్వహిస్తుంది. పాక్ తాజా నిర్ణయం ఎయిరిండియాపై కాస్త ప్రతికూల ప్రభావం పడనుంది. ఉదాహరణకు, ఢిల్లీ-మిడిల్ ఈస్ట్ విమానాలు ఇప్పుడు కనీసం ఒక గంట అదనంగా ప్రయాణించవలసి వస్తుంది, దీనికి ఎక్కువ ఇంధనం అవసరం అవుతుంది.ఎయిరిండియా దాని బడ్జెట్ సర్వీస్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగోలు గత నెలలో పదిహేను రోజుల్లో న్యూఢిల్లీ నుండి యూరప్, మిడిల్ ఈస్ట్, ఉత్తర అమెరికాలోని గమ్యస్థానాలకు 1,200 విమానాలు బయలుదేరాయని అంచనా. -
పెద్దారెడ్డిపై దాడికి కుట్ర.. రాళ్లను సిద్ధం చేసిన జేసీ వర్గీయులు
సాక్షి, అనంతపురం: టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్రకు తెరతీశారు. ఏపీ హైకోర్టు ఆదేశాలతో తాడిపత్రికి వెళ్లనున్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై రాళ్ల దాడి చేసేందుకు సిద్ధమయ్యారు. జేసీ వర్గీయులు పెద్దారెడ్డి ఇంటికి సమీపంలో రాళ్లను సిద్ధం చేసి ఉంచారు. పెద్దారెడ్డిపై రాళ్ల దాడి చేసేందుకు ఇది పెద్ద కుట్రగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో ఊరట.. జేసీకి షాక్మరోవైపు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టులో ఊరట లభించింది. తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర హోం శాఖ, డీజీపీ, అనంతపురం ఎస్పీలకు కోర్టు ఆదేశాలు గత 10 మాసాలుగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వడం లేదని సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. హైకోర్టు దృష్టి కి తీసుకెళ్లారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లొచ్చు.. ప్రజలను కలుసుకోవచ్చని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో తాడిపత్రిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోం శాఖ, డీజీపీ, అనంతపురం ఎస్పీలను కోర్టు ఆదేశించింది. అలాగే, పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లే క్రమంలో ఐదు వాహనాలకు మించి వెళితే పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించింది. ఇక, హైకోర్టు ఆదేశాలతో త్వరలోనే పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లనున్నారు. -
హెడ్లైన్ సరే.. డెడ్‌లైన్ ఏదీ: జైరాం రమేశ్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం జాతీయ జనగణన, కులగణనకు స్పష్టమైన రోడ్‌మ్యాప్ ప్రకటించాలని గురువారం కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఎలాంటి కాల పరిమితి లేకుండా కేవలం కులగణన చేస్తామన్న కేంద్ర ప్రకటనను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ జైరాం రమేశ్ తప్పుపట్టారు.ఈ సందర్భంగా ‘నిర్దిష్ట గడువు లేకుండా ముఖ్యమైన ప్రకటనలు ఇవ్వడంలో ప్రధాని మోదీ సిద్ధహస్తుడు. కులగణనపై ఆయన హెడ్లైన్ ఇచ్చారు. డెడ్‌లైన్ మాత్రం చెప్పలేదు. కులగణనపై రోడ్‌మ్యాప్ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఆరేళ్లుగా అడుగుతోంది’అని అన్నారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత పాక్‌పై తీవ్ర చర్యలు తీసుకోవాలనే డిమాండ్ల నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు కుల గణన నిర్ణయాన్ని ప్రకటించిందని ఆరోపించారు. కులగణనను మొదట్నుంచీ వ్యతిరేకిస్తున్న బీజేపీ, ఆకస్మికంగా నిర్ణయాన్ని మార్చుకోవడం నైతిక, రాజకీయ ఓటమిని చెప్పకనే చెబుతోందన్నారు. ‘జీఎస్టీ, ఆధార్, ఉపాధి హామీ, ఆహార భద్రతా చట్టాలపై యూటర్న్ తీసుకున్న మోదీ ఇప్పుడు కుల గణనపై అతిపెద్ద యూటర్న్ తీసుకున్నారు. ఈ విషయంలో ప్రధానిని మించిన వారు లేరు’అని రమేశ్ వ్యాఖ్యానించారు. గురువారం ఇక్కడ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జన గణనకు తగినంత బడ్జెట్ కేటాయింపులు లేకపోవడంపైనా ఆయన అనుమానం సంధించారు. కులగణనకు కాంగ్రెస్ మద్దతిస్తుందంటూ ఆయన.. తగు బడ్జెట్ లేకుండా, నిరి్ధష్ట గడువు లేకుండా, సమగ్ర ప్రణాళిక రూపొందించకుండా కేవలం హెడ్‌లైన్‌తో సరిపెట్టడం వెనుక కేంద్ర ప్రభుత్వం ఉద్దేశమేంటన్నారు. రాజ్యాంగ సవరణ చేయాలని, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించాలని డిమాండ్ చేస్తోందన్నారు. -
కాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు 20 వేల కొలువులు
అమెరికన్ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ ఈ ఏడాది సుమారు 20,000 మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకునే యోచనలో ఉంది. ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, మేనేజ్డ్ సర్వీసెస్ విభాగాల్లో ఈ కొలువులు ఉండనున్నాయి. ప్రస్తుతం కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,36,300గా ఉంది.‘ఇన్వెస్టర్ డే సందర్భంగా చెప్పినట్లు మా వ్యూహంలో భాగంగా 20,000 మంది ఫ్రెషర్లను తీసుకోబోతున్నాం. గతేడాదితో పోలిస్తే ఇది రెట్టింపు‘ అని కంపెనీ సీఈవో ఎస్ రవి కుమార్ తెలిపారు. ఫ్రెషర్లను తీసుకోవడం, ఏఐ ద్వారా ఉత్పాదకతను పెంచుకోవడం, మానవ వనరుల వ్యయాలను తగ్గించుకునేలా సామర్థ్యాల వినియోగాన్ని మెరుగుపర్చుకోవడం వంటి మూడు అంశాలపై కంపెనీ ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు వివరించారు.ఈ ఏడాది జనవరి–మార్చ్ త్రైమాసికంలో కాగ్నిజెంట్ ఆదాయం సుమారు 7 శాతం పెరిగి 5.1 బిలియన్ డాలర్లకు చేరింది. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో టాప్ ఐదు ఐటీ కంపెనీలు మొత్తంగా 80 వేల నుంచి 84 మందిని కొత్తగా నియమించుకోనున్నట్లు సంకేతాలిచ్చాయి. -
ఇలాంటి పనులు చేయకండి.. ఫ్యాన్స్‌కు విజయ్ సూచన
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత విజయ్ రెగ్యూలర్‌గా బయట తిరగాల్సిన పరిస్థితి ఉంది. అయితే, తను ఎక్కడికి వెళ్లిన అభిమానులు మాత్రం భారీగా వచ్చేస్తున్నారు. తన వెంట పడ వద్దుని వేడుకుంటున్నా వారు ఏమాత్రం తగ్గలేదు. తాజాగా తాను సినిమా షూటింగ్‌కు వెళ్తున్నానని సూచించినా తమ కోసం ఐదు నిమిషాలు అయినా సరే మాట్లాడి వెళ్లాలని రోడ్డుపైనే కూర్చున్నారు. అలా విజయ్‌కు మదురైలో ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. పార్టీ ఆవిర్భావంతో తమ ముందుకు వచ్చిన విజయ్ను చూసేందుకు తమిళనాడులో ఎక్కడికెళ్లినా అభిమానులు ఎగబడుతున్నారు. తమ అభిమానాన్ని అత్యుత్సాహంతో చూపించే వారెందరో ఉన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడ వద్దు అని విజయ్ వేడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితులలో చైన్నె నుంచి మదురై మీదుగా కొడైకెనాల్‌కు జననాగయం సినిమా షూటింగ్ నిమిత్తం విజయ్ వెళ్లారు. ఈ సమాచారంతో మదురై విమానాశ్రయంలో అభిమానులు ఉదయం నుంచే పోటెత్తారు. మదురైలో అనుమతి లేకుండా రోడ్ షోలు నిర్వహిస్తే చర్యలు తప్పవని విజయ్ అభిమానులకు కమిషనర్ లోకనాథన్ హెచ్చరికలు చేశారు. అయినా, అభిమానులు ఏ మాత్రం తగ్గలేదు. విజయ్ను చూసి, ఆయనకు ఆహ్వానం పలికే వెళ్తామని భీష్మించుకుని విమానాశ్రయం పరిసరాలలో కూర్చున్నారు. ఈ సమాచారంతో విజయ్ తొలిసారి చైన్నె విమానాశ్రయంలో మీడియా ముందుకు వచ్చారు. మీ అభిమానానికి కోట్లాది దండాలు అని పేర్కొంటూ, తాను సినిమా షూటింగ్ నిమిత్తం వెళ్తున్నానని, తన పని తనను చేయనివ్వండని వేడుకున్నారు. తన కోసం మదురై విమానాశ్రయానికి పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చినట్టు సమాచారం వచ్చిందని, అందుకే తాను మీడియా ముందుకు వచ్చినట్టు పేర్కొన్నారు. ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది కలిగించ వద్దని, తన కాన్వాయ్‌ను అనుసరించ వద్దని విజ్ఞప్తి చేశారు. విమానాశ్రయం నుంచి అందరూ వారి వారి ఇళ్లకు వెళ్లాలని కోరారు. అయితే, అభిమానులు ఏమాత్రం తగ్గలేదు. విజయ్ విమానాశ్రయంలో అడుగు పెట్టగానే దూసుకెళ్లారు. విజయ్ను ఆహ్వానిస్తూ నినాదాలు హోరెత్తించారు. అభిమానులను కట్టడిచేయలేక పోలీసులకు తంటాలు పడ్డారు. విజయ్ వాహనం మీదకు దూసుకెళ్లేందుకు యత్నించిన వారిని బౌన్సర్లు అడ్డుకోక తప్పలేదు. విజయ్ వాహనాన్ని వెంబడిస్తూ పలువురు అభిమానులు దూసుకెళ్లడం గమనార్హం. -
ఢిల్లీలో వర్ష బీభత్సం.. తల్లి, ముగ్గురు పిల్లలు మృతి
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం సృష్టించిన వర్షం బీభత్సంలో కుటుంబంలో నలుగురు మృతి చెందారు. వర్ష కారణంగా ద్వారాకాలో ఓ ఇంటిపై చెల్లి కూలింది. ఈ దుర్ఘటనలో తల్లి, ఆమె ముగ్గురు పిల్లలు మరణించారు. శుక్రవారం తెల్లవారు జామున ఢిల్లీ వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకున్నాయి. దుమ్ముతో పాటు భారీ వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. వర్షం కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాతావరణ శాఖ సైతం ఢిల్లీలో రెడ్ జోన్ ప్రకటించింది. భారీ వర్షం కారణంగా ఏర్పడిన ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వర్షం దెబ్బకు విమానాల సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు ఆయా విమానయాన సంస్థలు అధికారికంగా ప్రకటించాయి. Severe thunderstorms and rain lash Delhi and NCR.IMD forecasts heavy rainfall, thunderstorms, and gusty winds for the next two days, issuing a yellow alert for the national capital.#Rain #IMD #DelhiRains #rainfall #thunderstorms #Weather pic.twitter.com/fiZb2DPJJS— All India Radio News (@airnewsalerts) May 2, 2025 ఎయిర్ పోర్టుకు వెళ్లే ముందు ప్రయాణికులు తమ విమానాల రాకపోకల్ని పరిశీలించాలని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రయాణికుల్ని కోరింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది #TravelAdvisoryThunderstorms and gusty winds have affected flight operations in parts of Northern India. Some of our flights to and from Delhi are being delayed, which is likely to impact our overall flight schedule. We are doing our best to minimise disruptions.We advise our…— Air India (@airindia) May 2, 2025‘ఢిల్లీకి వెళ్లే, బయల్దేరే ఎయిరిండియా విమానాల సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలో దుమ్ము తుఫాను, వర్షం కారణంగా విమానాల్ని దారి మళ్లిస్తున్నాం. ఫలితంగా మొత్తం విమానాల రాకపోకలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. అంతరాయాలను తగ్గించడానికి మా వంతు మేం కృషి చేస్తున్నాం’ అంటూ ఎయిరిండియా ట్వీట్లో పేర్కొంది. -
పెళ్లి నగలు స్త్రీ ధనమే
తిరువనంతపురం: పెళ్లి సమయంలో వధువుకు బహుమతిగా ఇచ్చే బంగారు నగలు, నగదుపై హక్కెవరిదనే అంశంపై కేరళ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వాటిని స్త్రీ ధనంగా పరిగణించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అవి పూర్తిగా ఆ మహిళకే చెందుతాయని, చట్టబద్ధమైన పూర్తి హక్కులు ఆమెకే ఉంటాయని జస్టిస్ దివాన్ రామచంద్రన్, జస్టిస్ ఎంబీ స్నేహలతల ధర్మాసనం తెలిపింది. విడాకుల తర్వాత పెళ్లినాటి బంగారు నగలపై మహిళకు ఎలాంటి హక్కులేదంటూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎర్నాకులంలోని కలమసెర్రికి చెందిన మహిళ వేసిన పిటిషన్‌పై ఈ మేరకు తీర్పు వెలువరించింది.దురదృష్టవశాత్తూ భర్త, అత్తింటి వారు అలాంటి విలువైన ఆస్తులను బలవంతంగా స్వాధీనం చేసుకున్న అనేక సందర్భాలున్నాయని కూడా ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అనధికారికంగా చేతులు మారే ఇటువంటి ప్రైవేటు ఆస్తులపై తమకు హక్కుందని ప్రకటించుకునేందుకు అవసరమైన పత్రాలు మహిళల వద్ద ఉండవని, ఇలాంటి సందర్భాల్లో కోర్టులు విచక్షణను ఉపయోగించాల్సి ఉంటుందని తెలిపింది. 2010లో వివాహం సమయంలో పుట్టింటి వారు తమకు 63 సవర్ల బంగారంతోపాటు, రెండు సవర్ల గొలుసును, బంధువుల నుంచి అదనంగా మరో 6 సవర్ల ఆభరణాలు బహుమతిగా వచ్చాయని పిటిషనర్ తెలిపారు.వీటిలో మంగళసూత్రం, ఒక బంగారు గాజు, రెండు రింగులను మాత్రమే తనవద్ద ఉంచి మిగతా అన్నిటినీ భద్రత కోసమంటూ అత్తింటి వారు తీసుకున్నారని తెలిపారు. అదనంగా మరో రూ.5 లక్షలు డిమాండ్ చేయడంతో పుట్టింటికి వెళ్లగొట్టారని తెలిపారు. భర్త తన నగలను బ్యాంకులో ఉంచినట్లు తెలిపే పత్రాలను ఆమె కోర్టుముందుంచారు. పరిశీలించిన ధర్మాసనం 59.5 సవర్ల బంగారాన్ని లేదా మార్కెట్ విలువ ప్రకారం డబ్బు ఇవ్వాలని భర్తను ఆదేశించింది. బంధువులిచ్చిన నగలు, ఇతర విలువైన వస్తువులను కూడా ఇప్పించాలంటూ పిటిషనర్ చేసిన వినతిపై ధర్మాసనం.. తగు ఆధారాలు లేనందున తామేమీ చేయలేమని తెలిపింది. -
భారత్ వీడే పాక్ పౌరులకు మరింత గడువు
న్యూఢిల్లీ: భారత్‌లో ఉంటున్న పాక్ పౌరులకు కొంచెం ఉపశమనం కలిగింది. దేశం వీడేందుకు ఇచ్చిన గడువును కేంద్రం గురువారం సడలించింది. ఏప్రిల్ 30న సరిహద్దును మూసివేస్తామని గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరిస్తున్నట్లు హోం శాఖ తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు వాఘా–అటారీ సరిహద్దు గుండా తిరిగి వెళ్లేందుకు అనుమతించింది. ‘ఈ ఉత్తర్వులను సమీక్షించాం.తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ పాక్ పౌరులు అటారీలోని ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ నుంచి భారత్ విడిచి పాకిస్తాన్‌కు వెళ్లొచ్చు’అని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. కేంద్రం ఆదేశించిన ఆరు రోజుల్లో 55 మంది దౌత్యవేత్తలు, వారి సహాయక సిబ్బంది సహా 911 మంది పాకిస్తానీయులు అటారీ–వాఘా సరిహద్దు పోస్ట్ ద్వారా భారత్‌ను వీడారు. ఇక పాకిస్తాన్ నుంచి 1,617 మంది భారతీయులు స్వదేశానికి వచ్చారు. వీరిలో దీర్ఘకాలం వీసా కలిగిన 224 మంది ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరికొందరు విమానాశ్రయాల ద్వారా మూడో దేశం గుండా పాక్ వెళ్లిపోయారని అధికార వర్గాలు తెలిపాయి. -
అమరావతి పేరిట బాబు భూదందా
సాక్షి, అమరావతి: ‘రాజధాని అమరావతి నిర్మాణం పేరిట చంద్రబాబు ప్రభుత్వం భూ దందా చేస్తోంది. రూ.లక్షల కోట్ల అప్పులతో రాజధాని నిర్మాణం చేపట్టి, ఆ భారాన్ని ప్రజలపై మోపుతోంది. రాజధానిని రియల్ ఎస్టేట్ వ్యవహారంగా మార్చేసింది. ఒక ప్రాంతానికే అభివృద్ధిని పరిమితం చేస్తోంది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల అభివృద్ధిపై పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది’ అని సామాజిక, ఆర్థిక, విద్యావేత్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వనరులను కేంద్రీకృతం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు భవిష్యత్తులో విపరీత పరిణామాలకు దారి తీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.అమరావతి నిర్మాణంపై గురువారం ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణంరాజు, ప్రొఫెసర్ కంచ ఐలయ్య, ఆర్టీఐ మాజీ కమిషనర్ పి.విజయ్‌బాబు, ప్రజా సంఘాల ఐక్య వేదిక చైర్మన్ జేటీ రామారావు, రాజకీయ విశ్లేషకుడు చింతా రాజశేఖర్, హైకోర్టు సీనియర్ న్యాయవాది పల్లవోలు వెంకారెడ్డి, ఆంధ్రా అడ్వకేట్స్ ఫోరం కన్వీనర్ పి.అశోక్ కుమార్ తదితరులు మాట్లాడారు. ‘అమరావతి కోసం అంటూ 2015 నుంచే వేలాది ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. 2024లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అమరావతి విస్తరణ పేరిట మరో 44 వేల ఎకరాలు పూలింగ్ చేపట్టడానికి యత్నిస్తుండటం రాష్ట్ర ప్రజలను తీవ్రంగా వంచించడమే.ఒకసారి శంకుస్థాపన చేసి.. కొన్ని కట్టడాలు చేపట్టాక పునఃప్రారంభం అనడం హాస్యాస్పదం. అమరావతిలో, విశాఖలో విలువైన భూములను అస్మదీయ కంపెనీలకు కట్టబెడుతున్నారు. అమరావతి నిర్మాణం రాష్ట్రానికి గుదిబండగా మారుతుంది. చంద్రబాబు నిర్ణయంలో సామాజిక సమగ్రత, ఆర్థిక నైతికత లేవు. మునిగిపోయే ప్రాంతంలో రూ.వేల కోట్ల ప్రజాధనం తెచ్చి గుమ్మరించడం భావ్యం కాదు. రాజధాని భూ సమీకరణ వెనుక భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. ఇటు అమరావతిలో, అటు విశాఖలో భూములను బినామీలకు కట్టబెడుతున్నారు. సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు’ అంటూ వారు మండిపడ్డారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మూగ వేదన.. అరణ్య రోదన!
ఆళ్లగడ్డ: మండే ఎండలతో ప్రజలే దాహంతో అల్లాడుతున్నారు. నల్లమల అడవిలో వన్యప్రాణులదీ ఇదే పరిస్థితి. అటవీ ప్రాంతంలో నీటి నిల్వలు తగ్గడంతో జనావాస ప్రాంతాలకు వస్తూ ప్రాణాలను కోల్పోతున్నాయి. వేసవిలో సాసర్ పిట్లు( నీటి తొట్టెలను) నింపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో అమలు కావటం లేదు. నల్లమలలో జంతువులు ఇవీ.. దేశంలోనే అతి పెద్ద అభయారణ్యం నల్లమల. ఇక్కడ ఎన్నో రకాల వన్యప్రాణులు ఉన్నాయి. నంద్యాల జిల్లాలో అటవీ భూభాగం 1.60 లక్షల హెక్టార్లలో ఉంది. గుండ్లబ్రహ్మేశ్వరం, బండిఆత్మకూరు, నంద్యాల, చెలమ, రుద్రవరం, ఆత్మకూరు, బైర్లూటి, నాగలూటి, శ్రీశైలం, వెలుగోడు అటవీ రేంజ్‌లు ఉన్నాయి. వీటి పరిధిలో 65 బీట్లు, 44 సెక్షన్లు ఉన్నాయి. అడవిలో చిరుతలు, పెద్దపులులు, ఎలుగుబంట్లు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రేసు కుక్కలు, అడవి పిల్లులు, చుక్కల దుప్పులు, అడవి పందులు, కృష్ణ జింకలు, కుందేళ్లు, అడవి గొర్రెలు, నక్కలు కనిపిస్తాయి. బట్టమేక, అడవికోళ్లు, నెమళ్లతో పాటు వందలాది పక్షి జాతులకు నల్లమల ఆవాసం. వర్షాభావం వెంటాడటం, ఎండ తీవ్రత పెరగడంతో కుంటలు, వాగులు ఎండిపోయాయి. జలవనరుల్లో నీటి జాడ కనుమరుగైంది. అడవిలో చాలా చోట్ల తేమ సైతం ఆవిరైంది. ఇదే వన్యప్రాణుల పాలిట శాపమవుతోంది. సాసర్లు నింపరు! నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వన్యప్రాణుల దాహం తీర్చేందుకు 450కి పైగా సాసర్ పిట్లు ఏర్పాటు చేశారు. ఏటా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు 5 నెలలు నిరంతరం పర్యవేక్షిస్తూ సాసర్ పిట్లలో నీరు నింపాల్సి ఉంది. అయితే ఈ ఏడాది నిధుల కొరతతో చాలాకాలంగా నీరు నింపడంలేదన్నట్లు తెలుస్తోంది. కొందరు క్షేత్ర స్థాయి అధికారులు అడపాదడపా అక్కడక్కడా దాతల సాయంతో, సొంతంగా ఖర్చు చేసుకొని వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో దప్పిక తీరడంలేదు. అనేక చోట్ల సాసర్ పిట్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. చెత్తాచెదారంతో నిండిపోయి ఉన్నాయి. ఇలా చేస్తే ఎంతో మేలు.. బండిఆత్మకూరు, చెలమ, రుద్రవరం రేంజ్ పరిధిలో సాసర్ పిట్లకు ప్రతి రోజూ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలి. కొన్ని ప్రాంతాల్లో చెలమలను తవ్వి మూగజీవాలకు నీటి సౌకర్యాన్ని అందించాలి. అదేవిధంగా చెక్ డ్యామ్స్ ఏర్పాటు చేసి వాటి వద్ద నీటి నిల్వలను ఉంచాలి. సాసర్ పిట్ల వద్దకు నీటి కోసం వచ్చిన జంతువుల కోసం ఉప్పు ముద్దలను ఏర్పాటు చేయాలి. మూగ జంతువులు ఉప్పు ముద్దను నాకడంతో వడదెబ్బ బారి నుంచి కాపాడుకునే అవకాశం ఉంది.నీటి కోసం వచ్చి.. ప్రాణాలు విడిచిఅడవిలో నీటి వనరులు ఎండిపోవడం, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాసర్ పిట్లలో నీరు నింపకపోవడంతో మూగ జీవాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈ సమయంలో వాహనాలు ఢీకొని ప్రాణాలు వదులుతున్నాయి. అలాగే విద్యుదాఘాతానికి గురై, వేటగాళ్ల ఉచ్చులో చిక్కి మృత్యువాత పడుతున్నాయి.» ఈ మధ్య కాలంలో నీటికోసం వస్తున్న మూగజీవాలను వేటగాళ్లు నీటిలో విషపు గుళికలు వేసి చంపేస్తున్నారు. » రుద్రవరం, చెలమ అటవీ రేంజ్‌ల పరిధిలో వేటగాళ్లు పెట్రేగి పోతున్నారు. ఉచ్చులు వేసి వణ్యప్రాణులను వేటాడి వాటి మాంసాన్ని, శరీర భాగాలను విక్రయిస్తున్నారు. » ఇటీవల పెద్దకంబలూరు సమీపంలో వేటగాళ్లు వేసిన ఉచ్చులో చిక్కుకుని పెద్దపులి మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. » మూడు నెలల క్రితం అహోబిలం సమీపంలో కారుపై పెద్దపులి దాడి చేసింది. ఆ సమయంలో గాయాలై అడవిలోకి వెళ్లి పోయింది. » ఈ నెల 6వ తేదీ రుద్రవరంలో ఇద్దరు వ్యక్తులు వన్యప్రాణుల మాంసం విక్రయిస్తుండగా అట వీ అధికారులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. » 2019లో బాచిపల్లె తండా సమీపంలో పెద్దపులి కళేబరం కనిపించింది. అదే సంవత్స రం ఓ పెద్ద పులి మిట్టపల్లె సమీపంలోని ఎర్రచెరువు కాల్వలో మృతి చెంది కనిపించింది. » గండ్లేరు రిజర్వాయరులో వేర్వేరు సంఘటనల్లో రెండు చిరుత కళేబరాలు కనిపించాయి. » 2018లో బాచిపల్లె తండా, అహోబిలం మధ్యన రెండు ఎలుగుబంట్ల కళేబరాలు కనిపించాయి. » ఆళ్లగడ్డ సమీపంలో కృష్ణజింక వేటకు బలైంది. » రుద్రవరం సమీపంలో ఐదు నెమళ్లు వేటగాళ్ల ఉచ్చుకు బలయ్యాయి. » గాజులపల్లి – బొగద మధ్య రైలు పట్టాలపై రెండు చిరుత పులులు మృతి చెందాయి. చర్యలు తీసుకుంటాం సాసర్ పిట్లలో నీరు నింపుతున్నాం. ఎక్కడైనా నీరు లేదంటే సిబ్బంది చూడక పోవడమో, మరచిపోవడమో ఉంటుంది. వెంటనే నీటిని నింపేలా చర్యలు తీసుకుంటాం. – శ్రీపతి నాయుడు, రుద్రవరం అటవీ రేంజ్ అధికారి కుంటలు ఎండిపోయాయి అహోబిలం అటవీ పరిధిలో చెరువులు, కుంటలు పూర్తిగా ఎండిపోయాయి. వన్యప్రాణులు నీటి కోసం పొలాల్లోకి, గ్రామాల్లోకి వస్తున్నాయి. అవి దాడి చేస్తాయోనని ప్రజలు భయపడుతున్నారు. – నాసారి వెంకటేశ్వర్లు, ఏకలవ్య ఎరుకలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అందరి బాధ్యత నల్లమల అభయారణ్యం రాయలసీమకు మాణిక్యం లాంటింది. అందులోని వన్యప్రాణులను కాపాడుకోవల్సిన బాధ్యత అందరిపై ఉంది. సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి మూగజీవాల దాహార్తి తీర్చేందుకు ఏర్పాట్లు చేయాలి. – గజ్జల రాఘవేంద్రారెడ్డి, ఎంపీపీ -
తెలంగాణ అభివృద్ధికి అడ్డంకిగా కిషన్‌రెడ్డి, బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ అడ్డంకిగా మారారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. రాష్ట్రంలో నిర్వహించిన కులగణనను తప్పుల తడక అనడం ఈ ఇద్దరు నాయకుల దిగజారుడుతనానికి నిదర్శనమని గురువారం ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు. బీఆర్ఎస్తో దోస్తీ కట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిత్యం విషం కక్కడం వీరికి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.కులగణనపై కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రాహుల్ గాంధీ సంకల్పం సిద్ధించిందని, రాహుల్ ఆలోచన మేరకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల బృందం కులగణనను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించిందని పేర్కొన్నారు. శాసనసభలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేల సాక్షిగా ఏకగ్రీవ తీర్మానంతో బీసీల కులగణనకు చట్టబద్ధత కల్పించామని పేర్కొన్నారు. బీసీల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేసేలా పార్లమెంట్లో చట్టం చేయాలని డిమాండ్ చేశారు.బీసీ బిల్లు చట్టబద్ధత కోసం ప్రధాని మోదీకి లేఖ రాసే దమ్ము కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, సంజయ్‌లకు ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కేంద్ర మంత్రులమన్న విషయం మరిచి మాట్లాడటం వారి అహంకారానికి పరాకాష్ట అని మహేశ్‌గౌడ్ దుయ్యబట్టారు. పారదర్శక సర్వేపై తప్పుడు ఆరోపణలు చేయడానికి బీసీ బిడ్డగా బండి సంజయ్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. కేంద్రం జనగణనతో పాటు కులగణన చేయాలని తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ విజయం అని, కేంద్రం దేశవ్యాప్తంగా కులగణన ఎప్పుడు నిర్వహిస్తుందో ప్రకటించాలని డిమాండ్ చేశారు. చరిత్రాత్మక కులగణన, ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల నిర్ణయాలతో దేశానికీ ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని ఆయన అన్నారు. -
తెలంగాణలో చేసింది కుల సర్వేనే
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభు త్వం నిర్వహించింది కులగణన కాదని.. కుల సర్వే మాత్రమేనని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆ సర్వే ను కూడా తూతూమంత్రంగానే నిర్వహించారని ఆరోపించారు. గురువారం ఢిల్లీలో ఆయ న మీడి యాతో మాట్లాడారు. ‘తెలంగాణ ప్రభు త్వం సర్వే వివరాలను ఒకసారి పబ్లిష్ చేసి, లోపాలుంటే మరోసారి సర్వే చేసింది. ఇష్టం వచ్చినట్లు సర్వే చేశారు తప్ప.. అందులో శాస్త్రీయత లేదు. అది బీసీ వ్యతిరేక సర్వే. ఈ విషయం రాహుల్‌గాం«దీకి అర్థం కాలేదు.తెలంగాణ, కర్ణాటకలో చేపట్టిన కులగణన హడావుడిగా, ఏదో సాధించామని చెప్పుకునేందుకు చేశారు. ఇందులో చిత్తశుద్ధి లేదు, ఇది కులగణన కూడా కాదు. కులాలకు సంబంధించిన సర్వే మాత్రమే. తెలంగాణలో ఉన్న రాంగ్ రోల్ మోడల్ మాకు అవసరం లేదు. మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లి సమగ్రంగా జనగణన చేస్తాం. శాస్త్రీయ పద్ధతిలో కులగణన జరుగుతుంది. మేము చేపట్టబోయే కులగణనలో ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లింలను బీసీల్లో చేర్చం. మత ప్రాతిపదికన ఎవరినీ బీసీల్లో చేర్చే ప్రసక్తే లేదు’అని స్పష్టం చేశారు. ఈ కులగణన చరిత్రపుటల్లో నిలిచిపోతుందన్నారు. రాహుల్‌గాంధీ మాటలు సిగ్గుచేటు తన ఒత్తిడి వల్లే కేంద్ర ప్రభుత్వం కులగణన నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ రాహుల్‌గాంధీ చెప్పడం సిగ్గుచేటని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాహుల్‌గాం«దీ, రేవంత్‌రెడ్డిలకు భయపడి తీసుకున్న నిర్ణయం కాదని స్పష్టం చేశారు. ‘ఎద్దులబండి కింద నడుస్తున్న కుక్క.. మొత్తం బండిని తానే మోస్తున్నానని అనుకుంటుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా. తాము చెప్పినట్లే ప్రభుత్వాన్ని నడిపిస్తామని చెప్పుకుంటోంది. ఇది హాస్యాస్పదం’అని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పుకు కట్టుబడే కులగణన ఉంటుందని తెలిపారు.దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రజలను మతం పేరుతో విడగొడుతున్న కాంగ్రెస్ పార్టీ.. కులాల పేరుతోనూ సమాజాన్ని విచి్ఛన్నం చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. ‘కులగణన చేపట్టేందుకు సెన్సెస్ యాక్ట్ 1948లో సవరణ తీసుకొచ్చి ‘కులం’అనే పదాన్ని ఓ పారామీటర్‌గా చేర్చాలి. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ సవరణ తీసుకొచి్చన తర్వాతే జనగణనపై ముందుకెళ్తాం. 2026లో జనగణన మొదలయ్యే అవకాశం ఉంది’అని కిషన్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పారీ్టకి ఉన్నవే మూడు రాష్ట్రాలని, అవి కూడా తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటివని ఎద్దేవా చేశారు. -
రేపు కట్టబోయే అమరావతిలో కూడా గోడలుంటాయిగా..!
రేపు కట్టబోయే అమరావతిలో కూడా గోడలుంటాయిగా..! -
గోడ చాటున గుట్టు!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: స్వయంగా ఐదుగురు మంత్రుల కమిటీ దాదాపు పక్షం రోజులకుపైగా సింహగిరిపై చందనోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చిన్న చిన్న అంశాలను సైతం పరిగణనలోకి తీసుకొని అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత నమ్మకంగా చెప్పారు. అయినా సరే.. అప్పన్న నిజరూప దర్శన వేళ పెను విషాదం చోటు చేసుకుంది. ఏర్పాట్లలో మంత్రుల కమిటీ దారుణ వైఫల్యం ఏడుగురు భక్తుల ప్రాణాలను బలి తీసుకుంది. కనీసం ఓ గోడను కూడా పటిష్టంగా నిర్మించలేని బాధ్యతా రాహిత్యం భక్తులను పొట్టనబెట్టుకుంది. సాక్షాత్తూ మంత్రుల పర్యవేక్షణలోనే ఇలా జరిగిందంటే ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కాదా? దీన్ని కప్పిపుచ్చుకునేందుకు తాజాగా బహిరంగ విచారణ పేరుతో నాటకాన్ని సర్కారు రక్తి కట్టించింది. చందనోత్సవం రోజు వర్షం కురవడం సాధారణమే అయినప్పటికీ అందుకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పవిత్ర పుణ్యక్షేత్రాల్లో వరుసగా అపచారాలు, కూటమి సర్కారు నిర్వాకాలు, అంతులేని నిర్లక్ష్యం తాజాగా మరోసారి బహిర్గతం కావడంతో ఉలిక్కిపడి కింది స్థాయి ఉద్యోగులు, కాంట్రాక్టర్‌పై నెపం మోపి తప్పించుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే ఇదంతా కాంట్రాక్టర్, ఉద్యోగుల తప్పిదమేనంటూ అనుకూల మీడియాలో ఇప్పటికే లీకులిచ్చింది. తిరుపతి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తొక్కిసలాట చోటు చేసుకుని ఆరుగురు భక్తులు మృత్యువాత పడితే తన వైఫల్యాలను కప్పిపుచ్చి గుంభనంగా వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సింహాచలంలో మాత్రం బహిరంగ విచారణ చేపట్టి ఈ విషాదానికి కాంట్రాక్టర్, ఉద్యోగులను బాధ్యులుగా చేసి తప్పించుకునేందుకు సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. అనుమతి లేకుండానే మాస్టర్ ప్లాన్‌లో మార్పులు ప్రభుత్వ జోక్యం లేకుండా సాధ్యమేనా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.తాత్కాలికమే కదా.. కట్టమన్నారు!‘ప్లానింగ్ ప్రకారం డ్రాయింగ్‌లో అసలు ఈ గోడ నిర్మాణం లేదని చెప్పా. తాత్కాలికమే కదా...! చందనోత్సవం కోసం కట్టమని ఒత్తిడి తెచ్చారు. మీకు తెలియంది ఏముంది సర్? టూరిజం, దేవదాయ శాఖలు గోడ కట్టమన్నాయి. దేవుడి కార్యక్రమం కదా అని డ్రాయింగ్‌లో లేకపోయినా అతిక్రమించి చేశా. ఐదు రోజుల్లోనే గోడ నిర్మించా. ఈ గోడ నిర్మాణంపై పరీక్షలు ఏమీ జరగలేదు..’ అని సింహాచలంలో ఏడుగురి సజీవ సమాధికి కారణమైన గోడను నిర్మించిన కాంట్రాక్టరు లక్ష్మణరావు గురువారం విచారణ కమిషన్ ఎదుట వెల్లడించారు. మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మింంచిన ఈ గోడ కోసం అంచనాలు రూపొందించడంగానీ, అనుమతి గానీ తీసుకోలేదని కమిషన్ ఎదుట తేలిపోయింది. గోడ కట్టిన తర్వాత కనీసం పరీక్షలు కూడా చేయలేదని బట్టబయలైంది. ఒత్తిడి తెచ్చి పనులు హడావుడిగా చేయించారుసింహాద్రి అప్పన్న చందనోత్సవం సందర్భంగా గోడకూలి ఏడుగురు మృతి చెందిన ఘటనపై 72 గంటల్లో నివేదిక సమర్పించాలంటూ మునిసిపల్, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌కుమార్ నేతృత్వంలో ఐజీ ఆకే రవికృష్ణ, జలవనరులశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) వెంకటేశ్వరరావులతో కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయడం తెలిసిందే. గురువారం ఉదయం పదిన్నర గంటలకు సింహాచలంలో విచారణ ప్రారంభించిన కమిషన్ గోడ నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టర్‌తో పాటు దేవదాయ, టూరిజం శాఖ అధికారులను విచారించింది. గోడ కూలిన ప్రాంతాన్ని పరిశీలించి శిథిలాల నుంచి ఇటుకలు, మట్టిని విచారణ అధికారులు సేకరించారు. కేవలం 5 రోజుల్లోనే గోడ నిర్మాణాన్ని పూర్తి చేశామని... తమ మీద ఒత్తిడి తెచ్చి పనులు హడావుడిగా చేయించారని విచారణాధికారి ఎదుట కాంట్రాక్టర్ కుండబద్దలు కొట్టారు. ప్లాన్‌లో లేకుండానే పనులు చేయించారని, గోడ పటిష్టతపై ల్యాబ్‌లో ఎలాంటి పరీక్షలు చేయలేదని తెలిపారు. అనుమతులు లేకుండానే...డ్రాయింగ్‌లో లేని తాత్కాలిక గోడ నిర్మాణం విషయంలో అనుమతులు తీసుకున్నారా? అని కమిషన్ ఆరా తీసింది. దీనికి సంబంధించిన నోట్ ఫైల్, ఎం బుక్, వర్క్ ఆర్డర్, మీటింగ్ మినిట్స్ లాంటివి లేవని విచారణలో వెల్లడైంది. కేవలం నోటి మాట ఆధారంగా పని చేయలేమని.. డ్రాయింగ్, ప్లానింగ్ ఇవ్వాలని కాంట్రాక్టర్ కోరడం నిజం కాదా? అని సురేష్‌కుమార్ ప్రశ్నించగా అవునని అధికారులు అంగీకరించారు. మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా..సింహాచలం కొండ ‘యూ’ ఆకారంలో ఉంటుంది. కొండధారలు, ఆకాశగంగ, మాడవీధులు.. ఎక్కడ వర్షం కురిసినా తాజాగా ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న మెట్ల మీద నుంచే నీరంతా కిందకు వెళ్తుంది. అందుకే ఈ ప్రాంతంలో పటిష్టమైన రిటైనింగ్ వాల్ నిర్మించారు. దాన్ని ప్రసాద్ స్కీమ్‌లో పునర్ నిర్మించేందుకు పాత గోడని తొలగించారు. చందనోత్సవం నేపథ్యంలో తాత్కాలిక గోడని నాసిరకంగా, ఫ్లైయాష్ ఇటుకలతో కట్టారు. అది చిన్నపాటి వర్షానికే కూలిపోయింది. రూ.300 టికెట్ల లైన్ ఫెన్సింగ్ గోడకి ఆనుకొని వేశారు. ఫెన్సింగ్ లేకుంటే శిథిలాలు కొంతమేర తొలగించుకొని భక్తులు బయట పడేందుకు ప్రయత్నించేవారు. కానీ ఫెన్సింగ్ అడ్డుగా ఉండటంతో వాటిని తొలగించడం సాధ్యంకాక భక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు స్పష్టమవుతోంది. అంటే కనీస ప్రణాళిక లేకుండా, భక్తుల భద్రత గురించి ఏమాత్రం ఆలోచన చేయకుండా హడావుడిగా పనులు చేసినట్లు తెలుస్తోంది. నాసిరకంగా నిర్మించారు..తాత్కాలికంగా నిర్మించిన రిటైనింగ్ వాల్ నాసిరకంగా కట్టారు. దానివల్ల వర్షం పడే సమయంలో కూలిపోయిందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అలా ఎందుకు నిర్మించాల్సి వచ్చింది..? హడావుడిగా ఎందుకు చేయాల్సి వచ్చింది? నిజంగా అది నాసిరకంగా ఉందా? అనే వాటికి ఆధారాలు తీసుకున్నాం. ప్రసాద్ స్కీమ్ ఒరిజినల్ పనుల్లో మార్పులు చేర్పులు జరిగాయి. దాని ఆధారంగానే ఈ పనులు చేపట్టారు. ఎవరు అనుమతి ఇచ్చారు? డిజైన్ ఏమిటి? ఎవరు పరీక్షించారనేది విచారిస్తున్నాం. చందనోత్సవం ఉన్నందున త్వరితగతిన చేశామని చెబుతున్నారు. గత ఏడాది కాలంలో మాస్టర్‌ప్లాన్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. దానిలో భాగంగా ఈ గోడను నిర్మించారు. మూడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం. ఇటువంటివి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నెల రోజుల్లో సవివర నివేదిక సమర్పించాల్సి ఉంది. అందులో పూర్తిస్థాయి ఎస్‌వోపీలను పొందుపరుస్తాం. – సురేష్ కుమార్, విచారణ కమిషన్ అధ్యక్షుడు -
క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు
సాక్షి, అమరావతి: షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వ్యక్తులు క్రైస్తవ మతంలోకి మారితే, ఆ రోజునే వారి ఎస్సీ హోదా రద్దవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. అలాంటి వారు ఎస్సీ,ఎస్టీ చట్టం కింద రక్షణలు పొందలేరని తెలిపింది. క్రైస్తవంలోకి మారిన వారు ఎస్సీ,ఎస్టీ నిరోధక చట్టం కింద ఫిర్యాదు చేయలేరని, ఒకవేళ ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినా, అది చెల్లదని హైకోర్టు తేల్చి చెప్పింది. క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్‌గా కొనసాగుతున్న చింతాడ ఆనంద్ అనే వ్యక్తి ఎస్సీ,ఎస్టీ చట్టం కింద కొందరిపై ఫిర్యాదు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఎస్సీ,ఎస్టీ చట్టాన్ని సదరు పాస్టర్ దుర్వినియోగం చేశారని స్పష్టం చేసింది. ఆనంద్ క్రైస్తవ మతంలోకి మారి గత పదేళ్లుగా పాస్టర్‌గా కొనసాగుతున్నట్లు సాక్షులు వాంగ్మూలాలు ఇచ్చారని, ఈ నేపథ్యంలో పోలీసులు సంబంధిత కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసి ఉండాల్సింది కాదని అభిప్రాయపడింది. క్రైస్తవ మతంలో కులమన్నది లేదని స్పష్టం చేసింది. క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్‌గా కొనసాగుతున్న నేపథ్యంలో ఆనంద్ ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ కోరలేరని తేల్చి చెప్పింది. కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయలేదన్న కారణంతో క్రైస్తవంలోకి మారిన వ్యక్తి ఎస్సీ,ఎస్టీ చట్టం కింద రక్షణ కోరజాలరని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ బుధవారం తీర్పు వెలువరించారు. నిందితులపై గుంటూరు కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసును కొట్టివేశారు. నేపథ్యం ఇదీ...తనను అక్కాల రామిరెడ్డి, మరికొందరు కులం పేరుతో దూషించారని, వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదుచేయాలంటూ గుంటూరు జిల్లా, పిట్లవానిపాలెం మండలం, కొత్తపాలెంనకు చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ 2021 జనవరిలో చందోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రామిరెడ్డి మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ రామిరెడ్డి తదితరులు 2022లో హైకోర్టును ఆశ్రయించారు. -
ఆర్థిక అనారోగ్యం ఏడాదిలో నయమవుతుంది
సాక్షి, హైదరాబాద్: అనారోగ్యంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవ స్థను గాడిన పెట్టేందుకు మరో ఏడాది సమయం పడుతుందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో పదేళ్ల పాటు ఆర్థిక విధ్వంసం జరిగిందని, మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రా న్ని రూ.8.29 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని విమర్శించారు. కాంట్రాక్టర్లకు రూ.50 వేల కోట్లు బకాయిలు పెట్టారని, ఇతర విభాగాల్లో రూ.1.20 లక్షల కోట్ల మేర చెల్లింపులు చేయలేదని అన్నారు. అనవసరమైన ఖర్చుతో ఆర్థిక దోపి డీకి పాల్పడ్డ గత పాలకులు వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారని ఆరోపించారు.ఫామ్‌హౌస్‌లు, పేపర్లు, టీవీ లు అంటూ వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించుకున్నారన్నా రు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా సరిదిద్దుతున్నామని, పరిస్థితి ఇప్పుడిప్పుడే గాడిన పడుతోందని తెలిపారు. మే డే పురస్కరించుకుని గురువారం రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో సీఎం పాల్గొని కార్మికులనుద్దేశించి ప్రసంగించారు. 15 నెలలుగా నిద్రలేని రాత్రులు.. ‘రాష్ట్ర అభ్యున్నతి కోసం 15 నెలలుగా నేను, నా సహచర మంత్రులు ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. ఒక పద్ధతి ప్రకారం నష్టాలను నివారిస్తూ ముందుకు వెళుతున్నాం. కార్మికుల సంక్షేమం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. సింగరేణి లాభాల్లో వాటా కింద కార్మికులకు బోనస్ ఇచ్చాం. ఆరీ్టసీలో కారుణ్య నియామకాలు చేపట్టాం. త్వరలో గిగ్ వర్కర్స్ పాలసీని తీసుకురాబోతున్నాం. ఇది దేశానికే ఆదర్శంగా మారుతుందని భావిస్తున్నాం. కార్మికుల విషయంలో గత ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెను అణచివేసి 50 మంది కార్మికులను పొట్టన పెట్టుకుంది..’అని రేవంత్ ఆరోపించారు. సమ్మె చేస్తే నష్టాలు తప్పవు ‘ఇప్పుడు కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సమస్య ఏదైనా మంత్రి దృష్టికి తీసుకురండి. వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాల్లోకి వస్తోంది. ఇలాంటి సమయంలో సమ్మె చేస్తే సంస్థ తీవ్ర నష్టాల్లో కూరుకుపోతుంది. ఆర్టీసీ కార్మికులు పంతాలు, పట్టింపులకు పోవద్దు. ఈ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికులదే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తిగా ప్రజల ముందుంచాం. మీరేం చెబితే అదే చేస్తాం. ఇది మీ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు రూ.22,500 కోట్ల రాబడి ఉంటే అన్ని పథకాలను అమలు చేయవచ్చు.కానీ ప్రస్తుతం వస్తున్న ఆదాయం రూ.18,500 కోట్లు మాత్రమే. ఏడాదిన్నరలో రూ.1.58 లక్షల కోట్లు అప్పులు చేస్తే అందులో రూ.1.52 లక్షల కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పుల వాయిదాలు, వడ్డీలు చెల్లించడానికే సరిపోయింది. మరో ఏడాది పాటు వేచి చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆ తర్వాత సమస్యల పరిష్కారం వేగవంతం అవుతుంది. అప్పటివరకు ఒపికగా ప్రభుత్వానికి అండగా ఉండాలి..’అని ముఖ్యమంత్రి కోరారు. గత పాలకులు విషం చిమ్ముతున్నారు.. ‘పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన కపట నాటక సూత్రధారి ఇప్పుడు మళ్లీ బయలుదేరాడు. కేసీఆర్ చేసిన గాయాల్ని ప్రజలు ఇంకా మరిచిపోలేదు. పదేళ్ల పాటు ప్రజలను పట్టించుకోకుండా మరోమారు అధికారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. సమస్యలను పరిష్కరిస్తూ, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్న ప్రజా ప్రభుత్వంపై అక్కసుతో గత పాలకులు విషం చిమ్ముతున్నారు. ప్రజలు ఓట్లేసి అసెంబ్లీకి పంపితే ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. ప్రజలు వారి విషపు చూపుల్లో చిక్కుకోవద్దు. కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రిని చేయలేదు. కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అయినా అవకాశం ఇవ్వాలి..’అని రేవంత్ అన్నారు. శ్రమశక్తి అవార్డుల ప్రదానం కార్మిక శాఖ ఆధ్వర్యంలో శ్రమశక్తి అవార్డుల కోసం ఎంపిక చేసిన సంస్థలు, వ్యక్తులకు గురువారం రవీంద్రభారతిలో వాటిని ప్రదానం చేశారు. మొత్తం 11 సంస్థలు, 37 మంది వ్యక్తిగతంగా అవార్డులకు ఎంపికయ్యారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజి బోర్డు, గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, క్రిమెటివ్ స్కైజ్/ టెన్సిల్ స్ట్రక్చర్స్ మాన్యుఫాక్చరింగ్ తదితర సంస్థలు సీఎం నుంచి అవార్డులు అందుకున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, వీర్లపల్లి శంకర్, రాజ్‌ఠాకూర్, కనీస వేతన సలహా బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.